ముఖపేజీతఫ్సీర్Adh-Dhaariyat (51)

తఫ్సీర్ Adh-Dhaariyat (51) — الذاريات

మక్కీ · 60 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

وَٱلذَّٰرِيَـٰتِ ذَرْوًۭا ﴿١﴾

అల్లా హ్ దుమ్మును రేపే గాలుల పై ప్రమాణం చేస్తు న్నాడు

فَٱلْحَـٰمِلَـٰتِ وِقْرًۭا ﴿٢﴾

మరియు సమృద్దిగా ఉన్న నీటిని మోసుకొచ్చే మేఘాలపై (ప్రమాణం చేస్తు న్నాడు)

فَٱلْجَـٰرِيَـٰتِ يُسْرًۭا ﴿٣﴾

మరియు సముద్రంలో తేలికగా మరియు సులభంగా పయనించే ఓడలపై (ప్రమాణం చేస్తు న్నాడు)

فَٱلْمُقَسِّمَـٰتِ أَمْرًا ﴿٤﴾

మరియు అల్లా హ్ దాసుల వ్యవహారములను పంచిపెట్టమని ఆదేశించిన వాటిని పంచిపెట్టే దైవదూతలపై (ప్రమాణం చేస్తు న్నాడు). إنما توعدون لصادق

إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌۭ ﴿٥﴾

నిశ్చయంగా మీ ప్రభువు మీకు వాగ్దా నం చేసిన లెక్కతీసుకోబడటం మరియు ప్రతిఫలం ప్రసాధించబడటం నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు

وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌۭ ﴿٦﴾

మరియు నిశ్చయంగా దాసుల లెక్కతీసుకోబడటం ప్రళయదినమున ఖచ్చితంగా వాటిల్లు తుంది

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْحُبُكِ ﴿٧﴾

మరియు అల్లా హ్ మార్గా లు కల మంచి సృష్టి అయిన ఆకాశముపై ప్రమాణం చేస్తు న్నాడు. إنكم لفى قول م ختلف

إِنَّكُمْ لَفِى قَوْلٍۢ مُّخْتَلِفٍۢ ﴿٨﴾

ఓ మక్కా వాసులారా నిశ్చయంగా మీరు ఒక పరస్పర వైరుధ్యమైన,విరుద్దమైన మాటలో ఉన్నారు. ఒక సారి మీరు ఖుర్ఆన్ ను మంత్రజాలము అంటే ఒక సారి కవిత్వం అంటున్నారు. మరియు మీరు ముహమ్మద్ ను ఒక సారి మంత్రజాలకుడు అంటే ఒక సారి కవి అంటున్నారు. يؤفك عنهمن أفك

يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ ﴿٩﴾

ఖుర్ఆన్ పై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసము నుండి అతడే మరలింపబడుతాడు ఎవడైతే అల్లాహ్ జ్ఞానములో అతడు విశ్వసించడని మరియు సన్మార్గము పొందే భాగ్యమును కలగడని ఉన్నదో. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قُتِلَ ٱلْخَرَّٰصُونَ ﴿١٠﴾

ఖుర్ఆన్ విషయంలో మరియు తమ ప్రవక్త విషయంలో ఇలా పలికిన తిరస్కారులే శపించబడ్డా రు

ٱلَّذِينَ هُمْ فِى غَمْرَةٍۢ سَاهُونَ ﴿١١﴾

వారే అజ్ఞా నంలో పడి ఉండి పరలోక నివాసము నుండి పరధ్యానంలో ఉన్నారు. వారు దాని గురించి పట్టించుకోరు

يَسْـَٔلُونَ أَيَّانَ يَوْمُ ٱلدِّينِ ﴿١٢﴾

వారు ప్రతిఫల దినము ఎప్పుడూ ? అని అడుగుతున్నారు. వాస్తవానికి వారు దాని కొరకు ఆచరించటంలేదు

يَوْمَ هُمْ عَلَى ٱلنَّارِ يُفْتَنُونَ ﴿١٣﴾

అల్లా హ్ వారి ప్రశ్న గురుంచి వారికి ఇలా సమాధానమిస్తు న్నాడు: ఆ రోజు వారు నరకాగ్నిపై శిక్షింపబడుతారు

ذُوقُوا۟ فِتْنَتَكُمْ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَسْتَعْجِلُونَ ﴿١٤﴾

వారితో ఇలా పలకబడుతుంది: మీరు మీ శిక్ష రుచి చూడండి. మీరు హెచ్చరించబడినప్పుడు హేళనగా దేని గురించైతే తొందరపెట్టే వారో అదే ఇది

إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّـٰتٍۢ وَعُيُونٍ ﴿١٥﴾

నిశ్ఛయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడేవారు ప్రళయదినమున స్వర్గవనాల,ప్రవహించే సెలయేరుల మధ్య ఉంటారు

ءَاخِذِينَ مَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ ﴿١٦﴾

వారికి వారి ప్రభువు ఇచ్చే మర్యాదపూర్వక ప్రతిఫలమును పుచ్చుకుంటూ ఉంటారు. నిశ్ఛయంగా వారు ఈ మర్యాదపూర్వక ప్రతిఫలము కన్న ముందు ఇహలోకంలో సదాచర సంపన్నులుగా ఉండేవారు

كَانُوا۟ قَلِيلًۭا مِّنَ ٱلَّيْلِ مَا يَهْجَعُونَ ﴿١٧﴾

వారు రాత్రి పూట నమాజు చదివే వారు. తక్కువ సమయం నిదురపోయేవారు

وَبِٱلْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ ﴿١٨﴾

రాత్రి చివరి ఘడియల్లో తమ పాపముల నుండి అల్లా హ్ తో మన్నింపునుقవేడుకునేవారు

وَفِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّۭ لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ ﴿١٩﴾

మరియు వారి సంపదల్లోంచి వారు స్వచ్చందంగా ఇచ్చే దానిలో ప్రజల్లోంచి యాచించేవారి కొరకు మరియు ఏదో ఒక కారణం చేత ఆహారోపాధి ఆగిపోయన వారిలో నుండి వారితో యాచించని వారి కొరకు హక్కు ఉన్నది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَفِى ٱلْأَرْضِ ءَايَـٰتٌۭ لِّلْمُوقِنِينَ ﴿٢٠﴾

మరియు భూమిలో మరియు అల్లా హ్ అందులో ఉంచిన పర్వతాల్లో ,సముద్రముల్లో ,చెలమల్లో ,వృక్షముల్లో ,మొక్కల్లో మరియు జంతువుల్లో అల్లా హ్ యే సృష్టికర్త,రూపకల్పన చేసేవాడు అని నమ్మేవారి కొరకు అల్లా హ్ సామర్ధ్యముపై సూచనలు కలవు

وَفِىٓ أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ ﴿٢١﴾

మరియు మీ స్వయంలో ఓ ప్రజలారా అల్లా హ్ సామర్ధ్యంపై సూచనలు కలవు. ఏమీ మీరు గుణపాఠం నేర్చుకోవటం కొరకు చూడరా ?!

وَفِى ٱلسَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ ﴿٢٢﴾

మరియు ఆకాశములో మీ ప్రా పంచిక మరియు ధార్మిక ఆహారోపాధిق కలదు. మరియు అందులో మీతో వాగ్దా నం చేయబడిన మంచి లేదా చెడులు కలవు

فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ إِنَّهُۥ لَحَقٌّۭ مِّثْلَ مَآ أَنَّكُمْ تَنطِقُونَ ﴿٢٣﴾

భూమ్యాకాశముల ప్రభువు సాక్షిగా నిశ్చయంగా మరణాంతరం లేపబడటం వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానంటే మీరు మాట్లా డుకునేటప్పుడు మీ మాట్లా డటంలో సందేహం లేదో ఆ విధంగా

هَلْ أَتَىٰكَ حَدِيثُ ضَيْفِ إِبْرَٰهِيمَ ٱلْمُكْرَمِينَ ﴿٢٤﴾

ఓ ప్రవక్తా మీకు ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దైవదూతల్లోంచి ఆయన మర్యాదలు చేసిన అతిధుల గురించి మీకు (సమాచారం) చేరినదా ?

إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَـٰمًۭا ۖ قَالَ سَلَـٰمٌۭ قَوْمٌۭ مُّنكَرُونَ ﴿٢٥﴾

వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో సలాం (నీపై శాంతి కురియుగాక) అని అన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రతిసలాంచేస్తూ సలాం (మీపై శాంతి కురియుగాక) అన్నారు. మరియు ఆయన (ఇబ్రాహీం అలైహిస్సలాం) తన మనసులో వీరందరు మాకు పరిచయం లేని జనులు అనుకున్నారు

فَرَاغَ إِلَىٰٓ أَهْلِهِۦ فَجَآءَ بِعِجْلٍۢ سَمِينٍۢ ﴿٢٦﴾

అప్పుడు ఆయన చాటుగా తన ఇంటివారి వైపునకు మరలి వారి వద్ద నుండి ఒక సంపూర్ణ బలిసిన ఒక ఆవు దూడను వారు మనుషులని భావించి తీసుకుని వచ్చారు. فقربه إليهم قال ألا تأكلون

فَقَرَّبَهُۥٓ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ ﴿٢٧﴾

అప్పుడు ఆయన ఆవు దూడను వారికి దగ్గరగా చేశారు. మరియు వారితో మృదువుగా పలుకుతూ మీ ముందు ఉంచిన ఆహారమును మీరు తినరా ? అని అన్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةًۭ ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ وَبَشَّرُوهُ بِغُلَـٰمٍ عَلِيمٍۢ ﴿٢٨﴾

వారు తినకపోవటం చూసినప్పుడు ఆయన తన మనసులో వారి నుండి భయపడసాగారు అప్పుడు వారు ఆయన నుండి గుర్తించారు. అప్పుడు వారు ఆయనను సంత్రుప్తిపరుస్తూ ఇలా పలికారు: మీరు భయపడకండి. మేము అల్లా హ్ వద్ద నుండి పంపించబడ్డ దూతలము. మరియు వారు ఆయనకు సంతోషమును కలిగించే వార్త ఆయనకు చాలా జ్ఞానం కల ఒక మగ సంతానము కలుగుతుందని తెలిపారు. మరియు శుభవార్త ఇవ్వబడినది ఇస్హాఖ్ అలైహిస్సలాం గురించే

فَأَقْبَلَتِ ٱمْرَأَتُهُۥ فِى صَرَّةٍۢ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌۭ ﴿٢٩﴾

ఎప్పుడైతే ఆయన భార్య శుభవార్తను విన్నదో సంతోషముతో అరుస్తూ ముందుకు వచ్చినది. మరియు తన నుదిటిపై కొడుతూ ఆశ్ఛర్యముతో ఇలా పలికింది: ఏమీ ఒక వృద్ధు రాలు జన్మనిస్తుందా. మరియు ఆమె వాస్తవానికి గొడ్రా లు

قَالُوا۟ كَذَٰلِكِ قَالَ رَبُّكِ ۖ إِنَّهُۥ هُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ ﴿٣٠﴾

ఆమెతో దూతలు ఇలా పలికారు: నీ ప్రభువు చెప్పినదే నీకు మేము తెలిపాము. ఆయన చెప్పిన దాన్ని మార్చే వాడు ఎవడూ లేడు. నిశ్ఛయంగా ఆయనే తన సృష్టించటంలో,తన విధివ్రా తలో విజ్ఞత కలవాడు. తన సృష్టి రాసుల గురించి మరియు వారికి ప్రయోజనకరమైన వాటి గురించి తెలిసినవాడు

۞ قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ ﴿٣١﴾

ఇబ్రాహీం అలైహిస్సలాం దైవదూతలతో ఇలా పలికారు: మీ విషయమేమిటి ? మీరు ఏమి నిర్ణయించుకున్నారు ?

قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍۢ مُّجْرِمِينَ ﴿٣٢﴾

దైవదూతలు ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికారు: నిశ్చయంగా అల్లా హ్ మమ్మల్ని అతి చెడ్డ పాపములకు పాల్పడే అపరాధ జనుల వైపునకు పంపించాడు. لنرسل عليهم حجارةمن طين

لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةًۭ مِّن طِينٍۢ ﴿٣٣﴾

మేము వారిపై గట్టి మట్టితో చేయబడిన రాళ్ళను కురిపిస్తా ము. م سومة عند ربك للمسرفين

مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ ﴿٣٤﴾

ఓ ఇబ్రాహీం నీ ప్రభువు వద్ద నుండి గుర్తు వేయబడినవి అవి అల్లా హ్ హద్దు లను అతిక్రమించి,అవిశ్వాసములో మరియు పాప కార్యముల్లో హద్దు మీరే వారిపై కురిపించబడుతాయి

فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿٣٥﴾

అప్పుడు మేము లూత్ జాతి వారి ఊరిలో ఉన్న విశ్వాసపరులను వారికి అపరాధులకు సంభవించే శిక్ష సంభవించకుండా ఉండటానికి బయటకు తీసాము

فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍۢ مِّنَ ٱلْمُسْلِمِينَ ﴿٣٦﴾

వారి ఆ ఊరిలో ముస్లిముల ఒక ఇల్లు ను మాత్రమే మేము పొందాము. వారే లూత్ అలైహిస్సలాం ఇంటివారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَتَرَكْنَا فِيهَآ ءَايَةًۭ لِّلَّذِينَ يَخَافُونَ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ ﴿٣٧﴾

మరియు మేము లూత్ జాతి వారి ఊరిలో వారిపై కురిసిన శిక్షను సూచించే శిక్ష ఆనుమాళ్ళను వారికి కలిగిన బాధాకరమైన శిక్ష నుండి భయపడి గుణపాఠం నేర్చుకోవటానికి వదిలాము. దాని నుండి ముక్తి పొందటానికి వారి కర్మలకు పాల్పడరు వారు

وَفِى مُوسَىٰٓ إِذْ أَرْسَلْنَـٰهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَـٰنٍۢ مُّبِينٍۢ ﴿٣٨﴾

మరియు మూసా అలైహిస్సలాంలో ఆయనను మేము ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన వాదనలను ఇచ్చిపంపినప్పుడు బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు ఒక సూచన కలదు. فتولى بركنه وقال سحرأو مجنون

فَتَوَلَّىٰ بِرُكْنِهِۦ وَقَالَ سَـٰحِرٌ أَوْ مَجْنُونٌۭ ﴿٣٩﴾

అప్పుడు ఫిర్ఔన్ తన బలమును మరియు తన సైన్యమును సిద్ధం చేసుకుంటూ సత్యము నుండి విముఖత చూపాడు. మరియు మూసా అలైహిస్సలాం గురించి ఇలా పలికాడు: అతడు ప్రజలను మంత్రజాలమునకు గురి చేసే మంత్రజాలకుడు లేదా తనకు అర్ధం కాని మాటలను పలికే పిచ్చివాడు

فَأَخَذْنَـٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَـٰهُمْ فِى ٱلْيَمِّ وَهُوَ مُلِيمٌۭ ﴿٤٠﴾

అప్పుడు మేము అతన్ని మరియు అతని పూర్తి సైన్యములను పట్టుకుని వారిని మేము సముద్రంలో విసిరివేశాము. అప్పుడు వారు మునిగి నాశనమైపోయారు. మరియు ఫిర్ఔన్ తిరస్కారము మరియు తాను దైవమని వాదించటం వలన నిందను తీసుకుని వచ్చాడు

وَفِى عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ ٱلرِّيحَ ٱلْعَقِيمَ ﴿٤١﴾

మరియు హూద్ జాతి అయిన ఆద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు మేము వారిపై వర్షమును మోయని మరియు చెట్లను పరాగసంపర్కము చేయని గాలిని పంపినప్పుడు ఒక సూచన కలదు. మరియు అందులో ఎటువంటి చెరువు లేదు

مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَٱلرَّمِيمِ ﴿٤٢﴾

అది దేనిపైనైతే వచ్చినదో ఏ ప్రాణమును గాని ఏ సంపదన గాని ఇతరవాటిని గాని నాశనం చేయకుండా వదలలేదు. మరియు దాన్ని అది క్రు సించిపోయిన,నలిగిపోయిన దాని వలె చేసినది. وفى ثمودإذ قيل لهم تمتعواحت حين

وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍۢ ﴿٤٣﴾

మరియు సాలిహ్ అలైహిస్సలాం జాతి అయిన సమూద్ లో బాధాకరమైన శిక్ష నుండి భయపడే వారి కొరకు వారితో మీరు మీ ఆయుషు పూర్తి కాక ముందే మీ జీవితంతో ప్రయోజనం చెందండి అని అన్నప్పుడు ఒక సూచన కలదు

فَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ ٱلصَّـٰعِقَةُ وَهُمْ يَنظُرُونَ ﴿٤٤﴾

అప్పుడు వారు తమ ప్రభువు ఆదేశము నుండి గర్వమును చూపి,విశ్వసించటం మరియు విధేయత చూపటం పై అహంకారమును చూపారు. అప్పుడు శిక్ష పిడుగు దాని గురించి వారు నిరీక్షిస్తుండగానే వారిని పట్టుకుంది. అప్పటికే వారు శిక్ష గురించి దాని అవతరణ కన్న మూడు దినముల ముందే హెచ్చరింపబడ్డా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَمَا ٱسْتَطَـٰعُوا۟ مِن قِيَامٍۢ وَمَا كَانُوا۟ مُنتَصِرِينَ ﴿٤٥﴾

అయితే వారు తమపై కురిసిన శిక్షను తమ నుండి తొలగించుకోలేకపోయారు. మరియు వారికి దాన్ని ఎదుర్కునే శక్తి కూడా లేదు

وَقَوْمَ نُوحٍۢ مِّن قَبْلُ ۖ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًۭا فَـٰسِقِينَ ﴿٤٦﴾

మరియు ఈ ప్రస్తావించబడిన వారి కన్నా ముందు మేము నూహ్ జాతిని ముంచి నాశనం చేశాము. నిశ్చయంగా వారు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జనులు. కావున వారు ఆయన శిక్షకు యోగ్యులయ్యారు

وَٱلسَّمَآءَ بَنَيْنَـٰهَا بِأَيْي۟دٍۢ وَإِنَّا لَمُوسِعُونَ ﴿٤٧﴾

మరియు మేము ఆకాశమును నిర్మించాము. మరియు మేము దాన్ని శక్తితో నిర్మించటంలో ప్రావీణ్యము కలవారము. మరియు నిశ్చయంగా మేము దాని అంచులను విస్తరింపజేసేవారము

وَٱلْأَرْضَ فَرَشْنَـٰهَا فَنِعْمَ ٱلْمَـٰهِدُونَ ﴿٤٨﴾

మరియు భూమి దాన్ని మేము దానిపై నివసించేవారి కొరకు పరపులా పరచివేశాము. అయితే మేము దాన్ని వారి కొరకు పరచినప్పుడు మేము ఎంతో చక్కగా పరిచేవారము. ومن كل شىء خلقنا زوجين لعل كم تذكرون

وَمِن كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ﴿٤٩﴾

మరియు మేము ప్రతీ వస్తు వు నుండి మగ,ఆడ మరియు ఆకాశము,భూమి మరియు నేల,సముద్రం లా రెండు జతలను సృష్టించాము. బహుశా మీరు ప్రతి వస్తు వు నుండి రెండు జతలను సృష్టించిన అల్లా హ్ ఏకత్వమును గుర్తు చేసుకుంటారని మరియు మీరు ఆయన సామర్ధ్యమును గుర్తు చేసుకుంటారని

فَفِرُّوٓا۟ إِلَى ٱللَّهِ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌۭ مُّبِينٌۭ ﴿٥٠﴾

కావున మీరు అల్లా హ్ శిక్ష నుండి ఆయన ప్రతిఫలం వైపునకు ఆయనపై విధేయత ద్వారా మరియు ఆయన పట్ల అవిధేయతను విడనాడటం ద్వారా పరుగెత్తండి. నిశ్చయంగా నేను మీకు ఓ ప్రజలారా ఆయన శిక్ష నుండి స్పష్టంగా హెచ్చరించే వాడిని

وَلَا تَجْعَلُوا۟ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۖ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌۭ مُّبِينٌۭ ﴿٥١﴾

మరియు మీరు అల్లా హ్ తో పాటు వేరే ఆరాధ్యదైవమును ఆయనను వదిలి అతన్ని ఆరాధించటానికి చేయకండి. నిశ్చయంగా నేను మీకు ఆయన వద్ద నుండిస్పష్టంగా హెచ్చరించే వాడిని

كَذَٰلِكَ مَآ أَتَى ٱلَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا۟ سَاحِرٌ أَوْ مَجْنُونٌ ﴿٥٢﴾

మక్కా వాసులు తిరస్కరించిన ఈ తిరస్కారము వలె పూర్వ సమాజములూ తిరస్కరించారు. అయితే అల్లా హ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా అతని గురించి వారు ఇతడు మంత్రజాలకుడు లేదా పిచ్చివాడు అని అనకుండా ఉండలేదు

أَتَوَاصَوْا۟ بِهِۦ ۚ بَلْ هُمْ قَوْمٌۭ طَاغُونَ ﴿٥٣﴾

ఏమీ అవిశ్వాసపరుల్లోంచి ముందు గతించిన వారు మరియు వారిలో నుండి తరువాత వచ్చేవారు ఒకరినొకరు ప్రవక్తలను తిరస్కరించటంపై తాకీదు చేసుకున్నారా ?!. లేదు కాని వారి ఈ తలబిరుసుతనంపై వారి సమీకరణము అయినది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَتَوَلَّ عَنْهُمْ فَمَآ أَنتَ بِمَلُومٍۢ ﴿٥٤﴾

ఓ ప్రవక్తా మీరు ఈ తిరస్కారులందరి నుండి విముఖత చూపండి. మీరు నిందించబడేవారు కాదు. వాస్తవానికి మీరు వారి వద్దకు ఇచ్చి పంపించబడ్డ సందేశములన్నింటిని వారికి చేరవేశారు

وَذَكِّرْ فَإِنَّ ٱلذِّكْرَىٰ تَنفَعُ ٱلْمُؤْمِنِينَ ﴿٥٥﴾

వారి నుండి మీ విముఖత చూపటం వారిని హితోపదేశం చేయటం నుండి మిమ్మల్ని ఆపకూడదు. కావున మీరు వారిని ఉపదేశము మరియు హితోపదేశం చేయండి. ఎందుకంటే హితోపదేశం చేయటం అల్లా హ్ పై విశ్వాసము కలవారికి ప్రయోజనం కలిగిస్తుంది

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ ﴿٥٦﴾

నేను జిన్నులను మరియు మానవులను నా ఒక్కడి ఆరాధన కొరకు మాత్రమే సృష్టించుకున్నాను. మరియు నేను వారిని వారు నాకు సాటి కల్పించటానికి సృష్టించలేదు

مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍۢ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ ﴿٥٧﴾

మరియు నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు. మరియు వారు నాకు ఆహారం పెట్టా లని కూడా నేను వారి నుండి కోరటం లేదు

إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ ﴿٥٨﴾

నిశ్చయంగా అల్లా హ్ యే తన దాసులకు ఆహార ప్రధాత. కావున అందరు ఆయన ఆహారము అవసరము కలవారు. ఆయన తనను ఎవరు ఓడించని మహా శక్తిశాలి,మహాబలుడు. జిన్నులు మరియు మానవులందరు పరిశుద్ధు డైన ఆయన శక్తి ముందట తలఒగ్గు తారు. فإن للذين ظلمواذنوبا مثل ذنوب أصحبهم فلا يستعجلون

فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ ذَنُوبًۭا مِّثْلَ ذَنُوبِ أَصْحَـٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ ﴿٥٩﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మిమ్మల్ని తిరస్కరించి తమపై అన్యాయం చేసుకున్న వారికి పూర్వం గతించిన తమ సహచరులకు భాగం కలిగినట్లే శిక్ష నుండి భాగము కలదు. దానికి ఒక నిర్ణీత సమయం కలదు. దాని సమయం కన్నా ముందు వారు నన్ను దాన్ని తొందరగా కోరనవసరంలేదు

فَوَيْلٌۭ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن يَوْمِهِمُ ٱلَّذِى يُوعَدُونَ ﴿٦٠﴾

అల్లా హ్ ను తిరస్కరించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారి కొరకు తమపై శిక్ష అవతరణ గురించి వాగ్దా నం చేయబడిన ప్రళయదినమున వినాశనము మరియు నష్టము కలదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Adh-Dhaariyat — الذاريات

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు