أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ﴿١﴾
నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము. ووضعنا عنك وزرك
ముఖపేజీ›తఫ్సీర్›Ash-Sharh (94)
మక్కీ · 8 ఆయతులు
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ﴿١﴾
నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము. ووضعنا عنك وزرك
وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ ﴿٢﴾
మరియు మీ మునుపటి పాపాలకు మేము మిమ్మల్ని క్షమించాము మరియు మీరు ఉన్న అజ్ఞానపు రోజుల బరువును మేము తొలగించాము
ٱلَّذِىٓ أَنقَضَ ظَهْرَكَ ﴿٣﴾
ఏదైతే మిమ్మల్ని అలసింపజేసి చివరికి అది మీ వెన్నును విరిచివేయటానికి దగ్గరగా ఉన్నదో. ورفعنا لك ذكرك
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ﴿٤﴾
మరియు మేము మీ చర్చను మీ కొరకు పైకి లేపాము. అజాన్ లో మరియు ఇఖామత్ లో మరియు ఇతరవాటిలో మీ ప్రస్తా వన జరిగినది
فَإِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا ﴿٥﴾
నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది
إِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًۭا ﴿٦﴾
నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది. మీరు ఇది తెలుసుకున్నప్పుడు మీ జాతి వారి బాధపెట్టటం మీకు భయాందోళనకు గురి చేయకూడదు. మరియు అల్లాహ్ వైపు పిలవటం నుండి మిమ్మల్ని నిరోధించకూడదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَإِذَا فَرَغْتَ فَٱنصَبْ ﴿٧﴾
మీకు మీ పనుల నుండి తీరిక దొరికి మీరు వాటిని పూర్తి చేసినప్పుడు మీ ప్రభువును ఆరాధించడానికి కృషి చేయండి
وَإِلَىٰ رَبِّكَ فَٱرْغَب ﴿٨﴾
మరియు మీ కోరికను మరియు మీ ఉద్దేశమును ఒక్కడైన అల్లా హ్ కి మాత్రమే చేయండి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు