ముఖపేజీతఫ్సీర్Al-Qalam (68)

తఫ్సీర్ Al-Qalam (68) — القلم

మక్కీ · 52 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

نٓ ۚ وَٱلْقَلَمِ وَمَا يَسْطُرُونَ ﴿١﴾

(నూన్) సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది. అల్లా హ్ కలముపై ప్రమాణం చేశాడు మరియు ప్రజలు తమ కలములతో వ్రాసే వాటి గురించి ప్రమాణంచేశాడు

مَآ أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍۢ ﴿٢﴾

ఓ ప్రవక్త అల్లాహ్ మీకు అనుగ్రహించిన దైవ దౌత్యము వలన మీరు పిచ్చివారు కాదు. అంతే కాదు ముష్రికులు మీపై వేస్తున్న అపనింద అయిన పిచ్చితనముతో మీకు సంబంధము లేదు. وإن لك لأجرا غيرممنون

وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍۢ ﴿٣﴾

నిశ్చయంగా మీ కొరకు మీరు ప్రజలకు సందేశాలను చేరవేసే విషయంలో అనుభవించిన బాధపై అంతం కాని పుణ్యం కలదు. దాని ద్వారా మీపై ఎవరికీ ఎటువంటి ఉపకారము లేదు. وإنك لعل خلق عظيم

وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍۢ ﴿٤﴾

మరియు నిశ్చయంగా మీరు ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన ఉత్తమ గుణాలు కలవారు. కాబట్టి మీరు అందులో ఉన్న నైతికతను పరిపూర్ణ రీతిలో పూర్తి చేసేవారు. فستبصر ويبصرون

فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ ﴿٥﴾

అయితే తొందరలోనే మీరు చూస్తా రు మరియు ఈ తిరస్కారులందరు చూస్తా రు

بِأَييِّكُمُ ٱلْمَفْتُونُ ﴿٦﴾

సత్యము తేటతెల్లం అయినప్పుడు మీలో నుండి ఎవరికి పిచ్చి ఉన్నదో స్పష్టమైపోతుంది

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ ﴿٧﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు ఎవరు ఆయన మార్గము నుండి మరలిపోయారో. దాని వైపునకు సన్మార్గం పొందేవారి గురించి ఆయనకు బాగా తెలుసు. కావున ఎవరు దాని నుండి తప్పిపోయారో ఆయనకు తెలుసు. మరియు మీరు దాని వైపునకు ఎవరిని మార్గదర్శకం చేశారో ఆయనకు తెలుసు

فَلَا تُطِعِ ٱلْمُكَذِّبِينَ ﴿٨﴾

ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారి మాట వినకండి (అనుసరించకండి). بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ود والو تدهن فيدهنون

وَدُّوا۟ لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ ﴿٩﴾

ధర్మ లెక్క విషయంలో ఒక వేళ మీరు వారి పట్ల మెతక వైఖరిని చూపి వారిపై కనికరిస్తే వారు మీ పట్ల మెతక వైఖరిని చూపి మీ పై కనికరిస్తారని ఆశించారు. ولاتطع كل حلاف مهين

وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍۢ مَّهِينٍ ﴿١٠﴾

మరియు మీరు అసత్యముపై అధికముగా ప్రమాణాలు చేసే,దిగజారిన వాడి మాటలు వినకండి

هَمَّازٍۢ مَّشَّآءٍۭ بِنَمِيمٍۢ ﴿١١﴾

ప్రజల వీపు వెనుక వారి గురించి అధికముగా చెడు ప్రస్తావన చేసేవాడి (గీబత్ చేసేవాడు) వారి మధ్య దూరాలు పెంచటానికి వారి మధ్య చాడీలు చెప్పేవాడి మాటను; م ناع للخير معتد أثيم

مَّنَّاعٍۢ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ ﴿١٢﴾

మంచిని అధికంగా నిరోధించేవాడి,ప్రజలపై వారి సంపదలలో,వారి మానమర్యాదల విషయంలో,వారి ప్రాణముల విషయంలో మితిమీరిపోయేవాడి,అధికముగా పాపాలు,అవిధేయ కార్యాలు చేసేవాడి; عتلبعد ذلك زنيم

عُتُلٍّۭ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ ﴿١٣﴾

కఠినుడు,కర్కశుడు,తన జాతివారిలో నిందార్హుడు; أن كان ذا مال وبنين

أَن كَانَ ذَا مَالٍۢ وَبَنِينَ ﴿١٤﴾

అతడు సంపద,సంతానము కలవాడని అల్లా హ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసము కనబరచటం నుండి అహంకారమును చూపాడు

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿١٥﴾

మా ఆయతులు అతనిపై చదివి వినిపించబడినప్పుడు వాడు ఇవి వ్రా యబడిన పూర్వికుల కట్టు కథలు అని అన్నాడు

سَنَسِمُهُۥ عَلَى ٱلْخُرْطُومِ ﴿١٦﴾

మేము తొందరలోనే అతని ముక్కుపై ఒక గర్తు ను పెడతాము అది అతనిలో లోపమును ఏర్పరుస్తుంది మరియు అతనికి అంటిపెట్టు కుని ఉంటుంది

إِنَّا بَلَوْنَـٰهُمْ كَمَا بَلَوْنَآ أَصْحَـٰبَ ٱلْجَنَّةِ إِذْ أَقْسَمُوا۟ لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ ﴿١٧﴾

నిశ్చయంగా మేము ఈ ముష్రికులందరిని ఏ విధంగానైతే మేము తోటవారిని పరీక్షించామో అలా కరువుకాటకాల ద్వారా మరియు ఆకలి ద్వారా పరీక్షించాము. అప్పుడు వారు ప్రొద్దిన వేళ త్వరగా వెళ్ళి వాటి ఫలాలను తప్పకుండా కోస్తామని ప్రమాణం చేశారు చివరికి దాని నుండి ఏ పేదవాడు తినకూడదు అని. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ولا يستثنون

وَلَا يَسْتَثْنُونَ ﴿١٨﴾

మరియు వారు తమ ప్రమాణంలో ఇన్ షా అల్లా హ్ అన్న తమ ఈ మాటతో మినహాయించలేదు

فَطَافَ عَلَيْهَا طَآئِفٌۭ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ ﴿١٩﴾

అప్పుడు అల్లాహ్ దానిపై అగ్నిని పంపించాడు. అప్పుడు అది దాని యజమానులు నిదురపోతుండగా తినివేసింది. వారు దాని నుండి అగ్నిని తొలగించలేకపోయారు

فَأَصْبَحَتْ كَٱلصَّرِيمِ ﴿٢٠﴾

అప్పుడు అది కటిక చీకటి రాత్రివలె నల్లగా అయిపోయింది. فتنادوا مص بحين

فَتَنَادَوْا۟ مُصْبِحِينَ ﴿٢١﴾

తెలతెల్ల వారే వేళ వారు ఒకరినొకరు పిలవసాగారు

أَنِ ٱغْدُوا۟ عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَـٰرِمِينَ ﴿٢٢﴾

ఇలా పలుకుతూ: ఒకవేళ మీరు దాని ఫలాలను కోసేవారే అయితే పేదవారు రాక ముందే మీరు మీ పంట వద్దకు ఉదయాన్నే బయలుదేరండి

فَٱنطَلَقُوا۟ وَهُمْ يَتَخَـٰفَتُونَ ﴿٢٣﴾

అప్పుడు వారు తమ చేను వద్దకు తొందర చేస్తూ ఒకరితో ఒకరు నెమ్మది స్వరముతో పలుకుతూ బయలుదేరారు

أَن لَّا يَدْخُلَنَّهَا ٱلْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌۭ ﴿٢٤﴾

వారు ఒకరినొకరు ఇలా పలకసాగారు: ఈ రోజు మీ వద్దకు తోటకాడ ఏ పేదవాడు రాకూడదు. وغدواعل حرد قدرين

وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍۢ قَـٰدِرِينَ ﴿٢٥﴾

వారు తమ ఫలముల నుండి వారిని ఆపటంపై దృఢ నిర్ణయం చేసుకుంటూ ఉదయ మొదటి వేళలో బయలు దేరారు

فَلَمَّا رَأَوْهَا قَالُوٓا۟ إِنَّا لَضَآلُّونَ ﴿٢٦﴾

ఎప్పుడైతే వారు దాన్ని కాలిపోయి ఉండగా చూశారో వారు ఒకరినొకరు మేము దాని దారి తప్పిపోయాము అని అన్నారు. بل نحن محرومون

بَلْ نَحْنُ مَحْرُومُونَ ﴿٢٧﴾

కాదు కాదు దాని నుండి పేదలను ఆపే మన గట్టి నిర్ణయం వలన మేము దాని ఫలాలను కోయటం నుండి ఆపబడ్డా ము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ قال أوسطهم ألم أقل ل كم لولا تسبحون

قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ ﴿٢٨﴾

వారిలో ఉన్నతుడు ఇలా పలికాడు: మీరు పేదవారిని దాని నుండి ఆపటంపై గట్టి నిర్ణయం ఏదైతే చేసుకున్నారో అప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎందుకు అల్లా హ్ పరిశుద్ధతను కొనియాడటం లేదు మరియు ఆయన వైపునకు పశ్ఛాత్తా పముతో మరలటం లేదు అని మీతో చెప్పలేదా ?!

قَالُوا۟ سُبْحَـٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَـٰلِمِينَ ﴿٢٩﴾

వారు ఇలా పలికారు: మా ప్రభువు పరిశుద్ధు డు. మా తోట ఫలముల నుండి పేదవారిని ఆపటం పై మేము గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మా స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డా ము. فأقبل بعضهم عل بعض يتلومون

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ يَتَلَـٰوَمُونَ ﴿٣٠﴾

అప్పుడు వారు నిందించుకునే దారిలో తమ మాటల్లో తిరోగమునకు ముందడుగు వేశారు

قَالُوا۟ يَـٰوَيْلَنَآ إِنَّا كُنَّا طَـٰغِينَ ﴿٣١﴾

వారు అవమానముతో కృంగిపోతూ ఇలా పలికారు: అయ్యో మా నష్టము. నిశ్చయంగా మేము పేదవారిని వారి హక్కు నుండి ఆపి హద్దును అతిక్రమించిన వారిలో అయిపోయాము

عَسَىٰ رَبُّنَآ أَن يُبْدِلَنَا خَيْرًۭا مِّنْهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ ﴿٣٢﴾

బహుశా మా ప్రభువు తోట కన్న మేలైనది మాకు బదులుగా ప్రసాదిస్తా డు. నిశ్చయంగా మేము అల్లా హ్ ఒక్కడినే కోరుతున్నాము. మేము ఆయన నుండి మన్నింపును ఆశిస్తు న్నాము మరియు ఆయనతో మేలును కోరుతున్నాము

كَذَٰلِكَ ٱلْعَذَابُ ۖ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ ﴿٣٣﴾

ఆహారోపాధి నుండి దూరం చేసి ఈ శిక్ష లాగే మేము మాపై అవిధేయత చూపే వారిని శిక్షిస్తా ము. మరియు పరలోక శిక్ష ఎంతో పెద్దది ఒక వేళ వారు దాని తీవ్రతను,దాని శాశ్వతను తెలుసుకుంటే

إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّـٰتِ ٱلنَّعِيمِ ﴿٣٤﴾

నిశ్చయంగా అల్లా హ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారి కొరకు వారి ప్రభువు వద్ద అనుగ్రహ భరితమైన స్వర్గ వనాలు కలవు. వారు అందులో పరమానందమవుతారు. వారి అనుగ్రహాలు అంతం కావు

أَفَنَجْعَلُ ٱلْمُسْلِمِينَ كَٱلْمُجْرِمِينَ ﴿٣٥﴾

ఏమీ మేము ప్రతిఫల విషయంలో ముస్లిములను అవిశ్వాసపరులుగా చేస్తా మా ఏవిధంగానైతే మక్కా వాసుల్లోంచి ముష్రికులు వాదించేవారో అలా ?! مالكم كيف تحكمون

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ﴿٣٦﴾

ఓ ముష్రికులారా మీకు ఏమయింది మీరు ఎలా ఈ అన్యాయమైన,వక్రమమైన తీర్పునిస్తు న్నారు ?! بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أم لكم كتب فيهتدرسون

أَمْ لَكُمْ كِتَـٰبٌۭ فِيهِ تَدْرُسُونَ ﴿٣٧﴾

లేదా మీ వద్ద ఏదైన పుస్తకం ఉన్నదా అందులో మీరు విధేయుడికి మరియు అవిధేయుడికి మధ్య సమానత ఉన్నట్లు చదువుతున్నారా ?! إن لكم فيه لما تخيرون

إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ ﴿٣٨﴾

నిశ్చయంగా మీ కొరకు ఆ పుస్తకములో మీరు పరలోకములో మీ కొరకు మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అది ఉన్నదా

أَمْ لَكُمْ أَيْمَـٰنٌ عَلَيْنَا بَـٰلِغَةٌ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ ۙ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ ﴿٣٩﴾

లేదా మీ కొరకు మా వద్ద మీరు మీ స్వయం కొరకు ఏవైతే నిర్ణయించుకుంటారో అవి ఉన్నట్లు తాకీదు చేయబడ్డ ప్రమాణాలు ఉన్నాయా?! سلهم أي هم بذلك زعيم

سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ ﴿٤٠﴾

ఓ ప్రవక్తా మీరు ఈ మాటను పలికిన వారిని అడగండి వారిలో నుండి ఎవరు దీనికి హామిగా ఉంటాడు ?!

أَمْ لَهُمْ شُرَكَآءُ فَلْيَأْتُوا۟ بِشُرَكَآئِهِمْ إِن كَانُوا۟ صَـٰدِقِينَ ﴿٤١﴾

లేదా వారి కొరకు అల్లా హ్ కాకుండా ఎవరైన భాగస్వాములు ఉన్నారా వారు వారిని ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులుగా చేస్తు న్నారా ?! అయితే వారు తమ ఈ భాగస్వాములందరిని తీసుకుని రావాలి ఒక వేళ వారు తాము వాదిస్తున్న విషయమైన వారు ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులు అన్న దానిలో సత్యవంతులే అయితే

يَوْمَ يُكْشَفُ عَن سَاقٍۢ وَيُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ ﴿٤٢﴾

ప్రళయదినమున భయానక పరిస్థితి బహిర్గతమవుతుంది మరియు మన ప్రభువు తన పిక్కను బహిర్గతం చేస్తా డు. మరియు ప్రజలు సాష్టాంగపడటం వైపు పిలవబడుతారు. అప్పుడు విశ్వాసపరులు సాష్టాంగపడుతారు. మరియు అవిశ్వాసపరులు మరియు కపటులు ఉండిపోతారు. వారు సాష్టాంగం చేయలేకపోతారు

خَـٰشِعَةً أَبْصَـٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌۭ ۖ وَقَدْ كَانُوا۟ يُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ وَهُمْ سَـٰلِمُونَ ﴿٤٣﴾

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి,వారిపై అవమానము,పరాభవము ఆవరించి ఉంటుంది. వాస్తవానికి ఇహలోకంలో వారితో అల్లాహ్ కు సాష్టాంగపడమని కోరబడేది మరియు వారు ఈ రోజు ఉన్న దాని కంటే ఆరోగ్యంగా ఉండేవారు

فَذَرْنِى وَمَن يُكَذِّبُ بِهَـٰذَا ٱلْحَدِيثِ ۖ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ ﴿٤٤﴾

ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు మీ పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారిని వదలండి. మేము తొందరలోనే వారిని శిక్ష వైపునకు క్రమక్రమంగా తీసుకుని వెళతాము ఎలాగంటే అది వారిపట్ల వ్యూహమని మరియు వారిని నెమ్మదిగా తీసుకెళ్ళబడటం అని వారికి తెలియదు

وَأُمْلِى لَهُمْ ۚ إِنَّ كَيْدِى مَتِينٌ ﴿٤٥﴾

మరియు వారు తమ పాపములో పెరిగిపోవటానికి నేను వారికి కొంత కాలం గడువిస్తాను. నిశ్చయంగా నా వ్యూహం అవిశ్వాసపరుల పట్ల మరియు తిరస్కారుల పట్ల దృఢమైనది. వారు నా నుండి తప్పించుకోలేరు. మరియు నా శిక్ష నుండి భద్రంగా ఉండరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ أم تسٔلهم أجرا فهم من مغرم مثقلون

أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًۭا فَهُم مِّن مَّغْرَمٍۢ مُّثْقَلُونَ ﴿٤٦﴾

ఓ ప్రవక్తా వారిని మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో దానిపై ఏదైన ప్రతిఫలం వారితో మీరు కోరారా వారు దాని కారణం వలన పెద్ద విషయాన్ని మోస్తు న్నారు. కావున అది మీ నుండి విముఖత చూపటానికి కారణమా ?! వాస్తవం మరోలా ఉన్నది. మీరు వారితో ఎటువంటి ప్రతిఫలమును అడగలేదు. అలాగైతే మిమ్మల్ని అనుసరించటం నుండి వారిని ఏది ఆటంకపరుస్తుంది?

أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ ﴿٤٧﴾

లేదా వారి వద్ద అగోచర జ్ఞా నం ఉన్నదా కాబట్టి వారు తమకు ఇష్టమైన వాదనలు వేటితోనైతే మీతో వాదిస్తు న్నారో వాటిని వ్రా స్తు న్నారా ?!

فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌۭ ﴿٤٨﴾

అయితే ఓ ప్రవక్త మీ ప్రభువు వారికి గడువిచ్చి నెమ్మదిగా తీసుకుని వెళ్లే ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానిపై సహనం చూపండి. మరియు తన జాతివారితో విసుగు చెందిన చేప వారైన యూనుస్ అలైహిస్సలాం మాదిరిగా మీరు అవకండి. అప్పుడు అతను సముద్రపు చీకటిలో మరియు చేప కడుపు చీకటిలో బాధలో ఉన్న స్థితిలో తన ప్రభువును పిలిచాడు

لَّوْلَآ أَن تَدَٰرَكَهُۥ نِعْمَةٌۭ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلْعَرَآءِ وَهُوَ مَذْمُومٌۭ ﴿٤٩﴾

ఒక వేళ అతనికి దైవ కారుణ్యమే చేరకుండా ఉంటే చేప అతడిని నిందించబడిన స్థితిలో ఖాళీ నేలలో విసిరివేసేది

فَٱجْتَبَـٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّـٰلِحِينَ ﴿٥٠﴾

అయితే అతని ప్రభువుఅతడిని ఎన్నుకుని అతడిని తన పుణ్య దాసుల్లో చేశాడు

وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَيُزْلِقُونَكَ بِأَبْصَـٰرِهِمْ لَمَّا سَمِعُوا۟ ٱلذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجْنُونٌۭ ﴿٥١﴾

అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు దగ్గర దగ్గర మీ వైపు వారి తీవ్ర పదునైన చూపులతో మిమ్మల్ని పడవేసేటట్లు న్నారు ఎప్పుడైతే వారు మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను విన్నారో. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరిస్తూ మరియు సత్యము నుండి విముఖత చూపుతూ ఇలా పలికేవారు: నిశ్ఛయంగా దీన్ని తీసుకుని వచ్చిన ప్రవక్త పిచ్చివాడు. وما هو إلا ذكر للعلمين

وَمَا هُوَ إِلَّا ذِكْرٌۭ لِّلْعَـٰلَمِينَ ﴿٥٢﴾

మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ మానవులకు,జిన్నులకు ఒక హితోపదేశము మరియు ఒక జ్ఞా పిక మాత్రమే. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Qalam — القلم

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు