ٱلرَّحْمَـٰنُ ﴿١﴾
విస్తా రమైన కారుణ్యము కల అనంత కరుణామయుడు
ముఖపేజీ›తఫ్సీర్›Ar-Rahmaan (55)
మదనీ · 78 ఆయతులు
ٱلرَّحْمَـٰنُ ﴿١﴾
విస్తా రమైన కారుణ్యము కల అనంత కరుణామయుడు
عَلَّمَ ٱلْقُرْءَانَ ﴿٢﴾
ఆయన ప్రజలకు ఖుర్ఆన్ ను దాన్ని కంఠస్తం చేసుకొవటం సులభతరం చేయటం ద్వారా మరియు దాని అర్ధములను సునాయసంగా అర్ధం చేసుకునేట్లు గా నేర్పించాడు
خَلَقَ ٱلْإِنسَـٰنَ ﴿٣﴾
అయన మానవుడిని సవ్యంగా సృష్టించాడు. మరియు అతని రూపమును మంచిగా చేశాడు
عَلَّمَهُ ٱلْبَيَانَ ﴿٤﴾
ఆయన అతనికి మాటపరంగా మరియు వ్రా యటం పరంగా తన మనస్సులో ఉన్న దాన్ని ఏ విధంగా స్పష్టపరచాలో నేర్పించాడు
ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍۢ ﴿٥﴾
సూర్య చంద్రు లను వాటికి ఆయన హద్దు ను నిర్దేశించాడు. అవి పరిపూర్ణలెక్క ప్రకారం పయనిస్తు న్నవి. ప్రజలు సంవత్సరముల గణనను మరియు లెక్కను తెలుసుకోవటానికి
وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ ﴿٦﴾
మరియు కాండము లేని మొక్కలు మరియు వృక్షములు పరిశుద్ధు డైన అల్లా హ్ కు ఆయనకు విధేయిలుగా,లొంగిపోతూ సాష్టాంగపడుతున్నాయి
وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ ﴿٧﴾
మరియు ఆకాశమును దాన్ని భూమిపై దాని కొరకు కప్పుగా పైకెత్తి ఉంచాడు. మరియు భూమిలో న్యాయమును స్థా పించి దాని గురించి తన దాసులకు ఆదేశించాడు
أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ ﴿٨﴾
ఓ ప్రజలారా మీరు అన్యాయమునకు పాల్పడకూడదని మరియు తూకము వేయటంలో,కొలవటంలో అవినీతికి పాల్పడకూడదని ఆయన న్యాయమును స్థా పించాడు
وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ ﴿٩﴾
మరియు మీరు తూకమును మీ మధ్య న్యాయంతో నెలకొల్పండి. మరియు మీరు ఇతరుల కొరకు కొలచినప్పుడు మరియు తూకమేసినప్పుడు తూకము వేయటంలో లేదా కొలవటములో మీరు తగ్గించకండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ ﴿١٠﴾
మరియు భూమిని దానిపై సృష్టిని స్థిరీకరించటానికి దాన్ని సిద్ధం చేసి పరచాడు
فِيهَا فَـٰكِهَةٌۭ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ ﴿١١﴾
అందులో ఫలాలను పండించే వృక్షములు కలవు. మరియు అందులో ఖర్జూ ర పండ్లను కలిగి ఉండే పుష్పకోశాలు గల ఖర్జూ రపు చెట్లు కలవు
وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ ﴿١٢﴾
మరియు అందులో ఊక గల గోదుమలు మరియు బార్లి వంటి ధాన్యములు కలవు. మరియు అందులో మంచి సువాసన గల మొక్కలు గలవు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿١٣﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
خَلَقَ ٱلْإِنسَـٰنَ مِن صَلْصَـٰلٍۢ كَٱلْفَخَّارِ ﴿١٤﴾
ఆయన ఆదం అలైహిస్సలాంను పెంకులాంటి శబ్దము వినిపించే ఎండు బంక మట్టితో సృష్టించాడు అది కాల్చబడిన బంక మట్టిలా ఉన్నది
وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍۢ مِّن نَّارٍۢ ﴿١٥﴾
మరియు ఆయన జిన్ను తండ్రిని స్వచ్ఛమైన పొగ జ్వాల నుండి సృష్టించాడు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿١٦﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ ﴿١٧﴾
శీతాకాలం మరియు ఎండాకాలంలో సూర్యుడు ఉదయించే రెండు చోట్ల,అది అస్తమించే రెండు చోట్ల యొక్క ప్రభువు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿١٨﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ ﴿١٩﴾
ఆయన (అల్లా హ్) ఉప్పు మరియు తీపి సముద్రములను కలిపాడు అవి కంటికి కనిపించటంలో కలుస్తుంటాయి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ بينهما برزخ لا يبغيان
بَيْنَهُمَا بَرْزَخٌۭ لَّا يَبْغِيَانِ ﴿٢٠﴾
వాటి మధ్య ఒక అడ్డు కట్ట ఉన్నది అది వాటిలో నుండి ప్రతి ఒక్క దాన్ని వేరే దాన్ని ఆక్రమించుకోకుండా తీపిది తీపిగా మరియు ఉప్పుది ఉప్పగా ఉండేందుకు ఆపుతుంది
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٢١﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ ﴿٢٢﴾
రెండు సముద్రముల నుండి పెద్దవి మరియు చిన్నవి ముత్యములు వెలికి వస్తా యి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٢٣﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَـٰمِ ﴿٢٤﴾
సముద్రముల్లో పర్వతములవలె పయనించే ఓడలను పయనింపచేసే అధికారము పరిశుద్ధు డైన,మహోన్నతుడైన ఆయన ఒక్కడికే ఉన్నది
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٢٥﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. كل من عليهافان
كُلُّ مَنْ عَلَيْهَا فَانٍۢ ﴿٢٦﴾
సృష్టితాల్లోంచి భూమిపై ఉన్న ప్రతీది ఖచ్చితంగా నాశనమవుతుంది
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَـٰلِ وَٱلْإِكْرَامِ ﴿٢٧﴾
ఓ ప్రవక్తా తన దాసుల పట్ల గొప్పతనము,దాతృత్వం మరియు దయ కల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మిగిలి ఉంటుంది. దానికి వినాశనం ఎన్నటికీ కలగదు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٢٨﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍۢ ﴿٢٩﴾
ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి మరియు భూమిలో ఉన్న జిన్నులు,మానవుల్లోంచి ప్రతి ఒక్కరు తమ అవసరములను ఆయనతోనే వేడుకుంటారు. ప్రతి రోజు ఆయన తన దాసుల వ్యవహారములైన జీవింపజేయటం,మరణింపజేయటం మరియు ఆహారం ప్రసాదించటం మొదలగు వాటిలొ నిమగ్నుడై ఉంటాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٣٠﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ ﴿٣١﴾
ఓ మానవుల్లా రా,జిన్నుల్లా రా త్వరలోనే మేము మీ లెక్క చూసి ప్రతి ఒక్కరికి వారికి యోగ్యమైన ప్రతిఫలమును,శిక్షను ప్రసాదిస్తా ము
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٣٢﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
يَـٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَـٰنٍۢ ﴿٣٣﴾
జిన్నులు మరియు మానవులు సమావేశమైనప్పుడు ప్రళయదినమున అల్లా హ్ ఇలా పలుకుతాడు: ఓ జిన్నుల మరియు మానవుల జాతుల వారా ఒక వేళ మీరు మీ కొరకు భూమ్యాకాశముల సరిహద్దు ల్లోంచి ఏ సరిహద్దు నుంచైన బయటకు పోయే మార్గం పొందగలిగితే మీరు చేసి చూడండి. మీరు అది ఏదైన బలముతో,ఆధారముతో మాత్రమే చేయగలుగుతారు. మరియు అది మీ దగ్గర ఎక్కడున్నది ?
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٣٤﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران
يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌۭ مِّن نَّارٍۢ وَنُحَاسٌۭ فَلَا تَنتَصِرَانِ ﴿٣٥﴾
ఓ మానవులు మరియు జిన్నాతుల్లా రా ఆయన మీపై పొగ లేని అగ్ని జ్వాలలను మరియు జ్వాలలు లేని పొగను పంపిస్తా డు. మీరు దాన్ని ఆపలేరు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٣٦﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةًۭ كَٱلدِّهَانِ ﴿٣٧﴾
మరియు ఆకాశం దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్దలైనప్పుడు అది రంగు మెరవటంలో నూనెలా ఎర్రగా అయిపోతుంది
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٣٨﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపైن ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
فَيَوْمَئِذٍۢ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌۭ وَلَا جَآنٌّۭ ﴿٣٩﴾
ఆ మహోన్నతమైన దినమున మానవులకు,జిన్నులకు వారి పాపముల గురించి అడగబడదు ఎందుకంటే వారి కర్మల గురించి అల్లా హ్ కు తెలుసు కాబట్టి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٤٠﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَـٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ ﴿٤١﴾
అపరాదులు ప్రళయదినమున తమ చిహ్నాలైన ముఖములు నల్లబడటం,కళ్ళు నీలంగా మారటం ద్వారా గుర్తించబడుతారు. అప్పుడు వారి నుదుటులను వారి కాళ్ళతో కలిపి కట్టబడి వారు నరకంలో విసరబడుతారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٤٢﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
هَـٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ ﴿٤٣﴾
మరియు వారితో మందలిస్తూ ఇలా పలకబడును: ఇహలోకములో అపరాధులు తిరస్కరించిన నరకము ఇదే తమ కళ్ళముందట దాన్ని వారు తిరస్కరించలేరు. يطوفون بينها وبين حميم ءان
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍۢ ﴿٤٤﴾
వారు దాని మధ్య మరియు తీవ్ర వేడి కల నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٤٥﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. ولمن خاف مقام ربه جنتان
وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ ﴿٤٦﴾
తన ప్రభువు ముందట నిలబడటం నుండి భయపడి విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన వారి కొరకు రెండు స్వర్గవనాలుంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٤٧﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
ذَوَاتَآ أَفْنَانٍۢ ﴿٤٨﴾
మరియు ఈ రెండు స్వర్గ వనాలు పెద్ద,తాజా,ఫలవంతమైన కొమ్మలు కలవై ఉంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٤٩﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فيهما عينان تجريان
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ ﴿٥٠﴾
ఆ రెండు స్వర్గ వనముల్లో రెండు సెలయేళ్ళు వాటి మధ్య నీటిని తీసుకుని ప్రవహిస్తుంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٥١﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. فيهما من كل فكهة زوجان
فِيهِمَا مِن كُلِّ فَـٰكِهَةٍۢ زَوْجَانِ ﴿٥٢﴾
వాటిలో ప్రతిఫలము యొక్క రెండు రకాలు (జతలు) ఉంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٥٣﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍۢ ۚ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍۢ ﴿٥٤﴾
వారు మందమైన పట్టు తివాచీల మీద ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు రెండు స్వర్గ వనముల నుండి వారికి కోసి ఇవ్వబడే పండ్లు,ఫలాలు నిలబడిన వాడు,కూర్చున్న వాడు,ఆనుకుని ఉన్న వాడు వాటిని దగ్గర నుండి పొందుతాడు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٥٥﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారాن! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
فِيهِنَّ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ ﴿٥٦﴾
వాటిలో తమ భర్తల ముందట తమ చూపులను క్రిందికి వాల్చి ఉండే స్త్రీలు ఉంటారు. వారి కన్యతను వారి భర్తల కన్న ముందు ఏ మానవుడుగాని ఏ జిన్ను గాని దూరం చేసి ఉండడు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٥٧﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ ﴿٥٨﴾
వారు అందములో,స్వచ్ఛదనంలో ముత్యములను మరియు పగడాలను పోలి ఉంటారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٥٩﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
هَلْ جَزَآءُ ٱلْإِحْسَـٰنِ إِلَّا ٱلْإِحْسَـٰنُ ﴿٦٠﴾
తన ప్రభువుకి మంచి విధేయత చూపిన వారికి అల్లా హ్ అతనికి మంచి ప్రతిఫలమే ప్రసాదిస్తా డు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٦١﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. ومن دونهما جنتان
وَمِن دُونِهِمَا جَنَّتَانِ ﴿٦٢﴾
ఈ ప్రస్తా వించబడిన రెండు స్వర్గ వనములు కాకుండా వేరే రెండు స్వర్గ వనాలుంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٦٣﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
مُدْهَآمَّتَانِ ﴿٦٤﴾
వాటి పచ్చదనంతీవ్రంగా (ముదురుగా) ఉంటుంది
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٦٥﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. فيهما عينان نض اختان
فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ ﴿٦٦﴾
ఈ రెండు స్వర్గ వనముల్లో నీటితో తీవ్రంగా పొంగిపొరలే రెండు సెలయేళ్ళు ఉంటాయి. వాటి పొంగిపొరలటం అంతమవదు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٦٧﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. فيهما فكهة ونخل ورمان
فِيهِمَا فَـٰكِهَةٌۭ وَنَخْلٌۭ وَرُمَّانٌۭ ﴿٦٨﴾
ఆ రెండు స్వర్గ వనముల్లో చాలా ఫలములు,అధికముగా ఖర్జూ రములు మరియు దానిమ్మకాయలు ఉంటాయి
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٦٩﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فيهن خيرت حسان
فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌۭ ﴿٧٠﴾
ఈ స్వర్గ వనముల్లో ఉత్తమ గుణవంతులైన,మంచి రూపురేకలు కల స్త్రీలు ఉంటారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٧١﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
حُورٌۭ مَّقْصُورَٰتٌۭ فِى ٱلْخِيَامِ ﴿٧٢﴾
తమకు భద్రతగా డేరాలలో పరదాలు కప్పబడిన హూర్ లు ఉంటారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٧٣﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్నن అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
لَمْ يَطْمِثْهُنَّ إِنسٌۭ قَبْلَهُمْ وَلَا جَآنٌّۭ ﴿٧٤﴾
వారి భర్తల కన్న ముందు ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని వారి దగ్గరకు వచ్చి ఉండడు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٧٥﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?. متكٔينعل رفرف خضروعبقرى حسان
مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍۢ وَعَبْقَرِىٍّ حِسَانٍۢ ﴿٧٦﴾
వారు ఆకుపచ్చని గలాఫులతో కప్పబడిన దిండ్లకు అనుకుని మరియు అందమైన తివాచీలపై ఉంటారు
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿٧٧﴾
ఓ జిన్నాతులారా మరియు మానవులారా! మీపై ఉన్న అల్లా హ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తు న్నారు ?
تَبَـٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَـٰلِ وَٱلْإِكْرَامِ ﴿٧٨﴾
తన దాసులపై ఘనత గల,ఉపకారము చేసే,అనుగ్రహాలు కలిగించే నీ ప్రభువు పేరు అధికంగా,చాలా మేలైనది. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు