ముఖపేజీతఫ్సీర్An-Naazi'aat (79)

తఫ్సీర్ An-Naazi'aat (79) — النازعات

మక్కీ · 46 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلنَّـٰزِعَـٰتِ غَرْقًۭا ﴿١﴾

అవిశ్వాసపరుల ఆత్మలను కఠినంగా మరియు బలంగా గుంజే దైవదూతలపై అల్లా హ్ ప్రమాణం చేశాడు

وَٱلنَّـٰشِطَـٰتِ نَشْطًۭا ﴿٢﴾

మరియు విశ్వాసపరుల ఆత్మలను సులువుగా మరియు తేలికగా తీసే దైవదూతలపై ప్రమాణం చేశాడు

وَٱلسَّـٰبِحَـٰتِ سَبْحًۭا ﴿٣﴾

మరియు అల్లా హ్ ఆదేశమును తీసుకుని ఆకాశము నుండి భూమివైపునకు తేలయాడే దైవదూతలపై ప్రమాణం చేశాడు

فَٱلسَّـٰبِقَـٰتِ سَبْقًۭا ﴿٤﴾

మరియు అల్లా హ్ ఆదేశమును నెరవేర్చటంలో ఒకరితో ఒకరు పోటీపడే దైవదూతలపై ప్రమాణం చేశాడు

فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًۭا ﴿٥﴾

దాసుల కార్యముల బాధ్యత అప్పగించబడిన దూతలవలె అల్లా హ్ తమకు ఆదేశించిన వాటిని నెరవేర్చేటటువంటి దూతల పై ఆయన ప్రమాణం చేశాడు. లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారిని ఆయన తప్పకుండా మరల లేపుతాడని వీటన్నింటిపై ప్రమాణం చేశాడు

يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ ﴿٦﴾

ఆ రోజు మొదటి బాకా ఊదబడినప్పుడు భూమి ప్రకంపిస్తుంది

تَتْبَعُهَا ٱلرَّادِفَةُ ﴿٧﴾

ఈ బాకా వెనుకే రెండవ బాకా ఊదబడుతుంది. قلوب يومئذ واجفة

قُلُوبٌۭ يَوْمَئِذٍۢ وَاجِفَةٌ ﴿٨﴾

ఆ దినమున కొంత మంది ప్రజల హృదయాలు భయపడుతుంటాయి. أ بص رها خشعة

أَبْصَـٰرُهَا خَـٰشِعَةٌۭ ﴿٩﴾

వారి చూపులపై అవమాన ఛాయలు ప్రత్యక్షమై ఉంటాయి

يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ ﴿١٠﴾

మరియు వారు ఇలా పలుకుతుండేవారు: ఏమి మేము మరణించిన తరువాత జీవనం వైపునకు మరలుతామా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أءذا كنا عظما ن خرة

أَءِذَا كُنَّا عِظَـٰمًۭا نَّخِرَةًۭ ﴿١١﴾

ఏమీ మేము క్రు శించిపోయి ఖాళీ అయిపోయిన ఎముకలు అయపోయినప్పుడు మరలించబడుతామా ?. قالوا تلك إذا كرة خاسرة

قَالُوا۟ تِلْكَ إِذًۭا كَرَّةٌ خَاسِرَةٌۭ ﴿١٢﴾

వారు ఇలా పలికారు: మేము మరలినప్పుడు ఆ మరలింపు నష్టము కలిగిస్తుంది, మరలే వారికి నష్టపూరితమైనది. فإ ن ما هى زجرة وحدة

فَإِنَّمَا هِىَ زَجْرَةٌۭ وَٰحِدَةٌۭ ﴿١٣﴾

మరణాంతరం లేపబడే విషయం శులభమైనది. అది కేవలం బాకా ఊదే బాధ్యత కల దూత నుండి ఒక గర్జింపు మాత్రమే

فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ ﴿١٤﴾

అప్పుడు అందరు భూమిపై దానిలోపల మృతులుగా ఉన్న తరువాత కూడా జీవించబడుతారు

هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ ﴿١٥﴾

ఓ ప్రవక్తా ఏమీ మీ వద్దకు మూసా వార్త ఆయన ప్రభువుతో పాటు మరియు ఆయన శతృవు అయిన ఫిర్ఔన్ తోపాటు మీకు చేరినదా ?!

إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى ﴿١٦﴾

ఆయనను పరిశుద్ధు డైన ఆయన ప్రభువుపరిశుద్ధ తువా లోయలో పిలిచినప్పుడు

ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ ﴿١٧﴾

అతనితో అతను చెప్పిన దాని విషయంలో ఇలా చెప్పాడు: నీవు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు. నిశ్చయంగా అతడు దుర్మార్గంలో మరియు అహంకారంలో మితిమీరిపోయాడు

فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ ﴿١٨﴾

అతడితో నీవు ఇలా పలుకు: ఓ పిర్ఔన్ నీవు అవిశ్వాసము నుండి మరియు పాపకార్యముల నుండి పరిశుద్ధు డివవుతావా ?. وأهديك إلى ربك فتخش

وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ ﴿١٩﴾

మరియు నిన్ను సృష్టించి,నిన్ను జాగ్రత్తగా చూసుకున్న నీ ప్రభువు వైపునకు నేను మార్గదర్శకం చేస్తే నీవు ఆయనతో భయపడుతావా మరియు ఆయన ఇష్టపడే కార్యములను చేసి ఆయనకు క్రోధాన్ని కలిగించే వాటి నుండి దూరంగా ఉంటావా ?

فَأَرَىٰهُ ٱلْـَٔايَةَ ٱلْكُبْرَىٰ ﴿٢٠﴾

అప్పుడు మూసా అలైహిస్సలాం అతని ముందు తాను తన ప్రభువు వద్ద నుండి ప్రవక్త అని సూచించే పెద్ద అద్భుతమును ప్రవేశపెట్టా రు. అది చేయి మరియు చేతి కర్ర. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فكذ ب وعص

فَكَذَّبَ وَعَصَىٰ ﴿٢١﴾

అయితే ఫిర్ఔన్ తో ఈ అద్భుతమును తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగ లేదు. మరియు అతను మూసా అలైహిస్సలాం తనకు ఆదేశించిన దాన్ని ఉల్లంఘించాడు. ثم أدبر يسعى

ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ ﴿٢٢﴾

ఆ తరువాత అతడు అల్లా హ్ పట్ల అవిధేయత చూపటంలో కృషి చేస్తూ మరియు సత్యము పట్ల విముఖత చూపుతూ మూసా అలైహిస్సలాం తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసం చూపటం నుండి విముఖత చూపాడు. فحشر فناد

فَحَشَرَ فَنَادَىٰ ﴿٢٣﴾

అప్పుడు అతడు తన జాతివారిని మరియు తన అనుచరులను మూసా అలైహిస్సలాం పై ఆధిపత్యం చెలాయించటం కొరకు సమీకరించాడు. అప్పుడు ఇలా పలుకుతూ ప్రకటించాడు

فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ ﴿٢٤﴾

నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును. కాబట్టి మీపై నాకు తప్ప ఇతరులకు విధేయత చూపే బాధ్యత లేదు

فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْـَٔاخِرَةِ وَٱلْأُولَىٰٓ ﴿٢٥﴾

అల్లాహ్ అతడిని పట్టుకుని ఇహలోకంలో అతడిని సముద్రంలో ముంచి శిక్షించాడు మరియు అతడిని పరలోకంలో తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజేసి శిక్షించాడు

إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةًۭ لِّمَن يَخْشَىٰٓ ﴿٢٦﴾

నిశ్ఛయంగా మేము ఫిర్ఔన్ ను ఇహలోకంలో మరియు పరలోకంలో శిక్షించిన దానిలో అల్లా హ్ తో భయపడే వారి కొరకు హితబోధన కలదు. అతడే హితబోధనల ద్వారా ప్రయోజనం చెందుతాడు

ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ ۚ بَنَىٰهَا ﴿٢٧﴾

ఓ తిరస్కారులారా మరల లేపి మిమ్మల్ని ఉనికిలోకి తీసుకుని రావటం అల్లా హ్ పై కష్టమా లేదా ఆయన తయారు చేసిన ఆకాశమును ఉనికిలోకి తీసుకు రావటం (కష్టమా) ?! رفع سمكها فسوىها

رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا ﴿٢٨﴾

ఆయన దాని కప్పును పైకి చాలా ఎత్తుగా లేపాడు. దాన్ని సమాంతరంగా క్రమపరిచాడు. అందులో ఎటువంటి పగులు గాని బీట గాని ఎటువంటి లోపముగాని లేదు. وأغطش ليلها وأخرج ضحىها

وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا ﴿٢٩﴾

మరియు దాని సూర్యుడు అస్తమించినప్పుడు దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు అది ఉదయించినప్పుడు దాని వెలుగును బహిర్గతం చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ ﴿٣٠﴾

ఆకాశమును సృష్టించిన తరువాత భూమిని విస్తరింపజేశాడు. అందులో దాని ప్రయోజనాలను నిక్షిప్తం చేశాడు

أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا ﴿٣١﴾

దాని నుండి దాని నీటిని ప్రవహించే సెలయేరుల రూపంలో వెలికి తీశాడు. మరియు పశువులు మేసే మొక్కలను అందులో మొలకెత్తించాడు

وَٱلْجِبَالَ أَرْسَىٰهَا ﴿٣٢﴾

మరియు పర్వతములను భూమిపై స్థిరంగా నాటాడు. متعا ل كم ولأنعمكم

مَتَـٰعًۭا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ ﴿٣٣﴾

ఓ ప్రజలారా ఇవన్ని మీకు మరియు మీ పశువులకు ప్రయోజనములు. వీటన్నింటిని సృష్టించినవాడు వారిని సరి క్రొత్త రూపంలో మరలించటం నుండి అశక్తు డు కాడు

فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ ﴿٣٤﴾

తన భయానక పరిస్థితులతో ప్రతీ వస్తు వును కప్పివేసే రెండవ బాకా వచ్చినప్పుడు. మరియు ప్రళయం వస్తుంది

يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ مَا سَعَىٰ ﴿٣٥﴾

అది వచ్చిన రోజు మనిషి తాను చేసిన దాన్ని గుర్తు చేసుకుంటాడు అది మంచి అయినా గాని చెడు అయినా గాని

وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ ﴿٣٦﴾

మరియు నరకం తీసుకు రాబడుతుంది. దాన్ని చూసే వారి కొరకు ప్రత్యక్షంగా బహిర్గతం చేయబడుతుంది. فأما من طغى

فَأَمَّا مَن طَغَىٰ ﴿٣٧﴾

ఇక అపమార్గంలో ఎవరైతే హద్దు నుఅతిక్రమిస్తా డో

وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا ﴿٣٨﴾

మరియు నిత్యం ఉండే పరలోక జీవితంపై అంతమైపోయే ఇహలోక జీవితమును ప్రా ధాన్యతనిచ్చాడో

فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ ﴿٣٩﴾

నిశ్చయంగా నరకాగ్ని అతను శరణు తీసుకునే అతని నివాస స్థలమవును. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ ﴿٤٠﴾

فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ ﴿٤١﴾

మరియు ఎవరైతే తన ప్రభువు ముందట తాను నిలబడటం నుండి భయపడి అల్లా హ్ నిషేదించిన వాటిలో నుండి తన మనోవాంఛలను అనుసరించటం నుండి తన మనసును ఆపుకున్నాడో అతను శరణు తీసుకునే అతని నివాస స్థలం స్వర్గము

يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا ﴿٤٢﴾

ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటంను తిరస్కరించే వీరందరు ప్రళయం ఎప్పుడు వాటిల్లు తుందని మిమ్మల్ని అడుగుతున్నారు

فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ ﴿٤٣﴾

దాని గురించి మీకు ఎటువంటి జ్ఞానం లేదు చివరికి మీరు దాన్ని వారికి తెలియపరచటానికి. మరియు అది మీ విషయం కాదు. మీ విషయం మాత్రం మీరు దాని కొరకు సిద్ధం కావటం

إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ ﴿٤٤﴾

నీ ప్రభువు ఒక్కడి వద్దే ప్రళయం యొక్క జ్ఞా నం ముగింపు ఉన్నది

إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا ﴿٤٥﴾

నువ్వు మాత్రం ప్రళయం నుండి భయపడే వారికి హెచ్చరించే వాడివి. ఎందుకంటే నీ హెచ్చరికతో ప్రయోజనం చెందేవాడు అతడే

كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا ﴿٤٦﴾

ఏ రోజైతే వారు ప్రళయమును కళ్లారా చూస్తా రో వారు తమ ఇహలోక జీవితంలో ఒక రోజు సాయంత్రం వేళను లేదా దాని ఉదయం వేళను గడిపినట్లు ఉంటారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · An-Naazi'aat — النازعات

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు