وَيْلٌۭ لِّكُلِّ هُمَزَةٍۢ لُّمَزَةٍ ﴿١﴾
ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు
ముఖపేజీ›తఫ్సీర్›Al-Humaza (104)
మక్కీ · 9 ఆయతులు
وَيْلٌۭ لِّكُلِّ هُمَزَةٍۢ لُّمَزَةٍ ﴿١﴾
ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు
ٱلَّذِى جَمَعَ مَالًۭا وَعَدَّدَهُۥ ﴿٢﴾
అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు. يحسب أن ماله أخلده
يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ ﴿٣﴾
అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తు న్నాడు
كَلَّا ۖ لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ ﴿٤﴾
ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ ﴿٥﴾
ఓ ప్రవక్తతనలోవిసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తు నియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?
نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ ﴿٦﴾
నిశ్చయంగా అది అల్లా హ్ రాజేసిన అగ్ని
ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ ﴿٧﴾
అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లో కి చొచ్చుకుపోయేది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إن ها عليهم مؤصدة
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌۭ ﴿٨﴾
నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది. فى عمد ممد دة
فِى عَمَدٍۢ مُّمَدَّدَةٍۭ ﴿٩﴾
విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు