ముఖపేజీతఫ్సీర్Ad-Dhuhaa (93)

తఫ్సీర్ Ad-Dhuhaa (93) — الضحى

మక్కీ · 11 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلضُّحَىٰ ﴿١﴾

పగటి మొదటి వేళ పై అల్లా హ్ ప్రమాణం చేశాడు

وَٱلَّيْلِ إِذَا سَجَىٰ ﴿٢﴾

మరియు రాత్రిపై ప్రమాణం చేసాడు అది చీకటి అయినప్పుడు మరియు అందులో ప్రజలు కదలకుండా ఉన్నప్పుడు. ما ودعك ربك وما قل

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ﴿٣﴾

ఓ ప్రవక్తమీ ప్రభువు మిమ్మల్ని వదలలేదు మరియు మిమ్మల్ని ద్వేషించ లేదు; వహీ ఆగి పోయినప్పుడు ముష్రికులు పలికినట్లు

وَلَلْـَٔاخِرَةُ خَيْرٌۭ لَّكَ مِنَ ٱلْأُولَىٰ ﴿٤﴾

మరియు పరలోక నివాసము మీ కొరకు ఇహలోకము కన్న మేలైనది. అందులో ఉన్న శాశ్వతమైన,అంతం కాని అనుగ్రహాల వలన

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ ﴿٥﴾

మరియు ఆయన తొందరలోనే మీకు మరియు మీ జాతికి చాలా పుణ్యమును ప్రసాదిస్తాడు. చివరికి ఆయన మీకు మరియు మీ జాతి వారికి ప్రసాదించిన దానితో మీరు సంతోషపడుతారు. ألم يجدك يتيما فٔاو

أَلَمْ يَجِدْكَ يَتِيمًۭا فَـَٔاوَىٰ ﴿٦﴾

నిశ్చయంగా ఆయన మిమ్మల్ని బాల్యంలో మీ తండ్రి మీ నుండి మరణించి ఉండగా పొందాడు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయం కల్పించాడు. ఎలాగంటే మీ తాత అబ్దు ల్ ముత్తలిబ్ మీపై దయ చూపారు. ఆ తరువాత మీ బాబాయి అబూతాలిబ్. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ل

وَوَجَدَكَ ضَآلًّۭا فَهَدَىٰ ﴿٧﴾

గ్రంధం ఏమిటో విశ్వాసం ఏమిటో మీకు తెలియని స్థితిలో ఆయన మీకు పొందాడు. అయితే ఆయన వాటిలో నుండి మీకు తెలియని దానిని ఆయన నేర్పించాడు

وَوَجَدَكَ عَآئِلًۭا فَأَغْنَىٰ ﴿٨﴾

మరియు ఆయన మిమ్మల్ని బీద వారిగా పొంది మిమ్మల్ని ధనికులుగా చేశాడు

فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ ﴿٩﴾

అయితే మీరు బాల్యంలో తన తండ్రిని కోల్పోయిన వాడితో చెడుగా వ్యవహరించకండి. మరియు అతడిని అవమానపరచకండి

وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ ﴿١٠﴾

మరియు అవసరం ఉండి చేయి చాపి అడిగే వాడిని గద్దించకండి. وأم ابنعمة ربك فحدث

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ﴿١١﴾

మరియు మీపైఉన్న అల్లా హ్ అనుగ్రహాలకు కృతజ్ఞతతెలుపుకో. మరియు వాటిని బహిరంగంగా ప్రకటించు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Ad-Dhuhaa — الضحى

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు