ముఖపేజీతఫ్సీర్Al-Infitaar (82)

తఫ్సీర్ Al-Infitaar (82) — الانفطار

మక్కీ · 19 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ ﴿١﴾

మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి చీలిపోయినప్పుడు

وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ ﴿٢﴾

మరియు నక్షత్రా లు రాలిపోయి చెల్లా చెదురైపోయినప్పుడు

وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ ﴿٣﴾

మరియు సముద్రా లు ఒకదానిపై ఒకటి తెరవబడి కలిసిపోయినప్పుడు

وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ ﴿٤﴾

మరియు సమాధులు అందులోఉన్న మృతులు లేపబడటానికి వాటి మట్టి పెళ్ళగింపబడినప్పుడు. علمت نفس ما قد مت وأخ رت

عَلِمَتْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ﴿٥﴾

అప్పుడు ప్రతీ మనిషి తాను చేసుకున్న ఆచరరణను మరియు తాను చేయకుండా వెనుక వదిలేసిన ఆచరణను తెలుసుకుంటాడు

يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ ﴿٦﴾

ఓ తన ప్రభువును తిరస్కరించే మానవుడా తన వద్ద నుండి దాతృతంగా నిన్ను శిక్షించటంలో తొందర చేయకుండా నీకు గడువునిచ్చిన నీ ప్రభువు ఆదేశమును విభేదించేటట్లు ఏది చేసింది ?

ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ ﴿٧﴾

ఆయనే నీవు ఉనికిలో లేని తరువాత నీకు ఉనికిని ప్రసాదించాడు. మరియు నిన్ను సరైన,తగిన పరిమాణంలో ఉన్న అవయవాలు కలిగిన వాడిగా తీర్చి దిద్దా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فِىٓ أَىِّ صُورَةٍۢ مَّا شَآءَ رَكَّبَكَ ﴿٨﴾

ఆయన నిన్ను ఏ రూపంలో సృష్టించదలిచాడో ఆ రూపంలో నిన్ను సృష్టించాడు. మరియు నిశ్చయంగా ఆయన నిన్ను గాడిద రూపంలో గాని కోతి రూపంలో గాని కుక్క రూపంలో గాని ఇతర వాటిలా గాని సృష్టించకుండా నీపై ఉపకారం చేశాడు

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ ﴿٩﴾

ఓ నిర్లక్ష్యం వహించేవారా (మోసపోయినవారా) మీరు భావించినట్లు విషయం కాదు. కాని మీరు ప్రతిఫల దినమును తిరస్కరిస్తు న్నారు. కావున మీరు దాని కొరకు ఆచరించటం లేదు. وإن عليكم لحفظين

وَإِنَّ عَلَيْكُمْ لَحَـٰفِظِينَ ﴿١٠﴾

మరియు నిశ్ఛయంగా మీపైదైవదూతలు కనిపెట్టు కుని వారు మీ కర్మలను నమోదు చేస్తు న్నారు. كراما كتبين

كِرَامًۭا كَـٰتِبِينَ ﴿١١﴾

వారు అల్లా హ్ వద్ద గౌరవోన్నతులు,లేఖకులు మీ కర్మలను వ్రా స్తు న్నారు. يعلمون ما تفعلون

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ ﴿١٢﴾

మీరు చేస్తు న్నకర్మను వారు తెలుసుకుని దాన్ని వ్రా స్తు న్నారు

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍۢ ﴿١٣﴾

నిశ్చయంగా మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు

وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍۢ ﴿١٤﴾

మరియు నిశ్చయంగా పాపాలను చేసేవారు నరకాగ్నిలో ఉంటారు. అది వారిపై మండించబడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ ﴿١٥﴾

వారు అందులో ప్రతిఫలదినమున ప్రవేశిస్తా రు. దాని వేడిని కళ్ళారా చూస్తా రు

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ ﴿١٦﴾

వారు దాని నుండి ఎన్నటికి అదృశ్యమవరు. అంతే కాదు వారు అందులో శాశ్వతంగా ఉంటారు

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ ﴿١٧﴾

ఓ ప్రవక్తా ప్రతిఫల దినం ఏమిటో మీకు ఏమి తెలుసు ?

ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ ﴿١٨﴾

ఆ పిదప ప్రతిఫల దినం ఏమిటో మీకేమి తెలుసు ?!

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌۭ لِّنَفْسٍۢ شَيْـًۭٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍۢ لِّلَّهِ ﴿١٩﴾

ఆ రోజు ఎవరూ ఎవరికి లాభం చేకూర్చ లేడు.ఆ రోజు పూర్తి వ్వవహారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న దానితో నిర్వహిస్తా డు. ఆయనకు తప్ప ఎవరికి చెందదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Infitaar — الانفطار

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు