ముఖపేజీతఫ్సీర్Ash-Shu'araa (26)

తఫ్సీర్ Ash-Shu'araa (26) — الشعراء

మక్కీ · 227 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

طسٓمٓ ﴿١﴾

تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ ﴿٢﴾

ఇవి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు. لعلك بخع نفسك ألا يكونوامؤمنين

لَعَلَّكَ بَـٰخِعٌۭ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ ﴿٣﴾

ఓ ప్రవక్తా బహుశా మీరు వారు సన్మార్గము పొందాలనే మీ ఆశ వలన వారి సన్మార్గము పొందటంపై బాధతో ఆశతో మీ ప్రా ణములను కోల్పోతారేమో

إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةًۭ فَظَلَّتْ أَعْنَـٰقُهُمْ لَهَا خَـٰضِعِينَ ﴿٤﴾

ఒక వేళ మేము ఆకాశము నుండి వారిపై ఏదైన నిదర్శనమును అవతరించదలిస్తే వారిపై దాన్ని అవతరింపజేసే వారము. అప్పుడు వారి మెడలు దాని కొరకు వంగిపోయి లొంగిపోతాయి. కానీ వారి పరీక్ష కొరకు మేము అలా తలచుకోలేదు. ఏమీ వారు అగోచర విషయాలను విశ్వసిస్తా రా ?

وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍۢ مِّنَ ٱلرَّحْمَـٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ ﴿٥﴾

ఈ ముష్రికుల వద్దకు కరుణామయుడి వద్ద నుండి ఏదైన నూతన హితోపదేశం ఆయన ఏకత్వమును,ఆయన ప్రవక్త నిజాయితీని సూచించే వాదనలతో అవతరించి వచ్చినా వారు దాన్ని వినటం నుండి,దాన్ని నమ్మటం నుండి విముఖత చూపకుండా ఉండలేదు

فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَـٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿٦﴾

నిశ్ఛయంగా వారు తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించారు. తొందరలోనే వారు దేని గురించైతే హేళన చేసేవారో వాటి వార్తల నిరూపణ వారి వద్దకు వస్తుంది. మరియు వారిపై శిక్ష వాటిల్లు తుంది

أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۢ كَرِيمٍ ﴿٧﴾

ఏ వారు భూమిలో మేము మంచి దృశ్యం కల చాలా ప్రయోజనాలు కల రకరకాల మొక్కల్లోంచి ప్రతి రకములో నుండి ఎన్ని మొలకెత్తించామో వాటిని చూడకుండా వీరందరు తమ అవిశ్వాసంపై మొండిగా ఉండిపోయారా ?!

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿٨﴾

నిశ్ఛయంగా వేరు వేరు రకాల మొక్కలతో భూమిని మొలకెత్తించటంలో వాటిని మొలకెత్తించిన వాడి సామర్ధ్యం మృతులను జీవింపజేయటంలో ఉన్నదనటానికి స్పష్టమైన ఆధారం కలదు. వారిలో చాలా మంది విశ్వసించటం లేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿٩﴾

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తనపై ఎవరూ ఆధిక్యతను కనబరచని ఆధిక్యుడు. తన దాసులపై కరుణిెంచేవాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿١٠﴾

ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు మూసాను అల్లా హ్ పై తమ అవిశ్వాసం వలన,మూసా జాతి వారిని బానిసలుగా చేసుకోవటం వలన హింసకు పాల్పడిన జాతి వారివద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ పిలిచినప్పటి వైనమును గుర్తు చేసుకోండి

قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ ﴿١١﴾

వారు ఫిర్ఔన్ జాతి వారు. అప్పుడు ఆయన వారికి అల్లా హ్ ఆదేశములను పాటించటం ద్వారా,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లా హ్ భయభీతి కలిగి ఉండాలని సున్నితంగా,మృధువుగా ఆదేశిస్తా డు

قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ ﴿١٢﴾

మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు: నిశ్ఛయంగా నీ వద్ద నుండి నేను వారికి చేరవేసిన వాటి విషయంలో వారు నన్ను తిరస్కరిస్తా రని నేను భయపడుతున్నాను. ويضيق صدرى ولا ينطلق لسانى فأرسل إلىهرون

وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَـٰرُونَ ﴿١٣﴾

వారు నన్ను తిరస్కరించటం వలన నా హృదయం కుంచించుకుపోతుంది (ఇబ్బందికి గురి అవుతుంది). నా నాలుక మాట్లా డటం నుండి ఆగిపోతుంది. అయితే నీవు జిబ్రయీల్ అలైహిస్సలాంను నా సోదరుడు హారూన్ వద్దకు అతడు నాకు సహాయకుడిగా అవటానికి పంపించు. ولهم على ذنب فأخاف أن يقتلون

وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌۭ فَأَخَافُ أَن يَقْتُلُونِ ﴿١٤﴾

మరియు వారి వద్ద నేను ఖిబ్తీను హత్య చేయటం వలన నాపై ఒక నేరం ఉన్నది. అయితే వారు నన్ను హతమారుస్తా రని నేను భయపడుతున్నాను

قَالَ كَلَّا ۖ فَٱذْهَبَا بِـَٔايَـٰتِنَآ ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ ﴿١٥﴾

అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు: అలా జరగదు. వారు నిన్ను హతమార్చరు. అయితే నీవు మరియు నీ సోధరుడు హారూన్ మీ నిజీయితీని దృవీకరించే మా సూచనలను తీసుకుని వెళ్ళండి. నిశ్ఛయంగా మేము మీరు ఏమి పలుకుతారో వాటికి,వారు మీకు ఏమి పలుకుతారో వాటికి సహాయము ద్వారా మద్దతు ద్వారా మేము మీకు తోడుగా ఉంటాము. వాటి లో నుండి ఏది మా నుండి తప్పిపోదు

فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٦﴾

అయితే మీరిద్దరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళి అతనితో ఇలా పలకండి: నిశ్ఛయంగా మేము సమస్త సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి నీ వద్దకు ప్రవక్తలుగా పంపించబడ్డా ము

أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ ﴿١٧﴾

కావున నీవు ఇస్రా యీలు సంతతి వారిని మాతోపాటు పంపించు. قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمركسنين

قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًۭا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ ﴿١٨﴾

మూసా అలైహిస్సలాంతో పిర్ఔన్ ఇలా సమాధానమిచ్చాడు: ఏమీ మేము నిన్ను బాల్యంలో మా వద్ద పోషించలేదా, నీవు మా మధ్యలో నీ వయస్సులోని చాలా సంవత్సరాలు ఉండిపోయావు. అయితే దైవ దౌత్యం యొక్క వాదన వైపునకు నిన్ను ఏది పిలుస్తుంది ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَـٰفِرِينَ ﴿١٩﴾

మరియు నీ జాతి వారిలో నుండి ఒక వ్యక్తికి సహాయం చేయటానికి ఖిబ్తీని హతమార్చినప్పుడు నీవు గొప్ప ఘనకార్యం చేశావు. మరియు నీవు నీపై ఉన్న నా అనుగ్రహాలను తిరస్కరించే వారిలో నుంచి అయిపోయావు

قَالَ فَعَلْتُهَآ إِذًۭا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ ﴿٢٠﴾

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో అంగీకరిస్తూ ఇలా పలికారు: నేను ఆ మనిషిని నా వద్దకు దైవ వాణి రాక ముందు అజ్ఞా నుల్లోంచి ఉన్నప్పుడు హత్య చేశాను

فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًۭا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ ﴿٢١﴾

అతన్ని హత్య చేసిన తరువాత మీరు నన్ను అతనికి బదులుగా నన్ను హతమారుస్తా రని నేను భయపడినప్పుడు మద్యన్ బస్తీ వైపునకు మీ నుండి పారిపోయాను. అప్పుడు నా ప్రభువు నాకు జ్ఞానమును ప్రసాదించాడు. మరియు ఆయన నన్ను తాను ప్రజల వైపునకు ప్రవక్తలుగా పంపించే తన ప్రవక్తల్లోంచి చేశాడు

وَتِلْكَ نِعْمَةٌۭ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ ﴿٢٢﴾

మరియు నీవు నన్ను బానిసగా చేయకుండా ఇస్రాయీలు సంతతి వారిని బనిసలుగా చేసి నన్ను నీవు పోషించటాన్ని నిజంగా నాపై చేసిన ఉపకారంగా ఎత్తిపొడుస్తు న్నావు

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَـٰلَمِينَ ﴿٢٣﴾

ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను ఇలా అడిగాడు: ఆయన దూతగా నీవు చెప్పుకున్న సృష్టితాల ప్రభువు ఎవడు ?

قَالَ رَبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ ﴿٢٤﴾

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు సమాధానమిస్తూ ఇలా పలికారు: సృష్టితాల ప్రభువు,ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్న వాటి యొక్క ప్రభువు ఒక వేళ ఆయన వారి ప్రభువు అని మీరు నమ్మే వారైతే మీరు అతనొక్కడినే ఆరాధించండి. قال لمن حوله ألا تستمعون

قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ ﴿٢٥﴾

ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు: మీరు మూసా సమాధానమును,అందులో ఉన్న అబద్దపు వాదనను వినటంలేదా ?!

قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ ﴿٢٦﴾

మూసా అలైహిస్సలాం వారితో ఇలా పలికారు: అల్లా హ్ మీ ప్రభువు,మీ పూర్వ తాతముత్తా తల ప్రభువు

قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌۭ ﴿٢٧﴾

ఫిర్ఔన్ ఇలా పలికాడు: నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డా డని వాదించే ఇతను ఎలా సమాధానం ఇవ్వాలో తెలియని పిచ్చివాడు. తనకు అర్ధం కాని వాటిని చెబుతున్నాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ ﴿٢٨﴾

మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు: నేను మిమ్మల్ని పిలిచే అల్లాహ్ తూర్పునకు ప్రభువు,పడమరనకు ప్రభువు మరియు ఆ రెండింటికి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీకు వాటిని అర్ధం చేసుకునే బుద్దు లు ఉంటే

قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَـٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ ﴿٢٩﴾

ఫిర్ఔన్ ముసాతో వాదించటం నుండి అశక్తు డైన తరువాత మూసాతో ఇలా పలికాడు: నీవు నన్ను కాదని మరెవరినైన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తే నేను నిన్ను చెరసాలలో బందీలుగా ఉన్నవారిలో చేరుస్తా ను. قال أولو جئتك بشىء م بين

قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍۢ مُّبِينٍۢ ﴿٣٠﴾

మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కి ఇలా సమాధానమిచ్చారు: ఏమీ ఒక వేళ నేను అల్లా హ్ వద్ద నుండి నీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీని స్పష్టపరిచే దాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చిన తరువాత కూడా నీవు నన్ను చెరసాలలో బందీలుగా ఉన్న వారిలో చేరుస్తా వా ?

قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ ﴿٣١﴾

నీవు వాదిస్తు న్నవిషయంలో ఒక వేళ నీవు నిజాయితీ పరులలోంచి అయితే నీ నిజాయితీని సూచిస్తుందని నీవు ప్రస్తావించిన దాన్ని తీసుకుని రా అని అతడు పలికాడు. فألق عصاه فإذا هى ثعبان م بين

فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌۭ مُّبِينٌۭ ﴿٣٢﴾

అప్పుడు మూసా తన చేతి కర్రను భూమిపై విసిరారు అది అకస్మాత్తు గా చూసేవారికి ఒక స్పష్టమైన సర్పంగా మారిపోయింది

وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّـٰظِرِينَ ﴿٣٣﴾

మరియు ఆయన తన చేతిని తెల్లగా లేకుండా ఉన్న స్థితిలో తన జేబులో దూర్చారు. అప్పుడు ఆయన దాన్ని బొల్లి తెల్లదనం కాకుండా వెలిగిపోతున్న తెల్లదనముతో బయటకు తీశారు. దాన్ని చూసేవారు చూశారు. قال للملإ حوله إن هذا لسحرعليم

قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَـٰذَا لَسَـٰحِرٌ عَلِيمٌۭ ﴿٣٤﴾

ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు: నిశ్చయంగా ఈ వ్యక్తి మంత్రజాలము తెలిసిన ఒక మంత్రజాలకుడు. يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون

يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ ﴿٣٥﴾

ఇతను తన మంత్రజాలముతో మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్ళగొట్ట గోరుతున్నాడు. అయితే మేము అతని విషయంలో తీసుకునే చర్య గురించి మీ సలహా ఏమిటి ?

قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَـٰشِرِينَ ﴿٣٦﴾

వారు అతనికి ఇలా సమాధానమిచ్చారు: అతన్ని,అతని సోదరుడిని ఇద్దరిని శిక్షించటంలో తొందర చేయకుండా గడువు ఇచ్చి మిసర్ పట్టణాలలో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ يأتوك بكل سحار عليم

يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍۢ ﴿٣٧﴾

వారు మంత్రజాలమును తెలిసిన ప్రతీ మంత్రజాలకుడిని నీ వద్దకు తీసుకుని వస్తా రు

فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَـٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ ﴿٣٨﴾

అప్పుడు ఫిర్ఔన్ మూసాతో పోటీ చేయటానికి తన మంత్రజాలకులను ఒక నిర్ణీత ప్రదేశంలో,నిర్ణీత కాలంలో సమీకరించాడు. وقيل للناس هل أنتم م جتمعون

وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ ﴿٣٩﴾

మరియు ప్రజల్లో ఇలా ప్రకటించబడినది: ఏమీ మీరు గెలిచే వాడిని చూడటానికి సమావేశమవుతారా అతడు మూసానా లేదా మంత్రజాలకులా ?

لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ ﴿٤٠﴾

ఒక వేళ మంత్రజాలకులకు మూసా అలైహిస్సలాంపై గెలుపు కలిగితే మేము వారి ధర్మము విషయంలో వారిని అనుసరించాలని ఆశ

فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَـٰلِبِينَ ﴿٤١﴾

మంత్రజాలకులు మూసాపై గెలవటానికి ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు వారు అతనితో ఇలా పలికారు: ఒక వేళ మూసా పై మనకు గెలుపు కలిగితే మనకు ఆర్ధిక ప్రతిఫలం లేదా నైతిక ప్రతిఫలం ఉంటుందా ?

قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًۭا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ ﴿٤٢﴾

ఫిర్ఔన్ వారితో ఇలా పలికాడు: అవును మీ కొరకు ప్రతిఫలం గలదు. నిశ్ఛయంగా మీరు అతనిపై సఫలీకృతమైతే నా వద్ద మీకు ఉన్నత స్థా నాలను ప్రసాదించటం ద్వారా సన్నిదుల్లోంచి అవుతారు

قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ ﴿٤٣﴾

మూసా అలైహిస్సలాం అల్లా హ్ సహాయముపై నమ్మకమును కలిగి ఉండి మరియు తన వద్ద ఉన్నది మంత్రజాలము కాదని స్పష్టపరుస్తూ వారితో ఇలా పలికారు: మీరు వేయదలచుకున్న మీ త్రా ళ్ళను,మీ చేతి కర్రలను వేయండి

فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَـٰلِبُونَ ﴿٤٤﴾

అప్పుడు వారు తమ త్రాళ్ళను,చేతి కర్రలను విసిరారు.వాటిని విసిరినప్పుడు వారు ఇలా పలికారు: ఫిర్ఔన్ గొప్పతనము సాక్షిగా నిశ్ఛయంగా మేమే విజయం పొందే వారము. మరియు మూసా అతడే ఓడిపోయేవాడు. فألق موس عصاهفإذا هى تلقف ما يأفكون

فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ ﴿٤٥﴾

అప్పుడు మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అప్పుడు అది సర్పముగా మారిపోయింది. అప్పుడు అది వారు మంత్రజాలముతో ప్రజలను మోసం చేసిన దాన్ని మింగసాగింది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَـٰجِدِينَ ﴿٤٦﴾

మంత్రజాలకులు మూసా చేతి కర్ర వారు విసిరిన తమ మంత్రజాలమును మ్రింగి వేయటమును చూసినప్పుడు సాష్టాంగపడిపోయారు

قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٤٧﴾

వారు ఇలా అన్నారు: మేము సృష్టితాలన్నిటి ప్రభువును విశ్వసించాము. رب موس وهرون

رَبِّ مُوسَىٰ وَهَـٰرُونَ ﴿٤٨﴾

మూసా,హారూన్ అలైహిమస్సలాం ప్రభువును

قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ ۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَـٰفٍۢ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ ﴿٤٩﴾

وأ رجلكم من خلف ولأصلبنكم أ جمعين ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును ఖండిస్తూ ఇలా పలికాడు: ఏమీ నేను మీకు దీని అనుమతి ఇవ్వక ముందే మీరు మూసా పై విశ్వాసమును కనబరుస్తారా ?!. నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ పెద్దవాడు. వాస్తవానికి మీరందరు మిసర్ వాసులందరిని దాని నుండి వెళ్ళగొట్టడానికి కుట్ర పన్నారు. నేను మీకు ఏ శిక్ష విధిస్తానో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. నేను తప్పకుండా మీలో నుండి ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేయిని ఆ రెండింటి మధ్య వ్యతిరేక దిశలో కోసివేస్తా ను ఎడమ చేతితోపాటు కుడి కాలును కోయటం లేదా దానికి భిన్నంగా. మరియు నేను తప్పకుండా మీ అందరిని ఖర్జూ రపు చెట్టు బోదెలపై సిలువ వేస్తా ను. మీలో నుండి ఎవరినీ నేను వదలను

قَالُوا۟ لَا ضَيْرَ ۖ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ ﴿٥٠﴾

మంత్రజాలకులు ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు: ఇహ లోకంలో నీవు కోయటం,సిలువ వేయటం గురించి మమ్మల్ని బెదిరిస్తు న్నదానిలో ఎటువంటి నష్టం లేదు. నీ శిక్ష తరిగిపోతుంది. మరియు మేము మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళుతాము. మరియు ఆయన మమ్మల్ని తన శాశ్వత కారుణ్యంలో ప్రవేశింపజేస్తా డు

إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَـٰيَـٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ ﴿٥١﴾

నిశ్చయంగా మొదట మేమే మూసాపై విశ్వాసమును కనబరచి ఆయనను నమ్మాము కాబట్టి అల్లాహ్ మేము పాల్పడిన పూర్వ పాపాలను తుడిచి వేస్తా డని మేముఆశిస్తు న్నాము

۞ وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ ﴿٥٢﴾

మరియు మేము మూసా అలైహిస్సలాం వైపునకు ఆయన ఇస్రాయీలు సంతతి వారిని రాత్రి తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తూ దైవ వాణిని అవతరింపజేశాము. ఎందుకంటే ఫిర్ఔన్,అతనితో పాటు ఉన్నవారు వారిని పట్టు కోవటానికి వారిని వెంబడిస్తా రు

فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَـٰشِرِينَ ﴿٥٣﴾

అయితే ఫిర్ఔన్ పట్టణాలలో ఇస్రాయీలు సంతతి వారిని పట్టుకోవటానికి ఎప్పుడైతే మిసర్ నుండి వారి బయలదేరటమును తెలుసుకున్నాడో సైన్యములను సమీకరించే వారిని తన సైన్యముల్లోంచి కొంత మందిని పంపించాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّ هَـٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌۭ قَلِيلُونَ ﴿٥٤﴾

ఫిర్ఔన్ ఇస్రా యీలు సంతతి వారి విషయంలో చిన్నవిగా చూపిస్తూ ఇలా పలికాడు: నిశ్ఛయంగా వీరందరు చిన్న వర్గము

وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ ﴿٥٥﴾

మరియు నిశ్ఛయంగా వారు వారిపై మమ్మల్ని ఆగ్రహమును కలిగించే చర్యలకు పాల్పడ్డా రు. وإنا لجميع حذرون

وَإِنَّا لَجَمِيعٌ حَـٰذِرُونَ ﴿٥٦﴾

మరియు నిశ్ఛయంగా మేము వారి కొరకు సిద్ధంగా,అప్రమత్తంగా ఉన్నాము. فأخرجنهم من جنت وعيون

فَأَخْرَجْنَـٰهُم مِّن جَنَّـٰتٍۢ وَعُيُونٍۢ ﴿٥٧﴾

కావున మేము ఫిర్ఔన్ ను,అతని జాతి వారిని దట్టమైన తోటలు,నీటితో ప్రవహించే కాలువలు గల మిసర్ భూమి నుండి వెళ్ళగొట్టా ము. وكنوز ومقام كريم

وَكُنُوزٍۢ وَمَقَامٍۢ كَرِيمٍۢ ﴿٥٨﴾

మరియు సంపదల నిధులు గల,మంచి నివాసాలు గల (భూమి నుండి)

كَذَٰلِكَ وَأَوْرَثْنَـٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ ﴿٥٩﴾

ఈ విధంగా మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని ఈ అనుగ్రహాల నుండి వెళ్ళగొట్టి వారి తరువాత ఈ అనుగ్రహాలను షామ్ ప్రాంతములో ఇస్రాయీలు సంతతి వారి కొరకు చేశాము. فأتبعوهم م شرقين

فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ ﴿٦٠﴾

ఫిర్ఔన్,అతని జాతి వారు సూర్యోదయ సమయంలో ఇస్రా యీలు సంతతి వారిని వెంబడించారు

فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَـٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ ﴿٦١﴾

ఎప్పుడైతే ఫిర్ఔన్ అతని జాతి వారు మూసా అలైహిస్సలాం,అయన జాతి వారితో ఎదురుపడి ప్రతీ పక్షము రెండోవ పక్షమును చూసే విధంగా అయిపోయారో మూసా అనుచరులు నిశ్ఛయంగా ఫిర్ఔన్,అతని జాతి వారు మమ్మల్ని పట్టు కుంటారు. వారిని ఎదుర్కునే శక్తి మాకు లేదు అని అన్నారు

قَالَ كَلَّآ ۖ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ ﴿٦٢﴾

మూసా అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు: విషయం మీరు అనుకున్నట్లు కాదు. ఎందుకంటే నిశ్చయంగా మద్దతుతో,సహాయముతో నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తొందరలోనే ఆయన నన్ను విముక్తి మార్గము వైపునకు మార్గ దర్శకత్వము చేస్తా డు

فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ ۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍۢ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ ﴿٦٣﴾

అప్పుడు మేము మూసాను తన చేతి కర్రను సముద్రంపై కొట్టమని ఆదేశిస్తూ దైవ వాణి అవతరింపజేశాము. అప్పుడు ఆయన దాన్ని దానితో కొట్టా రు. అప్పుడు సముద్రం చీలిపోయి ఇస్రా యీలు సంతతి వారి తెగల లెక్క ప్రకారం పన్నెండు మార్గములుగా మారిపోయింది. అప్పుడు సముద్రం యొక్క చీలిన بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ప్రతీ ముక్క పెద్దది అవటంలో,స్థిరత్వంలోపెద్ద పర్వతము వలె అందులో నుండి ఎటువంటి నీరు ప్రవహించకుండా ఉన్నట్లు అయిపోయినది

وَأَزْلَفْنَا ثَمَّ ٱلْـَٔاخَرِينَ ﴿٦٤﴾

మరియు మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సమీపింపజేశాము చివరికి వారు మార్గమును దారిగా భావిస్తూ సముద్రంలో ప్రవేశించారు. وأنجينا موس ومن معه أجمعين

وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ ﴿٦٥﴾

మరియు మేము మూసా అలైహిస్సలాం,ఆయనతోపాటు ఉన్న ఇస్రా యీలు సంతతి వారిని రక్షించాము. వారిలో నుంచి ఎవరూ నాశనం కాలేదు

ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ ﴿٦٦﴾

ఆ తరువాత మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సముద్రంలో ముంచి తుదిముట్టించాము

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿٦٧﴾

నిశ్ఛయంగా మూసా అలైహిస్సలాం కొరకు సముద్రం విడిపోయి ఆయనకు విముక్తి కలగటంలో,ఫిర్ఔన్,అతని జాతి వారికి వినాశనం కలగటంలో మూసా నిజాయితీ పై సూచించే ఒక సూచన కలదు. మరియు ఫిర్ఔన్ తో పాటు ఉన్న చాలా మంది విశ్వసించరు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿٦٨﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ ﴿٦٩﴾

ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం గాధను వారికి చదివి వినిపించండి. إذ قال لأبيه وقومه ما تعبدون

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ ﴿٧٠﴾

ఆయన తన తండ్రి ఆజరుతో,తన జాతి వారితో మీరు అల్లా హ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తు న్నారు ? అని అడిగినప్పుడు. قالوانعبد أصناما فنظل لها عكفين

قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًۭا فَنَظَلُّ لَهَا عَـٰكِفِينَ ﴿٧١﴾

ఆయన జాతి వారు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు: మేము కొన్ని విగ్రహాలను వాటి ఆరాధనను వాటి కొరకు అట్టిపెడుతూ పాటిస్తూ ఆరాధిస్తు న్నాము. قال هل يسمعونكم إذ تدعون

قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ ﴿٧٢﴾

ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు విగ్రహాలను పిలుస్తు న్నప్పుడు వారు మీ పిలుపును వింటున్నారా ? అని ప్రశ్నించారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أو ينفعونكم أو يضرون

أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ ﴿٧٣﴾

లేదా ఒక వేళ మీరు వారికి విధేయత చూపితే మీకు వారు ప్రయోజనం చేకూరుస్తా రా ? లేదా ఒక వేళ మీరు వారికి అవిధేయులైతే వారు మీకు నష్టం చేకూరుస్తా రా ? అని వారితో అడిగారు

قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ ﴿٧٤﴾

వారు ఇలా సమాధానమిచ్చారు: మేము వారిని పిలిచినప్పుడు వారు మమ్మల్ని విన లేదు,ఒక వేళ మేము వారికి విధేయత చూపితే వారు మమ్మల్ని ప్రయోజనం కలిగించరు,ఒక వేళ మేము వారికి అవిధేయత చూపితే వారు మమ్మల్ని నష్టం కలిగించలేరు. కాని జరిగిందేమిటంటే మేము మా తాతముత్తా తలను ఇలా చేస్తుండగా చూశాము. మేము వారిని అనుకరిస్తు న్నాము. قال أفرءيتم ما كنتم تعبدون

قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ ﴿٧٥﴾

ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు: మీరు యోచన చేసి చూశారా ?మీరు అల్లా హ్ ను వదిలి ఆరాధిస్తు న్నవిగ్రహాలను;

أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ ﴿٧٦﴾

మరియు మీ పూర్వ తాతముత్తా తలు ఆరాధన చేసే వాటిని. و

فَإِنَّهُمْ عَدُوٌّۭ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَـٰلَمِينَ ﴿٧٧﴾

నిశ్చయంగా వారందరు నాకు శతృవులు ఎందుకంటే సమస్త సృష్టి రాసుల ప్రభువైన అల్లా హ్ తప్ప వారందరు అసత్యులు

ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ ﴿٧٨﴾

ఆయనే నన్ను సృష్టించాడు. కనుక ఆయన నన్ను ఇహపరాల మంచి వైపునకు మార్గ నిర్దేశకం చేస్తా డు

وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ ﴿٧٩﴾

ఆయన ఒక్కడే నాకు ఆకలి కలిగినప్పుడు నాకు తినిపిస్తా డు,నాకు దాహం వేసినప్పుడు నాకు త్రా పిస్తా డు. وإ ذا مرضت فهو يشفين

وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ ﴿٨٠﴾

మరియు ఆయన ఒక్కడే నాకు రోగం కలిగినప్పుడు రోగము నుండి నన్ను నయం చేస్తా డు. ఆయన తప్ప ఇంకెవరూ నాకు నయం చేసేవాడు లేడు

وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ ﴿٨١﴾

ఆయన ఒక్కడే నా వయస్సు అంతమైపోయినప్పుడు నన్ను మరణింపజేస్తా డు,నేను మరణించిన తరువాత నన్ను జీవింపజేస్తా డు

وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ ﴿٨٢﴾

ప్రతిఫలం దినం నాడు నా పాపములను మన్నిస్తా డని ఆయన ఒక్కడితోనే నేను ఆశిస్తు న్నాను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

رَبِّ هَبْ لِى حُكْمًۭا وَأَلْحِقْنِى بِٱلصَّـٰلِحِينَ ﴿٨٣﴾

ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువుతో దుఆ చేస్తూ ఇలా పలికారు: ఓ నా ప్రభువా నాకు ధర్మ అవగాహన ప్రసాదించు. మరియు నన్ను నా కన్నా మునుపటి పుణ్యాత్ములైన దైవ ప్రవక్తలతో వారితో పాటు నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసి కలుపు

وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍۢ فِى ٱلْـَٔاخِرِينَ ﴿٨٤﴾

మరియు నీవు నా తరువాత వచ్చే తరాలలో నా కొరకు అందమైన చర్చను,మంచి కీర్తిని కలిగించు

وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ ﴿٨٥﴾

మరియు నీవు నన్ను స్వర్గ స్థా నాలకు వారసులై వాటిలో సుఖభోగాలను అనుభవించే విశ్వాసపరులైన నీ దాసుల్లో చేర్చి వాటిలో నాకు నివాసం కల్పించు

وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ ﴿٨٦﴾

మరియు నీవు నా తండ్రిని మన్నించు. నిశ్ఛయంగా అతడు ,షిర్కు వలన సత్యము నుండి తప్పిన వారిలో అయిపోయాడు. ఇబ్రాహీం అలైహ్స్సలాం తన తండ్రి కొరకు అతను నరక వాసుల్లోంచి వాడు అని స్పష్టమవక మునుపు దుఆ చేశారు. ఎప్పుడైతే అది స్పష్టమైనదో ఆయన అతడి నుండి విసిగిపోయారు,అతని కొరకు దుఆ చేయలేదు. ولا تخزنى يوم يبعثون

وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ ﴿٨٧﴾

లెక్క తీసుకోబడటం కొరకు ప్రజలు లేపబడే రోజున నన్ను శిక్షించి బట్టబయలు చేయకు. يوملا ينفع مال ولا بنون

يَوْمَ لَا يَنفَعُ مَالٌۭ وَلَا بَنُونَ ﴿٨٨﴾

ఆ రోజు మనిషి ఇహలోకంలో సమీకరించిన సంపద గానీ,సంతానం గానీ ప్రయోజనం చేకూర్చవు. ప్రతి ఒక్కరు వారిపై జయిస్తా రు

إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍۢ سَلِيمٍۢ ﴿٨٩﴾

ఎటువంటి సాటి గానీ,కపటత్వం గానీ,ప్రదర్శనా బుద్ది గానీ,అహంకారము గానీ లేని నిర్మలమైన హృదయమును తీసుకుని అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు మాత్రమే. అతడే అల్లా హ్ మార్గంలో తాను ఖర్చు చేసిన సంపద ద్వారా,అతని కొరకు దుఆ చేసే తన సంతానము ద్వారా ప్రయోజనం చెందుతాడు

وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ ﴿٩٠﴾

మరియు తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారి కొరకు స్వర్గము దగ్గర చేయబడుతుంది

وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ ﴿٩١﴾

సత్య ధర్మము నుండి తప్పిపోయి మార్గ భ్రష్టు లయ్యే వారి కొరకు మహషర్ లో నరకాగ్ని ప్రత్యక్షపరచబడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وقيل لهم أين ما كنتمتعبدون

وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ ﴿٩٢﴾

మీరు ఆరాధించే విగ్రహాలు ఏవి అని వారితో దూషిస్తూ అడగటం జరుగుతుంది

مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ ﴿٩٣﴾

అల్లా హ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తు న్నారో వారు అల్లా హ్ శిక్షను మీ నుండి ఆపి మీకు సహాయం చేయగలరా ? లేదా వారు తమ స్వయం కొరకు సహాయం చేసుకోగలరా ?

فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ ﴿٩٤﴾

వారు,వారిని మార్గభ్రష్టతకు గురి చేసిన వారు నరకంలో ఒకరిపై ఒకరు విసిరివేయబడుతారు. وجنود إ بليس أجمعون

وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ ﴿٩٥﴾

మరియు షైతానుల్లోంచి ఇబ్లీసు సహాయకులందరు కూడా. వారిలో నుండి ఎవరు వదిలి వేయబడరు. قالوا وهم فيها يختصمون

قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ ﴿٩٦﴾

అల్లాహేతరులను ఆరాధించి వారిని ఆయనను వదిలి సాటి కల్పించేవారు వారునూ,ఎవరినైతే వారు ఆరాధించేవారో వారితో తగువులాడుతూ ఇలా పలుకుతారు:

تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَـٰلٍۢ مُّبِينٍ ﴿٩٧﴾

అల్లా హ్ సాక్షిగా నిశ్ఛయంగా మేము సత్యము నుండి స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము

إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٩٨﴾

మేము మిమ్మల్ని సమస్త సృష్టి రాసుల ప్రభువుతో సమానులుగా చేసి ఆయనను మేము ఆరాధించినట్లే మిమ్మల్ని ఆరాధించాము

وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ ﴿٩٩﴾

అల్లా హ్ ను వదిలి వారి ఆరాధన వైపునకు మమ్మల్ని పిలిచిన అపరాధులు మాత్రమే మమ్మల్ని సత్య మార్గము నుంచి తప్పించారు. فما لنا من شفعين

فَمَا لَنَا مِن شَـٰفِعِينَ ﴿١٠٠﴾

అల్లా హ్ వద్ద మా కొరకు సిఫారసు చేసి ఆయన శిక్ష నుండి మమ్మల్ని విముక్తి కలిగించటానికి సిఫారసు చేసే వారు లేరు. ولا صديق حميم

وَلَا صَدِيقٍ حَمِيمٍۢ ﴿١٠١﴾

మా తరపు నుండి ప్రతిఘటించే,మా కొరకు సిఫారసు చేసే ప్రత్యక ఆప్యాయత కల ఎటువంటి స్నేహితుడు మాకు లేడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَلَوْ أَنَّ لَنَا كَرَّةًۭ فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿١٠٢﴾

అయితే ఒక వేళ మా కొరకు ఇహలోక జీవితం వైపు మరలటం అన్నది ఉంటే మేము అల్లా హ్ పై విశ్వాసమును కనబరిచే వారిలోంచి అయిపోతాము

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٠٣﴾

నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గాధలో,తిరస్కారుల పరిణామంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٠٤﴾

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ ﴿١٠٥﴾

నూహ్ అలైహిస్సలాం జాతి వారు నూహ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు. إذ قال لهم أخوهم نوح ألا تتقون

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ ﴿١٠٦﴾

వారితో వంశ పరంగా సోదరుడైన నూహ్ ఇలా పలికినప్పుడు: ఏమీ మీరు అల్లా హ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!. إنى لكم رسول أمين

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ﴿١٠٧﴾

నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లా హ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను.అల్లా హ్ నా వైపునకు వహీ చేసిన దానిలో నేను అధికం చేయని,తరగించని నీతిమంతుడను

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٠٨﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٠٩﴾

మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లా హ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١١٠﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

۞ قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ ﴿١١١﴾

ఆయనతో ఆయన జాతి వారు ఇలా అన్నారు: ఓ నూహ్ మేము నిన్ను అనుసరించాలా ? మరియు నీవు తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించి ఆచరించాలా , పరిస్థితి చూస్తే నిన్ను అనుసరిస్తు న్నది మాత్రం ప్రజల్లోంచి అధములే. వారిలో నాయకులు,గొప్పవారు దొరకరు ?!. قال وما علمى بما كانوايعملون

قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١١٢﴾

నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు: ఈ విశ్వాసపరులందరు ఏమి చేసేవారో నాకు తెలియదు. నేను వారి ఆచరణలను లెక్కవేసే పరిరక్షకుడిగా వారిపై లేను

إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى ۖ لَوْ تَشْعُرُونَ ﴿١١٣﴾

వారి లెక్క మాత్రం వారి రహస్యాలను,వారి బహిరంగాలను తెలిసిన అల్లా హ్ పై ఉన్నది. నా వద్ద లేదు. మీరు ఏమి చెప్పారో ఒక వేళ మీరు తెలుసుకుంటే చెప్పేవారు కాదు

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ ﴿١١٤﴾

మరియు నేను మీరు విశ్వసించటానికి మీ కోరికను అంగీకరిస్తూ విశ్వాసపరులను నా సభ నుండి గెంటివేసే వాడను కాను. إ ن أناإ ل انذير م بين

إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ مُّبِينٌۭ ﴿١١٥﴾

నేను హెచ్చరికను స్పష్టపరిచే హెచ్చరిక చేసేవాడను మాత్రమే నేను మిమ్మల్ని అల్లా హ్ శిక్ష నుండి హెచ్చరిస్తు న్నాను

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَـٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ ﴿١١٦﴾

ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు: నీవు మమ్మల్ని పిలుస్తున్న దాని నుండి ఆపకపోతే నీవు తప్పకుండా దూషించబడిన వారిలో నుంచి,రాళ్ళతో కొట్టబడి హతమార్చబడిన వారిలో నుంచి అయిపోతావు. قال رب إن قومى كذبون

قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ﴿١١٧﴾

నూహ్ అలైహిస్సలాం తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు: ఓ నా ప్రభువా నిశ్చయంగా నా జాతి వారు నన్ను తిరస్కరించారు. మరియు నేను నీ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను సత్యవంతుడని నమ్మలేదు

فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًۭا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿١١٨﴾

అయితే నీవు నాకూ,వారికి మధ్య అసత్యముపై వారు మొండిగా ఉండటం వలన వారిని తుదిముట్టించే ఒక తీర్పును ఇవ్వు. నీవు నా జాతి వారిలో నుంచి అవిశ్వాసపరులని దేనితోనైతే వినాశనమునకు గురి చేస్తా వో దాని నుండి నన్ను,నాతోపాటు ఉన్న విశ్వాసపరులని రక్షించు

فَأَنجَيْنَـٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ ﴿١١٩﴾

అప్పుడు మేము అతని కొరకు అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతనిని,అతనితోపాటు ఉన్న విశ్వాసపరులని మనుషులతో,జంతువులతో నిండి ఉన్న నావలో రక్షించాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ ﴿١٢٠﴾

ఆ తరువాత మేము వారిలో మిగిలి ఉన్న వారిని ముంచి వేశాము, వారు నూహ్ జాతివారు

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٢١﴾

నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,అతని జాతి వారి గాధలో,నూహ్,అతనితో పాటు ఉన్న విశ్వాసపరుల విముక్తిలో,అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరుల వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం కలదు. మరియు వారిలో నుండి చాలా మంది విశ్వసించటం లేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٢٢﴾

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ ﴿١٢٣﴾

ఆద్ జాతి వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు. إذ قال لهم أخوهم هودألا تتقون

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ ﴿١٢٤﴾

వారితో వంశ పరంగా సోదరుడైన హూద్ ఇలా పలికినప్పుడు: ఏమీ మీరు అల్లా హ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!. إنى لكم رسول أمين

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ﴿١٢٥﴾

నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను. అల్లాహ్ నన్ను చేరవేయమని ఆదేశించిన దానిలో నేను అధికం చేయని,అందులో తరగించని నీతిమంతుడను

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٢٦﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٢٧﴾

మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లా హ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు. أتبنون بكل ريع ءاية تعبثون

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةًۭ تَعْبَثُونَ ﴿١٢٨﴾

ఏమీ మీరు ప్రతీ ఎత్తైన స్థలంలో మీ ఇహములో లేదా మీ పరములో మీపై మరలని ప్రయోజనం లేని ఒక నిష్ప్రయోజనమైన స్మారక కట్టడమును నిర్మిస్తా రా ?!. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وتتخذون مصانع لعل كم تخلدون

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ ﴿١٢٩﴾

మీరు ఈ ఇహలోకములో శాస్వతంగా ఉండిపోయేటట్లు గా కోటలను,భవనములను నిర్మిస్తు న్నారు. మీరు వాటి నుండి మరలించరని. وإذا بطشتم بطشتمجبارين

وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ ﴿١٣٠﴾

మరియు మీరు హత్య ద్వారా,కొట్టడం ద్వారా దాడి చేసినప్పుడు దయా,దాక్షిణ్యాలు లేని దౌర్జన్యపరులుగా దాడి చేస్తా రు

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٣١﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ ﴿١٣٢﴾

మరియు మీరు మీకు తెలిసిన అనుగ్రహాలు ప్రసాదించిన ఆ అల్లా హ్ క్రోధము నుండి మీరు భయపడండి. أمد كم بأ نعم وبنين

أَمَدَّكُم بِأَنْعَـٰمٍۢ وَبَنِينَ ﴿١٣٣﴾

ఆయన మీకు పశువులను ప్రసాదించాడు,మీకు సంతానమును ప్రసాదించాడు. وجنت وعيون

وَجَنَّـٰتٍۢ وَعُيُونٍ ﴿١٣٤﴾

మీకు తోటలను,ప్రవహించే చెలమలను ప్రసాదించాడు

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍۢ ﴿١٣٥﴾

ఓ నా జాతి వారా నిశ్ఛయంగా నేను మీపై గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము

قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ ﴿١٣٦﴾

అతని జాతి వారు అతనితో ఇలా పలికారు: మాకు నీ హితబోధన చేయటం,చేయకపోవటం మా వద్ద సమానము. మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము. మేము ఉన్న దాని నుండి మరలమంటే మరలము

إِنْ هَـٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ ﴿١٣٧﴾

ఇది మాత్రం పూర్వికుల ధర్మము,వారి అలవాట్లు ,వారి గుణాలు. وما نحن بمعذبين

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ﴿١٣٨﴾

మేము శిక్షించబడము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَكَذَّبُوهُ فَأَهْلَكْنَـٰهُمْ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٣٩﴾

అప్పుడు వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరిస్తూ నే ఉన్నారు. అప్పుడు మేము వారి తిరస్కారమునకు బదులుగా వంధ్య గాలితో వారిని వినాశనమునకు గురి చేశాము. నిశ్చయంగా ఈ వినాశనములో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలా మంది విశ్వసించటం లేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٤٠﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ ﴿١٤١﴾

సమూద్ జాతి తమ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలందరిని తిరస్కరించింది. إذ قال لهم أخوهم صلح ألا تتقون

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَـٰلِحٌ أَلَا تَتَّقُونَ ﴿١٤٢﴾

వారితో వంశ పరంగా సోదరుడైన సాలిహ్ ఇలా పలికినప్పుడు: ఏమీ మీరు అల్లా హ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!. إنى لكم رسول أمين

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ﴿١٤٣﴾

నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని. దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٤٤﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٤٥﴾

మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లా హ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు

أَتُتْرَكُونَ فِى مَا هَـٰهُنَآ ءَامِنِينَ ﴿١٤٦﴾

ఏమీ మీరు ఉన్న సుఖబోగాల్లో ,అనుగ్రహాల్లో నిశ్ఛింతగా మీరు భయపడకుండా వదలివేయబడుతారని ఆశిస్తు న్నారా ?!. فى جنت وعيون

فِى جَنَّـٰتٍۢ وَعُيُونٍۢ ﴿١٤٧﴾

తోటలలో,ప్రవహించే చెలమలలో, بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وزروع ونخل طلعها هضيم

وَزُرُوعٍۢ وَنَخْلٍۢ طَلْعُهَا هَضِيمٌۭ ﴿١٤٨﴾

మరియు పంట చేలలో, పండిపోయి మెత్తగా ఉన్న ఖర్జూ రపు పండ్ల తోటలలో

وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًۭا فَـٰرِهِينَ ﴿١٤٩﴾

మరియు మీరు నివసించటానికి ఇండ్లు నిర్మించటానికి పర్వతాలను చెక్కుతారు. మరియు మీరు వాటిని చెక్కటంలో నైపుణ్యవంతులు

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٥٠﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ ﴿١٥١﴾

మరియు మీరు పాపములకు పాల్పడి తమ స్వయం పై మితిమీరే వారి ఆజ్ఞను అనుసరించకండి

ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ ﴿١٥٢﴾

వారే ఎవరైతే పాప కార్యములను వ్యాపింపజేసి భూమిలో అల్లకల్లో లాలను రేకెత్తిస్తా రో,అల్లా హ్ విధేయతను చేపట్టి స్వయం సంస్కరణ చేయరో

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ ﴿١٥٣﴾

అతనితో అతని జాతివారు ఇలా పలికారు: నీవు మాత్రం పదే పదే మంత్రజాలమునకు వశపరచబడి చివరికి మంత్రజాలము వారి బుద్దులను వశపరచుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారిలో వాడివి

مَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ ﴿١٥٤﴾

నీవు మాత్రం మాలాంటి ఒక మనిషి మాత్రమే,నీవు ప్రవక్త అవటానికి నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. నీవు ప్రవక్త అని వాదించే విషయంలో ఒక వేళ సత్యమంతుడివే అయితే నీవు ప్రవక్త అవటంపై సూచించే ఒక సూచనను తీసుకుని రా. قال هذه ناقةلها شرب ولكم شرب يوم معلوم

قَالَ هَـٰذِهِۦ نَاقَةٌۭ لَّهَا شِرْبٌۭ وَلَكُمْ شِرْبُ يَوْمٍۢ مَّعْلُومٍۢ ﴿١٥٥﴾

సాలిహ్ అలైహిస్సలాం - వాస్తవానికి అల్లా హ్ ఆయనకు ఒక సూచనను ప్రసాదించాడు. అది ఒక ఆడ ఒంటె. దాన్ని అల్లా హ్ రాతి బండ నుండి వెలికి తీశాడు - వారితో ఇలా పలికారు: ఇది చూడబడే,తాకబడే ఒక ఆడ ఒంటె.దాని కొరకు నీటిని త్రాగే ఒక వంతు మరియు మీ కొరకు ఒక వంతు నిర్ధా రితమై ఉన్నది. మీ వంతు దినమున అది త్రా గదు మరియు దాని వంతు దినమున మీరు త్రా గరు

وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍۢ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍۢ ﴿١٥٦﴾

మరియు మీరు దాన్ని కోయటం ద్వారా గానీ లేదా కొట్టడం ద్వారా గానీ దానికి కీడు కలిగించే దానితో ముట్టు కోకండి. అప్పుడు దాని వలన మీపై ఆపద కురిసే గొప్ప దినములో అల్లా హ్ శిక్ష మిమ్మల్ని వినాశనమునకు గురి చేస్తుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فعقروها فأصبحوا ندمين

فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَـٰدِمِينَ ﴿١٥٧﴾

వారందరు దాని వెనుక కాలి మోకాలి వద్ద నరమును కోసి చంపటానికి కలిసి కట్టుగా నిర్ణయించుకున్నారు. వారిలో పెద్ద దుష్టుడు దాన్ని కోసి చంపివేశాడు. ఎప్పుడైతే వారు తమపై ఖచ్చితంగా శిక్ష కురుస్తుందని తెలుసుకున్నారో వారు తాము ముందడుగు వేసిన దానిపై పశ్ఛాత్తా ప్పడే వారిలో నుంచి అయిపోయారు. కానీ శిక్షను ప్రత్యక్ష్యంగా చూసినప్పుడు ప్రయోజనం ఉండదు

فَأَخَذَهُمُ ٱلْعَذَابُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٥٨﴾

అయితే వారితో వాగ్దా నం చేయబడిన భూకంపము,భయంకర శబ్దము ద్వారా వారిని శిక్ష కబళించింది. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సాలిహ్,ఆయన జాతి వారి గాధలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٥٩﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ ﴿١٦٠﴾

లూత్ అలైహిస్సలాం జాతి వారు తమ ప్రవక్త లూత్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలను తిరస్కరించారు. إذ قال لهم أخوهم لوط ألا تتقون

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ ﴿١٦١﴾

వారితో వారి సోదరుడు లూత్ ఇలా పలికినప్పుడు: ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటంను విడనాడి భయపడరా ?!. إنى لكم رسول أمين

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ﴿١٦٢﴾

నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٦٣﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٦٤﴾

మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లా హ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు

أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَـٰلَمِينَ ﴿١٦٥﴾

ఏమీ మీరు ప్రజల్లోంచి మగవారి వద్దకు (కామ కోరికలను తీర్చుకోవటానికి) వారి వెనుక భాగంలో వస్తు న్నారా ?!. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ ﴿١٦٦﴾

మరియు మీరు అల్లా హ్ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించిన మీ భార్యల మర్మావయవాల వద్దకు రావటమును వదిలివేశారు. కానీ మీరు ఈ చెడు అపరిమితితో అల్లా హ్ హద్దు లను మితిమీరిపోయారు

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَـٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ ﴿١٦٧﴾

ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు: ఓ లూత్ నీవు ఒక వేళ మమ్మల్ని ఈ చర్య నుండి ఆపటం నుండి, దాన్ని మాపై ఇష్టపడకపోవటం నుండి విడనాడకపోతే తప్పక నీవు,నీతోపాటు ఉన్న వారు మా ఊరి నుండి వెళ్ళగొట్టబడుతారు

قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ ﴿١٦٨﴾

లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు: నిశ్ఛయంగా మీ ఈ చర్యను అసహ్యించుకునే,ధ్వేషించుకునే వారిలో నేనూ ఉన్నాను. رب نجنى وأهلى مما يعملون

رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ ﴿١٦٩﴾

ఆయన తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు: ఓ నా ప్రభువా నీవు వీరందరికి వీరు చేసిన దుష్కర్మల వలన కలిగే శిక్ష నుండి నన్ను రక్షించు, నా ఇంటి వారిని రక్షించు. فنج ينه وأهله أجمعين

فَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ ﴿١٧٠﴾

అప్పుడు మేము అతని దఆను స్వీకరించి అతన్నీ,అతని ఇంటి వారందరినీ రక్షించాము

إِلَّا عَجُوزًۭا فِى ٱلْغَـٰبِرِينَ ﴿١٧١﴾

ఆయన సతీమణి తప్ప. ఆమె అవిశ్వాసపరురాలు. ఆమె వెళ్ళిపోయె వారిలో,వినాశనం చెందేవారిలో నుండి అయిపోయింది

ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ ﴿١٧٢﴾

ఆ పిదప లూత్,ఆయన ఇంటి వారు ఊరి నుండి (సదూమ్) బయలదేరిన తరువాత మిగిలి ఉన్న ఆయన జాతి వారిని మేము తీవ్రంగా వినాశనమునకు గురి చేశాము

وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًۭا ۖ فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ ﴿١٧٣﴾

మరియు మేము వారిపై వర్షమును కురిపించేటట్లు గా ఆకాశము నుండి రాళ్ళను కరిపించాము. లూత్ అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించారో,వారిని భయ పెట్టా రో ఒక వేళ వారు తాము ఉన్న దుష్కర్మలను పాల్పడటంలో కొనసాగితే వారందరిపై కురిసే వర్షం ఎంతో చెడ్డదైనది

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٧٤﴾

నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన లూత్ అలైహిస్సలాం జాతి వారిపై ఆశ్లీల కార్యము వలన కురిసే శిక్షలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٧٥﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

كَذَّبَ أَصْحَـٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ ﴿١٧٦﴾

మద్యన్ కు దగ్గరలో ఉన్న దట్టమైన చెట్లు కల పట్టణం వారు తమ ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు. إذ قال لهم شعيب ألا تتقون

إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ ﴿١٧٧﴾

వారితో వారి ప్రవక్త ఇలా పలికినప్పుడు: ఏమీ మీరు అల్లా హ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటమును విడనాడి భయపడరా ?!. إنى لكم رسول أمين

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌۭ ﴿١٧٨﴾

నిశ్ఛయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని,నాకు ఆయన దేనిని చేరవేయమని ఆదేశించాడో దానిపై నేను అధికం చేయను,తగ్గించను

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ ﴿١٧٩﴾

అయితే మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٨٠﴾

మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లా హ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు

۞ أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ ﴿١٨١﴾

మీరు ప్రజలకు అమ్మేటప్పుడు పూర్తిగా కొలవండి. ప్రజలకు అమ్మినప్పుడు కొలవటంలో తగ్గించే వారిలో మీరు కాకండి

وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ ﴿١٨٢﴾

ఇతరుల కొరకు తూకమేసేటప్పుడు సరైన తూకముతో తూకమేయండి

وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ ﴿١٨٣﴾

మరియు మీరు ప్రజల హక్కులను తగ్గించకండి. మరియు మీరు పాపకార్యములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను అధికం చేయకండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ ﴿١٨٤﴾

ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో మరియు పూర్వ సమాజాలను సృష్టించాడో ఆయన మీపై తన శిక్షను అవతరింపజేస్తా డని ఆయనతో భయముతో భీతిని కలిగి ఉండండి

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ ﴿١٨٥﴾

షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా ఫలికారు: నీవు మాత్రం పదే పదే మంత్రజాలము సంభవించిన వారిలోంచి వాడివి చివరికి మంత్రజాలము నీ బుద్ధిని వశపరచుకుని దాన్ని పోగొట్టింది

وَمَآ أَنتَ إِلَّا بَشَرٌۭ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَـٰذِبِينَ ﴿١٨٦﴾

మరియు నీవు మాత్రం మాలాంటి మనిషివి మాత్రమే నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు నీవు ఎలా ప్రవక్తవవుతావు ?. నీవు ప్రవక్తవని వాదిస్తు న్నవిషయంలో నిన్ను అసత్యడువని మేము భావిస్తు న్నాము

فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًۭا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ ﴿١٨٧﴾

నీవు వాదిస్తు న్నవిషయంలో ఒక వేళ సత్యవంతుడివి అయితే ఆకాశము నుండి ఒక తునకను మాపై పడవేయి

قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ ﴿١٨٨﴾

షుఐబ్ వారితో ఇలా పలికారు: మీరు చేస్తు న్నషిర్కు ,పాపకార్యాల గురించి మా ప్రభువుకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు

فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ ۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ ﴿١٨٩﴾

అయితే వారు తమ తిరస్కారముపైనే కొనసాగారు. అప్పుడు వారికి పెద్ద శిక్ష తీవ్ర వేడి కల దినము తరువాత ఒక మేఘము వారిని నీడ నిచ్చేటట్లు చుట్టు కుంది. అప్పుడు అది వారిపై అగ్నిని కురిపించి వారిని కాల్చివేసింది. నిశ్ఛయంగా వారి వినాశనము యొక్క దినము పెద్ద భయంకర దినమైనది

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةًۭ ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ ﴿١٩٠﴾

నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన షుఐబ్ అలైహిస్సలాం జాతి వారి వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ ﴿١٩١﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును

وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٩٢﴾

మరియు నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ ﴿١٩٣﴾

దీన్ని విశ్వసనీయుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని దిగారు

عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ ﴿١٩٤﴾

ఓ ప్రవక్తా అతడు దాన్ని తీసుకుని నీ హృదయంపై నీవుప్రజలను అల్లా హ్ శిక్ష నుండి హెచ్చరించే, వారిని భయపెట్టే ప్రవక్తల్లోంచి అవటానికి దిగాడు. بلسان عربى م بين

بِلِسَانٍ عَرَبِىٍّۢ مُّبِينٍۢ ﴿١٩٥﴾

అతడు దాన్ని స్పష్టమైన అరబీ భాషలో తీసుకుని దిగాడు

وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ ﴿١٩٦﴾

మరియు నిశ్చయంగా ఈఖుర్ఆన్ పూర్వ గ్రంధాలలో ప్రస్తా వించబడినది. నిశ్ఛయంగా పూర్వ దివ్య గ్రంధాలు దీని గురించి శుభవార్తను ఇచ్చినవి

أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَـٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ ﴿١٩٧﴾

ఏమీ అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి ఇస్రాయీలు సంతతి వారి పండితులకు సయితం మీపై అవతరింపబడిన దాని వాస్తవికత తెలిసి ఉండటం మీ నిజాయితీపై ఒక సూచనగా మిమ్మల్నితిరస్కరించే వీరందరికి సరిపోదా ?

وَلَوْ نَزَّلْنَـٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ ﴿١٩٨﴾

మరియు ఒక వేళ మేము ఈఖుర్ఆన్ ను అరబీ మట్లా డలేని అరబ్బేతరుల్లోంచి కొందరిపై అవతరింపజేసి ఉంటే. فقرأه عليهم ما كانوابه مؤمنين

فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ ﴿١٩٩﴾

అప్పుడు అతను దాన్ని వారికి చదివి వినిపించినా వారు దాన్ని విస్వసించేవారు కాదు; ఎందుకంటే వారు మాకు అది అర్ధం కాలేదు అంటారు. కావున వారు అది వారి భాషలో అవతరింపబడినది కాబట్టి అల్లా హ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి

كَذَٰلِكَ سَلَكْنَـٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ ﴿٢٠٠﴾

ఈ విధంగా మేము తిరస్కారమును,అవిశ్వాసమును అపరాధుల హృదయాలలో ప్రవేశింపజేశాము

لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ ﴿٢٠١﴾

వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు తాము ఉన్న అవిశ్వాసము నుండి మారరు,విశ్వసించరు. فيأتيهم بغتة وهم لا يشعرون

فَيَأْتِيَهُم بَغْتَةًۭ وَهُمْ لَا يَشْعُرُونَ ﴿٢٠٢﴾

అప్పుడు ఈ శిక్ష వారి వద్దకు అకస్మాత్తు గా వచ్చిపడుతుంది. వారి వద్దకు అది అకస్మాత్తు గా వచ్చేంతవరకు దాని రావటమును వారు గుర్తించరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فيقولواهل نحن منظرون

فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ ﴿٢٠٣﴾

వారిపై శిక్ష అకస్మాత్తుగా అవతరించినప్పుడు వారు తీవ్ర బాధతో ఇలా పలుకుతారు: మేము అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడటానికి మాకు గడువు ఇవ్వబడుతుందా ?!. أ فبعذابنا يستعجلون

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ﴿٢٠٤﴾

ఏమి ఈ తిరస్కారులందరు మా శిక్ష గురించి ఇలా పలుకుతూ తొందర చేస్తున్నారా: నీవు మాపై వాదించినట్లు ఆకాశము ఏదైన తునకమును పడవేసేనంత వరకు మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము ?! أفرءيت إن م تعنهم سنين

أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَـٰهُمْ سِنِينَ ﴿٢٠٥﴾

ఓ ప్రవక్తా మీరు నాకు తెలపండి ఒక వేళ మేము మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటము నుండి విముఖత చూపే ఈ అవిశ్వాసపరులందరికి కొంత కాలము అనుగ్రహాల ద్వారా ప్రయోజనం చేకూర్చినా

ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ ﴿٢٠٦﴾

ఆ తరువాత వారు ఈ అనుగ్రహాలను పొందిన కాలం తరువాత వారితో వాగ్దా నం చేయబడిన శిక్ష వారి వద్దకు వచ్చినది

مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ ﴿٢٠٧﴾

ఇహ లోకంలో వారికి ఉన్నఅనుగ్రహాలు వారికి ఏమి ప్రయోజనం కలిగించగలవు ?!. నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలన్నీఅంతమైపోయాయి. మరియు అవి ఏవి లాభం కలిగించవు

وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ ﴿٢٠٨﴾

సమాజాల్లోంచి ఏ సమాజమును కూడా వారి వద్దకు ప్రవక్తలను పంపించి,గ్రంధాలను అవతరింపజేసి సాకులు లేకుండా చేసిన తరువాతే మేము నాశనం చేశాము. ذكر وما كنا ظلمين

ذِكْرَىٰ وَمَا كُنَّا ظَـٰلِمِينَ ﴿٢٠٩﴾

వారికి ఉపదేశముగా,హితోపదేశముగా. మరియు ప్రవక్తలను పంపించి,గ్రంధములను అవతరింపజేసి వారి వద్ద సాకులు లేకుండా చేసిన తరువాత వారిని శిక్షించటం వలన మేము అన్యాయము చేసిన వారము కాము

وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَـٰطِينُ ﴿٢١٠﴾

ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం హృదయంపై దిగలేదు. وما ينبغى لهم وما يستطيعون

وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ ﴿٢١١﴾

వారు ఆయన హృదయంపై దిగటం సరి కాదు. మరియు వారికి దాని శక్తి లేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ ﴿٢١٢﴾

వారికి దాని శక్తి లేదు ఎందుకంటే వారు ఆకాశము నుండి దూరపు స్థలంలో తొలగించబడ్డా రు. అప్పుడు వారు దాని వద్దకు ఎలా చేర గలరు. మరియు దాన్ని తీసుకుని ఎలా దిగ గలరు ?!

فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ ﴿٢١٣﴾

అయితే మీరు అల్లా హ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆయనతో పాటు మీరు సాటి కల్పిస్తూ ఆరాధించకండి. అప్పుడు మీరు దాని కారణం వలన శిక్షింపబడే వారిలో అయిపోతారు

وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ ﴿٢١٤﴾

ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారిలోంచి దగ్గర బంధువులను ఒక వేళ వారు షిర్కు పై ఉంటే వారికి అల్లా హ్ శిక్ష కలగనంత వరకు హెచ్చరిస్తూ ఉండండి

وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿٢١٥﴾

మరియు విశ్వాసపరులోంచి నిన్ను అనుసరించిన వారి కొరకు నీ రెక్కలను కర్మ పరంగా,మాట పరంగా వారిపై కనికరిస్తూ ,దయను చూపుతూ మృధు వైఖరిని కలిగి ఉండు

فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌۭ مِّمَّا تَعْمَلُونَ ﴿٢١٦﴾

ఒక వేళ వారు నీపై అవిధేయత చూపి,నీవు వారికి ఆదేశించిన అల్లాహ్ ఏకత్వమును,ఆయన విధేయతను స్వీకరించకపోతే, మీరు వారితో ఇలా పలకండి: మీరు చేస్తు న్నషిర్కు,పాప కార్యాల నుండి నేను అతీతుడను

وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ ﴿٢١٧﴾

మరియు నీవు నీ వ్యవహారాలన్నింటిలో తన శతృవులతో ప్రతీకారం తీసుకునే సర్వ శక్తిమంతుడి పై,వారిలోంచి అతని వైపు మరలే వారిపై కరుణించేవాడిపై నమ్మకమును కలిగి ఉండు

ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ ﴿٢١٨﴾

పరిశుద్ధు డైన ఆయనే నీవు నమాజు కొరకు నిలబడినప్పుడు చూస్తు న్నాడు

وَتَقَلُّبَكَ فِى ٱلسَّـٰجِدِينَ ﴿٢١٩﴾

మరియు పరిశుద్ధు డైన ఆయన నమాజ్ చదివే వారిలో ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మీ మారటమును చూస్తు న్నాడు. మీరు నెలకొల్పిన (నమాజులను) వాటిలోంచి,ఇతరులు నెలకొల్పిన వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ﴿٢٢٠﴾

నిశ్ఛయంగా ఆయనే మీరు పఠించిన ఖుర్ఆన్ ను,మీ నమాజులో స్మరణను వినే వాడును,మీ ఉద్దేశమును తెలిసినవాడును. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَـٰطِينُ ﴿٢٢١﴾

ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు దిగుతారని మీరు వాదించారో వారు ఎవరిపై దిగుతారో మీకు నేను తెలియపరచనా ?. تنزل عل كل أفاك أثيم

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍۢ ﴿٢٢٢﴾

షైతానులు జ్యోతిష్యుల్లోంచి అధికంగా పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడే ప్రతీ అసత్యపరునిపై దిగుతారు

يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَـٰذِبُونَ ﴿٢٢٣﴾

షైతానులు పై లోకాల్లో ఉన్న దూతల (మలయే ఆలా) నుండి విన్న వాటిని ఎత్తుకుని వచ్చి జ్యోతిష్యుల్లోంచి తమ స్నేహితులకు చేరవేసేవారు. చాలామంది జ్యోతిష్యులు అసత్యపరులై ఉంటారు. ఒక వేళ వారు ఒక మాట నిజం పలికినా దానితో పాటు వంద మాటలు అబద్దా లు పలుకుతారు

وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ ﴿٢٢٤﴾

ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం గారు కవుల్లోంచి అని మీరు వాదిస్తు న్నారో వారిని సన్మార్గము నుండి,ఋజు మార్గము నుండి తప్పిపోయిన వారే అనుసరిస్తా రు. వారు ఏ కవిత్వాలను పలుకుతారో వాటినే వారు చదువుతారు. ألم ترأن هم فى كل واد يهيمون

أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍۢ يَهِيمُونَ ﴿٢٢٥﴾

ఓ ప్రవక్తా మీరు చూడలేదా - వారి అపమార్గపు దృశ్యాల్లోంచి వారు ప్రతీ లోయలో ఒకోసారి పొగుడుతూ తచ్చాడితే ఒకోసారి దూషిస్తూ తచ్చాడితే,ఒకో సారి వేరే వాటిలో తచ్చాడతున్నారు. وأنهم يقولون ما لا يفعلون

وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ ﴿٢٢٦﴾

మరియు వారు అబద్దం పలుకుతున్నారని, మేము ఇలా చేశాము అని అంటారు. కాని వార అలా చేయలేదు

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ ۗ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍۢ يَنقَلِبُونَ ﴿٢٢٧﴾

منقلب ينقلبون కవుల్లోంచి ఎవరైతే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో, అధికంగా అల్లాహ్ స్మరణ చేశారో, అల్లాహ్ శతృవులు వారిపై అన్యాయమునకు పాల్పడిన తరువాత వారిపై గెలుస్తా రో వారు కాదు. ఉదాహరణకు హస్సాన్ బిన్ సాబిత్ రజిఅల్లా హు అన్హు. మరియు అల్లా హ్ తో పాటు సాటి కల్పించి,ఆయన దాసులపై హింసకు పాల్పడిన వారు ఎవరి వైపు మరల వలసినదో తొందలోనే మరలి వెళుతారు. వారు గొప్ప స్థానము,ఖచ్చితమైన గణన వైపునకు మరలుతారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Ash-Shu'araa — الشعراء

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు