ముఖపేజీతఫ్సీర్Al-Alaq (96)

తఫ్సీర్ Al-Alaq (96) — العلق

మక్కీ · 19 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ ﴿١﴾

ఓ ప్రవక్తా అల్లాహ్ మీకు దైవవాణి ద్వారా చేరవేసిన దాన్ని సృష్టితాలన్నింటిని సృష్టించిన మీ ప్రభువు నామముతో ఆరంభిస్తూ చదవండి

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِنْ عَلَقٍ ﴿٢﴾

ఆయన మానవుడిని వీర్యబిందువుగా ఉన్న తరువాత గడ్డ కట్టిన రక్తపు ముద్దతో సృష్టించాడు

ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ ﴿٣﴾

ఓ ప్రవక్తా అల్లా హ్ మీకు దైవవాణి ద్వారా చేర వేసిన దాన్ని చదవండి. మీ ప్రభువు ఏ దాత కూడా ఆయన దాతృత్వానికి సరతూగని పరమదాత. ఆయన అధిక దాతృత్వం మరియు ఉపకారం కలవాడు

ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ ﴿٤﴾

ఆయనే కలము ద్వారా వ్రా యటమును బోధించాడు

عَلَّمَ ٱلْإِنسَـٰنَ مَا لَمْ يَعْلَمْ ﴿٥﴾

ఆయన మానవునికి తెలియని విషయాలను బోధించాడు

كَلَّآ إِنَّ ٱلْإِنسَـٰنَ لَيَطْغَىٰٓ ﴿٦﴾

వాస్తవానికి నిశ్చయంగా అబూజహల్ లాంటి పాపాత్ముడు మానవుడు అల్లా హ్ హద్దు లను అతిక్రమించటంలోహద్దు ను అతిక్రమించాడు

أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ ﴿٧﴾

తన వద్ద ఉన్న గౌరవం మరియు సంపద మూలంగా తనను నిరపేక్షాపరుడిగా భావించటం వలన. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ ﴿٨﴾

ఓ మమానవుడా నిశ్చయంగా ప్రళయదినమున నీ ప్రభువు వైపునకు మరలవలసి ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి అతని హక్కును ఇస్తా డు

أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ ﴿٩﴾

నిరోధించే అబూజహల్ విషయమును నీవు ఆశ్చర్యముతో చూశావా?

عَبْدًا إِذَا صَلَّىٰٓ ﴿١٠﴾

మా దాసుడగు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంను కాబా వద్ద నమాజ్ చేసినప్పుడు

أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ ﴿١١﴾

నీవు చెప్పు ఒక వేళ ఈ నిరోధించబడినవాడు తన ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉండి,పూర్తి అవగాహనతో ఉంటే

أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ ﴿١٢﴾

లేదా అతడు ప్రజలను అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయన భీతి కలిగి ఉండమని ఆదేశించి ఉంటే ఏమీ ఇటువంటి వ్యక్తిఅయిన అతడు నిరోధించబడతాడా ?!

أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ ﴿١٣﴾

ఒక వేళ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని నిరోధించే ఇతడు ఒక వేళ తిరస్కరించి,దాని నుండి విముఖతచూపితేమీరేమంటారు అతడు అల్లా హ్ కు భయపడడా ?!

أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ ﴿١٤﴾

ఈ దాసుడిని నమాజు చదవటం నుండి నిరోధించేవాడికి అల్లా హ్ తాను చేస్తు న్నది చూస్తు న్నాడని ,ఆయనపై దానిలో నుండి ఏదీ గోప్యంగా లేదని తెలియదా ?! بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ ﴿١٥﴾

ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. ఒక వేళ అతడు మా దాసుడిని బాధపెట్టటం నుండి మరియు అతన్ని తిరస్కరించటం నుండి ఆగకపోతే మేము తప్పకుండా అతని తల ముందు భాగమును (నుదుటను) గట్టిగా పట్టు కుని బలవంతాన నరకాగ్ని వైపుకు లాక్కుని వెళతాము. ناصيةكذبة خاطئة

نَاصِيَةٍۢ كَـٰذِبَةٍ خَاطِئَةٍۢ ﴿١٦﴾

ఆ నుదుటి కలవాడు అబద్దము పలికేవాడు మరియు తప్పులు చేసేవాడు. فليدع ناديه

فَلْيَدْعُ نَادِيَهُۥ ﴿١٧﴾

అయితే అతని తల ముందు భాగమును పట్టు కుని నరకాగ్ని వైపుకు తీసుకెళ్ళబడినప్పుడు అతను తన సహచరులను మరియు తనతో పాటు కూర్చునే వారిని తనను శిక్ష నుండి రక్షించటానికి వారి సహాయం కోరతూ పిలుచుకోవాలి

سَنَدْعُ ٱلزَّبَانِيَةَ ﴿١٨﴾

మేము కూడా తొందరలోనే నరక భటులైన కఠిన దూతలను పిలుచుకుంటాము. వారు అల్లాహ్ తమకు ఆదేశించిన దానికి అవిధేయత చూపరు మరియు తమకు ఆదేశించబడిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. కావున రెండు వర్గముల్లోంచి ఎవరు ఎక్కువ బలవంతులో మరియు సామర్ధ్యులో చూడాలి

كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩ ﴿١٩﴾

ఈ దుర్మార్గు డు మీకు చెడు కలిగిస్తా డని ఊహించినట్లు విషయం కాదు. కావున మీరు ఏ ఆదేశంలో గాని ఏ వారింపులో గాని అతని మాట వినకండి. అల్లాహ్ కొరకు సాష్టాంగపడండి. విధేయత కార్యాల ద్వారా ఆయనకు దగ్గరవ్వండి. ఎందుకంటే అవి ఆయనకు దగ్గర చేస్తా యి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Alaq — العلق

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు