ముఖపేజీతఫ్సీర్Al-An'aam (6)

తఫ్సీర్ Al-An'aam (6) — الأنعام

మక్కీ · 165 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَجَعَلَ ٱلظُّلُمَـٰتِ وَٱلنُّورَ ۖ ثُمَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ يَعْدِلُونَ ﴿١﴾

సంపూర్ణపరిపూర్ణతో కూడిన వర్ణన, ప్రేమతో కూడిన అత్యున్నత సౌంధర్యాలతో స్ధుతి ఆ అల్లాహ్ కే వర్తిస్తుంది ఎవరైతే భూమ్యాకాశాలను పూర్వపు ఉదాహరణ లేకుండా సృష్టించాడో,ఒక దాని తరువాత ఒకటిగా రేయింబవళ్ళను సృష్టించాడు,రాత్రిని చీకటిగా సృష్టించాడు,పగలును వెలుగుగా సృష్టించాడు. మరియు వీటికి తోడుగా సత్యతిరస్కారులైన వారు అల్లాహేతరులను ఆయనకు సమానంగా చేస్తున్నారు. వారిని ఆయనతో సాటి కల్పిస్తు న్నారు

هُوَ ٱلَّذِى خَلَقَكُم مِّن طِينٍۢ ثُمَّ قَضَىٰٓ أَجَلًۭا ۖ وَأَجَلٌۭ مُّسَمًّى عِندَهُۥ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ ﴿٢﴾

ఓ ప్రజలారా ఆయన సుబహానహు వతఆలా మిమ్మల్ని మీ తండ్రి ఆదమ్ అలైహిస్సలాంను మట్టితో సృష్టించినప్పుడే మట్టితో సృష్టించాడు.ఆ తరువాత ఆయన సుబహానహు తఆలా ఇహలోక జీవితంలో మీ నివాసము కొరకు ఒక గడువును నియమించాడు.మరియు ఆయన తప్ప ఇంకొకరికి తెలియని వేరొక గడువును మిమ్మల్ని ప్రళయదినాన లేపటం కొరకు నియమించాడు.ఆ తరువాత మీరు ఆయన సుబహానహు తఆలా మరల లేపే విషయంలో ఆయన శక్తి సామర్ధ్యాల గురించి సంశయంలో పడిపోయారు

وَهُوَ ٱللَّهُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَفِى ٱلْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ ﴿٣﴾

ఆయన సుబహానహు తఆలా భూమ్యాకాశాల్లో వాస్తవ ఆరాధ్య దైవము.ఆయనపై ఏ వస్తువు దాగి ఉండదు.ఆయన మీరు దాచిపెట్టే సంకల్పాలను,మాటలను,ఆచరణలను తెలుసుకుంటాడు.వాటిలోంచి మీరు బహిర్గతం చేసే వాటిని తెలుసుకుంటాడు.మరియు తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తా డు. وما تأتيهم من ءاية من ءايت ربهم إلا كانواعنها معرضين

وَمَا تَأْتِيهِم مِّنْ ءَايَةٍۢ مِّنْ ءَايَـٰتِ رَبِّهِمْ إِلَّا كَانُوا۟ عَنْهَا مُعْرِضِينَ ﴿٤﴾

ముష్రికుల వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఏ ఆధారం వచ్చినా దానిని వారు పట్టించుకోకుండా వదిలివేసేవారు.వారి వద్దకు అల్లా హ్ యొక్క ఏకత్వమును నిరూపించే స్పష్టమైన ఆధారాలు,స్పష్టమైన ఋజువులు వచ్చినవి.వారి వద్దకు ఆయన ప్రవక్తల నిజాయితిని తెలిపే సూచనలు వచ్చినవి.అయితే వారు వాటిని పట్టించుకోకుండా వాటిపట్ల విముఖతను చూపారు

فَقَدْ كَذَّبُوا۟ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنۢبَـٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿٥﴾

ఒక వేళ వీరందరు ఈ స్పష్టమైన ఆధారాలు,స్పష్టమైన ఋజువుల పట్ల విముఖత చూపితే నిశ్చయంగా వీరు చాలా స్పష్టమైన దాని పట్ల విముఖత చూపారు.నిశ్చయంగా వీరు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం గారు తీసుకుని వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించారు.ఆయన వారి వద్దకు తీసుకుని వచ్చినది దేని గురించైతే వారు హేళన చేస్తు న్నారో అది సత్యమని ప్రళయదినాన శిక్షను చూసినప్పుడు వారు గుర్తిస్తా రు

أَلَمْ يَرَوْا۟ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍۢ مَّكَّنَّـٰهُمْ فِى ٱلْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا ٱلسَّمَآءَ عَلَيْهِم مِّدْرَارًۭا وَجَعَلْنَا ٱلْأَنْهَـٰرَ تَجْرِى مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَـٰهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قَرْنًا ءَاخَرِينَ ﴿٦﴾

దుర్మార్గులైన జాతులవారి వినాశనంలో అల్లాహ్ సాంప్రదాయం ఉన్నదని ఈ అవిశ్వాసపరులందరికి తెలియదా?.అల్లాహ్ వారి కన్న ముందు చాలా జాతులను వినాశనానికి గురి చేశాడు.ఈ అవిశ్వాసపరులకి ప్రసాదించనివి ఎన్నో వారికి భూమిలో నివాసం కొరకు,బలము కొరకు కారకాలను ప్రసాదించాడు.నిర్విరామంగా (పుష్కలంగా) వారిపై వర్షాలను కురిపించాడు.వారి నివాసాల క్రింద నుండి సెలయేరులు ప్రవహించే విదంగా చేశాడు.అయినా వారు అల్లాహ్ పట్ల అవిధేయత చూపారు.అప్పుడు ఆయన వారు పాపకార్యములను పాల్పడటం వలన వారిని వినాశనానికి గురి చేశాడు.వారి తరువాత వేరే జాతుల వారిని సృష్టించాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَـٰبًۭا فِى قِرْطَاسٍۢ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌۭ مُّبِينٌۭ ﴿٧﴾

ఓ ప్రవక్తా మేము కాగితాల్లో వ్రా యబడిన ఒక గ్రంధాన్ని మీపై అవతరింపజేసినా,వారు దానిని తమ కళ్ళతో చూసినా,వారు తమ చేతులతో పుస్తకాన్ని తాకి అనుభూతి చెంది నిర్ధా రించుకున్నా వారి మొరటుతనం,తిరస్కారము వలన వారు దానిని విశ్వసించరు.నీవు తీసుకుని వచ్చినది స్పష్టమైన మాయాజాలం కన్నా ఎక్కువే.మేము దానిని విశ్వసించమంటే విశ్వసించము అని వారు అంటారు

وَقَالُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ مَلَكٌۭ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًۭا لَّقُضِىَ ٱلْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ ﴿٨﴾

ఈ అవిశ్వాసపరులందరు అంటారు-: ఒక వేళ అల్లా హ్ ముహమ్మద్ తోపాటు ఒక దూతను దించి ఉంటే అతడు మాతో మాట్లా డి ఉంటే ఆయన ప్రవక్త అని సాక్షం పలికి ఉంటే మేము విశ్వసిస్తాము.మేము ఒక వేళ వారు కోరిన లక్షణాలు కల దూతను దించితే మేము వారిని వినాశనమునకు గురి చేస్తా ము.అప్పుడు వారు విశ్వసించరు,దైవ దూత దిగినప్పుడు వారికి పశ్చ్యాత్తా ప్పడటానికి వ్యవది ఇవ్వబడదు. ولو جعلنهملكا ل جعلنهرجلا وللبسنا عليهم ما يلبسون

وَلَوْ جَعَلْنَـٰهُ مَلَكًۭا لَّجَعَلْنَـٰهُ رَجُلًۭا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ ﴿٩﴾

ఒక వేళ మేము దైవ దూతనే ప్రవక్తగా పంపిస్తే అతనిని మేము మానవుని రూపంలో చేస్తాము.అప్పుడు వారు అతనిని వినగలుగుతారు,అతనిని కలుసుకోగలుగుతారు.దైవ దూతను ఏ రూపంలో నైతే అల్లా హ్ అతనిని సృష్టించాడో ఆ రూపంలో ఇదంతా సాధ్యం కాదు.ఒక వేళ మేము మానవుని రూపంలో చేస్తే అది వారిని సందేహంలో పడవేస్తుంది

وَلَقَدِ ٱسْتُهْزِئَ بِرُسُلٍۢ مِّن قَبْلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُوا۟ مِنْهُم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿١٠﴾

ఒక వేళ వారందరు మీతో పాటు దూతను అవతరింపజేసే వారి కోరిక విషయంలో అవహేళన చేస్తే మీకన్న పూర్వం జాతులవారు తమ ప్రవక్తలను అవహేళనకు గురి చేశారు.అయితే ఏ శిక్ష ద్వారానైతే వారు భయపెట్టబడేటప్పుడు దానిని వారు తిరస్కరించారో,హేళన చేశారో ఆ శిక్ష వారిని చుట్టు ముట్టు కుంది

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ ثُمَّ ٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ ﴿١١﴾

ఓ ప్రవక్తా అవహేళన చేసే ఈ తిరస్కారులందరితో ఇలా తెలియజేయండి-: మీరు భూమిలో సంచరించండి.ఆ తరువాత అల్లా హ్ ప్రవక్తలను తిరస్కరించిన వారి ముగింపు ఏ విధంగా జరిగినదో చూడండి.వారికి బలం,బలగం ఉండి కూడా వారిపై అల్లా హ్ శిక్ష వచ్చి పడినది

قُل لِّمَن مَّا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ قُل لِّلَّهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ ٱلرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ لَا رَيْبَ فِيهِ ۚ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ﴿١٢﴾

ఓ ప్రవక్త వారందరితో అనండి: భూమిలో అధికారము,ఆకాశములలో అధికారము,వాటిలో ఉన్న సమస్తము పై అధికారము ఎవరిది ?.మీరు అనండి: వాటన్నింటి పై అధికారము అల్లా హ్ దే.అతను తన దాసులపై అనుగ్రహంగా కనికరమును తన పై అవశ్యం చేసుకున్నాడు.వారిని శిక్షించటంలో తొందర పడడు.చివరికి వారు పశ్చ్యాత్తా ప్పడక పోయినప్పుడు వారందరిని ప్రళయదినాన సమీకరిస్తా డు.ఆ దినము ఎటువంటి సందేహము లేని దినము.అల్లా హ్ పై అవిశ్వాసం వలన తమకు తామే నష్టమును కలిగించుకున్న వారు విశ్వసించరు. ఈ విధంగా వారు తమను నష్టం నుండి రక్షించుకోవాలనుకుంటారు

۞ وَلَهُۥ مَا سَكَنَ فِى ٱلَّيْلِ وَٱلنَّهَارِ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ﴿١٣﴾

మరియు పగలు,రాత్రి స్ధిరపడ్డ ప్రతి వస్తువు పై అధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే.ఆయన వారి మాటలను వినేవాడును,వారి కర్మలను తెలుసుకునేవాడును,త్వరలోనే వాటి పరంగా వారికి ప్రతిఫలాన్నిప్రసాధిస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ي

قُلْ أَغَيْرَ ٱللَّهِ أَتَّخِذُ وَلِيًّۭا فَاطِرِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّىٓ أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿١٤﴾

ఓ ప్రవక్త అల్లా హ్ తోపాటు ఇతరులను విగ్రహాలు,మొదలుగు వాటిని ఆరాధించే బహుదైవారాధకులతో ఇలా తెలపండి-: నేను అల్లా హ్ ను వదిలి వేరే వారిని సహాయకునిగా చేసుకుని అతనితో సహాయమును అర్ధిస్తే ఇది అర్ధం చేసుకునే విషయమా?.ఆయన పూర్వ నమూనా లేకుండా భూమ్యాకాశాలను సృష్టించాడు. ఆ రెండింటిని సృష్టించటంలో ఆయనకన్న ముందు ఎవడూ లేడు.అతనే తన దాసుల్లోంచి ఎవరిని తలచుకుంటే వారిని ఆహారాన్ని ప్రసాధించేవాడు.ఆయన దాసుల్లోంచి ఆయనకు ఎవరూ ఆహారాన్ని ప్రసాధించ లేరు.ఆయన తన దాసుల అవసరం లేనివాడు.ఆయన దాసులు ఆయన అవసరం కలవారు.ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియజేయండి-: పరిశుద్ధు డైన నా ప్రభువు నన్ను ఈ జాతిలోంచి అల్లా హ్ కొరకు మొట్ట మొదట విధేయత చూపే వానిగా,వినయ నిమమ్రతలు చూపే వానిగా అవ్వమని ఆదేశించాడు.మరియు ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించే వారిలోంచి అవ్వడం నుండి నన్ను వారించాడు

قُلْ إِنِّىٓ أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّى عَذَابَ يَوْمٍ عَظِيمٍۢ ﴿١٥﴾

ఓ ప్రవక్త మీరు ఇలా తెలియ పరచండి-: ఒక వేళ నేను అల్లా హ్ నాపై నిషేధించిన షిర్కును,తదితర కార్యాలను చేసి లేదా నన్ను ఆదేశించిన విధేయతకు గురిచేసే విశ్వాసము,తదితర కార్యాలను వదిలివేసి అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడితే ఆయన నన్ను ప్రళయదినాన పెద్ద శిక్షకు గురి చేస్తాడని నిశ్చయంగా నేను భయపడుతున్నాను

مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍۢ فَقَدْ رَحِمَهُۥ ۚ وَذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْمُبِينُ ﴿١٦﴾

ప్రళయ దినాన అల్లా హ్ ఎవరినైతే ఈ శిక్ష నుండి దూరం చేస్తా డో అతడు అల్లా హ్ కారుణ్యము ద్వారా సాఫల్యం చెందుతాడు.శిక్ష నుండి ఈ మోక్షమే స్పష్టమైన సాఫల్యం.దానికి సమానమైన సాఫల్యం ఏది ఉండదు

وَإِن يَمْسَسْكَ ٱللَّهُ بِضُرٍّۢ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍۢ فَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ ﴿١٧﴾

ఓ ఆదం కుమారుడా ఒక వేళ అల్లా హ్ వద్ద నుండి ఏదైన ఆపద నీపై వస్తే అల్లా హ్ తప్ప ఇంకెవరు నీపై నుండి ఆ ఆపదను తొలగించేవారుండరు.ఒక వేళ ఆయన వద్ద నుండి ఏదైన మేలు నీకు చేరితే దానిని ఆపేవాడు ఎవడూ ఉండడు.ఆయన అనుగ్రహమును ఎవరూ మరలించలేరు.ఆయనే ప్రతీ వస్తు వుపై అధికారము కలవాడు.ఆయనను ఏదీ అశక్తు లు చేయలేవు

وَهُوَ ٱلْقَاهِرُ فَوْقَ عِبَادِهِۦ ۚ وَهُوَ ٱلْحَكِيمُ ٱلْخَبِيرُ ﴿١٨﴾

మరియు అతడు తన దాసులపై ఆధిఖ్యతను చూపేవాడు వారిని తన అదుపులో ఉంచుకునేవాడు,అన్ని విధాలుగా వారిపై ఆధిఖ్యతను ప్రదర్శించేవాడు ఆయనను ఏదీ అశక్తుడు చేయలేవు.ఆయనపై ఎవరూ ఆధిఖ్యతను ప్రదర్శించలేరు.సమస్తము ఆయన ఆదీనంలో ఉన్నవి.పరిశుద్ధుడైన ఆయనకు తగినట్లు తన దాసులపై ఆధిఖ్యమున్నది.అతడే తన సృష్టించటంలో,పర్యాలోచనలో,తన శాసనాలను శాసించటంలో వివేకవంతుడు.అన్నీ తెలిసినవాడు,ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు

قُلْ أَىُّ شَىْءٍ أَكْبَرُ شَهَـٰدَةًۭ ۖ قُلِ ٱللَّهُ ۖ شَهِيدٌۢ بَيْنِى وَبَيْنَكُمْ ۚ وَأُوحِىَ إِلَىَّ هَـٰذَا ٱلْقُرْءَانُ لِأُنذِرَكُم بِهِۦ وَمَنۢ بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ ٱللَّهِ ءَالِهَةً أُخْرَىٰ ۚ قُل لَّآ أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَـٰهٌۭ وَٰحِدٌۭ وَإِنَّنِى بَرِىٓءٌۭ مِّمَّا تُشْرِكُونَ ﴿١٩﴾

ئ ى إ ఓ ప్రవక్త మిమ్మల్ని తిరస్కరించే ముష్రికులతో ఇలా అడగండి-: నా నిజాయితీపై ఏ సాక్ష్యం గొప్పది,పెద్దది?.మీరు సమాధానమిస్తూ తెలపండి: నా నిజాయితీపై అల్లా హ్ యే గొప్ప సాక్షి,పెద్ద సాక్షి.నాకు,మీకు మధ్యన ఆయనే సాక్షి.నేను మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని గురించి,మరియు మీరు దేనిని తిరస్కరిస్తా రో దాని గురించి ఆయనకు తెలుసు.నిశ్చయంగా అల్లా హ్ ఈ ఖుర్ఆన్ ను మిమ్మల్ని,ఇది మానవుల్లోంచి,జిన్నుల్లోంచి ఎవరెవరికి చేరుతుందో వారందరిని భయపెట్టటానికి వహీ ద్వారా నా వద్దకు చేరవేశాడు.ఓ ముష్రకులారా మీరు అల్లాహ్ తోపాటు వేరే ఆరాధ్య దైవాలు ఉన్నాయని విశ్వసిస్తు న్నారు.ఓ ప్రవక్త మీరు చెప్పండి మీరు దేనినైతే నమ్ముతున్నారో అది అసత్యం కావటం వలన దాని గురించి నేను సాక్ష్యం ఇవ్వను.అల్లా హ్ بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ మాత్రం ఒకే ఆరాధ్య దైవము,ఆయనతోపాటు ఎవరు సాటి లేరు.మీరు ఆయనతో సాటికల్పిస్తు న్నవాటి నుండి నేను నిర్దోషిని

ٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يَعْرِفُونَهُۥ كَمَا يَعْرِفُونَ أَبْنَآءَهُمُ ۘ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ ﴿٢٠﴾

మేము తౌరాతును ప్రసాధించిన యూదులు,మేము ఇంజీలును ప్రసాధించిన క్రైస్తవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంను పరిపూర్ణంగా గుర్తుపడుతున్నారు.ఏవిధంగానైతే వారు ఇతరుల పిల్లల మధ్య తమ పిల్లలను గుర్తుపడుతున్నారో ఆవిధంగా.వారందరు తమని నరకాగ్నిలో ప్రవేశింపజేయటం వలన తమ స్వయాన్ని నష్టం కలిగించుకున్నారు. ఇలాంటి వారు విశ్వసించరు

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِـَٔايَـٰتِهِۦٓ ۗ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ ﴿٢١﴾

అల్లాహ్ తోపాటు ఎవరినైన సాటి కల్పించి అతనిని ఆయనతోపాటు ఆరాధించేవాడు లేదా ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వాడికన్న పెద్ద దుర్మార్గుడు ఎవరూ ఉండరు.నిశ్చయంగా దుర్మార్గులు అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం,ఆయన ఆయతులను తిరస్కరించటం వలన ఒకవేళ వారు క్షమాపణ కోరకుండా ఉంటే ఎన్నటికి సాఫల్యం చెందలేరు

وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًۭا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوٓا۟ أَيْنَ شُرَكَآؤُكُمُ ٱلَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ﴿٢٢﴾

వారందరిని సమీకరించేటప్పటి ప్రళయదినాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి.మేము వారిలో ఎవరిని వదలము.ఆ తరువాత మేము అల్లా హ్ తోపాటు వేరే ఇతరులను ఆరాధించే వారితో వారిని చివాట్లు పెట్టటానికి ఇలా అంటాము.మీరు వారిని అల్లా హ్ కు భాగస్వాములని అబద్దపు వాదనలు చేసేవారో ఆ భాగస్వాములేరి?

ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّآ أَن قَالُوا۟ وَٱللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ ﴿٢٣﴾

ఈ పరీక్ష తరువాత వారికి తమ ఆరాధ్యదైవాలతో సంబంధం లేదని చెప్పటం తప్ప వేరే సాకు ఉండదు.వారు అబద్దం పలుకుతూ ఇలా అంటారు: మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకంలో నీతోపాటు సాటి కల్పించే వారము కాదు.కాని మేము నిన్ను విశ్వసించే వారము,నీ ఏకత్వమును తెలిపేవారము

ٱنظُرْ كَيْفَ كَذَبُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ ﴿٢٤﴾

ఓ ముహమ్మద్ చూడండి వీరందరు ఎలా తాము షిర్కు చేయలేదని తమపై అబద్దమును చెప్పుకుంటున్నారో,వారు తాము ఇహలోక జీవితంలో అల్లా హ్ తోపాటు సాటి కల్పించినవారి విషయంలో కల్పించుకున్నారో వారు వారి నుండి అదృశ్యమైపోయారు,వారిని నిస్సహాయులగా వదిలి వేశారు

وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِىٓ ءَاذَانِهِمْ وَقْرًۭا ۚ وَإِن يَرَوْا۟ كُلَّ ءَايَةٍۢ لَّا يُؤْمِنُوا۟ بِهَا ۚ حَتَّىٰٓ إِذَا جَآءُوكَ يُجَـٰدِلُونَكَ يَقُولُ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّآ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿٢٥﴾

ఓ ప్రవక్త మీరు ఖుర్ఆన్ ను చదువుతున్నప్పుడు ముష్రికుల్లోంచి కొందరు మిమ్మల్ని శ్రద్ధగా వింటారు. కాని వారు తాము దేనినైతే శ్రద్ధగా వింటున్నారో దాని ద్వారా లబ్ది పొందలేరు.ఎందుకంటే మేము వారి హృదయాలపై మూతలు వేశాము.చివరికి వారు తమ మొండితనము,తమ విముఖత వలన ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోలేరు.మేము వారి చెవులలో ప్రయోజనకరమైన మాటలు వినకుండా ఉండటానికి చెవుడును వేశాము.ఒకవేళ వారు స్పష్టమైన ఆధారాలు ,స్పష్టమైన వాదనలు చూస్తే వాటిని విశ్వసించరు.ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినప్పుడు అసత్యము ద్వారా సత్యం విషయంలో నీతో వాదనకు దిగుతారు.నీవు తీసుకుని వచ్చినది పూర్వికుల పుస్తకాల నుండి తీసుకొనబడినదని వారంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْـَٔوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّآ أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ ﴿٢٦﴾

వారు ప్రజలను ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి ఆపేవారు.వారు దాని నుండి దూరంగా ఉండేవారు.దాని ద్వారా ప్రయోజనం చెందేవారిని వదిలేవారు కాదు.దాని ద్వారా స్వయాన్ని ప్రయోజనం చేకూర్చుకునేవారు కాదు.వారు ఇలా చేయటం వలన తమనే నాశనం చేసుకునేవారు.వారు ఏమి చేస్తు న్నారో అందులో వారి వినాశనం ఉన్నదన్న విషయాన్ని వారు తెలసుకోలేపోతున్నారు

وَلَوْ تَرَىٰٓ إِذْ وُقِفُوا۟ عَلَى ٱلنَّارِ فَقَالُوا۟ يَـٰلَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِـَٔايَـٰتِ رَبِّنَا وَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿٢٧﴾

ఓ ప్రవక్తా ఒకవేళ మీరు ప్రళయదినాన వారిని నరకాగ్నిలో ప్రవేశపెట్టేటప్పుడు చూస్తే వారు శోకములో ఇలా అంటారు: మేము ఇహలోక జీవితం వైపు మరలించబడితే ఎంతో బాగుండేది.అప్పుడు మేము అల్లాహ్ సూచనలను తిరస్కరించే వాళ్ళము కాము.అల్లాహ్ ను విశ్వసించే వారిలోంచి అయిపోతాము.మీరు వారి ఈ దుస్ధితిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు

بَلْ بَدَا لَهُم مَّا كَانُوا۟ يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا۟ لَعَادُوا۟ لِمَا نُهُوا۟ عَنْهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ ﴿٢٨﴾

వారు ఇహలోకం వైపునకు మరలబడితే విశ్వసిస్తాము అని అన్న వారి మాటలు వాస్తవాలు కావు.ఎందుకంటే వారి మాటలను ఏవైతే వారు దాచేవారో (అల్లాహ్ సాక్షిగా మేము ముష్రికులము కాము) వారి అవయవాలు వారికి వ్యతిరేకంగా సాక్షం పలికినప్పుడు అవి బహిర్గతమైనవి.ఒకవేళ వారు ఇహలోకం వైపునకు మరలి వచ్చారే అనుకోండి వారు వారించబడిన షిర్క్,అవిశ్వాసం వైపునకే మరలుతారు.మరియు నిశ్చయంగా వారు మరలినప్పుడు విశ్వసిస్తా ము అన్న వాగ్దా నాల్లో అసత్యులు

وَقَالُوٓا۟ إِنْ هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ﴿٢٩﴾

ఈ ముష్రికులందరు అనేవారు మేము జీవిస్తు న్నఇహలోక జీవితమే అసలైన జీవితం.మేము లెక్క తీసుకోవబడటానికి లేపబడము

وَلَوْ تَرَىٰٓ إِذْ وُقِفُوا۟ عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَـٰذَا بِٱلْحَقِّ ۚ قَالُوا۟ بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا۟ ٱلْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ﴿٣٠﴾

ఓ ప్రవక్త ఒకవేళ మీరు మరణాంతర జీవితమును నిరాకరించే వారిని వారి ప్రభువు ముందట నిలబెట్టబడినప్పుడు చూస్తే ఎటువంటి సందేహము,సంశయము లేని మరణాంతర జీవితము దేని గురించినైతే మీరు తిరస్కరించేవారో అది జరగలేదా అని అల్లా హ్ వారితో ప్రశ్నించినప్పుడు వారి దుస్థితిని మీరు ఆశ్ఛర్యముతో చూస్తూ ఉండిపోతారు.వారు అంటారు: ఎరైతే మమ్మల్ని జన్మనిచ్చాడో మన ఆ ప్రభువు పై ప్రమాణం చేసి చెబుతున్నాము అది జరిగింది.అందులో ఎటువంటి సందేహం లేదు.అప్పుడు అల్లా హ్ వారితో అంటాడు: ఈ రోజును మీరు తిరస్కరించడం వలన శిక్షను అనుభవించండి.మీరు దానిని ఇహలోక జీవితంలో తిరస్కరించేవారు

قَدْ خَسِرَ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِلِقَآءِ ٱللَّهِ ۖ حَتَّىٰٓ إِذَا جَآءَتْهُمُ ٱلسَّاعَةُ بَغْتَةًۭ قَالُوا۟ يَـٰحَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَآءَ مَا يَزِرُونَ ﴿٣١﴾

ى మరణాంతర జీవితాన్ని తిరస్కరించేవారు,అల్లా హ్ ముందట నిలబడటంను దూరంగా భావించేవారు ప్రళయదినమున నష్టమును చవిచూస్తా రు.చివరికి ముందస్తు జ్ఞానం లేకుండా అకస్మాత్తు గా వారివద్ద ప్రళయం వచ్చిపడినప్పుడు వారు తీవ్ర అవమానముతో క్రుంగిపోతు ఇలా అంటారు:మేము అల్లా హ్ విషయంలో అవిశ్వాసమును చూపి,ప్రళయదినం కొరకు సిద్ధం కాకుండా ఉండి మేము అశ్రద్ధత వహించటం వలన అయ్యో మనకు భాధ కలిగినదే,మన ఆశలపై నీరు కారిపోయినదే.వారు తమ పాపముల బరువును తమ వీపులపై మోస్తూ ఉంటారు.వినండి వారు మోస్తు న్నఈ పాపముల బరువు చాలా చెడ్డదైనది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَعِبٌۭ وَلَهْوٌۭ ۖ وَلَلدَّارُ ٱلْـَٔاخِرَةُ خَيْرٌۭ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿٣٢﴾

ఇహలోక జీవితం దేని వైపునైతే మీరు వాలుతున్నారో అందులో అల్లాహ్ ను ప్రసన్నం చేసే కార్యాలు చేయని వారి కొరకు అది ఒక ఆటవిడుపు,మోసపూరితమైన సామగ్రి అవుతుంది.పరలోక వాసము అల్లా హ్ కు భయపడుతూ విశ్వాసం,విధేయత గురించి ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించేవారి కొరకు,షిర్క్,అవిధేయత నుండి దేనినైతే ఆయన వారంచాడో వాటిని వదిలివేసే వారి కొరకు ఎంతో శ్రేయస్కరమైనది.ఓ ముష్రికులారా మీరు మీరు దీనిని అర్ధం చేసుకోరా?. అయితే మీరు విశ్వసించండి,సత్కార్యాలు చేయండి

قَدْ نَعْلَمُ إِنَّهُۥ لَيَحْزُنُكَ ٱلَّذِى يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَـٰكِنَّ ٱلظَّـٰلِمِينَ بِـَٔايَـٰتِ ٱللَّهِ يَجْحَدُونَ ﴿٣٣﴾

ఓ ప్రవక్త వారు బహిర్గంగా మిమ్మల్ని తిరస్కరించటం మీకు బాధ కలిగిస్తుందని మాకు తెలుసు.మీ యొక్క నీతి,నిజాయితి వలన వారు తమ మనస్సులలో మిమ్మల్ని తిరస్కరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి.కాని వారు బహిర్గంగా మీ విషయాన్ని తిరస్కరిస్తూ తమ మనసుల్లో దాని గురించి నమ్మకంను కలిగి ఉన్న దుర్మార్గు లు

وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌۭ مِّن قَبْلِكَ فَصَبَرُوا۟ عَلَىٰ مَا كُذِّبُوا۟ وَأُوذُوا۟ حَتَّىٰٓ أَتَىٰهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَـٰتِ ٱللَّهِ ۚ وَلَقَدْ جَآءَكَ مِن نَّبَإِى۟ ٱلْمُرْسَلِينَ ﴿٣٤﴾

ఈ తిరస్కారము ప్రత్యేకించి మీరు తీసుకుని వచ్చిన గ్రంధం పట్లే అని భావించకండి.మీకన్న పూర్వ ప్రవక్తలు తిరస్కరించబడ్డారు.వారి జాతుల వారు వారిని బాధలకు గురి చేశారు.వారు దైవ మార్గంలో సందేశాలను చేరవేసేటప్పుడు,పోరాడేటప్పుడు వాటిని సహనంతో ఎదుర్కొన్నారు.కడకు అల్లాహ్ సహాయం వారికి చేరినది.అల్లా హ్ ఏదైతే సహాయాన్ని వ్రాసిపెట్టా డో,ఏ సహాయం గురించి తన ప్రవక్తలకు వాగ్దా నం చేశాడో దానిని మార్చే వాడు ఎవడూ లేడు.ఓ ప్రవక్త మీకన్న పూర్వ ప్రవక్తల సమాచారం మీ వద్దకు వచ్చినది.వారు ఏదైతే తమ జాతుల వారితో అనుభవించారో,అల్లా హ్ వారి శతృవులకు విరుద్ధంగా ఏ విధంగా సహాయం చేసి వారిని (శతృవులని) తుదిముట్టించాడో అన్నీ మీకు చేరినవి

وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ ٱسْتَطَعْتَ أَن تَبْتَغِىَ نَفَقًۭا فِى ٱلْأَرْضِ أَوْ سُلَّمًۭا فِى ٱلسَّمَآءِ فَتَأْتِيَهُم بِـَٔايَةٍۢ ۚ وَلَوْ شَآءَ ٱللَّهُ لَجَمَعَهُمْ عَلَى ٱلْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ ٱلْجَـٰهِلِينَ ﴿٣٥﴾

ى ఓ ప్రవక్త మీరు వారివద్దకు తీసుకుని వచ్చిన సత్యంను వారు తిరస్కరించటం,దాని నుండి వారి విముఖత ఏదైతే మీరు పొందుతున్నారో దాని ద్వారా మీకు బాధ కలిగితే మీకు గనక శక్తి ఉంటే భూమిలో ఏదైన సొరంగం లేదా ఆకాశంలో ఏదైన నిచ్చెనను వేసి ఏదైన వాదన,ఆధారం - దేని ద్వారా నైతే మేము మీకు సహకరించామో అది కాకుండా -తీసుకుని రండి. (అంటే వారి మార్పు కోసం మేము ప్రసాధించని మహిమ ఏదైన భూమ్యాకాశాల్లో వెతికి వారి వద్దకు తీసుకుని రండి) ఒకవేళ అల్లాహ్ వారందరిని సమీకరించదలచుకుంటే మీరు తీసుకుని వచ్చిన సన్మార్గంపై వారందరిని సమీకరించి ఉండేవాడు.కాని అల్లాహ్ గొప్ప వ్యూహం కారణం చేత అలా తలచుకోలేదు.మీరు దాని వలన అవివేకుల్లోంచి అయిపోకండి. అటువంటప్పుడు వారు విశ్వసంచలేదని మీ మనస్సు దుఃఖమునకు గురి అవుతుంది

۞ إِنَّمَا يَسْتَجِيبُ ٱلَّذِينَ يَسْمَعُونَ ۘ وَٱلْمَوْتَىٰ يَبْعَثُهُمُ ٱللَّهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ ﴿٣٦﴾

ఎవరైతే మాటను శ్రద్ధతో వింటాడో,దానిని అర్ధం చేసుకుంటాడో వాడు మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరిస్తూ మీ నుండి స్వీకరిస్తాడు.మరియు అవిశ్వాసపరులు మృతులు వారికి ఎటువంటి స్థా నం ఉండదు.వారి హృదయాలు మరణించినవి.మృతులను అల్లా హ్ ప్రళయదినాన మరల లేపుతాడు.ఆ తరువాత వారు ముందు పంపించుకున్న కర్మలకు ఆయన వారికి ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారు ఆయన ఒక్కడివైపే మరలించబడుతారు

وَقَالُوا۟ لَوْلَا نُزِّلَ عَلَيْهِ ءَايَةٌۭ مِّن رَّبِّهِۦ ۚ قُلْ إِنَّ ٱللَّهَ قَادِرٌ عَلَىٰٓ أَن يُنَزِّلَ ءَايَةًۭ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ﴿٣٧﴾

ముష్రికులు మొరట వైఖరితో,విశ్వాస విషయంలో కాలయాపన చేస్తూ ఇలా అంటారు-: ముహమ్మద్ పై ఒక అద్భుత మహిమ ఆయన తీసుకుని వచ్చిన దాని విషయంలో ఆయన నిజాయితీపై ఆయన ప్రభువు తరపు నుండి ఆధారం అవటానికి ఎందుకు అవతరింపబడలేదు.ఓ ప్రవక్త మీరు ఇలా అనండి -: అల్లా హ్ వారు కోరిన విధంగా మహిమను అవతరింపజేసే శక్తి కలవాడు.కాని మహిమ అవతరించాలని కోరిక కలిగిన చాలామంది ఈముష్రికులకు بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ మహిమ అవతరణ అల్లాహ్ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని తెలియదు. వారు కోరుతున్న దానికి అనుగుణంగా ఉండదు.ఒకవేళ ఆయన (అల్లా హ్ )దానిని అవతరింపజేస్తే ఆ తరువాత వారు విశ్వసించకపోతే అల్లా హ్ వారిని వినాశనమునకు గురిచేస్తా డు

وَمَا مِن دَآبَّةٍۢ فِى ٱلْأَرْضِ وَلَا طَـٰٓئِرٍۢ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّآ أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِى ٱلْكِتَـٰبِ مِن شَىْءٍۢ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ ﴿٣٨﴾

ربهم يحشرون భూమిపై సంచరించే అన్ని రకాల జంతువులు,ఆకాశంలో ఎగిరే అన్ని రకాల పక్షులు అన్నీ మీలాంటి సముదాయాలే.ఓ ఆదం సంతతివారా సృష్టితాల విషయంలో,ఆహారోపాది విషయంలో ప్రతీది ఏది వదలకుండా మేము లౌహె మహ్ఫూజ్ లో (సప్తా కాశాలపై ఉన్న గ్రధం.ఇందులో ణానవుల విధివ్రాతలు పొందుపరచబడి ఉన్నాయి.) పొందుపరచాము.వాటన్నింటి యొక్క జ్ఞా నం అల్లా హ్ వద్ద ఉన్నది.ఆ తరువాత ఫ్రళయదినాన వారందరు ఏకైక తమ ప్రభువు వైపున తీర్పు కొరకు సమీకరించబడుతారు.ప్రతి ఒక్కరికి వారి హక్కును ప్రసాధించటం జరుగుతుంది. م

وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا صُمٌّۭ وَبُكْمٌۭ فِى ٱلظُّلُمَـٰتِ ۗ مَن يَشَإِ ٱللَّهُ يُضْلِلْهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ ﴿٣٩﴾

మా సూచనలను తిరస్కరించేవారు వినలేని చెవిటోళ్లాంటివారు,మాట్లాడలేని మూగవాళ్లాంటివారు.మరియు దానితోపాటు వారందరు చీకట్లలో ఉంటారు,వారు చూడలేరు.అయితే ఇటువంటి స్థితి కలిగిన వాడు సన్మార్గం పొందటం ఎలా సాధ్యం?.అల్లా హ్ ప్రజల్లోంచి ఎవరిని మార్గభ్రష్టతకు లోను చేయదలచుకుంటే అతడిని మార్గభ్రష్టతకు గురి చేస్తా డు.ఎవరిని సన్మార్గం చూపదలచుకుంటే అతడిని సన్మార్గం చూపుతాడు.ఎందుకంటే ఆయన అతడిని ఎటువంటి వంకరతనం లేని ఋజుమార్గంపై నడిపిస్తా డు

قُلْ أَرَءَيْتَكُمْ إِنْ أَتَىٰكُمْ عَذَابُ ٱللَّهِ أَوْ أَتَتْكُمُ ٱلسَّاعَةُ أَغَيْرَ ٱللَّهِ تَدْعُونَ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٤٠﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: ఒక వేళ మీపై అల్లా హ్ శిక్ష వచ్చినా లేదా ఆ ప్రళయం దేని గురించైతే రాబోతుందని మీతో వాగ్దా నం చేయబడినదో అది మీ వద్దకు వస్తే అప్పుడు మీరు అల్లా హ్ ను వదిలి ఇతరులను మీపై వచ్చిన ఆపదను,కష్టమును తొలగించమని మొరపెట్టు కుంటారా ? మీరు నాకు తెలియజేయండి.ఒకవేళ మీ ఆరాధ్య దైవాలను లాభం చేస్తారని లేదా నష్టమును చేస్తారని మీరు మొరపెట్టు కోవటంలో సత్యవంతులే అయితే నాకు తెలియపరచండి

بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَآءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ ﴿٤١﴾

వాస్తవమేమిటంటే ఆ సమయంలో మీరు మిమ్మల్ని సృష్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను మీ నుండి ఆపదను తొలగించటం కొరకు ,మీ నుండి నష్టమును దూరం చేయటం కొరకు వేడుకోరు. ఆయనే దానిని చేసేవాడు,దానిని చేయుటకు శక్తిసామర్ధ్యాలు కలవాడు. మీరు అల్లా హ్ తోపాటు సాటి కల్పించే మీ ఆరాధ్య దైవాలు లాభం చేకూర్చలేరని,నష్టం చేకూర్చలేరని మీకు తెలిసిన తరువాత వారిని వదిలివేస్తా రు

وَلَقَدْ أَرْسَلْنَآ إِلَىٰٓ أُمَمٍۢ مِّن قَبْلِكَ فَأَخَذْنَـٰهُم بِٱلْبَأْسَآءِ وَٱلضَّرَّآءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ ﴿٤٢﴾

ఓ ప్రవక్తా మీకన్న పూర్వ జాతుల వారి వైపునకు ప్రవక్తలను పంపించినాము.వారు వారిని తిరస్కరించారు.వారు వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటి పట్ల విముఖత చూపారు.వారు తమ ప్రభువు యందు అణుకువభావం కలిగి ఉండటం కొరకు,ఆయనకు విధేయులై ఉండటం కొరకు మేము వారిని పేదరికం లాంటి కష్టా ల ద్వారా,వారిశరీరాలను హాని కలిగించే రోగాల్లాంటి వాటి ద్వారా శిక్షించాము

فَلَوْلَآ إِذْ جَآءَهُم بَأْسُنَا تَضَرَّعُوا۟ وَلَـٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٤٣﴾

ఒక వేళ మా ఆపద వారి వద్దకు వచ్చినప్పుడు వారి నుండి అల్లా హ్ ఆపదను తొలగించటం కొరకు వారు అల్లా హ్ కు విధేయత చూపితే,ఆయన యందు అణుకువతో మెలిగితే మేము వారిపై కనికరించే వాళ్ళము.కాని వారు అలా చేయలేదు.వాస్తవానికి వారి హృదయాలు కఠినంగా మారిపోయినవి.వారు గుణపాఠం నేర్చుకోలేదు.హితోపదేశంను గ్రహించలేదు.వారు పాల్పడే అవిశ్వాస కార్యాలను,అవిధేయత కార్యాలను షైతాను వారికొరకు అందంగా చేసి చూపించాడు.అయితే వారు తాము ఉన్నదానిపై కొనసాగిపోయారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَلَمَّا نَسُوا۟ مَا ذُكِّرُوا۟ بِهِۦ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَٰبَ كُلِّ شَىْءٍ حَتَّىٰٓ إِذَا فَرِحُوا۟ بِمَآ أُوتُوٓا۟ أَخَذْنَـٰهُم بَغْتَةًۭ فَإِذَا هُم مُّبْلِسُونَ ﴿٤٤﴾

పేదరికం,అనారోగ్యంల తీవ్రత వలన వారు ఎప్పుడైతే వారికి హితోపదేశం ఇవ్వబడిన వాటిని వదిలివేశారో,అల్లాహ్ ఆదేశాలను పాటించలేదో వారిపై మేము ఆహారపు ద్వారములను తెరచి పేదరికం తరువాత వారిని ధనికులను చేసి అనారోగ్యము తరువాత వారి శరీరములను సరిదిద్ది (ఆరోగ్యం ప్రసాధించి) వారిని ప్రలోభపెట్టాము.చివరికి వారికి ప్రసాధించబడిన అనుగ్రహాల పట్ల వారు కృతఘ్నతా వైఖరి కలిగినప్పుడు,వారికి అహంభావం కలిగినప్పుడు వారిపై మా శిక్ష వచ్చిపడినది.అప్పుడు వారు కలవరపడ్డా రు,తాము ఆశించిన వాటి నుండి నిరాశ్యులయ్యారు

فَقُطِعَ دَابِرُ ٱلْقَوْمِ ٱلَّذِينَ ظَلَمُوا۟ ۚ وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٤٥﴾

సత్యతిరస్కారులందరిని వినాశనమునకు గురి చేయటం ద్వారా, అల్లా హ్ యొక్క ప్రవక్తలకు సహాయం చేయటం ద్వారా సత్యతిరస్కారులందరిని కూకటి వ్రేళ్ళతో అంతమొందించటం జరిగింది.అల్లాహ్ శతృవులను అంతమొందించటంపై,అల్లాహ్ స్నేహితులకు సహాయం చేయటం పై కృతజ్ఞతలు,పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన ఏకైక అల్లా హ్ కొరకే

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَخَذَ ٱللَّهُ سَمْعَكُمْ وَأَبْصَـٰرَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِهِ ۗ ٱنظُرْ كَيْفَ نُصَرِّفُ ٱلْـَٔايَـٰتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ ﴿٤٦﴾

ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: ఒక వేళ అల్లా హ్ మీ వినే శక్తిని తీసుకుని మిమ్మల్ని చెవిటివారిగా,మీ చూపుని తీసుకుని మిమ్మల్ని గ్రుడ్డి వారిగా చేసి మీ యొక్క హృదయములపై సీలు వేస్తే మీరు వాటిని కోల్పోయిన తరువాత మీ వద్దకు వాటిని తీసుకుని వచ్చే సత్య ఆరాధ్యదైవం ఎవరో నాకు చెప్పండి.ఓ ప్రవక్త మేము వారి కొరకు వాదనలను ఎలా వివరించామో,రకరకాల ఆధారాలను ఎలా చూపామో,ఆ తరువాత వారు వాటి పట్ల ఏ విదంగా విముఖత చూపారో చూడండి

قُلْ أَرَءَيْتَكُمْ إِنْ أَتَىٰكُمْ عَذَابُ ٱللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا ٱلْقَوْمُ ٱلظَّـٰلِمُونَ ﴿٤٧﴾

ఓ ప్రవక్తా వారితో ఇలా అనండి: అల్లా హ్ యొక్క శిక్ష మీకు తెలియకుండా హటాత్తు గా మీ వద్దకు వస్తే లేదా మీ వద్దకు బహిరంగంగా,ప్రత్యక్షంగా వస్తే (మీరు ఏం చేయగలుగుతారో) నాకు తెలియజేయండి.ఎందుకంటే దుర్మార్గు లే అల్లా హ్ పై తమ అవిశ్వాసం వలన,ఆయన ప్రవక్తలను తిరస్కరించటం వలన వారు ఇటువంటి శిక్ష తో శిక్షింపబడుతారు

وَمَا نُرْسِلُ ٱلْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ ءَامَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٤٨﴾

మేము ప్రవక్తలను పంపించినది విశ్వాసపరులకి,విధేయత చూపేవారికి వారి కొరకు ఏర్పాటు చేసిన అంతం కాని,సమాప్తమవని శాస్వతమైన అనుగ్రహాల గురించి సందేశమివ్వటం కొరకు,అవిశ్వాసపరులని,అవిధేయతపరులని మన కఠినమైన శిక్ష నుండి భయపెట్టటానికి మాత్రమే.ఎవరైతే ప్రవక్తలపై విశ్వాసమును చూపుతారో,తమ కార్యాలను సరిదిద్దు కుంటారో తమ అంతిమ దినమున ఏదైతే వారు ఎదుర్కొంటారో దాని గురించి వారికి ఎటువంటి భయముండదు,ఇహలోక తమ భాగములను ఏవైతే వారు కోల్పోయారో వాటి గురించి వారికి ఎటువంటి దుఃఖముగాని చింతనగాని ఉండదు

وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا يَمَسُّهُمُ ٱلْعَذَابُ بِمَا كَانُوا۟ يَفْسُقُونَ ﴿٤٩﴾

మా సూచనలను ఎవరైతే తిరస్కరిస్తా రో వారు అల్లా హ్ విధేయతనుండి వైదొలగిపోవటం వలన వారికి శిక్ష వచ్చి చేరుతుంది

قُل لَّآ أَقُولُ لَكُمْ عِندِى خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعْلَمُ ٱلْغَيْبَ وَلَآ أَقُولُ لَكُمْ إِنِّى مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَىَّ ۚ قُلْ هَلْ يَسْتَوِى ٱلْأَعْمَىٰ وَٱلْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ ﴿٥٠﴾

ى ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: నావద్ద అల్లాహ్ యొక్క ఆహారపు ఖజానాలు ఉన్నాయని వాటిలో నేను కోరుకున్న వాటిని వినియోగిస్తా నని మీతో చెప్పటం లేదు,అల్లా హ్ నాకు దైవవాణి ద్వారా తెలియపరచనివి కాకుండా అగోచర విషయాల గురించి నాకు జ్ఞా నం ఉన్నదని بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ చెప్పటం లేదు,నేను దైవదూతల్లోంచి ఒక దూత అని మీతో చెప్పటం లేదు.కాని నేను అల్లా హ్ తరపు నుండి పంపించబడ్డ ఒక ప్రవక్తను.నాకు దైవవాణి ద్వారా తెలియపరచబడిన వాటిని మాత్రమే అనుసరిస్తాను.నేను నాతో జరగని దాని గురించి దావా చేయను.ఓ ప్రవక్తా వారితో తెలియపరచండి: సత్యాన్ని చూడటం నుండి అంధుడైన అవిశ్వాసపరుడు,సత్యాన్ని చూసి దానిని విశ్వసించిన విశ్వాసపరుడు ఇద్దరూ సమానులవుతారా?.ఓ ముష్రికులారా మీరు మీ బుద్దితో మీ చుట్టూى ఉన్న సూచనల్లో యోచన చేయరా

وَأَنذِرْ بِهِ ٱلَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوٓا۟ إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِۦ وَلِىٌّۭ وَلَا شَفِيعٌۭ لَّعَلَّهُمْ يَتَّقُونَ ﴿٥١﴾

ఓ ప్రవక్తా ప్రళయదినాన తమ ప్రభువు యందు సమీకరించబడుతారని భయపడే వారిని ఈ ఖుర్ఆన్ ద్వారా భయపెట్టండి.వారి కొరకు అల్లా హ్ కాకుండా లాభమును తీసుకుని వచ్చే సంరక్షకుడెవడూ లేడు,వారి నుండి నష్టమును తొలగించటానికి సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు.తద్వారా వారు అల్లా హ్ ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లా హ్ భయభీతి కలిగి ఉంటారు.వీరేఖుర్ఆన్ ధ్వారా ప్రయోజనం చెందుతారు

وَلَا تَطْرُدِ ٱلَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِٱلْغَدَوٰةِ وَٱلْعَشِىِّ يُرِيدُونَ وَجْهَهُۥ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَىْءٍۢ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَىْءٍۢ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ ٱلظَّـٰلِمِينَ ﴿٥٢﴾

ఓ ప్రవక్తా ఉదయము,సాయంత్రము అల్లాహ్ కొరకు ఫ్రత్యేకిస్తూ శాస్వత ఆరాధనలో ఉండే నిరుపేద ముస్లిములను మీ సమావేశము నుండి దూరం చేయకండి.ముష్రికుల్లోంచి గొప్పవారిని చేరదీయటానికి వారిని దూరం చేయకండి.ఈ పేదవారందరి లెక్క ఏది మీపై లేదు.వారందరి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది.వారిపై మీ లెక్క ఏదీ లేదు.ఒకవేళ మీరు వారందరిని మీ సమావేశాల నుండి దూరం చేస్తే మీరు అల్లా హ్ హద్దు ల నుండి మితిమీరిన వారైపోతారు

وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍۢ لِّيَقُولُوٓا۟ أَهَـٰٓؤُلَآءِ مَنَّ ٱللَّهُ عَلَيْهِم مِّنۢ بَيْنِنَآ ۗ أَلَيْسَ ٱللَّهُ بِأَعْلَمَ بِٱلشَّـٰكِرِينَ ﴿٥٣﴾

మరియు ఇలాగే మేము వారిలో కొందరిని కొందరి ద్వారా పరీక్షించాము.మేము వారి ప్రాపంచిక భాగాల్లో అసమానంగా (హెచ్చుతగ్గు లుగా) చేశాము.ఈ విధంగా మేము వారిని పరీక్షించాము.ధనికులైన అవిశ్వాసపరులు పేదవారైన విస్వాసపరులను చూసి అల్లాహ్ మనలో నుండి వీరికే సన్మార్గమును అనుగ్రహించాడా?!.ఒక వేళ విశ్వాసము మేలైనది అయి ఉంటే మనకన్న ముందు వారు దానిని పొందేవారు కాదు.మేము ముందు ఉండేవాళ్లము అని అంటారు.అల్లా హ్ తన అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకునే వారిని వారికి విశ్వాసము యొక్క సౌభాగ్యం కలిగించటానికి గుర్తించలేడా? మరియు తన అనుగ్రహాలపట్ల కృతజ్ఞతలు తెలపని వారిని వారికి విశ్వాసము నుండి దూరంచేసి నిరాశయులు చేయటం కొరకు గుర్తించలేడా?.ఎందుకు కాదు నిశ్చయంగా అల్లా హ్ వారిగురించి చాలాబాగా తెలిసినవాడు

وَإِذَا جَآءَكَ ٱلَّذِينَ يُؤْمِنُونَ بِـَٔايَـٰتِنَا فَقُلْ سَلَـٰمٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ ٱلرَّحْمَةَ ۖ أَنَّهُۥ مَنْ عَمِلَ مِنكُمْ سُوٓءًۢا بِجَهَـٰلَةٍۢ ثُمَّ تَابَ مِنۢ بَعْدِهِۦ وَأَصْلَحَ فَأَنَّهُۥ غَفُورٌۭ رَّحِيمٌۭ ﴿٥٤﴾

بجهلةثم تاب من بعده وأصلح فأنه غفور رحيم ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చినది సత్యం కావటంపై సాక్షమిచ్చే మా సూచనలపై విశ్వాసం కలిగినవారు మీ వద్దకు వచ్చినప్పుడు వారిని గౌరవంగా మీరు సలాం చేయండి.అల్లాహ్ యొక్క సువిశాల కారుణ్యం గురించి వారికి శుభవార్తనివ్వండి.అల్లాహ్ దయ చూపటంను కరుణాకరమైన విధిగా విధిగావించుకున్నాడు.మీలోనుంచి ఎవరైన అవివేకంగా,అజ్ఞానంగా పాపమునకు పాల్పడి ఆ తరువాత పశ్చాత్తాపం చెందితే,తన కార్యమును సరిదిద్దుకుంటే నిశ్చయంగా అల్లాహ్ అతను చేసిన పాపమును క్షమించివేస్తాడు.అల్లాహ్ తన దాశుల్లోంచి మన్నింపుని కోరేవారిని క్షమించేవాడు,వారిపై కనికరించేవాడు

وَكَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ ٱلْمُجْرِمِينَ ﴿٥٥﴾

అపరాదుల మార్గము,వారి పద్దతి విదితమయ్యేందుకు,దాని నుండి జాగ్రత్తపడటం కొరకు,దూరంగా ఉండటం కొరకు ప్రస్తా వించబడిన వాటిని మేము మీకు విడమరచి తెలిపినట్లే మేము మాఆధారాలను,వాదనలను అసత్యపరుల ముందు విడమరచి తెలుపుతాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قُلْ إِنِّى نُهِيتُ أَنْ أَعْبُدَ ٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ ۚ قُل لَّآ أَتَّبِعُ أَهْوَآءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًۭا وَمَآ أَنَا۠ مِنَ ٱلْمُهْتَدِينَ ﴿٥٦﴾

ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి: నిశ్చయంగా మీరు అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటి ఆరాధన చేయటం నుండి అల్లాహ్ నన్ను వారించాడు.ఓ ప్రవక్తా మీరు తెలియపరచండి: అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన విషయంలో నేను మీ కోరికలను అనుసరించను.ఒకవేళ ఆ విషయంలో మీ కోరికలను అనుసరిస్తే నేను సత్యమార్గము నుండి తప్పిపోతాను.దాని వైపున మార్గమును పొందలేను.అల్లాహ్ నిదర్శనమును వదిలి కోరికలను అనుసరించే ప్రతి ఒక్కరిపరిస్థితి ఇది

قُلْ إِنِّى عَلَىٰ بَيِّنَةٍۢ مِّن رَّبِّى وَكَذَّبْتُم بِهِۦ ۚ مَا عِندِى مَا تَسْتَعْجِلُونَ بِهِۦٓ ۚ إِنِ ٱلْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ ٱلْحَقَّ ۖ وَهُوَ خَيْرُ ٱلْفَـٰصِلِينَ ﴿٥٧﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: నిశ్చయంగా నేను ఎటువంటి మనోవాంచనకు లోను కాకుండా నా ప్రభువు తరపునుంచి స్పష్టమైన ఆధారంపై ఉన్నాను.మీరు ఆ ఆధారాన్నే తిరస్కరించారు.ఏ శిక్ష గురించైతే మీరు తొందరపడుతున్నారో అదీ,మీరు కోరే అద్భుత సూచన నా వద్ద లేవు.అవి అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నవి.సంక్షిప్తముగా చెప్పేదేమిటంటే మీరు కోరతున్న న్యాయాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే ఉన్నది.ఆయన సత్యాన్ని తెలియపరుస్తా డు,దానిపరంగా తీర్పునిస్తా డు.అసత్యం పలికే వాడిని సత్యం పలికే వాడిని వేరు చేసిన వాడు అతడు పరిశుద్ధు డు,ఉత్తముడు

قُل لَّوْ أَنَّ عِندِى مَا تَسْتَعْجِلُونَ بِهِۦ لَقُضِىَ ٱلْأَمْرُ بَيْنِى وَبَيْنَكُمْ ۗ وَٱللَّهُ أَعْلَمُ بِٱلظَّـٰلِمِينَ ﴿٥٨﴾

ఓ ప్రవక్తా వారితో ఇలా అనండి: మీరు ఏ శిక్ష గురించైతే తొందర చేస్తు న్నారో అది ఒకవేళ నా వద్ద,నాఆదీనంలో ఉంటే నేను దానిని మీపై కురిపించే వాడిని,అప్పుడే మీకు,నాకు మధ్య వ్వవహారం తేలిపోతుంది.దుర్మార్గు ల గురించి వారికి ఎంత వ్యవధి ఇవ్వాలో,వారిని ఎప్పుడు శిక్షించాలో అల్లా హ్ కు బాగా తెలుసు

۞ وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍۢ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍۢ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍۢ مُّبِينٍۢ ﴿٥٩﴾

ఒక్కడైన అల్లాహ్ వద్ద అగోచరాల నిధులు ఉన్నవి. వాటి గురించి అల్లాహ్ కు తప్ప ఇతరులకు తెలియదు. భూమిలో ఉన్న సృష్టితాలైన జంతువుల్లోంచి,మొక్కల్లోంచి,స్థిరరాసుల్లోంచి ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. సముద్రంలో ఉన్న జంతువుల గురించి మొక్కల గురించి ఆయనకు తెలుసు. భూమిలో పాతిపెట్టబడినمప్రతీ గింజ అది పచ్చిదైన,ఎండినదైన ఒక స్పష్టమైన గ్రంధంలో నమోదై ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ గ్రంధం

وَهُوَ ٱلَّذِى يَتَوَفَّىٰكُم بِٱلَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُم بِٱلنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰٓ أَجَلٌۭ مُّسَمًّۭى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٦٠﴾

ينبئكم بما كنتمتعملون మరియు అల్లా హ్ నిద్ర సమయంలో మీ ఆత్మలను తాత్కాలికంగా తీసుకుంటాడు.మరియు అతడే మీరు పగటిపూట మీ కార్యకలాపాల వేళ మీరు చేసిన కార్యాలను తెలుసుకుంటాడు.మరల మీరు నిద్రించటానికి ఆత్మలు తీసుకున్న తరువాత మీరు మీ కార్యాలను నిర్వర్తించటం కొరకు పగలు ఆయన మిమ్మల్ని మేల్కొలుపుతాడు.చివరికి అల్లాహ్ వద్ద మీ యొక్క నిర్ధారిత జీవిత సమయాలు ముగిసిపోతాయి.ఆయన ఒక్కడి వైపునకే మీ యొక్క మరలటం ప్రళయదినాన మరణాంతరం లేపబడటం ద్వారా జరుగుతుంది.ఆ తరువాత మీరు ఇహలోక జీవితంలో చేసుకున్న కర్మల గురించి ఆయన మీకు తెలియపరుస్తా డు.దానిపరంగా ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తా డు

وَهُوَ ٱلْقَاهِرُ فَوْقَ عِبَادِهِۦ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ ﴿٦١﴾

మరియు అల్లాహ్ తన దాసులపై ఆదిపత్యం చలాయించే వాడును,వారిని ఆదీనంలో చేసుకునేవాడును.అన్ని విధాలుగా వారిపై ఆదిపత్యాన్ని చలాయించేవాడు.ప్రతీది ఆయనకు విధేయత చూపుతుంది.ఆయనకు తన దాసులపై ఏవిధంగా ఆదిపత్యం ఉండటం వర్తిస్తుందో ఆ విధమైన ఆదిపత్యం بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ఉన్నది. ఓ మానవులారా ఆయన మీపై గౌరవోన్నతులైన దూతలను మీ ఆచరణలను షుమారు చేయటానికి,లెక్కవేయటానికి పంపిస్తా డు.చివరికి మీలో ఎవరిదైన ఆయుషు ముగిస్తుంది.మరణదూత,ఆయన సహాయకులు అతని ఆత్మను స్వాధీనపరచుకుంటారు.వారు తమకు ఇవ్వబడిన ఆదేశంలో ఎటువంటి నిర్లక్షం వహించరు

ثُمَّ رُدُّوٓا۟ إِلَى ٱللَّهِ مَوْلَىٰهُمُ ٱلْحَقِّ ۚ أَلَا لَهُ ٱلْحُكْمُ وَهُوَ أَسْرَعُ ٱلْحَـٰسِبِينَ ﴿٦٢﴾

ఆ తరువాత ఆత్మలు స్వాధీనపరచబడిన వారందరు వారి వాస్తవ యజమాని అయిన అల్లా హ్ వైపునకు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాధించటం కొరకు మరలించబడుతారు.వారి విషయంలో ఆయన కొరకు సమర్ధవంతమైన న్యాయ వ్యవస్థ,న్యాయపూరితమైన నిర్ణయం ఉన్నది.ఆయనే శీఘ్రముగా మీ లెక్క తీసుకుంటాడు.మరియు మీ కర్మలను షుమారు చేస్తా డు

قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَـٰتِ ٱلْبَرِّ وَٱلْبَحْرِ تَدْعُونَهُۥ تَضَرُّعًۭا وَخُفْيَةًۭ لَّئِنْ أَنجَىٰنَا مِنْ هَـٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّـٰكِرِينَ ﴿٦٣﴾

ఓ ప్రవక్త ఈ ముష్రికులందరితో తెలియపరచండి: భూమిలోని,సముద్రములోని చీకట్లలో మీపై వచ్చిపడే వినాశముల నుండి మిమ్మల్ని పరిరక్షించే వాడు,విముక్తిని కలిగించేవాడు ఎవడు?.ఏ ఒక్కడినైతే మీరు కడు ధీనంగా,వినయంగా బహిర్గంగా,లోలోపల ఇలా వేడుకుంటున్నారు: మా ప్రభువు ఈ వినాశనములనుండి ఒక వేళ మమ్మల్ని రక్షిస్తే మేము వేరేవారిని కాకుండా ఆయననే ఆరాధించి ఆయన మాపై ప్రసాధించిన అనుగ్రహాలకు తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకుంటాము

قُلِ ٱللَّهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍۢ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ ﴿٦٤﴾

ఓ ప్రవక్తా వారితో ఇలా తెలపండి: వాటినుండి మిమ్మల్ని రక్షించేవాడు ఆయనే అల్లాహ్.మరియు మిమ్మల్ని అన్నిరకాల విపత్తుల నుండి విముక్తి కలిగించేవాడు ఆయనే.అయినా మీరు దాని తరువాత మేలిమి స్థితిలో ఆయనతోపాటు వేరేవారిని సాటి కల్పిస్తు న్నారు.మీరు చేస్తు న్నఈ కార్యం కన్న పెద్ద దుర్మార్గం ఏదైనా ఉన్నదా?!

قُلْ هُوَ ٱلْقَادِرُ عَلَىٰٓ أَن يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًۭا مِّن فَوْقِكُمْ أَوْ مِن تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًۭا وَيُذِيقَ بَعْضَكُم بَأْسَ بَعْضٍ ۗ ٱنظُرْ كَيْفَ نُصَرِّفُ ٱلْـَٔايَـٰتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ ﴿٦٥﴾

ఓ ప్రవక్తా వారితో అనండి: అల్లాహ్ మీపై శిక్షను పంపించే సామర్ధ్యము కలవాడు.ఆ శిక్ష మీపైనుండి రాళ్ళ రూపంలో,ఉరుముల రూపంలో,తుఫాను రూపంలో మీపై వస్తుంది లేదా భూకంపాల రూపంలో,భూస్థాపితం రూపంలో మీ క్రింది నుండి వస్తుంది లేదా మీ మధ్య ఆయన వ్యతిరేకతలు కలుగజేస్తా డు.ఆ తరువాత మీలో ప్రతి ఒక్కరు తమ మనోవాంచనలను అనుసరిస్తా రు.మీలోని కొందరు కొందరితో తగాదాలు పడుతారు.ఓ ప్రవక్తా మీరు ధీర్గంగా ఆలోచించండి మేము ఏ విధంగా వారి కొరకు రకరకాల ఆధారాలను,ఋజువులను తెలియపరుస్తున్నామో,వాటిని విడమరచి తెలియపరుస్తు న్నామో బహుశా వారు మీరు తీసుకుని వచ్చినది సత్యమని ,వారి వద్ద ఉన్నది అసత్యమని అర్ధం చేసుకుంటారు

وَكَذَّبَ بِهِۦ قَوْمُكَ وَهُوَ ٱلْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍۢ ﴿٦٦﴾

మీ జాతివారు ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించారు.వాస్తవానికి ఆ సత్యము అల్లా హ్ తరుపు నుండి కావటంలో ఎటువంటి సందేహం లేదు.ఓ ప్రవక్తా వారితో తెలపండి నేను మీ పర్యవేక్షణ బాధ్యత తీసుకోలేదు.నేను మీ కొరకు నాرముందు రాబోతున్న కఠినమైన శిక్ష నుండి హెచ్చరించే వాడిని మాత్రమే

لِّكُلِّ نَبَإٍۢ مُّسْتَقَرٌّۭ ۚ وَسَوْفَ تَعْلَمُونَ ﴿٦٧﴾

ప్రతి వార్త స్థిరపడటానికి ఒక సమయం ఉన్నది.ఒక ముగింపు ఉన్నది దాని వైపు అది అంతం అవుతుంది.దాని నుండే మీ ముగింపు,అంతము యొక్క వార్త ఉన్నది.తొందరలోనే ప్రళయదినాన మీరు లేపబడినప్పుడు దానిని తెలుసుకుంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذَا رَأَيْتَ ٱلَّذِينَ يَخُوضُونَ فِىٓ ءَايَـٰتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا۟ فِى حَدِيثٍ غَيْرِهِۦ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ ٱلشَّيْطَـٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ ٱلذِّكْرَىٰ مَعَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٦٨﴾

ى ఓ ప్రవక్తా మీరు ముష్రికులను మా సూచనల (ఆయతుల) విషయంలో హేళన చేస్తూ ,ఎగతాళి చేస్తూ మాట్లా డుతున్నప్పుడు చూస్తే వారు మా సూచనల విషయంలో హేళన,ఎగతాళి లేకుండా వేరే మాటలు మాట్లాడనంతవరకు వారినుండి దూరంగా ఉండండి.షైతాను మిమ్మల్ని మరపింపజేసినప్పుడు వారితోపాటు మీరు కూర్చుంటే ఆతరువాత మీకు గుర్తు వస్తే వారు కూర్చున్న ప్రదేశమును వదిలివేయండి.హద్దు మీరే వీరందరితోపాటు మీరు కూర్చోకండి

وَمَا عَلَى ٱلَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَىْءٍۢ وَلَـٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ ﴿٦٩﴾

అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ,అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారిపై ఈ దుర్మార్గులందరి లెక్కల బాధ్యత ఏదీ లేదు.వారు చేస్తున్న చెడుల నుండి వారించటం మాత్రమే వారిపై బాధ్యత.బహుశా వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతారేమో

وَذَرِ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ دِينَهُمْ لَعِبًۭا وَلَهْوًۭا وَغَرَّتْهُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِۦٓ أَن تُبْسَلَ نَفْسٌۢ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ وَلِىٌّۭ وَلَا شَفِيعٌۭ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍۢ لَّا يُؤْخَذْ مِنْهَآ ۗ أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ أُبْسِلُوا۟ بِمَا كَسَبُوا۟ ۖ لَهُمْ شَرَابٌۭ مِّنْ حَمِيمٍۢ وَعَذَابٌ أَلِيمٌۢ بِمَا كَانُوا۟ يَكْفُرُونَ ﴿٧٠﴾

إ حميم وعذاب أليمبما كانوايكفرون ఓ ప్రవక్తా తమ ధర్మమును ఆటగా,వినోదంగా చేసుకుని దానిని పరిహాసంగా,హేళనగా చేసుకున్న ఈ ముష్రికులందరిని వదిలివేయండి. వారిని ప్రాపంచిక జీవితం తనలో ఉన్న అశాస్వత సామగ్రి ద్వారా మోసపుచ్చింది. ఓప్రవక్తా ప్రజల్లో ని ప్రతి వ్యక్తిని తన పాపాల ద్వారా వినాశనము బారిన పడనంత వరకు ఖుర్ఆన్ ద్వారా హితోపదేశం చేస్తూ ఉండండి. అతని కొరకు అల్లా హ్ తప్ప సహాయం అర్ధించటం కొరకు వేరే ఎవరు సంరక్షకుడు లేడు. ప్రళయదినాన అల్లా హ్ శిక్షను అతని నుండి ఆపేవాడు మధ్యవర్తి ఎవడూ ఉండడు. అతడు అల్లా హ్ శిక్షకు బదులుగా ఏదైన పరిహారము ఇచ్చినప్పుడు అతని నుండి స్వీకరించబడదు. వారందరు తాము చేసుకున్న పాపాలవలన వినాశనమునకు గురి అయ్యారు. వారి కొరకు అవిశ్వాసం వలన ప్రళయదినమున త్రా గటానికి అత్యంత వేడిదైన నీరు,బాధాకరమైన శిక్ష ఉంటాయి

قُلْ أَنَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰٓ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَىٰنَا ٱللَّهُ كَٱلَّذِى ٱسْتَهْوَتْهُ ٱلشَّيَـٰطِينُ فِى ٱلْأَرْضِ حَيْرَانَ لَهُۥٓ أَصْحَـٰبٌۭ يَدْعُونَهُۥٓ إِلَى ٱلْهُدَى ٱئْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى ٱللَّهِ هُوَ ٱلْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿٧١﴾

ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా అనండి: ఏ మేము అల్లాహ్ ను వదిలి మమ్మల్ని ఎటువంటి లాభం చేకూర్చలేని,మనకు ఎటువంటి నష్టం కలిగించలేని విగ్రహాలను ఆరాధించాలా?,అల్లా హ్ మనకు విశ్వాసము యొక్క సౌభాగ్యం కలిగించిన తరువాత దాని నుండి మేము వెను తిరిగిపోవాల ?.అలాంటప్పుడు మేము షైతానులు మార్గభ్రష్టులు చేసిన వారి మాదిరిగా అయిపోతాము.వారు అతడిని సన్మార్గం పొందక దిక్కులు చూస్తూ ఉండిపోయేలా వదిలి వేస్తా రు.అతని కొరకు సహవాసులు సన్మార్గంపై ఉండి అతనిని సత్యం వైపునకు పిలుస్తూ ఉంటారు.అతడు వారు దేనివైపునైతే పిలుస్తున్నారో దానిని స్వీకరించటం నుండి ఆగిపోతాడు.ఓ ప్రవక్తా వారితో అనండి నిశ్చయంగా అల్లాహ్ మార్గమే సత్య మర్గము.మరియు అల్లాహ్ మమ్మల్ని ఆయన ఏకత్వమును తెలుపుతూ,ఆయన ఒక్కడి ఆరాధన చేస్తూ విధేయత చూపమని ఆదేశించాడు.సర్వలోకాల ప్రభువుఆయనే

وَأَنْ أَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَٱتَّقُوهُ ۚ وَهُوَ ٱلَّذِىٓ إِلَيْهِ تُحْشَرُونَ ﴿٧٢﴾

మరియు ఆయన మమ్మల్ని నమాజును సంపూర్ణంగా నెలకొల్పమని ఆదేశించాడు,మరియు ఆయన మమ్మల్ని అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉండటం గురించి ఆదేశించాడు.ఆయన ఒక్కడి వైపే ప్రళయదినాన దాసులు తమ ఆచరణల ప్రతిఫలం పొందటం కొరకు సమీకరించబడుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ ٱلْحَقُّ ۚ وَلَهُ ٱلْمُلْكُ يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ ۚ عَـٰلِمُ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ ۚ وَهُوَ ٱلْحَكِيمُ ٱلْخَبِيرُ ﴿٧٣﴾

మరియు ఆయన సుబ్,హానహు తఆలా భూమ్యాకాశాలను సత్యబద్దంగా సృష్టించాడు.ఆ రోజు అల్లా హ్ ప్రతి వస్తు వుతో ఇలా అంటాడు: నీవు అయిపో అయితే అది అయిపోతుంది.ప్రళయదినాన ఆయన మీరు నిలబడండి అని అంటాడు అయితే వారందరు నిలబడుతారు.సత్య బద్దమైన ఆయన మాట తప్పకుండా ఏర్పడుతుంది.ప్రళయదినాన ఇస్రా ఫీల్ అలైహిస్సలాం రెండోవసారి బాకా (సూర్) ఊదేటప్పుడు అధికారము ఆయన సుబ్,హానహు ,వతఆలా ఒక్కడి కొరకే ఉంటుంది.అగోచర విషయాల గురించి జ్ఞానం కలవాడు,గోచర విషయాల గురించి జ్ఞానం కలవాడు.తన సృష్టించటంలో,తన నిర్వహణలో ఆయనే వివేకవంతుడు.సర్వము తెలిసినవాడు ఆయనపై ఏ విషయం గోప్యంగా ఉండదు,అంతర్గత విషయాలు ఆయన వద్ద బహిర్గత విషయాల్లాంటివి

۞ وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ ءَازَرَ أَتَتَّخِذُ أَصْنَامًا ءَالِهَةً ۖ إِنِّىٓ أَرَىٰكَ وَقَوْمَكَ فِى ضَلَـٰلٍۢ مُّبِينٍۢ ﴿٧٤﴾

ఓ ప్రవక్తా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ముష్రిక్ తండ్రి అయిన ఆజర్ తో మాట్లా డిన వేళను గుర్తు చేసుకోండి: "ఓ నా ప్రియ తండ్రి మీరు అల్లా హ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తూ వాటిని ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారా?.నిశ్చయంగా నేను మిమ్మల్ని,విగ్రహాలను ఆరాధిస్తు న్నమీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత (అపమార్గం) లోను,మీరు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధించటం వలన సత్య మార్గము నుండి తికమక అయ్యి తప్పిపోయారని భావిస్తు న్నాను.పరిశుద్ధు డు అయిన ఆయనే సత్య ఆరాధ్య దైవము,ఆయన కాకుండ ఇతరులు అసత్య దైవాలు"

وَكَذَٰلِكَ نُرِىٓ إِبْرَٰهِيمَ مَلَكُوتَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَلِيَكُونَ مِنَ ٱلْمُوقِنِينَ ﴿٧٥﴾

మరియు మేము ఆయనకు ఆయన తండ్రి,ఆయన జాతి వారి మార్గ భ్రష్టతను చూపించామో అలాగే మేము ఆయనకు విశాలమైన భూమ్యాకాశాల అధికారమును చూపిస్తాము.ఆ విశాల అధికారము ద్వారా అల్లా హ్ ఏకత్వము,ఆరాధనకు ఆయన ఒక్కడే అర్హుడు అనడానికి ఆధారము చేసుకొనుట కొరకు, అల్లా హ్ ఒక్కడే ఆయనకు ఎవరు సాటి లేరు,ఆయన ప్రతీ దానిపై అధికారము కలవాడు అన్న నమ్మకమును కలిగిన వారిలోంచి ఆయన కావటం కొరకు (భూమ్యాకాశముల అధికారమును చూపిస్తా ము)

فَلَمَّا جَنَّ عَلَيْهِ ٱلَّيْلُ رَءَا كَوْكَبًۭا ۖ قَالَ هَـٰذَا رَبِّى ۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَآ أُحِبُّ ٱلْـَٔافِلِينَ ﴿٧٦﴾

రాత్రి చీకటి అయినప్పుడు ఆయన ఒక నక్షత్రాన్ని చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే నక్షత్రము అదృశ్యం అయినదో అదృశ్యం అయ్యే వాటిని నేను ఇష్టపడను. ఎందుకంటే వాస్తవ ఆరాధ్య దైవం ప్రత్యక్షం అయి ఉంటాడు అదృశ్యం అవ్వడు అని ఆయన అన్నారు

فَلَمَّا رَءَا ٱلْقَمَرَ بَازِغًۭا قَالَ هَـٰذَا رَبِّى ۖ فَلَمَّآ أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِى رَبِّى لَأَكُونَنَّ مِنَ ٱلْقَوْمِ ٱلضَّآلِّينَ ﴿٧٧﴾

మరియు ఆయన చంద్రుడిని ఉదయించినప్పుడు చూసి ఇది నా ప్రభువు అన్నారు.ఎప్పుడైతే అది అదృశ్యం అయినదో ఇలా అన్నారు: ఒక వేళ అల్లా హ్ ఆయన ఏకత్వము,ఆయన ఒక్కడి ఆరాధన చేయటం కొరకు నాకు అనుగ్రహాన్ని ప్రసాదించకుండా ఉంటే నేను ఆయన సత్యధర్మము నుండి దూరమైన వారిలోంచి అయిపోతాను

فَلَمَّا رَءَا ٱلشَّمْسَ بَازِغَةًۭ قَالَ هَـٰذَا رَبِّى هَـٰذَآ أَكْبَرُ ۖ فَلَمَّآ أَفَلَتْ قَالَ يَـٰقَوْمِ إِنِّى بَرِىٓءٌۭ مِّمَّا تُشْرِكُونَ ﴿٧٨﴾

మరియు ఆయన సూర్యుడిని ఉదయించినప్పుడు చూసి ఇతడు నా ప్రభువు అన్నారు.ఈ ఉదయించేవాడు నక్షత్రము,చంద్రుడి కన్న చాలా పెద్దగా ఉన్నాడు.అది అదృశ్యమైనది చూసి ఇలా అన్నారు: ఓ నా జాతివారా మీరు అల్లా హ్ తోపాటు ఎవరినైతే సాటి కల్పిస్తు న్నారో వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنِّى وَجَّهْتُ وَجْهِىَ لِلَّذِى فَطَرَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ حَنِيفًۭا ۖ وَمَآ أَنَا۠ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿٧٩﴾

నిశ్చయంగా నేను నా ధర్మమును పూర్వ ఎటువంటి నమూనా లేకుండా భూమ్యాకాశాలను పుట్టించిన ఆయన కొరకు షిర్క్ నుండి స్వచ్చమైన తౌహీదు (ఏక దైవోపాసన) వైపునకు మరలుతూ ప్రత్యేకించుకున్నాను

وَحَآجَّهُۥ قَوْمُهُۥ ۚ قَالَ أَتُحَـٰٓجُّوٓنِّى فِى ٱللَّهِ وَقَدْ هَدَىٰنِ ۚ وَلَآ أَخَافُ مَا تُشْرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّى شَيْـًۭٔا ۗ وَسِعَ رَبِّى كُلَّ شَىْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ ﴿٨٠﴾

ముష్రికులైన ఆయన జాతివారు అల్లాహ్ సుబహానహు తఆలా తౌహీదు (ఏక దైవోపాసన) విషయంలో ఆయనతో వాదించారు.వారు తమ విగ్రహాల ద్వారా ఆయనను భయపెట్టా రు.అప్పుడు ఆయన వారితో ఇలా పలికారు: ఏ మీరు అల్లా హ్ యొక్క తౌహీద్ విషయంలో,ఆరాధనలో ఆయన ఒక్కడే అన్న విషయంలో నాతో వాదిస్తు న్నారా.వాస్తవానికి నా ప్రభువు నాకు దానిని అనుగ్రహించాడు.నేను మీ విగ్రహాలతో భయపడను.ఎందుకంటే వారికి నన్ను నష్టం,లాభం కలిగించే శక్తి లేదు.కాని అల్లాహ్ తలుచుకుంటే జరిగిద్ది.అల్లాహ్ ఏది తలచుకుంటే అది అయిపోతుంది.ప్రతి వస్తువు అల్లాహ్ జ్ఞానంలో ఉన్నది.భూమ్యాకాశాల్లో ఉన్న ఏ వస్తువు ఆయన నుండి గోప్యంగా ఉండదు.అయితే ఓ నా జాతివారా అల్లాహ్ పై అవిశ్వాసం,ఆయనతోపాటు సాటి కల్పిస్తు న్నమీరు ఏకైక అల్లా హ్ ను విశ్వసించి హితబోధనను గ్రహించరా?

وَكَيْفَ أَخَافُ مَآ أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ عَلَيْكُمْ سُلْطَـٰنًۭا ۚ فَأَىُّ ٱلْفَرِيقَيْنِ أَحَقُّ بِٱلْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٨١﴾

మరియు అల్లా హ్ ను వదిలి విగ్రహాల్లోంచి మీరు ఆరాధిస్తు న్నవాటికి నేను ఎలా భయపడుతాను.మరియు అల్లా హ్ మీ కొరకు ఎటువంటి ఆధారమును సృష్టించలేదు అటువంటి వారిని మీరు ఆయనతోపాటు సాటి కల్పిస్తున్నప్పుడు మీ షిర్కు చేయటం నుండి మీకు ఎందుకని భయం కలగటం లేదు?.తౌహీదును విశ్వసించే వర్గము,బహుదైవారదకుల వర్గము ఈ రెండు వర్గముల్లోంచి శాంతి,భధ్రతలకు ఎక్కువ హక్కుదారులు ఎవరు?.వారిలోంచి ఎవరు ఉత్తములని మీరు తెలుసుకుంటారో వారిని అనుసరించండి.వారిద్దరిలోంచి విశ్వాసపరులు,ఏకదైవోపాసన చేసే వర్గము ఉత్తములు అవటంలో ఎటువంటి సందేహం లేదు

ٱلَّذِينَ ءَامَنُوا۟ وَلَمْ يَلْبِسُوٓا۟ إِيمَـٰنَهُم بِظُلْمٍ أُو۟لَـٰٓئِكَ لَهُمُ ٱلْأَمْنُ وَهُم مُّهْتَدُونَ ﴿٨٢﴾

ఎవరైతే అల్లా హ్ ను విశ్వసించి ధర్మశాస్త్రమును అనుసరిస్తా రో,తమ విశ్వాసము తోపాటు షిర్క్ ను కలగాపులగం చేయలేదో ఇతరులకు కాకుండా వారి కొరకే శాంతి,భద్రతలు కలవు.వారు సౌభాగ్యవంతులు.వారికి వారి ప్రభువు సన్మార్గపు మార్గము కోసం భాగ్యమును కలిగించాడు

وَتِلْكَ حُجَّتُنَآ ءَاتَيْنَـٰهَآ إِبْرَٰهِيمَ عَلَىٰ قَوْمِهِۦ ۚ نَرْفَعُ دَرَجَـٰتٍۢ مَّن نَّشَآءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌۭ ﴿٨٣﴾

వారి వాదనలు అంతమైపోయినవి అది (ఆ వాదన ) మా వాదన.దాని ద్వారా ఆయన తన జాతి వారితో వాదించటానికి మేము ఆయనకు ప్రసాదించాము.దానినే ఆయనకు ప్రసాదించాము.ఇహలోకంలో,పరలోకంలో మా దాసుల్లోంచి మేము కోరుకున్న వారికి ఉన్నత స్థా నాలను ప్రసాదిస్తా ము.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుతన సృష్టించటంలో,తన కార్య నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి అంతా తెలిసినవాడు

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِۦ دَاوُۥدَ وَسُلَيْمَـٰنَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَـٰرُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿٨٤﴾

ى మరియు మేము ఇబ్రాహీంనకు ఇస్హాఖ్ ను ఆమన కుమారుడిగా,యాఖూబ్ ను ఆయన మనవడిగా ప్రసాదించాము.వారిద్దరిలోంచి ప్రతి ఒక్కరికి సన్మార్గమును పొందే అనుగ్రహమును కలిగించాము.వారికన్న ముందు నూహ్ నకు అనుగ్రహించాము.మరియు మేము నూహ్ సంతానములోంచి దావుద్,ఆయన కుమారుడు సులైమాన్,అయ్యూబ్,యూసుఫ్,మూసా,ఆయన సోదరుడు హారూన్ అలైహిముస్సలాం ప్రతి ఒక్కరికి సత్య మార్గము కొరకు సౌభాగ్యమును కలిగించాము.దైవ ప్రవక్తలు చేసిన మేలుకి ప్రతిఫలంగా మేము వారికి ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలము మాదిరిగా వారే కాకుండా بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ఇతరులకు వారు చేసే మేలుకి ప్రతిఫలాన్ని మేము ప్రసాదిస్తాلము

وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّۭ مِّنَ ٱلصَّـٰلِحِينَ ﴿٨٥﴾

మరియు మేము జక్రియా,యహ్యా,మర్యం కుమారుడగు ఈసా,ఇల్యాస్ లోంచి ప్రతి ఒక్కరికి ఇలాగే అనుగ్రహించాము.ఈ పుణ్యాత్ములైన ప్రవక్తలందరిని అల్లా హ్ సందేశములనుచేరవేసె వారిగా (ప్రవక్తలుగా) ఎన్నుకున్నాడు.ل

وَإِسْمَـٰعِيلَ وَٱلْيَسَعَ وَيُونُسَ وَلُوطًۭا ۚ وَكُلًّۭا فَضَّلْنَا عَلَى ٱلْعَـٰلَمِينَ ﴿٨٦﴾

మరియు మేము ఇదే విదంగ ఇస్మాయీల్,యస్అ,యూనుస్,లూత్ అలైహిముస్సలాంలను అనుగ్రహించాము.మరియు మేము ఈ ప్రవక్తలందరిని,వారందరిలో ప్రత్యేకించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంను ,వాందరిని సర్వలోకాల్లొ ప్రా ధాన్యతను ప్రసాదించాము

وَمِنْ ءَابَآئِهِمْ وَذُرِّيَّـٰتِهِمْ وَإِخْوَٰنِهِمْ ۖ وَٱجْتَبَيْنَـٰهُمْ وَهَدَيْنَـٰهُمْ إِلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ ﴿٨٧﴾

మరియు వారి తాతముత్తాతల్లోంచి కొందరిని,వారి కుమారుల్లోంచి కొందరిని,వారి సోదరుల్లోంచి కొందరిని మేము కోరుకున్న వారికి దానిని అనుగ్రహించాము.వారిని మేము ఎన్నుకున్నాము,మరియు మేము వారందరికి సన్మార్గమైన అల్లా హ్ యొక్క తౌహీద్,ఆయన విధేయత యొక్క మార్గము పై నడవడిక భాగ్యమును ప్రసాదించాము

ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهْدِى بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۚ وَلَوْ أَشْرَكُوا۟ لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٨٨﴾

వారికి లభించిన ఈ భాగ్యము అల్లా హ్ అనుగ్రహము.ఆయన తన దాసుల్లోంచి ఎవరిని కోరుకుంటే వారికి దానిని అనుగ్రహిస్తా డు.ఒకవేళ వారు అల్లా హ్ తోపాటు ఇతరులను సాటి కల్పిస్తే వారి ఆచరణ వృధా అవుతుంది ఎందుకంటే షిర్క్ సత్కార్యమును వృధా చేస్తుంది

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ وَٱلْحُكْمَ وَٱلنُّبُوَّةَ ۚ فَإِن يَكْفُرْ بِهَا هَـٰٓؤُلَآءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًۭا لَّيْسُوا۟ بِهَا بِكَـٰفِرِينَ ﴿٨٩﴾

ఈ ప్రస్తా వించబడిన ప్రవక్తలందరికి మేము గ్రంధాన్ని ప్రసాదించాము,వారికి వివేకమును ప్రసాధించాము, వారికి దైవదౌత్యమును ప్రసాదించాము.ఒకవేళ మీ జాతి వారు మేము ప్రసాదించిన ఈ మూడింటిని తిరస్కరిస్తే వాటి కొరకు మేము ఒక జాతి వారిని తయారుచేసి ఉంచాము.వారు వాటిని తిరస్కరించరు.అంతే కాక వారు దాన్ని విశ్వసించి పాటిస్తా రు. వారు ముహాజిర్ లు,అన్సార్ లు,ప్రళయ దినం వరకు వారిని మంచిగా అనుసరించిన వారు

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُ ۖ فَبِهُدَىٰهُمُ ٱقْتَدِهْ ۗ قُل لَّآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَـٰلَمِينَ ﴿٩٠﴾

ఈ ప్రవక్తలందరు,వారితోపాటు ప్రస్తావించబడిన వారి తాతముత్తాతలు,వారి కుమారులు,వారి సోదరులు వాస్తవానికి వారందరు సన్మార్గమును పొందినవారు.మీరు వారిని అనుసరించండి,వారిపై విధేయత చూపండి.ఓ ప్రవక్తా మీ జాతి వారితో ఇలా అనండి: నేను ఈ ఖుర్ఆన్ ను చేరవేయటం పై మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరటం లేదు.అయితే ఖుర్ఆన్ సర్వలోకాల్లొ ఉన్న మానవులకు,జిన్నులకు సన్మార్గమును,నిజమైన మార్గమును పొందటం కొరకు హితోపదేశము మాత్రమే

وَمَا قَدَرُوا۟ ٱللَّهَ حَقَّ قَدْرِهِۦٓ إِذْ قَالُوا۟ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ بَشَرٍۢ مِّن شَىْءٍۢ ۗ قُلْ مَنْ أَنزَلَ ٱلْكِتَـٰبَ ٱلَّذِى جَآءَ بِهِۦ مُوسَىٰ نُورًۭا وَهُدًۭى لِّلنَّاسِ ۖ تَجْعَلُونَهُۥ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًۭا ۖ وَعُلِّمْتُم مَّا لَمْ تَعْلَمُوٓا۟ أَنتُمْ وَلَآ ءَابَآؤُكُمْ ۖ قُلِ ٱللَّهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِى خَوْضِهِمْ يَلْعَبُونَ ﴿٩١﴾

ى అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అల్లాహ్ ఏ మానవునిపై ఎటువంటి దైవ వాణిని అవతరింప జేయలేదు అని ముష్రికులు పలికినప్పుడు వారు అల్లా హ్ ను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించ లేదు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి: మూసాపై ఆయన జాతి بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ వారికి జ్యోతిగా,సన్మార్గంగా,మార్గదర్శకత్వంగా తౌరాతును ఎవరు అవతరింప జేశారు?. దానిని యూదులు కొన్ని పుస్తకాల్లో పొందుపరచి తమ కోరికలకు అనుగుణంగా ఉన్న వాటిని భహిర్గతం చేస్తు న్నారు. తమ కోరికలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని దాచివేస్తు న్నారు. ఉదా: ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం గారి గుణగణాలు. ఓ అరబ్బులారా మీరు ఖుర్ఆన్ ద్వారా మీకు పూర్వికులకు తెలియని విషయాలను తెలియజేయబడ్డా రు. ఓ ప్రవక్తా దానిని అల్లాహ్ అవతరింప జేశాడని వారికి తెలియ జేయండి. ఆ తరువాత మీరు వారిని వారికి మరణం వచ్చే వరకు హేళన చేస్తూ ఉండే స్థితిలోనే వారి మార్గభ్రష్టతలో,వారి అజ్ఞా నంలోనే వదిలి వేయండి

وَهَـٰذَا كِتَـٰبٌ أَنزَلْنَـٰهُ مُبَارَكٌۭ مُّصَدِّقُ ٱلَّذِى بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ ٱلْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَٱلَّذِينَ يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ يُؤْمِنُونَ بِهِۦ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ ﴿٩٢﴾

ى ఓ ప్రవక్తా మేము మీపై అవతరింపజేసిన ఈ ఖుర్ఆను ఎంతో శుభప్రదమైనది. తన కన్న ముందు అవతరింపబడిన ఆకాశ గ్రంధాలను దృవీకరుస్తుంది. దాని ద్వారా మక్కా వాసులను, భూమికి తూర్పు,పడమరలో ఉన్న ప్రజలందరిని వారు సన్మార్గం పొందెంత వరకు హెచ్చరించటం కొరకు (అవతరింపజేశాము),మరియు ఎవరైతే పరలోక జీవితంను విశ్వసిస్తారో,ఈ ఖుర్ఆను ను విశ్వసిస్తారో,అందులో ఉన్న వాటిని ఆచరిస్తారో,తమ నమాజులను వాటి విధులతో,వాటి సున్నతులతో,వాటి నిర్దేశిత వేళల్లో షరిఅత్ పరంగా వాటి భాగములను నెలకొల్పుతూ పరిరక్షిస్తారో (వారిని హెచ్చరించటం కొరకు అవతరింపజేశాము)

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِىَ إِلَىَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَىْءٌۭ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَآ أَنزَلَ ٱللَّهُ ۗ وَلَوْ تَرَىٰٓ إِذِ ٱلظَّـٰلِمُونَ فِى غَمَرَٰتِ ٱلْمَوْتِ وَٱلْمَلَـٰٓئِكَةُ بَاسِطُوٓا۟ أَيْدِيهِمْ أَخْرِجُوٓا۟ أَنفُسَكُمُ ۖ ٱلْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ ٱلْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ وَكُنتُمْ عَنْ ءَايَـٰتِهِۦ تَسْتَكْبِرُونَ ﴿٩٣﴾

అల్లా హ్ ఏ మానవునిపై ఎటువంటి వస్తు వును అవతరింప జేయలేదని పలికి లేదా తనపై అల్లా హ్ ఎటువంటి వస్తు వును అవతరింప జేయకపోయిన అల్లాహ్ తనపై అవతరింప జేశాడని అబద్దం పలికి లేదా అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింప జేసినట్లు తాను అవతరింప జేస్తానని తెలిపి అల్లాహ్ పై అబద్దంను కల్పించే వాడి కన్న పెద్ద దుర్మార్గు డు ఎవరూ ఉండరు.ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ దుర్మార్గు లందరిని మరణయాతను పొందుతున్నప్పుడు చూస్తే దైవదూతలు శిక్షిస్తూ ,కొడుతూ వారి వైపున తమ జేతులను జాపుతుంటారు,కఠినత్వంతో వారితో ఇలా పలుకుతుంటారు: మీరు మీ ప్రాణములను వదలండి మేము వాటిని పట్టు కుంటాము.ఈ రోజు మీరు ప్రతిఫలంగా శిక్షను పొందుతారు.అది మీరు దైవదౌత్యం,దైవవాణి,అల్లా హ్ అవతరింప జేసినట్లు అవతరింప జేయటం యొక్క దావా చేసి అల్లా హ్ పై అబద్దమును అంటగడుతూ పలకటం వలన,మీరు విశ్వాసించటం నుండి ఆయన ఆయతుల పట్ల గర్వాన్ని ప్రదర్శించటం వలన మిమ్మల్ని పరాభవానికి,అగౌరవానికి గురిచేస్తుంది.ఒక వేళ మీరు దానిని చూస్తే భయంకరమైన విషయం కనబడుతుంది

وَلَقَدْ جِئْتُمُونَا فُرَٰدَىٰ كَمَا خَلَقْنَـٰكُمْ أَوَّلَ مَرَّةٍۢ وَتَرَكْتُم مَّا خَوَّلْنَـٰكُمْ وَرَآءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَآءَكُمُ ٱلَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَـٰٓؤُا۟ ۚ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ ﴿٩٤﴾

ప్రళయదినాన వారితో ఈ విధంగా తెలుపబడును: ఏ విధంగానైతే మేము మొదటిసారి మిమ్మల్ని చెప్పలు లేకుండా,నగ్నముగా,సున్తీ చేయకుండా పుట్టించామో అలాగే మీరు ఈ రోజు మావద్దకు ఒంటరిగావచ్చారు.మీ వద్ద ఎటువంటి సంపద లేదు,ఎటువంటి అధికారము లేదు.మేము మీకు ప్రసాదించిన వాటిని మీరు అయిష్టతతో ఇహలోకములో మీ వెనుక వదిలివేశారు.మీ ఆరాధ్య దేవుళ్ళు ఎవరినైతే మీరు మీ కొరకు మధ్యవర్తులుగా (సిఫారసు చేసేవారిగా) ,ఆరాధనలో హక్కుదారులవటంలో అల్లా హ్ కు సాటిగా భావించే వారో వారిని మేము ఈ రోజు మీతోపాటు చూడటం లేదు.మీ మధ్యన సంబంధాలు తెగిపోయినవి.ఎవరికైతే సిఫారసు చేసే అధికారము ఉందని,వారు అల్లా హ్ కు సాటి అని మీరు నమ్మేవారో వారందరు మీ నుండి దూరమైపోయారు

۞ إِنَّ ٱللَّهَ فَالِقُ ٱلْحَبِّ وَٱلنَّوَىٰ ۖ يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَمُخْرِجُ ٱلْمَيِّتِ مِنَ ٱلْحَىِّ ۚ ذَٰلِكُمُ ٱللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ﴿٩٥﴾

నిశ్చయంగా అల్లా హ్ ఒక్కడే విత్తనములను చీల్చి దాని ద్వారా పంటలను తీస్తు న్నాడు. మరియు అతడు టెంకను చీల్చి దాని ద్వారా ఖర్జూ రపు చెట్లను తీస్తు న్నాడు,నిర్జీవం నుండి జీవమును తీస్తు న్నాడు అప్పుడే మానవుడిని,జంతువులన్నింటిని వీర్య బిందువు నుండి తీస్తు న్నాడు. మరియు జీవము నుండి నిర్జీవమును తీస్తు న్నాడు అప్పుడే మనిషి నుండి వీర్య బిందువును,కోడి నుండి గ్రు డ్డు ను తీస్తు న్నాడు. ఇదంతా మిమ్మల్ని సృష్టించిన ఆ అల్లా హ్ بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ చేస్తు న్నాడు. అయితే ఓ బహు దైవారాదుకులారా మీరు ఆయన అద్భుతమైన సృష్టిని చూసి కూడా సత్యము నుండి ఎలా మరలిపోతున్నారు

فَالِقُ ٱلْإِصْبَاحِ وَجَعَلَ ٱلَّيْلَ سَكَنًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ حُسْبَانًۭا ۚ ذَٰلِكَ تَقْدِيرُ ٱلْعَزِيزِ ٱلْعَلِيمِ ﴿٩٦﴾

మరియ ఆయనే సుబహానహు తఆలా రాత్రి చీకటి నుండి ఉదయపు వెలుగును చీల్చి వెలికి తాస్తు న్నాడు. మరియు ఆయనే రాత్రిని మానవుల కొరకు విశ్రాంతి సమయంగా చేశాడు. పగలు ఆహారోపాధిని పొందటం కొరకు,దానిని పొందటంలో కలిగిన తమ అలసట నుండి సేద తీరటం కొరకు వారు అందులో చలనం నుండి విశ్రాంతి తీసుకుంటారు. మరియు ఆయనే సూర్యచంద్రులను ఒక నిర్ధారిత లెక్కప్రకారం ప్రకాశించటానికి సృష్టించాడు. ఈ ప్రస్తావించబడిన అద్భుతమైన సృష్టిని ఎవరూ అపజయానికి గురిచేయలేని సర్వాధిక్యుడి నిర్ధా రణ. మరియు అతడు తన సృష్టితాల గురించి,వారికి ఏది శ్రేయెస్కరమో అంతా తెలిసినవాడు

وَهُوَ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلنُّجُومَ لِتَهْتَدُوا۟ بِهَا فِى ظُلُمَـٰتِ ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍۢ يَعْلَمُونَ ﴿٩٧﴾

ఓ ఆదమ్ సంతతివారా అల్లాహ్ సుబహానహు తఆలా భూమి,సముద్రపు మార్గముల్లో మీప్రయాణముల్లో మిమ్మల్ని మార్గము సందేహంలో పడవేసినప్పుడు దారి తెలుసుకోవటానికి మీ కొరకు ఆకాశములో నక్షత్రములను సృష్టించాడు. నిశ్చయంగా మేము ఈ ఆధారాల్లో ,రుజువుల్లో యోచన చేసి వాటిద్వారా లబ్ది పొందే జాతి వారి కొరకు మా సామర్ధ్యమును నిరూపించేر ఆధారాలను,రుజువులను చూపించినాము

وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَكُم مِّن نَّفْسٍۢ وَٰحِدَةٍۢ فَمُسْتَقَرٌّۭ وَمُسْتَوْدَعٌۭ ۗ قَدْ فَصَّلْنَا ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍۢ يَفْقَهُونَ ﴿٩٨﴾

మరియు ఆయన సుబహానహు తఆలా మిమ్మల్ని ఒకే ప్రా ణం తో పుట్టించాడు. అది మీ తండ్రి అయిన ఆదం ప్రా ణము. ఆయన మిమ్మల్ని సృష్టించటంను మీ తండ్రిని మట్టితో సృష్టించటం ద్వారా మొదలు పెట్టా డు. ఆ తరువాత దానితో ఆయన మిమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు మీరు దేనిలోనైతే ఎక్కువ కాలం స్థిరంగా ఉంటారో దానిని మీ తల్లుల గర్భాల మాదిరిగా,తక్కువ కాలం స్థిరంగా ఉంటారో దానిని మీ తండ్రుల వెన్నుల మాదిరిగా సృష్టించాడు.ب నిశ్చయంగా మేము అల్లా హ్ వాక్కును అర్ధంచేసుకునే జాతి వారి కొరకు ఆయతులను విడమరచి తెలిపాము

وَهُوَ ٱلَّذِىٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءًۭ فَأَخْرَجْنَا بِهِۦ نَبَاتَ كُلِّ شَىْءٍۢ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًۭا نُّخْرِجُ مِنْهُ حَبًّۭا مُّتَرَاكِبًۭا وَمِنَ ٱلنَّخْلِ مِن طَلْعِهَا قِنْوَانٌۭ دَانِيَةٌۭ وَجَنَّـٰتٍۢ مِّنْ أَعْنَابٍۢ وَٱلزَّيْتُونَ وَٱلرُّمَّانَ مُشْتَبِهًۭا وَغَيْرَ مُتَشَـٰبِهٍ ۗ ٱنظُرُوٓا۟ إِلَىٰ ثَمَرِهِۦٓ إِذَآ أَثْمَرَ وَيَنْعِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكُمْ لَـَٔايَـٰتٍۢ لِّقَوْمٍۢ يُؤْمِنُونَ ﴿٩٩﴾

మరియు ఆయనే సుబహానహు వతఆలా ఆకాశము నుండి నీటిని కరిపించాడు అది వర్షపు నీరు. దాని ద్వారా మేము అన్ని రకాల మొక్కలను మొలకెత్తించినాము. మేము మొక్కల నుండి పచ్చని చేల మాదిరిగా,వృక్షాల మాదిరిగా వెలికి తీశాము. దాని నుండి మేము ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన వెన్నులో ఉండినట్లు గా గింజలను తీస్తా ము. మరియు ఖర్జూ రపు పాళి నుండి వాటి గెలలు దగ్గరగా ఉంటాయి. నిలబడిన వాడు,కూర్చున్న వాడు వాటిని పొందుతాడు. మరియు మేము ద్రా క్షతోటలను తీసినాము. మరియు మేము జైతూనును (ఆలివ్ పండ్లను),దానిమ్మకాయలను తీసినాము. వాటి ఆకులు ఒక దానితో ఒకటి పోలి ఉంటాయి. వాటి ఫలాల్లో వేరు వేరుగా ఉంటాయి. ఓ ప్రజలారా వాటి పండ్లు మొదలు ప్రారంభమయ్యే వేళ,అది పండే వేళ దాని వైపున నిశిత దృష్టితో చూడండి. ఓ ప్రజలారా నిశ్చయంగా ఇందులో అల్లా హ్ ను విశ్వసించే జాతి వారి కొరకు అల్లా హ్ సామర్ధ్యమును నిరూపించే స్పష్టమైన ఆధారాలున్నవి. వారే ఈ ఆధారాలు,రుజువుల ద్వారా లబ్ది పొందుతారు

وَجَعَلُوا۟ لِلَّهِ شُرَكَآءَ ٱلْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا۟ لَهُۥ بَنِينَ وَبَنَـٰتٍۭ بِغَيْرِ عِلْمٍۢ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يَصِفُونَ ﴿١٠٠﴾

ముష్రికులు జిన్నులు లాభం చేస్తాయని,నష్టం కలిగిస్తాయని విశ్వసించినప్పుడు వారు ఆరాధనలో జిన్నులను అల్లాహ్ కి భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. వాస్తవానికి అల్లాహ్ వారిని సృష్టించినాడు. ఆయన కాక మరెవ్వరూ వాటిని సృష్టించలేదు. ఆయనే ఆరాధనకు అర్హుడు. వారు కుమారులను కల్పించుకున్నారు ఏ విధంగానైతే యూదులు ఉజైరును కల్పించుకున్నారో,క్రైస్తవులు ఈసాను కల్పించుకున్నారో. మరియు వారు కుమార్తెలను కల్పించుకున్నారు ఏ విధంగానైతే ముష్రికులు దైవదూతలను కల్పించుకున్నారో. అసత్యవాదులు తెలుపుతున్న ఈ గుణాల నుండి ఆయన పరిశుద్ధు డు,పవిత్రు డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

بَدِيعُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُۥ وَلَدٌۭ وَلَمْ تَكُن لَّهُۥ صَـٰحِبَةٌۭ ۖ وَخَلَقَ كُلَّ شَىْءٍۢ ۖ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌۭ ﴿١٠١﴾

మరియు ఆయనే పూర్వ నమూనా లేకుండా ఆకాశములను సృష్టించిన వాడు,భూమిని సృష్టించిన వాడు. ఆయనకు భార్యయే లేనప్పుడు ఆయనకు సంతానము ఎలా ఉండును ?. ఆయనే ప్రతి వస్తు వును సృష్టించినాడు. మరియు ఆయన ప్రతి వస్తు వు గురించి తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ خَـٰلِقُ كُلِّ شَىْءٍۢ فَٱعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ وَكِيلٌۭ ﴿١٠٢﴾

ఓ ప్రజలారా ఈ లక్షణాలు కలిగిన వాడు మీ ప్రభువు, మీ కొరకు ఆయన తప్ప వేరే ప్రభువు లేడు,ఆయన కాకుండా వేరేవాడు సత్య ఆరాధ్య దైవం కాడు. ప్రతి వస్తువును సృష్టించిన వాడు ఆయనే.ఆయన ఒక్కడినే మీరు ఆరాధించండి. ఆయనే ఆరాధనకు హక్కుదారుడు. మరియు ప్రతి వస్తువుపై సంరక్షకునిగా ఉన్నాడు

لَّا تُدْرِكُهُ ٱلْأَبْصَـٰرُ وَهُوَ يُدْرِكُ ٱلْأَبْصَـٰرَ ۖ وَهُوَ ٱللَّطِيفُ ٱلْخَبِيرُ ﴿١٠٣﴾

ఆయనను ఎవరి చూపులు చుట్టు ముట్ట లేవు. ఆయన అందరి చూపులను అందుకోగలడు. మరియు వాటిని చుట్టు ముట్టగలడు. మరియు ఆయన తన పుణ్యదాసుల పై సూక్ష్మదృష్టి కలవాడు. వారి గురించి తెలుసుకునేవాడు

قَدْ جَآءَكُم بَصَآئِرُ مِن رَّبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِۦ ۖ وَمَنْ عَمِىَ فَعَلَيْهَا ۚ وَمَآ أَنَا۠ عَلَيْكُم بِحَفِيظٍۢ ﴿١٠٤﴾

ఓ ప్రజలారా మీ ప్రభువు వద్ద నుండి స్పష్టమైన వాదనలు,స్పష్టమైన ఆధారాలు మీ వద్దకు వచ్చినవి. ఎవరైతే వాటిని అర్థం చేసుకుని స్వీకరిస్తా డో ఆ ప్రయోజనం అతని వైపునకు మరలుతుంది. ఎవడైతే వాటి పట్ల అంధుడైపోతాడో,వాటిని అర్ధం చేసుకోడో ,వాటిని స్వీకరించడో ఆ నష్టం అతనికే పరిమితం అవుతుంది. నేను మీ కర్మలను లెక్క వేసుకుంటూ మిమ్మల్ని కనిపెట్టు కుని ఉండేవాడిని కాదు. నేను కేవలం నా ప్రభువు తరుపు నుంచి ప్రవక్తను మాత్రమే. ఆయనే మిమ్మల్ని కనిపెట్టు కుని ఉంటాడు

وَكَذَٰلِكَ نُصَرِّفُ ٱلْـَٔايَـٰتِ وَلِيَقُولُوا۟ دَرَسْتَ وَلِنُبَيِّنَهُۥ لِقَوْمٍۢ يَعْلَمُونَ ﴿١٠٥﴾

మరియు మేము అల్లాహ్ శక్తికి సంబంధించిన సాక్షాధారాలను,రుజువులను విభిన్నంగా చేసినట్లు వాగ్ధానము,హెచ్చరిక,హితబోధనలకు సంబంధించిన సూచనలను విభిన్నంగా చేశాము. ముష్రికులు ముందు ముందు ఇలా పలుకుతారు "ఇది దైవ వాణి కాదు దీనిని నీవు నీకన్న మునుపు గ్రంధవహుల నుండి నేర్చుకున్నావు". మరియు ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం జాతి వారిలోంచి విశ్వాసపరులకు ఈ సూచనలను మేము విభిన్నంగా చేయటం ద్వారా సత్యాన్ని ప్రజలకు స్పష్టపరచేందుకు చేస్తా ము. అయితే వారే (విశ్వాసపరులు) సత్యాన్ని స్వీకరిస్తా రు,దానిని అనుసరిస్తా రు

ٱتَّبِعْ مَآ أُوحِىَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ ﴿١٠٦﴾

ఓ ప్రవక్తా మీ ప్రభువు మీ పై అవతరింపజేసిన సత్యాన్ని అనుసరించండి. ఆయన పరిశుధ్ధుడు. ఆయన తప్ప వేరేవారు నిజ ఆరాధ్యులు కారు. అవిశ్వాసులతో,వారి మొండితనంతో మీ హృదయాన్ని లగ్నం చేయకండి. వారి విషయం అల్లా హ్ కే వదిలేయండి

وَلَوْ شَآءَ ٱللَّهُ مَآ أَشْرَكُوا۟ ۗ وَمَا جَعَلْنَـٰكَ عَلَيْهِمْ حَفِيظًۭا ۖ وَمَآ أَنتَ عَلَيْهِم بِوَكِيلٍۢ ﴿١٠٧﴾

అల్లా హ్ తోపాటు వారు ఎవరిని సాటి కల్పించకూడదు అని ఒక వేళ అల్లా హ్ తలచుకుంటే వారు ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించేవారు కాదు. ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారిపై వారి కర్మలను లెక్క వేయటానికి పర్యవేక్షకునిగా నియమించలేదు. వారి వ్యవహారాలకు మీరు బాధ్యులు కారు. మీరు ప్రవక్త మాత్రమే. సందేశాలను చేరవేయటం మాత్రమే మీ బాధ్యత. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَلَا تَسُبُّوا۟ ٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِ ٱللَّهِ فَيَسُبُّوا۟ ٱللَّهَ عَدْوًۢا بِغَيْرِ عِلْمٍۢ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٠٨﴾

مرجعهم فينبئهم بما كانوايعملون ఓ విశ్వాసపరులారా ముష్రికులు అల్లాహ్ తోపాటు ఆరాధించే విగ్రహాలను దూషించకండి. ఒక వేళ అవి అత్యంత అల్పమైన,దూషించుటకు అవి తగినవైనా సరే. ముష్రికులు అల్లా హ్ ను ఎక్కువగా ద్వేషిస్తూ అజ్ఞా నం వలన అల్లా హ్ కు తగని వాటి ద్వారా దూషించనంత వరకు. వీరందరి కొరకు వారు ఉన్న అపమార్గము అలంకరించబడిన విధంగా మేము ప్రతి జాతి వారికి వారి ఆచరణను అది మంచి అయిన,చెడు అయిన అలంకరించాము. ఆ తరువాత వారు తమ కొరకు అలంకరించిన దానిలోంచి తీసుకుని వచ్చారు. ప్రళయదినాన వారి మరలింపు వారి ప్రభువు వైపు ఉంటుంది. వారు ఈ లోకంలో చేసుకున్న కర్మల గురించి ఆయన వారికి తెలియపరుస్తా డు. దాని పరంగా వారికి ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తా డు

وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَـٰنِهِمْ لَئِن جَآءَتْهُمْ ءَايَةٌۭ لَّيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا ٱلْـَٔايَـٰتُ عِندَ ٱللَّهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَآ إِذَا جَآءَتْ لَا يُؤْمِنُونَ ﴿١٠٩﴾

ముష్రికులు తమ శక్తి మేరకు అతి గట్టిగా అల్లా హ్ పై ప్రమాణం చేసారు.ఒక వేళ ముహమ్మద్ వారి వద్దకు వారు ప్రతిపాదించిన సూచనల్లోంచి ఏ ఒక్క సూచన తీసుకుని వచ్చినా వారు దానిని తప్పకుండా విశ్వసిస్తా రు(అని). ఓ ప్రవక్తా వారితో ఇలా తెలియ చేయండి: సూచనలు నా వద్ద లేవు నేను వాటిని అవతరింప చేయటానికి.అవి అల్లాహ్ వద్ద మాత్రమే ఉంటాయి.ఆయన వాటిని ఎప్పుడు తలచుకుంటే అప్పుడు అవతరింప చేస్తాడు.ఓ విశ్వాసపరులారా మీకేమి తెలుసు నిశ్చయంగా ఈ సూచనలు వచ్చినప్పుడు వారు ప్రతిపాదించిన ప్రకారం ఉన్నా వారు విశ్వసించరు.కాని వారు తమ మొండితనము,తమ తిరస్కరించటం పైనే ఉంటారు.ఎందుకంటే వారు సన్మార్గమును కోరుకోవటం లేదు

وَنُقَلِّبُ أَفْـِٔدَتَهُمْ وَأَبْصَـٰرَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا۟ بِهِۦٓ أَوَّلَ مَرَّةٍۢ وَنَذَرُهُمْ فِى طُغْيَـٰنِهِمْ يَعْمَهُونَ ﴿١١٠﴾

మరియు సత్యాన్ని మార్గ నిర్దేశం చేయకుండా నిరోధించటం ద్వారా వారి హృదయాలను,వారి కళ్ళను మేము తిప్పి వేశాము. ఏ విధంగానైతే మేము వారి మొండితనం కారణంగా వారి మధ్య,విశ్వాసము మధ్య ఖుర్ఆన్ ద్వారా తొలిసారి పరిష్కరించామో ఆ విధంగా. మరియు మేము వారిని వారి అపమార్గంలో,తమ ప్రభువుకి వ్యతిరేకంగా తమ తలబిరుసు తనంలో దారి తప్పి తిరిగేలా వదిలి పెడతాము

۞ وَلَوْ أَنَّنَا نَزَّلْنَآ إِلَيْهِمُ ٱلْمَلَـٰٓئِكَةَ وَكَلَّمَهُمُ ٱلْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَىْءٍۢ قُبُلًۭا مَّا كَانُوا۟ لِيُؤْمِنُوٓا۟ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ ﴿١١١﴾

ولكن أك ثرهم يجهلون ఒక వేళ మేము వారు ప్రతిపాదించిన దానిని తీసుకుని వచ్చి వారి కోరికను స్వీకరిస్తే వారిపై దైవదూతలను అవతరింపజేస్తా ము. అప్పుడు వారు వారిని తమ కళ్ళారా చూస్తా రు. మృతులు వారితో మాట్లా డుతారు. మీరు తీసుకుని వచ్చిన దానిలో మీ నిజాయితి గురించి వారికి వారు తెలియజేస్తా రు. వారు ప్రతిపాదించిన ప్రతి వస్తు వును వారి కొరకు మేము సమీకరిస్తా ము. వారు దానిని తమ ముందట పొందుతారు. వారిలోంచి అల్లా హ్ ఎవరి కొరకు సన్మార్గం కోరుకుంటారో వారు మాత్రమే మీరు తీసుకుని వచ్చిన దానిని విశ్వసిస్తా రు. కాని వారిలోంచి చాలా మందికి దాని గురించి జ్ఞానం లేదు. అల్లా హ్ వారికి సన్మార్గపు సౌభాగ్యము కలిగించటానికి వారు ఆయన వైపునకు మరలటం లేదు. و

وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِىٍّ عَدُوًّۭا شَيَـٰطِينَ ٱلْإِنسِ وَٱلْجِنِّ يُوحِى بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍۢ زُخْرُفَ ٱلْقَوْلِ غُرُورًۭا ۚ وَلَوْ شَآءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ ﴿١١٢﴾

ఈ ముష్రికులందరి ద్వారా మేము మిమ్మల్ని పరీక్షించినట్లే మీకన్న మునుపు ప్రతి ప్రవక్తను పరీక్షించినాము. వారిలోంచి ప్రతి ఒక్కరి కొరకు మానవుల్లోంచి తలబిరుసు కల వారిని,జిన్నాతుల్లోంచి తలబిరుసు కల వారిని శతృవులుగా చేశాము. వారిలోంచి కొందరు కొందరి మనసులో మాటలు వేసి వారిని మోసం చేయటానికి అసత్యాన్ని అలంకరించి చూపిస్తా రు. ఒక వేళ అల్లా హ్ వారు ఇలా చేయకూడదు అని అనుకుంటే వారు ఇలా చేయరు. కాని ఆయన వారిని పరీక్షించటం కొరకు దానిని కోరుకున్నాడు. అయితే మీరు వారిని,వారు కల్పించుకున్న అవిశ్వాసము,అసత్యమును వదిలివేయండి. వారిని ఇబ్బంది పెట్ట కండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَلِتَصْغَىٰٓ إِلَيْهِ أَفْـِٔدَةُ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا۟ مَا هُم مُّقْتَرِفُونَ ﴿١١٣﴾

మరియు పరలోకమును విశ్వసించని వారి మనస్సులను వారిలోంచి కొందరు కొందరిని ప్రేరేపించటానికి మనస్సులో వేసిన మాటల వైపు మొగ్గు చూపటం కొరకు,మరియు దానిని తమ కొరకు స్వీకరించటం కొరకు,దానిని వారి కొరకు ఇష్టపడేందుకు,వారు అవిధేయత కార్యాలను,పాపములను చేసేటందుకు

أَفَغَيْرَ ٱللَّهِ أَبْتَغِى حَكَمًۭا وَهُوَ ٱلَّذِىٓ أَنزَلَ إِلَيْكُمُ ٱلْكِتَـٰبَ مُفَصَّلًۭا ۚ وَٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يَعْلَمُونَ أَنَّهُۥ مُنَزَّلٌۭ مِّن رَّبِّكَ بِٱلْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ ٱلْمُمْتَرِينَ ﴿١١٤﴾

ఓ ప్రవక్తా అల్లా హ్ తో పాటు ఇతరులను ఆరాధించే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: నేను మీ మధ్య,నా మధ్య తీర్పు విషయంలో అల్లా హ్ ను వదిలి వేరే వాళ్ళను అంగీకరించడం సాధ్యమేనా?. అల్లా హ్ యే అన్నీ విషయాలను వివరిస్తూ మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. మేము తౌరాత్ ను ప్రసాధించిన యూదులు,మేము ఇంజీలు ప్రసాధించిన క్రైస్తవులు మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ సత్యంతో కూడుకుని ఉన్నదని దాని గురించి తమ గ్రంధాల్లో ఆధారమును పొందటం మూలంగా వారు తెలుసుకున్నారు. అయితే మీ పై మేము అవతరింపజేసిన దాని గురించి సందేహపడే వారిలోంచి మీరు కాకండి

وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًۭا وَعَدْلًۭا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَـٰتِهِۦ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ﴿١١٥﴾

మరియు ఖుర్ఆన్ మాటల్లో సమాచారమివ్వటంలో చాలా నిజాయితీకి చేరుకుంది. ఆయన వాక్కులను మార్చే వాడెవడూ లేడు. మరియు అతడు తన దాసుల మాటలను వినేనాడు. వాటి గురించి తెలిసిన వాడు. వాటిలోంచి ఏది కూడా ఆయనకు గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాక్కులను మార్చటానికి ప్రయత్నించే వాడిని ఆయన తొందరగా ప్రతిఫలాన్నిప్రసాధిస్తా డు

وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِى ٱلْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ ٱللَّهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ ﴿١١٦﴾

ఓ ప్రవక్తా భూమిపై నివసించే అధిక సంఖ్యాకుల మాట విన్నారే అనుకోండి వారు మిమ్మల్ని అల్లా హ్ ధర్మం నుంచి తప్పించి వేస్తా రు. సత్యం తక్కువ మందితో పాటు ఉండటంలో అల్లా హ్ సంప్రదాయం నడుస్తు న్నది. చాలామంది నిరాధారమైన నమ్మకమును మాత్రమే అనుసరిస్తా రు. ఏ విధంగానంటే వారి ఆరాధ్యదైవాలు వారిని అల్లా హ్ కు దగ్గర చేస్తా యని వారు నమ్మేవారు. వారు ఆ విషయంలో అబధ్ధం పలికేవారు

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِۦ ۖ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ ﴿١١٧﴾

ఓ ప్రవక్తా ప్రజల్లోంచి తన మార్గము నుండి ఎవరు తప్పిపోతారో నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు(ఎవరు) సన్మార్గము పొందుతారో ఆయనకు బాగా తెలుసు. అందులోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు

فَكُلُوا۟ مِمَّا ذُكِرَ ٱسْمُ ٱللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِـَٔايَـٰتِهِۦ مُؤْمِنِينَ ﴿١١٨﴾

ఓ ప్రజలారా ఒక వేళ మీరు ఆయన స్పష్టమైన నిదర్శనాలపై సత్య విశ్వాసం కలిగిన వారే నైతే జుబాహ్ (కోసే) చేసే సమయంలో అల్లాహ్ పేరు తీసుకున్న వాటిలోంచే మీరు తినండి

وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا۟ مِمَّا ذُكِرَ ٱسْمُ ٱللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا ٱضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًۭا لَّيُضِلُّونَ بِأَهْوَآئِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِٱلْمُعْتَدِينَ ﴿١١٩﴾

ఓ విశ్వాసపరులారా అల్లా హ్ పేరు ఉచ్చరించబడిన జంతువుల్లోంచి తినటానికి మిమ్మల్ని ఏది ఆపుతుంది. వాస్తవానికి అల్లా హ్ మీపై నిషేధించిన వాటిని తెలియపరచాడు. మీకు ఏదైన అవసరం గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పరిస్తే తప్ప వాటిని వదిలివేయటం మీపై తప్పనిసరి. అత్యవసర పరిస్థితి నిషేధిత వస్తు వులను అనుమతిస్తుంది. నిశ్చయంగా చాలామంది ముష్రికులు తమ అజ్ఞానంతో తప్పుడు సలహాల ద్వారా తమను అనుసరించే వారిని సత్యం నుండి దూరం చేస్తు న్నారు. ఎలాగంటే అల్లా హ్ వారిపై నిషేధించిన మృత జంతువులు,తదితర వాటిని వారు హలాల్ చేసుకుంటున్నారు. మరియు بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ అల్లా హ్ వారి కొరకు హలాల్ చేసిన బహీరా,వసీలా,హామ్ తదితర వాటిని నిషేధించుకుంటున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ యొక్క ప్రభువు అల్లా హ్ హద్దులను అదిగమించే వాడి గురించి బాగా తెలిసిన వాడు. వారు ఆయన హద్దులను దాటటం వలన వారికి ఆయన తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తా డు

وَذَرُوا۟ ظَـٰهِرَ ٱلْإِثْمِ وَبَاطِنَهُۥٓ ۚ إِنَّ ٱلَّذِينَ يَكْسِبُونَ ٱلْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا۟ يَقْتَرِفُونَ ﴿١٢٠﴾

ఓ ప్రజలారా బహిరంగంగా,గోప్యంగా పాపములను చేయటం వదలండి. నిశ్చయంగా బహిరంగంగా,గోప్యంగా పాపాలకు పాల్పడేవారిని అల్లాహ్ తొందరలోనే వారి పాపముల ప్రతిఫలాన్ని ప్రసాధిస్తా డు

وَلَا تَأْكُلُوا۟ مِمَّا لَمْ يُذْكَرِ ٱسْمُ ٱللَّهِ عَلَيْهِ وَإِنَّهُۥ لَفِسْقٌۭ ۗ وَإِنَّ ٱلشَّيَـٰطِينَ لَيُوحُونَ إِلَىٰٓ أَوْلِيَآئِهِمْ لِيُجَـٰدِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ ﴿١٢١﴾

أطعتموهم إ نكم لمشركون ఓ ముస్లిములారా అల్లా హ్ నామము స్మరించబడని దానిని తినకండి. దానిపై అల్లా హ్ నామము తీసుకొనకపోయిన లేదా ఇతరుల నామం తీసుకున్నా ఒక్కటే. అందులో నుంచి తినటం అల్లా హ్ విధేయత నుండి అవిధేయతకు పాల్పడటమే. నిశ్చయంగా షైతానులు మృత జంతువులను తినే విషయంలో సందేహములో పడవేసి మీతో వాదులాడటానికి తమ మితృలను ఉసిగొల్పుతుంటారు. ఓ ముస్లిములారా మృత జంతువును తినటం ధర్మసమ్మతం చేసుకోవటంలో సందేహపడిన విషయంలో ఒక వేళ మీరు వారి మాట విన్నారనుకోండి మీరు మరియు వారు షిర్క్ లో సమానమైపోతారు

أَوَمَن كَانَ مَيْتًۭا فَأَحْيَيْنَـٰهُ وَجَعَلْنَا لَهُۥ نُورًۭا يَمْشِى بِهِۦ فِى ٱلنَّاسِ كَمَن مَّثَلُهُۥ فِى ٱلظُّلُمَـٰتِ لَيْسَ بِخَارِجٍۢ مِّنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَـٰفِرِينَ مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٢٢﴾

كذلك زين للكفرين ما كانوايعملون ఎవడైతే అల్లాహ్ సన్మార్గము చూపక మునుపు అవిశ్వాసంలో,అజ్ఞానంలో,అవిధేయతలో ఉండటం వలన మృతునిగా ఉన్నాడో మేము అతనికి విశ్వాసం,జ్ఞానం,విధేయత కొరకు సన్మార్గము చూపినాము. అతను ఆ వ్యక్తితో సమానుడవుతాడా ? ఎవరైతే అవిశ్వాసం,అజ్ఞానం,అవిధేయత చీకట్లలో ఉండి అందులో నుంచి బయటపడటానికి అతనికి శక్తి లేదు. అతనిపై దారులు సందిగ్దమైపోయినవి,అతనిపై మార్గములు చీకటిమయమై పోయినవి. ఏ విధంగానైతే ఈ ముష్రికులందరి కొరకు వారు చేస్తు న్నషిర్కు,మృత జంతువులను తినటం,అసత్యము ద్వారా వాదన అలంకరించ బడినదో అదేవిధంగా అవిశ్వాసపరుల కొరకు వారు చేస్తున్న పాప కార్యాలు అలంకరించబడినవి. వాటి పరంగా వారు ప్రళయ దినాన భాధకరమైన శిక్ష ద్వారా ప్రతిఫలం ప్రసాధించబడటానికి

وَكَذَٰلِكَ جَعَلْنَا فِى كُلِّ قَرْيَةٍ أَكَـٰبِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا۟ فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ ﴿١٢٣﴾

మక్కాలో అల్లాహ్ మార్గము నుండి ఆపే కార్యక్రమం ఏదైతే ముష్రికుల నాయకుల ద్వారా జరిగినదో అదే విధంగా ప్రతి పట్టణంలో నాయకులను,పెద్ద వారిని తయారు చేశాము. వారి పన్నాగాలు,ఎత్తుగడలు షైతాన్ మార్గం వైపునకు పిలవటంలో,ప్రవక్తలతో,వారిని అనుసరించే వారితో పోట్లా డటంలో అమలు చేసేవి. వాస్తవానికి వారి కుయుక్తులు,ఎత్తుగడలు వారిపైనే వచ్చి పడుతున్నవి. కాని వారు తమ అజ్ఞానం వలన,తమ మనోవాంచనలకు లోనవటం వలన దానిని గ్రహించలేకపోతున్నారు

وَإِذَا جَآءَتْهُمْ ءَايَةٌۭ قَالُوا۟ لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَآ أُوتِىَ رُسُلُ ٱللَّهِ ۘ ٱللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُۥ ۗ سَيُصِيبُ ٱلَّذِينَ أَجْرَمُوا۟ صَغَارٌ عِندَ ٱللَّهِ وَعَذَابٌۭ شَدِيدٌۢ بِمَا كَانُوا۟ يَمْكُرُونَ ﴿١٢٤﴾

అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సూచనల్లోంచి ఏదైన సూచన అవిశ్వాసపరుల పెద్దల వద్దకు వచ్చినప్పుడు వారు అంటారు: "అల్లాహ్ దైవ ప్రవక్తలకు ఇచ్చినటువంటి దైవదౌత్యము,సందేశాలను చేరవేసే బాధ్యత మాకు ప్రసాధించనంతవరకు మేము విశ్వసించమంటే విశ్వసించము". అల్లా హ్ వారి మాటలను ఖండించాడు. ఎందుకంటే సందేశాలను చేరవేయటానికి తగినవాడు ఎవడో,దాని బాధ్యత భారమును మోసేవాడు ఎవడో ఆయనకు బాగా తెలుసు. అయితే ఆయన దైవదౌత్యము ద్వారా,సందేశాలను చేరవేసే బాధ్యత ద్వారా అతన్ని ప్రత్యేకిస్తా డు. ఈ నిరంకుశులందరు సత్యమును స్వీకరించటం నుండి తమ అహంకారం వలన అవమానము,పరాభవము వాటిల్లు తుంది,వారి కుయుక్తు ల వలన కఠినమైన శిక్ష వచ్చిపడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَمَن يُرِدِ ٱللَّهُ أَن يَهْدِيَهُۥ يَشْرَحْ صَدْرَهُۥ لِلْإِسْلَـٰمِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُۥ يَجْعَلْ صَدْرَهُۥ ضَيِّقًا حَرَجًۭا كَأَنَّمَا يَصَّعَّدُ فِى ٱلسَّمَآءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ ٱللَّهُ ٱلرِّجْسَ عَلَى ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ ﴿١٢٥﴾

ه అల్లాహ్ ఎవరికైన సన్మార్గము ప్రసాధించదలచుకుంటే అతని హృదయమును విశాలంగా చేస్తాడు,ఇస్లాం స్వీకరించటానికి అతన్ని సిద్ధం చేస్తాడు. మరియు ఎవరినైన ఆయన నిస్సహాయుడిగా వదిలివేయాలని,సన్మార్గం పొందే సౌభాగ్యం కలగకుండా చేయాలి అనుకుంటే అతని హృదయమును సత్యమును స్వీకరించటం నుండి కుదింపజేస్తా డు. ఆకాశము వైపునకు ఎక్కటం అతనికి సాధ్యం కాని విధంగా సత్యం అతని హృదయంలో ప్రవేశించటం నుండి ఆగిపోతుంది. మరియు అదేవిధంగా అల్లా హ్ మార్గభ్రష్టు ని స్థితిని కఠినంగా బిగుతుగా ఉన్న ఈస్థితికి గురిచేస్తా డు. ఆయనను విశ్వసించని వారిపై శిక్షను కురిపిస్తా డు

وَهَـٰذَا صِرَٰطُ رَبِّكَ مُسْتَقِيمًۭا ۗ قَدْ فَصَّلْنَا ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍۢ يَذَّكَّرُونَ ﴿١٢٦﴾

ఓ ప్రవక్తా మేము మీ కోసం నిర్దేశించిన ఈ ధర్మము ఎటువంటి వంకరతనం లేకుండా ఉన్న అల్లా హ్ మార్గము. గుర్తుంచుకునే,అర్ధం చేసుకునే గుణం ఉండి అల్లా హ్ నుండి గుర్తుంచుకునే వారి కోసం మేము ఆయతులను విడమరచి తెలిపాము

۞ لَهُمْ دَارُ ٱلسَّلَـٰمِ عِندَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٢٧﴾

వారి కొరకు అన్ని చెడుల నుండి విముక్తిని పొందే ఇల్లు ఉంది. అది స్వర్గము. వారు చేస్తున్న సత్కర్మలకు ప్రతిఫలంగా అల్లాహ్ వారికి సహాయం చేసేవాడును,వారిని సమర్ధించేవాడును

وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًۭا يَـٰمَعْشَرَ ٱلْجِنِّ قَدِ ٱسْتَكْثَرْتُم مِّنَ ٱلْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَآؤُهُم مِّنَ ٱلْإِنسِ رَبَّنَا ٱسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍۢ وَبَلَغْنَآ أَجَلَنَا ٱلَّذِىٓ أَجَّلْتَ لَنَا ۚ قَالَ ٱلنَّارُ مَثْوَىٰكُمْ خَـٰلِدِينَ فِيهَآ إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌۭ ﴿١٢٨﴾

ఓ ప్రవక్తా ఒకసారి ఆ రోజును గుర్తు చేసుకోండి ఏ రోజునైతే అల్లాహ్ మానవులను,జిన్నాతులను (సఖలైన్ ను) సమీకరిస్తాడు. ఆ తరువాత వారితో అల్లా హ్ ఇలా అంటాడు: ఓ జిన్నుల వర్గీయులారా మీరు మానవులను మార్గభ్రష్టు లను చేయటంను,అల్లా హ్ మార్గము నుంచి వారిని ఆపటంను ఎక్కువ చేశారు. మానవుల్లోంచి వారిని అనుసరించేవారు తమ ప్రభువుకు జవాబిస్తూ ఇలా అంటారు: ఓ మా ప్రభువా మాలోంచి ప్రతి ఒక్కరు తమ తోటి వారితో లబ్ది పొందారు. జిన్ను మానవుడు తనపై విధేయత చూపటాన్ని ఆస్వాదించేవాడు. మానవుడు తన కోరికలను పొంది లబ్ది పొందేవాడు. మరియు మేము నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు చేరుకున్నాము. అది ప్రళయదినము. అల్లాహ్ ఇలా అంటాడు: నరకాగ్ని మీ శాస్వత నివాసస్థలము. మీరు అందులో ఎల్లప్పుడు ఉంటారు. వారు వారి సమాధుల నుండి లేవబడటం నుండి వారు నరకమునకు చేరటం మధ్య ఏదైతే గడువు ఉన్నదో దాన్ని అల్లా హ్ తలచుకుంటే తప్ప. ఈ గడువు అల్లా హ్ వారు నరకములో శాస్వతంగా ఉండటం నుండి మినహాయించిన గడువు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు తన విధివ్రా త విషయంలో,తన నిర్వహణలో వివేకవంతుడు,తన దాసుల గురించి,వారిలో నుండి ఎవరు శిక్షకు అర్హులో తెలిసినవాడు

وَكَذَٰلِكَ نُوَلِّى بَعْضَ ٱلظَّـٰلِمِينَ بَعْضًۢا بِمَا كَانُوا۟ يَكْسِبُونَ ﴿١٢٩﴾

ఏ విధంగానైతే మేము తలబిరుసు అయిన జిన్నాతులను సన్నిహితులుగా చేస్తా మో,కొంతమంది మానవులను మార్గభ్రష్టతకు గురి చేయటానికి వారిని మేము వారి వెనుక అంటగడుతాము. అలాగే మేము వారు చేసుకున్న పాపములకు ప్రతిఫలంగా ప్రతి దుర్మార్గు నిని ఒక దుర్మార్గు నికి సన్నిహితునిగా చేస్తాము. అతడు అతనిని చెడు చేయటానికి ఉద్భోధిస్తా డు,దానిపై అతనిని ప్రేరేపిస్తా డు,అతనిని మంచి నుండి దూరం చేస్తా డు. దానిని అతని నుండి త్యజిస్తా డు

يَـٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌۭ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ ءَايَـٰتِى وَيُنذِرُونَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هَـٰذَا ۚ قَالُوا۟ شَهِدْنَا عَلَىٰٓ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا وَشَهِدُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا۟ كَـٰفِرِينَ ﴿١٣٠﴾

మరియు మేము ప్రళయదినాన వారితో అంటాము: ఓ మానవుల,జిన్నాతుల వర్గీయులారా ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన వారు మానవుల్లోంచి అయి ఉంటారు. అల్లా హ్ వారిపై అవతరింపజేసిన వాటిని మీకు చదివి వినిపిస్తా రు. ప్రళయదినమైన మీ ఈ రోజును పొందటం గురించి వారు మిమ్మల్ని بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ భయపెడుతారు వారు ప్రవక్తలుగా రాలేదా?. అప్పుడు వారు సమాధానమిస్తారు: ఎందుకు కాదు.మాకు వ్యతిరేకంగా ఈ రోజు స్వయంగా మేమే సాక్ష్యమిస్తాం ఎందుకంటే నీ ప్రవక్తలు మాకు సందేశాలను చేరవేశారు. మరియు మేము ఈ రోజును పొందటం గురించి అంగీకరించాము. కాని మేము నీ ప్రవక్తలను తిరస్కరించాము,ఈ రోజును పొందటం గురించి తిరస్కరించాము. ఈ ప్రాపంచిక జీవితం తనలో ఉన్న అలంకారాలు,అలంకరణలు,అంతమైపోయే అనుగ్రహాల ద్వారా వారిని మోసగించింది. వారందరు ఇహలోకంలో అల్లా హ్ ని,ఆయన ప్రవక్తలని తిరస్కరించే వారని తమకు వ్యతిరేకంగా స్వయంగా సాక్ష్యం పలుకుతారు. వారి ఈ సాక్ష్యము,విశ్వాసము దాని గడువు ముగియటం వలన వారికి లాభం చేకూర్చదు

ذَٰلِكَ أَن لَّمْ يَكُن رَّبُّكَ مُهْلِكَ ٱلْقُرَىٰ بِظُلْمٍۢ وَأَهْلُهَا غَـٰفِلُونَ ﴿١٣١﴾

ఈ మన్నింపు మానవులు,జిన్నాతుల వద్దకు ప్రవక్తలను పంపించటం ద్వారా ఎవరూ కూడా తన వద్దకు ఏ ప్రవక్తను పంపించబడకుండా,తన వద్దకు ఏ దావత్ (పిలుపు,సందేశము) చేరకుండా ఉన్న స్థితిలో శిక్షింపబడకుండా ఉండటానికి. జాతుల్లోంచి ఏ జాతిని మేము వారి వద్దకు ప్రవక్తలను పంపించిన తరువాతే శిక్షిస్తా ము

وَلِكُلٍّۢ دَرَجَـٰتٌۭ مِّمَّا عَمِلُوا۟ ۚ وَمَا رَبُّكَ بِغَـٰفِلٍ عَمَّا يَعْمَلُونَ ﴿١٣٢﴾

వారిలోంచి ప్రతి ఒక్కరిని వారి ఆచరణలను బట్టి అంతస్తులు (స్థానాలు) ఉంటాయి. అయితే ఎక్కువ చెడులు కలవాడు,తక్కువ చెడులు కలవాడు సమానులు కారు. అనుసరించేవాడు అనుసరించబడినవాడు సమానులు కారు. అదే విధంగా సత్కర్మలు చేసేవారి యొక్క పుణ్యం సమానం కాదు. నీ ప్రభువు వారు చేస్తు న్నకర్మల నుండి నిర్లక్ష్యం వహించేవాడు కాడు. కాని ఆయన వాటి గురించి తెలుసుకునే వాడు. వాటిలోంచి ఏది ఆయనకు గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వారికర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తా డు

وَرَبُّكَ ٱلْغَنِىُّ ذُو ٱلرَّحْمَةِ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنۢ بَعْدِكُم مَّا يَشَآءُ كَمَآ أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ ءَاخَرِينَ ﴿١٣٣﴾

ఓ ప్రవక్తా మీ ప్రభువు,ఆయన తన దాసుల నుండి ఎటువంటి అక్కర లేనివాడు. ఆయనకి వారి అవసరం లేదు,వారి ఆరాధనల అవసరం లేదు. వారి తిరస్కారము ఆయనకు నష్టం కలిగించదు. వారి నుండి ఆయనకి అక్కర లేకపోవటంతోపాటు ఆయన వారిపై కరుణ కలవాడు. ఓ అవిధేయ దాసుల్లా రా ఒక వేళ ఆయన మిమ్మల్ని హతమార్చాలనుకుంటే తన వద్ద ఉన్న శిక్ష ద్వారా మీమ్మల్ని కూకటివ్రేళ్ళతో పెకిలించివేస్తా డు. మీ కన్న మునుపు వేరే జాతి వారి వంశము నుండి మిమ్మల్ని ఆయన పుట్టించినట్లే మిమ్మల్ని హతమార్చిన తరువాత తనను విశ్వసించే వారిలోంచి,తనపై విధేయత చూపే వారిలోంచి తాను కోరుకున్న వారిని తీసుకుని వస్తా డు

إِنَّ مَا تُوعَدُونَ لَـَٔاتٍۢ ۖ وَمَآ أَنتُم بِمُعْجِزِينَ ﴿١٣٤﴾

ఓ విశ్వాసపరులారా మీతో వాగ్ధా నం చేయబడిన మరణాంతరంలేపబడటం,మరలించబడటం,లెక్కతీసుకోవటం,శిక్షించటం జరగటం అనివార్యము. మీరు పారిపోయి మీ ప్రభువు నుండి తప్పించుకోలేరు. ఆయన మీ నుదుట్లను పట్టు కుంటాడు,తన శిక్ష ద్వారా మిమ్మల్ని శిక్షిస్తా డు

قُلْ يَـٰقَوْمِ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّى عَامِلٌۭ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُۥ عَـٰقِبَةُ ٱلدَّارِ ۗ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ ﴿١٣٥﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: ఓ నా జాతివారా మీ పద్దతిని మీరు పాటిస్తూ ఉండండి,మీరు దేని పైనైతే ఉన్నారో అవిశ్వాసం,మార్గభ్రష్టతను పాటించండి. నేను మన్నింపు వైఖరిని అవలంబించాను,స్పష్టమైన సందేశముతో నేను మీపై వాదనను ఉంచాను. మీ అవిశ్వాసము,సన్మార్గమును తప్పి పోవటంను నేను పట్టించుకోను. కాని నేను దేనిపైనైతే ఉన్నానో సత్యము పై నిలకడ చూపుతాను. ఇహలోకంలో సహాయం ఎవరి కొరకు ఉంటుందో,ఎవరు భూమిని వారసత్వంగా పొందుతారో,పరలోక నివాసము ఎవరి కొరకో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ముష్రికులు ఇహలోకంలోను,పరలోకంలోను సాఫల్యం చెందలేరు. కాని నష్టము వారి పరిణామము అవుతుంది. ఒకవేళ మీరు లభ్ది పొందాలనుకుంటే ఇహలోకంలోనే లభ్ది పొందండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَجَعَلُوا۟ لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ ٱلْحَرْثِ وَٱلْأَنْعَـٰمِ نَصِيبًۭا فَقَالُوا۟ هَـٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَـٰذَا لِشُرَكَآئِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَآئِهِمْ فَلَا يَصِلُ إِلَى ٱللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَآئِهِمْ ۗ سَآءَ مَا يَحْكُمُونَ ﴿١٣٦﴾

అల్లాహ్ సృష్టించిన పంట పొలాల్లోంచి,పశువుల్లోంచి కొంత భాగమును అల్లాహ్ కోసం నిర్ధారించుకుని ముష్రికులు తమ తరుపు నుంచి ఆవిష్కరించుకునేవారు. అది అల్లా హ్ కొరకు అని విడ్ఢూ రంగా చెప్పేవారు. మరియు మరి కొంత భాగమును తమ విగ్రహాల కొరకు,తమ స్మారక చిహ్నాల కొరకు తమ తరుపు నుండి ఆవిష్కరించుకునేవారు. అయితే వారు తాము సాటి కల్పించుకున్న వారి కొరకు ప్రత్యేకించుకున్నది అల్లా హ్ ఖర్చు చేయమన్న పేదలకు,అగత్యపరులకు చేరేది కాదు. మరియు వారు అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకున్నది తాము సాటి కల్పించుకున్న విగ్రహాలకు చేరుతుంది. వాటి ప్రయోజనాల్లో ఖర్చు చేయబడుతుంది. వినండి వారి తీర్పు,వారి విభజన ఎంతో చెడ్డదైనది

وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍۢ مِّنَ ٱلْمُشْرِكِينَ قَتْلَ أَوْلَـٰدِهِمْ شُرَكَآؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا۟ عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَآءَ ٱللَّهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ ﴿١٣٧﴾

మరియు ఏ విధంగా ముష్రికులకు షైతాను ఈ దుర్మార్గపు తీర్పును మంచిగా చేసి చూపించాడో అలాగే చాలామంది ముష్రికులకు వారు సాటి కల్పిస్తు న్నషైతానులు అల్లాహ్ అన్యాయంగా హత్య చేయటంను నిషేదించిన ప్రాణమును హత్య చేయటంలో పడవేసి వారిని హతమార్చటం కొరకు,వారికి ఏది ధర్మమో,ఏది అధర్మమో తెలియకుండా వారి ధర్మమును సంశయాస్పదమైనదిగా చేయటానికి వారి సంతానమును పేదరికం భయంతో హతమార్చటంను మంచిదిగా చేసి చూపించారు. ఒక వేళ అల్లాహ్ వారు ఇలా చేయకూడదు అని తలచుకుంటే వారు అలా చేసేవారు కాదు. కాని ఆయన విపరీత వివేకము కొరకు దాన్నే కోరుకున్నాడు. ఓ ప్రవక్తా వారిని,అల్లా హ్ పై వారు అబధ్ధం ను అంటగట్టడంను వదిలి వేయండి. ఎందుకంటే అది మీకు ఎటువంటి నష్టం చేయదు. వారి విషయాన్ని అల్లా హ్ కు అప్పజెప్పండి

وَقَالُوا۟ هَـٰذِهِۦٓ أَنْعَـٰمٌۭ وَحَرْثٌ حِجْرٌۭ لَّا يَطْعَمُهَآ إِلَّا مَن نَّشَآءُ بِزَعْمِهِمْ وَأَنْعَـٰمٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَـٰمٌۭ لَّا يَذْكُرُونَ ٱسْمَ ٱللَّهِ عَلَيْهَا ٱفْتِرَآءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا۟ يَفْتَرُونَ ﴿١٣٨﴾

ముష్రికులు ఇలా అన్నారు: ఈ కొన్ని పశువులు,పంటపొలాలు నిషేదించబడినవి. కాని వాటి నుంచి వారు తమ తరపు నుంచి తయారు చేసుకుని విగ్రహాల సేవకులు,ఇతరులను ఎవరిని వారు కోరుకుంటే వారు తినవచ్చు. ఈ పశువులపై స్వారీ చేయటం,వాటిపై బరువులు మోయటం నిషిద్ధం. అవి బహీరహ్,సాయిబహ్,హామీ లు. ఈ పశువులను వారు జుబాహ్ చేసే సమయంలో అల్లా హ్ నామం పటించేవారు కాదు. వాటిని కేవలం తమ విగ్రహాల నామం తీసుకుని జుబాహ్ చేసేవారు. ఇదంతా అల్లాహ్ తరుపు నుండి ఆదేశం అని ఆయనపై అబద్దమును అంటగట్టేవారు. వారు అబద్దమును కల్పించుకున్నందు వల్ల అల్లా హ్ వారికి తొందరలోనే తన శిక్షకు గురిచేస్తా డు

وَقَالُوا۟ مَا فِى بُطُونِ هَـٰذِهِ ٱلْأَنْعَـٰمِ خَالِصَةٌۭ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰٓ أَزْوَٰجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةًۭ فَهُمْ فِيهِ شُرَكَآءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٌۭ ﴿١٣٩﴾

మరియు వారు అన్నారు ఈ సవాయిబ్,బహాయిర్ గర్భాల్లో ఉన్న పిండాలు ఒక వేళ అది పుట్టినప్పుడు జీవించి ఉంటే అది మన మగవారి కొరకు హలాల్ (ధర్మ సమ్మతమైనవి),మన స్త్రీల కొరకు హరామ్ (నిషిద్ధం). ఒక వేళ వాటి గర్భాలలో ఉన్నది మరణించి పుడితే మగవారికి స్తీలకి అందులో భాగముంటుంది. అల్లా హ్ తొందరలోనే వారు వారి మాటలకు ఎటువంటి శిక్షకు అర్హులో దానిని ప్రసాధిస్తా డు. నిశ్చయంగా ఆయన తన శాసనంలో,తన సృష్టి నిర్వహణలో వివేకవంతుడు,వారిగురించి తెలిసినవాడు

قَدْ خَسِرَ ٱلَّذِينَ قَتَلُوٓا۟ أَوْلَـٰدَهُمْ سَفَهًۢا بِغَيْرِ عِلْمٍۢ وَحَرَّمُوا۟ مَا رَزَقَهُمُ ٱللَّهُ ٱفْتِرَآءً عَلَى ٱللَّهِ ۚ قَدْ ضَلُّوا۟ وَمَا كَانُوا۟ مُهْتَدِينَ ﴿١٤٠﴾

తమ బుద్ది లేమి వలన,అజ్ఞానం వలన తమ సంతానమును హత్య చేసినవారు,అల్లాహ్ ప్రసాధించిన పశువులను అల్లాహ్ వైపు అబద్దమును అంటగడుతూ నిషేదించుకున్న వారు నాశనమయ్యారు. వారు సన్మార్గం నుండి దూరం అయిపోయారు,వారు సన్మార్గమును పొందలేరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

۞ وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ جَنَّـٰتٍۢ مَّعْرُوشَـٰتٍۢ وَغَيْرَ مَعْرُوشَـٰتٍۢ وَٱلنَّخْلَ وَٱلزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُۥ وَٱلزَّيْتُونَ وَٱلرُّمَّانَ مُتَشَـٰبِهًۭا وَغَيْرَ مُتَشَـٰبِهٍۢ ۚ كُلُوا۟ مِن ثَمَرِهِۦٓ إِذَآ أَثْمَرَ وَءَاتُوا۟ حَقَّهُۥ يَوْمَ حَصَادِهِۦ ۖ وَلَا تُسْرِفُوٓا۟ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْرِفِينَ ﴿١٤١﴾

మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా కాండము లేకుండా భూ ఉపరితలంపై వ్యాపించే విధంగా,కాండమును కలిగి భూమి పైకి ఉండే విధంగా తోటలను సృష్టించాడు. మరియు ఆయనే ఖర్జూ రపు చెట్లను సృష్టించినాడు. మరియు రూపములో,రుచిలో తేడాకల రకరకాల ఫలాల తోటలను సృష్టించాడు. మరియు ఆయన జైతూను (ఆలివ్),దానిమ్మ చెట్లను వాటి ఆకులు పరస్పరం పోలి ఉండినట్లు ,వాటి రూపములో,రుచిలో వేరువేరుగా ఉండేటట్లు సృష్టించాడు. ఓ ప్రజలారా అవి ఫలాలు ఇచ్చినప్పుడు వాటి ఫలాలను తినండి ,వాటిని కోసే రోజు వాటి జకాతును చెల్లించండి. తినే విషయంలో,ఖర్చు చేసే విషయంలో ధర్మ హద్దులను దాటకండి. మరియు అల్లాహ్ ఆ రెండిటి విషయంలో,ఇతర వాటి విషయంలో తన హద్దులను దాటేవారిని ఇష్టపడడు. కాని వారిని ద్వేషిస్తాడు. నిశ్చయంగా ఎవరైతే వాటన్నింటిని సృష్టించాడో ఆయనే వాటిని తన దాసుల కొరకు ధర్మసమ్మతం చేశాడు.అయితేو ముష్రికులు వాటిని నిషేదించుకోవటం సరికాదు

وَمِنَ ٱلْأَنْعَـٰمِ حَمُولَةًۭ وَفَرْشًۭا ۚ كُلُوا۟ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ وَلَا تَتَّبِعُوا۟ خُطُوَٰتِ ٱلشَّيْطَـٰنِ ۚ إِنَّهُۥ لَكُمْ عَدُوٌّۭ مُّبِينٌۭ ﴿١٤٢﴾

మరియు ఆయనే మీ కొరకు పశువుల్లోంచి ఏవైతే బరువు మోయటం,స్వారీ చేయటం కొరకు అనుకూలమైనవో ఉదాహరణకు ఒంటెలు లాంటి వాటిని,బరువు మోయటం స్వారీ చేయటం కొరకు అనుకూలం కానివి చిన్న ఒంటెలు,మేకల్లాంటి వాటిని సృష్టించాడు. ఓ ప్రజలారా మీకు అల్లాహ్ ప్రసాధించినటువంటి వాటిలోంచి ఏవైతే మీ కొరకు ధర్మ సమ్మతం చేశాడో వాటిని తినండి. మరియు అల్లాహ్ నిషేధించిన వాటిని (హరాం చేసిన) ధర్మసమ్మతం(హలాల్) చేసుకోవటంలో,అల్లా హ్ ధర్మ సమ్మతం చేసిన వాటిని నిషేదించుకోవటంలో ఏ విధంగానైతే ముష్రికులు చేశారో అలా చేసి షైతాను అడుగుజాడలో నడవకండి. ఓ ప్రజలార నిశ్చయంగా షైతాను బహిరంగ శతృవు ఏ విధంగానంటే అతడు దీని ద్వారా మీరు అల్లా హ్ కు అవిధేయత పడాలని ఆశిస్తు న్నాడు

ثَمَـٰنِيَةَ أَزْوَٰجٍۢ ۖ مِّنَ ٱلضَّأْنِ ٱثْنَيْنِ وَمِنَ ٱلْمَعْزِ ٱثْنَيْنِ ۗ قُلْ ءَآلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ ٱلْأُنثَيَيْنِ أَمَّا ٱشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ ٱلْأُنثَيَيْنِ ۖ نَبِّـُٔونِى بِعِلْمٍ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿١٤٣﴾

మీ కొరకు ఆయన ఎనిమిది రకాల జంతువులను సృష్టించాడు. గొర్రెల్లోంచి రెండు ఆడ,మగ మరియు మేకల్లోంచి రెండు ఆడ,మగ. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి: ఏమిటి అల్లాహ్ ఆ రెండిటిలోంచి మగవి కావటం వలన రెండు మగ జంతువులను నిషేదించాడా ? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో మీరు అనండి: అలాగైతే మీరు ఆడ జంతువులను ఎందుకు నిషేదించుకున్నారు?. లేదా ఆయన ఆడ జంతువులు కావటం వలన రెండు ఆడ జంతువులను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి: ఎందుకు మీరు రెండు మగ జంతువులను నిషేదించుకుంటున్నారు? లేదా అతడు గర్భంలో ఉన్న పిండంకావటం వలన రెండు ఆడ జంతువుల గర్భంలో ఉన్న పిండాలను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి: ఎందుకు మీరు తల్లి గర్భంలో ఉన్న పిండముల మధ్య వాటి మగ జంతువులను ఒక సారి నిషేదించుకుని,వాటి ఆడ జంతువులను ఒక సారి నిషేదించుకుని తేడా చూపుతున్నారు. ఓ ముష్రికులారా నాకు సమాధానమివ్వండి మీరు దేనిని ఆధారంగా తీసుకున్నారో అది సత్య జ్ఞానములోంచిదా ఈ నిషేదము అల్లాహ్ తరపు నుంచి అన్న దానిలో మీరు చేస్తున్న వాదన విషయంలో మీరు సత్యవంతులే నైతే (నాకు సమాధానమివ్వండి)

وَمِنَ ٱلْإِبِلِ ٱثْنَيْنِ وَمِنَ ٱلْبَقَرِ ٱثْنَيْنِ ۗ قُلْ ءَآلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ ٱلْأُنثَيَيْنِ أَمَّا ٱشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ ٱلْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَآءَ إِذْ وَصَّىٰكُمُ ٱللَّهُ بِهَـٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًۭا لِّيُضِلَّ ٱلنَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿١٤٤﴾

ه ى ه ఎనిమిది రకాల్లో మిగతావి అవి ఒంటెలలోంచి రెండు,ఆవుల్లోంచి రెండు.ఓ ప్రవక్తా మీరు ముష్రికులతో ఇలా తెలపండి: వాటిలోంచి మగ జంతువు కావటం వలన లేదా ఆడ జంతువు కావటం వలన లేదా తల్లి గర్భంలో ఉన్న పిండం కావటం వలన నిషేంచుకోబడినవి అల్లాహ్ నిషేదించాడా?లేదా ఓ ముష్రికులారా మీ ఆలోచనాపరంగా ఈ పశువుల నుండి మీరు ఏవైతే నిషేదించుకున్నారో ఆ నిషేదం గురించి అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరు అక్కడ ఉన్నారా?. ఎటువంటి ఆధారము,జ్ఞానము లేకుండా ప్రజలను సన్మార్గము నుండి మరల్చటం కొరకు అల్లా హ్ పై అబద్దమును అంటగట్టి ఆయన నిషేధించని వాటిని ఆయన నిషేధించినట్లు ఆయన వైపునకు మరల్చే వాడి కంటే పెద్ద దుర్మార్గు డు,పాపాత్ముడు ఇంకొకడుండడు. నిశ్చయంగా అల్లా హ్ పై بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ అబద్దమును అంటగట్టటం వలన దుర్మార్గు లకు అల్లా హ్ సన్మార్గము పొందే సౌభాగ్యమును కలిగించడు

قُل لَّآ أَجِدُ فِى مَآ أُوحِىَ إِلَىَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍۢ يَطْعَمُهُۥٓ إِلَّآ أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًۭا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍۢ فَإِنَّهُۥ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ ٱللَّهِ بِهِۦ ۚ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍۢ وَلَا عَادٍۢ فَإِنَّ رَبَّكَ غَفُورٌۭ رَّحِيمٌۭ ﴿١٤٥﴾

ఓ ప్రవక్తా మీరు తెలియజేయండి: అల్లాహ్ నా వైపునకు వహీ ద్వారా తెలిపిన వాటిలో (నిషేధించబడినవిగా) జుబాహ్ చేయకుండా చనిపోయిన జంతువును లేదా ప్రవహించే రక్తం ను లేదా పంది మాంసమును ఎందుకంటే అది అశుద్ధమైనది నిషేదించడినది లేదా అల్లా హ్ నామం కాకుండా ఇతరుల నామం తీసుకుని జుబాహ్ చేయబడినవి. ఉదాహరణకి వారి విగ్రహాల పేరుతో జుబాహ్ చేయబడినది నిషేదించబడినవిగా నేను పొందాను. ఎవరికైనను ఈ నిషేదాలను ఆకలి తీవ్రత వలన తినటం అత్యవసరం అయితే వాటిని తినటంలో రుచిని ఆస్వాధించే ఉద్దేశం లేకుండా, అవసరాన్ని మించకుండా తినటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఓ ప్రవక్తా గత్యంతరం లేని వాడు ఒక వేళ అందులోంచి తింటే నిశ్చయంగా మీ ప్రభువు అతనిని క్షమించే వాడును.అతనిపై కరుణించేవాడును

وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا كُلَّ ذِى ظُفُرٍۢ ۖ وَمِنَ ٱلْبَقَرِ وَٱلْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَآ أَوِ ٱلْحَوَايَآ أَوْ مَا ٱخْتَلَطَ بِعَظْمٍۢ ۚ ذَٰلِكَ جَزَيْنَـٰهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَـٰدِقُونَ ﴿١٤٦﴾

మరియు మేము వ్రేళ్ళు విడిగా లేని ఒంటెలు,నిప్పుకోళ్ళు లాంటి వాటిని యూదులపై నిషేదించాము. మరియు ఆవులు,మేకల వీపులకు తగిలిన,వాటి పేగులకు తగిలిన,ప్రక్కటెముకులకు తగిలిన క్రొవ్వు తప్ప ఇతర క్రొవ్వును మేము నిషేదించాము. వారు తమపై వాటిని నిషేదించుకుని దుర్మార్గముకు పాల్పడినందుకు మేము వారికి ప్రతిఫలాన్ని ప్రసాధించాము. నిశ్చయంగా మేము చెప్పే మాటలన్నింటిలో సత్యవంతులము

فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍۢ وَٰسِعَةٍۢ وَلَا يُرَدُّ بَأْسُهُۥ عَنِ ٱلْقَوْمِ ٱلْمُجْرِمِينَ ﴿١٤٧﴾

ఓ ప్రవక్తా వారు ఒక వేళ మిమ్మల్ని తిరస్కరిస్తే, మీ ప్రభువువద్ద నుంచి మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించకపోతే వారిని ప్రో త్సహించటానికి ఇలా చెప్పండి: మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యము కలవాడు. మీకు గడువివ్వటం,మీపై శిక్షను కురిపించటంలో తొందర చేయకపోవటం మీపై ఆయన కారుణ్యమే. మీరు (ఓ ప్రవక్తా) వారిని హెచ్చరిస్తూ ఇలా అనండి: నిశ్చయంగా పాపాలకు పాల్పడే,అవిధేయతకు పాల్పడే జాతి వారి పైనుండి తొలగించబడదు

سَيَقُولُ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَآ أَشْرَكْنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَىْءٍۢ ۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا۟ بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍۢ فَتُخْرِجُوهُ لَنَآ ۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ ﴿١٤٨﴾

ى ముష్రికులు అల్లా హ్ తోపాటు వారి సాటి కల్పించటం సరైనదనటంపై అల్లా హ్ చిత్తము,ఆయన తఖ్దీరు ద్వారా వాదిస్తూ తొందరలోనే ఇలా అంటారు: ఒక వేళ అల్లాహ్ మేము సాటి కల్పించ కూడదని,మరియు మా తాత ముత్తాతలు సాటి కల్పించ కూడదని అనుకుంటే మేము ఆయన తోపాటు సాటి కల్పించేవారము కాదు. ఒక వేళ అల్లా హ్ మేము మాపై నిషేదించుకున్న వాటిని నిషేదించుకో కూడదని అనుకుంటే మేము వాటిని నిషేదించుకునే వారము కాదు. వారి నిరాకరించిన వాదన వలె వారికన్న మునుపు వారు తమ ప్రవక్తలను ఇలా తెలుపుతూ తిరస్కరించారు: ఒక వేళ మేము వారిని తిరస్కరించ కూడదని అల్లా హ్ అనుకుంటే మేము వారిని తిరస్కరించే వాళ్ళము కాదు. మేము వారిపై కురిపించిన శిక్షను రుచి చూసే వరకు వారు ఈ తిరస్కరణను కొనసాగించారు. ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: మీరు అల్లా హ్ తోపాటు సాటి కల్పించటాన్ని,ఆయన హరామ్ చేసిన వాటిని మీరు హలాల్ చేసుకోవటాన్ని,ఆయన హలాల్ చేసిన వాటిని మీరు హరామ్ చేసుకోవటాన్ని ఆయన మీతో ప్రసన్నుడైనట్లు నిరూపించే ఏదైన ఆధారం మీ వద్ద ఉన్నదా ?. అది (హలాల్,హరామ్ ) మీ ద్వారా జరగటం ఆయన మీ నుండి ప్రసన్నుడైనట్లు ఆధారం కాదు. మీరు ఈ విషయంలో కేవలం ఊహలను అనుసరిస్తు న్నారు. నిశ్చయంగా ఊహ సత్యం విషయంలో దేనికి పనికి రాదు.మరియు మీరు కేవలం తిరస్కరిస్తు న్నారు

قُلْ فَلِلَّهِ ٱلْحُجَّةُ ٱلْبَـٰلِغَةُ ۖ فَلَوْ شَآءَ لَهَدَىٰكُمْ أَجْمَعِينَ ﴿١٤٩﴾

ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలియ పరచండి: మీకు ఈ బలహీన వాదనలు తప్ప వేరే వాదనలు లేవు. నిశ్చయంగా అల్లా హ్ కొరకు పరిపూర్ణవాదన కలదు. మీరు ప్రవేశపెట్టే వంకలు దాని ముందట సమాప్తమైపోతాయి. మరియు దాని ద్వారా మీరు జత చేయబడిన మీ పోలిక నిర్వీర్యమైపోతుంది. ఒక بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ వేళ మీకందరికి సత్యమును అనుసరించే సౌభాగ్యమును ప్రసాధించాలని అల్లా హ్ అనుకుంటే దానిని మీకు తప్పకుండా ప్రసాధించేవాడు

قُلْ هَلُمَّ شُهَدَآءَكُمُ ٱلَّذِينَ يَشْهَدُونَ أَنَّ ٱللَّهَ حَرَّمَ هَـٰذَا ۖ فَإِن شَهِدُوا۟ فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَآءَ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ ﴿١٥٠﴾

ఓ ప్రవక్తా అల్లా హ్ హలాల్ చేసిన వాటిని హరామ్ చేసుకుని దానిని అల్లా హ్ యే హరామ్ చేశాడని వాదించే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: మీరు నిషేదించుకున్న ఈ వస్తు వులన్నింటిని అల్లా హ్ నిషేదించాడు అని సాక్షం పలకటానికి మీ సాక్షులను మీరు ప్రవేశపెట్టండి. ఒక వేళ వారు అల్లా హ్ నిషేదించాడు అనటానికి ఎటువంటి జ్ఞానం లేకుండా నిరాధారంగా సాక్షమిస్తే ఓ ప్రవక్తా మీరు వారిని వారి సాక్ష్యం విషయంలో అంగీకరించకండి. ఎందుకంటే అది అబద్ద సాక్ష్యం. తమ కోరికలను శాసించే వారి కోరికలను నీవు అనుసరించకు. ఎప్పుడైతే వారు అల్లా హ్ హలాల్ చేసిన వాటిని తమ కొరకు హరామ్ చేసుకున్నారో వారు మా ఆయతులను తిరస్కరించారు. పరలోకమును విశ్వసించని వారిని మీరు అనుసరించకండి. వారందరు తమ ప్రభువుతోపాటు వేరేవారిని సమానులుగా చేసి సాటి కల్పిస్తున్నారు. తన ప్రభువుతో ఎవరి నడవడి ఈ విధంగా ఉన్నదో అతడు ఎలా అనుసరించబడుతాడు ?

۞ قُلْ تَعَالَوْا۟ أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًۭٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًۭا ۖ وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَـٰدَكُم مِّنْ إِمْلَـٰقٍۢ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا۟ ٱلْفَوَٰحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا۟ ٱلنَّفْسَ ٱلَّتِى حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَعْقِلُونَ ﴿١٥١﴾

ఓ ప్రవక్తా మీరు ప్రజలతో ఇలా అనండి: మీరు రండి అల్లా హ్ నిషేదించిన వాటిని మీకు నేను చదివి వినిపిస్తాను. అల్లా హ్ సృష్టితాల్లోంచి దేనిని కూడా మీరు ఆయనతో పాటు సాటి కల్పించటాన్ని,మీ తల్లిదండ్రులపట్ల మీరు అవిధేయతకు పాల్పడటంను,కాని వారితో మంచిగా మెలగటం మీపై తప్పనిసరి.పేదరికం కారణం చేత మీ సంతానమును మీరు హత్య చేయటంను మీ పై నిషేదించాడు. ఏ విధంగానైతే అజ్ఞానులు చేసేవారో ఆవిధంగా. మేమే మీకు ఆహారాన్ని ప్రసాధిస్తా ము,వారికి ఆహారాన్ని ప్రసాధిస్తా ము. సిగ్గు మాలిన పనులు అవి బాహటంగా జరిగేవైనా,గుట్టు గా జరిగేవైనా వాటికి మీరు దగ్గరవటాన్ని,అల్లా హ్ దేని హత్య చేయటంను నిషేధించాడో దానిని మీరు ఆ ప్రాణమును హత్య చేయటంను మీపై నిషేధించాడు. కాని సత్యబద్ధంగా వివాహం తరువాత వ్యభిచారం చేయటం,ఇస్లాం స్వీకరించిన తరువాత ఇస్లాం నుండి మరలి పోవటం లాంటివి. మీరు అల్లాహ్ ఆదేశించిన వాటిని,ఆయన వారించిన వాటిని అర్ధం చేసుకుంటారని ఆయన ఈప్రస్తా వించిన వాటి ద్వారా మిమ్మల్ని ఆదేశిస్తు న్నాడు

وَلَا تَقْرَبُوا۟ مَالَ ٱلْيَتِيمِ إِلَّا بِٱلَّتِى هِىَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُۥ ۖ وَأَوْفُوا۟ ٱلْكَيْلَ وَٱلْمِيزَانَ بِٱلْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَٱعْدِلُوا۟ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ ٱللَّهِ أَوْفُوا۟ ۚ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ﴿١٥٢﴾

మరియు అనాధ ఎవరైతే యుక్త వయస్సుకు చేరక ముందు తన తండ్రిని కోల్పోయాడో అతని సొమ్ముకు మీరు దగ్గరవ్వటంను ఆయన (అల్లాహ్) నిషేదించాడు. కాని అతని కొరకు మేలు మరియు లాభం,అతని సంపదను అధికం చేయటం ద్వారా అతను యుక్తవయస్సుకు చేరుకుని దానిని మానవీకరణ చేసుకునేంత వరకు (అతని సంపదకు దగ్గరవ్వవచ్చు). మరియు కొలతలు వేయటంలో,తూకం వేయటంలో హెచ్చుతగ్గు లు చేయటమును ఆయన మీపై నిషేదించాడు. అంతేకాక క్రయవిక్రయ సమయంలో ఇచ్చిపుచ్చుకునే విషయంలో న్యాయపూరిత వ్యవహారము మీపై తప్పనిసరి. మేము ఏ ప్రా ణిపై శక్తికి మించిన భారము వేయము. కొలతలు వేయటంలో,ఇతర విషయాల్లో హెచ్చుతగ్గు ల నుండి జాగ్రత్త పడటం సాధ్యం కానప్పుడు దాని గురించి లెక్క తీసుకోబడదు. దగ్గర బంధువులు,స్నేహితులు కాకుండా (ఇతరుల విషయంలో) ఏదైన సమాచారం లేదా సాక్ష్యం విషయంలో తప్పు చెప్పటం మీపై నిషేదించబడింది. (అంటే ప్రతి ఒక్కరి విషయంలో న్యాయపూరితంగా వ్యవహరించండి). అల్లా హ్ యొక్క ఒప్పందం అదీ మీరు అల్లా హ్ తో చేసినదైన లేదా అల్లా హ్ మీతో చేసినదైన దానిని భంగపరచటము మీపై ఆయన నిషేధించాడు. అంతేకాదు దానిని పూర్తి చేయటం మీపై తప్పనిసరి.మీ వ్యవహారాల పర్యవసానం మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈ ముందు తెలుపబడినవి వీటి ద్వారా అల్లా హ్ మిమ్మల్ని తాకీదుగా ఆదేశించాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَنَّ هَـٰذَا صِرَٰطِى مُسْتَقِيمًۭا فَٱتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا۟ ٱلسُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِۦ ۚ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿١٥٣﴾

تتقون అప మార్గములను, దాని దారులను మీరు అనుసరించటం ఆయన మీపై నిషేదించాడు. కాని ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమైన అల్లాహ్ మార్గమును అనుసరించటం మీపై తప్పనిసరి. అప మార్గము మిమ్మల్ని విభజన వైపునకు,సత్య మార్గము నుండి దూరం చేయుటకు దారి తీస్తుంది. మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారని ఆశిస్తూ సన్మార్గమైన అల్లా హ్ మార్గమును ఈ అనుసరణ గురించే అల్లా హ్ మీకు ఆదేశిస్తు న్నాడు

ثُمَّ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ تَمَامًا عَلَى ٱلَّذِىٓ أَحْسَنَ وَتَفْصِيلًۭا لِّكُلِّ شَىْءٍۢ وَهُدًۭى وَرَحْمَةًۭ لَّعَلَّهُم بِلِقَآءِ رَبِّهِمْ يُؤْمِنُونَ ﴿١٥٤﴾

ప్రస్తావించబడిన వాటి ద్వారా సమాచారమిచ్చిన తరువాత మేము మూసాకు అనుగ్రహమును పరిపూర్ణం చేయటం కొరకు,ఆయన సత్కర్మకు ప్రతిఫలంగా,ధర్మ విషయంలో ఆయనకు అవసరమైన ప్రతి వస్తువుకు సూచనగా,సత్యమును,కారుణ్యమును,మార్గమును పొందటానికి ప్రళయదినాన తమ ప్రభువును కలవటం పై విశ్వాసమును కలిగి దాని కొరకు పుణ్య కార్యము ద్వారా సిద్ధం అవుతారని ఆశిస్తు తౌరాతును ప్రసాధించామని సమాచారమిస్తు న్నాము

وَهَـٰذَا كِتَـٰبٌ أَنزَلْنَـٰهُ مُبَارَكٌۭ فَٱتَّبِعُوهُ وَٱتَّقُوا۟ لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿١٥٥﴾

మరియు ఈ ఖుర్ఆన్ గ్రంధము దేనినైతే మేము అవతరింపజేశామో అందులో ప్రాపంచిక,ధార్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వలన ఎంతో శుభప్రదమైనది. కాబట్టి మీరు అందులో అవతరింప జేసిన వాటిని అనుసరించండి. మీరు కరుణించబడాలని ఆశిస్తూ దాని వ్యతిరేకత నుండి మీరు జాగ్రత్తపడండి

أَن تَقُولُوٓا۟ إِنَّمَآ أُنزِلَ ٱلْكِتَـٰبُ عَلَىٰ طَآئِفَتَيْنِ مِن قَبْلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمْ لَغَـٰفِلِينَ ﴿١٥٦﴾

(మేము మీపై ఖుర్ఆన్ ను మీ భాషలో అవతరింపజేశాము) ఓ అరబు ముష్రికులారా మీరు ఇలా అనకుండా ఉండటానికి: కేవలం అల్లాహ్ తౌరాతును,ఇంజీలును మాకన్న ముందు యూదులు,క్రైస్తవులపై అవతరింపజేశాడు. మన పై ఏ గ్రంధం అవతరింపజేయలేదు. మరియు మనకు వారి గ్రంధాలు చదవటం రాదు. ఎందుకంటే అవి వారి భాషలో ఉన్నవి,అవి మా భాషలో లేవు

أَوْ تَقُولُوا۟ لَوْ أَنَّآ أُنزِلَ عَلَيْنَا ٱلْكِتَـٰبُ لَكُنَّآ أَهْدَىٰ مِنْهُمْ ۚ فَقَدْ جَآءَكُم بَيِّنَةٌۭ مِّن رَّبِّكُمْ وَهُدًۭى وَرَحْمَةٌۭ ۚ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَّبَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَصَدَفَ عَنْهَا ۗ سَنَجْزِى ٱلَّذِينَ يَصْدِفُونَ عَنْ ءَايَـٰتِنَا سُوٓءَ ٱلْعَذَابِ بِمَا كَانُوا۟ يَصْدِفُونَ ﴿١٥٧﴾

ء మరియు మీరు ఇలా అనకుండా ఉండటానికి: ఒక వేళ అల్లా హ్ క్రైస్తవులు,యూదులపై గ్రంధాన్ని అవతరింప జేసినట్లు మన పై అవతరింపజేసి ఉంటే మేము వారి కన్నా ఎక్కువగా స్థిరత్వాన్ని కలిగి ఉండే వాళ్ళము. వాస్తవానికి అల్లా హ్ మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం పై మీ భాషలో అవతరింపజేసిన గ్రంధం వచ్చినది. అది స్పష్టమైన వాదన,సత్యం వైపు మార్గ దర్శకము,ఉమ్మత్ కొరకు కారుణ్యము. అయితే మీరు బలహీన సాకులు చూపకండి,తప్పుడు కారణాలు తెలపకండి. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వాడు,వాటి నుండి మరలి పోయే వాడి కన్న పెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు. మా ఆయతుల నుండి మరలి పోయే వారిని వారి మరలిపోవటంకు,వారి విముఖతకు ప్రతిఫలంగా నరకంలో ప్రవేశింపజేసి తొందరలోనే మేము కఠినంగా శిక్షిస్తా ము

هَلْ يَنظُرُونَ إِلَّآ أَن تَأْتِيَهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ أَوْ يَأْتِىَ رَبُّكَ أَوْ يَأْتِىَ بَعْضُ ءَايَـٰتِ رَبِّكَ ۗ يَوْمَ يَأْتِى بَعْضُ ءَايَـٰتِ رَبِّكَ لَا يَنفَعُ نَفْسًا إِيمَـٰنُهَا لَمْ تَكُنْ ءَامَنَتْ مِن قَبْلُ أَوْ كَسَبَتْ فِىٓ إِيمَـٰنِهَا خَيْرًۭا ۗ قُلِ ٱنتَظِرُوٓا۟ إِنَّا مُنتَظِرُونَ ﴿١٥٨﴾

ఓ ప్రవక్త సత్య తిరస్కారులు ఇహలోకంలో వారి ఆత్మలను తీసుకోవటం కొరకు మరణ దూత మరియు అతని సహాయకులు వారి వద్దకు రావాలని లేదా పరలోకంలో తీర్పు దినమున వారి మధ్య తీర్పునివ్వటం కొరకు వారి ప్రభువు రావాలని లేదా ప్రళయం గురించి సూచించే నీ ప్రభువు యొక్క కొన్ని సూచనలు రావాలని నిరీక్షిస్తు న్నారు. సూర్యుడు పడమర నుండి ఉదయించటం లాంటి నీ ప్రభువు సూచనల్లోంచి కొన్ని వచ్చిన రోజు అవిశ్వాసపరునికి بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ అతని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఎటువంటి సత్కార్యం చేయని విశ్వాసపరుని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ ముష్రికులందరితో ఇలా తెలియపరచండి: ఈ విషయాల్లోంచి దేని గురించైన మీరు నిరీక్షించండి,నిశ్చయముగా మేము నిరీక్షిస్తు న్నాము

إِنَّ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًۭا لَّسْتَ مِنْهُمْ فِى شَىْءٍ ۚ إِنَّمَآ أَمْرُهُمْ إِلَى ٱللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُوا۟ يَفْعَلُونَ ﴿١٥٩﴾

నిశ్చయంగా యూదులు,క్రైస్తవులు ధర్మములోంచి కొన్ని వాటిని తీసుకుని కొన్ని వాటిని వదిలి వేసి తమ ధర్మమును వేరు వేరు చేసుకున్నారు. వారు వేరు వేరు వర్గా లుగా అయిపోయారు. ఓ ప్రవక్త ఏ విషయంలో కూడా మీకు వారితో సంబంధం లేదు. వారు ఉన్న అపమార్గము నుండి మీరు నిర్దోషులు. కేవలం వారిని హెచ్చరించే బాధ్యత మీపై కలదు. వారి వ్యవహారం దైవాదీనమై ఉంది. ఆయన ప్రళయదినాన ఇహలోకంలో వారు చేసిన కర్మలగురించి వారికి తెలియపరుస్తా డు.ఆయన వాటి పరంగా వారికి ప్రతిఫలాన్నిప్రసాధిస్తా డు

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ ﴿١٦٠﴾

విశ్వాసపరుల్లోంచి ఎవరైన ఒక సత్కార్యమును చేసి ఉంటే అల్లా హ్ ప్రళయదినాన దానిని అతని కొరకు పది సత్కార్యాలుగా పెంచుతాడు. ఎవరన్న పాప కార్యమునకు పాల్పడితే అది చిన్నదైన, పెద్దదైన దాని ప్రకారం అతనిని శిక్షించటం జరుగుతుంది. సత్కార్యాల పుణ్యమును తగ్గించి పాప కార్యాల శిక్షను పెంచి ప్రళయదినాన వారికి అన్యాయం చేయటం జరగదు

قُلْ إِنَّنِى هَدَىٰنِى رَبِّىٓ إِلَىٰ صِرَٰطٍۢ مُّسْتَقِيمٍۢ دِينًۭا قِيَمًۭا مِّلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًۭا ۚ وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿١٦١﴾

ఓ ప్రవక్తా తిరస్కార వైఖరి కల ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: నా ప్రభువు ఒక సన్మార్గమును నాకు చూపించాడు. అది ఇహ,పరలోక ప్రయోజనాల ద్వారా స్థిరమైన ధర్మము యొక్క మార్గము. సత్యం వైపునకు మరలిన ఇబ్రాహీం యొక్క ధర్మము అది. ఆయన ఎప్పుడు కూడా ముష్రికుల్లోంచి కాలేదు

قُلْ إِنَّ صَلَاتِى وَنُسُكِى وَمَحْيَاىَ وَمَمَاتِى لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ ﴿١٦٢﴾

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి: నిశ్చయంగా నా నమాజు,నా జుబాహ్ చేయటం అల్లా హ్ కొరకే,అల్లా హ్ పేరుతోనే. ఆయన కాకుండా వేరే వారి పేరుతో కాదు. నా జీవనం,నా మరణం ప్రతి ఒక్కటి సృష్టిరాసులందరి ఏకైక ప్రభువైన అల్లా హ్ కొరకే. ఆయన కాకుండా వేరేవారికి అందులో భాగం లేదు

لَا شَرِيكَ لَهُۥ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا۠ أَوَّلُ ٱلْمُسْلِمِينَ ﴿١٦٣﴾

మరియు ఆయన పరిశుద్ధు డు. ఆయనకు ఎవరు సాటి లేరు. ఆయన కాకుండా వేరే వాడు సత్య ఆరాధ్య దైవం కాడు. షిర్కు నుండి స్వచ్ఛమైన ఈ తౌహీద్ గురించే అల్లా హ్ నాకు ఆదేశించాడు. ఆయన ఆజ్ఞా పాలన చేసే వారిలో ఈఉమ్మత్ (సమాజం) నుండి నేనొక్కడినే.ب

قُلْ أَغَيْرَ ٱللَّهِ أَبْغِى رَبًّۭا وَهُوَ رَبُّ كُلِّ شَىْءٍۢ ۚ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ إِلَّا عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌۭ وِزْرَ أُخْرَىٰ ۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ﴿١٦٤﴾

إلى ربكم مرجعكم فينبئكم بما كنتمفيه تختلفون ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి: ప్రతి వస్తు వుకు ప్రభువు అల్లా హ్ సుబహానహు వతఆలా అయినప్పటికి ఆయనను కాదని వేరే వారిని ప్రభువుగా నేను కోరుకోవాలా. మీరు ఆయనను వదిలి ఆరాధించే ఆరాధ్య దైవాలకు ప్రభువు ఆయనే. ఏ నిర్దోషి కూడా ఇతరుల పాపాల బరువును మోయడు. మరియు ప్రళయ దినాన మీ ఏకైక ప్రభువు వైపునకే మీ యొక్క మరలటం జరుగుతుంది. అప్పుడు ఆయన ధర్మ ఆదేశ విషయంలో మీరు ఇహలోకంలో విభేధించిన వాటి గురించి మీకు తెలియపరుస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَهُوَ ٱلَّذِى جَعَلَكُمْ خَلَـٰٓئِفَ ٱلْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍۢ دَرَجَـٰتٍۢ لِّيَبْلُوَكُمْ فِى مَآ ءَاتَىٰكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ ٱلْعِقَابِ وَإِنَّهُۥ لَغَفُورٌۭ رَّحِيمٌۢ ﴿١٦٥﴾

మరియు అల్లా హ్ నే భూ నిర్మాణము కొరకు (ఆబాద్ చేయటం కొరకు) మీ పూర్వీకుల తరువాత మిమ్మల్ని సృష్టించాడు. సృష్టి,ఆహారోపాధి విషయంలో ,అవే కాకుండా వేరే వాటి విషయంలో మీకు ప్రసాధించిన వాటి విషయంలో మిమ్మల్ని పరీక్షించటం కొరకు మీలో కొందరిని కొందరిపై స్థానాలను పెంపొందించాడు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శీఝ్రంగా శిక్షించే వాడు. వచ్చేది ప్రతీది కూడా దగ్గరవుతుంది. మరియు నిశ్చయంగా ఆయన తన దాసుల్లోంచి క్షమాపణకోరేవాడిని మన్నించే వాడును,కరుణించే వాడును. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-An'aam — الأنعام

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు