ముఖపేజీతఫ్సీర్Al-Ghaashiya (88)

తఫ్సీర్ Al-Ghaashiya (88) — الغاشية

మక్కీ · 26 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَـٰشِيَةِ ﴿١﴾

ఓ ప్రవక్తా తన భయాందోళనల ద్వారా ప్రజలను క్రమ్ముకునే ప్రళయ సంగతి నీకు చేరినదా ?! وجوه يومئذ خشعة

وُجُوهٌۭ يَوْمَئِذٍ خَـٰشِعَةٌ ﴿٢﴾

ప్రజలు ప్రళయదినమున దౌర్భాగ్యులై ఉంటారు లేదా పుణ్యాత్ములై ఉంటారు. కావున దౌర్భాగ్యుల ముఖములు క్రుంగిపోయి క్రిందకు వాలి ఉంటాయి. عاملة ن اصبة

عَامِلَةٌۭ نَّاصِبَةٌۭ ﴿٣﴾

అవి సంకెళ్ళు వేసి ఈడ్చబడటం వలన మరియు వాటికి వేయబడిన బేడీల వలన అలసి సలసి ఉంటాయి. تصل نارا حامية

تَصْلَىٰ نَارًا حَامِيَةًۭ ﴿٤﴾

ఈ ముఖములు వేడైన అగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తా యి. تسق من عينءانية

تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍۢ ﴿٥﴾

వారికి తీవ్ర వేడిదైన సెలయేరు నుండి త్రాపించబడును. ليس لهم طعام إلا من ضريع

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍۢ ﴿٦﴾

వారి కొరకు అత్యంత చెడ్డదైన మరియు దురవాసన గల మొక్కల్లోంచి షిబ్రిక్ పేరు గల మొక్క తప్ప వారు ఆహారంగా తీసుకోవటానికి ఎటువంటి ఆహారముండదు. అది ఎండిపోయినప్పుడు విషపూరితంగా అయిపోతుంది. لا يسمن ولا يغنى من جوع

لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍۢ ﴿٧﴾

అది దాన్ని తినే వాడిని లావు చేయదు మరియు అతని ఆకలిని ఆపదు. وجوه يومئذ ن اعمة

وُجُوهٌۭ يَوْمَئِذٍۢ نَّاعِمَةٌۭ ﴿٨﴾

ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు తాము పొందిన అనుగ్రముల వలన అనుగ్రహము కలవిగా,వికసించి,సంతోషముగా ఉంటాయి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ لسعيها راض ية

لِّسَعْيِهَا رَاضِيَةٌۭ ﴿٩﴾

తాము ఇహలోకంలో చేసుకున్న తమ సత్కర్మ పట్ల సంతుష్టంగా ఉంటారు. నిశ్చయంగా వారు తమ కర్మల పుణ్యమును ఆదా చేసి ఉండగా రెట్టింపు చేసి ఉండగా పొందారు. فى جنة عالية

فِى جَنَّةٍ عَالِيَةٍۢ ﴿١٠﴾

ఉన్నతమైన స్థా నము కల స్వర్గములో. لا تسمع فيها لغية

لَّا تَسْمَعُ فِيهَا لَـٰغِيَةًۭ ﴿١١﴾

స్వర్గములోవారు ఎటువంటి అసత్య మాటను మరియు వ్యర్ధ మాటను వినరు.ఇవేకాక నిషిద్ధ మాటలు వినరు. فيها عين جارية

فِيهَا عَيْنٌۭ جَارِيَةٌۭ ﴿١٢﴾

ఈ స్వర్గములో ప్రవహించే సెలయేరులు ఉంటాయి వారు వాటిని తాము కోరిన విధంగా త్రవ్వి తీసుకుని పోతారు మరియు వాటిని మరల్చుకుంటారు. فيها سرر مرفوعة

فِيهَا سُرُرٌۭ مَّرْفُوعَةٌۭ ﴿١٣﴾

అందులో ఎత్తైన ఆసనాలుంటాయి. وأكواب م وضوعة

وَأَكْوَابٌۭ مَّوْضُوعَةٌۭ ﴿١٤﴾

మరియు పాత్రలు త్రా గటానికి సిద్ధం చేసి ఉంచబడి ఉంటాయి. ونمارق مص فوفة

وَنَمَارِقُ مَصْفُوفَةٌۭ ﴿١٥﴾

మరియు అందులో వరుసగా ఒక దానితో ఒకటి ఆనించి పెట్టబడిన దిండ్లు ఉంటాయి. وزرابى مبثوثة

وَزَرَابِىُّ مَبْثُوثَةٌ ﴿١٦﴾

మరియు అందులోఅక్కడక్కడ అనేక తివాచీలు పరచబడి ఉంటాయి

أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ ﴿١٧﴾

ఏమిటీ వారు ఒంటెల వైపునకు యోచన చేసే దృష్టితో చూడరా ఎలా అల్లాహ్ వాటిని సృష్టించాడు మరియు వాటిని ఆదం సంతతి కొరకు ఆదీనంలో చేశాడు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ ﴿١٨﴾

మరియు ఆకాశం వైపునకు చూడరా ఏ విధంగా దాన్ని పైకి ఎత్తా డో చివరికి అది వారిపై భద్రమైన కప్పుగా అయిపోయింది. అది వారిపై పడదు

وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ ﴿١٩﴾

మరియు పర్వతముల వైపుకు చూడరా ఏ విధంగా వాటిని పాతి పెట్టాడో మరియు భూమి వాటి వలన ప్రజలను తీసుకుని ప్రకంపించకుండా స్థిరంగా ఉంది

وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ ﴿٢٠﴾

మరియు భూమి వైపు చూడరా ఎలా ఆయన దాన్ని పరచాడో మరియు దాన్ని ప్రజలు దానిపై నివాసం ఉండటానికి సిద్ధం చేశాడో ?!

فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌۭ ﴿٢١﴾

ఓ ప్రవక్తా వారందరిని మీరు హితబోధన చేయండి మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టండి. మీరు హితబోధన చేసే వారు మాత్రమే. మీతో వారి హితబోధనను మాత్రమే కోరబడింది.ఇక వారి విశ్వాసము భాగ్యము ఒక్కడైన అల్లా హ్చేతిలోఉంది. لست عليهم بمصيطر

لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ ﴿٢٢﴾

మీరు వారిని విశ్వాసముపై బలవంతం పెట్టటానికి మీరు వారిపై నియమింపబడలేదు. إلا من تولى وكفر

إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ ﴿٢٣﴾

కాని ఎవరైతే వారిలోనుండి విశ్వాసం నుండి ముఖము చాటేశాడో మరియు అల్లా హ్పట్ల,ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసం కనబరచాడో

فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ ﴿٢٤﴾

అతన్ని అల్లా హ్ ప్రళయదినమున నరకములో ప్రవేశింపజేసి పెద్ద శిక్ష విధిస్తా డు. అందులో శాశ్వతంగా ఉంటాడు

إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ ﴿٢٥﴾

నిశ్చయంగా వారి మరణం తరువాత వారి మరలటం మా ఒక్కరి వైపే. ثم إن علينا حسابهم

ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم ﴿٢٦﴾

ఆ పిదప వారి కర్మలపై వారి లెక్క తీసుకోవటం మా ఒక్కరిపై బాధ్యత కలదు. మరియు మీకూ లేదు మరియు ఇతరులకూ దాని బాధ్యత లేదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Ghaashiya — الغاشية

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు