سَبَّحَ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿١﴾
ఆకాశముల్లో ఉన్న మరియు భూమిలో ఉన్న సృష్టి రాసులన్నీ అల్లా హ్ యొక్క ఆయనకు తగని వాటి నుండి గొప్పతనాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన ధర్మ శాసనములలో,తన విధి వ్రా తలో వివేకవంతుడు
هُوَ ٱلَّذِىٓ أَخْرَجَ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ مِن دِيَـٰرِهِمْ لِأَوَّلِ ٱلْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا۟ ۖ وَظَنُّوٓا۟ أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا۟ ۖ وَقَذَفَ فِى قُلُوبِهِمُ ٱلرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِى ٱلْمُؤْمِنِينَ فَٱعْتَبِرُوا۟ يَـٰٓأُو۟لِى ٱلْأَبْصَـٰرِ ﴿٢﴾
ه ఆయనే అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం గారిని తిరస్కరించి బనూ నజీర్ ను మదీనాలో ఉన్న వారి నివాసముల నుండి వారిని మదీనా నుండి షామ్ (సిరియా) వైపునకు మొదటి సారి వెలివేయటం కొరకు వెలివేశాడు. మరియు వారు తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి వారు. వారు తమ ఒప్పందమును భంగపరచి,ఆయనకు వ్యతిరేకముగా ముష్రికులతో సత్సంబంధాలు కలిగిన తరువాత. ఆయన వారిని షామ్ ప్రాంతము వైపునకు వెలివేశాడు. ఓ విశ్వాసపరులారా వారు కలిగిన ఆధిక్యత మరియు రక్షణ వలన వారు తమ నివాసముల నుండి భయటకు వస్తారని మీరు అనుకోలేదు. మరియు వారు నిర్మించుకున్న వారి కోటలు మరియు వారి రక్షణాలయములు అల్లాహ్ యాతన,ఆయన శిక్ష నుండి తమను రక్షిస్తాయని వారు భావించారు. అప్పుడు అల్లాహ్ శిక్ష ఆయన తన ప్రవక్తను వారితో పోరాడమని,వారిని వెలివేయమని ఆదేశించినప్పుడు వారు దాని వచ్చే చోటును ఊహించని విధంగా వారిపై వచ్చిపడినది. మరియు అల్లా హ్ వారి హృదయముల్లో తీవ్రమైన భయమును కలిగించాడు. వారు తమ నివాసములను ముస్లిములు వాటితో ప్రయోజనం చెందకుండా ఉండటానికి లోపలి నుండి తమ చేతులతో పడగొట్టసాగారు. మరియు ముస్లిములు వాటిని వెలుపల నుండి పడగొట్టసాగారు. కాబట్టి కళ్లు ఉన్నవారలారా వారి అవిశ్వాసం వలన వారిపై కలిగిన దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు వారిలా అవ్వకండి. అటువంటప్పుడు వారు శిక్షంచబడిన వారి ప్రతిఫలము,వారి శిక్షను మీరు పొందుతారు
وَلَوْلَآ أَن كَتَبَ ٱللَّهُ عَلَيْهِمُ ٱلْجَلَآءَ لَعَذَّبَهُمْ فِى ٱلدُّنْيَا ۖ وَلَهُمْ فِى ٱلْـَٔاخِرَةِ عَذَابُ ٱلنَّارِ ﴿٣﴾
మరియు ఒక వేళ అల్లాహ్ వారిని వారి నివాసముల నుండి వెలివేయటమును వారిపై రాసి ఉండకపోతే వారిని ఇహలోకములోనే హతమార్చటం ద్వారా,బందీ చేయటం ద్వారా ఏ విధంగానైతే వారి సోదరులు బను ఖురైజా పట్ల వ్యవహరించాడో ఆ విధంగా శిక్షించేవాడు. మరియు వారి కొరకు పరలోకములో నరక యాతన వారిని నిరీక్షిస్తూ ఉంటుంది. వారు అందులో శాశ్వతంగా ఉంటారు
ذَٰلِكَ بِأَنَّهُمْ شَآقُّوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥ ۖ وَمَن يُشَآقِّ ٱللَّهَ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ ﴿٤﴾
అది ఏదైతే వారికి సంభవించినది సంభవించింది. ఎందుకంటే వారు తమ అవిశ్వాసం ద్వారా తమ ప్రమాణములను భంగ పరచటం ద్వారా అల్లా హ్ పట్ల శతృత్వమును చూపారు మరియు ఆయన ప్రవక్త పట్ల శతృత్వమును చూపారు. ఎవరైతే అల్లా హ్ పట్ల శతృత్వమును చూపుతారో నిశ్ఛయంగా అల్లా హ్ కఠినంగా శిక్షంచేవాడు. తొందరలోనే ఆయన కఠినమైన శిక్ష అతనికి కలుగుతుంది
مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَآئِمَةً عَلَىٰٓ أُصُولِهَا فَبِإِذْنِ ٱللَّهِ وَلِيُخْزِىَ ٱلْفَـٰسِقِينَ ﴿٥﴾
విశ్వాసపరుల సమాజం వారా బనూ నజీర్ యుద్దంలో మీరు ఏవైతే ఖర్జూ రపు చెట్లను అల్లా హ్ శతృవులను ఆగ్రహమునకు గురి చేయటానికి మీరు నరికారో లేదా మీరు ప్రయోజనం చెందటానికి వాటిని వాటి బోదెలపై వదిలి వేశారో అది అల్లాహ్ ఆదేశముతోనే. అది వారు అనుకున్నట్లు భూమిలో ఉపద్రవాన్ని తలపెట్టటం కోసం కాదు. మరియు యూదుల్లోంచి ఆయన విధేయత నుండి వైదొలగిన వారికి అల్లా హ్ దాని ద్వారా అవమానపరచటానికి. వారు ప్రమాణమును భంగపరిచారు. మరియు వారు విశ్వాసపాత్రత మార్గమునకు భిన్నంగా ద్రోహ మార్గమును ఎంచుకున్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَمَآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنْهُمْ فَمَآ أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍۢ وَلَا رِكَابٍۢ وَلَـٰكِنَّ ٱللَّهَ يُسَلِّطُ رُسُلَهُۥ عَلَىٰ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ ﴿٦﴾
ى బనూ నజీర్ సంపదల్లోంచి అల్లా హ్ ఏదైతే తన ప్రవక్తకు అందజేశాడో దాన్ని పొందే విషయంలో మీరు సవారి చేసే గుఱ్రములను గాని ఒంటెలను గాని మీరు పరుగెత్తించలేదు. మరియు ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ అల్లాహ్ తాను తలచుకున్న వారిపై తన ప్రవక్తలకు ఆధిక్యతను ప్రసాదిస్తా డు. వాస్తవానికి ఆయన తన ప్రవక్తకు బనూ నజీర్ పై ఆధిక్యతను ప్రసాదించాడు. కాబట్టి ఆయన ఎటువంటి యుద్దం లేకుండానే వారి బస్తీలపై విజయం పొందారు. మరియు అల్లా హ్ ప్రతీది చేసే సమర్ధు డు. ఆయనను ఏదీ అశక్తు డిని చేయదు
مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنْ أَهْلِ ٱلْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱبْنِ ٱلسَّبِيلِ كَىْ لَا يَكُونَ دُولَةًۢ بَيْنَ ٱلْأَغْنِيَآءِ مِنكُمْ ۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ ﴿٧﴾
ه అల్లా హ్ బస్తీ వాసుల సంపదల్లోంచి ఏదైతే తన ప్రవక్తకు ఎటువంటి యుద్దం లేకుండా అనుగ్రహించాడో అది అల్లా హ్ కు చెందినది. ఆయన దాన్ని తాను తలచిన వారికి ఇస్తాడు. మరియు ప్రవక్తకు అధికారం కలదు. మరియు ఆయన బంధువులైన హాషిమ్ సంతతి మరియు ముత్తలిబ్ సంతతి కొరకు అధికారము కలదు అది వారు సదఖా నుండి ఆపబడిన దానికి బదులుగా. మరియు అనాధులకి,పేదవారికి మరియు తన ఖర్చులను కోల్పోయిన బాటసారికి అధికారం కలదు. సంపద పేదవారికి కాకుండా ధనికుల్లో నే ప్రత్యేకించి తిరగకుండా ఉండటానికి. ఓ విశ్వాసపరులారా ఫై సంపదలలోంచి మీకు ప్రవక్త ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి మరియు ఆయన మీకు ఆపిన దాని నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు అల్లా హ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి. నిశ్ఛయంగా అల్లా హ్ కఠినంగా శిక్షించే వాడు కాబట్టి మీరు ఆయన శిక్ష నుండి జాగ్రత్తపడండి
لِلْفُقَرَآءِ ٱلْمُهَـٰجِرِينَ ٱلَّذِينَ أُخْرِجُوا۟ مِن دِيَـٰرِهِمْ وَأَمْوَٰلِهِمْ يَبْتَغُونَ فَضْلًۭا مِّنَ ٱللَّهِ وَرِضْوَٰنًۭا وَيَنصُرُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ ﴿٨﴾
మరియు ఈ సంపద నుండి తమ సంపదలను,తమ సంతానమును వదిలివేయటంపై బలవంతం చేయబడి అల్లా హ్ మార్గములో హిజ్రత్ చేసిన పేదల కొరకు మరలించబడుతుంది. వారు అల్లాహ్ వారిపై ఆహారోపాధి ద్వారా ఇహలోకంలో మరియు మన్నత ద్వారా పరలోకంలో అనుగ్రహిస్తాడని ఆశిస్తుంటారు. మరియు వారు అల్లా హ్ మార్గములో ధర్మ పోరాటము ద్వారా అల్లా హ్ కు మరియు ఆయన ప్రవక్తకు సహాయపడతారు. ఈ లక్షణాలతో వర్ణించబడిన వారందరు వాస్తవానికి విశ్వాసములో పతిష్టమైనవారు
وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلْإِيمَـٰنَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِى صُدُورِهِمْ حَاجَةًۭ مِّمَّآ أُوتُوا۟ وَيُؤْثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌۭ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِۦ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ ﴿٩﴾
మరియు ముహాజిర్ ల కన్నా ముందు నుండే మదీనాలో చోటు చేసుకున్న అన్సారులు, వారు అల్లా హ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును ఎంచుకున్నారు. వారు మక్కా నుండి తమ వద్దకు వలస వచ్చిన వారిని ఇష్టపడుతారు. మరియు వారు ఫై నుండి తమకు ఇవ్వకుండా అల్లా హ్ మార్గములో హిజ్రత్ చేసిన వారికి ఏదైన ఇవ్వబడితే తమ హృదయములలో ఎటువంటి కోపమును గాని ఎటువంటి అసూయను గాని పొందరు. మరియు వారు ప్రాపంచిక భాగములలో ముహాజిర్ లను తమ కన్నా ముందు ఉంచుతారు. ఒక వేళ వారికి పేదరికము, అవసరం కలిగినా సరే. మరియు అల్లా హ్ ఎవరినైతే సంపదపై అత్యాశ నుండి రక్షిస్తా డో అతడు దాన్ని ఆయన మార్గములో ఖర్చు చేస్తా డు. కావున వారందరే తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ل
وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ ﴿١٠﴾
మరియు వీరందరి తరువాత ఎవరైతే వచ్చి ప్రళయ దినము వరకు వారిని మంచితో అనుసరిస్తా రో వారు ఇలా పలుకుతారు: ఓ మా ప్రభువా మమ్మల్ని మరియు అల్లా హ్ పై మరియు ఆయన ప్రవక్త పై మా కన్నా ముందు విశ్వాసము కనబరచిన వారైన ధర్మ విషయంలో మా సోదరులైన వారిని మన్నించు. విశ్వాసపరుల్లోంచి ఎవరి కొరకు కూడా మా హృదయములలో ద్వేషమును కాని పగను కాని కలిగించకు. ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు నీ దాసులపై దయ చూపేవాడివి, వారిపై కరుణించేవాడివి
۞ أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ نَافَقُوا۟ يَقُولُونَ لِإِخْوَٰنِهِمُ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًۭا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَٱللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿١١﴾
ఓ ప్రవక్తా అవిశ్వాసమును గోప్యంగా ఉంచి విశ్వాసమును బయటకు చూపే వారిని మీరు గమనించలేదా వారు అవిశ్వాసంలో తమ సోదరులైన మార్పు చేర్పులు చేయబడిన తౌరాత్ ను అనుసరించే యూదులతో ఇలా పలుకుతున్నారు: మీరు మీ ఇండ్లలోనే స్థిరంగా ఉండండి మేము మిమ్మల్ని నిస్సహాయులుగా వదిలివేయము. మరియు మేము మిమ్మల్ని అప్పజప్పము. ఒక వేళ ముస్లిములు మిమ్మల్ని వాటి నుండి వెళ్ళగొడితే మేము కూడా మీతో పాటు కలిసి బయటకు వస్తాము. మేము మీతో పాటు బయటకు రావటం నుండి మమ్మల్ని ఆపదలచిన వారి ఎవరి మాట వినము. మరియు ఒకవేళ వారు మీతో పోరాడితే మేము వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాము. మరియు నిశ్ఛయంగా యూదులు వెళ్ళగొట్టబడినప్పుడు వారితో పాటు బయలు దేరుతారని మరియు వారితో యుద్దం చేయబడినప్పుడు వారితో కలసి యుద్దం చేస్తారని చేసిన వాగ్దానములో కపటులు అబద్దం పలుకుతున్నారని అల్లా హ్ సాక్ష్యం పలుకుతున్నాడు
لَئِنْ أُخْرِجُوا۟ لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا۟ لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ ٱلْأَدْبَـٰرَ ثُمَّ لَا يُنصَرُونَ ﴿١٢﴾
ఒక వేళ ముస్లిములు యూదులను వెళ్ళ గొడితే వారు వారితో పాటు బయలుదేరరు. ఒక వేళ వారు వారితో యుద్దం చేస్తే వారు వారికి సహాయము చేయరు మద్దతూ పలకరు. మరియు ఒక వేళ వారు వారికి ముస్లిములకు వ్యతిరేకముగా సహాయము చేసి మద్దతు పలికితే వారు వారి నుండి తప్పకుండా పారిపోతారు ఆ తరువాత కపటులు సహాయం చేయబడరు. అంతేకాదు అల్లా హ్ వారిని అవమానమునకు గురి చేస్తా డు మరియు వారికి పరాభవమునకు లోను చేస్తా డు
لَأَنتُمْ أَشَدُّ رَهْبَةًۭ فِى صُدُورِهِم مِّنَ ٱللَّهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌۭ لَّا يَفْقَهُونَ ﴿١٣﴾
ఓ విశ్వాసపరులారా కపటుల మరియు యూదుల హృదయములలో అల్లా హ్ కన్నా మీ భయం ఎక్కువ. ఈ ప్రస్తా వించబడిన - మీ నుండి వారి భయము యొక్క తీవ్రత మరియు అల్లా హ్ నుండి వారి భయపడటంలో బలహీనత - వారు బుద్దిలేని,అర్ధం చేసుకోలేని జనులు కావటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే అల్లా హ్ భయము,భీతి ఎక్కువ హక్కు కలదని వారు తెలుసుకునేవారు. ఆయనే మిమ్మల్ని వారిపై ఆధిక్యతను కలిగించాడు
لَا يُقَـٰتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِى قُرًۭى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَآءِ جُدُرٍۭ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌۭ ۚ تَحْسَبُهُمْ جَمِيعًۭا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌۭ لَّا يَعْقِلُونَ ﴿١٤﴾
ذلك بأنهم قوم لا يعقلون ఓ విశ్వాసపరులారా యుదులు సమావేశమై మీతో యుద్దం చేయరు కాని కోటలుగల పురములలో ఉండిగానీ,గోడల చాటు నుండిగాని పోరాడుతారు. వారు తమ పిరికితనం వలన మిమ్మల్ని ఎదుర్కోలేరు. వారి మధ్య ఉన్నద్వేషముల వలన వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తీవ్రమైనవి. వారి మాట ఒకటే అని,వారి పంక్తి ఒకటే అని మీరు భావిస్తా రు. వాస్తవానికి వారి హృదయములు వేరు వేరుగా ఉన్నవి,వ్యతిరేకమైనవి. ఈ విభేదము మరియు ద్వేషము వారికి బుద్ది లేకపోవటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే సత్యమును గుర్తించి దాన్ని అనుసరించేవారు. అందులో విభేదించరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًۭا ۖ ذَاقُوا۟ وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌۭ ﴿١٥﴾
తమ అవిశ్వాసములో,తమపై కురిసిన శిక్షలో ఈ యూదులందరి ఉపమానము దగ్గరి కాలములో వారి కన్నా ముందు ఉన్న మక్కా ముష్రికుల ఉపమానము లాంటిది. వారు తమ అవిశ్వాసము యొక్క చెడ్డ పరిణామము రుచిని చవిచూశారు. బదర్ దినమున వారిలో నుండి హతమార్చబడేవారు హతమార్చబడ్డా రు మరియు బందీ చేయబడేవారు బందీ చేయబడ్డా రు. మరియు వారి కొరకు పరలోకములో బాధాకరమైన శిక్ష కలదు
كَمَثَلِ ٱلشَّيْطَـٰنِ إِذْ قَالَ لِلْإِنسَـٰنِ ٱكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّى بَرِىٓءٌۭ مِّنكَ إِنِّىٓ أَخَافُ ٱللَّهَ رَبَّ ٱلْعَـٰلَمِينَ ﴿١٦﴾
కపటుల నుండి వారి వినటంలో వారి ఉపమానముషైతాను ఉపమానములాంటిది అతడు మనిషిని అవిశ్వాసము చూపమని అలంకరించినప్పుడు అవిశ్వాసమును చూపటమును తన కొరకు అతను అలంకరించటం వలన అతడు అవిశ్వసించినప్పుడు అతడు (షైతాను) ఇలా పలుకుతాడు నిశ్చయంగా నీవు అవిశ్వాసం చూపిన దానికి నీతో నాకు సంబంధము లేదు. నిశ్చయంగ నేను సృష్టిరాసుల ప్రభువైన అల్లా హ్ తో భయపడుతున్నాను
فَكَانَ عَـٰقِبَتَهُمَآ أَنَّهُمَا فِى ٱلنَّارِ خَـٰلِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَٰٓؤُا۟ ٱلظَّـٰلِمِينَ ﴿١٧﴾
షైతాన్ వ్యవహారము పర్యవసానము మరియు అతనిని అనుసరించిన వాడి పర్యవసానము వారిద్దరు (అంటే అనుసరించబడిన షైతాను మరియు అనుసరించిన మనిషి) ప్రళయదినమున నరకాగ్నిలో ఉంటారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఈ ప్రతిఫలము ఏదైతే వారి కొరకు నిరీక్షిస్తు న్నదో అది అల్లా హ్ హద్దు లను అతిక్రమించి తమ స్వయం పై దుర్మార్గమునకు పాల్పడిన వారి ప్రతిఫలము
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَلْتَنظُرْ نَفْسٌۭ مَّا قَدَّمَتْ لِغَدٍۢ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ ﴿١٨﴾
ఓ అల్లా హ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లా హ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మరియు ప్రతి మనిషి ప్రళయదినం కొరకు ముందు చేసుకున్న సత్కర్మను గురించి యోచన చేయాలి. మరియు మీరు అల్లా హ్ కు భయపడండి. నిశ్ఛయంగా అల్లా హ్ మీరు చేసుకున్న కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తా డు
وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَـٰسِقُونَ ﴿١٩﴾
మరియు మీరు అల్లా హ్ ను ఆయన ఆదేశములను పాటించటమును వదిలి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండకుండా మరచిపోయిన వారిలా అవ్వకండి. అల్లా హ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు. అప్పుడు వారు అల్లా హ్ క్రోదము నుండి,ఆయన శిక్ష నుండి తమను రక్షించే కార్యాలు చేయలేదు. వారందరు అల్లా హ్ ను మరచిపోయారు - వారు ఆయన ఆదేశములను పాటించలేదు మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగ లేదు - వారే అల్లా హ్ విధేయత నుండి వైదొలగిన వారు
لَا يَسْتَوِىٓ أَصْحَـٰبُ ٱلنَّارِ وَأَصْحَـٰبُ ٱلْجَنَّةِ ۚ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ هُمُ ٱلْفَآئِزُونَ ﴿٢٠﴾
నరక వాసులు మరియు స్వర్గ వాసులు సరిసమానులు కారు. అంతే కాదు వారు ఇహలోకములో తమ కర్మలు వేరైనట్లుగానే తమ ప్రతిఫలము విషయములో వేరుగా ఉంటారు. స్వర్గ వాసులు వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి ముక్తి పొంది సాఫల్యం చెందుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
لَوْ أَنزَلْنَا هَـٰذَا ٱلْقُرْءَانَ عَلَىٰ جَبَلٍۢ لَّرَأَيْتَهُۥ خَـٰشِعًۭا مُّتَصَدِّعًۭا مِّنْ خَشْيَةِ ٱللَّهِ ۚ وَتِلْكَ ٱلْأَمْثَـٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ﴿٢١﴾
يتفك رون ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏదైన పర్వతంపైనైనా అవతరింపజేస్తే ఓ ప్రవక్తా మీరు ఆ పర్వతమును అది దృఢముగా ఉండి కూడా అల్లా హ్ యొక్క తీవ్ర భయం వలన అణిగిపోయి బ్రద్దలైపోవటమును చూస్తా రు. ఖుర్ఆన్ లో కల హితోపదేశముల హెచ్చరికలు మరియు తీవ్ర బెదిరింపుల వలన. మరియు మేము ఈ ఉపమానములను ప్రజలకు విశదపరుస్తు న్నాము బహుశా వారు తమ బుద్దు లను ఆచరణలో పెట్టి దాని ఆయతులలో పొందుపరచబడిన హితోపదేశములతో,గుణపాఠములతో హితోపదేశం గ్రహిస్తా రని
هُوَ ٱللَّهُ ٱلَّذِى لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَـٰلِمُ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ ۖ هُوَ ٱلرَّحْمَـٰنُ ٱلرَّحِيمُ ﴿٢٢﴾
هُوَ ٱللَّهُ ٱلَّذِى لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْمَلِكُ ٱلْقُدُّوسُ ٱلسَّلَـٰمُ ٱلْمُؤْمِنُ ٱلْمُهَيْمِنُ ٱلْعَزِيزُ ٱلْجَبَّارُ ٱلْمُتَكَبِّرُ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ ﴿٢٣﴾
يشركون ఆయనే అల్లా హ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లా హ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధు డు మరియు అతీతుడు
هُوَ ٱللَّهُ ٱلْخَـٰلِقُ ٱلْبَارِئُ ٱلْمُصَوِّرُ ۖ لَهُ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٢٤﴾
ఆయనే అల్లా హ్ ప్రతీ వస్తు వును సృష్టించిన సృష్టికర్త, వస్తు వులకు ఉనికిని ప్రసాదించేవాడు ,తాను తలచిన విధంగా తన సృష్టిరాసులకు రూపకల్పన చేసేవాడు, ఉన్నత గుణాలను కల మంచి నామములు పరిశుద్ధు డైన ఆయన కొరకే కలవు. ఆకాశములలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ ప్రతీ లోపము నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నవి. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మశాసనములలో,తన విధి వ్రా తలో వివేకవంతుడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్