قُلْ أُوحِىَ إِلَىَّ أَنَّهُ ٱسْتَمَعَ نَفَرٌۭ مِّنَ ٱلْجِنِّ فَقَالُوٓا۟ إِنَّا سَمِعْنَا قُرْءَانًا عَجَبًۭا ﴿١﴾
ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారితో ఇలా పలకండి: నఖ్లా ప్రాంతంలో జిన్నుల్లోంచి ఒక వర్గము నేను ఖుర్ఆన్ ను పటిస్తుండగా విన్నదని అల్లా హ్ నాకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు. వారు తమ జాతి వారి వైపునకు మరలి వెళ్ళినప్పుడు వారితో ఇలా పలికారు: నిశ్చయంగా మేము తన స్పష్టపరచటంలో మరియు తన వాక్చాతుర్యంలో విచిత్రమైన చదవబడిన ఒక వాక్కును విన్నాము
يَهْدِىٓ إِلَى ٱلرُّشْدِ فَـَٔامَنَّا بِهِۦ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَآ أَحَدًۭا ﴿٢﴾
మేము విన్న ఈ వాక్కు విశ్వాసం విషయంలో మరియు మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో సరైన దానిపై సూచిస్తుంది. కాబట్టి మేము దాన్ని విశ్వసించాము. మరియు మేము దాన్ని అవతరించిన మా ప్రభువుతో పాటు ఎవరిని సాటి కల్పించము
وَأَنَّهُۥ تَعَـٰلَىٰ جَدُّ رَبِّنَا مَا ٱتَّخَذَ صَـٰحِبَةًۭ وَلَا وَلَدًۭا ﴿٣﴾
మరియు మేము విశ్వసించాము ఎందుకంటే - మా ప్రభువు ఔన్నత్యము మరియు ఆయన వైభవము అత్యున్నతమైనది - ఆయన ముష్రికులు అంటున్నట్లు గా భార్యను గాని సంతానమును గాని చేసుకోలేదు
وَأَنَّهُۥ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى ٱللَّهِ شَطَطًۭا ﴿٤﴾
మరియు ఇబ్లీసు అల్లా హ్ పై పరిశుద్ధు డైన ఆయనకు భార్యను మరియు సంతానమును అంటగట్టి వికృత మాటలు పలుకుతున్నాడు
وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلْإِنسُ وَٱلْجِنُّ عَلَى ٱللَّهِ كَذِبًۭا ﴿٥﴾
మానవుల్లోంచి మరియు జిన్నుల్లోంచి ముష్రికులు ఆయనకు భార్య మరియు సంతానం ఉన్నదని వాదించినప్పుడు వారు అబద్దం పలకటం లేదని మేము భావించాము. అప్పుడు మేము వారిని అనుకరిస్తూ వారి మాటలను నిజమని నమ్మాము
وَأَنَّهُۥ كَانَ رِجَالٌۭ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍۢ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًۭا ﴿٦﴾
మరియు అజ్ఞాన కాలంలో మానవుల్లోంచి కొందరు పురుషులు భయానక ప్రదేశంలో బస చేసినప్పుడు జిన్నల్లోంచి కొందరు పురుషులతో శరణు వేడుకునేవారు. అప్పుడు వారిలో నుండి ఒకడు ఇలా పలికే వాడు: నేను ఈ ప్రాంతపు నాయకునితో అతని జాతివారి యొక్క మూర్ఖుల కీడు నుండి శరణు వేడుకుంటున్నాను. అప్పుడు మానవుల్లోంచి పురుషులకు జిన్నుల్లోంచి పురుషుల నుండి భయం అధికమైపోయింది
وَأَنَّهُمْ ظَنُّوا۟ كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ ٱللَّهُ أَحَدًۭا ﴿٧﴾
ఓ జిన్నుల్లారా మీరు అనుకున్నట్లే మానువులు కూడా అల్లాహ్ ఎవరినీ అతని మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపడని భావించారు
وَأَنَّا لَمَسْنَا ٱلسَّمَآءَ فَوَجَدْنَـٰهَا مُلِئَتْ حَرَسًۭا شَدِيدًۭا وَشُهُبًۭا ﴿٨﴾
మరియు మేము ఆకాశం యొక్క వార్తలను అడిగాము, మరియు ఆకాశం దైవదూతల యొక్క బలమైన కాపలాతో నిండినట్లు మేము కనుగొన్నాము. వారు మేము చేస్తు న్నవిన్న వాటిని దోచుకుని పోయే కార్యం నుండి వారు దాన్ని కాపలాకాస్తు న్నారు. మరియు అది (ఆకాశం) భగభగ మండే అగ్ని జ్వాలలతో بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ నిండి పోయి ఉంది ఆకాశమునకు దగ్గర వెళ్ళే ప్రతి ఒక్కడి పై అవి విసరబడుతున్నాయి
وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَـٰعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ ٱلْـَٔانَ يَجِدْ لَهُۥ شِهَابًۭا رَّصَدًۭا ﴿٩﴾
మరియు మేము గతంలో ఆకాశములో స్థానములను ఏర్పరచుకుని అక్కడ నుండి దైవ దూతలు పరస్పరం చర్చించుకునే మాటలను వినే వారము. అప్పుడు వాటి గురించి మేము భూలోకవాసుల్లోంచి జ్యోతిష్యులకు సమాచారమిచ్చేవారము. ఇప్పుడు విషయం మారినది. ఇప్పుడు మనలో నుంచి ఎవరైన వింటే అతడు తన కొరకు సిద్ధం చేసి ఉంచిన మండే అగ్నిని పొందుతాడు. ఎప్పుడైతే అతడు దగ్గరకు వెళతాడో అది అతనిపై పంపించబడును. అప్పుడు అది అతడిని దహించివేస్తుంది
وَأَنَّا لَا نَدْرِىٓ أَشَرٌّ أُرِيدَ بِمَن فِى ٱلْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًۭا ﴿١٠﴾
ఈ పతిష్టమైన కాపలాకి కారణం ఏమిటో మాకు తెలియదు. భూవాసులకి కీడు చేసే ఉద్దేశించబడినదా లేదా అల్లాహ్ వారికి మేలు చేయదలచాడా. నిశ్చయంగా ఆకాశ సమాచారం మా నుండి తెగిపోయినది
وَأَنَّا مِنَّا ٱلصَّـٰلِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَآئِقَ قِدَدًۭا ﴿١١﴾
మేము జిన్నుల సమాజమునకు చెందినవారము. మాలో నుండి దైవభీతి కలవారు,పుణ్యాత్ములు ఉన్నారు. మరియు మాలో నుండి అవిశ్వాసులు,అవిధేయులు ఉన్నారు. మేము వేరువేరు రకాలుగా మరియు విభిన్న ఇష్టా లు కలవారిగా ఉండేవారము
وَأَنَّا ظَنَنَّآ أَن لَّن نُّعْجِزَ ٱللَّهَ فِى ٱلْأَرْضِ وَلَن نُّعْجِزَهُۥ هَرَبًۭا ﴿١٢﴾
పరిశుద్ధు డైన అల్లా హ్ మా పట్ల ఏదైన విషయమును నిర్ణయించుకున్నప్పుడు మేము ఆయన నుండి తప్పించుకోలేమని పూర్తిగా నమ్మాము. మరియు ఆయన మమ్మల్ని చుట్టు ముట్టి ఉండటం వలన మేము పారిపోయి ఆయన నుండి ఖచ్చితంగా తప్పించుకోలేము
وَأَنَّا لَمَّا سَمِعْنَا ٱلْهُدَىٰٓ ءَامَنَّا بِهِۦ ۖ فَمَن يُؤْمِنۢ بِرَبِّهِۦ فَلَا يَخَافُ بَخْسًۭا وَلَا رَهَقًۭا ﴿١٣﴾
మరియు నిశ్ఛయంగా మేము సవ్యమైన మార్గమును చూపించే ఖుర్ఆన్ ను విన్నప్పుడు దాన్ని విశ్వసించాము. కావున ఎవడైతే తన ప్రభువును విశ్వసిస్తా డో అతడు తన పుణ్యాలు తరుగుతాయని మరియు తన పూర్వ పాపాలతో వేరే పాపము అంటగట్టబడుతుందని భయపడడు
وَأَنَّا مِنَّا ٱلْمُسْلِمُونَ وَمِنَّا ٱلْقَـٰسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُو۟لَـٰٓئِكَ تَحَرَّوْا۟ رَشَدًۭا ﴿١٤﴾
మరియు నిశ్చయంగా మాలో నుండి అల్లా హ్ కు విధేయులమైన ముస్లిములు ఉన్నారు. మరియు మాలో నుండి సత్యమైన మరియు స్థిరమైన మార్గము నుండి దూరమైనవారు ఉన్నారు. ఎవరైతే విధేయతతో మరియు సత్కర్మతో అల్లా హ్ కు వినయంగా ఉంటారో వారందరు సన్మార్గమును మరియు సరైన మార్గమును నిర్ణయించుకున్నారు
وَأَمَّا ٱلْقَـٰسِطُونَ فَكَانُوا۟ لِجَهَنَّمَ حَطَبًۭا ﴿١٥﴾
మరియు సత్యమార్గము నుండి మరియు స్థిర మార్గము నుండి దూరమైన వారు నరకమునకు ఇందనమవుతారు. అది వారి లాంటి జనులతో వెలిగించబడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَأَلَّوِ ٱسْتَقَـٰمُوا۟ عَلَى ٱلطَّرِيقَةِ لَأَسْقَيْنَـٰهُم مَّآءً غَدَقًۭا ﴿١٦﴾
జిన్నుల్లోంచి ఒక వర్గము విన్నదని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచినట్లే ఒక వేళ జిన్నులు మరియు మానవులు ఇస్లాం మార్గముపై స్థిరంగా ఉండి అందులో ఉన్న వాటిని ఆచరిస్తే అల్లా హ్ వారికి అధికంగా నీటిని త్రా పిస్తా డని మరియు రకరకాల అనుగ్రహాలను ఎక్కువగా ప్రసాదిస్తా డని ఆయనకు దైవ వాణి ద్వారా తెలియపరచాడు
لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِۦ يَسْلُكْهُ عَذَابًۭا صَعَدًۭا ﴿١٧﴾
వారు అల్లా హ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారా లేదా వాటి వట్ల కృతఝ్నులవుతారా అందులో మేము వారిని పరీక్షించటం కొరకు. మరియు ఎవరైతే ఖుర్ఆన్ నుండి మరియు అందులో ఉన్న ఉపదేశాల నుండి విముఖత చూపుతాడో అతడిని అతడి ప్రభువు కఠినమైన శిక్షలో ప్రవేశింపజేస్తా డు దాన్నిమోసే శక్తి అతనికి ఉండదు
وَأَنَّ ٱلْمَسَـٰجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا۟ مَعَ ٱللَّهِ أَحَدًۭا ﴿١٨﴾
మరియు నిశ్ఛయంగా మస్జిదులు పరిశుద్ధు డైన ఆయన కొరకే ఇతరుల కొరకు కాదు. కావున మీరు అందులో అల్లా హ్ తో పాటు ఎవరిని ఆరాధించకండి. అప్పుడు మీరు తమ ఆరాధనాలయాలు,తమ చర్చుల విషయంలో యూదులు,క్రైస్తవులవలే అయిపోతారు
وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبْدُ ٱللَّهِ يَدْعُوهُ كَادُوا۟ يَكُونُونَ عَلَيْهِ لِبَدًۭا ﴿١٩﴾
మరియు అల్లా హ్ దాసుడగు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం నఖ్లా ప్రాంతములో తన ప్రభువును ఆరాధిస్తూ నిలబడినప్పుడు జిన్నులు ఆయన ఖుర్ఆన్ పఠనమును వారు విన్నప్పుడు రద్ది తీవ్రత వలన ఆయనపై దాదాపుగా కిక్కిరిసిపోయినట్లు ఉన్నారు
قُلْ إِنَّمَآ أَدْعُوا۟ رَبِّى وَلَآ أُشْرِكُ بِهِۦٓ أَحَدًۭا ﴿٢٠﴾
ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి: నేను ఒక్కడైన నా ప్రభువును మాత్రమే ఆరాధిస్తా ను. మరియు నేను అతనితో పాటు ఇతరులను సాటి కల్పించను (ఆ ఇతరులు) ఎవరైనా అయినా సరే. ر
قُلْ إِنِّى لَآ أَمْلِكُ لَكُمْ ضَرًّۭا وَلَا رَشَدًۭا ﴿٢١﴾
మీరు వారితో ఇలా పలకండి: నిశ్ఛయంగా అల్లా హ్ మీ పై విధివ్రాతలో వ్రాసి పెట్టిన ఎటువంటి కీడును మీ కొరకు తొలగించే అధికారం నాకు లేదు. మరియు అల్లా హ్ మీ నుండి ఆపివేసిన ఏ ప్రయోజనమును తీసుకుని వచ్చే అధికారము నాకు లేదు
قُلْ إِنِّى لَن يُجِيرَنِى مِنَ ٱللَّهِ أَحَدٌۭ وَلَنْ أَجِدَ مِن دُونِهِۦ مُلْتَحَدًا ﴿٢٢﴾
మీరు వారితో ఇలా పలకండి: ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయత చూపితే అల్లాహ్ నుండి నన్ను ఎవరు రక్షించలేరు. మరియు నేను ఆశ్రయం పొందటానికి ఆయన కాకుండా ఏ ఆశ్రయమును నేను పొందలేను
إِلَّا بَلَـٰغًۭا مِّنَ ٱللَّهِ وَرِسَـٰلَـٰتِهِۦ ۚ وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَإِنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ﴿٢٣﴾
కాని నన్ను అల్లాహ్ మీకు చేరవేయమని ఆదేశించిన వాటిని మరియు నాకు మీ వైపునకు ఇచ్చి పంపించిన ఆయన సందేశములను మీకు చేరవేసే అధికారం నాకు కలదు. మరియు ఎవరైతే అల్లా హ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతాడో అతడి పరిణామం నరకంలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశము. అందులో నుండి అతడు ఎన్నటికి బయటకు రాలేడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
حَتَّىٰٓ إِذَا رَأَوْا۟ مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًۭا وَأَقَلُّ عَدَدًۭا ﴿٢٤﴾
మరియు అవిశ్వాసపరులు తమ అవిశ్వాసముపైనే కొనసాగుతారు చివరికి వారు తమకు ఇహలోకంలో వాగ్దా నం చేయబడిన శిక్షను ప్రళయదినమున కళ్ళారా చూసినప్పుడు. అప్పుడు వారు సహాయపరంగా ఎవరు ఎక్కువ బలహీనుడో వారు తొందరలోనే తెలుసుకుంటారు. మరియు సహాయం చేయటానికి సంఖ్యాపరంగా ఎవరు తక్కువో వారు త్వరలోనే తెలుసుకుంటారు
قُلْ إِنْ أَدْرِىٓ أَقَرِيبٌۭ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُۥ رَبِّىٓ أَمَدًا ﴿٢٥﴾
ఓ ప్రవక్తా మరణాంతరమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: మీతో వాగ్దా నం చేయబడిన శిక్ష దగ్గరలో ఉన్నదో లేదా దానికి అల్లా హ్ కు మాత్రమే తెలిసిన సమయం ఉన్నదో నాకు తెలియదు
عَـٰلِمُ ٱلْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِۦٓ أَحَدًا ﴿٢٦﴾
పరిశుద్ధు డైన ఆయన అగోచర విషయాలన్నింటిని తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన అగోచర జ్ఞా నం గురించి ఆయన ఎవరికి తెలియపరచడు. అంతేకాదు అది ఆయన జ్ఞా నంతో ప్రత్యేకించబడి ఉంటుంది
إِلَّا مَنِ ٱرْتَضَىٰ مِن رَّسُولٍۢ فَإِنَّهُۥ يَسْلُكُ مِنۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِۦ رَصَدًۭا ﴿٢٧﴾
కాని పరిశుద్ధుడైన ఆయన తాను ఇష్టపడిన ప్రవక్తకు మాత్రమే (తెలియపరుస్తాడు). నిశ్చయంగా ఆయన దాని గురించి తాను తలచిన వారికి తెలియపరుస్తాడు. మరియు ఆయన ప్రవక్త ముందు దైవదూతలను కాపలాగా పంపిస్తాడు వారు దాన్ని ప్రవక్త కాకుండా ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకు పరిరక్షిస్తా రు. ليعلمأن قد أبلغوارسلت ربهم وأحاط بما لديهم وأحص كل شىءعددا
لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا۟ رِسَـٰلَـٰتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَىْءٍ عَدَدًۢا ﴿٢٨﴾
ప్రవక్త తన కన్నా మునుపటి ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని వారికి వారి ప్రభువు ఆదేశించినటువంటి తమ ప్రభువు సందేశాలను అల్లా హ్ చుట్టూ ఉంచిన పరిరక్షణ వలన మరియు దైవదూతల మరియు ప్రవక్తల వద్ద ఉన్న దాన్నిఅల్లాహ్ జ్ఞాన పరంగా చుట్టు ముట్టి ఉండటం వలన చేరవేశారని తెలుసుకుంటారని ఆశిస్తూ. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ప్రతీ వస్తు వు యొక్క లెక్కను ఆయన లెక్కవేసి ఉంచాడు. పరిశుద్ధు డైన ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్