ముఖపేజీతఫ్సీర్Al-Burooj (85)

తఫ్సీర్ Al-Burooj (85) — البروج

మక్కీ · 22 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ ﴿١﴾

సూర్య చంద్రు ల మరియు ఇతర వాటి గ్రు హములు కల ఆకాశముపై అల్లా హ్ ప్రమాణం చేశాడు

وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ ﴿٢﴾

మరియు ఆయన ఆ ప్రళయదినంపై ప్రమాణం చేశాడు దేనిలోనైతే ఆయన సృష్టిరాసులను సమీకరిస్తా నని వాగ్దా నం చేశాడో. وشاهد ومشهود

وَشَاهِدٍۢ وَمَشْهُودٍۢ ﴿٣﴾

మరియు ఆయన ప్రతీ సాక్ష్యం పలికేవాడిపై ప్రమాణం చేశాడు ఉదాహరణకు దైవప్రవక్త తన జాతి గురించి సాక్ష్యం పలుకుతారు. మరియు ప్రతీ సాక్ష్యం ఇవ్వబడిన దాని పై ప్రమాణం చేశాడు ఉదాహరణకు జాతి (ఉమ్మత్) తన ప్రవక్త గురించి సాక్ష్యం పలుకుతుంది

قُتِلَ أَصْحَـٰبُ ٱلْأُخْدُودِ ﴿٤﴾

భూమిని పెద్దగా చీల్చిన వారు శపించబడ్డా రు

ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ ﴿٥﴾

మరియు వారు అందులో అగ్నిని వెలిగించారు. మరియు వారు అందులో విశ్వాసపరులను జీవించి ఉన్న స్థితిలో వేశారు. إذ هم عليها قعود

إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌۭ ﴿٦﴾

అప్పుడు వారు ఆ చీల్చబడిన అగ్నితో నిండబడిన దాని వద్ద కూర్చుని ఉన్నారు

وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌۭ ﴿٧﴾

మరియు వారు విశ్వాసపరులకు ఇచ్చే శిక్షను,యాతనను చూస్తు న్నారు. ఆ సమయంలో వారు ప్రత్యక్షమై ఉండటం వలన

وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ ﴿٨﴾

ఈ అవిశ్వాసపరులందరు విశ్వాసపరుల పట్ల ప్రతీకారం తీసుకున్నది కేవలం వారు ఎవరు ఓడించలేని సర్వ శక్తిమంతుడైన మరియు ప్రతీ దానిలో స్థు తించబడిన అల్లా హ్ పై విశ్వాసం కనబరచారని మాత్రమే. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ شَهِيدٌ ﴿٩﴾

ఆయన ఒక్కడి కొరకే భూమ్యాకాశముల రాజ్యాధికారము. మరియు ఆయన ప్రతీది తెలుసుకునేవాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ ﴿١٠﴾

నిశ్చయంగా ఎవరైతే విశ్వాసపర పురుషులను మరియు విశ్వాసపర స్త్రీలను వారిని ఒక్కడైన అల్లా హ్ పై విశ్వాసము నుండి మరల్చటానికి శిక్షిస్తారో ఆ తరువాత తమ పాపముల గురించి అల్లా హ్ యందు పశ్ఛాత్తాప్పడరో వారి కొరకు ప్రళయదినమున నరకము యొక్క శిక్ష కలదు. మరియు వారి కొరకు వారిని దహించి వేసే అగ్ని శిక్ష కలదు. ఏదైతే వారు విశ్వాసపరులను అగ్నితో కాల్చివేసే కార్యం చేసేవారో దానికి ప్రతిఫలంగా

إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ جَنَّـٰتٌۭ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ ﴿١١﴾

నిశ్చయంగా ఎవరైతే అల్లా హ్ ను విశ్వసించి సత్కార్యములు చేస్తా రో వారి కొరకు స్వర్గవనాలు కలవు వాటి భవనముల క్రింది నుండి,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రతిఫలము ఏదైతే ఆయన వారి కొరకు సిద్ధం చేశాడో ఏ సాఫల్యం సరితూగని పెద్ద సాఫల్యము. إن بطش ربكلشديد

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ﴿١٢﴾

ఓ ప్రవక్త నిశ్చయంగా దుర్మార్గు ని కొరకు మీ ప్రభువు పట్టు - మరియు నిశ్ఛయంగా అతనికి కొంత సమయం గడువు ఇవ్వటం - ఎంతో దృఢమైనది. إ نه هو يبدئ ويعيد

إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ ﴿١٣﴾

నిశ్చయంగా ఆయనే సృష్టిని మరియు శిక్షను ఆరంభించేవాడు మరియు వాటిని మరల ఉనికిలోకి తెచ్చేవాడు

وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ ﴿١٤﴾

మరియు ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తా ప్పడేవారి పాపములను మన్నించేవాడు. మరియు నిశ్చయంగా ఆయన దైవభీతిపరుల్లోంచి తన స్నేహితులను ఇష్టపడుతాడు

ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ ﴿١٥﴾

సింహాసనము వాడు,గౌరవోన్నతుడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فعال لما يريد

فَعَّالٌۭ لِّمَا يُرِيدُ ﴿١٦﴾

పాపముల నుండి తాను కోరిన మన్నింపును తాను తలచిన వారికి చేసేవాడును మరియు తాను తలచిన వారికి శిక్షించేవాడును. పరిశుద్ధు డైన ఆయనను బలవంతం చేసేవాడు ఎవడూ లేడు

هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ ﴿١٧﴾

ఓ ప్రవక్తా సత్యముకి వ్యతిరేకముగా పోరాడటానికి మరియు దాని నుండి ఆపటానికి సైనికులను కూడబెట్టిన సైన్యాల సమాచారము మీ వద్దకు వచ్చినదా ? فرعون وثمود

فِرْعَوْنَ وَثَمُودَ ﴿١٨﴾

ఫిర్ఔన్ మరియు సాలిహ్ అలైహిస్సలాం సహచరులైన సమూద్ వారి (సమాచారము)

بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍۢ ﴿١٩﴾

వీరందరిని విశ్వాసము నుండి వారందరి వద్దకు సత్యతిరస్కార సమాజముల సమాచారములు రాకపోవటం మరియు వారి వినాశనము నుండి సంభవించినది ఆటంకపరచలేదు కాని వారు తమ ప్రవక్త తమ వద్దకు తీసుకుని వచ్చిన దాన్ని తమ మనోవాంఛలను అనుసరిస్తూ తిరస్కరించేవారు

وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ ﴿٢٠﴾

మరియు అల్లా హ్ వారి కర్మలను చుట్టు ముట్టేవాడును వాటిని లెక్కవేసేవాడును. ఆయన నుండి ఏదీ తప్పి పోదు. వాటి పరంగా ఆయన వారికి తొందరలోనే ప్రతిఫలం ప్రసాదిస్తా డు. بل هوقرءان مجيد

بَلْ هُوَ قُرْءَانٌۭ مَّجِيدٌۭ ﴿٢١﴾

సత్యతిరస్కారులన్నట్లు ఖుర్ఆన్ కవిత్వము కాదు వ్యాకరణము కాదు. కాని అది దివ్యమైన ఖుర్ఆన్. فى لوح محفوظ

فِى لَوْحٍۢ مَّحْفُوظٍۭ ﴿٢٢﴾

మార్పు చేర్పుల నుండి తరుగు పెరుగుల నుండి భద్రంగా లౌహె మహఫూజ్ లో ఉంది. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Burooj — البروج

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు