ముఖపేజీతఫ్సీర్Al-Haaqqa (69)

తఫ్సీర్ Al-Haaqqa (69) — الحاقة

మక్కీ · 52 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

ٱلْحَآقَّةُ ﴿١﴾

అందరిపై వచ్చి తీరేదైన మరణాంతరం లేపబడే ఘడియను అల్లా హ్ ప్రస్తా విస్తు న్నాడు

مَا ٱلْحَآقَّةُ ﴿٢﴾

ఆ పిదప ఈ ప్రశ్న ద్వారా దాని విషయ గొప్పతనం తెలపబడింది: అనివార్యమయ్యే ఈ సంఝటన ఏమిటి ?

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ ﴿٣﴾

ఈ అనివార్య సంఘటన ఏమిటో మీకు ఏమి తెలుసు ?

كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ ﴿٤﴾

తన భయానక పరిస్థితులతో ప్రజలను తట్టేటటువంటి ప్రళయమును సాలిహ్ జాతి సమూద్ మరియు హూద్ జాతి ఆద్ తిరస్కరించినది

فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ ﴿٥﴾

ఇక సమూద్ జాతి, వారిని అల్లా హ్ అత్యంత తీవ్రమైన,భయంకరమైన గర్జనతో నాశనం చేశాడు. وأما عاد فأهلكوابريح صرصر عاتية

وَأَمَّا عَادٌۭ فَأُهْلِكُوا۟ بِرِيحٍۢ صَرْصَرٍ عَاتِيَةٍۢ ﴿٦﴾

ఇక ఆద్ జాతి, వారిని అల్లా హ్ అత్యంత క్రూ రమైన తీవ్రమైన చలిగాలి ద్వారా నాశనం చేశాడు

سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍۢ وَثَمَـٰنِيَةَ أَيَّامٍ حُسُومًۭا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍۢ ﴿٧﴾

అల్లా హ్ దాన్ని వారిపై ఏడు రాత్రు లు,ఎనిమిది దినముల కాలం వరకు పంపించాడు అది వారిని కూకటి వేళ్ళతో సహా నాశనం చేయసాగింది. నీవు జాతి వారిని వారి ఇళ్ళల్లో నాశనమై భూమిపై పడి ఉండగా చూస్తావు. వారి వినాశనం తరువాత వారు నేలపై పడి ఉన్న బోసిపోయిన ఖర్జూ రపు బోదెలవలే ఉన్నారు. فهل تر لهممن باقية

فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍۢ ﴿٨﴾

అయితే వారికి శిక్ష కలిగిన తరువాత వారిలోని ఏ ప్రా ణమును మిగిలి ఉండగా నీవుచూస్తు న్నావా ?!

وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَـٰتُ بِٱلْخَاطِئَةِ ﴿٩﴾

మరియు ఫిర్ఔన్,అతని కన్నా మునుపటి సమాజాల వారు మరియు తలక్రిందులు చేయబడి శిక్షింపబడిన బస్తీల వారైన లూత్ జాతి వారు షిర్కు మరియు అవిధేయ కార్యాల్లాంటి పాప కార్యములకు పాల్పడ్డా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فعصوا رسول ربهم فأخذهم أخذة ر ابية

فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةًۭ رَّابِيَةً ﴿١٠﴾

వారిలో నుండి ప్రతి ఒక్కరు తమ వద్దకు పంపించబడ్డ తమ ప్రవక్తకు అవిధేయత చూపి అతన్ని తిరస్కరించారు. అప్పుడు అల్లా హ్ వారి వినాశనం పరిపూర్ణమయ్యే కఠినమైన పట్టు తో పట్టు కున్నాడు

إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَـٰكُمْ فِى ٱلْجَارِيَةِ ﴿١١﴾

ఎప్పుడైతే నీరు ఎత్తు లో తన పరిమితికి మించి దాటిపోయినదో నిశ్చయంగా మేము మీరు ఎవరి వెన్నులలో ఉన్నారో వారిని మా ఆదేశముతో నూహ్ అలైహిస్సలాం తయారు చేసిన నడిచే ఓడలో ఎక్కించాము. అప్పుడు మిమ్మల్ని ఎక్కించటం అయినది

لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةًۭ وَتَعِيَهَآ أُذُنٌۭ وَٰعِيَةٌۭ ﴿١٢﴾

మేము ఓడను మరియు దాని గాధను ఒక హితబోధనగా చేయటానికి దాని ద్వారా అవిశ్వాసపరుల వినాశనముపై మరియు విశ్వాసపరుల ముక్తిపై ఆధారమివ్వటానికి. మరియు గుర్తుంచుకునే చెవులు దేన్నైతే విన్నాయో దాన్ని గుర్తుంచుకుంటాయి

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌۭ وَٰحِدَةٌۭ ﴿١٣﴾

బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత బాకాలో (కొమ్ములో) ఒకే ఒక ఊదటం ఊదినప్పుడు. అది రెండవ బాకా

وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةًۭ وَٰحِدَةًۭ ﴿١٤﴾

మరియు భూమి,పర్వతాలు ఎత్తబడుతాయి ఆ తరువాత అవి రెండు ఒకే సారి తీవ్రంగా దంచబడుతాయి. అప్పుడు భూమి భాగాలు మరియు దాని పర్వత భాగాలు విడిపోతాయి

فَيَوْمَئِذٍۢ وَقَعَتِ ٱلْوَاقِعَةُ ﴿١٥﴾

అదంతా జరిగే రోజు ప్రళయం వాటిల్లు తుంది

وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍۢ وَاهِيَةٌۭ ﴿١٦﴾

ఆ రోజు ఆకాశం దాని నుండి దైవ దూతలు దిగటం కొరకు బ్రద్దలైపోతుంది. అది ఆ రోజు ఆకాశము దృఢంగా పట్టు కలిగి ఉండి కూడా బలహీనంగా ఉంటుంది

وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍۢ ثَمَـٰنِيَةٌۭ ﴿١٧﴾

మరియు దైవ దూతలు దాని అంచులపై ఉంటారు. మరియు ఆ రోజు నీ ప్రభువు యొక్క సింహాసనమును ఎనిమిది సన్నిహిత దూతలు మోస్తుంటారు. يومئذ تعرضون لا تخف منكم خافية

يَوْمَئِذٍۢ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌۭ ﴿١٨﴾

ఆ రోజున ఓ ప్రజలారా మీరు అల్లా హ్ ముందు హాజరు చేయబడుతారు. అల్లా హ్ పై మీ నుండి ఏ గోప్య విషయం గోప్యంగా ఉండదు అది ఏదైనా కూడా. అంతేకాదు అల్లా హ్ వాటి గురించి తెలుసుకునేవాడును,వాటిని ఎరుగువాడును. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَـٰبِيَهْ ﴿١٩﴾

ఇక ఎవరికైతే అతని కర్మల పుస్తకము అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో అతను అప్పుడు సంతోషముతో,ఆనందముతో ఇలా పలుకుతాడు: నా కర్మల పుస్తకమును మీరు పుచ్చుకుని చదవండి. إنى ظننت أنى ملق حسابيه

إِنِّى ظَنَنتُ أَنِّى مُلَـٰقٍ حِسَابِيَهْ ﴿٢٠﴾

నేను మరల లేపబడుతానని మరియు నా ప్రతిఫలమును నేను పొందుతానని నిశ్ఛయంగా నాకు ఇహలోకంలోనే తెలుసు మరియు నేను నమ్మేవాడిని. فهو فى عيشة ر اضية

فَهُوَ فِى عِيشَةٍۢ رَّاضِيَةٍۢ ﴿٢١﴾

అతడు శాశ్వతమైన అనుగ్రహాలను చూడటం వలన అతడు సంతృప్తికరమైన జీవితంలో ఉంటాడు. فى جنة عالية

فِى جَنَّةٍ عَالِيَةٍۢ ﴿٢٢﴾

ఉన్నతమైన స్థా నము కల స్వర్గములో. قطوفها دانية

قُطُوفُهَا دَانِيَةٌۭ ﴿٢٣﴾

దాని ఫలాలు వాటిని తినేవారికి దగ్గరగా ఉంటాయి

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ ﴿٢٤﴾

వారితో మర్యాదపురంగా ఇలా పలకబడును: మీరు తినండి మరియు త్రాగండి మీరు ఇహలోకంలో గడిచిన దినములలో చేసుకున్న సత్కర్మల వలన అందులో ఎటువంటి బాధ ఉండదు. وأما من أوتى كتبه بشماله فيقول يليتنى لم أوت كتبيه

وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَـٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَـٰبِيَهْ ﴿٢٥﴾

మరియు ఇక ఎవరి కర్మల పత్రం అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో అతడు తీవ్రమైన అవమానముతో ఇలా పలుకుతాడు: అయ్యో నా పాడుగాను నాకు శిక్షను అనివార్యం చేసే దుష్కర్మలు ఉన్న నా కర్మల పత్రం నాకు ఇవ్వకపోతే ఎంత బాగుండేది. ولم أدر ما حسابيه

وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ ﴿٢٦﴾

అయ్యో నా పాడుగాను నా లెక్క ఏమౌతుందో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది

يَـٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ ﴿٢٧﴾

బహుశా నేను మరణించిన మరణం దాని తరువాత ఎన్నటికి నేను మరల లేపబడకుండా ఉండే మరణం అయి ఉంటే ఎంత బాగుండేది

مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ ۜ ﴿٢٨﴾

నా సంపద అల్లా హ్ యొక్క శిక్షను నా నుండి ఏమాత్రం తొలగించలేకపోయింది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ هلك عنى سلطنيه

هَلَكَ عَنِّى سُلْطَـٰنِيَهْ ﴿٢٩﴾

నా వాదన మరియు నేను నమ్మకం ఉంచుకున్న బలము మరియు శక్తి నా నుండి అదృశ్యమైపోయాయి. خذوه فغلوه

خُذُوهُ فَغُلُّوهُ ﴿٣٠﴾

మరియు ఇలా పలకబడుతుంది: ఓ దైవదూతలారా అతన్ని పట్టు కోండి మరియు అతని చేతులను అతని మెడకేసి కట్టిపడేయండి

ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ ﴿٣١﴾

ఆ తరువాత అతడిని నరకములో దాని వేడిని అనుభవించటానికి ప్రవేశింపజేయండి

ثُمَّ فِى سِلْسِلَةٍۢ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًۭا فَٱسْلُكُوهُ ﴿٣٢﴾

ఆ తరువాత అతడిని డబ్బైమూరల పొడవైన గొలుసులో ప్రవేశింపజేయండి

إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ ﴿٣٣﴾

నిశ్ఛయంగా అతడు మహోన్నతుడైన అల్లా హ్ ను విశ్వసించేవాడు కాదు

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ ﴿٣٤﴾

మరియు పేదవారిని అన్నం తినిపించటంపై ఇతరులను ప్రో త్సహించేవాడు కాదు

فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَـٰهُنَا حَمِيمٌۭ ﴿٣٥﴾

ప్రళయ దినమున అతని నుండి శిక్షను తొలగించే దగ్గర బంధువు ఎవడూ అతని కొరకు ఉండరు. ولا طعام إلا من غسلين

وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍۢ ﴿٣٦﴾

నరక వాసుల శరీరాల నుండి కారే (చీము) రసం తప్ప అతను తినటానికి ఆహారముగా ఏమీ ఉండదు

لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَـٰطِـُٔونَ ﴿٣٧﴾

ఆ ఆహారమును పాపాత్ములు మరియు అవిధేయులు మాత్రమే తింటారు

فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ ﴿٣٨﴾

అల్లా హ్ మీరు చూసే వాటి గురించి ప్రమాణం చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وما لا تبصرون

وَمَا لَا تُبْصِرُونَ ﴿٣٩﴾

మరియు ఆయన మీరు చూడని వాటి గురించి ప్రమాణం చేశాడు. إنه لقول رسول كريم

إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍۢ كَرِيمٍۢ ﴿٤٠﴾

నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లా హ్ వాక్కు దాన్ని గౌరవనీయుడైన ఆయన ప్రవక్త ప్రజలకు చదివి వినిపిస్తా డు

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍۢ ۚ قَلِيلًۭا مَّا تُؤْمِنُونَ ﴿٤١﴾

మరియు అది ఏ కవి యొక్క వాక్కు కాదు ఎందుకంటే అది కవిత్వ పద్ధతిలో లేదు. మీరు చాలా తక్కువ విశ్వసిస్తు న్నారు

وَلَا بِقَوْلِ كَاهِنٍۢ ۚ قَلِيلًۭا مَّا تَذَكَّرُونَ ﴿٤٢﴾

మరియు అది ఏ జ్యోతిష్యుని వాక్కు కాదు. జ్యోతిష్యుల వాక్కు ఈ ఖుర్ఆన్ కు భిన్నంగా ఉండే విషయము. మీరు చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తు న్నారు

تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٤٣﴾

మరియు కాని అది సృష్టిరాసులందరి ప్రభువు వద్ద నుండి అవతరించబడినది

وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ ﴿٤٤﴾

మరియు ఒక వేళ ముహమ్మద్ మేము పలకని ఏవైన అబద్దపు మాటలను మాపై కల్పించుకుని ఉంటే

لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ ﴿٤٥﴾

మేము అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాము. మరియు మేము అతడిని మా బలముతో మరియు సామర్ధ్యముతో పట్టు కుంటాము

ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ ﴿٤٦﴾

ఆ పిదప మేము హృదయముతో కలిసి ఉన్న అతని నరమును కోసివేస్తా ము. فما منكم من أحد عنهحجزين

فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَـٰجِزِينَ ﴿٤٧﴾

అయితే మీలో నుండి ఎవరు దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఉండడు. అతడు మాపై కల్పించుకోవటం మీ వలన చాలా దూర విషయం. وإنه لتذكرة للمتقين

وَإِنَّهُۥ لَتَذْكِرَةٌۭ لِّلْمُتَّقِينَ ﴿٤٨﴾

మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఒక హితోపదేశము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وإنا لنعلم أن منكم م كذبين

وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ ﴿٤٩﴾

మరియు నిశ్చయంగా మీలో నుండి ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించేవాడు ఎవడో మాకు తెలుసు

وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَـٰفِرِينَ ﴿٥٠﴾

మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ పట్ల తిరస్కారము ప్రళయదినమున పెద్ద అవమానమునకు కారణమగును

وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ ﴿٥١﴾

మరియు నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లా హ్ వద్ద నుండి అవటంలో ఎటువంటి సందేహము గాని ఎటువంటి సంశయం గాని లేని నమ్మదగిన సత్యము

فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ﴿٥٢﴾

ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువుకు తగని వాటి నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడండి మరియు మహోన్నతుడైన నీ ప్రభువు నామము యొక్క స్మరణను చేయండి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Haaqqa — الحاقة

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు