ముఖపేజీతఫ్సీర్At-Takaathur (102)

తఫ్సీర్ At-Takaathur (102) — التكاثر

మక్కీ · 8 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ ﴿١﴾

ఓ ప్రజలారా సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది

حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ ﴿٢﴾

చివరికి మీరు మరణించి మీ సమాదులలో ప్రవేశించారు. كلا سوف تعلمون

كَلَّا سَوْفَ تَعْلَمُونَ ﴿٣﴾

వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లా హ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ثم كلاسوف تعلمون

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ ﴿٤﴾

ఆ పిదప మీరు తొందరలోనే దాని పర్యవసానమును తెలుసుకుంటారు

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ ﴿٥﴾

వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల,సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు

لَتَرَوُنَّ ٱلْجَحِيمَ ﴿٦﴾

అల్లా హ్ సాక్షిగా ప్రళయదినమున మీరు నరకాగ్నిని తప్పకుండా చూస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ ﴿٧﴾

ఆ తరువాత మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తా రు. అందులో ఎటువంటి సందేహం లేదు

ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ ﴿٨﴾

ఆ తరువాత అల్లా హ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము,ఐశ్వర్యము,ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · At-Takaathur — التكاثر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు