ముఖపేజీతఫ్సీర్An-Najm (53)

తఫ్సీర్ An-Najm (53) — النجم

మక్కీ · 62 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلنَّجْمِ إِذَا هَوَىٰ ﴿١﴾

పరిశుద్ధు డైన ఆయన నక్షత్రము రాలినప్పుడు ప్రమాణం చేశాడు. ما ضل صاحبكم وما غو

مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ ﴿٢﴾

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఋజుమార్గము నుండి మరల లేదు మరియు ఆయన అపమార్గమునకు లోను కాలేదు కాని ఆయన హేతుబద్ధమైనవారు

وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ ﴿٣﴾

మరియు ఆయన ఈ ఖుర్ఆన్ ను తన మనోవాంఛను అనుసరించి పలకలేదు. إن هو إ ل اوحى يوحى

إِنْ هُوَ إِلَّا وَحْىٌۭ يُوحَىٰ ﴿٤﴾

ఈ ఖుర్ఆన్ అల్లా హ్ జిబ్రయీల్ అలైహిస్సలాం మార్గము నుండి ఆయన వైపునకు అల్లా హ్ అవతరింపజేసిన ఒక దైవవాణి మాత్రమే

عَلَّمَهُۥ شَدِيدُ ٱلْقُوَىٰ ﴿٥﴾

మహా బలవంతుడు ఒక దూత అయిన జిబ్రయీల్ అలైహిస్సలాం దాన్ని ఆయనకు నేర్పించాడు

ذُو مِرَّةٍۢ فَٱسْتَوَىٰ ﴿٦﴾

మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం మంచి రూపము కలవారు. మరియు ఆయన అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం ముందు అల్లా హ్ ఆయనను సృష్టించిన రూపములో (నిజ రూపములో) ప్రత్యక్షమై నిలబడ్డా రు

وَهُوَ بِٱلْأُفُقِ ٱلْأَعْلَىٰ ﴿٧﴾

మరియు జిబ్రయీల్ ఆకాశపు ఎత్తైన అంచులపై ఉన్నారు. ثم دنا فتدلى

ثُمَّ دَنَا فَتَدَلَّىٰ ﴿٨﴾

ఆ తరువాత జిబ్రయీల్ అలైహిస్లాం ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లమునకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయనకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యారు. فكان قاب قوسين أو أدنى

فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ ﴿٩﴾

ఆయనకు ఆయన దగ్గరవ్వటం రెండు విల్లు లంత లేదా దానికి ఇంచుమించుగా ఉన్నది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ ﴿١٠﴾

అప్పుడు జిబ్రయీల్ అల్లా హ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంనకు దైవవాణి చేర్చవలసినది చేర్చారు

مَا كَذَبَ ٱلْفُؤَادُ مَا رَأَىٰٓ ﴿١١﴾

ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం హృదయం ఆయన చూపులు చూసిన దాన్ని అబద్దమనలేదు. أفتمرونه عل ما ير

أَفَتُمَـٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ ﴿١٢﴾

ఓ ముష్రికులారా అల్లా హ్ ఆయనను రాత్రివేళ తీసుకుని వెళ్ళి ఆయనకు చూపిన దాని విషయంలో మీరు ఆయనతో వాదులాడుతున్నారా ?! ولقد رءاه نزلةأخر

وَلَقَدْ رَءَاهُ نَزْلَةً أُخْرَىٰ ﴿١٣﴾

మరియు వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను రెండవ సారి ఆయన నిజరూపములో ఆయనకు రాత్రి వేళ తీసుకుని వెళ్ళినప్పుడు చూశారు

عِندَ سِدْرَةِ ٱلْمُنتَهَىٰ ﴿١٤﴾

సిద్రతుల్ ముంతహా (చివరి హద్దు ల్లో ఉన్న రేగు చెట్టు ) వద్ద. ఏడవ ఆకాశములో ఉన్న చాలా గొప్ప వృక్షము అది

عِندَهَا جَنَّةُ ٱلْمَأْوَىٰٓ ﴿١٥﴾

ఆ వృక్షము వద్దనే జన్నతుల్ మావా (స్వర్గ ధామం) కలదు

إِذْ يَغْشَى ٱلسِّدْرَةَ مَا يَغْشَىٰ ﴿١٦﴾

అప్పుడు సిద్రహ్ ను అల్లా హ్ ఆదేశముతో ఒక గొప్ప వస్తు వు కప్పివేస్తుంది. దాని వాస్తవికత అల్లా హ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు

مَا زَاغَ ٱلْبَصَرُ وَمَا طَغَىٰ ﴿١٧﴾

ఆయన సల్లల్లా హు అలైహి వసల్లం చూపులు కుడి యడమలకు వాలనూ లేదు మరియు ఆయనకి నిర్ణయించిన హద్దు లను అతిక్రమించలేదు

لَقَدْ رَأَىٰ مِنْ ءَايَـٰتِ رَبِّهِ ٱلْكُبْرَىٰٓ ﴿١٨﴾

వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం తనను గగన యాత్ర చేయించబడిన రాత్రి తన ప్రభువు సామర్ధ్యమును సూచించే గొప్ప సూచనలను చూశారు. అప్పుడు ఆయన స్వర్గమును చూశారు మరియు నరకమును ఇతరవాటిని చూశారు

أَفَرَءَيْتُمُ ٱللَّـٰتَ وَٱلْعُزَّىٰ ﴿١٩﴾

ఓ ముష్రికులారా మీరు అల్లా హ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు లాత్ మరియు ఉజ్జా లను గురించి ఆలోచించారా. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلْأُخْرَىٰٓ ﴿٢٠﴾

మరియు మీ విగ్రహాల్లోంచి మూడవదైన ఇంకొకటి మనాత్ ను గరించి. నాకు చెప్పండి మీరు అవి మీకు ఏదైన ప్రయోజనం గాని నష్టం గాని కలిగించే అధికారం కలవా ?!

أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلْأُنثَىٰ ﴿٢١﴾

ఓ ముష్రికులారా మీకు మీరు ఇష్డపడే మగ సంతానమా మరియు పరిశుద్ధు డైన ఆయనకు మీరు ఇష్టపడని ఆడ సంతానమా ?!

تِلْكَ إِذًۭا قِسْمَةٌۭ ضِيزَىٰٓ ﴿٢٢﴾

మీ ఇచ్ఛానుసారం మీరు పంచిన ఈ పంపకము ఒక అన్యాయమైన పంపకం

إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌۭ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَـٰنٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ ۖ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ ﴿٢٣﴾

ఈ విగ్రహాలు కొన్ని అర్దరహిత పేర్లు మాత్రమే. దైవత్వ గుణముల్లో వాటికి ఎటువంటి భాగము లేదు. వాటిని మీరు మీ తాత ముత్తాతలు మీ స్వయంతరపు నుండి పేర్లు పెట్టు కున్నారు. వాటి గురించి అల్లా హ్ ఎటువంటి ఆధారము అవతరింపజేయలేదు. ముష్రికులు తమ మనసులు కోరిన తమ హృదయములలో షైతాను అలంకరించిన విశాసములను మాత్రమే అనుసరిస్తు న్నారు. వాస్తవానికి వారి ప్రభువు వద్ద నుండి ఆయన ప్రవక్త సల్లల్లా హు అలైైహి వసల్లం నాలుక ద్వారా వారి వద్దకు సన్మార్గము వచ్చినది. కాని వారు ఆయన ద్వారా మార్గము పొందలేదు. أم للإنسن ما تمن

أَمْ لِلْإِنسَـٰنِ مَا تَمَنَّىٰ ﴿٢٤﴾

లేదా మానవునికి తాను ఆశించిన విగ్రహాల సిఫారసు అల్లా హ్ యందు కలదా ?!

فَلِلَّهِ ٱلْـَٔاخِرَةُ وَٱلْأُولَىٰ ﴿٢٥﴾

లేదు అతను ఆశించినది అతనికి లభించదు. పరలోకము మరియు ఇహలోకము అల్లాహ్ దే. వాటిలో నుండి ఆయన తాను కోరిన దాన్ని ఇస్తాడు మరియు తాను కోరిన దాన్ని ఆపుతాడు

۞ وَكَم مِّن مَّلَكٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ لَا تُغْنِى شَفَـٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ ﴿٢٦﴾

మరియు ఆకాశముల్లో ఎందరో దూతలున్నారు ఒక వేళ వారు ఎవరికోసమైన సిఫారసు చేయదలచితే వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు కాని అల్లా హ్ వారిలో నుంచి ఎవరికి తలచుకుని సిఫారసు చేసే అనుమతించిన తరువాత మరియు దానికి సిఫారసు చేయబడే వాడి నుండి ప్రసన్నుడు అయితే తప్ప. అల్లా హ్ సాటి కల్పించే వారి కొరకు సిఫారసు చేసే అనుమతివ్వడు మరియు అల్లా హ్ ను వదిలి అతను ఆరాధించే ఆతని సిఫరసు చేయబడే వాడి నుండి ఆయన ప్రసన్నుడవడు

إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ لَيُسَمُّونَ ٱلْمَلَـٰٓئِكَةَ تَسْمِيَةَ ٱلْأُنثَىٰ ﴿٢٧﴾

నిశ్చయంగా పరలోక నివాసములో మరల లేపబడటం గురించి విశ్వసించని వారు దైవదూతలను వారు అల్లా హ్ కుమార్తెలు అన్న తమ విశ్వాసముతో స్త్రీల పేర్లను పెట్టు కున్నారు. అల్లా హ్ వారి మాటల నుండి ఎంతో మహోన్నతుడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ ۖ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ ۖ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغْنِى مِنَ ٱلْحَقِّ شَيْـًۭٔا ﴿٢٨﴾

మరియు వారికి వారిని స్త్రీలుగా పేర్లు పెట్టు కోటానికి ఎటువంటి ఆధారపూరితమైన జ్ఞానం లేదు. వారు ఈ విషయంలో ఊహగానాలను మరియు భ్రమను మాత్రమే అనుసరిస్తు న్నారు. భ్రమ సత్యం విషయంలో దాని స్థా నములో నిలబడనంతవరకు ప్రయోజనం కలిగించదు

فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا ﴿٢٩﴾

ఓ ప్రవక్తా మీరు అల్లా హ్ స్మరణ నుండి వీపు త్రిప్పుకుని,దాని గురించి పట్టించుకోని మరియు ఇహలోక జీవితమునే ఆశించే వ్యక్తి నుండి మీరు ముఖం త్రిప్పుకోండి. అతడు తన పరలోకం కొరకు ఆచరించడు. ఎందుకంటే అతడు దాన్ని విశ్వసించడు

ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ ٱلْعِلْمِ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِمَنِ ٱهْتَدَىٰ ﴿٣٠﴾

ఈ ముష్రికులందరు దైవదూతలను స్త్రీల పేర్లు పెట్టి ఏదైతే పలుకుతున్నారో వారు చేరే వారి జ్ఞాన పరిధి. ఎందుకంటే వారు అజ్ఞానులు. వారు వాస్తవమునకు చేరలేదు. ఓ ప్రవక్తా నిశ్చయంగా సత్య మార్గము నుండి మరలిపోయిన వారి గురించి మీ ప్రభువుకే బాగా తెలుసు. మరియు ఆయన మార్గమును పొందే వారి గురించి ఆయనకే బాగా తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ لِيَجْزِىَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ بِمَا عَمِلُوا۟ وَيَجْزِىَ ٱلَّذِينَ أَحْسَنُوا۟ بِٱلْحُسْنَى ﴿٣١﴾

ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అధికారక పరంగా, సృష్టి పరంగా మరియు కార్య నిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. ఇహలోకము దుష్కర్మలు చేసిన వారికి యోగ్యమైన శిక్షను కలిగించటానికి మరియు సత్కర్మలు చేసిన విశ్వాసపరులకు స్వర్గమును ప్రసాదించటానికి

ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَـٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ ۚ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌۭ فِى بُطُونِ أُمَّهَـٰتِكُمْ ۖ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ ۖ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ ﴿٣٢﴾

మరియు ఎవరైతే చిన్న పాపములు కాకుండా పెద్ద పాపముల నుండి మరియు అసహ్యకరమైన పాపముల నుండి దూరంగా ఉంటారో ఇవి (చిన్న పాపములు) పెద్ద పాపములను వదిలి వేయటం వలన,విధేయత కార్యములను అధికంగా చేయటం వలన మన్నించబడుతాయి. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు విశాలమైన మన్నింపు కలవాడు. ఆయన తన దాసుల పాపములను వారు వాటి నుండి మన్నింపు వేడుకున్నప్పుడు మన్నిస్తా డు. పరిశుద్ధు డైన ఆయనకు మీ స్థితులను గురించి మరియు మీ వ్యవహారముల గురించి మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించబడినప్పుడు మరియు మీరు మీ మాతృ గర్భముల్లో పిండములుగా ఉండి పుట్టు క తరువాత సృష్టించబడినప్పుడు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పై మీరు స్వయంగా దైవభీతిపరులని గొప్పగా చెప్పుకోకండి. పరిశుద్ధు డైన ఆయనకు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడే వారి గురించి బాగా తెలుసు

أَفَرَءَيْتَ ٱلَّذِى تَوَلَّىٰ ﴿٣٣﴾

ఇస్లాం నుండి అది దగ్గరైన తరువాత విముఖత చూపిన వాడి దుర్భర స్థితిని మీరు చూశారా ?

وَأَعْطَىٰ قَلِيلًۭا وَأَكْدَىٰٓ ﴿٣٤﴾

మరియు అతడు సంపద నుండి కొద్దిగా ఇచ్చి ఆ తరువాత ఆగిపోయాడు ఎందుకంటే పిసినారితనం అతని తీరు. అయినా కూడా అతడు తన గొప్పలు చెప్పుకునేవాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَعِندَهُۥ عِلْمُ ٱلْغَيْبِ فَهُوَ يَرَىٰٓ ﴿٣٥﴾

ఏమీ అతను చూడటానికి మరియు అగోచర విషయాలు మాట్లా డటానికి అతని వద్ద అగోచర జ్ఞా నమున్నదా ?!. أم لم ينبأ بما فى صحف موس

أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِى صُحُفِ مُوسَىٰ ﴿٣٦﴾

లేదా అల్లా హ్ పై అబద్దమును కల్పించుకున్నాడా ? లేదా అల్లా హ్ పై అబద్దమును కల్పించుకున్న ఇతడికి అల్లా హ్ మూసాపై అవతరింపజేసిన మొదటి గ్రంధముల్లో ఉన్నవాటి గురించి తెలియపరచబడలేదా ?

وَإِبْرَٰهِيمَ ٱلَّذِى وَفَّىٰٓ ﴿٣٧﴾

మరియు తన ప్రభువు తనకు ఇచ్చిన బాధ్యతలన్నింటిని నెరవేర్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం గ్రంధముల్లో. ألا تزر وازرة وزر أخر

أَلَّا تَزِرُ وَازِرَةٌۭ وِزْرَ أُخْرَىٰ ﴿٣٨﴾

ఏ మనిషి ఇతరుల పాప బరువును మోయడని. وأن ليس للإنسن إلا ما سعى

وَأَن لَّيْسَ لِلْإِنسَـٰنِ إِلَّا مَا سَعَىٰ ﴿٣٩﴾

మరియు మనిషికి తాను చేసుకున్న కర్మల ప్రతిఫలం మాత్రమే ఉంటుందని. وأن سعيهسوف ير

وَأَنَّ سَعْيَهُۥ سَوْفَ يُرَىٰ ﴿٤٠﴾

మరియు అతడు తొందరలోనే తన కర్మను ప్రళయదినమున కళ్ళారా చూపబడుతుందని

ثُمَّ يُجْزَىٰهُ ٱلْجَزَآءَ ٱلْأَوْفَىٰ ﴿٤١﴾

ఆ తరువాత అతని కర్మ ప్రతిఫలం ఎటువంటి తగ్గు దల లేకుండా పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది

وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلْمُنتَهَىٰ ﴿٤٢﴾

ఓ ప్రవక్తా దాసుని మరలే చోటు,వారి గమ్య స్థా నము వారి మరణము తరువాత నీ ప్రభువు వైపే ఉంటుందని. وأنه هوأض حك وأبكى

وَأَنَّهُۥ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ ﴿٤٣﴾

మరియు ఆయనే తాను నవ్వింపదలచిన వారికి నవ్వించే వాడని మరియు తాను బాధ కలిగించదలచిన వాడిని ఏడ్పిస్తా డని. وأنه هو أمات وأحيا

وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا ﴿٤٤﴾

మరియు ఆయన ఇహలోకంలో జీవించి ఉన్న వారికి మరణమును కలిగిస్తా డని మరియు మృతులను మరణాంతరం లేపి జీవింపజేస్తా డని. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰ ﴿٤٥﴾

మరియు ఆయన ఆడ,మగ రెండు జంటలను సృష్టించాడని, من نطفة إذا تمن

مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ ﴿٤٦﴾

విర్య బిందువు నుండి అది మాతృ గర్భంలో ఉంచబడినప్పుడు

وَأَنَّ عَلَيْهِ ٱلنَّشْأَةَ ٱلْأُخْرَىٰ ﴿٤٧﴾

మరియు వారి మరణం తరువాత మరణాంతరం లేపటం కొరకు వారిద్దరి సృష్టిని మరలింపజేయటం ఆయనపై ఉన్నదని. وأنه هو أغن وأقن

وَأَنَّهُۥ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ ﴿٤٨﴾

మరియు నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి తాను తలచిన వారికి సంపదలో అధికారమును ప్రసాదించి సంపన్నులుగా చేసేవాడు మరియు ప్రజల్లోంచి సంపద పట్ల తృప్తి చెందే విధంగా సంపదనుప్రసాదించేవాడని

وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعْرَىٰ ﴿٤٩﴾

మరియు ఆయనే ముష్రికుల్లోంచి కొందరు అల్లా హ్ తో పాటు ఆరాధించే షిఅ్'రా నక్షత్రమునకు ప్రభువు అని

وَأَنَّهُۥٓ أَهْلَكَ عَادًا ٱلْأُولَىٰ ﴿٥٠﴾

మరియు ఆయనే హూద్ జాతి వారైన తొలి ఆద్ ను వారు తమ అవిశ్వాసంపై మొండిగా వ్యవహరించినప్పుడు నాశనం చేశాడని

وَثَمُودَا۟ فَمَآ أَبْقَىٰ ﴿٥١﴾

మరియు ఆయన సాలిహ్ జాతి సమూద్ ను వారిలో నుండి ఏ ఒక్కరిని మిగల్చకుండా తుదిముట్టించాడని

وَقَوْمَ نُوحٍۢ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ ﴿٥٢﴾

మరియు ఆయన ఆద్,సమూద్ కన్న ముందు నూహ్ జాతివారిని నాశనం చేశాడు. నిశ్చయంగా నూహ్ జాతి వారు ఆద్ మరియు సమూద్ కన్న పరమ దుర్మార్గు లుగా మరియు అధికంగా మితిమీరేవారిగా ఉండే వారు. ఎందుకంటే నూహ్ వారి మధ్య తొమ్మిదొందల యాభై సంవత్సరాలు అల్లా హ్ ఏకత్వము వైపునకు పిలుస్తూ ఉన్నారు. కాని వారు ఆయన మాటను స్వీకరించలేదు

وَٱلْمُؤْتَفِكَةَ أَهْوَىٰ ﴿٥٣﴾

మరియు లూత్ జాతి వారి బస్తీలను ఆకాశము వైపునకు ఎత్తి ఆ తరువాత వాటిని తిరిగేశాడు. ఆ తరువాత వాటిని భూమి వైపునకు పడవేశాడు. فغش ىها ما غش

فَغَشَّىٰهَا مَا غَشَّىٰ ﴿٥٤﴾

ఆ తరువాత వాటిని ఆకాశము వైపునకు ఎత్తి భూమిపై పడవేసిన తరువాత వాటిపై క్రప్పవలసిన రాళ్ళతో క్రప్పివేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ ﴿٥٥﴾

ఓ మానవుడా అయితే నీవు నీ ప్రభువు సామర్ధ్యముపై సూచించే ఏ ఏ సూచనలను వాటి ద్వారా హితోపదేశం స్వీకరించకుండా వాదులాడుతావు ?

هَـٰذَا نَذِيرٌۭ مِّنَ ٱلنُّذُرِ ٱلْأُولَىٰٓ ﴿٥٦﴾

మీ వైపునకు పంపించబడ్డ ఈ ప్రవక్త తొలి ప్రవక్తల కోవకు చెందినవాడే

أَزِفَتِ ٱلْـَٔازِفَةُ ﴿٥٧﴾

దగ్గరయ్యే ప్రళయం దగ్గరైనది

لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ ﴿٥٨﴾

దాన్ని తొలగించే వాడు మరియు దాని గురించి తెలుసుకునేవాడు అల్లా హ్ మాత్రమే

أَفَمِنْ هَـٰذَا ٱلْحَدِيثِ تَعْجَبُونَ ﴿٥٩﴾

ఏమీ మీకు చదివి వినిపించబడే ఈ ఖుర్ఆన్ గురించి అది అల్లా హ్ వద్ద నుండి అవటం విషయంలో మీరు ఆశ్ఛర్యపోతున్నారా ?! وتضحكون ولا تبكون

وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ ﴿٦٠﴾

మరియు దానిపై పరిహాసంగా మీరు నవ్వుతున్నారు మరియు మీరు దాని హితోపదేశాలను విన్నప్పుడు ఏడవటంలేదు ?! وأ نتم سمدون

وَأَنتُمْ سَـٰمِدُونَ ﴿٦١﴾

మరియు మీరు దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దాన్ని పట్టించుకోవటంలేదు

فَٱسْجُدُوا۟ لِلَّهِ وَٱعْبُدُوا۟ ۩ ﴿٦٢﴾

అయితే మీరు ఒక్కడైన అల్లా హ్ కు సాష్టాంగపడండి మరియు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించండి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · An-Najm — النجم

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు