ముఖపేజీతఫ్సీర్An-Naas (114)

తఫ్సీర్ An-Naas (114) — الناس

మక్కీ · 6 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

قُلْ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ﴿١﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను

مَلِكِ ٱلنَّاسِ ﴿٢﴾

ప్రజల చక్రవర్తి. ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తా డు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు

إِلَـٰهِ ٱلنَّاسِ ﴿٣﴾

వారి వాస్తవ ఆరాధ్య దైవము. అతను తప్ప వారికి ఏ వాస్తవ ఆరాధ్యదైవము లేడు

مِن شَرِّ ٱلْوَسْوَاسِ ٱلْخَنَّاسِ ﴿٤﴾

ఆ షైతాన్ కీడు నుండి ఎవడైతే మానవునికి అల్లాహ్ స్మరణ నుండి అతడు పరధ్యానంలో ఉన్నప్పుడు తన దుష్ప్రేరణను వేస్తా డు. మరియు అతడు ఆయన స్మరణ చేసినప్పుడు అతని నుండి వెనుకడుగు వేస్తా డు

ٱلَّذِى يُوَسْوِسُ فِى صُدُورِ ٱلنَّاسِ ﴿٥﴾

అతడు తన దుష్ప్రేరితాలను ప్రజల హృదయాల్లో వేస్తా డు

مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ ﴿٦﴾

మరియు అతడు జిన్నుల్లోంచి అయినట్లే మానవుల్లోంచి అవుతాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · An-Naas — الناس

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు