ముఖపేజీతఫ్సీర్Al-Masad (111)

తఫ్సీర్ Al-Masad (111) — المسد

మక్కీ · 5 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍۢ وَتَبَّ ﴿١﴾

దైవ ప్రవక్తసల్లల్లా హు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దు ల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మ నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంను బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది

مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ ﴿٢﴾

అతడి సంపద మరియు అతని సంతానములో నుంచి అవి అతడి నుండి శిక్షను తొలగించకపోతే మరియు అతనికి కారుణ్యమును తీసుకుని రాకపోతే దేనికి పనికి వస్తా యి ?. سيصل نارا ذات لهب

سَيَصْلَىٰ نَارًۭا ذَاتَ لَهَبٍۢ ﴿٣﴾

ప్రళయదినమున అతడు ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశిస్తా డు. మరియు దాని వేడిని అనుభవిస్తా డు

وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ ﴿٤﴾

మరియు అతని భార్య అయిన ఉమ్మెజమీల్ అతనితో పాటు అందులో ప్రవేశిస్తుంది. ఆమె దైవ ప్రవక్తసల్లల్లా హు అలైహి వసల్లంను ఆయన మార్గంలో ముళ్ళను పరచి బాధ కలిగించేది. فى جيدها حبل من مسد

فِى جِيدِهَا حَبْلٌۭ مِّن مَّسَدٍۭ ﴿٥﴾

ఆమె మెడలో ఖర్జూ రపు నారతో పేనబడిన తాడు ఉంటుంది. దానితో ఆమె నరకాగ్నిలోకి ఈడ్చబడుతుంది. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Masad — المسد

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు