إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًۭا مُّبِينًۭا ﴿١﴾
ఓ ప్రవక్త నిశ్ఛయంగా మేము హుదేబియా ఒడంబడిక ద్వారా మీకు స్పష్టమైన విజయమును కలిగించాము
ముఖపేజీ›తఫ్సీర్›Al-Fath (48)
మదనీ · 29 ఆయతులు
إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًۭا مُّبِينًۭا ﴿١﴾
ఓ ప్రవక్త నిశ్ఛయంగా మేము హుదేబియా ఒడంబడిక ద్వారా మీకు స్పష్టమైన విజయమును కలిగించాము
لِّيَغْفِرَ لَكَ ٱللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنۢبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُۥ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَٰطًۭا مُّسْتَقِيمًۭا ﴿٢﴾
ఈ విజయము కన్న ముందు జరిగిన,దాని తరువాత జరిగే మీ తప్పును అల్లా హ్ మన్నించటానికి మరియు మీ ధర్మ సహాయము ద్వారా మీపై తన అనుగ్రహమును పూర్తి చేయటానికి మరియు ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు మీకు మార్గదర్శకత్వం చేయటానికి. అది తిన్నని ఇస్లాం యొక్క మార్గము
وَيَنصُرَكَ ٱللَّهُ نَصْرًا عَزِيزًا ﴿٣﴾
మరియు మీకు అల్లా హ్ మీ శతృవులకు వ్యతిరేకంగా గొప్ప సహకారమును కలిగించటానికి. దాన్ని ఎవరు అడ్డు కోలేరు
هُوَ ٱلَّذِىٓ أَنزَلَ ٱلسَّكِينَةَ فِى قُلُوبِ ٱلْمُؤْمِنِينَ لِيَزْدَادُوٓا۟ إِيمَـٰنًۭا مَّعَ إِيمَـٰنِهِمْ ۗ وَلِلَّهِ جُنُودُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًۭا ﴿٤﴾
అల్లాహ్ యే విశ్వాసపరుల హృదయములలో వారు తమ విశ్వాసముపై విశ్వాసమును అధికం చేసుకోవటానికి నిలకడను మరియు మనశ్శాంతిని అవతరింపజేశాడు. మరియు ఆకాశములలో,భూమిలో ఉన్న సైన్యములు ఒక్కడైన అల్లా హ్ వే. వాటి ద్వారా ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి మద్దతును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనముల గురించి బాగా తెలిసినవాడును మరియు తాను దేనిలోనైతే సహాయమును,మద్దతును కలిగిస్తు న్నాడో అందులో వివేకవంతుడు
لِّيُدْخِلَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ ٱللَّهِ فَوْزًا عَظِيمًۭا ﴿٥﴾
అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచే పురుషులను మరియు విశ్వాసమును కనబరిచే స్త్రీలను స్వర్గవనములలో ప్రవేశింపజేయటానికి. వాటి భవనముల మరియు చెట్ల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారి నుండి వారి పాపములను తుడిచివేయటానికి. కావున ఆయన వాటిపరంగా వారిని పట్టు కోడు. ఈ ప్రస్తా వించబడిన - ఆశించినది పొందటం అది స్వర్గము మరియు భయపడుతున్న దాని నుండి దూరమవటం అది పాపముల వలన పట్టు బడటం - అల్లా హ్ వద్ద గొప్ప సాఫల్యము దానికి సమానమైన ఎటువంటి సాఫల్యం లేదు
وَيُعَذِّبَ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْمُنَـٰفِقَـٰتِ وَٱلْمُشْرِكِينَ وَٱلْمُشْرِكَـٰتِ ٱلظَّآنِّينَ بِٱللَّهِ ظَنَّ ٱلسَّوْءِ ۚ عَلَيْهِمْ دَآئِرَةُ ٱلسَّوْءِ ۖ وَغَضِبَ ٱللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَآءَتْ مَصِيرًۭا ﴿٦﴾
మరియు కపటవిశ్వాస పరుషులను,కపటవిశ్వాస స్త్రీలను శిక్షించటానికి మరియు అల్లా హ్ తో పాటు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను, తన ధర్మమునకు సహాయము చేయడని మరియు తన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడని అల్లా హ్ పట్ల అపనమ్మకము కలిగిన వారిని శిక్షించటం కొరకు. శిక్ష యొక్క వృత్తం వారిపైనే మరలివచ్చింది. మరియు అల్లా హ్ వారి అవిశ్వాసం వలన మరియు వారి అపనమ్మకం వలన వారిపై ఆగ్రహమును చూపాడు. మరియు వారిని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు వారి కొరకు పరలోకంలో నరకము సిద్ధం చేశాడు. వారు అందులో శ్వాశ్వతంగా ఉండేటట్లు గా ప్రవేసిస్తా రు. వారు మరలి వెళ్ళే నరకము ఎంతో చెడ్డదైన నివాస స్థలము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَلِلَّهِ جُنُودُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًا ﴿٧﴾
మరియు ఆకాశముల,భూమి యొక్క సైన్యములు అల్లా హ్ వే. వాటి ద్వారా ఆయన తన దాసుల్లోంచి తలచిన వారికి మద్దతును కలిగిస్తా డు. మరియు అల్లా హ్ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తన సృష్టించటంలో,తన విధివ్రా తలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు
إِنَّآ أَرْسَلْنَـٰكَ شَـٰهِدًۭا وَمُبَشِّرًۭا وَنَذِيرًۭا ﴿٨﴾
ఓ ప్రవక్తా నిశ్చయంగా మిమ్మల్ని ప్రళయదినమున మీ జాతివారిపై సాక్ష్యమును పలికే సాక్షిగా మరియు ఇహలోకములో వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన సహాయము,సాధికారత గురించి మరియు వారి కొరకు పరలోకంలో సిద్ధపరచిన అనుగ్రహాల గురించి శుభవార్తనిచ్చేవారిగా మరియు వారి కొరకు ఇహలోకములో సిద్ధపరచిన విశ్వాసపరుల చేతుల ద్వారా అవమానము,పరాభవము గురించి మరియు పరలోకంలో వారి కొరకు సిద్ధపరచిన వారి కోసం నిరీక్షిస్తు న్నబాధాకరమైన శిక్ష గురంచి అవిశ్వాసపరులకుభయపెట్టే వారిగా మేముపంపించాము
لِّتُؤْمِنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةًۭ وَأَصِيلًا ﴿٩﴾
మీరు అల్లా హ్ పై విశ్వాసమును కనబరుస్తా రని,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తా రని మరియు మీరు ఆయన ప్రవక్తని గౌరవిస్తా రని,ఆదరిస్తా రని మరియు దినపు మొదటి,చివరి వేళల్లో అల్లా హ్ పరిశుద్ధతను కొనియాడుతారని ఆశిస్తూ
إِنَّ ٱلَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ ٱللَّهَ يَدُ ٱللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِۦ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَـٰهَدَ عَلَيْهُ ٱللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًۭا ﴿١٠﴾
ఓ ప్రవక్తా నిశ్చయంగా ముష్రికులైన మక్కా వాసులతో యుద్దం చేయటం విషయంలో మీతో బైఅతె రిజ్వాన్ శపథం చేసినవారు అల్లాహ్ తో శపథం చేసినవారు. ఎందుకంటే ఆయనే ముష్రికులతో యుద్దం చేయమని వారిని ఆదేశించాడు. మరియు ఆయనే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. శపథం సమయంలో అల్లా హ్ చేయి వారి చేతులపై ఉన్నది. మరియు ఆయన వారి గురించి తెలుసుకునేవాడు ఆయనపై వారి నుండి ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఎవరైతే తన శపథమును భంగపరచి అల్లా హ్ తో ఆయన ధర్మమునకు సహాయము చేస్తా నని చేసిన వాగ్దా నమును పూర్తి చేయలేదో నిశ్చయంగా అతని శపథమును అతను భంగపరచిన దాని నష్టము మరియు తన ప్రమాణమును భంగపరచిన దాని నష్టము అతనిపైనే మరలుతుంది. అది అల్లా హ్ కు నష్టం కలిగించదు. మరియు ఎవరైతే అల్లా హ్ తో ఆయన ధర్మమునకు సహాయం చేస్తానని చేసిన వాగ్దా నమును పూర్తి చేస్తా డో అతనికి ఆయన తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. అది స్వర్గము
سَيَقُولُ لَكَ ٱلْمُخَلَّفُونَ مِنَ ٱلْأَعْرَابِ شَغَلَتْنَآ أَمْوَٰلُنَا وَأَهْلُونَا فَٱسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِم مَّا لَيْسَ فِى قُلُوبِهِمْ ۚ قُلْ فَمَن يَمْلِكُ لَكُم مِّنَ ٱللَّهِ شَيْـًٔا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًۢا ۚ بَلْ كَانَ ٱللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًۢا ﴿١١﴾
ه ఓ ప్రవక్తా మక్క వైపు మీ ప్రయాణములో మీతో తోడుగా ఉండటం నుండి అల్లా హ్ వెనుక ఉండేటట్లు చేసిన పల్లె వాసులను మీరు మందలించినప్పుడు వారు మీతో ఇలా పలుకుతారు: మా సంపదల బాధ్యత మరియు మా సంతానము బాధ్యత మీతో పాటు ప్రయాణం చేయటం నుండి మమ్మల్ని తీరిక లేకుండా చేశాయి. కావును మీరు అల్లాహ్ తో మా పాపముల మన్నింపును వేడుకోండి. వారు తమ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో మన్నింపును వేడుకోవటమును కోరటం తమ మనసులలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. ఎందుకంటే వారు తమ పాపముల నుండి పశ్చాత్తా ప్పడలేదు. మీరు వారితో ఇలా పలకండి: ఒక వేళ అల్లా హ్ మీకు మేలు చేయదలచితే లేదా కీడు చేయదలచితే మీ కొరకు అల్లా హ్ నుండి ఎవరికీ ఏ అధికారముండదు. అంతేకాదు మీరు చేసేదంతా అల్లా హ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఒక వేళ మీరు వాటిని దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ ٱلرَّسُولُ وَٱلْمُؤْمِنُونَ إِلَىٰٓ أَهْلِيهِمْ أَبَدًۭا وَزُيِّنَ ذَٰلِكَ فِى قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ ٱلسَّوْءِ وَكُنتُمْ قَوْمًۢا بُورًۭا ﴿١٢﴾
قوما بورا ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళటం నుండి మీరు వెనుక ఉండిపోవటానికి సంపదల,సంతానముల బాధ్యత తీరికలేకండా చేయటం అని మీరు వంకపెట్టినది కారణం కాదు. కాని ప్రవక్త మరియు ఆయన సహచరులు వినాశనమునకు గురి అవుతారని మరియు వారు మదీనాలోని తమ ఇంటి వారి వైపునకు మరలిరారని మీరు భావించారు. దాన్ని షైతాను మీ హృదయములలో మంచిగా చేసి చూపించాడు. మరియు మీరు మీ ప్రభువు గురించి ఆయన తన ప్రవక్తకు సహాయం చేయడని తప్పుగా భావించారు. మరియు మీరు ఏదైతే అల్లా హ్ పట్ల చెడు ఆలోచనను కలిగి ముందడుగు వేయటం వలన మరియు ఆయన ప్రవక్త నుండి వెనుక ఉండిపోవటం వలన వినాశనమునకు గురి అయ్యే జనులైపోయారు
وَمَن لَّمْ يُؤْمِنۢ بِٱللَّهِ وَرَسُولِهِۦ فَإِنَّآ أَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ سَعِيرًۭا ﴿١٣﴾
మరియు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచనివాడు అతడు అవిశ్వాసపరుడు. నిశ్ఛయంగా వారి కొరకు ప్రళయదినమున మండే అగ్నిని సిద్ధంచేసి ఉంచాము వారు అందులో శిక్షంచబడుతారు
وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُ ۚ وَكَانَ ٱللَّهُ غَفُورًۭا رَّحِيمًۭا ﴿١٤﴾
మరియు ఆకాశముల,భూమి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తన దాసుల్లోంచు తాను తలచిన వాడి పాపములను మన్నించి తన అనుగ్రహముతో అతన్ని స్వర్గములో ప్రవేశింపజేస్తాడు. మరియు ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారిని తన న్యాయముతో శిక్షిస్తా డు. మరియు అల్లా హ్ తన దాసుల్లోంచి పశ్చాత్తా ప్పడే వారి పాపములను మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును
سَيَقُولُ ٱلْمُخَلَّفُونَ إِذَا ٱنطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَن يُبَدِّلُوا۟ كَلَـٰمَ ٱللَّهِ ۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ ٱللَّهُ مِن قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا۟ لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًۭا ﴿١٥﴾
ఓ విశ్వాసపరులారా మీరు హుదేబియా ఒప్పందము తరువాత అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన ఖైబర్ విజయధనము గురించి మీరు వాటిని తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అల్లా హ్ వెనుక ఉంచిన వారు మీతో ఇలా పలుకుతారు: మీరు మమ్మల్ని వదలండి మేము దాని నుండి మా భాగమును పొందటానికి మీతో పాటు బయలుదేరుతాము. వెనుక ఉండిపోయిన వీరందరు తమ ఈ కోరిక వలన అల్లాహ్ హుదేబియ ఒప్పందము తరువాత విశ్వాసపరులకొక్కరికే ఖైబర్ విజయ ధనమును ఇస్తా నని చేసిన వాగ్దా నమును మార్చివేయాలనుకున్నారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి: ఈ విజయ ధనము పొందటానికి మీరు మా వెంట రాకండి. నిశ్చయంగా అల్లా హ్ ఖైబర్ విజయ ధనమును ప్రత్యేకించి హుదేబియాలో హాజరు అయిన వారికి మాత్రమే ఇస్తా నని మాకు వాగ్దా నం చేశాడు. అప్పుడు వారు ఇలా సమాధానమిస్తా రు: ఖైబర్ వైపునకు మేము మీ వెంట రావటం నుండి మీరు మమ్మల్ని ఆపటం అన్నది అల్లా హ్ ఆదేశం కాదు. అది మాపై మీ అసూయ వలన. మరియు విషయం వెనుక ఉండిపోయిన వీరందరు అనుకున్నట్లు కాదు. కాని వారందరు అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన వారింపులను చాలా తక్కువగా అర్ధం చేసుకునేవారు. అందుకనే వారు ఆయనకు అవిధేయత చూపటంలో పడిపోయారు
قُل لِّلْمُخَلَّفِينَ مِنَ ٱلْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُو۟لِى بَأْسٍۢ شَدِيدٍۢ تُقَـٰتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِن تُطِيعُوا۟ يُؤْتِكُمُ ٱللَّهُ أَجْرًا حَسَنًۭا ۖ وَإِن تَتَوَلَّوْا۟ كَمَا تَوَلَّيْتُم مِّن قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًۭا ﴿١٦﴾
ఓ ప్రవక్తా మీరు మీతో పాటు మక్కాకు బయలుదేరటం నుండి వెనుక ఉండిపోయిన పల్లె వాసులతో వారికే తెలియపరుస్తూ ఇలా పలకండి: మీరు తొందరలోనే యుద్దంలో తీవ్రంగా,బలంగా పోరాడే జాతితో యుద్దం చేయటానికి పిలవబడుతారు. మీరు వారిని అల్లా హ్ మార్గంలో వదిస్తా రు లేదా వారు యుద్దం జరగకుండానే ఇస్లాంలో ప్రవేశిస్తా రు. ఒక వేళ మీరు వారితో యుద్దం విషయంలో మీరు పిలవబడిన దాని విషయంలో అల్లా హ్ కు విధేయత చూపితే ఆయన మీకు మంచి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. అది స్వర్గము. ఒక వేళ మీరు మక్కా వైపునకు ఆయనతో పాటు వెళ్ళటం నుండి వెనుక ఉండిపోయినప్పుడు విధేయత నుండి విముఖత చూపినట్లు ఆయన విధేయత నుండి విముఖత చూపితే ఆయన మీకు బాధాకరమైన శిక్షను కలిగిస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
لَّيْسَ عَلَى ٱلْأَعْمَىٰ حَرَجٌۭ وَلَا عَلَى ٱلْأَعْرَجِ حَرَجٌۭ وَلَا عَلَى ٱلْمَرِيضِ حَرَجٌۭ ۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدْخِلْهُ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًۭا ﴿١٧﴾
గుడ్డితనం లేదా, కుంటితనం లేదా ఏదైన రోగం కారణం కలిగిన వారిపై అల్లా హ్ మార్గములో యుద్ధం చేయటం నుండి వెనుక ఉండిపోయినప్పుడు పాపం లేదు. మరియు ఎవరైతే అల్లా హ్ కు విధేయత చూపుతారో,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో వారిని ఆయన స్వర్గవనములలో ప్రవేశింపజేస్తా డు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు ఎవరైతే వారిద్దరి విధేయత నుండి విమిఖత చూపుతారో వారిని అల్లా హ్ బాధాకరమైన శిక్షను విధిస్తా డు
۞ لَّقَدْ رَضِىَ ٱللَّهُ عَنِ ٱلْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ ٱلشَّجَرَةِ فَعَلِمَ مَا فِى قُلُوبِهِمْ فَأَنزَلَ ٱلسَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَـٰبَهُمْ فَتْحًۭا قَرِيبًۭا ﴿١٨﴾
فتحا قريبا వాస్తవానికి అల్లా హ్ హుదేబియాలో చెట్టు క్రింద మీతో బైఅతే రిజ్వాన్ శపథం చేసిన విశ్వాసపరుల నుండి ప్రసన్నుడయ్యాడు. అప్పుడు ఆయన వారి హృదయములలో కల విశ్వాసమును,చిత్తశుద్ధిని,నిజాయితీని తెలుసుకున్నాడు. అప్పుడు వారి హృదయములపై మనశ్శాంతిని కురిపించాడు. మరియు వారికి దానికి బదులుగా తొందరలోనే ఒక విజయమును కలిగించాడు. అది ఖైబర్ పై విజయం. వారు ఏదైతే కోల్పోయారో మక్కాలో ప్రవేశము దానికి బదులుగా (ప్రసాదించాడు)
وَمَغَانِمَ كَثِيرَةًۭ يَأْخُذُونَهَا ۗ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًۭا ﴿١٩﴾
మరియు ఆయన వారికి అధికముగా విజయధనమును ప్రసాదించాడు. వారు దాన్ని ఖైబర్ వారితో తీసుకున్నారు. మరియు అల్లా హ్ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తన సృష్టించటంలో,తన విధివ్రా తలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు
وَعَدَكُمُ ٱللَّهُ مَغَانِمَ كَثِيرَةًۭ تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَـٰذِهِۦ وَكَفَّ أَيْدِىَ ٱلنَّاسِ عَنكُمْ وَلِتَكُونَ ءَايَةًۭ لِّلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَٰطًۭا مُّسْتَقِيمًۭا ﴿٢٠﴾
ويهديكم صرطا م ستقيما ఓ విశ్వాసపరులారా అల్లా హ్ మీతో చాలా విజయధనముల గురించి మీరు వాటిని భవిష్యత్తు లో ఇస్లా మీయ విజయాల్లో పొందుతారని వాగ్దా నం చేశాడు. కాబట్టి ఆయన ఖైబర్ విజయధనములను మీ కొరకు చేశాడు. మరియు యూదుల చేతులను వారు మీ తరువాత మీ ఇంటి వారికి బాధించటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆపివేశాడు. మరియు ఈ త్వరగా లభించే విజయధనములు మీకు అల్లా హ్ సహాయము మరియు మీ కొరకు ఆయన మద్దతు పై మీకు ఒక సూచన అవటానికి. మరియు అల్లా హ్ మీకు ఎటువంటి వంకరతనము లేని తిన్నని మార్గమునకు మార్గదర్శకత్వం చేస్తా డు
وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا۟ عَلَيْهَا قَدْ أَحَاطَ ٱللَّهُ بِهَا ۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرًۭا ﴿٢١﴾
మరియు అల్లా హ్ ఈ సమయంలో మీరు సాధించని ఇతర విజయధనముల గురించి మీతో వాగ్దా నం చేస్తు న్నాడు. అల్లా హ్ ఒక్కడే వాటిపై సామర్ధ్యం కలవాడు. మరియు అది ఆయన జ్ఞానములో మరియు ఆయన పర్యాలోచనలో కలదు. మరియు అల్లా హ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీనూ అశక్తు డిని చేయదు. ي
وَلَوْ قَـٰتَلَكُمُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوَلَّوُا۟ ٱلْأَدْبَـٰرَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّۭا وَلَا نَصِيرًۭا ﴿٢٢﴾
ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను అవిశ్వసించినవారు మీతో యుద్ధము చేస్తే వారు మీ ముందు నుండి పరాభవమునకు లోనై వెనుతిరిగి పారిపోతారు. ఆ తరువాత వారు తమ వ్యవహారమును పరిరక్షించే ఎటువంటి పరిరక్షకుడిని పొందలేరు. మరయు వారు మీకు వ్యతిరేకంగా యుద్ధం చేయటంలో వారికి సహాయపడే ఎటువంటి సహాయకుడిని పొందలేరు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
سُنَّةَ ٱللَّهِ ٱلَّتِى قَدْ خَلَتْ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ ٱللَّهِ تَبْدِيلًۭا ﴿٢٣﴾
మరియు విశ్వాసపరుల విజయము మరియు అవిశ్వాసపరుల పరాజయము ప్రతీ కాలములో,ప్రతీ చోట నిరూపితమైనది. అది ఈ తిరస్కారులందరి మునుపు గతించిన సమాజములలో అల్లా హ్ సంప్రదాయము. ఓ ప్రవక్తా మీరు అల్లా హ్ సంప్రదాయములో ఎటువంటి మార్పును పొందలేరు
وَهُوَ ٱلَّذِى كَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُم بِبَطْنِ مَكَّةَ مِنۢ بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا ﴿٢٤﴾
بص يرا మరియు ఆయనే మీ నుండి ముష్రికుల చేతులను హుదేబియాలో మీకు కీడుని కలిగించే ఉద్దేశముతో వారిలోని ఎనభై మంది వచ్చినప్పుడు ఆపాడు. మరియు వారి నుండి మీ చేతులను ఆపాడు అప్పుడు మీరు వారిని హతమార్చలేదు మరియు వారిని బాధించలేదు. వారిని బందీలుగా చేసుకునే సామర్ధ్యం ఉండి కూడా మీరు వారిని విడుదల చేశారు. మరియు అల్లాహ్ మీరు చేసేవాటిని చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు
هُمُ ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوكُمْ عَنِ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ وَٱلْهَدْىَ مَعْكُوفًا أَن يَبْلُغَ مَحِلَّهُۥ ۚ وَلَوْلَا رِجَالٌۭ مُّؤْمِنُونَ وَنِسَآءٌۭ مُّؤْمِنَـٰتٌۭ لَّمْ تَعْلَمُوهُمْ أَن تَطَـُٔوهُمْ فَتُصِيبَكُم مِّنْهُم مَّعَرَّةٌۢ بِغَيْرِ عِلْمٍۢ ۖ لِّيُدْخِلَ ٱللَّهُ فِى رَحْمَتِهِۦ مَن يَشَآءُ ۚ لَوْ تَزَيَّلُوا۟ لَعَذَّبْنَا ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْهُمْ عَذَابًا أَلِيمًا ﴿٢٥﴾
వారందరే అల్లా హ్ పై మరియు ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచి,మిమ్మల్ని మస్జిదుల్ హరామ్ నుండి ఆపారు మరియు బలి పశువును దాని జుబాహ్ అయ్యే ప్రదేశమైన హరమ్ నకు చేరకుండా ఉండేటట్లు ఆపారు. మరియు ఒక వేళ అక్కడ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే పురుషులు,విశ్వాసమును కనబరిచే స్త్రీలు ఉండకుండా ఉంటే - మీరు వారిని గుర్తించకుండా ఉండి మీరు వారిని అవిశ్వాసపరులతో పాటు హతమార్చేసేవారు. వారిని మీరు మీకు తెలియకుండా హత్య చేసి ఉంటే మీకు పాపము మరియు రక్తపరిహారము కలిగి ఉండేది. కావున ఆయన మక్కా విజయము రోజు మీకు అనుమతినిచ్చాడు అల్లా హ్ మక్కాలోని విశ్వాసపరుల్లాంటి వారిలా తాను తలచిన వారిని తన కారుణ్యములో ప్రవేశింపజేస్తా డు. ఒక వేళ మక్కాలో విశ్వాసపరుల్లో నుంచి అవిశ్వాసపరులు వేరై ఉంటే అల్లా హ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచిన వారిని మేము బాధాకరమైన శిక్షకు గురి చేసేవారము
إِذْ جَعَلَ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى قُلُوبِهِمُ ٱلْحَمِيَّةَ حَمِيَّةَ ٱلْجَـٰهِلِيَّةِ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ ٱلتَّقْوَىٰ وَكَانُوٓا۟ أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمًۭا ﴿٢٦﴾
ى ه అల్లా హ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు తమ హృదయముల్లో సత్య సాక్షాత్కారానికి సంబంధం లేకుండా కేవలం మనోవంఛలతో సంబంధం కల అజ్ఞాన కాలపు అహంభావమును పెంచుకున్నప్పుడు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశమును వారు తమను ఓడించి అపనిందలు వేస్తారనే భయముతో అసహ్యించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన వద్ద నుండి మనశ్శాంతిని తన ప్రవక్తపై అవతరింపజేశాడు మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు. అయితే వారి మీద ఉన్న కోపము ముష్రికులతో పోరాటమును వారు చేసినట్లు గా కోరలేదు. మరియు అల్లా హ్ విశ్వాసపరులకి సత్య వాక్కు అది లా యిలాహ ఇల్లల్లా హ్ (అల్లా హ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేడు) ను అనివార్యము చేశాడు. మరియు వారు దానికి తగినట్లు గా స్థిరంగా ఉండాలని అనివార్యము చేశాడు. అప్పుడు వారు దానిపై స్థిరంగా ఉన్నారు. మరియు విశ్వాసపరులు ఇతరులకన్న ఈ వాక్యమునకు ఎక్కువ హక్కుదారులు. అల్లా హ్ వారి హృదయముల్లో మంచితనమును తెలుసుకున్నప్పుడు వారే దానికి అర్హతకలిగే అర్హులు. మరియు అల్లా హ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు
لَّقَدْ صَدَقَ ٱللَّهُ رَسُولَهُ ٱلرُّءْيَا بِٱلْحَقِّ ۖ لَتَدْخُلُنَّ ٱلْمَسْجِدَ ٱلْحَرَامَ إِن شَآءَ ٱللَّهُ ءَامِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمْ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَ ۖ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوا۟ فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتْحًۭا قَرِيبًا ﴿٢٧﴾
నిశ్ఛయంగా అల్లా హ్ తన ప్రవక్తకు కలను నిజం చేసి చూపించాడు. ఎప్పుడైతే ఆయన దాన్నే తన కలలో చూశారో తన సహచరులకు దాన్ని గురించి సమాచారమిచ్చారు. అదేమిటంటే నిశ్చయంగా ఆయన మరియు ఆయన అనుచరులు అల్లా హ్ పవిత్ర గృహములో తమ శతృవుల నుండి నిర్భయంగా بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ప్రవేసిస్తున్నారు. వారిలో నుండి కొందరు తమ శిరో ముండనం చేస్తున్నారు. మరియు వారిలో నుండి కొందరు ఖుర్బానీ ముగింపు గురించి ప్రకటిస్తూ వెంట్రు కలను కత్తిరిస్తు న్నారు. ఓ విశ్వాసపరులారా అల్లా హ్ మీకు తెలియని మీ ప్రయోజనంను తెలుసుకున్నాడు. కావున ఆయన ఆ సంవత్సరం మక్కాలో ప్రవేశించటం ద్వారా కల నిరూపితం కాకుండానే దగ్గరలోనే విజయమును కలిగించాడు. మరియు అది అల్లాహ్ హుదైబియా సయోధ్యను జారీచేసి, మరియు దాని వెనువెంటనే హుదైబియాలో సమావేశమైన విశ్వాసపరుల చేతులపై ఖైబర్ పై విజయంను కలిగించి
هُوَ ٱلَّذِىٓ أَرْسَلَ رَسُولَهُۥ بِٱلْهُدَىٰ وَدِينِ ٱلْحَقِّ لِيُظْهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ ۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًۭا ﴿٢٨﴾
అల్లా హ్ యే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లంను స్పష్టమైన ప్రకటన మరియు ఇస్లాం ధర్మమైన సత్య ధర్మమును ఇచ్చి దాన్ని దానికి వ్యతిరేక ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి పంపించాడు. మరియు అల్లా హ్ దానికి సాక్షి. మరియు సాక్షిగా అల్లా హ్ యే చాలు
مُّحَمَّدٌۭ رَّسُولُ ٱللَّهِ ۚ وَٱلَّذِينَ مَعَهُۥٓ أَشِدَّآءُ عَلَى ٱلْكُفَّارِ رُحَمَآءُ بَيْنَهُمْ ۖ تَرَىٰهُمْ رُكَّعًۭا سُجَّدًۭا يَبْتَغُونَ فَضْلًۭا مِّنَ ٱللَّهِ وَرِضْوَٰنًۭا ۖ سِيمَاهُمْ فِى وُجُوهِهِم مِّنْ أَثَرِ ٱلسُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِى ٱلتَّوْرَىٰةِ ۚ وَمَثَلُهُمْ فِى ٱلْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْـَٔهُۥ فَـَٔازَرَهُۥ فَٱسْتَغْلَظَ فَٱسْتَوَىٰ عَلَىٰ سُوقِهِۦ يُعْجِبُ ٱلزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ ٱلْكُفَّارَ ۗ وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِنْهُم مَّغْفِرَةًۭ وَأَجْرًا عَظِيمًۢا ﴿٢٩﴾
ى ى ى ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త మరియు ఆయన వెంట ఉన్న వారు ఆయన సహచరులు యుద్దం చేస్తూ వచ్చిన అవిశ్వాసపరులపై కఠినులు. వారు పరస్పరం దయ చూపుకుంటూ,ప్రేమా అభిమానములను చూపుకుంటూ కరుణామయులు. ఓ చూసేవాడా నీవు వారిని పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు రుకూ చేస్తుండగా,సాష్టాంగపడుతుండగా చూస్తావు. వారు అల్లాహ్ తో తమపై మన్నింపును మరియు ఉన్నతమైన పుణ్యయమును అనుగ్రహించమని మరియు తమ నుండి ప్రసన్నుడవమని కోరుతారు. వారి చిహ్నము వారి ముఖములలో సాష్టాంగపడటము వలన కలిగిన గుర్తుల నుండి ఏదైతే సన్మార్గము నుండి,దారి నుండి మరియు వారి ముఖముల్లో నమాజు కాంతి నుండి కనబడుతుంది. ఇది మూసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం తౌరాత్ వర్ణించిన లక్షణము మరియు ఈసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం ఇంజీలులో వారి పరస్పర సహాయము విషయంలో మరియు వారి పరిపూర్ణతలో వారి ఉపమానము ఒక పైరుతో పోల్చబడినది అది దాన్ని చిన్నదిగా వెలికి తీస్తుంది. ఆ తరువాత బలమువంతునిగా,గట్టిగా తయారై తన కాండములపై నిలబడుతుంది. దాని బలము మరియు దాని పరిపూర్ణత పండించేవారిని ఆనందపరుస్తుంది. అల్లా హ్ వారి ద్వారా అవిశ్వాసపరులకు వారు వారిలో ఉన్న బలము,సమన్వయము మరియు పరిపూర్నతను చూసినప్పుడు క్రోదానికి గురిచేయటానికి. మరియు అల్లా హ్ అల్లా హ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన సహచరులకు వారి పాపములు మన్నిస్తా డని మరియు వాటి వలన ఆయన వారిని శిక్షించడని మరియు గొప్ప ప్రతిఫలమైన స్వర్గము ఉన్నదని వాగ్దా నం చేశాడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు