ముఖపేజీతఫ్సీర్An-Naba (78)

తఫ్సీర్ An-Naba (78) — النبأ

మక్కీ · 40 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

عَمَّ يَتَسَآءَلُونَ ﴿١﴾

ఈ ముష్రికులందరు తమ వైపు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత ఏ నిషయం గురించి పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు ?!

عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ ﴿٢﴾

వారు గొప్ప వార్తను గురించి ఒకరినొకరు అడుగుతున్నారు. మరియు అది మరణాంతరం లేపబడటం వార్తకు సంబంధించి వారి ప్రవక్త పై అవతరింపబడిన ఈ ఖుర్ఆను

ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ ﴿٣﴾

ఈ ఖుర్ఆన్ అదే దేని గురించైతే వారు మంత్రజాలమవటం లేదా కవిత్వమవటం లేదా జ్యోతిష్యమవటం లేదా పూర్వికుల కట్టు కధలవటం గురించి వారు తెలుపుతున్న విషయంలో విబేధించుకున్నారు. كلا سيعلمون

كَلَّا سَيَعْلَمُونَ ﴿٤﴾

వారు భావించినట్లు విషయం కాదు. ఖుర్ఆన్ ను తిరస్కరించే వీరందరు తమ తిరస్కారము యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు. ثم كلا سيعلمون

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ ﴿٥﴾

ఆ పిదప వారికి దాని గురించి తాకీదు చేయబడింది

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَـٰدًۭا ﴿٦﴾

ఏమీ మేము భూమిని వారు దానిపై స్థిరంగా ఉండటానికి పాన్పుగా చేయలేదా ?!

وَٱلْجِبَالَ أَوْتَادًۭا ﴿٧﴾

మరియు మేము పర్వతాలను దానిపై అది ప్రకంపించకుండా ఉండటానికి మేకుల స్థా నంలో ఉంచాము. وخلقنكم أ زوجا

وَخَلَقْنَـٰكُمْ أَزْوَٰجًۭا ﴿٨﴾

మరియు మేము ఓ ప్రజలారా మిమ్మల్ని రకరకాలుగా సృష్టించాము: మీలో పురుషులు మరియు స్త్రీలు ఉన్నారు. وجعلنا نومكم سباتا

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًۭا ﴿٩﴾

మరియు మీరు విశ్రాంతి తీసుకోవటానికి మేము మీ నిద్రను కర్యకలాపముల నుండి విరామంగా చేశాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًۭا ﴿١٠﴾

మరియు మీరు మీ మర్మావయవాలను కప్పుకునే దుస్తు ల మాదిరిగా రాత్రిని తన చీకటి ద్వారా మీకు ఆచ్ఛాదనగా చేశాము

وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًۭا ﴿١١﴾

మరియు మేము పగలును సంపాదన కోసం మరియు జీవనోపాది శోధన కోసం మైదానముగా చేశాము. وبنينا فوقكم سبعا شدادا

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًۭا شِدَادًۭا ﴿١٢﴾

మరియు మేము మీపై దృఢ నిర్మితమైన మరియు పటిష్ట నిర్మితమైన సప్తా కాశములను నిర్మించాము. وجعلنا سراجا وهاجا

وَجَعَلْنَا سِرَاجًۭا وَهَّاجًۭا ﴿١٣﴾

మరియు మేము సూర్యుడిని తీవ్రంగా వెలిగే మరియు ప్రకాశించే దీపముగా చేశాము

وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءًۭ ثَجَّاجًۭا ﴿١٤﴾

మరియు మేము కురవటానికి వేళ అయిన మేఘముల నుండి ఎక్కువగాب ఉప్పొంగే నీటిని కురిపించాము. لنخرج به ح اونباتا

لِّنُخْرِجَ بِهِۦ حَبًّۭا وَنَبَاتًۭا ﴿١٥﴾

దాని ద్వారా మేము రకరకాల ఆహార ధాన్యాలను మరియు రకరకాల మొక్కలను వెలికితీయటానికి. وجنت ألفافا

وَجَنَّـٰتٍ أَلْفَافًا ﴿١٦﴾

మరియు మేము దాని ద్వారా కొమ్మలు అధికంగా ఒక దానిలో ఒకటి చొచ్చబడిన చెట్ల వలన చుట్టబడిన తోటలను వెలికితీశాము

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَـٰتًۭا ﴿١٧﴾

నిశ్చయంగా సృష్టి రాశుల మధ్య తీర్పుదినము ఒక వేళతో నిర్ధా రితమై నిర్ణీతమై ఉంది. దానికి విరుద్ధంగా జరగదు

يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًۭا ﴿١٨﴾

దైవ దూత బాకాలో రెండవ సారి ఊదిన రోజు ఓ ప్రజలారా మీరు సమూహాలు సమూహాలుగా వస్తా రు

وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًۭا ﴿١٩﴾

మరియు ఆకాశము తెరవబడుతుంది అప్పుడు దాని కొరకు తెరవబడిన తలుపుల వలే ద్వారములు అయిపోతాయి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا ﴿٢٠﴾

మరియు పర్వతాలు నడిపించబడుతాయి చివరికి అవి వ్యాపించబడ్డ దూళిగా మారిపోతాయి. అప్పుడు అవి ఎండమావుల వలె అయిపోతాయి. إ ن جهن م كانت مرصادا

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًۭا ﴿٢١﴾

నిశ్ఛయంగా నరకముమాటువేసి వేచి ఉంది. للط غين مٔابا

لِّلطَّـٰغِينَ مَـَٔابًۭا ﴿٢٢﴾

దుర్మార్గు ల కొరకు అది ఒక మరలే చోటు. వారు దాని వైపునకు మరలి వెళతారు

لَّـٰبِثِينَ فِيهَآ أَحْقَابًۭا ﴿٢٣﴾

వారు అందులో అంతం లేని యుగాలు కాలాల వరకు ఉంటారు. لا يذوقون فيها بردا ولا شرابا

لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًۭا وَلَا شَرَابًا ﴿٢٤﴾

వారు అందులో తమ నుండి నరకాగ్ని వేడిని చల్లబరిచే ఎటువంటి చల్ల గాలి రుచి చూడరు. మరియు వారు అందులో ఆస్వాదించటానికి ఎటువంటి పాణియంను చవిచూడరు. إلا حميما وغس اقا

إِلَّا حَمِيمًۭا وَغَسَّاقًۭا ﴿٢٥﴾

మరియు వారు తీవ్రమైన వేడి నీటిని మరియు నరక వాసుల నుండి ప్రవహించే చీముని మాత్రమే చవిచూస్తా రు

جَزَآءًۭ وِفَاقًا ﴿٢٦﴾

వారు ఉన్న అవిశ్వాసము మరియు అపమార్గమునకు తగిన విధంగా ప్రతిఫలం. إن هم كانوالا يرجون حسابا

إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًۭا ﴿٢٧﴾

నిశ్చయంగా వారు ఇహలోకంలో అల్లాహ్ వారిని పరలోకంలో లెక్క తీసుకోవటం నుండి భయపడేవారు కాదు. ఎందుకంటే వారు మరణాంతరం లేపబడటమును విశ్వసించేవారు కాదు. ఒక వేళ వారు మరణాంతరం లేపబడటం నుండి భయపడి ఉంటే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసి ఉండేవారు. وكذ بوا بٔايتنا كذابا

وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا كِذَّابًۭا ﴿٢٨﴾

మరియు వారు మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించేవారు. وكل شىء أح ص ينهكتبا

وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَـٰهُ كِتَـٰبًۭا ﴿٢٩﴾

మరియు వారి కర్మల్లోంచి ప్రతీ దాన్ని మేము నమోదుచేసి ఉంచాము మరియు లెక్కవేసి ఉంచాము. మరియు అది వారి కర్మల పత్రాలలో వ్రాయబడి ఉంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فذوقوا فلن نزيدكم إلا عذابا

فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا ﴿٣٠﴾

ఓ మితిమీరే వారా మీరు ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి. మేము మీ శిక్షపై శిక్షను మాత్రమే మీపై అధికం చేస్తా ము. إن للمتقين مفازا

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا ﴿٣١﴾

నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడే వారి కొరకు సాఫల్య స్థలం కలదు వారు అందులో తాము ఆశించిన దానితో సాఫల్యం చెందుతారు. అది స్వర్గము

حَدَآئِقَ وَأَعْنَـٰبًۭا ﴿٣٢﴾

ఉధ్యానవనాలు మరియు ద్రా క్షఫలాలు కలవు. وكواعب أ ترابا

وَكَوَاعِبَ أَتْرَابًۭا ﴿٣٣﴾

పొంగే పరువాలు కల సమవయస్కులైన స్త్రీలు ఉంటారు. وكأ سا دهاقا

وَكَأْسًۭا دِهَاقًۭا ﴿٣٤﴾

మద్యముతో నిండిన పాత్ర. لا يسمعون فيها لغوا ولا كذبا

لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا كِذَّٰبًۭا ﴿٣٥﴾

వారు స్వర్గంలో అసత్య మాటలు వినరు మరియు వారు అబద్దమును వినరు. మరియు వారు ఒకరితో ఒకరు అబద్దము మాట్లా డుకోరు

جَزَآءًۭ مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًۭا ﴿٣٦﴾

ఇదంతా అల్లా హ్ తన వద్ద నుండి వారికి ప్రసాదించిన తగినంత అనుగ్రహము మరియు ప్రసాదము

رَّبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَـٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًۭا ﴿٣٧﴾

ఆకాశముల మరియు భూమి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటి ప్రభువు. ఇహలోక,పరలోక కరుణామయుడు. భూమిలో గాని అకాశములో గాని ఉన్నవాటన్నింటికి ఆయన వారికి అనుమతిస్తే తప్ప ఆయనతోమాట్లా డలేరు. ف

يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَـٰٓئِكَةُ صَفًّۭا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَـٰنُ وَقَالَ صَوَابًۭا ﴿٣٨﴾

ఏ రోజునైతే జిబ్రయీలు మరియు దైవదూతలు పంక్తుల్లో నిలబడుతారో కరుణామయుడు అనుమతిస్తే తప్ప ఎవరి కొరకు సిఫారసు గురించి వారు మాట్లా డరు. మరియు వారు తౌహీద్ వాక్కు లాంటి సరైన మాటనే మాట్లా డుతారు

ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ ۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا ﴿٣٩﴾

మీకు వర్ణించబడినది అది ఆ రోజు దాని వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎవరైతే అల్లా హ్ శిక్ష నుండి ముక్తి పొందదలచాడో అతడు తన ప్రభువు ఇష్టపడే సత్కర్మలతో దాని వైపునకు మార్గమును తయారు చేసుకోవాలి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّآ أَنذَرْنَـٰكُمْ عَذَابًۭا قَرِيبًۭا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَـٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا ﴿٤٠﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా మేము దగ్గరలోనే కలిగే శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టా ము. ఆ రోజు మనిషి ఇహలోకంలో ముందస్తు పంపించుకున్న తన కర్మను చూసుకుంటాడు. మరియు అవిశ్వాసి శిక్ష నుండి ముక్తిని ఆశిస్తూ ఇలా పలుకుతాడు: అయ్యో ఆ పశువుల మాదిరిగా వేటినైతే ప్రళయదినమున మీరు మట్టి అయిపోండి అని పలకబడినదో నేను కూడా మట్టినైపోతే బాగుండును. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · An-Naba — النبأ

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు