ముఖపేజీతఫ్సీర్Al-Waaqia (56)

తఫ్సీర్ Al-Waaqia (56) — الواقعة

మక్కీ · 96 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ ﴿١﴾

ప్రళయం ఖచ్చితంగా సంభవించినప్పుడు. ليس لوقعتها كاذبة

لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ﴿٢﴾

ఇహలోకంలో తిరస్కరించినట్లు దాన్ని తిరస్కరించే ఏ ప్రా ణము దొరకదు. خافضة ر افعة

خَافِضَةٌۭ رَّافِعَةٌ ﴿٣﴾

అది అపరాధులైన అవిశ్వాసపరులను వారిని నరకములో ప్రవేశింపజేసి హీనపరిచేది,దైవభీతి కలిగిన విశ్వాసపరులను వారిని స్వర్గములో ప్రవేశింపజేసి ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది. ج

إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّۭا ﴿٤﴾

భూమి తీవ్రంగా కంపించబడినప్పుడు, س

وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّۭا ﴿٥﴾

మరియుపర్వతాలుతుత్తు నియలుగా చేయబడినప్పుడు, ث

فَكَانَتْ هَبَآءًۭ مُّنۢبَثًّۭا ﴿٦﴾

అప్పుడు తుత్తు నియలుగా చేయటం వలన అవి స్థిరత్వం లేని చెల్లా చెదురయ్యే ధూళిఅయిపోతాయి. وكنتم أزوجا ثلثة

وَكُنتُمْ أَزْوَٰجًۭا ثَلَـٰثَةًۭ ﴿٧﴾

ఆ రోజున మీరు మూడు రకాలుగా (వర్గములుగా) అయిపోతారు

فَأَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَـٰبُ ٱلْمَيْمَنَةِ ﴿٨﴾

ఇక తమ కుడి చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే కుడి పక్షము వారు. వారి స్థా నము ఎంత గొప్పదైనది మరియు ఎంత ఉన్నతమైనది!

وَأَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَـٰبُ ٱلْمَشْـَٔمَةِ ﴿٩﴾

మరియు తమ ఎడమ చేతులతో తమ కర్మల పుస్తకములను తీసుకునే ఎడమ పక్షం వారు. వారి స్ధా నము ఎంత దిగజారినది మరియు ఎంత చెడ్డది

وَٱلسَّـٰبِقُونَ ٱلسَّـٰبِقُونَ ﴿١٠﴾

ఇహలోకములో సత్కర్మలు చేయటంలో ముందుండేవారు పరలోకంలో వారే స్వర్గంలో ప్రవేశము కొరకు ముందుంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أُو۟لَـٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ ﴿١١﴾

వారందరే అల్లా హ్ సాన్నిధ్యమును పొందేవారు

فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ ﴿١٢﴾

వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో రకరకాల అనుగ్రహములను అనుభవిస్తూ ఉంటారు

ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ ﴿١٣﴾

ఈ సమాజము నుండి మరియు పూర్వ సమాజముల నుండి ఒక పెద్ద వర్గము,

وَقَلِيلٌۭ مِّنَ ٱلْـَٔاخِرِينَ ﴿١٤﴾

మరియు చివరి కాలము నాటి ప్రజల్లోంచి కొంత మంది వారే సాన్నిధ్యమును పొంది ముందు ఉండేవారు. عل سرر موضونة

عَلَىٰ سُرُرٍۢ مَّوْضُونَةٍۢ ﴿١٥﴾

వారు బంగారముతో నేయబడిన పీఠాలపై ఉంటారు. متكٔين عليها متقبلين

مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَـٰبِلِينَ ﴿١٦﴾

వారు ఈ పీఠాలపై అభిముఖమై ఎదురుబదురుగా అనుకుని కూర్చుని ఉంటారు. వారిలోని ఏ ఒక్కరు ఇతరుల వెనుక వైపు చూడరు. يطوف عليهم ولدن مخلدون

يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌۭ مُّخَلَّدُونَ ﴿١٧﴾

వారి సేవ కొరకు చిన్న పిల్లలు వారి మధ్య తిరుగుతుంటారు వారికి వృద్ధా ప్యము గాని వినాశనం గాని ముట్టు కోదు. بأ ك واب وأباريق وكأس من م عين

بِأَكْوَابٍۢ وَأَبَارِيقَ وَكَأْسٍۢ مِّن مَّعِينٍۢ ﴿١٨﴾

స్వర్గంలో వారు ప్రవహించే మధ్యముతో నిండిన కడయమలు లేని పాత్రలను మరియు కడియములు కల కూజాలను మరియు గ్లా సులను తీసుకుని వారి మధ్య తిరుగుతుంటారు. لا يصدعون عنها ولا ينزفون

لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ ﴿١٩﴾

అది ఇహలోక మధ్యము వలే ఉండదు. దాన్ని సేవించే వారికి ఎటువంటి తలనొప్పి గాని మతి కోల్పోవటం గాని సంభవించదు. وفكهة مما يتخيرون

وَفَـٰكِهَةٍۢ مِّمَّا يَتَخَيَّرُونَ ﴿٢٠﴾

ఈ పిల్లలందరు వారి మధ్య వారు కోరుకునే ఫలాలలను తీసుకుని తిరుగుతుంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ولحم طير مما يشتهون

وَلَحْمِ طَيْرٍۢ مِّمَّا يَشْتَهُونَ ﴿٢١﴾

మరియు వారు వారి మనస్సులు కోరుకునే పక్షుల మాంసమును తీసుకుని తిరుగుతుంటారు. وحور عين

وَحُورٌ عِينٌۭ ﴿٢٢﴾

మరియు వారి కొరకు స్వర్గములో అందములో విశాలమైన కనులు కల స్త్రీలు ఉంటారు

كَأَمْثَـٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ ﴿٢٣﴾

గవ్వల్లో దాయబడిన ముత్యాల వలే ఉంటారు

جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٢٤﴾

వారు ఇహలోకములో చేసుకున్న సత్కర్మలకు వారికి ప్రతిఫలముగా. لا يسمعون فيها لغوا ولا تأثيما

لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا تَأْثِيمًا ﴿٢٥﴾

వారు స్వర్గములో అశ్లీల మాటలను వినరు మరియు దాని వాసుల నుండి ఎటువంటి పాపము జరగదు. إلا قيلا سلما سلما

إِلَّا قِيلًۭا سَلَـٰمًۭا سَلَـٰمًۭا ﴿٢٦﴾

వారికి దైవదూతలు సలాము చేయటమును మరియు వారు ఒకరినొకరు సలాం చేసుకోవటమును మాత్రమే వారు వింటారు

وَأَصْحَـٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَـٰبُ ٱلْيَمِينِ ﴿٢٧﴾

కుడి పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రాలైతే వారి కుడి చేతులలో ఇవ్వబడుతాయో అల్లా హ్ వద్ద వారి స్థా నము మరియు వారి విషయము ఎంతో గొప్పది. فى سدر مخضود

فِى سِدْرٍۢ مَّخْضُودٍۢ ﴿٢٨﴾

(వారు) ముళ్ళు కోయబడిన రేగు చెట్ల మధ్య ఉంటారు. అందులో ఎటువంటి బాధ ఉండదు. وطلح م نضود

وَطَلْحٍۢ مَّنضُودٍۢ ﴿٢٩﴾

మరియుఒక దానిపై ఒకటి వరుసగా పేర్చబడిన అరటి పండ్ల మధ్యలో ఉంటారు. وظل م مدود

وَظِلٍّۢ مَّمْدُودٍۢ ﴿٣٠﴾

మరియు వాలని నిరంతరాయంగా విస్తరించిన నీడలో ఉంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَآءٍۢ مَّسْكُوبٍۢ ﴿٣١﴾

మరియు ఆగకుండా ప్రవహించే నీటిలో ఉంటారు. وفكهةكثيرة

وَفَـٰكِهَةٍۢ كَثِيرَةٍۢ ﴿٣٢﴾

మరియు పరిమితం కాని చాలా పండ్లలో ఉంటారు. لا مقطوعة ولا ممنوعة

لَّا مَقْطُوعَةٍۢ وَلَا مَمْنُوعَةٍۢ ﴿٣٣﴾

అవి వారి నుండి ఎన్నటికి అంతమవవు. ఎందుకంటే వాటికి ఎటువంటి కాలం (సీజన్) లేదు. వాటిని వారు ఏ సమయంలో కోరినా ఎటువంటి అభ్యంతరం వాటిని నిరోధించదు. وفرش م رفوعة

وَفُرُشٍۢ مَّرْفُوعَةٍ ﴿٣٤﴾

మరియు ఆసనాలపై ఉంచబడిన ఎత్తైన పరుపుల మధ్య ఉంటారు

إِنَّآ أَنشَأْنَـٰهُنَّ إِنشَآءًۭ ﴿٣٥﴾

నిశ్ఛయంగా మేమే ప్రస్తా వించబడిన హూరెయీన్ లను అసాధరణ రీతిలో సృష్టించాము. فجعلنهن أ بكارا

فَجَعَلْنَـٰهُنَّ أَبْكَارًا ﴿٣٦﴾

మేము వారిని ముందెన్నడు తాకబడని కన్యలుగా చేశాము. عربا أ ترابا

عُرُبًا أَتْرَابًۭا ﴿٣٧﴾

తమ భర్తలను ప్రేమించే వానిగా,సమ వయస్సు గల వారిగా (చేశాము)

لِّأَصْحَـٰبِ ٱلْيَمِينِ ﴿٣٨﴾

తమ ఆనందానికి సంకేతంగా కూడిచేత తీసుకొనబడిన కుడి పక్షం వారి కొరకు మేము వారిని సృష్టించాము

ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ ﴿٣٩﴾

]వారు మొదటి తరాల ప్రవక్తల సమాజాల వర్గము

وَثُلَّةٌۭ مِّنَ ٱلْـَٔاخِرِينَ ﴿٤٠﴾

ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం యొక్క సమాజము నుండి ఒక వర్గము ఉంటుంది. అది సమాజములందరిలో చివరిది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَصْحَـٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَـٰبُ ٱلشِّمَالِ ﴿٤١﴾

ఎడమ పక్షమువారు వారే ఎవరి కర్మల పత్రా లు వారి ఎడమ చేతులలో ఇవ్వబడుతాయో,వారి పరిశ్థితి,వారి పర్యవాసనము ఎంతో చెడ్డది. فى سموم وحميم

فِى سَمُومٍۢ وَحَمِيمٍۢ ﴿٤٢﴾

వారు తీవ్ర వేడి గాలులలో మరియు తీవ్ర వేడి నీటిలో ఉంటారు. وظل من يحموم

وَظِلٍّۢ مِّن يَحْمُومٍۢ ﴿٤٣﴾

నల్లటి పొగ నీడలో ఉంటారు. لا بارد ولا كريم

لَّا بَارِدٍۢ وَلَا كَرِيمٍ ﴿٤٤﴾

వీచటంలో మంచిగా ఉండదుమరియుచూడ్డా నికి అందంగా ఉండదు. إن هم كانواقبل ذلك مترفين

إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ ﴿٤٥﴾

నిశ్చయంగా వారు శిక్షను అనుభవించక ముందు ఇహలోకంలో సుఖభోగాలను అనుభవించేవారు. వారికి వారి మనో వాంఛలు తప్ప ఏ ఉద్ధేశము ఉండేది కాదు

وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ ﴿٤٦﴾

వారు అల్లా హ్ పట్ల అవిశ్వాసం కనబరచటంపై మరియు ఆయనను వదిలి విగ్రహాలను ఆరాధించటంపై హఠులై ఉండేవారు. وكانوايقولون أ ذا متنا وكنا ترابا وعظما أءنا لمبعوثون

وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ ﴿٤٧﴾

మరియు వారు మరణాంతరం లేపబడటమును నిరాకరించి దాని పట్ల పరిహాసముగా,దాన్ని దూరంగా భావిస్తూ ఇలా పలికేవారు: ఏమీ మేము మరణించి,మట్టిగా,క్రు సించి పోయిన ఎముకలుగా అయిపోయినప్పుడు దాని తరువాత మేము మరణాంతరం లేపబడుతామా ?!

أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ ﴿٤٨﴾

ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తా తలు మరల లేపబడుతారా ?

قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْـَٔاخِرِينَ ﴿٤٩﴾

ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరితో ఇలా పలకండి: నిశ్చయంగా పూర్వ ప్రజలు మరియు తురువాత వచ్చే వారు కూడా. لمجموعون إلى ميقت يوم معلوم

لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَـٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ ﴿٥٠﴾

ప్రళయదినమున వారు లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఖచ్చితంగా సమీకరించబడుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ ﴿٥١﴾

لٔاكلون من شجر من زقوم

لَـَٔاكِلُونَ مِن شَجَرٍۢ مِّن زَقُّومٍۢ ﴿٥٢﴾

ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ మరణాంతరము లేపబడటమును తిరస్కరించేవారా,సన్మార్గము నుండి తప్పిపోయేవారా ప్రళయదినమున మీరు జక్కూమ్ వృక్ష ఫలాలలను తింటారు. మరియు అది అత్యంత చెడ్డదైన,నీచమైన ఫలము

فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ ﴿٥٣﴾

అప్పుడు మీ ఖాళీ కడుపులను ఆ చేదు వృక్షముతో నింపుకుంటారు

فَشَـٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ ﴿٥٤﴾

అప్పుడు దానిపై తీవ్రమైన వేడి నీళ్ళను త్రా గుతారు

فَشَـٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ ﴿٥٥﴾

హుయామ్ రోగము కారణం వలన ఎక్కువ నీటిని త్రా గే ఒంటెల వలె వారు దాని త్రా గటమును అధికం చేస్తా రు

هَـٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ ﴿٥٦﴾

ఈ ప్రస్తా వించబడిన చేదు ఆహారము మరియు వేడి నీళ్ళు ప్రతిఫలం దినం నాడు వారికి ఇవ్వబడే ఆతిధ్యము. نحن خلقنكم فلولا تصدقون

نَحْنُ خَلَقْنَـٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ ﴿٥٧﴾

ఓ తిరస్కారులారా మీరు ఉనికిలో లేనప్పటికీ మేము మిమ్మల్ని సృష్టించాము. మేము మిమ్మల్ని మరణాంతరం జీవింపజేసి లేపుతామని మీరెందుకు నమ్మరు ?! أفرءيتم ما تمنون

أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ ﴿٥٨﴾

ఓ ప్రజలారా మీరు మీ భార్యల గర్భాల్లో విసిరే వీర్యమును గమనించారా ?!

ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَـٰلِقُونَ ﴿٥٩﴾

ఏమీ ఆ వీర్యమును మీరు సృష్టించేవారా లేదా మేము దాన్ని సృష్టించేవారమా ?!

نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ ﴿٦٠﴾

మేమే మీ మధ్య మరణమును నిర్ణయించాము. మీలో నుండి ప్రతి ఒక్కరికి ఒక సమయమున్నది దాన్ని అదిగమించటం జరగదు మరియు వెనుకకు జరగటం జరగదు. మరియు మేము అలసిపోయేవారము కాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَـٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ ﴿٦١﴾

మీరు ఉన్న మీకు తెలిసిన సృష్టి,రూపమును మేము మార్చి మీకు తెలియని సృష్టి,రూపములో మిమ్మల్ని సృష్టించే సామర్ధ్యమును కలిగిన వారము

وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ ﴿٦٢﴾

వాస్తవానికి మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా సృష్టించామో మీకు తెలుసు. ఏమీ మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు మీరు మరణించిన తరువాత మిమ్మల్ని మరల లేపటంపై సామర్ధ్యము కలవాడని మీరు గుణపాఠం నేర్చుకుని తెలుసుకోరా ?! أفرءيتم ما تحرثون

أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ ﴿٦٣﴾

ఏమీ మీరు భూమిలో నాటే బీజమును గమనించారా ?!

ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ ﴿٦٤﴾

ఆ విత్తనమును మీరు మొలకెత్తిస్తు న్నారా లేదా మేము దాన్ని మొలకెత్తిస్తు న్నామా ?!

لَوْ نَشَآءُ لَجَعَلْنَـٰهُ حُطَـٰمًۭا فَظَلْتُمْ تَفَكَّهُونَ ﴿٦٥﴾

ఒక వేళ మేము ఆ పంటను నాశనం చేయదలచుకుంటే అది పక్వమునకు వచ్చి చేతికి వచ్చే సమయాన దాన్ని మేము నాశనం చేస్తా ము. అప్పుడు దాని తరువాత మీరు దానికి సంభవించిన దానిపై ఆశ్ఛర్యపోతారు. إ ن المغرمون

إِنَّا لَمُغْرَمُونَ ﴿٦٦﴾

మీరంటారు నిశ్చయంగా మేము ఖర్చు చేసిన దాన్ని నష్టపోయి శిక్షింపబడ్డా ము. بل نحن محرومون

بَلْ نَحْنُ مَحْرُومُونَ ﴿٦٧﴾

కాదు కాదు మేము ఆహారోపాధిని కోల్పోయాము

أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ ﴿٦٨﴾

ఏమీ మీరు దప్పికకు గురైనప్పుడు మీరు త్రా గే నీటిని గమనించారా ?!

ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ ﴿٦٩﴾

ఏమీ ఆకాశములో ఉన్న మేఘము నుండి మీరు దాన్ని కురిపించారా లేదా మేము దాన్ని కురిపించామా ?!

لَوْ نَشَآءُ جَعَلْنَـٰهُ أُجَاجًۭا فَلَوْلَا تَشْكُرُونَ ﴿٧٠﴾

ఒక వేళ మేము ఆ నీటిని త్రా గటానికి,దాహం తీర్చుకోవటానికి ఉపయోగించకుండా ఉప్పగా చేయదలచుకుంటే దాన్ని చాలా ఉప్పగా చేసేవారము. మీపై కారుణ్యముగా తియ్యగా దాన్ని మీపై కురిపించినందుకు మీరు అల్లా హ్ కు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ ﴿٧١﴾

మీ ప్రయోజనముల కొరకు మీరు వెలిగించే అగ్ని ని మీరు గమనించారా ?!

ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ ﴿٧٢﴾

ఏ వృక్షముతో దాన్ని వెలిగించబడుతున్నదో దాన్ని మీరు సృష్టించారా లేదా మీపై దయగా మేము దాన్ని సృష్టించామా ?! نحن جعلنها تذكرة ومتعا للمقوين

نَحْنُ جَعَلْنَـٰهَا تَذْكِرَةًۭ وَمَتَـٰعًۭا لِّلْمُقْوِينَ ﴿٧٣﴾

మేము ఈ అగ్నిని మీకు పరలోక అగ్నిని గుర్తు చేసే మీ కొరకు ఒక జ్ఞాపికగా చేశాము. మరియు దాన్ని మీలో నుండి ప్రయాణికుల కొరకు ప్రయోజనదాయకంగా చేశాము

فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ﴿٧٤﴾

ఓ ప్రవక్తా మహోన్నతుడైన నీ ప్రభువు యొక్క ఆయనకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడండి

۞ فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ ﴿٧٥﴾

అల్లా హ్ నక్షత్రముల స్థా నాల మరియు వాటి ప్రదేశాలపై ప్రమాణం చేశాడు. وإنه لقسم لو تعلمون عظيم

وَإِنَّهُۥ لَقَسَمٌۭ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ﴿٧٦﴾

మరియు నిశ్చయంగా ఈ ప్రదేశముల యొక్క ప్రమాణము ఒక వేళ మీరు దానిలో ఉన్న సూచనలు మరియు లెక్క లేనన్ని గుణపాఠములు ఉండటం వలన దాని గొప్పతనమును తెలుసుకుని ఉంటే ఎంతో గొప్పది. إنه لقرءان كريم

إِنَّهُۥ لَقُرْءَانٌۭ كَرِيمٌۭ ﴿٧٧﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా మీకు చదివి వినిపించబడే ఖుర్ఆన్ అందులో ఉన్న గొప్ప ప్రయోజనముల వలన దివ్యమైన ఖుర్ఆన్. فى كتب مكنون

فِى كِتَـٰبٍۢ مَّكْنُونٍۢ ﴿٧٨﴾

ప్రజల కళ్ళ నుండి సురక్షితమైన ఒక గ్రంధమైన లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది

لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ ﴿٧٩﴾

పాపముల నుండి మరియు లోపముల నుండి పరిశుద్ధు లైన దైవదూతలు మాత్రమే దాన్ని ముట్టు కుంటారు

تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٨٠﴾

సృష్టితాల ప్రభువు వద్ద నుండి తన ప్రవక్త అగు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంపై అవతరింపబడినది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَفَبِهَـٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ ﴿٨١﴾

ఓ ముష్రికులారా మీరు ఈ విషయమును విశ్వసించకుండా తిరస్కరిస్తు న్నారా ?! وتجعلون رزقكم أنكم تكذبون

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ ﴿٨٢﴾

మరియు మీరు అల్లాహ్ కు ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాలపై మీ కృతజ్ఞతలను వాటిని మీ తిరస్కారముగా చేసి వర్షము కురవటమును నక్షత్రముల వైపు చేసి ఫలానా నక్షత్రము వలన మాపై వర్షము కురిసింది అని అంటున్నారా ?!

فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ ﴿٨٣﴾

ప్రా ణము గొంతుకు చేరిపోయినప్పుడు وأنتم حينئ ذ تنظرون

وَأَنتُمْ حِينَئِذٍۢ تَنظُرُونَ ﴿٨٤﴾

మరియు మీరు ఆ సమయమున మీ ముందట ప్రత్యక్షమయ్యే దాన్ని చూస్తుండిపోతారు. ونحن أقرب إليهمنكم ولكن لا تبصرون

وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَـٰكِن لَّا تُبْصِرُونَ ﴿٨٥﴾

మరియు మేము మా జ్ఞా నముతో,మా సామర్ధ్యముతో మరియు మా దూతలు మీ మృత్యువునకు మీకన్న దగ్గరగా ఉంటారు. కాని మీరు ఆ దూతలందరిని చూడలేరు

فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ ﴿٨٦﴾

మీరు అనుకుంటున్నట్లు మీ కర్మలకు మీరు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మరల లేపబడకుండా ఉంటే

تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٨٧﴾

మీరు సత్యవంతులే అయితే మీ మృతుని నుండి వెలికి వచ్చిన ఈ ప్రా ణమును తిరిగి రప్పించుకోండి ?! మీరు అలా చేయలేరు

فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ ﴿٨٨﴾

ఇక ఒక వేళ మరణించే వాడు సత్కర్మల వైపు ముందడుగు వేసేవారిలో నుంచి అయితే فروح وريحان وجنت نعيم

فَرَوْحٌۭ وَرَيْحَانٌۭ وَجَنَّتُ نَعِيمٍۢ ﴿٨٩﴾

అతనికి మనశ్శాంతి,కారుణ్యము ఉంటుంది దాని తరువాత ఎటువంటి అలసట ఉండదు.మరియు మంచి ఆహారము,కారుణ్యముంటుంది. మరియు అతని కొరకు స్వర్గముంటుంది అందులో అతడు తన మనస్సుకు నచ్చిన వాటితో సుఖభోగాలను అనుభవిస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَـٰبِ ٱلْيَمِينِ ﴿٩٠﴾

فَسَلَـٰمٌۭ لَّكَ مِنْ أَصْحَـٰبِ ٱلْيَمِينِ ﴿٩١﴾

మరియు ఒక వేళ మరణించే వాడు కుడిపక్షం వారిలో నుంచి అయితే మీరు వారి విషయం గురించి పట్టించుకోకండి. వారికి శాంతి శ్రేయస్సులు ఉంటాయి

وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ ﴿٩٢﴾

మరియు ఇక ఒక వేళ మరణించే వాడు ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారిలో నుండి మరియు సన్మార్గము నుండి తప్పిపోయే వారిలో నుండి అయితే. فنزل من حميم

فَنُزُلٌۭ مِّنْ حَمِيمٍۢ ﴿٩٣﴾

అప్పుడు అతనికి తీవ్రమైన వేడి గల నీటితో ఆతిధ్యమివ్వబడును. وتص لية جحيم

وَتَصْلِيَةُ جَحِيمٍ ﴿٩٤﴾

మరియు అతను నరకాగ్నికి ఆహుతి అవటం జరుగును

إِنَّ هَـٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ ﴿٩٥﴾

ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు తెలియపరచిన ఈ గాధ ఎటువంటి సందేహం లేని రూఢీ అయిన సత్యం

فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ ﴿٩٦﴾

కావున మీరు మీ మహోన్నత ప్రభువు యొక్క నామము పరిశుద్ధతను కొనియాడండి. మరియు లోపముల నుండి ఆయన పరిశుద్ధతను తెలపండి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Waaqia — الواقعة

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు