ముఖపేజీతఫ్సీర్As-Saaffaat (37)

తఫ్సీర్ As-Saaffaat (37) — الصافات

మక్కీ · 182 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلصَّـٰٓفَّـٰتِ صَفًّۭا ﴿١﴾

నేను తమ ఆరాధన చేయటంలో వరసగా బారులుతీరి నిలబడిన దైవదూతలపై ప్రమాణం చేస్తు న్నాను

فَٱلزَّٰجِرَٰتِ زَجْرًۭا ﴿٢﴾

మరియు మేఘములను సమీకరించి తెచ్చి వాటిని అల్లా హ్ కురిపించదలచిన చోట నడిపించే దైవదూతలపై నేను ప్రమాణం చేస్తు న్నాను

فَٱلتَّـٰلِيَـٰتِ ذِكْرًا ﴿٣﴾

మరియు నేను అల్లా హ్ వాక్కును పఠించే దైవదూతలపై ప్రమాణం చేస్తు న్నాను. إن إلهكم لوحد

إِنَّ إِلَـٰهَكُمْ لَوَٰحِدٌۭ ﴿٤﴾

ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ సత్య ఆరాధ్య దైవం ఒక్కడే ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయనే అల్లా హ్

رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَـٰرِقِ ﴿٥﴾

ఆకాశములకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్నవాటికి ప్రభువు మరియు సంవత్సరమంతా తన ఉదయించే స్థలములలో,తన అస్తమించే స్థలములలో ఉన్న సూర్యుడి ప్రభువు

إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ ﴿٦﴾

నిశ్ఛయంగా మేము భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములను అందమైన అలంకరణతో అందంగా ముస్తాబు చేశాము అవి చూడటానికి మిణుకు మిణుకుమని మెరిసే వజ్రవైఢూర్యాల్లాంటి నక్షత్రములు. وحفظا من كل شيطن مارد

وَحِفْظًۭا مِّن كُلِّ شَيْطَـٰنٍۢ مَّارِدٍۢ ﴿٧﴾

మరియు మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశమును విధేయత నుండి వైదొలగిన తలబిరుసైన ప్రతీ షైతాను నుండి నక్షత్రముల ద్వారా భద్రపరిచాము. అవి అతనిపై విసరబడుతాయి

لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍۢ ﴿٨﴾

ఈ షైతానులందరికి దైవదూతలు ఆకాశములో తమ ప్రభువు దివ్యవాణి ద్వారా తన ధర్మ విషయాలను,తన తఖ్దీర్ విషయాలను తెలియపరచిన వాటి గురించి చర్చించుకుంటున్నప్పుడు వినలేరు. ప్రతీ వైపు నుండి వారిపై అగ్ని జ్వాలలు విసిరివేయబడుతాయి

دُحُورًۭا ۖ وَلَهُمْ عَذَابٌۭ وَاصِبٌ ﴿٩﴾

వారిని (షైతానులను) ధూత్కరించటానికి మరియు వారిని (దైవదూతలను) వినటం నుండి దూరంగా ఉంచటానికి. మరియు వారి కొరకు పరలోకంలో బాధను కలిగించే శాశ్వతమైన అంతము కాని శిక్ష కలదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌۭ ثَاقِبٌۭ ﴿١٠﴾

కాని షైతానుల్లోంచి ఎవరైన ఎగరేసుకునిపోతే - అది దైవదూతలు సంప్రదించుకునే మాటల్లోంచి మాట అయి ఉంటుంది. అది వారి మధ్య చక్కరులు కొట్టేదై ఉంటుంది,దాని గురించి జ్ఞా నం లోకవాసులకు చేరి ఉండదు - అప్పుడు కాంతివంతమైన అగ్ని జ్వాల అతడిని వెంబడించి కాల్చివేస్తుంది. ఒక్కొక్క సారి అగ్ని జ్వాల అతడిని కాల్చక ముందే ఆ మాటను అతడు తన సోదరుల వద్దకు చేరవేస్తా డు అప్పుడు అది జ్యోతిష్యులకు చేరుతుంది. అప్పుడు వారు దానితో పాటు వంద అబద్దా లను కలిపి చెబుతారు

فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ ۚ إِنَّا خَلَقْنَـٰهُم مِّن طِينٍۢ لَّازِبٍۭ ﴿١١﴾

ఓ ముహమ్మద్ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులతో అడగండి: ఏమీ వారు మేము సృష్టించిన ఆకాశములు,భూమి,దైవదూతల కన్న సృష్టిపరంగా బలమైన వారా,అవయవాలపరంగా పెద్ద వారా ?. నిశ్ఛయంగా మేము వారిని జిగట మట్టితో సృష్టించాము. అటువంటప్పుడు వారు ఎలా మరణాంతరం లేపబడటమును తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు స్వయంగా బలహీన సృష్టి నుండి సృష్టించబడిన వారు. అది జిగట మట్టి ?. بل عجبت ويسخرون

بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ ﴿١٢﴾

ఓ ముహమ్మద్ వాస్తవానికి మీరు అల్లా హ్ సామర్ధ్యము నుండి,ఆయన సృష్టి వ్యవహారాల విషయంలో ఆయన పర్యాలోచన నుండి ఆశ్చర్యపోయారు. మరియు మీరు ముష్రికుల మరణాంతరం లేపబడటమును తిరస్కరించటం నుండి ఆశ్ఛర్యపోయారు. మరియు ఈ ముష్రికులందరు మరణాంతరము లేపబడటము పట్ల తమ తిరస్కారము యొక్క తీవ్రత వలన మీరు ఆయన విషయము గురించి చెబుతున్న వాటి నుండి ఎగతాళి చేస్తు న్నారు. وإذا ذكروالا يذكرون

وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ ﴿١٣﴾

మరియు ఈ ముష్రికులందరు హితబోధనల్లోంచి ఏదైన హితబోధన ద్వారా హితబోధన చేయబడితే వారు తమకు ఉన్న హృదయాల కఠినత్వం వలన దానితో హితబోధనను గ్రహించరు,ప్రయోజనం చెందరు. وإ ذا رأوا ءاية يستسخرون

وَإِذَا رَأَوْا۟ ءَايَةًۭ يَسْتَسْخِرُونَ ﴿١٤﴾

మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల్లోంచి ఆయన నిజాయితీపై సూచించే ఏదైన సూచనను చూసినప్పుడు హేళన చేయటంలో,దాని నుండి ఆశ్ఛర్యమును చూపటంలో అధికం చేసేవారు

وَقَالُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌۭ مُّبِينٌ ﴿١٥﴾

మరియు ఇలా పలికారు: ఓ ముహమ్మద్ నీవు తీసుకుని వచ్చినది కేవలం స్పష్టమైన మంత్రజాలము మాత్రమే. أءذا متنا وكنا ترابا وعظما أءنا لمبعوثون

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ ﴿١٦﴾

అయితే మేము మరణించి మట్టిగా,కృశించిపోయి ముక్కలుగా అయిన ఎముకలుగా మారిపోయినప్పుడు ఏమీ మేము దాని తరువాత జీవింపజేయబడి మరల లేపబడతామా ?. నిశ్ఛయంగా ఇది చాలా దూరమైన విషయం

أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ ﴿١٧﴾

ఏమిటీ మా కన్న మునుపు చనిపోయిన పూర్వ మా తాతముత్తా తలు మరల లేపబడుతారా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ قل نعم وأنتمدخرون

قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ ﴿١٨﴾

ఓ ముహమ్మద్ వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి: అవును మీరు మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయిన తరువాత మరల లేపబడుతారు మరియు మీ పూర్వ తాతముత్తా తలూ మరల లేపబడుతారు. మీరందరు అధములై,నీచులై లేపబడుతారు. فإنما هى زجرة وحدة فإذا هم ينظرون

فَإِنَّمَا هِىَ زَجْرَةٌۭ وَٰحِدَةٌۭ فَإِذَا هُمْ يَنظُرُونَ ﴿١٩﴾

అది బాకాలో కేవలం ఒకేే ఒక ఊదటం (రెండవ బాకా) మాత్రమే అప్పుడు వారందరు ప్రళయదిన భయానక స్థితులను చూసి అల్లా హ్ తమకు ఏమి చేస్తు న్నాడోఅని ఎదురుచూస్తుంటారు

وَقَالُوا۟ يَـٰوَيْلَنَا هَـٰذَا يَوْمُ ٱلدِّينِ ﴿٢٠﴾

మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలుకుతారు: అయ్యో మా పాడుగాను ఇది ఆ ప్రతిఫలదినము దేనిలోనైతే అల్లా హ్ తన దాసులకు వారు తమ ఇహలోక జీవితములో చేసుకున్న కర్మలకు ప్రతిఫలమును ప్రసాదిస్తా డో

هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ﴿٢١﴾

అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది: ఇది దాసుల మధ్య తీర్పునిచ్చే ఆ దినము దేనిగురించైతే మీరు ఇహలోకంలో నిరాకరించేవారో,తిరస్కరించేవారో

۞ ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ ﴿٢٢﴾

మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది: తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్చయంగా అది వారి గమ్యస్థా నము

مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ ﴿٢٣﴾

మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది: తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్ఛయంగా అది వారి గమ్యస్థా నము

وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْـُٔولُونَ ﴿٢٤﴾

వారిని నరకాగ్నిలో ప్రవేశపెట్టక మునుపు లెక్క తీసుకోవటం కొరకు ఆపండి. అప్పుడు వారు ప్రశ్నించబడుతారు. ఆ పిదప వారిని నరకాగ్ని వైపునకు తీసుకునిరండి. ما لكم لا تناصرون

مَا لَكُمْ لَا تَنَاصَرُونَ ﴿٢٥﴾

వారిని మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది: మీకేమయింది మీరు ఇహలోకములో ఎలాగైతే ఒకరినొకరు సహాయపడేవారో,మీ విగ్రహాలు మీకు సహాయం చేస్తా రని ఆరోపించేవారో అలా ఒకరినొకరు ఎందుకు సహాయం చేసుకోవటం లేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ ﴿٢٦﴾

కాని వారు ఆ రోజు అల్లా హ్ ఆదేశమునకు కట్టు బడినవారై,లోబడినవారై ఉంటారు. తమ అశక్తి వలన,తమ నిస్సహాయత వలన ఒకరినొకరు సహాయం చేసుకోరు

وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ يَتَسَآءَلُونَ ﴿٢٧﴾

మరియు వారు ఒకరినొకరు దూషించుకుంటూ,వాదులాడుతూ ముందుకు వస్తా రు. అప్పుడు దూషణ,వాదులాట వారికి ప్రయోజనం కలిగించదు

قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ ﴿٢٨﴾

అనుసరించేవారు అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు: ఓ మా పెద్దలారా నిశ్ఛయంగా మీరు ధర్మం,సత్యం వైపు నుండి మా వద్దకు వచ్చి మా కొరకు అవిశ్వాసమును, అల్లా హ్ తో సాటి కల్పించటంను,పాపకార్యములకు పాల్పడటంను అలంకరించి చూపించారు. మరియు ప్రవక్తలు అల్లా హ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన సత్యము నుండి మమ్మల్ని మీరు ధ్వేషమును కలిగించారు. قالوا بل لم تكونوامؤمنين

قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ ﴿٢٩﴾

అనుసరించబడేవారు అనుసరించేవారితో ఇలా పలుకుతారు: విషయం మీరు వాదించినట్లు కాదు. కానీ మీరు అవిశ్వాసంపై ఉన్నారు. మీరు విశ్వాసపరులు కారు. అంతేకాక మీరు తిరస్కరించేవారు

وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَـٰنٍۭ ۖ بَلْ كُنتُمْ قَوْمًۭا طَـٰغِينَ ﴿٣٠﴾

ఓ అనుసరించేవారా మేము మిమ్మల్ని అవిశ్వాసంలో,షిర్కులో,పాపములను పాల్పడటంలో పడవేయటానికి అణచివేత లేదా ఆధిపత్యం ద్వారా మాకు మీపై ఎలాంటి అధికారం లేదు. అంతే కాదు మీరు అవిశ్వాసంలో,మార్గభ్రష్టతలో మితిమీరిపోయే జనులు

فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖ إِنَّا لَذَآئِقُونَ ﴿٣١﴾

అనుసరించే "నీతోను,నిన్ను }ألمألن جهنم منك وممن تبعك منهم أجمعين{: అనివార్యమయింది ఆయతులో ఈ బెదిరింపు హ్ అల్లా మీపై మాపై కావున వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను". ఆపై నిశ్చయంగా మేము మా ప్రభువు బెదిరించిన దాని రుచి ఖచ్చితంగా చూస్తా ము. فأغوينكم إنا كنا غوين

فَأَغْوَيْنَـٰكُمْ إِنَّا كُنَّا غَـٰوِينَ ﴿٣٢﴾

కావున మేము మిమ్మల్ని మార్గభ్రష్టత వైపునకు,అవిశ్వాసము వైపునకు పిలిచాము. నిశ్ఛయంగా మేము కూడా సన్మార్గము నుండి తప్పిపోయి ఉన్నాము

فَإِنَّهُمْ يَوْمَئِذٍۢ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ ﴿٣٣﴾

నిశ్ఛయంగా అప్పుడు అనుసరించేవారు,అనుసరించబడినవారు ప్రళయదినమున శిక్షలో భాగస్వాములవుతారు

إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ ﴿٣٤﴾

నిశ్ఛయంగా మేము ఏవిధంగానైతే వీరందరికి శిక్ష రుచి చూపించామో అలాగే ఇతర అపరాధులతో వ్యవహరిస్తా ము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ ﴿٣٥﴾

నిశ్ఛయంగా ఈ ముష్రికులందరితో ఇహలోకములో "లా ఇలాహ ఇల్లల్లా హ్" మీ వాస్తవ ఆరాధ్యదైవం అల్లా హ్ తప్ప ఇంకెవరూ లేరు దానికి తగ్గట్టు గా ఆచరించమని,దానికి వ్యతిరేకమైన వాటిని వదిలివేయమని పలికినప్పుడు వారు దాన్ని స్పందించడానికి,దానికి కట్టు బడి ఉండటానికి సత్యము నుండి గర్వముతో దానిపై అహంకారముతో నిరాకరించారు

وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍۢ مَّجْنُونٍۭ ﴿٣٦﴾

మరియు వారు తమ అవిశ్వాసము కొరకు వాదిస్తూ ఇలా పలికేవారు: ఏమీ మేము ఒక పిచ్చి కవి మాటపై మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టా లా ?! వారి ఈ మాటకు దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం అని అర్ధం

بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ ﴿٣٧﴾

నిశ్ఛయంగా వారు పెద్ద నిందనే వేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి పిచ్చివారు కాదు,ఎటువంటి కవి కాదు. కాని ఆయన అల్లాహ్ తౌహీద్ వైపునకు,అయన ప్రవక్త ను అనుసరించటం వైపునకు పిలిచే ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. మరియు ఆయన దైవప్రవక్తలను వారు అల్లా హ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన తౌహీదును,వాగ్దా న దినము యొక్క నిరూపణను నిజం చేసి చూపించారు. ఏ విషయంలోను వారిని విబేధించలేదు

إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ ﴿٣٨﴾

ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు ప్రళయదినమున మీ అవిశ్వాసము,ప్రవక్తల పట్ల మీ తిరస్కారము వలన బాధాకరమైన శిక్ష రుచి చూస్తా రు. وما تجزون إلا ما كنتمتعملون

وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٣٩﴾

ఓ ముష్రికులారా మీరు ఇహలోకములో చేసిన అల్లా హ్ పట్ల అవిశ్వాసం,పాపకార్యములకు పాల్పడిన దానికి మాత్రమే ప్రతిఫలం ప్రసాదించబడుతారు

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ ﴿٤٠﴾

కానీ అల్లా హ్ తన ఆరాధన కొరకు ప్రత్యేకించుకున్న విశ్వాసపరులైన అల్లా హ్ దాసులు. మరియు వారు ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు. వారే ఈ శిక్ష నుండి విముక్తి పొందుతారు

أُو۟لَـٰٓئِكَ لَهُمْ رِزْقٌۭ مَّعْلُومٌۭ ﴿٤١﴾

చిత్తశుద్ధి కల ఈ దాసులందరి కొరకు ఆహారోపాధి కలదు. దాన్నే అల్లా హ్ వారికి ప్రసాదిస్తా డు. అది తన శ్రేష్ఠతలో,తన మంచితనములో,తన ఎల్లప్పుడు ఉండటంలో పేరుగాంచినది

فَوَٰكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ ﴿٤٢﴾

మరియు ఈ జీవనోపాధి నుండే వారు తినే మరియు కోరుకునే ఉత్తమమైన ఫలములను ప్రసాదించబడుతారు. మరియు ఆపైన వారు స్థానములను పెంపొందించబడి,గౌరవోన్నతుడైన అల్లా హ్ ముఖమును దర్శించుకోవటం ద్వారా గౌరవించబడుతారు

فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ ﴿٤٣﴾

వీటన్నింటిని వారు అంతంకాని,తొలగిపోని శాశ్వతమైన,స్థిరమైన అనుగ్రహాలు కల స్వర్గవనాలలో పొందుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ عل سرر متقبلين

عَلَىٰ سُرُرٍۢ مُّتَقَـٰبِلِينَ ﴿٤٤﴾

వారు ఎదురెదురుగా ఆసనములపై ఆనుకుని కూర్చొని ఒకరినొకరు చూస్తుంటారు. يطاف عليهم بكأس من معين

يُطَافُ عَلَيْهِم بِكَأْسٍۢ مِّن مَّعِينٍۭ ﴿٤٥﴾

వారి మధ్య తమ స్వచ్చదనంలో ప్రవహించే నీటి వలే ఉండే మధు గ్లా సులు త్రిప్పబడుతాయి

بَيْضَآءَ لَذَّةٍۢ لِّلشَّـٰرِبِينَ ﴿٤٦﴾

అవి రంగులో తెల్లవిగా ఉంటాయి వాటిని త్రా గేవాడు పరిపూర్ణరుచిని ఆస్వాదిస్తా డు. لا فيها غول ولا هم عنها ينزفون

لَا فِيهَا غَوْلٌۭ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ ﴿٤٧﴾

అది ఇహలోకపు మధ్యం లాంటిది కాదు. అందులో మతిని పోగొట్టే మత్తు ఉండదు. మరియు దాన్ని వినియోగించేవారికి తలనొప్పి ఉండదు. దాన్ని త్రా గేవాడి శరీరము,బుద్ధి భద్రంగా ఉంటాయి

وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌۭ ﴿٤٨﴾

మరియు స్వర్గములో వారి దగ్గర శీలవతులైన స్త్రీలు ఉంటారు. వారి చూపులు తమ భర్తలకు తప్ప ఇతరుల.వైపునకు వాలవు. అందమైన కళ్ళుగల వారై ఉంటారు. كأن هن بيض مكنون

كَأَنَّهُنَّ بَيْضٌۭ مَّكْنُونٌۭ ﴿٤٩﴾

వారు తమ రంగులో పసుపురంగులో కలిసిన తెల్లగా ఉండి ఎవరిచేతులు తాకని భద్రంగా ఉన్న తెల్లని పక్షులవలే ఉంటారు

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍۢ يَتَسَآءَلُونَ ﴿٥٠﴾

అప్పుడు స్వర్గవాసులు ఒకరినొకరు తమ గతము గురించి ఇహలోకములో వారికి సంభవించిన దాని గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు

قَالَ قَآئِلٌۭ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌۭ ﴿٥١﴾

విశ్వాసపరులందరిలో నుండి పలికేవాడు ఒకడు ఇలా పలుకుతాడు: నిశ్చయంగా నాకు ఇహలోకంలో మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఒక స్నేహితుడుండేవాడు

يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ ﴿٥٢﴾

అతడు నాతో తిరస్కరిస్తూ ,హేళన చేస్తూ ఇలా పలికేవాడు: ఓ మిత్రమా ఏమీ నీవు మృతులు మరల లేపబడటమును నమ్మేవారిలోంచివా ?. أءذا متنا وكنا ترابا وعظما أءنا لمدينون

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَـٰمًا أَءِنَّا لَمَدِينُونَ ﴿٥٣﴾

ఏమీ మేము మరణించి మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయినప్పుడు మేము మరలలేపబడుతామా మరియు మేము ఇహలోకంలో చేసిన మా కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతామా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ قال هل أنتم مط لعون

قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ ﴿٥٤﴾

విశ్వాసపరుడైన అతని మితృడు స్వర్గవాసులైన తన మితృలతో ఇలా పలుకుతాడు: ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన స్నేహితుడి పరిణామమును మేము చూడటానికి మీరు నాతోపాటు తొంగి చూస్తా రా ?

فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ ﴿٥٥﴾

అప్పుడు అతను తొంగి చూస్తా డు. తన స్నేహితుడిని నరకం మధ్యలో చూస్తా డు

قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ ﴿٥٦﴾

అతడు ఇలా పలుకుతాడు: అల్లా హ్ సాక్షిగా ఓ నా మిత్రమా నీవు నన్ను అవిశ్వాసము,మరణాంతరము లేపబడటము వైపు నీ పిలుపు ద్వారా నన్ను నరకములో ప్రవేశింపజేసి నాశనం చేసి ఉండేవాడివే

وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ ﴿٥٧﴾

ఒక వేళ నాపై విశ్వసము కొరకు మార్గదర్శకము,దాని సౌభాగ్యము ద్వారా అల్లా హ్ అనుగ్రహమే లేకపోతే నీలాగా నేనూ శిక్ష వైపు హాజరు అయ్యేవారిలో నుంచి అయిపోయేవాడిని. أفما نحن بميتين

أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ ﴿٥٨﴾

అయితే మేము - స్వర్గవాసులు - మరణించము

إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ ﴿٥٩﴾

ఇహలోకములోని మన మొదటి మరణం తప్ప. అంతే కాదు మేము స్వర్గంలో శాశ్వతంగా ఉంటాము. మరియు అవిశ్వాసపరులు శిక్షింపబడినట్లు మేము శిక్షింపబడము

إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ ﴿٦٠﴾

నిశ్ఛయంగా మా ప్రభువు మాకు ప్రతిఫలంగా ప్రసాదించిన స్వర్గములో ప్రవేశము,అందులో శాశ్వత నివాసము,నరకాగ్ని నుండి భద్రత గొప్ప సాఫల్యము. దానికి సరితూగే ఎటువంటి సాఫల్యము లేదు

لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ ٱلْعَـٰمِلُونَ ﴿٦١﴾

ఇటువంటి గొప్ప సాఫల్యము కొరకు ఆచరించే వారు ఆచరించటం తప్పనిసరి. నిశ్ఛయంగా ఇదే లాభదాయకమైన వ్యాపారము

أَذَٰلِكَ خَيْرٌۭ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ ﴿٦٢﴾

తన విధేయత కొరకు ప్రత్యేకించుకున్న తన దాసుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచినటువంటి ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలు స్థానమును బట్టి,ఆతిధ్యమును బట్టి మేలైనవా,గొప్పవా లేదా ఖుర్ఆన్ లో దూషించబడినటువంటి జముడు చెట్టు ఏదైతే అవిశ్వాసపరుల ఆహారమో అది లావు చేయదు,ఆకలినీ తీర్చదు అది (మేలైనదా). بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إنا جعلنها فتنة للظ لمين

إِنَّا جَعَلْنَـٰهَا فِتْنَةًۭ لِّلظَّـٰلِمِينَ ﴿٦٣﴾

నిశ్ఛయంగా మేము ఈ వృక్షమును ఒక పరీక్షగా చేశాము. దాని ద్వారా అవిశ్వాసముతో,పాపకార్యములతో దుర్మార్గులైనవారు పరీక్షింపబడుతారు. అందుకనే వారు ఇలా పలికారు: నిశ్ఛయంగా అగ్ని వృక్షములను తినివేస్తుంది. అందులో అవి మొలకెత్తటం అసంభవం

إِنَّهَا شَجَرَةٌۭ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ ﴿٦٤﴾

నిశ్ఛయంగా జముడు చెట్టు ఒక ప్రా ణాంతక చెట్టు. అది నరకము యొక్క లోతు నుండి వెలికి వచ్చే వృక్షము

طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَـٰطِينِ ﴿٦٥﴾

దాని నుండి వాటి ఫలములు వెలికి వచ్చే భయంకర దృశ్యము షైతానుల తలలవలె ఉంటాయి. దృశ్యం యొక్క వికారము సమాచారము ఇచ్చేవారి వికారమునకు సూచన. మరియు ఇది అంటే దాని ఫలములు రుచిలో చెడ్డవని అర్ధం

فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ ﴿٦٦﴾

అయితే అప్పుడు అవిశ్వాసపరులు చేదైన,వికారమైన దాని పండ్లను తింటారు. తమ ఖాళీ కడుపులను దానితో నింపుకుంటారు. ثم إن لهم عليها لشوبا من حميم

ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًۭا مِّنْ حَمِيمٍۢ ﴿٦٧﴾

నిశ్ఛయంగా వారు దాని నుండి తిన్న తరువాత వారి కొరకు వికారమైన వేడి మిశ్రమ పానియం ఉంటుంది

ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ ﴿٦٨﴾

ఆ తరువాత నిశ్ఛయంగా దాని తరువాత వారి మరలింపు మండే అగ్నిశిక్ష వైపుకు అవుతుంది. అప్పుడు వారు ఒక శిక్ష నుండి ఇంకో శిక్ష వైపునకు మరలుతారు

إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ ﴿٦٩﴾

నిశ్ఛయంగా ఈ అవిశ్వాసపరులందరు తమ తాతముత్తాతలను సన్మార్గము నుండి తప్పిపోయినవారిగా పొందుతారు. వారు వారిని నమూనాగా చేసుకున్నది అనుకరణగా మాత్రమే,ఎటువంటి ఆధారపరంగా కాదు

فَهُمْ عَلَىٰٓ ءَاثَـٰرِهِمْ يُهْرَعُونَ ﴿٧٠﴾

అప్పుడు వారు తమ తాతముత్తా తల అడుగుజాడలోనే మర్గభ్రష్టతలో తొందరపడుతూ అనుసరించారు

وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ ﴿٧١﴾

వాస్తవానికి వారికి మునుపుచాలా మంది పూర్వికులు పెడదారి పట్టి ఉన్నారు. ఓ ప్రవక్తా జాతుల్లోంచి మొదట పెడదారిన పడినది మీ జాతి కాదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ولقد أرسلنا فيهم منذرين

وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ ﴿٧٢﴾

మరియు నిశ్చయంగా మేము ఆ మొదటి జాతుల వారిలో ప్రవక్తలను పంపించాము.వారు వారిని అల్లా హ్ శిక్ష నుండి భయపెట్టేవారు. అప్పుడు వారు తిరస్కరించారు

فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُنذَرِينَ ﴿٧٣﴾

ఓ ప్రవక్తా ఆ జాతుల ముగింపు ఎవరినైతే వారి ప్రవక్తలు హెచ్చరిస్తే వారు వారిని స్వీకరించలేదో ఏమయిందో మీరు చూడండి. నిశ్ఛయంగా వారి అవిశ్వాసం వలన,వారి ప్రవక్తలను వారు తిరస్కరించటం వలన వారి ముగింపు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశమయింది

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ ﴿٧٤﴾

అల్లా హ్ తనపై విశ్వాసమునకు ప్రత్యేకించుకున్నవారు తప్ప. నిశ్ఛయంగా వారు తిరస్కారులైన అవిశ్వాసపరులందరి ముగింపు ఏదైతో జరిగినదో ఆ శిక్ష నుండి ముక్తి పొందేవారయ్యారు

وَلَقَدْ نَادَىٰنَا نُوحٌۭ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ ﴿٧٥﴾

మరియు నిశ్ఛయంగా మన ప్రవక్త నూహ్ అలాహిస్సలాం తనును తిరస్కరించిన తన జాతి వారిపై బద్దుఆ (శపించినప్పుడు) చేసినప్పుడు మమ్మల్నే వేడుకున్నాడు. మేమే ఎంతో చక్కగా ప్రా ర్ధనలను అంగీకరించేవారము. నిశ్ఛయంగా మేము వారికి వ్యతిరేకంగా ఆయన ప్రా ర్దనను స్వీకరించటంలో తొందర చేశాము

وَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ ﴿٧٦﴾

మరియు నిశ్ఛయంగా మేము అతనిని,అతని కుటుంబీకులని,అతనితోపాటు విశ్వసించినవారిని అతని జాతి వారి వేదింపుల నుండి,అవిశ్వాసపరులైన అతని జాతి వారిపై పంపించబడ్డ పెద్ద తూఫాను ద్వారా మునగటం నుండి రక్షించాము

وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ ﴿٧٧﴾

మరియు మేము అతని కుటుంబం వారిని,విశ్వాసపరులైన అతనిని అనుసరించేవారిని ఒక్కరినే రక్షించాము. నిశ్ఛయంగా మేము అతని జాతిలో నుండి అవిశ్వాసపరులైన ఇతరులను ముంచివేశాము

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ ﴿٧٨﴾

మరియు మేము అతని కొరకు తరువాత వచ్చే సమాజముల్లో మంచి కీర్తిని మిగిల్చాము వారు దాని ద్వారా అతనిని పొగిడేవారు

سَلَـٰمٌ عَلَىٰ نُوحٍۢ فِى ٱلْعَـٰلَمِينَ ﴿٧٩﴾

నూహ్ కొరకు తరువాత వచ్చే సమాజములలో ఆయన గురించి చెడు పలకటం నుండి భద్రత మరియు శాంతి కలుగుగాక. అంతే కాదు ఆయన కొరకు కీర్తి మరియు మంచి ప్రస్తా వన మిగిలి ఉంటుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿٨٠﴾

నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలం లాంటి దాన్ని ఒక్కడైన అల్లా హ్ కొరకు తమ ఆరాధన చేయటంలో, తమ విధేయత చూపటంలో మంచిగా చేసే వారికి ప్రసాదిస్తా ము

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ ﴿٨١﴾

నిశ్ఛయంగా నూహ్ అల్లా హ్ విధేయతలో ఆచరించే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు

ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ ﴿٨٢﴾

ఆ తరువాత మిగిలిన వారిని మేము వారిపై పంపించిన తూఫాను ద్వారా ముంచివేశాము. వారిలో నుండి ఎవరూ మిగలలేదు

۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ ﴿٨٣﴾

మరియు నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా హ్ తౌహీద్ వైపునకు పిలవటంలో ఆయనను ఏకీభవించిన అతని ధర్మం వారిలోంచి వారు

إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍۢ سَلِيمٍ ﴿٨٤﴾

అయితే షిర్కు నుండి భద్రమైన హృదయముతో, అల్లా హ్ కొరకు ఆయన సృష్టితాల్లో హితోపదేశం చేసేవాడిగా తన ప్రభువు వద్దకు వచ్చినప్పటి వేళ మీరు గుర్తు చేసుకోండి. إذ قال لأبيه وقومه ماذا تعبدون

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ ﴿٨٥﴾

ఆయన తన తండ్రితో,తన జాతి వారైన ముష్రికులతో వారిని మందలిస్తూ మీరు అల్లా హ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తు న్నారు ? అని అడిగినప్పుడు

أَئِفْكًا ءَالِهَةًۭ دُونَ ٱللَّهِ تُرِيدُونَ ﴿٨٦﴾

ఏమీ మీరు అల్లా హ్ ను వదిలి అసత్య దైవాలను ఆరాధిస్తు న్నారా ?

فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٨٧﴾

ఓ నా జాతివారా సర్వలోకాల ప్రభువు గురించి మీరు ఇతరులను ఆరాధిస్తూ ఆయనను కలిసినప్పుడు మీ ఆలోచనేమిటి ?. మరియు ఆయన మీకు ఏమి చేస్తా రని మీరు అనుకుంటున్నారు ?!

فَنَظَرَ نَظْرَةًۭ فِى ٱلنُّجُومِ ﴿٨٨﴾

అప్పుడు ఇబ్రాహీం తన జాతి వారితోపాటు బయలుదేరటం నుండి ముక్తి పొందటం కొరకు వ్యూహమును రచిస్తూ నక్షత్రముల వైపు ఒక చూపు చూశారు. فقال إنى سقيم

فَقَالَ إِنِّى سَقِيمٌۭ ﴿٨٩﴾

అప్పుడు ఆయన తన జాతి వారితో వారి జాతరకి బయలుదేరటం నుండి కారణం చూపుతూ ఇలా పలికారు: నిశ్ఛయంగా నేను అనారోగ్యంగా ఉన్నాను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ فتولوا عنه مدبرين

فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ ﴿٩٠﴾

అప్పుడు వారు ఆయనను తమ వెనుక వదిలి వెళ్ళిపోయారు

فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ ﴿٩١﴾

అప్పుడు ఆయన వారు అల్లా హ్ ను వదిలి ఆరాధించే వారి ఆరాధ్య దైవాల వద్దకు మెల్లగా వెళ్ళారు. అప్పుడు వారి ఆరాధ్య దైవాలను హేళన చేస్తూ ఇలా పలికారు: ఏమీ ముష్రికులు మీ కొరకు తయారు చేసినటువంటి ఆహారమును మీరు తినరా ?! ما لكم لا تنطقون

مَا لَكُمْ لَا تَنطِقُونَ ﴿٩٢﴾

మీ విషయమేమిటి మీరు మాట్లా డటం లేదు మరియు మిమ్మల్ని అడిగిన వారికి సమాధానమివ్వటం లేదు ?. ఏమీ ఇలాంటివి అల్లా హ్ ను వదిలి ఆరాధన చేయబడుతున్నాయా ?!

فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ ﴿٩٣﴾

అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని విరగ్గొట్టటం కొరకు తన కుడి చేత్తో కొడుతూ వారి వైపుకు వెళ్ళారు

فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ ﴿٩٤﴾

అప్పుడు ఈ విగ్రహాల ఆరాధకులు ఆయన వద్దకు తొందరగా వచ్చారు. قال أتعبدون ما تنحتون

قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ ﴿٩٥﴾

అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని స్థిరంగా ఎదుర్కొన్నారు. మరియు వారితో ఇలా పలికారు: ఏమీ మీరు మీ చేతులతో చెక్కిన దేవతలను అల్లా హ్ ను వదిలి ఆరాధిస్తు న్నారా ?!

وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ ﴿٩٦﴾

పరిశుద్ధు డైన అల్లా హ్ మమ్మల్నీ సృష్టించాడు మరియు మీ ఆచరణనూ సృష్టించాడు. మరియు ఈ విగ్రహాలు మీ కర్మల్లోంచివే. కాబట్టి ఆయన తన ఒక్కడి ఆరాధన చేయబడటం కొరకు,తనతోపాటు ఇతరులను సాటికల్పించకుండా ఉండటం కొరకు యోగ్యుడు

قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَـٰنًۭا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ ﴿٩٧﴾

ఎప్పుడైతే వారు ఆయన్ను వాదనతో ఎదుర్కోవటం నుండి అశక్తులయ్యారో బలప్రయోగమునకు ఆశ్రయించారు. అప్పుడు వారు ఇబ్రాహీంను ఏమి చేయాలన్న విషయంలో పరస్పరం సంప్రదింపులు చేశారు. వారు ఇలా పలికారు: మీరు అతని కొరకు ఒక కట్టడమును నిర్మించండి. మరియు దాన్ని కట్టెలతో నింపివేసి దాన్ని నిప్పంటించండి. ఆ తరువాత అతన్ని అందులో విసిరివేయండి

فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًۭا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَسْفَلِينَ ﴿٩٨﴾

అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతివారు ఇబ్రాహీం అలైహిస్సలాంను హతమార్చి ఆయన నుండి విముక్తి పొందటానకి ఇబ్రాహీం అలైహిస్సలాంను కీడు చేయదలచారు. మేము ఆయనపై అగ్నిని చల్లగా,శాంతిదాయకంగా చేసినప్పుడు మేము వారిని నష్టపోయేవారిలోంచి చేశాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وقال إنى ذاهب إلى ربى سيهدين

وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ ﴿٩٩﴾

ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు: నిశ్చయంగా నేను నా ప్రభువు వైపునకు ఆయన ఆరాధనను పూర్తిగా చేయటానికి నా జాతి వారి నగరమును వదిలి వలసపోయేవాడిని. తొందరలోనే నా ప్రభువు ఇహపరాల్లో నాకు మేలు దేనిలో ఉన్నదో దాన్ని నాకు సూచిస్తా డు

رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّـٰلِحِينَ ﴿١٠٠﴾

ఓ నా ప్రభువా నాకు సహాయకునిగా,ప్రవాసంలో నా జాతివారి నుండి బదులుగా అయ్యే ఒక పుణ్య కుమారుడిని నాకు ప్రసాదించు. فبشرنه بغلم حليم

فَبَشَّرْنَـٰهُ بِغُلَـٰمٍ حَلِيمٍۢ ﴿١٠١﴾

అప్పుడు మేము అతని అర్ధనను స్వీకరించి అతనికి సంతోషమును కలిగించే శుభవార్తనిచ్చాము. ఎందుకంటే మేము అతనికి పెద్దరికమును చాటి సహనశీలుడయ్యే ఒక కుమారుడిని ప్రసాదించాము. మరియు ఈ పిల్లవాడు అతడే ఇస్మాయీల్ అలైహిస్సలాం

فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَـٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَـٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰبِرِينَ ﴿١٠٢﴾

ఇస్మాయీల్ అలైహిస్సలాం యవ్వనానికి చేరుకుని తన తండ్రి పరుగెత్తటమునకు తన పరుగెత్తటము చేరువైనప్పుడు అతని తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కలను చూశారు. మరియు దైవప్రవక్తల కల దైవవాణి అవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కల అంశము గురించి తన కుమారుడికి సమాచారమిస్తూ ఇలా పలికారు: ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా నేను కలలో నిన్ను జుబహ్ చేస్తు న్నట్లు గా చూశాను. అయితే నీవు ఈ విషయంలో నీ అభిప్రా యం ఏమిటో చూడు. అప్పుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం తన తండ్రికి ఇలా పలుకుతూ సమాధానమిచ్చారు: ఓ నా తండ్రి నన్ను జుబహ్ చేసే విషయం గురించి మీకు అల్లా హ్ ఆదేశించిన దాన్ని చేసి తీరండి. తొందరలోనే మీరు నన్ను అల్లా హ్ ఆదేశమును స్వీకరించే వారిలోంచి,సహనం చూపే వారిలోంచి పొందుతారు

فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ ﴿١٠٣﴾

ఎప్పుడైతే వారిద్దరు అల్లా హ్ కి లోబడి ఆయనకు విధేయులయ్యారో ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడిని తన ప్రభువు అతన్ని జుబహ్ చేయమని ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి అతని నుదటి మీద బొర్లా పడుకోబెట్టా రు

وَنَـٰدَيْنَـٰهُ أَن يَـٰٓإِبْرَٰهِيمُ ﴿١٠٤﴾

మరియు మేము ఇబ్రాహీం ను అతను తన కుమారుడిని జుబహ్ చేయమని అల్లా హ్ ఆదేశించిన దాన్ని నెరవేర్చటానికి పూనుకుని ఉన్నప్పుడు ఇలా పిలిచాము: ఓ ఇబ్రాహీం

قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿١٠٥﴾

నిశ్ఛయంగా నీవు నీ నిదురలో చూసిన కలను నీ కుమారుని జుబహ్ చేసే దృఢ సంకల్పము ద్వారా నిజం చేసి చూపించావు. ఈ పెద్ద పరీక్ష నుండి నిన్ను విముక్తిని కలిగించి మేము నీకు ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తాము. కావున మేము వారిని పరీక్షల నుండి,కష్టా ల నుండి విముక్తిని కలిగిస్తా ము

إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْبَلَـٰٓؤُا۟ ٱلْمُبِينُ ﴿١٠٦﴾

నిశ్ఛయంగా ఇదే స్పష్టమైన పరీక్ష. మరియు నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అందులో సాఫల్యం చెందారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وفدينهبذب ح عظيم

وَفَدَيْنَـٰهُ بِذِبْحٍ عَظِيمٍۢ ﴿١٠٧﴾

మరియు మేము ఇస్మాయీలు అలైహిస్సలాంకు బదులుగా ఆయన తరపు నుండి జుబహ్ చేయటానికి ఒక పెద్ద గొర్రెను పరిహారంగా ఇచ్చాము

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ ﴿١٠٨﴾

మరియు మేము తరువాత వచ్చే తరాలలో ఇబ్రాహీం అలైహిస్సలాం పై మంచి కీర్తిని ఉంచాము

سَلَـٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ ﴿١٠٩﴾

అల్లా హ్ వద్ద నుండి ఆయన కొరకు అభినందనలు, ప్రతీ నష్టము,ఆపద నుండి భద్రత యొక్క ప్రా ర్ధన లభించినది

كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿١١٠﴾

మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఆయన విధేయత చూపటంపై ఈ ప్రతిఫలమును ప్రసాదించినట్లే సజ్జనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తా ము

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ ﴿١١١﴾

నిశ్ఛయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా హ్ కొరకు ఆరాధనను తగినي విధంగా పూర్తి చేసే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు

وَبَشَّرْنَـٰهُ بِإِسْحَـٰقَ نَبِيًّۭا مِّنَ ٱلصَّـٰلِحِينَ ﴿١١٢﴾

మరియు మేము ఆయనకు తన ఏకైక కుమారుడిని జుబహ్ చేయటంలో అల్లా హ్ కు తన విధేయత చూపటంపై ప్రతిఫలంగా ప్రవక్త, పుణ్యదాసుడయ్యే ఇంకొక కుమారుడి శుభవార్తనిచ్చాము. అతడే ఇస్హా ఖ్ అలైహిస్సలాం

وَبَـٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَـٰقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌۭ وَظَالِمٌۭ لِّنَفْسِهِۦ مُبِينٌۭ ﴿١١٣﴾

మరియు మేము అతనిపై,అతని కుమారుడగు ఇస్హా ఖ్ పై మా వద్ద నుండి శుభాలను కురిపించాము. అప్పుడు మేము వారి కొరకు అనుగ్రహాలను అధికం చేశాము. మరియు వారిద్దరి సంతానము అధికమవటం వాటిలో నుండే. మరియు వారి సంతానములో నుండి తమ ప్రభువు కొరకు తమ విధేయతను మంచిగా చేసే వారున్నారు. మరియు వారిలో నుండి అవిశ్వాసము,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయంపై స్పష్టమైన దుర్మార్గమునకు పాల్పడిన వారున్నారు. ولقدمنناعل موس وهرون

وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ ﴿١١٤﴾

మరియు నిశ్ఛయంగా మేము మూసా మరియు ఆయన సోదరుడైన హారూన్ పై దైవదౌత్యము ద్వారా ఉపకారము చేశాము

وَنَجَّيْنَـٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ ﴿١١٥﴾

మరియు మేము వారిని, వారి జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని ఫిర్ఔన్ వారిని బానిసలుగా చేసుకోవటం నుండి మరియు మునగటం నుండి విముక్తిని కలిగించాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَنَصَرْنَـٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ ﴿١١٦﴾

మరియు మేము వారికి ఫిర్ఔన్,అతని సైన్యములకు వ్యతిరేకముగా సహాయం చేశాము. అప్పుడు వారికి వారి శతృవులపై విజయం కలిగింది

وَءَاتَيْنَـٰهُمَا ٱلْكِتَـٰبَ ٱلْمُسْتَبِينَ ﴿١١٧﴾

మరియు మేము మూసా,ఆయన సోదరుడు హారూన్ కి తౌరాతును అల్లా హ్ వద్ద నుండి ఎటువంటి సందేహము లేని గ్రంధముగా ప్రసాదించాము

وَهَدَيْنَـٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ ﴿١١٨﴾

మరియు మేము వారిద్దరికి ఎటువంటి వంకరుతనం లేని రుజుమార్గమును చూపించాము. మరియు అది పరిశుద్ధు డైన సృష్టికర్త ఇష్టతకు చేరవేసే ఇస్లాం ధర్మం

وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ ﴿١١٩﴾

మరియు మేము వచ్చే తరాలలో వారికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తా వనను మిగిలి ఉండేలా చేశాము. سلمعل موس وهرون

سَلَـٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ ﴿١٢٠﴾

వారి కొరకు అల్లా హ్ వద్ద నుండి మంచి అభినందనలు,వారికి కీర్తి, ప్రతీ ఇష్టం లేని వాటి నుండి భద్రత కొరకు ప్రా ర్ధన కలవు

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿١٢١﴾

నిశ్ఛయంగా మేము మూసా,హారూన్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే తమ ప్రభువు కొరకు తమ విధేయత ద్వారా మంచి చేసేవారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా ము

إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ ﴿١٢٢﴾

నిశ్ఛయంగా మూసా,హారూన్ అల్లా హ్ పై విశ్వాసమును కనబరిచే, ఆయన వారి కొరకు ధర్మబద్దం చేసిన వాటిని ఆచరించే మా దాసులలోంచివారు

وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ ﴿١٢٣﴾

మరియు నిశ్ఛయంగా ఇల్యాస్ తన ప్రభువు వద్ద నుండి పంపించబడిన ప్రవక్తల్లోంచి వారు. అల్లాహ్ ఆయన పై దైవదౌత్యము,సందేశాలను చేరవేయటమును అనుగ్రహించాడు

إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ ﴿١٢٤﴾

అతను తాను ప్రవక్తగా పంపించబడిన తన జాతి ఇస్రాయీలు సంతతి వారితో ఇలా పలికినప్పుడు: ఓ నా జాతివారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి అందులో నుండి తౌహీదు ఉన్నది మరియు తాను వారించిన వాటి నుండి జాగ్రత్త వహించి వాటిలో నుండి షిర్కు ఉన్నది మీరు అల్లా హ్ కి భయపడరా ?. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَتَدْعُونَ بَعْلًۭا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَـٰلِقِينَ ﴿١٢٥﴾

ఏమీ మీరు అల్లా హ్ ను వదిలి మీ విగ్రహమైన బఅల్ ను ఆరాధిస్తు న్నారా మరియు సర్వోత్తముడైన అల్లా హ్ ఆరాధనను వదిలివేస్తు న్నారా ?!

ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ ﴿١٢٦﴾

మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించిన,మీ పూర్వికులైన తాతముత్తాతలను సృష్టించిన మీ ప్రభువు. ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన కాకుండా లాభం చేయలేని,నష్టం కలిగించని విగ్రహాలు కావు. فكذبوه فإن هم لمحضرون

فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ ﴿١٢٧﴾

అయితే అతని జాతివారి నుండి అతన్ని తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగలేదు. వారి తిరస్కారము వలన వారు శిక్షలో హాజరుచేయబడుతారు

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ ﴿١٢٨﴾

కాని అతని జాతి వారిలో నుంచి విశ్వాసపరుడై అల్లా హ్ కొరకు ఆయన ఆరాధన విషయంలో చిత్తశుద్ధి కలవాడై ఉండేవాడు నిశ్ఛయంగా అతడు శిక్ష వైపునకు హాజరు చేయటం నుండి ముక్తి పొందుతాడు

وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ ﴿١٢٩﴾

మరియు మేము వచ్చే తరాలలో అతనికి మంచి కీర్తిని మరియు మంచి ప్రస్తా వనను మిగిలి ఉండేలా చేశాము

سَلَـٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ ﴿١٣٠﴾

అల్లా హ్ వద్ద నుండి ఇల్,యాస్ పై అభినందనలు మరియు కీర్తి కలుగుగాక

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿١٣١﴾

నిశ్ఛయంగా మేము ఇల్,యాస్ కు ఈ మంచి ప్రతిఫలమును ప్రసాదించినట్లే విశ్వాసపరులైన మా దాసుల్లోంచి మంచి చేసే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా ము

إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ ﴿١٣٢﴾

నిశ్ఛయంగా ఇల్,యాస్ వాస్తవంగా విశ్వాసపరులైన,తమ ప్రభువు పై తమ విశ్వాసములో సత్యవంతులైన మా దాసులలోని వాడు

وَإِنَّ لُوطًۭا لَّمِنَ ٱلْمُرْسَلِينَ ﴿١٣٣﴾

మరియు నిశ్చయంగా లూత్ అల్లా హ్ తమ జాతుల వారివద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు. إ ذ نجينه وأهله أجمعين

إِذْ نَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ ﴿١٣٤﴾

అయితే అతని జాతి వారిపై పంపించబడ్డ శిక్ష నుండి మేము అతన్ని,అతని జాతి వారిని రక్షించినప్పటి వైనమును నీవుగుర్తు చేసుకో. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِلَّا عَجُوزًۭا فِى ٱلْغَـٰبِرِينَ ﴿١٣٥﴾

అతని భార్య తప్ప. ఆమెకూడా వారిలాగా అవిశ్వాసపరురాలు కావటం వలన ఆమె జాతి వారి యొక్క శిక్ష ఆమెకూ వర్తించే స్త్రీ అయిపోయినది

ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ ﴿١٣٦﴾

ఆ తరువాత అతన్ని తిరస్కరించి,అతను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించని వారిలో నుంచి అయిన అతని జాతి వారిలో నుండి మిగిలిన వారినీ కూడా మేము తుదిముట్టించాము. وإ نكم لتمرون عليهم م ص بحين

وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ ﴿١٣٧﴾

మరియు నిశ్ఛయంగా ఓ మక్కా వాసులారా మీరు షామ్ (శిరియా) వైపు మీ ప్రయాణములలో వారి నివాసములపై నుండి ఉదయం వేళ ప్రయాణిస్తూ ఉంటారు

وَبِٱلَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿١٣٨﴾

మరియు అలాగే మీరు వాటిపై నుండి రాత్రి వేళలో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఏమీ వారి యొక్క తిరస్కరించటం,వారి యొక్క అవిశ్వాసము కనబరచటం,ముందెన్నడూ వారితో జరగని అశ్లీల కార్యమును వారి యొక్క పాల్పడటం తరువాత వారికి ఏమి జరిగినదో దాని ద్వారా మీరు అర్ధం చేసుకోరా,హితబోధన గ్రహించరా ?

وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ ﴿١٣٩﴾

మరియు నిశ్ఛయంగా మా దాసుడగు యూనుస్ అల్లా హ్ తమ జాతుల వారి వద్దకు శుభవార్తనిచ్చేవారిగా,హెచ్చరించే వారిగా పంపించిన ప్రవక్తల్లోంచి వాడు

إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ ﴿١٤٠﴾

తన ప్రభువు అనుమతి లేకుండా తన జాతి వారి నుండి పారిపోయి ప్రయాణికులతో,సామానుతో నిండిన ఒక పడవ పై సవారీ అయినప్పుడు

فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ ﴿١٤١﴾

పడవ అది నిండిపోవటం వలన మునగటానికి దగ్గరలో ఉన్నది. అప్పుడు ప్రయాణికులు ఎక్కువవటం వలన పడవ మునిగి పోతుందేమోనని భయముతో తమలోని కొందరిని తీసి పడవేయటానికి ప్రయాణికులు చీటీ వేశారు. ఆ ఓడిపోయిన వారిలో నుండి యూనుస్ అయ్యాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు

فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌۭ ﴿١٤٢﴾

ఎప్పుడైతే వారు అతన్ని సముద్రంలో పడవేశారో పెద్ద చేప అతన్ని పట్టు కుని మ్రింగివేసింది. మరియు అతడు తన ప్రభువు అనుమతి లేకుండా సముద్రం వద్దకు వెళ్ళటం వలన అతడు నిందించబడే కార్యము చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ ﴿١٤٣﴾

యూనుస్ తనకు సంభవించిన దాని కన్న మునుపు ఎక్కువగా అల్లా హ్ స్మరణ చేసేవారిలో నుంచి కాకపోయి ఉంటే మరియు చేప కడుపులో ఆయన పరిశుద్ధత కొనియాడటం లేకపోయి ఉంటే

لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ﴿١٤٤﴾

ఆయన చేప కడుపులోనే అది అతనికి సమాదిగా అయిపోయి ప్రళయదినం వరకు ఉండిపోయేవాడు

۞ فَنَبَذْنَـٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌۭ ﴿١٤٥﴾

అప్పుడు మేము అతడిని చేప కడుపు నుండి తీసి చెట్లు ,కట్టడాలు లేని ఖాళీ ప్రదేశంలో పడవేశాము. అతడు చేప కడుపులో కొంత కాలం ఉండటం వలన బలహీన శరీరము కలవాడి స్థితిలో ఉన్నాడు. وأنبتنا عليه شجرة من يقطين

وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةًۭ مِّن يَقْطِينٍۢ ﴿١٤٦﴾

మరియు మేము ఆ ఖాళీ ప్రదేశంలో ఆనపకాయ చెట్టు ను అతనిపై దాని ద్వారా అతను నీడను పొందటానికి,దాని నుండి తినటానికి మొలిపించాము. وأرسلنهإ لى مائة ألف أو يزيدون

وَأَرْسَلْنَـٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ ﴿١٤٧﴾

మరియు మేము అతడిని అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా పంపించాము. మరియు వారి సంఖ్య లక్ష మంది ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉంటుంది. فٔامنوافمتعنهم إلى حين

فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَـٰهُمْ إِلَىٰ حِينٍۢ ﴿١٤٨﴾

అప్పుడు వారు విశ్వసించారు మరియు ఆయన తీసుకుని వచ్చిన దాన్ని నిజమని నమ్మారు. అప్పుడు అల్లా హ్ వారి ఇహలోక జీవితంలో వారి నిర్ణీత ఆయుషు ముగిసేవరకు వారికి ప్రయోజనం చేకూర్చాడు

فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ ﴿١٤٩﴾

అయితే ఓ ముహమ్మద్ మీరు ముష్రికులతో నిరాకరించే విధంగా అడగండి: ఏమీ మీరు మీకు ఇష్టంలేనివైన కుమార్తెలను అల్లా హ్ కొరకు చేసి మీరు ఇష్టపడే కుమారులను మీ కొరకు చేసుకుంటున్నారా ?. ఇదేమి పంపకము ?!

أَمْ خَلَقْنَا ٱلْمَلَـٰٓئِكَةَ إِنَـٰثًۭا وَهُمْ شَـٰهِدُونَ ﴿١٥٠﴾

దైవదూతలను వారు ఎలా స్త్రీలు అనుకున్నారు. వాస్తవానికి వారి పుట్టించే సమయంలో వారు హాజరై లేరు. మరియు వారు దాన్ని చూడనూ లేదు ?!

أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ ﴿١٥١﴾

وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿١٥٢﴾

జాగ్రత్త నిశ్ఛయంగా ముష్రికులు అల్లాహ్ పై అబద్దమును పలకటం వలన మరియు ఆయనపై కల్పించుకుని అపాదించటం వలన వారు ఆయనకు సంతానమును అంటగడుతారు. నిశ్ఛయంగా వారు తమ ఈ వాదనలో అసత్యపరులు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ ﴿١٥٣﴾

ఏమీ అల్లా హ్ తన స్వయం కొరకు మీరు ఇష్టపడే మగ సంతానమునకు బదులుగా మీరు ద్వేషించే ఆడ సంతానమును ఎన్నుకున్నాడా ?!. ఖచ్చితంగా కాదు. مالكم كيف تحكمون

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ ﴿١٥٤﴾

ఓ ముష్రికులారా మీకేమయింది. మీరు అల్లా హ్ కొరకు కుమార్తెలను చేసి,మీ కొరకు కుమారులని చేసి ఈ దుర్మార్గపు నిర్ణయం చేస్తు న్నారు ?. أفلا تذك رون

أَفَلَا تَذَكَّرُونَ ﴿١٥٥﴾

ఏమీ మీరు ఉన్న ఈ చెడు విశ్వాసము అసత్యమని గ్రహించలేకపోతున్నారా ?!. నిశ్ఛయంగా మీరు ఒక వేళ గ్రహిస్తే ఈ మాటను పలికేవారు కాదు. أم لكم سلطن مبين

أَمْ لَكُمْ سُلْطَـٰنٌۭ مُّبِينٌۭ ﴿١٥٦﴾

లేదా మీ వద్ద దీని గురించి ఏదైన పుస్తకం లేదా ఎవరైన ప్రవక్త నుండి స్పష్టమైన వాదన గాని,స్పష్టమైన ఆధారం గాని ఉన్నదా ?. فأتوا بكتبكم إن كنتم صدقين

فَأْتُوا۟ بِكِتَـٰبِكُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿١٥٧﴾

మీరు వాదిస్తు న్నవిషయంలో ఒక వేళ మీరు నీతిమంతులే అయితే ఈ విషయంపై మీకొరకు ఆధారమయ్యే మీ పుస్తకాన్ని మీరు తీసుకుని రండి

وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًۭا ۚ وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ ﴿١٥٨﴾

మరియు ముష్రికులు దైవదూతలు అల్లా హ్ కుమార్తెలు అని ఆరోపించినప్పుడు వారు అల్లా హ్ కు మరియు తమ నుండి తెరలో ఉంచబడిన దైవదూతలకు మధ్య సంబంధమును అంటగడుతున్నారు. వాస్తవానికి అల్లాహ్ ముష్రికులను లెక్క తీసుకోవటానికి తొందరలోనే హాజరు పరుస్తాడన్న విషయం దైవదూతలకు తెలుసు

سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ ﴿١٥٩﴾

పరిశుద్ధు డైన ఆయనకు తగనటువంటి సంతానము,భాగస్వామి మరియు ఇతరలు ఉండటం వేటి గురించైతే ముష్రికులు తెలుపుతున్నారో వాటి నుండి అల్లా హ్ పరిశుద్ధు డు మరియు అతీతుడు

إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ ﴿١٦٠﴾

చిత్తశుద్ధిగల అల్లా హ్ దాసులు తప్ప. ఎందుకంటే వారు పరిశుద్ధు డైన అల్లా హ్ కు తగినటువంటి గొప్ప,పరిపూర్ణగుణాలను మాత్రమే తెలుపుతారు. فإنكم وما تعبدون

فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ ﴿١٦١﴾

అయితే ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు మరియు అల్లా హ్ ను వదిలి మీరు ఆరాధిస్తు న్నవారు

مَآ أَنتُمْ عَلَيْهِ بِفَـٰتِنِينَ ﴿١٦٢﴾

ఎవరినీ కూడా మీరు సత్య ధర్మం నుండి తప్పించలేరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ ﴿١٦٣﴾

కాని అల్లా హ్ ఎవరిపైనైతే అతడు నరకవాసుల్లోంచి అవుతాడని తీర్పునిస్తా డో. నిశ్చయంగ అల్లా హ్ అతనిపై తన తీర్పును జారీ చేస్తా డు. అప్పుడు అతడు అవిశ్వాసమునకు పాల్పడి నరకములోకి ప్రవేశిస్తా డు. కాని మీకు,మీ ఆరాధ్యదైవాలకు దాని శక్తి లేదు

وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌۭ مَّعْلُومٌۭ ﴿١٦٤﴾

మరియు దైవదూతలు అల్లా హ్ కొరకు తమ ఆరాధనను, ముష్రికులు ఆరోపిస్తు న్నదాని నుండి తమ నిర్దోషత్వమును స్పష్టపరుస్తూ ఇలా పలుకుతారు: అల్లా హ్ ఆరాధనలో,ఆయన విధేయతలో ఒక నిర్ణీత స్థా నం లేకుండా మాలో నుండి ఎవడూ లేడు

وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ ﴿١٦٥﴾

وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ ﴿١٦٦﴾

మరియు మేమే దైవదూతలము అల్లా హ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లా హ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము. وإ نكانوا ليقولون

وَإِن كَانُوا۟ لَيَقُولُونَ ﴿١٦٧﴾

لَوْ أَنَّ عِندَنَا ذِكْرًۭا مِّنَ ٱلْأَوَّلِينَ ﴿١٦٨﴾

మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు: ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లా హ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తు న్నతీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు

لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ ﴿١٦٩﴾

మరియు నిశ్చయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు: ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లా హ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తు న్నతీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు

فَكَفَرُوا۟ بِهِۦ ۖ فَسَوْفَ يَعْلَمُونَ ﴿١٧٠﴾

మరియు నిశ్ఛయంగా మక్కా వాసుల్లోంచి ముష్రికులు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక ముందు ఇలా పలికేవారు: ఒక వేళ మా వద్ద పూర్వికుల గ్రంధముల్లోంచి తౌరాత్ లాంటి ఏదైన గ్రంధము ఉంటే మేము అల్లా హ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించేవారము. మరియు వారు ఈ విషయంలో అబద్దము పలికారు. వాస్తవానికి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు దాన్ని తిరస్కరించారు. అయితే వారు తొందరలోనే ప్రళయదినాన తమ కొరకు నిరీక్షిస్తు న్నతీవ్రమైన శిక్షను తెలుసుకుంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ ﴿١٧١﴾

إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ ﴿١٧٢﴾

మరియు నిశ్చయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లా హ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లా హ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని

وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَـٰلِبُونَ ﴿١٧٣﴾

మరియు నిశ్ఛయంగా మా ప్రవక్తల కొరకు మా మాట ఇంతకు ముందే జరిగిపోయింది అలాహ్ ఆధారము,బలముతో వారిపై చేసిన ఉపకారము ద్వారా వారు తమ శతృవులపై సహాయం (విజయం) పొందుతారని మరియు అల్లా హ్ వాక్కు (కలిమ) అదే గొప్పదవ్వాలని అల్లా హ్ మార్గములో పోరాడే మా సైనికులకే ఆధిక్యం కలుగుతుందని. فتول عنهمحت حين

فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍۢ ﴿١٧٤﴾

ఓ ప్రవక్తా ఈ వ్యతిరేకించే ముష్రికులందరి నుండి వారి వద్దకు వారి శిక్ష సమయం వచ్చేవరకు అల్లా హ్ కు తెలిసిన కొంత కాలం వరకు విముఖత చూపండి. وأبصرهم فسوف يبصرون

وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ ﴿١٧٥﴾

మరియు మీరు వారిపై శిక్ష అవతరించేటప్పుడు వారిని చూడండి. తొందరలోనే వారూ చూస్తా రు. అప్పుడు చూడటం వారికి ప్రయోజనం చేకూర్చదు. أ فبعذابنا يستعجلون

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ﴿١٧٦﴾

ఏమీ ఈ ముష్రికులందరు అల్లా హ్ శిక్ష గురించి తొందరపెడుతున్నారా ?

فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ ﴿١٧٧﴾

అయితే ఎప్పుడైతే వారిపై అల్లా హ్ శిక్ష దిగుతుందో అప్పుడు వారి ఉదయం దుర్భరమైన ఉదయం అవుతుంది. وتول عنهمحت حين

وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍۢ ﴿١٧٨﴾

ఓ ప్రవక్తా అల్లా హ్ వారి శిక్ష గురించి తిర్పునిచ్చేంత వరకు వారి నుండి మీరు విముఖత చూపండి. وأبصر فسوف يبصرون

وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ ﴿١٧٩﴾

మరియు మీరు చూడండి. అప్పుడు వారందరు తొందరలోనే తమపై వాటిల్లే అల్లహ్ శిక్షను,ఆయన యాతనను చూస్తా రు

سُبْحَـٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ ﴿١٨٠﴾

ఓ ముహమ్మద్ బలవంతుడైన నీ ప్రభువు ముష్రికులు కల్పించి తెలిపే లోపపూరితమైన లక్షణాల నుండి అతీతుడు మరియు పరిశుద్ధు డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَسَلَـٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ ﴿١٨١﴾

మరియు అల్లా హ్ అభినందనలు మరియు ఆయన పొగడ్తలు గౌరవోన్నతులైన ఆయన ప్రవక్తలపై కలుగుగాక

وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٨٢﴾

పొగడ్తలన్నీ పరిశుద్దు డైన,మహోన్నతుడైన అల్లా హ్ కే చెందుతాయి. ఆయనే దానికి యోగ్యుడు. మరియు ఆయన లోకాలన్నింటికి ప్రభువు. వారికి ఆయన తప్ప ఇంకెవరూ ప్రభువు లేడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · As-Saaffaat — الصافات

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు