إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌۭ ﴿١﴾
నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను తన జాతి వారి వద్దకు పంపించాము. వారు అల్లా హ్ కు సాటి కల్పించటం వలన వారిపై వచ్చే బాధాకరమైన శిక్షకు ముందు ఆయన తన జాతి వారిని భయపెట్టా నికి వారిని ఆహ్వానించమని. قال يقوم إنى لكم نذيرمبين
قَالَ يَـٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌۭ مُّبِينٌ ﴿٢﴾
నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు: ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను ఒక వేళ మీరు అల్లా హ్ యందు పశ్చాత్తా ప్పడకపోతే మీ కోసం నిరీక్షిస్తు న్నఒక శిక్ష నుండి మీ కొరకు స్పష్టంగా హెచ్చరించేవాడిని
أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ ﴿٣﴾
మీకు నా హెచ్చరిక యొక్క ఆవశ్యకత ఏమిటంటే, నేను మీకు చెప్తు న్నాను: అల్లా హ్ ఒక్కడిని మాత్రమే మీరు ఆరాధించండి మరియు ఆయనతో దేనినీ సాటి కల్పించకండి. మరియు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మీరు నన్ను అనుసరించండి
يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ ﴿٤﴾
నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే అల్లా హ్ మీ కొరకు మీ పాపములను ఏవైతే దాసుల హక్కులతో సంబంధము లేదో వాటిని మన్నించివేస్తా డు. మరియు ఇహలోకంలో మీ సమాజ కాలమును అల్లాహ్ జ్ఞానములో నిర్ణయించబడిన సమయం వరకు పొడిగిస్తాడు. మీరు భూమిని దానిపై మీరు ఉన్నంతకాలం ఏలుతారు. నిశ్చయంగా మరణం వచ్చినప్పుడు గడువు ఇవ్వబడదు. ఒక వేళ మీకు తెలిస్తే మీరు అల్లాహ్ పై విశ్వాసము వైపునకు మరియు మీరు ఉన్న షిర్కు,మార్గభ్రష్టత నుండి పశ్చాత్తా ప్పడటం వైపునకు త్వరపడుతారు. قال رب إنى دعوت قومى ليلا ونهارا
قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًۭا وَنَهَارًۭا ﴿٥﴾
నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు: ఓ నా ప్రభూ నిశ్చయంగా నేను నీ దాసులను నీ తౌహీద్ వైపునకు రాత్రింబవళ్ళు క్రమం తప్పకుండా పిలిచాను
فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًۭا ﴿٦﴾
వారిని నా పిలవటం నేను దేని వైపునైతే వారిని పిలిచానో దాని నుండి బెదిరి పారిపోవటమును మరియు దూరమును మాత్రమే అధికం చేసింది
وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَـٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًۭا ﴿٧﴾
మరియు నేను ఎప్పుడెప్పుడైతే వారిని వారి పాపములకు మన్నింపు గలవైన నీ ఒక్కడి ఆరాధన మరియు నీపై,నీ ప్రవక్తపై విధేయత చూపటం వైపునకు పిలిచానో వారు తమ చెవులను తమ వేళ్ళతో నా పిలుపును వినటం నుండి వాటిని ఆపటానికి అడ్డుపెట్టు కునేవారు. మరియు నన్ను చూడకుండా ఉండటానికి తమ ముఖములను తమ వస్త్రములతో కప్పుకునేవారు. మరియు వారు తాము ఉన్న షిర్కుపైనే కొనసాగిపోయేవారు. మరియు దేని వైపునైతే నేను వారిని పిలిచానో దాన్ని స్వీకరించటం నుండి మరియు దానికి కట్టు బడి ఉండటం నుండి అహంకారమును చూపేవారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ثم إنى دعوتهم جهارا
ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًۭا ﴿٨﴾
ఆ పిదప ఓ నా ప్రభువా నేను వారిని బహిరంగంగా పిలిచాను
ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًۭا ﴿٩﴾
ఆ పిదప నిశ్చయంగా నేను పిలవటంలో వారి కొరకు నా స్వరమును బిగ్గరగా చేశాను మరియు నేను రహస్యంగా గోప్యంగా చెప్పాను. మరియు నేను వారిని నెమ్మదైన స్వరముతో పిలిచాను. వారికి నా పిలుపు యొక్క రకరకాల పద్దతులతో పిలిచాను
فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًۭا ﴿١٠﴾
అప్పుడు నేను వారితో ఇలా పలికాను: ఓ నా జాతి వారా మీరు మీ ప్రభువుతో ఆయన వైపునకు పశ్ఛాత్తా ప్పడుతూ పాపముల మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా పరిశుద్ధు డైన ఆయన తన దాసుల్లోంచి తన వైపునకు పశ్ఛాత్తా పముతో మరలే వారిపాపములను మన్నించేవాడు
يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًۭا ﴿١١﴾
నిశ్ఛయంగా మీరు ఇలా చేస్తే అల్లాహ్ మీపై వర్షమును మీకు దాని అవసరం ఉన్నప్పుడల్లా క్రమం తప్పకుండా కురిపిస్తాడు. మీకు కరువు అన్నది సంభవించదు. ويمددكم بأمول وبنين ويجعل ل كم جنت ويجعل ل كم أنهرا
وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍۢ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّـٰتٍۢ وَيَجْعَل لَّكُمْ أَنْهَـٰرًۭا ﴿١٢﴾
మరియు ఆయన మీకు సంపదలను మరియు సంతానమును అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ కొరకు తోటలను చేస్తాడు మీరు వాటి ఫలముల నుండి తింటారు. మరియు ఆయన మీ కొరకు సెలయేరులను చేస్తా డు మీరు వాటి నుండి త్రాగుతారు మరియు మీ పంటలకు,మీ పశువులకు నీటిని పట్టిస్తా రు. ما لكم لا ترجون لله وقارا
مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًۭا ﴿١٣﴾
ఓ నా జాతి ప్రజలారా మీ విషయమేమిటి మీరు అల్లా హ్ గొప్పతనానికి భయపడటం లేదు ?. అందుకనే మీరు పట్టించుకోకుండా ఆయనపై అవిధేయత చూపుతున్నారు. وقد خلقكم أطوارا
وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا ﴿١٤﴾
వాస్తవానికి ఆయన మిమ్మల్ని ఒక దశ తరువాత ఇంకో దశగా సృష్టించాడు. వీర్యపు బిందువు నుండి రక్తపు ముద్దగా,ఆ తరువాత మాంసపు ముద్దగా
أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَـٰوَٰتٍۢ طِبَاقًۭا ﴿١٥﴾
ఏమీ ఒక ఆకాశముపై ఇంకో ఆకాశముగా ఏడు ఆకాశములను అల్లా హ్ ఎలా సృష్టించాడో మీరు చూడటంలేదా ?!
وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًۭا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًۭا ﴿١٦﴾
మరియు ఆయన వాటిలో నుండి భూమికి దగ్గరలో ఉన్న ఆకాశములో చంద్రుడిని భూ వాసులకు వెలుగుగా చేశాడు. మరియు ఆయన సూర్యుడిని కాంతివంతముగా చేశాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًۭا ﴿١٧﴾
మరియు అల్లా హ్ మీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించటంతో మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు. ఆ పిదప మీరు అది మీ కొరకు ఉత్పత్తి చేసే వాటిని ఆహారంగా తీసుకొంటున్నారు. ثم يعيدكم فيها ويخرجكم إخراجا
ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًۭا ﴿١٨﴾
ఆ పిదప ఆయన మిమ్మల్ని మీ మరణం తరువాత అందులో మరలింపజేస్తా డు. ఆ తరువాత మరణాంతరం లేపటం కొరకు ఆయన మిమ్మల్ని దాని నుండి వెలికి తీస్తా డు
وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًۭا ﴿١٩﴾
మరియు అల్లా హ్ మీ కొరకు భూమిని నివాసం కొరకు విస్తరింపజేసి సిద్ధం చేశాడు. لتسلكوامنها سبلا فجاجا
لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًۭا فِجَاجًۭا ﴿٢٠﴾
మీరు దాని విశాలమైన మార్గముల్లో ధర్మ సమ్మతమైన సంపాదన కొరకు శ్రమిస్తూ నడుస్తా రని ఆశిస్తూ
قَالَ نُوحٌۭ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًۭا ﴿٢١﴾
నూహ్ అలైహిస్సలాం ఇలా పలికారు: ఓ నా ప్రభువా నిశ్ఛయంగా నా జాతి వారు నేను వారికి నీ తౌహీదు గురించి మరియు నీ ఒక్కడి ఆరాధన గురించి ఇచ్చిన ఆదేశం విషయంలో నా పై అవిధేయత చూపారు. మరియు వారిలో నుండి తక్కువ స్థా నం కలవారు నీవు ధనాన్ని,సంతానమును అనుగ్రహించిన తమ నాయకులను అనుసరించారు. వారికి నీవు అనుగ్రహించినది వారిని అపమార్గములో మాత్రం అధికం చేసింది. ومكروا مكرا كبارا
وَمَكَرُوا۟ مَكْرًۭا كُبَّارًۭا ﴿٢٢﴾
వారిలోని పెద్దవారు తమ క్రిందటి స్థా నం కలవారిని నూహ్ కి వ్యతిరేకంగాد రెచ్చగొట్టటంతో పెద్ద కుట్రనే పన్నారు. وقالوالا تذرن ءالهتكم ولا تذرن و اولا سواعا ولا يغوث ويعوق ونسرا
وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّۭا وَلَا سُوَاعًۭا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًۭا ﴿٢٣﴾
మరియు వారు తమను అనుసరించే వారితో ఇలా పలికారు: మీరు మీ దేవతలను ఆరాధించటమును వదలకండి. మరియు మీరు మీ విగ్రహములైన వద్ద్ ని గాని సువాను గాని యగూస్ ని గాని యఊఖ్ని గాని మరియు నస్ర్ ని గాని ఆరాధించటమును వదలకండి
وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًۭا ۖ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا ضَلَـٰلًۭا ﴿٢٤﴾
వాస్తవానికి వారు తమ ఈ విగ్రహాల ద్వారా చాలా మంది ప్రజలను అపమార్గమునకు లోను చేశారు. ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసంపై,పాప కార్యములపై మొండితనముతో తమ స్వయమునకు హింసించుకున్న వారిని నీవు సత్యం నుండి తప్పిపోవటంలో మాత్రం అధికం చేయి
مِّمَّا خَطِيٓـَٔـٰتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًۭا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًۭا ﴿٢٥﴾
వారు పాల్పడిన తమ పాపముల వలన ఇహలోకంలో తుఫాను ద్వారా ముంచబడ్డా రు. తమ మరణం తరువాత వెంటనే నరకాగ్నిలో ప్రవేశించబడ్డా రు. వారు తమను మనుగటం నుండి.నరకాగ్ని నుండి రక్షించే ఏ సహాయకుడిని అల్లహ్ ను విడిచి ఎవరినీ తమ కొరకు పొందలేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَقَالَ نُوحٌۭ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَـٰفِرِينَ دَيَّارًا ﴿٢٦﴾
మరియు నూహ్ అలైహిస్సలాం ఆయన జాతి వారిలో నుండి విశ్వసించిన వారు తప్ప ఇంకా ఎవరు విశ్వసించరని అల్లాహ్ ఆయనకు తెలియపరచినప్పుడు ఇలా పలికారు: ఓ నా ప్రభువా నీవు అవిశ్వాసపరుల్లోంచి ఎవరినీ భూమిపై తిరుగుతుండగా లేదా సంచరిస్తుండగా వదలకు
إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًۭا كَفَّارًۭا ﴿٢٧﴾
నిశ్ఛయంగా ఓ మా ప్రభువా ఒక వేళ నీవు వారిని వదిలి,వారికి గడువిస్తే వారు విశ్వాసపరులైన నీ దాసులను అపమార్గమునకు గురి చేస్తా రు. మరియు నీపై విధేయత చూపని పాపాత్ముడిని,నీ అనుగ్రహములపై నీకు కృతజ్ఞత తెలపని కఠిన కృతఘుృడిని మాత్రమే వారు జన్మనిస్తా రు
رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًۭا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا تَبَارًۢا ﴿٢٨﴾
ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు మరియు నా తల్లిదండ్రులను మన్నించు మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వారిని మన్నించు. మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను మన్నించు. మరియు అవిశ్వాసము,పాప కార్యముల ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారిని వినాశనంలో మరియు నష్టంలో అధికం చేయి. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్