ముఖపేజీతఫ్సీర్Al-Mutaffifin (83)

తఫ్సీర్ Al-Mutaffifin (83) — المطففين

మక్కీ · 36 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَيْلٌۭ لِّلْمُطَفِّفِينَ ﴿١﴾

కొలతల్లో ,తూనికలలో తగ్గించి ఇచ్చేవారి కొరకు వినాశనము,నష్టము కలదు

ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ ﴿٢﴾

వారు ఇతరుల నుండి కొలిచి తీసుకున్నప్పుడు తగ్గించకుండా పూర్తిగా తమ హక్కును తీసుకుంటారు. وإذا كالوهم أو وزنوهم يخسرون

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ ﴿٣﴾

మరియు వారు ప్రజలకు కొలచి ఇచ్చినప్పుడు లేదా వారికి తూకమేసి ఇచ్చినప్పుడు కొలవటంలో,తూకమేయటంలో తగ్గించి ఇచ్చేవారు. మరియు ఈ పరిస్థితి మదీనా వాసులది దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం వారి వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఉండేది

أَلَا يَظُنُّ أُو۟لَـٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ ﴿٤﴾

ఏమీ ఈ దుష్కార్యమునకు పాల్పడేవారు అల్లా హ్ వద్దకు మరల లేపబడి వెళతారని నమ్మకం లేదా ?! ليوم عظيم

لِيَوْمٍ عَظِيمٍۢ ﴿٥﴾

ఒక గొప్ప దినములో లెెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అందులో ఉన్న పరీక్ష మరియు భయాందోళనల వలన

يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٦﴾

ఆ దినమున ప్రజలు లెక్క కొరకు సృష్టితాలందరి ప్రభువు ముందు నిలబడుతారు

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍۢ ﴿٧﴾

మరణాంతరం మరల లేపబడటం లేదని మీరు భావించినట్లు విషయం కాదు. నిశ్చయంగా అవిశ్వాసపరులైన,కపటులైన పాపాత్ముల కర్మల పుస్తకములు అత్యంత క్రిందటి భూమిలో నష్టములో ఉంటాయి

وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌۭ ﴿٨﴾

ఓ ప్రవక్తా సిజ్జీన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?. كتب م رقوم

كِتَـٰبٌۭ مَّرْقُومٌۭ ﴿٩﴾

నిశ్ఛయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿١٠﴾

సత్య తిరస్కారుల కొరకు ఆ రోజు వినాశనం,నష్టము కలదు

ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ ﴿١١﴾

ఎవరైతే అల్లా హ్ ఇహ లోకంలో తన దాసులు చేసుకున్న వారి కర్మల ప్రతిఫలం ప్రసాదించే దినమును తిరస్కరిస్తా రో వారికి

وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ﴿١٢﴾

అల్లా హ్ హద్దు లను అతిక్రమించే అధిక పాపములు కల ప్రతి ఒక్కరు ఆ దినమును తిరస్కరిస్తా రు

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿١٣﴾

మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను అతనికి చదివి వినిపించబడినప్పుడు అవి పూర్వ సమాజాల కట్టు కథలు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడినవి కావు అనేవాడు

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ ﴿١٤﴾

ఈ తిరస్కారులందరు ఊహించినట్లు విషయం కాదు. కాని వారు చేసుకున్న పాపాలు వారి బుద్ధు లను అదిగమించి వాటిని కప్పివేశాయి. వారు తమ మనస్సులతో సత్యమును చూడలేదు

كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍۢ لَّمَحْجُوبُونَ ﴿١٥﴾

వాస్తవానికి వారు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనం నుండి ఆపబడుతారు

ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ ﴿١٦﴾

ఆ పిదప నిశ్చయంగా వారు నరకాగ్నిలో ప్రవేశిస్తా రు. దాని వేడిని వారు అనుభవిస్తా రు

ثُمَّ يُقَالُ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ﴿١٧﴾

ఆ పిదప ప్రళయదినమున వారిని నిందిస్తూ వారితో ఇలా పలకబడును: మీరు పొందే ఈ శిక్ష అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మీకు తెలిపినప్పుడల్లా మీరు దాన్ని తిరస్కరించేవారు

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ ﴿١٨﴾

లెక్క తీసుకోవటం గాని ప్రతిఫలం ప్రసాదించటం గాని లేదని మీరు ఊహంచినట్లు విషయం కాదు. నిశ్చయంగా విధేయత చూపేవారి కర్మల పుస్తకం ఇల్లియ్యీన్ లో ఉంటుంది

وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ ﴿١٩﴾

ఓ ప్రవక్తా ఇల్లియ్యూన్ ఏమిటో మీకు ఏమి తెలుసు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ كتب م رقوم

كِتَـٰبٌۭ مَّرْقُومٌۭ ﴿٢٠﴾

నిశ్చయంగా వారి కర్మల పుస్తకం చెదరదు అందులో అధికం చేయబడదు మరియు తరగించబడదు

يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ ﴿٢١﴾

ఈ పుస్తకం వద్ద ప్రతి ఆకాశమునకు దగ్గర ఉండే దైవదూతలు హాజరవుతారు

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ ﴿٢٢﴾

నిశ్ఛయంగా విధేయకార్యములను అధికంగా చేసేవారు ప్రళయదినమున శాశ్వత అనుగ్రహాల్లో ఉంటారు

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ ﴿٢٣﴾

అలంకరించబడిన ఆసనములపై కూర్చుని తమ ప్రభువు వైపునకు మరియు వారి మనస్సులను ఆనందపరిచే,వారికి సంతోషమును కలిగించే వాటన్నింటి వైపు వారు చూస్తుంటారు

تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ ﴿٢٤﴾

నీవు వారిని చూసినప్పుడు వారి ముఖముల్లో అందం పరంగా,సంతోషం పరంగా సుఖభోగాల ప్రభావమును చూస్తా వు. يسقون من رحيق م ختوم

يُسْقَوْنَ مِن رَّحِيقٍۢ مَّخْتُومٍ ﴿٢٥﴾

వారికి వారి సేవకులు సీలు వేయబడిన పాత్ర నుండి మధువును త్రా పించుతారు

خِتَـٰمُهُۥ مِسْكٌۭ ۚ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَـٰفِسُونَ ﴿٢٦﴾

దాని ముగింపు వరకు దాని నుండి కస్తూ రి సువాసన పరిమళిస్తూ ఉంటుంది. మరియు ఈ గౌరవోన్నత ప్రతిఫలం విషయంలో ముందుకు సాగే వారు ముందుకు సాగాలి. అల్లా హ్ ను సంతోష పెట్టే కార్యాలను చేసి మరియు ఆయనను క్రోధానికి గురి చేసే వాటిని వదిలి. ومزاجه من تسنيم

وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ ﴿٢٧﴾

సీలు వేయబడిన ఈ పానీయం తస్నీమ్ సెలయేరు నుండి కలుపబడి ఉంటుంది

عَيْنًۭا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ ﴿٢٨﴾

మరియు అది స్వర్గము యొక్క ఉన్నత స్థా నంలో ఉన్న ఒక సెలయేరు దాని నుండి సాన్నిధ్యం పొందిన వారు తాగుతారు అది పరిశుద్ధమైనది కలితీలేనిది. దాని నుండి విశ్వాసపరులందరు త్రా గుతారు. అది వేరే దానితో కలిసి ఉంటుంది

إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ ﴿٢٩﴾

నిశ్చయంగా తాము ఉన్న అవిశ్వాసముతో అపరాధమునకు పాల్పడినవారు విశ్వాసపరులపై పరిహాసంగా నవ్వేవారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وإذا مر وابهم يتغامزون

وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ ﴿٣٠﴾

మరియు వారు విశ్వాసపరుల యెదుట నుండి పోయినప్పుడు ఒకరినొకరు పరిహాసంగా,హచ్చరికగా కనుసైగలు చేసుకునేవారు

وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ ﴿٣١﴾

మరియు వారు తమ ఇంటివారి వద్దకు మరలినప్పుడు తాము ఉన్న అవిశ్వాసము మరియు విశ్వాసపరుల పట్ల పరిహాసముతో సంబరపడుతూ మరలేవారు

وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَـٰٓؤُلَآءِ لَضَآلُّونَ ﴿٣٢﴾

మరియు వారు ముస్లిములను చూసినప్పుడు నిశ్చయంగా వీరందరు తమ తాతముత్తాతల ధర్మమును వదిలివేయటం వలన సత్యమార్గము నుండి తప్పిపోయారు అని అనేవారు

وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَـٰفِظِينَ ﴿٣٣﴾

వారు తమ ఈ మాట పలకటానికి అల్లా హ్ వారిని వారి కర్మలను పరిరక్షించే బాధ్యత ఇవ్వలేదు

فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ ﴿٣٤﴾

కాని అల్లా హ్ ను విశ్వసించేవారు ప్రళయదినమున అవిశ్వాసపరులపై నవ్వుతారు ఏవిధంగానైతే వారు ఇహలోకంలో వారిపై నవ్వే వారో అలా

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ ﴿٣٥﴾

అలంకరించబడిన ఆసనములపై కూర్చొని అల్లా హ్ తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శాశ్వత అనుగ్రహాలను చూస్తుంటారు

هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ ﴿٣٦﴾

నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలకు హీనమైన శిక్షతో ప్రతిఫలం ప్రసాదించబడ్డా రు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Mutaffifin — المطففين

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు