ముఖపేజీతఫ్సీర్At-Takwir (81)

తఫ్సీర్ At-Takwir (81) — التكوير

మక్కీ · 29 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ ﴿١﴾

సూర్యుని ఆకారము సమీకరించబడి దాని వెలుగు తొలగిపోయినప్పుడు

وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ ﴿٢﴾

మరియు నక్షత్రములు రాలిపోయి వాటి కాంతి తుడిచివేయబడినప్పుడు

وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ ﴿٣﴾

మరియు పర్వతములు తమ స్థా నము నుండి కదిలించబడినప్పుడు

وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ ﴿٤﴾

యజమానులు తాము పోటీపడేటటువంటి గర్భిణీ ఒంటెలను నిర్లక్ష్యంగా వదిలివేసినప్పుడు

وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ ﴿٥﴾

మరియు కృూరమృగాలు మానవులతో పాటు ఒకే నేలలో సమీకరించబడినప్పుడు

وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ ﴿٦﴾

మరియు సముద్రా లు వెలిగించబడినప్పుడు చివరికి అవి అగ్నిగా అయిపోతాయి

وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ ﴿٧﴾

మరియు ప్రాణములు తమ లాంటి వారితో కలిపివేయబడినప్పుడు. అప్పుడు దుష్టుడు దుష్టునితో మరియు దైవబీతిపరుడు దైవబీతిపరునితో కలిపివేయబడుతాడు

وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ ﴿٨﴾

మరియు పూడ్చబడిన ఆడ పిల్ల అది జీవించి ఉన్నప్పుడు అల్లా హ్ దానిని ప్రశించినప్పుడు. بأى ذنب قتلت

بِأَىِّ ذَنۢبٍۢ قُتِلَتْ ﴿٩﴾

నిన్ను హతమార్చినవాడు ఏ పాపము వలన నిన్ను హతమార్చాడు ?!

وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ ﴿١٠﴾

మరియు దాసుల కర్మల పుస్తకములు తెరవబడినప్పుడు ప్రతి ఒక్కడు తమ కర్మల పుస్తకమును చదవటానికి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ ﴿١١﴾

మరియు ఆకాశము మేక నుండి తోలు ఒలిచివేయబడినట్లు ఒలిచివేయబడినప్పుడు

وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ ﴿١٢﴾

మరియు నరకాగ్ని వెలిగించబడినప్పుడు

وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ ﴿١٣﴾

మరియు స్వర్గం దైవభాతిపరులకు దగ్గర చేయబడినప్పుడు

عَلِمَتْ نَفْسٌۭ مَّآ أَحْضَرَتْ ﴿١٤﴾

ఇవి సంభవించినప్పుడు ప్రతి ప్రా ణి తాను ఆ రోజు కొరకు ఏమి చేసుకున్నాడో తెలుసుకుంటుంది

فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ ﴿١٥﴾

దాగిన నక్షత్రా లపై అల్లా హ్ అవి రాత్రి ప్రత్యక్షం కాక ముందే ప్రమాణం చేశాడు

ٱلْجَوَارِ ٱلْكُنَّسِ ﴿١٦﴾

తమ కక్ష్యల్లో ప్రకాశించేవి అవి జింకలు తాము దాక్కొనే ప్రదేశంలో అంటే తమ ఇండ్లలోకి ప్రవేశించే మాదిరిగా తెల్లవారగానే కనుమరుగవుతాయి

وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ ﴿١٧﴾

మరియు ఆయన రాత్రి మొదటి వేళ అది వచ్చినప్పుడు మరియు దాని చివరి వేళ అది వెళ్ళినప్పుడు ప్రమాణం చేశాడు

وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ ﴿١٨﴾

మరియు ఆయన ఉదయంపై దాని కాంతి ఉదయించినప్పుడు ప్రమాణం చేశాడు. إنه لقول رسول كريم

إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ ﴿١٩﴾

నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు దాన్ని నీతి మంతుడైన ఒక దైవదూత చేరవేశాడు. ఆయనే జిబ్రయీల్ అలైహిస్సలాం. అల్లా హ్ ఆయనపై నమ్మకం ఉంచాడు

ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍۢ ﴿٢٠﴾

మహాబలవంతుడు, పరిశుద్ధు డైన సింహాసన యజమాని వద్ద ఉన్నత స్థా నం కలవాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ مطاع ثم أمين

مُّطَاعٍۢ ثَمَّ أَمِينٍۢ ﴿٢١﴾

ఆకాశ వాసులు అతనిపై విధేయత చూపుతారు. ఆయన చేరవేసే దైవ వాణి విషయంలో నమ్మకస్తు డు. وما صاحبكم بمجنون

وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍۢ ﴿٢٢﴾

మీతోపాటే ఉండే ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం మీకు అతని బుద్ధి గురించి,అతని నీతి గురించి,అతని నిజాయితీ గురించి తెలుసు. అతడు మీరు నిందమోపినట్లు పిచ్చివాడు కాదు

وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ ﴿٢٣﴾

మరియు నిశ్ఛయంగా మీ సహచరుడు జిబ్రయీల్ ను స్పష్టమైన ఆకాశపు అంచులపై ఆయన సృష్టించబడిన ఆయన రూపములో చూశాడు

وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍۢ ﴿٢٤﴾

మరియు మీ సహచరుడు మీకు చేరవేయమని అతనికి ఆదేశించబడిన వాటిని మీకు చేరవేయటంలో మీయందు పిసినారి కాదు. మరియు అతడు జ్యోతిష్యులు తీసుకున్నట్లు ఎటువంటి వేతనం తీసుకోడు. وما هوبقول شيطن رجيم

وَمَا هُوَ بِقَوْلِ شَيْطَـٰنٍۢ رَّجِيمٍۢ ﴿٢٥﴾

మరియు ఈ ఖుర్ఆన్ దైవ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను వాక్కు కాదు. فأ ين تذهبون

فَأَيْنَ تَذْهَبُونَ ﴿٢٦﴾

అయితే ఈ వాదనల తరువాత అది అల్లా హ్ వద్ద నుండి అన్న దానికి నిరాకరించటమునకు మీరు ఏ మార్గములో నడుస్తా రు ?! إن هو إل اذكر للعلمين

إِنْ هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَـٰلَمِينَ ﴿٢٧﴾

ఖుర్ఆన్ జిన్నులకు మరియు మానవులకు ఒక జ్ఞా పిక మరియు హితోపదేశం మాత్రమే

لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ ﴿٢٨﴾

మీలో నుండి సత్య మార్గంపై తిన్నగా నడవదలచిన వారి కొరకు

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ ﴿٢٩﴾

తిన్నగా ఉండటము గాని ఇతరవాటిగా గాని అల్లా హ్ తలచుకుంటే తప్ప మీరు తలచుకోలేరు. ఆయన సృష్టి రాసులన్నింటి ప్రభువు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · At-Takwir — التكوير

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు