ముఖపేజీతఫ్సీర్Al-Mulk (67)

తఫ్సీర్ Al-Mulk (67) — الملك

మక్కీ · 30 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

تَبَـٰرَكَ ٱلَّذِى بِيَدِهِ ٱلْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌ ﴿١﴾

ఒక్కడైన ఆయన చేతిలో రాజ్యాధికారము కలిగిన అల్లా హ్ మేలు ఎంతో అధికము మరియు ఎక్కువ. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదినూ అశక్తు డిని చేయదు

ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًۭا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ ﴿٢﴾

ఆయనే ఓ ప్రజలారా మీలో నుంచి ఆచరణ పరంగా మంచివారో పరీక్షించటం కొరకు మరణమును,జీవనమును సృష్టించాడు. ఆయనే ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తా పడే వారి పాపములను మన్నించేవాడును

ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَـٰوَٰتٍۢ طِبَاقًۭا ۖ مَّا تَرَىٰ فِى خَلْقِ ٱلرَّحْمَـٰنِ مِن تَفَـٰوُتٍۢ ۖ فَٱرْجِعِ ٱلْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍۢ ﴿٣﴾

ఆయనే సప్త ఆకాశములను సృష్టించాడు. ప్రతీ ఆకాశము దాని ముందు ఉన్న దాని పై ఉండి ఒక ఆకాశము ఇంకో ఆకాశమునకు అంటిపెట్టు కుని లేనట్లు గా ఉన్నది. ఓ సందర్శకుడా నీవు అల్లా హ్ సృష్టించిన దానిలో ఎటువంటి హెచ్చు తగ్గు లను మరియు అస్తవ్యస్తతను చూడలేవు. కావున నీవు దృష్టిని సారించు ఏమీ నీవు ఏదైన పగులును లేదా బీటలను చూశావా ?! నీవు ఖచ్చితంగా దాన్ని చూడలేవు. నీవు మాత్రం ఒక నిర్మాణాత్మకమైన విస్తృతమైన సృష్టిని చూస్తా వు

ثُمَّ ٱرْجِعِ ٱلْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ ٱلْبَصَرُ خَاسِئًۭا وَهُوَ حَسِيرٌۭ ﴿٤﴾

ఆ తరువాత నీవు పదే పదే దృష్టిని సారించు నీ చూపులు ఎటువంటి లోపమును గాని అస్తవ్యస్తతను చూడ లేక నిరాశులై నీ వైపునకు మరలుతాయి. మరియు అవి చూడలేక అలసిపోయి ఉంటాయి

وَلَقَدْ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِمَصَـٰبِيحَ وَجَعَلْنَـٰهَا رُجُومًۭا لِّلشَّيَـٰطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ ٱلسَّعِيرِ ﴿٥﴾

మరియు మేము భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రా లతో అలంకరించాము. మరియు మేము ఆ నక్షత్రా లను అగ్ని జ్వాలలుగా చేశాము. దొంగ చాటుగా వినే షైతానులు వాటి ద్వారా కొట్టబడుతారు. మరియు అవి వారిని దహించి వేస్తా యి. మరియు మేము పరలోకంలో వారి కొరకు భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము

وَلِلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ ٱلْمَصِيرُ ﴿٦﴾

మరియు తమ ప్రభువును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున మండుతున్న అగ్ని శిక్ష కలదు. వారు దేనివైపునైతే మరలి వెళ్ళుతున్నారో ఆ మరలే స్థా నము ఎంతో చెడ్డది

إِذَآ أُلْقُوا۟ فِيهَا سَمِعُوا۟ لَهَا شَهِيقًۭا وَهِىَ تَفُورُ ﴿٧﴾

వారు నరకాగ్నిలో విసిరి వేయబడినప్పుడు వారు తీవ్రమైన భయంకరమైన గర్జనను వింటారు. మరియు అది కుండ ఉడికినట్లు ఉడకబెట్టబడుతుంటుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلْغَيْظِ ۖ كُلَّمَآ أُلْقِىَ فِيهَا فَوْجٌۭ سَأَلَهُمْ خَزَنَتُهَآ أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌۭ ﴿٨﴾

దాదాపు దాని కొంతభాగము దానిలో ప్రవేశించేవారిపై తీవ్రమైన కోపము వలన ప్రేలిపోయి వేరైపోయినట్లుగా ఉంటుంది. అవిశ్వాసపరులైన దాని వాసుల్లోంచి ఒక సమూహం అందులో విసిరివేయబడినప్పుడు దాని బాధ్యత వహించే దూతలు వారిని గద్దిస్తూ ఇలా ప్రశ్నిస్తా రు: ఏమీ అల్లా హ్ శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టే ఒక ప్రవక్త ఇహలోకంలో మీ వద్దకు రాలేదా ?

قَالُوا۟ بَلَىٰ قَدْ جَآءَنَا نَذِيرٌۭ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَىْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِى ضَلَـٰلٍۢ كَبِيرٍۢ ﴿٩﴾

మరియు అవిశ్వాసపరులు ఇలా సమాధానమిస్తా రు: ఎందుకు రాలేదు. అల్లా హ్ శిక్ష నుండి మమ్మల్ని భయపెడుతూ ఒక ప్రవక్త మా వద్దకు వచ్చాడు. అప్పుడు మేము అతన్ని తిరస్కరించి అతనితో ఇలా పలికాము: అల్లా హ్ ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. ఓ ప్రవక్తల్లా రా మీరు మాత్రం సత్యము నుండి ఘోర అపమార్గములో ఉన్నారు

وَقَالُوا۟ لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِىٓ أَصْحَـٰبِ ٱلسَّعِيرِ ﴿١٠﴾

మరియు అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు: ఒక వేళ మేము ప్రయోజనం చెందే విధంగా విని ఉంటే లేదా అసత్యము నుండి సత్యమును వేరు చేసే వారి బుద్ది లాగా మేము అర్ధం చేసుకుని ఉంటే మేము నరక వాసులందరితో ఉండేవారము కాదు. అంతే కాదు మేము ప్రవక్తలను విశ్వసించి వారు తీసుకుని వచ్చిన దాన్ని దృవీకరించి ఉండేవారము. మరియు మేము స్వర్గ వాసుల్లోంచి అయి ఉండేవారము

فَٱعْتَرَفُوا۟ بِذَنۢبِهِمْ فَسُحْقًۭا لِّأَصْحَـٰبِ ٱلسَّعِيرِ ﴿١١﴾

అప్పుడు వారు స్వయంగా అవిశ్వసించిన దాన్ని,తిరస్కరించిన దాన్ని అంగీకరిస్తా రు. అప్పుడు వారు నరకానికి అర్హులవుతారు. కావున నరక వాసుల కొరకు (దైవ కారుణ్యం) దూరమవుగాక

إِنَّ ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ لَهُم مَّغْفِرَةٌۭ وَأَجْرٌۭ كَبِيرٌۭ ﴿١٢﴾

నిశ్చయంగా ఎవరైతే తమ ఏకాంతములో అల్లాహ్ తో భయపడుతారో వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము

وَأَسِرُّوا۟ قَوْلَكُمْ أَوِ ٱجْهَرُوا۟ بِهِۦٓ ۖ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴿١٣﴾

ఓ ప్రజలారా మీరు మీ మాటలను గోప్యంగా ఉంచి పలికినా లేదా వాటిని బహిరంగంగా పలికినా అల్లా హ్ వాటి గురించి తెలుసుకుంటాడు. నిశ్చయంగా పరిశుద్ధు డైన ఆయనకు తన దాసుల హృదయముల్లో ఉన్నది బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلْخَبِيرُ ﴿١٤﴾

సృష్టిరాసులన్నింటిని సృష్టించిన వాడికి రహస్యము గురించి మరియు రహస్యము కన్న గోప్యమైన వాటి గురించి తెలియదా ?! మరియు ఆయన తన దాసుల పట్ల సూక్ష్మ గ్రా హి,వారి వ్యవహారముల గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

هُوَ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ ذَلُولًۭا فَٱمْشُوا۟ فِى مَنَاكِبِهَا وَكُلُوا۟ مِن رِّزْقِهِۦ ۖ وَإِلَيْهِ ٱلنُّشُورُ ﴿١٥﴾

ఆయనే భూమిని మీ కొరకు దానిపై నివాసముండటానికి సౌలభ్యముగా,మరియు మెత్తగా చేశాడు. కావున మీరు దాని ప్రక్కలలో,దాని మార్గముల్లో నడవండి. మరియు ఆయన అందులో మీ కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆయన ఆహారోపాధిలో నుండి తినండి. మరియు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు మరణాంతరం లేపబడి వెళ్ళటం ఆయన ఒక్కడివైపే. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ءَأَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يَخْسِفَ بِكُمُ ٱلْأَرْضَ فَإِذَا هِىَ تَمُورُ ﴿١٦﴾

ఏమీ ఆకాశముల్లో ఉన్న అల్లా హ్ భూమిని ఖారూన్ క్రింది నుండి అది నివాసమునకు సౌలభ్యంగా,యోగ్యంగా ఉన్నతరువాత కూడా చీల్చినట్లు మీ క్రింది నుండి చీల్చుతాడన్న దాని నుండి నిర్భయులైపోయారా ?!. అప్పుడు అది స్థిరంగా ఉన్న తరువాత కూడా మిమ్మల్ని తీసుకుని ప్రకంపిస్తుంది

أَمْ أَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًۭا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ ﴿١٧﴾

లేదా ఆకాశముల్లో ఉన్న అల్లా హ్ లూత్ జాతి వారిపై రాళ్ళను కురిపించినట్లు మీపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించడని నిర్భయులైపోయారా ?!. మీరు నా శిక్షను కళ్ళారా చూసినప్పుడు మీకు నా హెచ్చరిక ఎలా ఉందో మీరు తెలుసుకుంటారు. కాని మీరు శిక్షను కళ్ళారా చూసిన తరువాత దాని నుండి ప్రయోజనం చెందలేరు

وَلَقَدْ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ ﴿١٨﴾

నిశ్చయంగా ఈ ముష్రికులందరి కన్న ముందు గతించిన సమాజాల వారు తిరస్కరించారు. వారు తమ అవిశ్వాసంపై,తమ తిరస్కారంపై మొండిగా వ్యవహరించినప్పుడు అల్లా హ్ శిక్ష వారిపై అవతరించింది. అయితే వారిపై నా శిక్ష ఎలా ఉందో ?! నిశ్చయంగా అది తీవ్రమైన శిక్షగా అయినది

أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلطَّيْرِ فَوْقَهُمْ صَـٰٓفَّـٰتٍۢ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا ٱلرَّحْمَـٰنُ ۚ إِنَّهُۥ بِكُلِّ شَىْءٍۭ بَصِيرٌ ﴿١٩﴾

ఏమీ ఈ తిరస్కారులందరు తమపై పక్షులను అవి ఎగిరేటప్పుడు చూడటంలేదా అవి తమ రెక్కలను గాలిలో ఒక సారి చాపితే ఇంకోసారి వాటిని తమ వైపు ముడుచుకుంటున్నాయి. అవి భూమిపై పడిపోకుండా వాటిని అల్లా హ్ మాత్రమే అదిమిపట్టి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ప్రతీది చూస్తు న్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

أَمَّنْ هَـٰذَا ٱلَّذِى هُوَ جُندٌۭ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحْمَـٰنِ ۚ إِنِ ٱلْكَـٰفِرُونَ إِلَّا فِى غُرُورٍ ﴿٢٠﴾

ఓ అవిశ్వాసపరులారా ఒక వేళ అల్లా హ్ మిమ్మల్ని శిక్షించదలచితే అల్లా హ్ శిక్షను మీ నుండి ఆపే ఏ సైన్యము మీ కొరకు లేదు. అవిశ్వాసపరులు మాత్రం మోసగించబడి ఉన్నారు. వారిని షైతాను మోసం చేశాడు. అతనితో వారు మోసపోయారు

أَمَّنْ هَـٰذَا ٱلَّذِى يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُۥ ۚ بَل لَّجُّوا۟ فِى عُتُوٍّۢ وَنُفُورٍ ﴿٢١﴾

ఒక వేళ అల్లాహ్ తన ఆహారోపాధిని మీకు చేరటం నుండి ఆపివేస్తే మీకు ఆహారమును ప్రసాదించేవాడు ఎవడూ ఉండడు. కాని జరిగిందేమిటంటే అవిశ్వాసపరులు వ్యతిరేకతలో,అహంకారంలో,సత్యము నుండి ఆగిపోవటంలో కొనసాగిపోయారు

أَفَمَن يَمْشِى مُكِبًّا عَلَىٰ وَجْهِهِۦٓ أَهْدَىٰٓ أَمَّن يَمْشِى سَوِيًّا عَلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ ﴿٢٢﴾

ఏమీ తన ముఖంపై తల క్రిందలై నడిచేవాడు - అతడు ముష్రికు - ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా లేదా సన్మార్గంపై తిన్నగా నడిచే విశ్వాసపరుడు ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా ?!

قُلْ هُوَ ٱلَّذِىٓ أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۖ قَلِيلًۭا مَّا تَشْكُرُونَ ﴿٢٣﴾

ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: అల్లా హ్ యే మిమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు వినే చెవులను మరియు మీరు చూసే కళ్ళను మరియు మీరు అర్ధం చేసుకునే హృదయములను చేశాడు. ఆయన మీకు అనుగ్రహించిన అనుగ్రహాలపై మీరు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قُلْ هُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ﴿٢٤﴾

ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: అల్లా హ్ యే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు అందులో విస్తరింపజేశాడు. ఏమీ సృష్టించలేనటువంటి మీ విగ్రహాలు కాదు. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు. మీ విగ్రహాల వైపు కాదు. కావున మీరు ఆయనతో భయపడండి. మరియు ఆయన ఒక్కడినే ఆరాధించండి

وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٢٥﴾

మరణాంతరం లేపబడటంను దూరంగా భావిస్తూ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వారు ఇలా పలికేవారు: ఓ ముహమ్మద్ నీవు మరియు నీ సహచరులు మాతో చేసిన ఈ వాగ్దా నము ఎప్పుడు పూర్తి కానున్నది ఒక వేళ మీరు అది రాబోతున్నదని మీ వాదనలో మీరు సత్యవంతులే అయితే ?!

قُلْ إِنَّمَا ٱلْعِلْمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌۭ مُّبِينٌۭ ﴿٢٦﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: నిశ్చయంగా ప్రళయము యొక్క జ్ఞానము అల్లా హ్ వద్ద ఉన్నది. అది ఎప్పుడు వాటిల్లు తుందో ఆయనకు మాత్రమే తెలుసు. నేను మాత్రం మీకు స్పష్టంగా హెచ్చరించేవాడిని

فَلَمَّا رَأَوْهُ زُلْفَةًۭ سِيٓـَٔتْ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُوا۟ وَقِيلَ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَدَّعُونَ ﴿٢٧﴾

ఎప్పుడైతే వారిపై వాగ్దా నం వచ్చిపడి వారు శిక్షను తమకు దగ్గరవటమును కళ్లారా చూసినప్పుడు అది ప్రళయదినము అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖములు మారిపోతాయి మరియు నల్లగా మారిపోతాయి. మరియు వారితో ఇలా పలకబడును: ఇది అదే దేనినైతే మీరు ఇహలోకంలో కోరేవారో మరియు తొందరపెట్టేవారో

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَهْلَكَنِىَ ٱللَّهُ وَمَن مَّعِىَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلْكَـٰفِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍۢ ﴿٢٨﴾

ఓ ప్రవక్తా ఈ తిరస్కరించే ముష్రికులతో వారిని ఖండిస్తూ ఇలా పలకండి: మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లా హ్ నన్ను మరణింపజేసి, నాతోపాటు ఉన్న విశ్వాసపరులను మరణింపజేస్తే అవిశ్వాసపరులని బాధాకరమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తా రు ?!. దాని నుండి వారిని ఎవరూ రక్షించరు

قُلْ هُوَ ٱلرَّحْمَـٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِى ضَلَـٰلٍۢ مُّبِينٍۢ ﴿٢٩﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి: అనంత కరుణామయుడు అయిన ఆయనే మిమ్మల్ని తన ఒక్కడి ఆరాధన వైపు పిలుస్తు న్నాడు. మేము ఆయన్ని విశ్వసించాము. మా వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే మేము నమ్మకమును కలిగి ఉన్నాము. మీరు తొందరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరు స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారో ఎవరు సన్మార్గంపై ఉన్నారో

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَصْبَحَ مَآؤُكُمْ غَوْرًۭا فَمَن يَأْتِيكُم بِمَآءٍۢ مَّعِينٍۭ ﴿٣٠﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: మీరు నాకు చెప్పండి ఒక వేళ మీరు త్రా గే నీరు మీరు చేరలేనంత వరకు భూమి లోతులో అయిపోతే మీ వద్దకు ఎక్కువగా ప్రవహించే నీరును ఎవరు తీసుకుని వస్తా రు ?! అల్లా హ్ తప్ప ఎవరూ కాదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Mulk — الملك

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు