ముఖపేజీతఫ్సీర్Al-Mursalaat (77)

తఫ్సీర్ Al-Mursalaat (77) — المرسلات

మక్కీ · 50 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلْمُرْسَلَـٰتِ عُرْفًۭا ﴿١﴾

అంతులేని పర్షియన్ సైనిక పంక్తు ల వలే, ఒకదాని తర్వాత ఒకటి నిరంతరంగా, వేగంగా వీస్తు న్నపెనుగాలులపై అల్లా హ్ ప్రమాణం చేశాడు

فَٱلْعَـٰصِفَـٰتِ عَصْفًۭا ﴿٢﴾

తీవ్రంగా వీచే పెనుగాలులపై ప్రమాణం చేశాడు

وَٱلنَّـٰشِرَٰتِ نَشْرًۭا ﴿٣﴾

వర్షమును వ్యాపింపజేసే పెనుగాలులపై ప్రమాణం చేశాడు

فَٱلْفَـٰرِقَـٰتِ فَرْقًۭا ﴿٤﴾

సత్యం మరియు అసత్యాలను వేరు పరిచేందుకు క్రిందికి దిగి వచ్చే దైవదూతలపై ప్రమాణం చేశాడు

فَٱلْمُلْقِيَـٰتِ ذِكْرًا ﴿٥﴾

మరియ దైవ వాణిని తీసుకుని దిగే దైవదూతలపై ప్రమాణం చేశాడు. عذرا أو نذرا

عُذْرًا أَوْ نُذْرًا ﴿٦﴾

వారు దైవ వాణిని తీసుకుని దిగుతారు అల్లాహ్ వద్ద నుండి ప్రజలకు సాకులు లేకుండా చేయటానికి మరియు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించటానికి. إنما توعدون لوقع

إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌۭ ﴿٧﴾

నిశ్చయంగా మీకు వాగ్దా నం చేయబడిన మరణాంతరం లేపబడటం మరియు లెక్క తీసుకోబడటం మరియు ప్రతిఫలం ప్రసాదించటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది

فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ ﴿٨﴾

నక్షత్రములు వాటి కాంతి తుడిచి వేయబడి వాటి వెలుగు వెళ్ళిపోయినప్పుడు

وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ ﴿٩﴾

మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి చీలిపోయినప్పుడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ ﴿١٠﴾

మరియు పర్వతాలు తమ స్థా నం నుండి పెకిలించవేయబడి తునాతునకలుగా చేయబడి చివరికి దూళిగా అయిపోయినప్పుడు

وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ ﴿١١﴾

మరియు దైవ ప్రవక్తలు ఒక నిర్ణీత కాలం కొరకు సమావేశపరచబడినప్పుడు. لأى يوم أجلت

لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ ﴿١٢﴾

ఒక గొప్ప దినం కొరకు వారిని వారి జాతులపై సాక్ష్యం పలకటం కొరకు వాయిదా వేయబడ్డా రు

لِيَوْمِ ٱلْفَصْلِ ﴿١٣﴾

దాసుల మధ్య తీర్పునిచ్చే దినం కోసం. అప్పుడు సత్యపరుడు అసత్యపరుడి నుండి మరియు పుణ్యాత్ముడు పాపాత్ముడి నుండి స్పష్టమవుతాడు

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ ﴿١٤﴾

ఓ ప్రవక్తా తీర్పు దినం ఏమిటో మీకు ఏది తెలిపినది ? ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿١٥﴾

ఆ దినమున అల్లా హ్ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించే తిరస్కారుల కొరకు వినాశనము,యాతన,నష్టము కలుగును

أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ ﴿١٦﴾

ఏమీ మేము పూర్వ సమాజములను వారు అల్లా హ్ ను తిరస్కరించినప్పుడు మరియు తమ ప్రవక్తలను తిరస్కరించినప్పుడు నాశనం చేయలేదా ?!

ثُمَّ نُتْبِعُهُمُ ٱلْـَٔاخِرِينَ ﴿١٧﴾

ఆ తరువాత మేము వెనుకటి తరాల వారిలో నుంచి తిరస్కారులను వారి వెనుక తీసుకుని వచ్చి వారిని వినాశనమునకు గురి చేసినట్లే వారిని వినాశనమునకు గురి చేస్తా ము

كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ ﴿١٨﴾

ఆ సమాజములను నాశనం చేసినట్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే ఆపరాదులను మేము నాశనం చేస్తా ము. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿١٩﴾

ఆ దినమున అపరాదులకు శిక్ష గురించి అల్లా హ్ హెచ్చరికను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍۢ مَّهِينٍۢ ﴿٢٠﴾

ఓ ప్రజలారా ఏమీ మేము మిమ్మల్ని హేయమైన అల్పమైన నీటితో సృష్టించలేదా. అది వీర్య బిందువు. فجعلنهفى قرار مكين

فَجَعَلْنَـٰهُ فِى قَرَارٍۢ مَّكِينٍ ﴿٢١﴾

అయితే మేము ఆ హీనమైన నీటిని ఒక భద్రమైన స్థా నంలో ఉంచాము. అది స్త్రీ గర్భాశయం. إلى قدر م علوم

إِلَىٰ قَدَرٍۢ مَّعْلُومٍۢ ﴿٢٢﴾

ఒక నిర్ణీత కాలం వరకు అది గర్భం యొక్క కాలం

فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَـٰدِرُونَ ﴿٢٣﴾

మేము జన్మించే పిల్లవాడి గుణమును,అతని సామర్ధ్యమును,అతని రంగు,ఇతరవాటిని నిర్ణయించాము. మేమే ఈ పూర్తి ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేవారము. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٢٤﴾

ఆ దినమున అల్లా హ్ సామర్ధ్యమును తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا ﴿٢٥﴾

ఏమీ మేము భూమిని ప్రజలందరిని సమీకరించేదిగా చేయలేదా

أَحْيَآءًۭ وَأَمْوَٰتًۭا ﴿٢٦﴾

అది వారిలో నుంచి జీవించి ఉన్న వారిని తన పై నివాసమును కల్పించి మరియు వారిలో నుంచి మరణించిన వారిని తనలో ఖననం చేయటం ద్వారా సమీకరిస్తుంది

وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَـٰمِخَـٰتٍۢ وَأَسْقَيْنَـٰكُم مَّآءًۭ فُرَاتًۭا ﴿٢٧﴾

మరియు మేము అందులో స్థిరమైన ఎత్తైన పర్వతాలను చేశాము అవి దాన్ని ప్రకంపించటం నుండి ఆపుతాయి. మరియు ఓ ప్రజలారా మేము మీకు తియ్యటి నీటిని త్రా పించాము. కాబట్టి ఎవరైతే దాన్ని సృష్టించాడో మిమ్మల్ని మరల లేపటం నుండి అశక్తు డు కాడు. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٢٨﴾

ఆ దినమున తమపై ఉన్న అల్లా హ్ అనుగ్రహములను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ﴿٢٩﴾

మరియు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారితో ఇలా పలకబడును: ఓ తిరస్కరించేవారా మీరు తిరస్కరించిన శిక్ష వైపుకు మీరు నడవండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّۢ ذِى ثَلَـٰثِ شُعَبٍۢ ﴿٣٠﴾

మీరు మూడు శాఖలుగా చీలిపోయిన నరకాగ్ని పొగ నీడ వైపుకు నడవండి

لَّا ظَلِيلٍۢ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ ﴿٣١﴾

అందులో నీడ చల్లదనం ఉండదు. మరియు అది నరకాగ్ని జ్వాలలను,దాని వేడిని మీ వైపునకు ప్రజ్వలించటం నుండి ఆపదు

إِنَّهَا تَرْمِى بِشَرَرٍۢ كَٱلْقَصْرِ ﴿٣٢﴾

నిశ్ఛయంగా నరకాగ్ని నిప్పు రవ్వలను విసురుతుంది. ప్రతీ నిప్పు రవ్వ తన పెద్దదవటంలో మేడలా ఉంటుంది. كأنه جملت صفر

كَأَنَّهُۥ جِمَـٰلَتٌۭ صُفْرٌۭ ﴿٣٣﴾

విసరబడే నిప్పు రవ్వలు తమ నల్లదనంలో మరియు తమ పెద్ద పరిమాణంలో నల్లని ఒంటెలవలె ఉంటాయి. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٣٤﴾

ఆ దినమున అల్లా హ్ శిక్షను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును. هذا يوملا ينطقون

هَـٰذَا يَوْمُ لَا يَنطِقُونَ ﴿٣٥﴾

ఈ రోజు వారు దేని గురించీ మాట్లా డరు. ولا يؤذن لهم فيعتذرون

وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ ﴿٣٦﴾

వారికి తమ ప్రభువు వద్ద తమ అవిశ్వాసం,తమ పాపముల గురించి సాకులు చెప్పుకోవటానికి అనుమతించబడదు. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٣٧﴾

ఆ దినమున ఈ దినపు సమాచారములను తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును

هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ۖ جَمَعْنَـٰكُمْ وَٱلْأَوَّلِينَ ﴿٣٨﴾

ఇది సృష్టితాల మధ్య తీర్పు దినం. మేము మిమ్మల్ని మరియు పూర్వ సమాజములను ఒకే మట్టిలో సమీకరించాము. فإن كان لكم كيد فكيدون

فَإِن كَانَ لَكُمْ كَيْدٌۭ فَكِيدُونِ ﴿٣٩﴾

ఒక వేళ మీ కొరకు అల్లా హ్ శిక్ష నుండి విముక్తి కొరకు ఏదైన పన్నాగం ఉంటే నాపై పన్నాగం పన్నండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٤٠﴾

ఆ దినమున తీర్పు దినమును తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును

إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَـٰلٍۢ وَعُيُونٍۢ ﴿٤١﴾

నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు విశాలమైన స్వర్గము యొక్క వృక్షాల నీడలలో మరియు తీయటి ప్రవహించే నీటి సెలయేరులలో ఉంటారు. وفوكه مما يشتهون

وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ ﴿٤٢﴾

మరియు వారు తినటానికి కోరుకునే ఫలాల మధ్య ఉంటారు

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٤٣﴾

మరియు వారితో ఇలా పలకబడును: మీరు పరిశుద్ధమైన వాటిలో నుంచి తినండి మరియు మీరు ఎటువంటి కలతీ లేని పానియమును హాయిగా త్రా గండి. మీరు ఇహ లోకంలో చేసుకున్న సత్కర్మలకు బదులుగా

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿٤٤﴾

‎నిశ్ఛయంగా మేము మీకు ప్రతిఫలం ప్రసాదించినట్లే సజ్జనులకు వారి కర్మల ప్రతిఫలమును ప్రసాదిస్తా ము. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٤٥﴾

ఆ దినమున అల్లా హ్ దైవభీతిపరులకు సిద్దం చేసి ఉంచిన వాటిని తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును. كلوا وتمتعوا قليلا إنكم م جرمون

كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ ﴿٤٦﴾

మరియు సత్యతిరస్కారులతో ఈ విధంగా పలకబడును: మీరు తినండి మరియు ప్రాపంచిక రుచులతో కొంత కాలం ఇహలోకంలో లబ్ది పొందండి. నిశ్చయంగా మీరు అల్లా హ్ పట్ల మీ అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్తలను మీరు తిరస్కరించటం వలన అపరాదులయ్యారు. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٤٧﴾

ఆ దినమున ప్రతిఫలం దినమున తమకు ప్రసాదించబడే వాటిని తిరస్కరించే వారి కొరకు వినాశనం,యాతన,నష్టము కలుగును

وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ ﴿٤٨﴾

ఈ తిరస్కారులందరితో మీరు అల్లా హ్ కొరకు నమాజును చదవండి అంటే వారు ఆయన కొరకు నమాజు చదివేవారు కాదు. ويل يومئذ للمكذبين

وَيْلٌۭ يَوْمَئِذٍۢ لِّلْمُكَذِّبِينَ ﴿٤٩﴾

ఆ దినమున అల్లా హ్ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించే తిరస్కారుల కొరకు వినాశనము,యాతన,నష్టము కలుగును. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فبأى حديث بعده يؤمنون

فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ ﴿٥٠﴾

తమ ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను విశ్వసించనప్పుడు వారు ఇతర ఏ సందేశాన్ని విశ్వసిస్తా రు ?! మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Mursalaat — المرسلات

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు