إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ ﴿١﴾
నిశ్ఛయంగా మేము రమజాన్ నెలలో ఘనమైన రాత్రిలో దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణను ఆరంభించినట్లే పూర్తి ఖుర్ఆన్ ను భూమికి దగ్గర ఉన్న ఆకాశము పై ఒకేసారి అవతరింపజేశాము
ముఖపేజీ›తఫ్సీర్›Al-Qadr (97)
మక్కీ · 5 ఆయతులు
إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ ﴿١﴾
నిశ్ఛయంగా మేము రమజాన్ నెలలో ఘనమైన రాత్రిలో దైవప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణను ఆరంభించినట్లే పూర్తి ఖుర్ఆన్ ను భూమికి దగ్గర ఉన్న ఆకాశము పై ఒకేసారి అవతరింపజేశాము
وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ ﴿٢﴾
ఓ ప్రవక్తా ఈ రాత్రిలోఉన్న మేలు,శుభము ఏమిటో నీకు తెలుసా ?!
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌۭ مِّنْ أَلْفِ شَهْرٍۢ ﴿٣﴾
ఈ రాత్రి గొప్ప మేలు కలిగిన రాత్రి. విశ్వాసముతో మరియు పుణ్యాన్ని ఆశిస్తూ అందులో ఆరాధన చేస్తూ జాగారం చేసే వాడి కొరకు అది వెయ్యి నెలల కన్నా శ్రేష్ఠమైనది
تَنَزَّلُ ٱلْمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍۢ ﴿٤﴾
దైవదూతలు మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం అందులో పరిశుద్ధు డైన తమ ప్రభువు ఆదేశముతో ఆ సంవత్సరం అల్లా హ్ నిర్ణయించిన ప్రతీ విషయమును అది ఆహారం అయినా లేదా మరణం అయినా లేదా జననం అయినా లేదా ఇతర విషయాలు అల్లా హ్ అంచనా వేసిన వాటిని తీసుకుని దిగుతారు
سَلَـٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ ﴿٥﴾
ఈ శుభప్రధమైన రాత్రి దాని ఆరంభం నుంచి ఫజర్ ఉదయించటంతో దాని ముగింపు అయ్యే వరకు పూర్తిగా మేలు కలది. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు