ముఖపేజీతఫ్సీర్Al-Balad (90)

తఫ్సీర్ Al-Balad (90) — البلد

మక్కీ · 20 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

لَآ أُقْسِمُ بِهَـٰذَا ٱلْبَلَدِ ﴿١﴾

పవిత్ర పట్టణమైన మక్కతుల్ ముకర్రమ పై అల్లా హ్ ప్రమాణం చేశాడు

وَأَنتَ حِلٌّۢ بِهَـٰذَا ٱلْبَلَدِ ﴿٢﴾

ఓ ప్రవక్త మీరు చేసేది హతమార్చబడటానికి హక్కు దారుడైన వాడిని హతమార్చటం మరియు బంధీ చేయబడటానికి హక్కుదారుడైన వాడిని బంధీ చేయటం మీకు ధర్మ సమ్మతము. ووالد وما ولد

وَوَالِدٍۢ وَمَا وَلَدَ ﴿٣﴾

మరియు అల్లా హ్ మానవుని తండ్రిపై ప్రమాణం చేశాడు. మరియు అతని నుండి కలిగే సంతానముపై ప్రమాణం చేశాడు

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ فِى كَبَدٍ ﴿٤﴾

నిశ్చయంగా మేము మనిషిని శ్రమలో,కష్టములోసృష్టించాము. ఇహలోకంలోకష్టా లను అతడు అనుభవిస్తా డు. أيحسب أن لن يقدر عليه أحد

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌۭ ﴿٥﴾

ఏమిటి మనిషి తాను పాపకార్యములకు పాల్పడినప్పుడు అతనిపై ఎవరి అదుపు లేదని మరియు అతనితో ఎవరు ప్రతీకారము తీర్చుకోడని బావిస్తు న్నాడా, ఒక వేళ అతడు తనను సృష్టించిన తన ప్రభువైనా కూడా ?! يقول أهلكت مالا لبدا

يَقُولُ أَهْلَكْتُ مَالًۭا لُّبَدًا ﴿٦﴾

అతను ఇలా అంటున్నాడు: నేను ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన చాలా సంపదను ఖర్చు చేశాను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أيحسب أن لم يره أحد

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ ﴿٧﴾

తాను ఖర్చు చేసిన దానిపై ప్రగల్బాలు పలికే ఇతను తనను అల్లాహ్ చూడటం లేదని భావిస్తున్నాడా ? మరియు ఆయన అతని సంపద విషయంలో అతడు ఎక్కడ నుండి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు అన్న దానిలో లెక్క తీసుకోడని భావిస్తు న్నాడా ?. ألم نجعل له عينين

أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ ﴿٨﴾

ఏమీ మేము అతని కొరకు అతను చూసే రెండు కళ్ళను తయారు చేయలేదా ?! ولسانا وشفتين

وَلِسَانًۭا وَشَفَتَيْنِ ﴿٩﴾

మరియు అతను మాట్లా డే నాలుకను మరియు రెండు పెదాలను

وَهَدَيْنَـٰهُ ٱلنَّجْدَيْنِ ﴿١٠﴾

మరియు మేము అతనికి మంచి మార్గమును మరియు దుర్మార్గమును పరిచయం చేశాము

فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ ﴿١١﴾

మరియు అతను స్వర్గం నుండి అతన్ని వేరు చేసే కనుమను దాటటానికి మరియు అదిరోహించటానికి ఆశిస్తు న్నాడు

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ ﴿١٢﴾

ఓ ప్రవక్తఅతడు స్వర్గంలో ప్రవేశించటానికి అతను దాటే కనుమ ఏమిటో మీకేమి తెలుసు ?! فك رقبة

فَكُّ رَقَبَةٍ ﴿١٣﴾

అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా బానిసత్వం నుండి విడిపించడం. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أو إطعم فى يوم ذى مسغبة

أَوْ إِطْعَـٰمٌۭ فِى يَوْمٍۢ ذِى مَسْغَبَةٍۢ ﴿١٤﴾

లేదా ఆహారం లభించటం అరుదుగా ఉండే కరువు దినంలో ఆహారమును తినిపించటం يتيما ذا مقربة

يَتِيمًۭا ذَا مَقْرَبَةٍ ﴿١٥﴾

తనకు సమీప బందువైన తన తండ్రిని కోల్పోయిన శిసువుకు (సమీప అనాధకు) أو مسكينا ذا متربة

أَوْ مِسْكِينًۭا ذَا مَتْرَبَةٍۢ ﴿١٦﴾

తన యాజమాన్యంలో ఏమీ లేని బీధ వానికి

ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ ﴿١٧﴾

ఆ తరువాత అతడు అల్లాహ్ ను విశ్వసించి మరియు విధేయత కార్యాలు చేయటంపై,అవిధేయత కార్యాలను విడనాడటంపై,ఆపదలపై ఓర్పు చూపమని ఒకరినొకరు సహనం చూపుకోమని తాకీదు చేసుకున్న వారిలో నుంచి మరియు అల్లా హ్ దాసులపైకరుణించమని ఒకరినొకరు తాకీదు చేసుకున్న వారిలొనుంచి అయిపోయాడు

أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ ﴿١٨﴾

ఈ సుగుణాలు కలిగిన వారందరే కుడి పక్షం వారు

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِنَا هُمْ أَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ ﴿١٩﴾

మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించిన వారే ఎడమ పక్షం వారు. عليهم نار مؤصدة

عَلَيْهِمْ نَارٌۭ مُّؤْصَدَةٌۢ ﴿٢٠﴾

వారిపై ప్రళయ దినమున బందించబడిన నరకాగ్ని ఉంటుంది అందులో వారు శిక్షంపబడుతారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Balad — البلد

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు