ముఖపేజీతఫ్సీర్Al-Hujuraat (49)

తఫ్సీర్ Al-Hujuraat (49) — الحجرات

మదనీ · 18 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُقَدِّمُوا۟ بَيْنَ يَدَىِ ٱللَّهِ وَرَسُولِهِۦ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٌۭ ﴿١﴾

ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు మాట పరంగా లేదా చేత పరంగా అల్లా హ్ ను మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వినేవాడును మరియు మీ కార్యాలను తెలుసుకునేవాడును. ఆయన నుండి వాటిలో నుండి ఏదీ తప్పిపోదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తా డు

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَرْفَعُوٓا۟ أَصْوَٰتَكُمْ فَوْقَ صَوْتِ ٱلنَّبِىِّ وَلَا تَجْهَرُوا۟ لَهُۥ بِٱلْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَـٰلُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ ﴿٢﴾

أعملكم وأنتملا تشعرون ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు ఆయన ప్రవక్తతో క్రమశిక్షణతో వ్యవహరించండి. మరియు ఆయనతో మాట్లా డే సమయంలో మీరు మీ స్వరములను ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం స్వరము కన్న పెంచకండి. మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ఆయన పేరుతో ఆయనను పిలవకండి. కాని ఆయనను దైవదౌత్యముతో,సందేశహరునితో మృధువుగా పిలవండి. దాని వలన మీ కర్మల ప్రతిఫలం నిష్ఫలితం అయిపోతుందని భయముతో. మరియు దాని ప్రతిఫలం నిష్ఫలితమవుతుందని మీరు గ్రహించలేరు

إِنَّ ٱلَّذِينَ يَغُضُّونَ أَصْوَٰتَهُمْ عِندَ رَسُولِ ٱللَّهِ أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ ٱمْتَحَنَ ٱللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌۭ وَأَجْرٌ عَظِيمٌ ﴿٣﴾

నిశ్ఛయంగా ఎవరైతే తమ స్వరములను అల్లా హ్ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం వద్ద తగ్గించుకుంకుంటారో వారందరి హృదయములను అల్లా హ్ తన భీతి కొరకు పరీక్షించుకున్నాడు. మరియు వారిని దాని కొరకు ప్రత్యేకించుకున్నాడు. వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. ఆయన వారిని శిక్షించడు. మరియు వారి కొరకు ప్రళయదినమున గొప్ప ప్రతిఫలం కలదు. మరియు అది అల్లా హ్ వారిని స్వర్గములో ప్రవేశింపజేయటం

إِنَّ ٱلَّذِينَ يُنَادُونَكَ مِن وَرَآءِ ٱلْحُجُرَٰتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ ﴿٤﴾

ఓ ప్రవక్తా నిశ్ఛయంగా పల్లెవాలుల్లోంచి మిమ్మల్నిమీ సతీమణుల కుటీరాల వెనుక నుండిపిలిచే చాలామందికి బుద్ధి లేదు

وَلَوْ أَنَّهُمْ صَبَرُوا۟ حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًۭا لَّهُمْ ۚ وَٱللَّهُ غَفُورٌۭ رَّحِيمٌۭ ﴿٥﴾

ఓ ప్రవక్త ఒక వేళ మిమ్మల్ని మీ సతీమణుల కుటీరముల వెనుక నుండి పిలిచే వీరందరు మీరు వారి వద్దకు వచ్చేంతవరకు మిమ్మల్ని పిలవకుండా ఓపికపట్టి తమ స్వరములను తగ్గించి మీతో మాట్లా డి ఉంటే అది వారికి మిమ్మల్ని వాటి వెనుక నుండి పిలవటం కన్న మేలైనది అందులో ఉన్న మర్యాద మరియు గొప్పతనము వలన. మరియు అల్లా హ్ వారిలో నుండి పశ్ఛాత్తా ప్పడిన వారి మరియు ఇతరుల పాపములను మన్నించేవాడును మరియు వారి అజ్ఞా నత వలన వారికి మన్నించేవాడును, వారిపై కనికరించేవాడును

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن جَآءَكُمْ فَاسِقٌۢ بِنَبَإٍۢ فَتَبَيَّنُوٓا۟ أَن تُصِيبُوا۟ قَوْمًۢا بِجَهَـٰلَةٍۢ فَتُصْبِحُوا۟ عَلَىٰ مَا فَعَلْتُمْ نَـٰدِمِينَ ﴿٦﴾

ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా ఒక వేళ ఎవరైన పాపాత్ముడు మీ వద్దకు ఏ జాతి వారి గురించైన ఏదైన వార్తను తీసుకుని వస్తే మీరు అతని వార్త సరైనదన్న విషయాన్ని నిరూపించండి. మరియు మీరు అతన్ని నమ్మటానికి తొందరపడకండి. మీరు ఆ జాతి వారికి ఏదైన నేరము వలన వారి విషయము యొక్క వాస్తవమును తెలుసుకోకుండా బాధకు గురి చేస్తారని బయపడుతూ - మీరు అతని వార్తను సరైనదని నిరూపించకుండానే మీరు నమ్మినప్పుడు - మీరు వారిని బాధను కలిగించిన తరువాత అతని వార్త అబద్దమని మీకు స్పష్టమైనప్పుడు మీరు అవమానపాలవుతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱعْلَمُوٓا۟ أَنَّ فِيكُمْ رَسُولَ ٱللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِى كَثِيرٍۢ مِّنَ ٱلْأَمْرِ لَعَنِتُّمْ وَلَـٰكِنَّ ٱللَّهَ حَبَّبَ إِلَيْكُمُ ٱلْإِيمَـٰنَ وَزَيَّنَهُۥ فِى قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ ٱلْكُفْرَ وَٱلْفُسُوقَ وَٱلْعِصْيَانَ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلرَّٰشِدُونَ ﴿٧﴾

ఓ విశ్వాసపరులారా మీలో దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం ఉన్నారని,ఆయనపై దైవ వాణి అవతరింపబడుతున్నదని తెలుసుకోండి. కాబట్టి మీరు అబద్దము పలకటం నుండి జాగ్రత్తపడండి ఎందుకంటే ఆయనపై దైవ వాణి అవతరించి మీ అబద్దము పలకటం గురించి ఆయనకు తెలియపరుస్తుంది. మీ ప్రయోజనం ఎందులో ఉన్నదో దాని గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక వేళ మీరు ఆయనకు ప్రతిపాదించిన వాటి విషయంలో ఆయన మీ మాట వింటే ఆయన మీ కొరకు ఇష్టపడని కష్టముల్లో మీరు పడిపోతారు. కాని అల్లాహ్ తన అనుగ్రహంతో మీ కొరకు విశ్వాసమును ఇష్టపడి,దాన్ని మీ మనస్సుల్లో మంచిగా చూపిస్తే మీరు విశ్వసించారు. మరియు ఆయన మీకు అవిశ్వాసమును,ఆయన విధేయత నుండి వైదొలగిపోవటమును అసహ్యకరంగా చేశాడు. మరియు మీకు ఆయన అవిధేయతను అసహ్యకరం చేశాడు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే సన్మార్గము,ఋజు మార్గముపై నడుస్తా రు

فَضْلًۭا مِّنَ ٱللَّهِ وَنِعْمَةًۭ ۚ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌۭ ﴿٨﴾

మీ హృదయముల్లో మంచిని మెరుగు పరచటం మరియు చెడును ద్వేషించటం వంటిది మీకు కలిగినది అది అల్లా హ్ తరపు నుండి ఒక ఉపకారము. ఆయన దాని ద్వారా మీపై ఉపకారం చేశాడు. మరియు ఒక అనుగ్రహము దాన్ని మీపై అనుగ్రహించాడు. మరియు తన దాసుల్లోంచి తనకు కృతజ్ఞత తెలుపుకునే వారి గురించి అల్లా హ్ కు తెలుసు కాబట్టి ఆయన దాని భాగ్యమును కలిగిస్తా డు. మరియు విజ్ఞత కలవాడు కాబట్టే ఆయన ప్రతీ వస్తు వును దానికి తగిన ప్రదేశములో ఉంచుతాడు

وَإِن طَآئِفَتَانِ مِنَ ٱلْمُؤْمِنِينَ ٱقْتَتَلُوا۟ فَأَصْلِحُوا۟ بَيْنَهُمَا ۖ فَإِنۢ بَغَتْ إِحْدَىٰهُمَا عَلَى ٱلْأُخْرَىٰ فَقَـٰتِلُوا۟ ٱلَّتِى تَبْغِى حَتَّىٰ تَفِىٓءَ إِلَىٰٓ أَمْرِ ٱللَّهِ ۚ فَإِن فَآءَتْ فَأَصْلِحُوا۟ بَيْنَهُمَا بِٱلْعَدْلِ وَأَقْسِطُوٓا۟ ۖ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُقْسِطِينَ ﴿٩﴾

ء ه మరియు ఒక వేళ విశ్వాసపరుల్లోంచి ఏవైన రెండు వర్గములు తగువులాడితే ఓ విశ్వాసపరులారా మీరు వారికి కలిగిన విబేధములో వారిని అల్లా హ్ ధర్మ శాస్త్ర తీర్పు వైపునకు పిలిచి వారిరువురి మధ్య సయోద్య చేయండి. ఒక వేళ ఇరు వర్గముల్లోంచి ఒక వర్గము సయోద్యను నిరాకరించి మితిమీరితే మీరు మితిమీరిన వారితో వారు అల్లా హ్ తీర్పు వైపునకు మరలే వరకు యుద్ధం చేయండి. ఒక వేళ వారు అల్లా హ్ తీర్పు వైపునకు మరలితే మీరు వారి మధ్య న్యాయముతో,సరైన తీర్పుతో సయోద్యను చేయండి. మరియు మీరు వారి మధ్య మీ తీర్పులో న్యాయం చేయండి. నిశ్చయంగా అల్లా హ్ తమ తీర్పులో న్యాయంగా వ్యవహరించే వారిని ఇష్టపడుతాడు

إِنَّمَا ٱلْمُؤْمِنُونَ إِخْوَةٌۭ فَأَصْلِحُوا۟ بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿١٠﴾

వాస్తవానికి ఇస్లాంలో విశ్వాసపరులు సహోదరులు. మరియు ఇస్లాంలో సహోదరులు ఓ విశ్వాసపరులారా మీరు తగువులాడే మీ సహోదరుల మధ్య సయోద్యచేయాలి. మరియు మీరు అల్లాహ్ కి ఆయన ఆదేశములు పాటించి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి మీరు దయ చూపబడుతారని ఆశిస్తూ భయపడుతూ ఉండండి

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا يَسْخَرْ قَوْمٌۭ مِّن قَوْمٍ عَسَىٰٓ أَن يَكُونُوا۟ خَيْرًۭا مِّنْهُمْ وَلَا نِسَآءٌۭ مِّن نِّسَآءٍ عَسَىٰٓ أَن يَكُنَّ خَيْرًۭا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوٓا۟ أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا۟ بِٱلْأَلْقَـٰبِ ۖ بِئْسَ ٱلِٱسْمُ ٱلْفُسُوقُ بَعْدَ ٱلْإِيمَـٰنِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ ﴿١١﴾

ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీలో నుండి ఒక వర్గము ఇంకొక వర్గముని ఎగతాళి చేయకండి. బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లా హ్ వద్ద గొప్పవారు కావచ్చు. అల్లా హ్ వద్ద ఉన్నదాని ద్వారా గుణపాఠం ఉన్నది. మరియు స్త్రీల్లోంచి కొందరు ఇంకొందరి స్త్రీలను ఎగతాళి చేయకూడదు బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లాహ్ వద్ద గొప్పవారు కావచ్చు. మరియు మీరు మీ సహోదరులను నిందించకండి వారు మీలాంటి వారే. మరియు మీరు ద్వేషించుకునే మారు పేరుతో ఏ విధంగానైతే దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం రాక మునుపు కొందరి అన్సారుల స్థితి ఉండేదో ఆ విధంగా ఒకరినొకరు పిలుచుకోకండి. మీలో నుండి ఎవరైతే ఇలా చేస్తా రో వారు పాపాత్ములు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ విశ్వాసము తరువాత పాప గుణము ఎంతో చెడ్డదైన గుణము. మరియు ఎవరైతే ఈ పాప కార్యముల నుండి పశ్ఛాత్తా ప్పడరో వారందరు తాము పాల్పడిన పాప కార్యముల వలన వినాశన స్థా నములకు చేరి తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడినవారు

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱجْتَنِبُوا۟ كَثِيرًۭا مِّنَ ٱلظَّنِّ إِنَّ بَعْضَ ٱلظَّنِّ إِثْمٌۭ ۖ وَلَا تَجَسَّسُوا۟ وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًۭا فَكَرِهْتُمُوهُ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ تَوَّابٌۭ رَّحِيمٌۭ ﴿١٢﴾

ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు తగిన కారణాలు మరియు ఆధారాలు లేని అనేక ఆరోపణల నుండి దూరంగా ఉండండి. నిశ్చయంగా కొన్ని అనుమానాలు బాహ్యంగా ప్రయోజనం కలిగించేవాడి విషయంలో దురాలోచన లాంటివి పాపములవుతాయి. మరియు మీరు విశ్వాసపరుల రహస్యాలను వారి చాటునుండి తెలుసుకోవటానికి అనుసరించకండి. మరియు మీలో నుండి ఏ ఒక్కరు కూడా తన సోదరుడు ఇష్టపడని వాటి గురించి చర్చించకండి. ఎందుకంటే అతడు ఇష్టపడని దాని గురించి చర్చించటం అతని మృత శరీరం నుండి మాంసమును తిన్నట్లే. ఏమి మీ లో నుండి ఎవరైన తన సోదరుని మృత శరీరము నుండి మాంసమును తినటం ఇష్టపడుతాడా ?. మీరు ఇష్టపడరు అతని చాడీలు చెప్పటము దాని లాంటిదే. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లా హ్ తన దాసుల్లోంచి పశ్చాత్తా ప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّا خَلَقْنَـٰكُم مِّن ذَكَرٍۢ وَأُنثَىٰ وَجَعَلْنَـٰكُمْ شُعُوبًۭا وَقَبَآئِلَ لِتَعَارَفُوٓا۟ ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ ٱللَّهِ أَتْقَىٰكُمْ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۭ ﴿١٣﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మీ తండ్రి అయిన ఆదమ్ మరియి ఒకే స్త్రీ మీ తల్లి అయిన హవ్వాతో సృష్టించాము. కావున మీ వంశము ఒక్కటే. కాబట్టి మీరు వంశం విషయంలో ఒకరిపై ఒకరు గర్వించకండి. మరియు మేము దాని తరువాత మిమ్మల్ని చాలా వర్గములుగా మరియు విస్తరించిన తెగలుగా చేశాము మీరు ఒకరినొకరు గుర్తించుకోవటానికి దానిపై గర్వించటానికి కాదు. ఎందుకంటే వ్యత్యాసం అనేది దైవభీతి పరంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన (అల్లా హ్) ఇలా పలికాడు: నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి కలవాడే అల్లా హ్ వద్ద మీలో ఎక్కువ గౌరవం కలవాడు. నిశ్చయంగా అల్లా హ్ మీ పరిస్థితుల గురించి తెలిసినవాడు, మీలో ఉన్న పరిపూర్ణతను,లోపమను తెలుసుకునేవాడు. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

۞ قَالَتِ ٱلْأَعْرَابُ ءَامَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا۟ وَلَـٰكِن قُولُوٓا۟ أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ ٱلْإِيمَـٰنُ فِى قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥ لَا يَلِتْكُم مِّنْ أَعْمَـٰلِكُمْ شَيْـًٔا ۚ إِنَّ ٱللَّهَ غَفُورٌۭ رَّحِيمٌ ﴿١٤﴾

కొందరు పల్లెవాసులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ఇలా పలికారు: మేము అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచాము. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి: మీరు విశ్వసించ లేదు, కాని మీరు మేము విధేయులయ్యాము మరియు కట్టు బడి ఉన్నాము అని పలకండి. మీ హృదయముల్లో ఇంకా విశ్వాసము ప్రవేశించలేదు. మరియు అది వాటిలో ప్రవేశిస్తుందని ఆశించవచ్చు. ఓ పల్లెవాసుల్లా రా ఒక వేళ మీరు విశ్వసించే విషయంలో,సత్కర్మలు చేయటంలో,నిషిద్దతాల నుండి దూరంగా ఉండటంలో అల్లా హ్ ను,ఆయన ప్రవక్తను అనుసరిస్తే అల్లా హ్ మీ కర్మల ప్రతిఫలము నుండి ఏమాత్రం మీకు తగ్గించడు. నిశ్ఛయంగా అల్లా హ్ తన దాసుల్లోంచి పశ్ఛచత్తా ప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కనికరించేవాడును

إِنَّمَا ٱلْمُؤْمِنُونَ ٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ لَمْ يَرْتَابُوا۟ وَجَـٰهَدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ فِى سَبِيلِ ٱللَّهِ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ ﴿١٥﴾

వాస్తవానికి విశ్వాసపరులు వారే ఎవరైతే అల్లా హ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి ఆ తరువాత వారి విశ్వాసమునకు ఎటువంటి సందేహము కలవలేదో మరియు వారు అల్లా హ్ మార్గములో తమ సిరిసంపదలతో,తమ ప్రా ణములతో పోరాడి వాటిలో కొంచము కూడా పిసినారితనము చూపరో వారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే తమ విశ్వాసములో సత్యవంతులు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قُلْ أَتُعَلِّمُونَ ٱللَّهَ بِدِينِكُمْ وَٱللَّهُ يَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمٌۭ ﴿١٦﴾

ఓ ప్రవక్తా మీరు ఈ పల్లె వాసులందరితో ఇలా పలకండి: ఏమీ మీరు అల్లా హ్ కు మీ ధార్మికత గురించి తెలియపరుస్తు న్నారా,జ్ఞా నోదయం చేస్తు న్నారా ?! వాస్తవానికి ఆకాశముల్లో ఏమున్నదో,భూమిలో ఏమున్నదో అల్లా హ్ కు తెలుసు. మరియు అల్లా హ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మీ ధార్మికత గురించి మీరు ఆయనకు తెలియపరచవలసిన అవసరం లేదు

يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا۟ ۖ قُل لَّا تَمُنُّوا۟ عَلَىَّ إِسْلَـٰمَكُم ۖ بَلِ ٱللَّهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَىٰكُمْ لِلْإِيمَـٰنِ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿١٧﴾

ఓ ప్రవక్త ఈ పల్లెవాసులందరు తమ ఇస్లా మును స్వీకరించటమును మీ పై ఉపకారము చేసినట్లు చూపుతున్నారు. మీరు వారితో ఇలా పలకండి: అల్లా హ్ ధర్మములో మీరు ప్రవేశించటమును నా పై ఉపకారము చేసినట్లు చెప్పకండి. దాని ప్రయోజనము ఒక వేళ కలిగితే అది మీపైనే మరలుతుంది. కానీ అల్లాహ్ ఆయనే మీకు ఆయనపై విశ్వాసమును కనబరచే భాగ్యమును కలిగించి మీపై ఉపకారం చేశాడు ఒక వేళ మీరు అందులో ప్రవేశించారని మీ వాదనలో సత్యవంతులే అయితే

إِنَّ ٱللَّهَ يَعْلَمُ غَيْبَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا تَعْمَلُونَ ﴿١٨﴾

నిశ్ఛయంగా ఆకాశముల యొక్క అగోచర విషయముల గురించి అల్లా హ్ కు తెలుసు మరియు ఆయనకు భూమి యొక్క అగోచర విషయముల గురించి తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పుణ్య కార్యాలపై మరియు దుష్కార్యాలపై మీకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Hujuraat — الحجرات

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు