وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ ﴿١﴾
రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లా హ్ దానిపై ప్రమాణం చేశాడు
ముఖపేజీ›తఫ్సీర్›Al-Lail (92)
మక్కీ · 21 ఆయతులు
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ ﴿١﴾
రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లా హ్ దానిపై ప్రమాణం చేశాడు
وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ ﴿٢﴾
మరియు పగలు బహిర్గతమై,ప్రత్యక్షమైనప్పుడు దానిపై ప్రమాణం చేశాడు
وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ ﴿٣﴾
మరియు రెండు రకములైన తన సృష్టి అయిన మగ,ఆడ పై ప్రమాణం చేశాడు. إن سعيكم لشت
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ ﴿٤﴾
ఓ ప్రజలారా నిశ్చయంగా మీ కర్మ రకరకాలుగా ఉంటుంది. అందులో స్వర్గములో ప్రవేశమునకు కారణమయ్యే సత్కర్మలు కలవు. మరియు నరకములో ప్రవేశమునకు కారణమయ్యే పాప కార్యములు కలవు
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ ﴿٥﴾
ఇక ఎవరైతే జకాతు,ఖర్చు చేయటం,పాపపరిహారములోంచి ఏదైతే ఖర్చు చేయటం తనపై తప్పనిసరో దాన్ని ఇచ్చాడో మరియు దేని నుండైతే అల్లా హ్ వారించాడో దాని నుండి దూరంగా ఉండాటో
وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ ﴿٦﴾
మరియు పరిహారంగా అల్లా హ్ తనకు ఏదైతే ఇస్తా నని వాగ్దా నం చేశాడో దాన్ని నమ్ముతాడో. فسنيسره لليسر
فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ ﴿٧﴾
అతనిపై మేము తొందరలోనే సత్కర్మను చేయటమును మరియు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటమును సులభతరం చేస్తా ము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ ﴿٨﴾
మరియు ఎవరైతే తన సంపద విషయంలో పిసినారితనం చూపి దాన్ని దేనిలోనైతే ఖర్చు చేయటం తనపై అనివార్యమో ఖర్చు చేయలేదో మరియు అల్లా హ్ నుండి తన సంపద విషయంలో నిర్లక్ష్యం వహించి అల్లా హ్ తో ఆయన అనుగ్రహముల్లోంచి ఏదీ అర్దించలేదో
وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ ﴿٩﴾
అల్లా హ్ ఏదైతే బదులుగా ఇస్తానని మరియు తన సంపదలో నుంచి అల్లా హ్ మార్గంలో ఖర్చు చేయటంపై ప్రతిఫలం ఇస్తానని వాగ్దా నం చేశాడో దాన్ని అబద్దమని తిరస్కరించాడు. فسنيسره للعسر
فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ ﴿١٠﴾
తొందరలోనే మేము చెడును చేయటమును అతనిపై సులభతరం చేస్తా ము. మరియు మేలును చేయటమును అతనిపై కష్టతరం చేస్తా ము
وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ ﴿١١﴾
అతను నాశనం అయి నరకంలో ప్రవేశించినప్పుడు తాను పిసినారి తనం చూపిన తన సంపద తనకు ఏమి పనికి రాలేదు. إن علينا للهد
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ ﴿١٢﴾
నిశ్చయంగా మేము అసత్య మార్గము నుండి సత్య మార్గమును స్పష్టపరచటం మా బాధ్యత
وَإِنَّ لَنَا لَلْـَٔاخِرَةَ وَٱلْأُولَىٰ ﴿١٣﴾
మరియు నిశ్చయంగా పరలోక జీవితం మా కొరకే మరియు ఇహలోక జీవితం మా కొరకే. వాటిలో మేము తలుచుకున్నట్లు వ్యవహారాలు నడుపుతాము. మాకు తప్ప అది ఎవరికి చెందదు. فأنذرتكم نارا تلظ
فَأَنذَرْتُكُمْ نَارًۭا تَلَظَّىٰ ﴿١٤﴾
ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లా హ్ కు అవిధేయత చూపితే దహించి వేసే నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించాను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى ﴿١٥﴾
ఈ నరకాగ్నిని అనుభవించువాడు దుష్టు డు మాత్రమే మరియు అతడు అవిశ్వాసపరుడు
ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ ﴿١٦﴾
అతడే దైవ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించాడు మరియు అల్లా హ్ ఆదేశించిన వాటిని పాటించటం నుండి విముఖత చూపాడు
وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى ﴿١٧﴾
ప్రజల్లో అత్యంత దైవ భీతి కలిగిన వారైన అబూబకర్ రజిఅల్లా హు అన్హు దాని నుండి దూరంగా ఉంటారు
ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ ﴿١٨﴾
ఆయనే పాపముల నుండి పరిశుద్ధు డగుటకు తన సంపదను పుణ్య మార్గా ల్లో ఖర్చు చేశారు
وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍۢ تُجْزَىٰٓ ﴿١٩﴾
మరియు తన సంపద నుండి తాను ఖర్చు చేసినది, ఎవరో తనకు ఉపకారము చేసిన దానికి బదులుగా కాదు
إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ ﴿٢٠﴾
తన సంపదలో నుంచి తాను ఖర్చు చేసినది తన సృష్టి రాసుల కన్న మహోన్నతుడైన తన ప్రభువు మన్నతును కోరుతూ మాత్రమే. ولسوف يرض
وَلَسَوْفَ يَرْضَىٰ ﴿٢١﴾
మరియు అతడు తనకు అల్లా హ్ ప్రసాదించే గొప్ప ప్రతిఫలముతో సంతుష్టపడుతాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు