سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى ﴿١﴾
తన సృష్టిరాసుల కన్న గొప్ప వాడైన నీ ప్రభువు పరిశుద్దతను కొనియాడు ఆయన నామమును పలుకుతూ ఆయననే నీవు స్మరించినప్పుడు మరియు నీవు ఆయన గొప్పతనమును పలుకుతూ
ముఖపేజీ›తఫ్సీర్›Al-A'laa (87)
మక్కీ · 19 ఆయతులు
سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى ﴿١﴾
తన సృష్టిరాసుల కన్న గొప్ప వాడైన నీ ప్రభువు పరిశుద్దతను కొనియాడు ఆయన నామమును పలుకుతూ ఆయననే నీవు స్మరించినప్పుడు మరియు నీవు ఆయన గొప్పతనమును పలుకుతూ
ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ ﴿٢﴾
ఆయనే మనిషిని సమగ్రంగా సృష్టించాడు మరియు అతని రూపమును తగిన ప్రమాణంలో తీర్చిదిద్దా డు
وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ ﴿٣﴾
మరియు ఆయనే సృష్టితాలను వాటి జాతులను వాటి రకాలను మరియు వాటి గుణములను అంచనా వేశాడు. మరియు ప్రతీ సృష్టి రాసిని దానికి తగిన దాని వైపునకు మరియు దానికి అనుకూలమైన దాని వైపునకు మార్గదర్శకం చేశాడు
وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ ﴿٤﴾
మరియు ఆయనే భూమి నుండి మీ పశువులు మేసే మేతను వెలికితీశాడు
فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ ﴿٥﴾
మరల దాన్ని తాజాగా పచ్చగా ఉన్న తరువాత ఆయన నల్లటి ఎండు గడ్డిగా మార్చి వేశాడు
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ ﴿٦﴾
ఓ ప్రవక్తా మేము తొందరలోనే ఖుర్ఆన్ ను మీకు చదివింపజేస్తా ము మరియు దాన్ని మీ హృదయంలో సమీకరిస్తా ము. మీరు దాన్ని మరచిపోరు. కాబట్టి మీరు చదివే విషయంలో జిబ్రయిల్ కన్న ముందు చదవకండి ఏ విధంగానైతే మీరు దాన్ని మరవకుండా ఉండటానికి అత్యాశతో చేసేవారో అలా. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ ﴿٧﴾
కాని విజ్ఞతతో దాని నుండి మీరు మరవాలని అల్లా హ్ తలచినది తప్ప. నిశ్చయంగా పరిశుద్ధు డైన ఆయనకు బహిర్గతం చేయబడేవి మరియు గోప్యంగా ఉంచబడేవి తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ونيسرك لليسر
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ ﴿٨﴾
మరియు స్వర్గంలో ప్రవేశింపజేసే కర్మల్లోంచి అల్లాహ్ సంతుష్టపడే వాటిని చేయటమును మీకు మేము సులభతరం చేస్తా ము
فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ ﴿٩﴾
కావున ఖుర్ఆన్ నుండి మేము మీకు దైవవాణి ద్వారా తెలియజేసిన వాటిని మీరు ప్రజలకు బోధించండి మరియు వారిని హితోపదేశం విన్నంత కాలం హితోపదేశం చేయండి. سيذك رمن يخش
سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ ﴿١٠﴾
అల్లా హ్ తో భయపడే వాడు మీ హితబోధనలతో హితబోధన గ్రహిస్తా డు. ఎందుకంటే అతడే హితబోధనతో ప్రయోజనం చెందుతాడు
وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى ﴿١١﴾
మరియు అవిశ్వాసపరుడు హితబోధన నుండి దూరమైపోతాడు మరియు అతడు దాని నుండి బెదిరిపోతాడు. ఎందుకంటే అతడు నరకాగ్నిలో ప్రవేశించటం వలన పరలోకంలో ప్రజలందరికెల్ల పెద్ద దౌర్భాగ్యవంతుడు
ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ ﴿١٢﴾
అతడే పరలోక పెద్ద నరకాగ్నిలోప్రవేశిస్తా డు. దాని వేడి అనుభవిస్తా డు మరియు శాశ్వతంగా దాన్ని అనుభవిస్తా డు. ثم لا يموت فيها ولا يحي
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ﴿١٣﴾
ఆ తరువాత అతడు అందులో ప్రవేశిస్తా డు ఏ విధంగా నంటే అతడు అనుభవించే శిక్ష నుండి ఉపశమనం పొందటానికి بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ అందులో అతడు మరణించడు. మరియు అతడు మంచి గౌరవ ప్రధమైన జీవితమును జీవించడు. قد أفلح من تزك
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ﴿١٤﴾
నిశ్ఛయంగా షిర్కు నుండి మరియు పాప కార్యముల నుండి పరిశుద్ధుడైనవాడు ఆశించిన వాటి ద్వారా సాఫల్యం చెందుతాడు
وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ ﴿١٥﴾
మరియు అతడు తన ప్రభువును ఆయన ధర్మబద్ధం చేసిన స్మరణల ద్వారా స్మరించాడు. మరియు నమాజును దాన్ని పాటించుటకు కోరబడిన గుణము ద్వారా పాటించాడు
بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا ﴿١٦﴾
కాని మీరు ఇహలోక జీవితమును ముందు పెడుతున్నారు. మరియు దాన్ని పరలోక జీవితం పై ఆ రెండిటి మధ్య పెద్ద లోపమున్నాకూడు ప్రా ధాన్యతనిస్తు న్నారు
وَٱلْـَٔاخِرَةُ خَيْرٌۭ وَأَبْقَىٰٓ ﴿١٧﴾
మరియు పరలోకం ఇహలోకము కన్న మేలైనది మరియు గొప్పది. మరియు అందులో ఉన్న సుఖభోగాలు,వైభవాలు,శాశ్వతమైనవి. ఎందుకంటే అందులో ఉన్న అనుగ్రహాలు అంతము కానివి,శాశ్వతమైనవి
إِنَّ هَـٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ ﴿١٨﴾
నిశ్చయంగా మేము మీకు ప్రస్తావించిన ఈ ఆదేశాలు మరియు సమాచారములు ఖుర్ఆన్ కన్న పూర్వం అవతరించబడిన గ్రంధముల్లో కలవు. صحف إ برهيموموس
صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ ﴿١٩﴾
అవి ఇబ్రా హీం మరియు మూసా అలైహిమస్సలాం పై అవతరింపబడిన గ్రంధములు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు