ముఖపేజీతఫ్సీర్At-Taariq (86)

తఫ్సీర్ At-Taariq (86) — الطارق

మక్కీ · 17 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ ﴿١﴾

అల్లా హ్ ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు ఆయన రాత్రి వేళ వచ్చే నక్షత్రముపై ప్రమాణం చేశాడు

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ ﴿٢﴾

ఓ ప్రవక్తా ఈ గొప్ప నక్షత్రము విషయము ఏమిటో మీకేమి తెలుసు ?!

ٱلنَّجْمُ ٱلثَّاقِبُ ﴿٣﴾

తన ప్రకాశవంతమైన కాంతితో ఆకాశమును ప్రకాశవంతం చేసే నక్షత్రం అది. إن كل نفس لما عليها حافظ

إِن كُلُّ نَفْسٍۢ لَّمَّا عَلَيْهَا حَافِظٌۭ ﴿٤﴾

ఏ మనిషి కూడా అల్లా హ్ ప్రళయదినం లెక్క తీసుకోవటం కొరకు అతని కర్మలను పరిరక్షించే ఒక దైవదూతను అతనిపై బాధ్యతగా నియమించకండా ఉండడు

فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ مِمَّ خُلِقَ ﴿٥﴾

మనిషి అల్లాహ్ అతన్ని దేని నుంచి సృష్టించాడో గమనించాలి ; అల్లాహ్ సామర్ధ్యము మరియు మనిషి అసమర్ధత అతనికి స్పష్టమవటానికి

خُلِقَ مِن مَّآءٍۢ دَافِقٍۢ ﴿٦﴾

అల్లా హ్ అతనిని చిమ్ముకుంటూ వెలువడే నీటితో సృష్టించాడు అది తల్లి గర్భంలోగుమ్మరించబడుతుంది

يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ ﴿٧﴾

ఈ నీరు మనిషి వెన్నుముక ఎముకల మధ్య నుండి మరియు రొమ్ము ఎముకల మధ్య నుండి వెలువడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إنه عل رجعه لقادر

إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌۭ ﴿٨﴾

నిశ్చయంగా పరిశుద్ధు డైన ఆయన ఈ హీనమైన నీటితో అతడిని సృష్టించినప్పుడు అతన్ని లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతని మరణం తరువాత జీవింపజేసి మరల లేపటం పై సామర్ధ్యం కలవాడు

يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ ﴿٩﴾

ఆ రోజు రహస్య విషయాలు పరీక్షించబడుతాయి. అప్పుడు హృదయములు దాచిన సంకల్పాలు మరియు విశ్వాసాలు,ఇతర విషయాలు బట్టబయలు చేయబడుతాయి. అప్పుడు వాటి నుండి పుణ్యాత్ముడు మరియు పాపాత్ముడు వేరు చేయబడుతారు. فما له من قوة ولا ناصر

فَمَا لَهُۥ مِن قُوَّةٍۢ وَلَا نَاصِرٍۢ ﴿١٠﴾

ఆ రోజు మానవునికి అల్లా హ్ శిక్ష నుండి ఆపటానికి ఎటువంటి శక్తి ఉండదు మరియు అతడికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ ﴿١١﴾

అల్లా హ్ వర్షము కల ఆకాశముపై ప్రమాణం చేశాడు. ఎందుకంటే అది దాని వైపు నుండి పదే పదే కురుస్తుంది. ع

وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ ﴿١٢﴾

మరియు ఆయన భూమిపై ఏదైతే తనలో ఉన్న మొక్కలు,ఫలములు,వృక్షములతో చీలిపోతుందో ప్రమాణం చేశాడు. إنه لقول فصل

إِنَّهُۥ لَقَوْلٌۭ فَصْلٌۭ ﴿١٣﴾

నశ్చయంగా ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ సత్యఅసత్యాల మధ్య మరియు నిజము అబద్దా ల మధ్య వేరు చేసే మాట

وَمَا هُوَ بِٱلْهَزْلِ ﴿١٤﴾

మరియు అది ఆట మరియు అసత్యము కాదు. కాని అది గంభీరము మరియు సత్యము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إن هم يكيدون كيدا

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًۭا ﴿١٥﴾

నిశ్చయంగా తమ వద్దకు తమ ప్రవక్తతీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించేవారు ఆయన దావత్ ను తిరస్కరించటానికి దాన్ని అసత్యపరచటానికి చాలా కుట్రలు పన్నుతున్నారు. وأ كيد كيدا

وَأَكِيدُ كَيْدًۭا ﴿١٦﴾

మరియు నేను ధర్మమును భహిర్గతం చేసి అసత్యాన్ని పరిసమాప్తం చేయటానికి పన్నాగం పన్నుతున్నాను

فَمَهِّلِ ٱلْكَـٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا ﴿١٧﴾

ఓ ప్రవక్త ఈ తిరస్కారులకు గడువివ్వండి. వారికి కొంత గడువివ్వండి. మరియు వారి శిక్షను,వారి వినాశనమును మీరు తొందరగా కోరకండి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · At-Taariq — الطارق

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు