ముఖపేజీతఫ్సీర్Faatir (35)

తఫ్సీర్ Faatir (35) — فاطر

మక్కీ · 45 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

ٱلْحَمْدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ جَاعِلِ ٱلْمَلَـٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍۢ مَّثْنَىٰ وَثُلَـٰثَ وَرُبَـٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ ﴿١﴾

ى పొగడ్తలన్నీ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించినవాడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దైవదూతలను సందేశాలను చేరవేసేవానిగా చేశాడు వారు ఆయన విధి ఆదేశాలను నిర్వర్తిస్తుంటారు మరియు వారిలో నుండి దైవప్రవక్తలకు దైవ వాణిని చేరవేసేవారు ఉన్నారు. మరియు ఆయన వారికి ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటంపై బలమును చేకూర్చాడు. అయితే వారిలో నుండి కొందరు రెండు రెక్కల వారు,మూడు రెక్కల వారు,నాలుగు రెక్కల వారు ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను నిర్వర్తించటానికి వారు వాటి ద్వారా ఎగురుతారు. అల్లా హ్ సృష్టి లో నుండి ఎవరికి తలచుకుంటే వారికి అవయములను గాని అందమును గాని స్వరమును గాని అధికం చేస్తా డు. నిశ్చయంగా అల్లా హ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తు డిని చేయదు

مَّا يَفْتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍۢ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُۥ مِنۢ بَعْدِهِۦ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٢﴾

నిశ్చయంగా ప్రతీ వస్తు వు యొక్క తాళములు అల్లా హ్ చేతిలో ఉన్నవి. అయితే ఆయన ప్రజల కొరకు ఆహారోపాధిని,సన్మార్గమును,ఆనందమును తెరిస్తే ఎవరూ దాన్ని ఆపలేరు. మరియు వాటిలో నుండి ఆయన దేన్ని ఆపినా, ఆపిన తరువాత దాన్ని ఎవడూ పంపించలేడు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వశక్తిమంతుడు, తన సృష్టించటంలో,తన విధి వ్రా తలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱذْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَـٰلِقٍ غَيْرُ ٱللَّهِ يَرْزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۚ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ ﴿٣﴾

فأ نى تؤفكون ఓ ప్రజలారా మీరు మీపై ఉన్నఅనుగ్రహములైన మీ హృదయములను,మీ నాలుకలను,మీ పనిచేసే మీ అవయవాలను గుర్తు చేసుకోండి. ఏమీ మీ కొరకు అల్లా హ్ ను వదిలి ఆకాశము నుండి మీపై వర్షం కురిపించటం ద్వారా మీకు ఆహారోపాధిని ప్రసాదించే మరియు భూమి నుండి ఫలములను,పంటలను మొలకెత్తించి మీకు ఆహారోపాధిని ప్రసాదించే సృష్టికర్త ఎవరైనా ఉన్నారా ?. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరు. అటువంటప్పుడు దీని తరువాత మీరు ఎలా ఈ సత్యము నుండి మరలిపోయి,అల్లా హ్ పై కల్పించుకుని అల్లా హ్ కొరకు భాగస్వాములు ఉన్నారని భావిస్తు న్నారు. వాస్తవానికి ఆయనే మిమ్మల్ని సృష్టించాడు మరియు మీకు ఆహారోపాధిని ప్రసాదించాడు

وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌۭ مِّن قَبْلِكَ ۚ وَإِلَى ٱللَّهِ تُرْجَعُ ٱلْأُمُورُ ﴿٤﴾

ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరిస్తే మీరు సహనం వహించండి. మీరు తన జాతి వారు తిరస్కరించిన మొదటి ప్రవక్త కాదు. మీకు పూర్వ జాతులు ఆద్,సమూద్, లూత్ జాతి వారు లాంటి వారు తమ ప్రవక్తలను తిరస్కరించారు. మరియు ఒక్కడైన అల్లాహ్ వైపు వ్యవహారాలన్నీ మరలించబడుతాయి. ఆయన తిరస్కారులను తుదిముట్టిస్తా డు మరియు ఆయన తనقప్రవక్తలకు,విశ్వాసపరులకు సహాయం చేస్తా డు

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ ۖ فَلَا تَغُرَّنَّكُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُم بِٱللَّهِ ٱلْغَرُورُ ﴿٥﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా అల్లా హ్ చేసిన వాగ్దా నమైనటువంటి మరణాంతరం లేపబడటం, ప్రళయదినమున ప్రతిఫలం ప్రసాదించటం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇహలోక జీవిత రుచులు,వాటి కోరికలు ఈ దినము కొరకు సత్కర్మతో సిద్ధం అవటం నుండి మిమ్మల్ని మోసగించకూడదు. మరియు షైతాను అసత్యమును తన అలంకరణ ద్వారా, ప్రాపంచిక జీవితం వైపునకు మరలించటం ద్వారా మిమ్మల్ని మోసగించకూడదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ و

إِنَّ ٱلشَّيْطَـٰنَ لَكُمْ عَدُوٌّۭ فَٱتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُوا۟ حِزْبَهُۥ لِيَكُونُوا۟ مِنْ أَصْحَـٰبِ ٱلسَّعِيرِ ﴿٦﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా షైతాను మీకు శాశ్వత శతృవు. కాబట్టి మీరు అతడితో పోరాటమును కొనసాగించటంతో అతడిని శతృవుగా చేసుకోండి. షైతాను మాత్రం తనను అనుసరించేవారిని వారి పరిణామము ప్రళయదినమున భగభగ మండే అగ్నిలో ప్రవేశం అవ్వాలని అల్లా హ్ పై అవిశ్వాసమును కనబరచటం వైపునకు పిలుస్తా డు

ٱلَّذِينَ كَفَرُوا۟ لَهُمْ عَذَابٌۭ شَدِيدٌۭ ۖ وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُم مَّغْفِرَةٌۭ وَأَجْرٌۭ كَبِيرٌ ﴿٧﴾

షైతానును అనుసరిస్తూ అల్లా హ్ పై అవిశ్వాసమును కనబరచిన వారి కొరకు కఠినమైన శిక్ష కలదు. మరియు ఎవరైతే అల్లా హ్ ను విశ్వసించి సత్కర్మలు చేస్తా రో వారి కొరకు అల్లా హ్ వద్ద వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు దాని కన్నా పెద్ద ప్రతిఫలం కలదు అది స్వర్గము

أَفَمَن زُيِّنَ لَهُۥ سُوٓءُ عَمَلِهِۦ فَرَءَاهُ حَسَنًۭا ۖ فَإِنَّ ٱللَّهَ يُضِلُّ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَٰتٍ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِمَا يَصْنَعُونَ ﴿٨﴾

నిశ్ఛయంగా ఎవరి కొరకైతే షైతాను అతని దుష్కర్మను మంచిగా చేసి చూపిస్తే దాన్ని మంచిదని నమ్మితే అతను అల్లాహ్ ఎవరికొరకైతే సత్యాన్ని మంచిగా చూపితే దాన్ని సత్యమని నమ్ముతాడో అతనితో సమానుడు కాడు. నిశ్ఛయంగా అల్లా హ్ తాను కోరుకున్న వారికి అపమార్గమునకు లోను చేస్తా డు. మరియు తాను కోరుకున్న వారికి సన్మార్గము చూపుతాడు. అతనును ధ్వేషించే వాడెవడూ లేడు. ఓ ప్రవక్తా మీరు మార్గభ్రష్టు ల మార్గభ్రష్టతపై బాధపడుతూ మీ స్వయాన్ని హతమార్చుకోకండి. నిశ్ఛయంగా పరిశుద్ధు డైన అల్లా హ్ వారు చేస్తు న్నవాటి గురించి బాగా తెలిసినవాడు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు

وَٱللَّهُ ٱلَّذِىٓ أَرْسَلَ ٱلرِّيَـٰحَ فَتُثِيرُ سَحَابًۭا فَسُقْنَـٰهُ إِلَىٰ بَلَدٍۢ مَّيِّتٍۢ فَأَحْيَيْنَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ ٱلنُّشُورُ ﴿٩﴾

మరియు అల్లా హ్ యే గాలులను పంపిస్తా డు అప్పుడు ఈ గాలులు మేఘమును కదుపుతాయి. అప్పుడు మేము మేఘమును ఎటువంటి మొక్కలు లేని ప్రదేశమునకు తీసుకుని వెళతాము. అప్పుడు మేము దాని నీటితో భూమిని అది బంజరు అయిన తరువాత కూడా అందు మేము మొలకెత్తించిన మొక్కల ద్వారా జీవింపజేస్తాము. ఏ విధంగానైతే మేము ఈ భూమిని దాని మరణం తరువాత అందు మేము మొక్కలను వేయటం ద్వారా జీవింపజేశామో అలాగే ప్రళయదినమున మృతుల మరణాంతరం లేపబడటం జరుగుతుంది

مَن كَانَ يُرِيدُ ٱلْعِزَّةَ فَلِلَّهِ ٱلْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ ٱلْكَلِمُ ٱلطَّيِّبُ وَٱلْعَمَلُ ٱلصَّـٰلِحُ يَرْفَعُهُۥ ۚ وَٱلَّذِينَ يَمْكُرُونَ ٱلسَّيِّـَٔاتِ لَهُمْ عَذَابٌۭ شَدِيدٌۭ ۖ وَمَكْرُ أُو۟لَـٰٓئِكَ هُوَ يَبُورُ ﴿١٠﴾

మరియు ఎవరైతే ఇహలోకంలో లేదా పరలోకంలో గౌరవాన్ని ఆశిస్తా డో అతడు దాన్ని అల్లా హ్ తో మాత్రమే కోరుకోవాలి. ఆ రెండింటిలో గౌరవమన్నది అల్లాహ్ ఒక్కడి కొరకే. ఆయన వైపునకే ఆయన సద్సమరణ ఎగబ్రాకుతుంది. మరియు దాసుల సత్కర్మ దాన్ని ఆయన వైపునకు ఉన్నతినిస్తుంది. మరియు ఎవరైతే దైవ ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లంను హతమార్చే ప్రయత్నం చేయటం లాంటి కుట్రలను పన్నుతారో వారి కొరకు కఠినమైన శిక్ష కలదు. మరియు ఈ అవిశ్వాసపరులందరి కుట్ర నిర్వీర్యమైపోతుంది,పాడైపోతుంది. మరియు వారి కొరకు గమ్యం సాధించదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱللَّهُ خَلَقَكُم مِّن تُرَابٍۢ ثُمَّ مِن نُّطْفَةٍۢ ثُمَّ جَعَلَكُمْ أَزْوَٰجًۭا ۚ وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِۦ ۚ وَمَا يُعَمَّرُ مِن مُّعَمَّرٍۢ وَلَا يُنقَصُ مِنْ عُمُرِهِۦٓ إِلَّا فِى كِتَـٰبٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٌۭ ﴿١١﴾

మరియు అల్లా హ్ యే మీ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించాడు. ఆ తరువాత మిమ్మల్ని ఇంద్రియ బిందువుతో సృష్టించాడు. ఆ తరువాత ఆయన మిమ్మల్ని మగవారిగా,ఆడవారిగా చేశాడు మీరు మీ మధ్య పరస్పరం వివాహం చేసుకొంటున్నారు. మరియు ఏ స్త్రీ కూడా పరిశుద్ధుడైన ఆయనకు తెలియకుండా గర్భం దాల్చదు మరియు తన బిడ్డకు జన్మనివ్వదు. వాటిలో నుంచి ఏదీ ఆయన నుండి అదృశ్యమవదు. మరియు ఆయన సృష్టిలో నుండి ఎవరి ఆయుషులో అధికమైనా లేదా అందులో నుండి తరిగినా అది లౌహ్ మహఫూజ్ లో వ్రాయబడి ఉండకుండా ఉండదు. నిశ్చయంగా ఈ ప్రస్తా వించబడినటువంటి మీ పుట్టు క మట్టి నుండి కావటం,మీ పుట్టు క వివిధ దశలో కావటం,మీ ఆయుషులు లౌహె మహఫూజ్ లో వ్రా యటం అల్లా హ్ పై సులభము.ي

وَمَا يَسْتَوِى ٱلْبَحْرَانِ هَـٰذَا عَذْبٌۭ فُرَاتٌۭ سَآئِغٌۭ شَرَابُهُۥ وَهَـٰذَا مِلْحٌ أُجَاجٌۭ ۖ وَمِن كُلٍّۢ تَأْكُلُونَ لَحْمًۭا طَرِيًّۭا وَتَسْتَخْرِجُونَ حِلْيَةًۭ تَلْبَسُونَهَا ۖ وَتَرَى ٱلْفُلْكَ فِيهِ مَوَاخِرَ لِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿١٢﴾

మరియు రెండు సముద్రా లు సమానం కాజాలవు: అందులో ఒకటి చాలా తియ్యదైనది. దాని తియ్యదనం వలన దాన్ని త్రా గటం సులభమైనది. మరియు రెండవది ఉప్పగా,చేదుగా ఉన్నదైనది దాని అధిక ఉప్పదనం వలన దాన్ని త్రాగటం సాధ్యం కాదు. ప్రస్తావించబడిన రెండు సముద్రముల్లోంచి ప్రతీ ఒక్కటి నుండి మీరు తాజా మాంసమును తింటున్నారు అది చేపలు. ఆ రెండింటి నుండి మీరు ముత్యములను,పగడములను వెలికితీస్తు న్నారు. వాటిని మీరు అలంకరణగా తొడుగుతున్నారు. ఓ వీక్షించేవాడా నీవు ఓడలను చూస్తావు అవి తమ పయనముతో మీరు వ్యాపారము ద్వారా అల్లా హ్ అనుగ్రహమును అన్వేషించటానికి వస్తూ ,పోతుండగా సముద్రమును చీల్చుతున్నాయి. మరియు బహుశా మీరు అల్లాహ్ కి ఆయన మీకు ప్రసాదించిన తన చాలా అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటారని.م ل

يُولِجُ ٱلَّيْلَ فِى ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِى ٱلَّيْلِ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ كُلٌّۭ يَجْرِى لِأَجَلٍۢ مُّسَمًّۭى ۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ ۚ وَٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِهِۦ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ ﴿١٣﴾

అల్లా హ్ రాత్రిని పగలులో ప్రవేశింపజేసి దాన్ని పొడుగుగా అధికం చేస్తు న్నాడు. మరియు పగలును రాత్రిలో ప్రవేశింపజేసి పొడుగుగా అధికం చేస్తు న్నాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన సూర్యుడిని నిబద్ధుడిగా చేశాడు మరియు చంద్రుడిని నిబద్ధుడిగా చేశాడు. వాటిలో నుండి ప్రతి ఒక్కటి అల్లాహ్ కు తెలిసిన ఒక నిర్ణీత సమయంలో పయనిస్తు న్నాయి. అది ప్రళయదినము. వాటిలో ప్రతీ ఒక్కటిని నిర్ణయించి దాన్ని నడిపిస్తు న్నవాడు ఆయనే మీ ప్రభువైన అల్లాహ్,అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయనను వదిలి మీరు ఆరాధిస్తున్న విగ్రహాలకు ఖర్జూ రపు టెంకపై ఉన్న పొర అంత దాని అధికారము కూడా లేదు. అటువంటప్పుడు మీరు ఎలా నన్ను కాదని వారిని పూజిస్తు న్నారు ?!

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا۟ دُعَآءَكُمْ وَلَوْ سَمِعُوا۟ مَا ٱسْتَجَابُوا۟ لَكُمْ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍۢ ﴿١٤﴾

خبير ఒక వేళ మీరు మీ ఆరాధ్య దైవాలను వేడుకుంటే అవి మీ వేడుకలను వినలేవు. అవి తమలో ఎటువంటి ప్రా ణము లేని,తమకు ఎటువంటి వినికిడి శక్తి లేని స్థిర రాసులు. ఒక వేళ అవి తఖ్దీర్ ప్రకారం విన్నా మీ కొరకు వారు స్వీకరించజాలవు. ప్రళయదినాన మీ సాటి కల్పించటం నుండి , మీరు వారి ఆరాధన చేయటం నుండి విసుగును చూపిస్తా రు. ఓ ప్రవక్తా మీకు పరిశుద్ధు డైన అల్లా హ్ కన్నా ఎక్కువ నిజంగా తెలిపేవారు ఎవరూ ఉండరు

۞ يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ أَنتُمُ ٱلْفُقَرَآءُ إِلَى ٱللَّهِ ۖ وَٱللَّهُ هُوَ ٱلْغَنِىُّ ٱلْحَمِيدُ ﴿١٥﴾

ఓ ప్రజలారా మీరు మీ వ్యవహారాలన్నింటిలో,మీ పరిస్థితులన్నింటిలో అల్లాహ్ అవసరం కలవారు. మరియు అల్లాహ్ యే స్వయం సమృద్ధుడు ఏ విషయంలోను ఆయనకు మీ అవసరం లేదు. తన దాసుల కొరకు ఆయన నిర్ణయించే వాటిపై ఇహపరాల్లో స్థు తింపబడేవాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ إن يشأ يذهبكم ويأت بخلق جديد

إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍۢ جَدِيدٍۢ ﴿١٦﴾

ఒక వేళ పరిశుద్ధు డైన ఆయన ఏదైన వినాశనం ద్వారా మిమ్మల్ని తొలగించదలచుకుంటే దాని ద్వారా మిమ్మల్ని తుదిముట్టించి తొలగిస్తా డు. మరియు మీకు బదులుగా ఆయనను ఆరాధించి,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించని ఒక క్రొత్త సృష్టిని తీసుకునివస్తా డు

وَمَا ذَٰلِكَ عَلَى ٱللَّهِ بِعَزِيزٍۢ ﴿١٧﴾

మిమ్మల్ని తుదిముట్టించటం ద్వారా తొలగించటం,మీకు బదులుగా ఒక క్రొత్త సృష్టిని తీసుకొని రావటం పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ నుండి జరగడం సాధ్యం కాని పని కాదు

وَلَا تَزِرُ وَازِرَةٌۭ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِن تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَىْءٌۭ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰٓ ۗ إِنَّمَا تُنذِرُ ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ ۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِۦ ۚ وَإِلَى ٱللَّهِ ٱلْمَصِيرُ ﴿١٨﴾

ى ى మరియు ఒక పాపాత్ముడైన ప్రాణము వేరొక పాపాత్ముడైన ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతే కాదు ప్రతీ పాపాత్ముడైన ప్రాణము తన పాపమునే మోస్తుంది. ఒక వేళ తన పాపముల బరువేయబడిన ఏ ప్రాణమైన తన పాపముల్లోంచి కొంచెమైన మోయటానికి వాటిని మోసే వాడిని పిలిచినా తన పాపముల్లోంచి కొంచెము కూడా మోయబడదు. ఒక వేళ పిలవబడిన వాడు అతనికి దగ్గర బందువైనా సరే. ఓ ప్రవక్తా మీరు కేవలం తమ ప్రభువును చూడకుండానే భయపడే వారిని, నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పూర్తి చేసేవారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెడుతారు. వారే మీ భయపెట్టటం ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు ఎవరైతే పాపముల నుండి మరియు వాటిలో నుండి పెద్దది షిర్కు నుండి పరిశుద్ధు డవుతాడో అతడు తన స్వయం కొరకు పరిశుద్ధుడయ్యాడు. ఎందుకంటే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది. అల్లాహ్ తన విధేయత నుండి అక్కరలేనివాడు. మరియు ప్రళయదినమున లెక్క తీసుకొనటం,ప్రతిఫలం కొరకు అల్లా హ్ వైపునకే మరలిపోవలసినది

وَمَا يَسْتَوِى ٱلْأَعْمَىٰ وَٱلْبَصِيرُ ﴿١٩﴾

గ్రు డ్డివాడు,చూపు కలవాడు ఏ విధంగా సమానులు కారో అలాగే అవిశ్వాసపరుడు మరియు విశ్వాసపరుడు స్థా నమును బట్టి సమానులు కారు

وَلَا ٱلظُّلُمَـٰتُ وَلَا ٱلنُّورُ ﴿٢٠﴾

చీకట్లు మరియు వెలుగు సమానము కానట్లే అవిశ్వాసము మరియు విశ్వాసము సమానము కాదు

وَلَا ٱلظِّلُّ وَلَا ٱلْحَرُورُ ﴿٢١﴾

నీడ మరియు వేడి గాలి సమానము కానట్లే స్వర్గము మరియు నరకము తమ ప్రభావములలో సమానము కావు

وَمَا يَسْتَوِى ٱلْأَحْيَآءُ وَلَا ٱلْأَمْوَٰتُ ۚ إِنَّ ٱللَّهَ يُسْمِعُ مَن يَشَآءُ ۖ وَمَآ أَنتَ بِمُسْمِعٍۢ مَّن فِى ٱلْقُبُورِ ﴿٢٢﴾

బ్రతికి ఉన్నవారు మరియు మృతులు సమానము కానట్లే విశ్వాసపరులు మరియు అవిశ్వాసపరులు సమానులు కారు. నిశ్ఛయంగా అల్లాహ్ తాను కోరుకున్న వారికి తన సన్మార్గమును వినిపిస్తా డు. ఓ ప్రవక్తా మీరు సమాధులలో మృతినివలె ఉన్న అవిశ్వాసపరులను వినిపించలేరు. إن أنت إلا نذير

إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ ﴿٢٣﴾

మీరు కేవలం వారికి అల్లా హ్ శిక్ష నుండి హెచ్చరిక చేసేవారు మాత్రమే. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

إِنَّآ أَرْسَلْنَـٰكَ بِٱلْحَقِّ بَشِيرًۭا وَنَذِيرًۭا ۚ وَإِن مِّنْ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌۭ ﴿٢٤﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఎటువంటి సందేహం లేని సత్యముతో,విశ్వాసపరులకు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన గౌరవప్రదమైన పుణ్యమును గురించి శుభవార్తనిచ్చేవాడిగా,అవిశ్వాసపరులకు వారి కొరకు ఆయన తయారు చేసి ఉంచిన బాధాకర శిక్ష నుండి హెచ్చరించేవాడిగా పంపించాము. పూర్వ జాతుల్లోంచి ఏ జాతి కూడా అందులో అల్లాహ్ వద్ద నుండి ఆయన శిక్ష నుండి వారిని హెచ్చరించే ఏ ప్రవక్తా రాకుండా గడిచిపోలేదు

وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ جَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَـٰتِ وَبِٱلزُّبُرِ وَبِٱلْكِتَـٰبِ ٱلْمُنِيرِ ﴿٢٥﴾

ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతివారు మిమ్మల్ని తిరస్కరిస్తే సహనం చూపండి. మీరు తన జాతి వారు తిరస్కరించిన మొదటి ప్రవక్త కాదు. ఆద్,సమూద్,లూత్ జాతి లాంటి పూర్వ జతులు తమ ఈ ప్రవక్తలందరిని తిరస్కరించారు. అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వారి ప్రవక్తలు తమ నిజాయితీని సూచించే స్పష్టమైన వాదనలను తీసుకుని వచ్చారు. మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు ప్రతులను (సహీఫాలను),ప్రకాశమానమైన గ్రంధమును దానిలో యోచన చేసేవాడి కొరకు,దీర్ఘంగా ఆలోచించేవాడి కొరకు తీసుకుని వచ్చారు

ثُمَّ أَخَذْتُ ٱلَّذِينَ كَفَرُوا۟ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ ﴿٢٦﴾

మరియు అయినా వారు అల్లా హ్ ను,ఆయన ప్రవక్తలను తిరస్కరించారు మరియు ఆయన వద్ద నుండి వారు తీసుకుని వచ్చిన వాటి విషయంలో వారిని వారు నమ్మలేదు. అప్పుడు నేను అవిశ్వసించిన వారందరిని నాశనం చేశాను. ఓ ప్రవక్తా నేను వారిని నాశనం చేసినప్పుడు వారిపై నా శిక్ష ఎలా ఉందో మీరు యోచన చేయండి

أَلَمْ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءًۭ فَأَخْرَجْنَا بِهِۦ ثَمَرَٰتٍۢ مُّخْتَلِفًا أَلْوَٰنُهَا ۚ وَمِنَ ٱلْجِبَالِ جُدَدٌۢ بِيضٌۭ وَحُمْرٌۭ مُّخْتَلِفٌ أَلْوَٰنُهَا وَغَرَابِيبُ سُودٌۭ ﴿٢٧﴾

ألونها وغرابيب سود ఓ ప్రవక్తా పరిశుద్ధు డైన అల్లా హ్ ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించటమును మీరు చూడలేదా. అప్పుడు మేము ఆ నీటితో వేరు వేరు రంగులు కల ఫలములను వెలికి తీశాము. వాటి వృక్షములకు దాని నుండి నీరు పెట్టిన తరువాత వాటిలో ఎరుపు,పచ్చని,పసుపు,ఇతర రంగులు కలవు. మరియు పర్వతములలోంచి తెల్లటి కనుమలను, ఎర్రటి కనుమలను,ముదురు నలుపు కనుమలను వెలికి తీశాము

وَمِنَ ٱلنَّاسِ وَٱلدَّوَآبِّ وَٱلْأَنْعَـٰمِ مُخْتَلِفٌ أَلْوَٰنُهُۥ كَذَٰلِكَ ۗ إِنَّمَا يَخْشَى ٱللَّهَ مِنْ عِبَادِهِ ٱلْعُلَمَـٰٓؤُا۟ ۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌ غَفُورٌ ﴿٢٨﴾

మరియు మనుషుల్లోంచి,జంతువుల్లోంచి,పశువుల్లోంచి (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) ప్రస్తావించిన వాటిలాగే వాటికి వేరు వేరు రంగులు కలవు. అవి మాత్రం మహోన్నతుడైన అల్లాహ్ స్థానమును గౌరవిస్తున్నాయి మరియు పరిశుద్ధుడైన ఆయన గురించి జ్ఞానం కలవారు ఆయన నుండి భయపడుతారు. ఎందుకంటే వారు ఆయన గుణాలను,ఆయన శాసనములను,ఆయన సామర్ధ్యపు ఆధారాలను గుర్తించారు. నిశ్చయంగా అల్లాహ్ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తా ప్పడినر వారిపాపములను మన్నించేవాడు

إِنَّ ٱلَّذِينَ يَتْلُونَ كِتَـٰبَ ٱللَّهِ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنفَقُوا۟ مِمَّا رَزَقْنَـٰهُمْ سِرًّۭا وَعَلَانِيَةًۭ يَرْجُونَ تِجَـٰرَةًۭ لَّن تَبُورَ ﴿٢٩﴾

నిశ్ఛయంగా వారు మేము మా ప్రవక్తపై అవతరింపజేసిన అల్లా హ్ గ్రంధమును చదువుతారు మరియు అందులో ఉన్నవాటిపై ఆచరిస్తా రు. మరియు వారు నమాజును ఉత్తమ పద్దతిలో పూర్తి చేస్తా రు. మరియు వారు మేము వారికి ప్రసాదించిన వాటిలో నుంచి జకాత్ విధి దానం పద్దతిలో,ఇతర పద్దతిలో (స్వచ్ఛందంగా) గోప్యంగా,బహిర్గంగా ఖర్ఛు చేస్తా రు. వారు ఈఆచరణల ద్వారా అల్లా హ్ వద్ద ఎన్నటికి నష్టం కలగని వ్యాపారమును ఆశిస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ غَفُورٌۭ شَكُورٌۭ ﴿٣٠﴾

అల్లాహ్ వారి కర్మల పరిపూర్ణ ప్రతిఫలమును వారికి ప్రసాదించటానికి. ఆయనే దీనికి యోగ్యుడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన ఈ గుణములు కలిగిన వారి పాపములను మన్నించేవాడును, వారి సత్కర్మలను ఆదరించేవాడును

وَٱلَّذِىٓ أَوْحَيْنَآ إِلَيْكَ مِنَ ٱلْكِتَـٰبِ هُوَ ٱلْحَقُّ مُصَدِّقًۭا لِّمَا بَيْنَ يَدَيْهِ ۗ إِنَّ ٱللَّهَ بِعِبَادِهِۦ لَخَبِيرٌۢ بَصِيرٌۭ ﴿٣١﴾

ఓ ప్రవక్తా మేము మీ వైపునకు దైవ వాణి ద్వారా అవతరింపజేసిన గ్రంధం ఎటువంటి సందేహము లేని సత్యము. దానినే అల్లా హ్ పూర్వ గ్రంధాలను ధృవీకరించే విధంగా అవతరింపజేశాడు. నిశ్చయంగా అల్లా హ్ తన దాసుల గురించి తెలుసుకునే వాడును,చూసేవాడును. ఆయన ప్రతీ జాతి ప్రవక్తకు వారి కాలంలో తన నుండి వారికి ఏమి అవసరమో దైవవాణి ద్వారా తెలియపరుస్తా డు

ثُمَّ أَوْرَثْنَا ٱلْكِتَـٰبَ ٱلَّذِينَ ٱصْطَفَيْنَا مِنْ عِبَادِنَا ۖ فَمِنْهُمْ ظَالِمٌۭ لِّنَفْسِهِۦ وَمِنْهُم مُّقْتَصِدٌۭ وَمِنْهُمْ سَابِقٌۢ بِٱلْخَيْرَٰتِ بِإِذْنِ ٱللَّهِ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَضْلُ ٱلْكَبِيرُ ﴿٣٢﴾

ఆ తరువాత మేము సమాజాలపై ఎన్నుకున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజమునకు మేము ఖుర్ఆన్ ను ప్రసాదించాము. అయితే వారిలో కొందరు నిషిద్ధ కార్యాలకు పాల్పడి, విధిగావించబడిన వాటిని వదిలివేసి తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినవారు ఉన్నారు. మరియు వారిలో కొందరు విధిగావించబడిన వాటిని చేసి,నిషిద్ధమైన వాటిని వదిలివేసి దానికి తోడుగా కొన్ని సమ్మతమైన వాటిని వదిలివేసి,కొన్ని సమ్మతం కాని వాటిని చేసి మధ్యస్థంగా ఉండేవారు ఉన్నారు. మరియు వారిలో నుండి కొందరు అల్లా హ్ సెలవుతో సత్కార్యములను చేయటంలో మున్ముందు ఉండేవారు ఉన్నారు. ఈ ప్రస్తా వించబడినటువంటి ఈ సమాజము కొరకు ఎంచుకోవటం, దానికి ఖుర్ఆన్ ను ప్రసాదించటం ఇది పెద్ద అనుగ్రహము. దానికి సరితూగే ఏ అనుగ్రహము లేదు

جَنَّـٰتُ عَدْنٍۢ يَدْخُلُونَهَا يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍۢ وَلُؤْلُؤًۭا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌۭ ﴿٣٣﴾

కలకాలం నిలిచే స్వర్గవనాలు వాటిలో ఈ ఎంచుకోబడిన వారందరు ప్రవేశిస్తా రు. వారు వాటిలో ముత్యాలను,బంగారపు కంకణములను తొడుగుతారు. మరియు వాటిలో వారి వస్త్రా లు పట్టు వస్త్రా లై ఉంటాయి

وَقَالُوا۟ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِىٓ أَذْهَبَ عَنَّا ٱلْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌۭ شَكُورٌ ﴿٣٤﴾

మరియు వారు స్వర్గంలో ప్రవేశించిన తరువాత ఇలా పలుకుతారు: పొగడ్తలన్ని ఆ అల్లా హ్ కొరకే ఎవరైతే మేము నరకములో ప్రవేశము నుండి మేము భయపడటము వలన కలిగిన దుఃఖమును మా నుండి తొలగించాడో. నిశ్ఛయంగా మా ప్రభువు తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించు వాడును, వారి విధేయతపై వారి కొరకు ఆదరించేవాడును

ٱلَّذِىٓ أَحَلَّنَا دَارَ ٱلْمُقَامَةِ مِن فَضْلِهِۦ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌۭ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌۭ ﴿٣٥﴾

ఆయనే తన అనుగ్రహముతో శాశ్వత నివాసము, దాని తరువాత ఎటువంటి తరలింపులేని దాన్ని మనకు ప్రసాదించాడు. మాకు ఎటువంటి సామర్ధ్యము గాని శక్తి గాని లేదు. అందులో మాకు ఎటువంటి అలసట గాని,సమస్య గాని తలెత్తదు

وَٱلَّذِينَ كَفَرُوا۟ لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَىٰ عَلَيْهِمْ فَيَمُوتُوا۟ وَلَا يُخَفَّفُ عَنْهُم مِّنْ عَذَابِهَا ۚ كَذَٰلِكَ نَجْزِى كُلَّ كَفُورٍۢ ﴿٣٦﴾

మరియు ఎవరైతే అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తా రో వారి కొరకు నరకాగ్ని గలదు,వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు మరణించి శిక్ష నుండి ప్రశాంతతను పొందటానికి వారిపై మరణ తీర్పు ఇవ్వబడదు. మరియు వారి నుండి నరకము శిక్ష కొంచెము కూడా తగ్గించబడదు. ఈ ప్రతిఫలం ప్రసాదించినట్లే ప్రళయదినాన మేము తన ప్రభువు యొక్క అనుగ్రహాలను తిరస్కరించే వాడికి ప్రసాదిస్తా ము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَآ أَخْرِجْنَا نَعْمَلْ صَـٰلِحًا غَيْرَ ٱلَّذِى كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَآءَكُمُ ٱلنَّذِيرُ ۖ فَذُوقُوا۟ فَمَا لِلظَّـٰلِمِينَ مِن نَّصِيرٍ ﴿٣٧﴾

మరియు వారు అందులో తమ బిగ్గర స్వరాలతో మొర పెట్టు కుంటూ ఇలా పలుకుతూ అరుస్తా రు: ఓ మా ప్రభూ నీవు మమ్మల్ని నరగాగ్ని నుండి వెలికి తీ మేము నీ మన్నతను పొంది నీ శిక్ష నుండి భద్రంగా ఉండటానికి మేము ఇహలోకములో చేసిన కర్మలకు భిన్నంగా సత్కర్మను చేస్తా ము. అప్పుడు అల్లా హ్ వారికి ఇలా సమాధానమిస్తా డు: ఏ మేము మీకు హితబోధనను గ్రహించదలిచేవాడు హితబోధన గ్రహించి,అల్లా హ్ ముందు పశ్చాత్తా ప్పడి,సత్కర్మను చేసేంత వయస్సును ఇవ్వ లేదా ?. మరియు మీకు అల్లా హ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ ప్రవక్త మీ వద్దకు రాలేదా ?. వీటన్నిటి తరువాత మీకు ఎటువంటి వాదన గాని వంక గాని లేదు. కాబట్టి మీరు అగ్ని శిక్షను చవిచూడండి. అవిశ్వాసము ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు అల్లా హ్ శిక్ష నుండి వారిని రక్షించటానికి లేదా దాన్ని వారి నుండి తేలిక చేయటానికి ఎటువంటి సహాయకుడు ఉండడు

إِنَّ ٱللَّهَ عَـٰلِمُ غَيْبِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴿٣٨﴾

నిశ్చయంగా అల్లా హ్ ఆకాశముల,భూమి యొక్క అగోచరమును తెలిసినవాడు. దానిలో నుంచి ఏదీ అతని నుండి తప్పిపోదు. నిశ్ఛయంగా ఆయన తన దాసులు తమ హృదయముల్లో గోప్యంగా ఉంచే మేలును,చెడును తెలిసినవాడు

هُوَ ٱلَّذِى جَعَلَكُمْ خَلَـٰٓئِفَ فِى ٱلْأَرْضِ ۚ فَمَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ ۖ وَلَا يَزِيدُ ٱلْكَـٰفِرِينَ كُفْرُهُمْ عِندَ رَبِّهِمْ إِلَّا مَقْتًۭا ۖ وَلَا يَزِيدُ ٱلْكَـٰفِرِينَ كُفْرُهُمْ إِلَّا خَسَارًۭا ﴿٣٩﴾

ఓ ప్రజలారా ఆయనే మీలో నుండి కొందరిని భూమిలో కొందరిపై ప్రతినిధులుగా చేశాడు మీరు ఎలా ఆచరిస్తారో ఆయన మిమ్మల్ని పరీక్షించటానికి. అయితే ఎవరైతే అల్లాహ్ పట్ల,ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి పట్ల అవిశ్వాసమును కనబరుస్తాడో అతని అవిశ్వాసము యొక్క పాపము,అతని పరిణామము అతనిపైనే మరలుతుంది. అతని అవిశ్వాసము అతని ప్రభువుకు హాని తలపెట్టదు.అవిశ్వాసపరుల అవిశ్వాసము పరిశుద్ధుడైన తమ ప్రభువు వద్ద తీవ్ర ధ్వేషమును మాత్రమే అధికం చేస్తుంది. మరియు అవిశ్వాసపరుల అవిశ్వాసము నష్టమును మాత్రమే అధికం చేస్తుంది. ఎందుకంటే అల్లా హ్ వారి కొరకు స్వర్గంలో తయారు చేసి ఉంచిన వాటిని నష్టపోతారు ఒక వేళ వారు విశ్వసిస్తే (నష్టపోరు)

قُلْ أَرَءَيْتُمْ شُرَكَآءَكُمُ ٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِى مَاذَا خَلَقُوا۟ مِنَ ٱلْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌۭ فِى ٱلسَّمَـٰوَٰتِ أَمْ ءَاتَيْنَـٰهُمْ كِتَـٰبًۭا فَهُمْ عَلَىٰ بَيِّنَتٍۢ مِّنْهُ ۚ بَلْ إِن يَعِدُ ٱلظَّـٰلِمُونَ بَعْضُهُم بَعْضًا إِلَّا غُرُورًا ﴿٤٠﴾

ى ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: మీరు అల్లా హ్ ను వదిలి ఆరాధిస్తు న్నమీ భాగస్వాముల గురించి నాకు తెలియపరచండి. వారు భూమి నుండి ఏమి సృష్టించారు ?. వారు దాని పర్వతాలను సృష్టించారా ?,దాని వాగులను సృష్టించారా ?, దాని జంతువులను సృష్టించారా ?. లేదా ఆకాశములను సృష్టించటంలో వారు అల్లా హ్ తో పాటు భాగస్వాములా ?. లేదా మేము వారికి మేము ఏదైన పుస్తకమును ఇచ్చామా అందులో వారి భాగస్వాముల కొరకు వారి ఆరాధన నిజమవటంపై ఏదైన ఆధారమున్నదా ?. వీటిలో నుండి ఏదీ వారికి కలగలేదు. అంతే కాదు అవిశ్వాసము ద్వారా,పాప కార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాలపడినవారు ఒకరినొకరు మోసపూరిత మాటల వాగ్దా నం మాత్రమే చేసుకుంటున్నారు

۞ إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا ۚ وَلَئِن زَالَتَآ إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍۢ مِّنۢ بَعْدِهِۦٓ ۚ إِنَّهُۥ كَانَ حَلِيمًا غَفُورًۭا ﴿٤١﴾

غفورا నిశ్ఛయంగా పరిశుద్ధు డైన అల్లా హ్ ఆకాశములను,భూమిని వాటి స్థా నముల నుండి తొలగిపోకుండా ఆపి ఉంచాడు. ఒక వేళ అవి రెండు తమ స్థా నముల నుండి తొలగిపోతే - అనుకోండి - పరిశుద్ధు డైన ఆయన తరువాత తొలగిపోవటం నుండి ఆ రెండింటిని ఆపేవాడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా ఆయన సహనశీలుడు శిక్షించటంలో తొందర చేయడు, తన దాసుల్లోంచి పశ్ఛాత్తా ప్పడేవారి పాపములను మన్నించేవాడు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَـٰنِهِمْ لَئِن جَآءَهُمْ نَذِيرٌۭ لَّيَكُونُنَّ أَهْدَىٰ مِنْ إِحْدَى ٱلْأُمَمِ ۖ فَلَمَّا جَآءَهُمْ نَذِيرٌۭ مَّا زَادَهُمْ إِلَّا نُفُورًا ﴿٤٢﴾

نفورا మరియు తిరస్కారులైన ఈ అవిశ్వాసపరులందరు ధృడమైన,గట్టివైన ప్రమాణాలు చేసి చెప్పేవారు: ఒక వేళ వారి వద్దకు అల్లా హ్ వద్ద నుండి ఒక ప్రవక్త వచ్చి ఆయన శిక్ష నుండి హెచ్చరించి ఉంటే వారు తప్పకుండా యూదుల కన్న,క్రైస్తవుల కన్న,ఇతరుల కన్న ఎక్కువగా సత్యము పై స్థిరత్వము కలిగిన వారై,అనుసరించేవారై పోతారని. మరియు ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి వారి వద్దకు ప్రవక్తగా వచ్చి వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టా రో అయన రాక వారిని సత్యము నుండి దూరమును,అసత్యముతో సంబంధమును అధికం చేసింది. వారు తమ కన్న పూర్వం గతించిన వారి కన్న ఎక్కువగా సన్మార్గంపై ఉంటారని వారు చేసిన ధృడ ప్రమాణాలను పూర్తి చేయలేదు

ٱسْتِكْبَارًۭا فِى ٱلْأَرْضِ وَمَكْرَ ٱلسَّيِّئِ ۚ وَلَا يَحِيقُ ٱلْمَكْرُ ٱلسَّيِّئُ إِلَّا بِأَهْلِهِۦ ۚ فَهَلْ يَنظُرُونَ إِلَّا سُنَّتَ ٱلْأَوَّلِينَ ۚ فَلَن تَجِدَ لِسُنَّتِ ٱللَّهِ تَبْدِيلًۭا ۖ وَلَن تَجِدَ لِسُنَّتِ ٱللَّهِ تَحْوِيلًا ﴿٤٣﴾

మరియు వారు అల్లాహ్ పై చేసిన వారి ప్రమాణము మంచి సంకల్పముతో,మంచి ఉద్ధేశముతో కాదు. కాని భూమిలో అహంకారమును చూపటానికి,ప్రజలను మోసం చేయటానికి. మరియు చెడు వ్యూహం దాన్ని పాల్పడే వ్యూహకర్తలనే చుట్టుకుంటుంది. అహంకారమును చూపే ఈ వ్యూహకర్తలందరు ఖచ్చితంగా వాటిల్లే అల్లాహ్ సంప్రదాయం కోసం మాత్రమే నిరీక్షిస్తున్నారు. మరియు అది వారిలాంటి వారి పూర్వికులను తుది ముట్టుంచినట్లే వారి వినాశనము. అయితే నీవు అహంకారులైన వారిని తుదిముట్టించటంలో అల్లా హ్ సంప్రదాయం వారిపై వాటిల్లకుండా మార్చటమును ,అది ఇతరులపై వాటిల్లి మారటమును పొందవు. ఎందుకంటే అది వాటిల్లే దైవిక సంప్రదాయం

أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ وَكَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةًۭ ۚ وَمَا كَانَ ٱللَّهُ لِيُعْجِزَهُۥ مِن شَىْءٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ وَلَا فِى ٱلْأَرْضِ ۚ إِنَّهُۥ كَانَ عَلِيمًۭا قَدِيرًۭا ﴿٤٤﴾

ఏమీ ఖురైష్ జాతి వారిలో నుంచి నిన్ను తిరస్కరించిన వారు వారి కన్న మునుపు తిరస్కరించిన సమాజముల పరిణామం ఏమైందో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. అల్లా హ్ వారిని నాశనం చేసినప్పుడు వారి ముగింపు చెడ్డ ముగింపు కాలేదా ?. వాస్తవానికి వారు ఖురైష్ కన్న ఎక్కువ బలం కలవారు. మరియు ఆకాశములలో గాని భూమిలో గాని ఏదీ అల్లా హ్ నుండి తప్పిపోదు. నిశ్చయంగా ఆయన ఈ తిరస్కారులందరి కర్మల గురించి బాగా తెలిసినవాడు. వారి కర్మల్లోంచి ఏది ఆయన నుండి అధృశ్యమవదు,ఆయన నుండి తప్పిపోదు. ఆయన తలచినప్పుడు వారిని వినాశనము చేయటం పై సామర్ధ్యము కలవాడు.م

وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِمَا كَسَبُوا۟ مَا تَرَكَ عَلَىٰ ظَهْرِهَا مِن دَآبَّةٍۢ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّۭى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ فَإِنَّ ٱللَّهَ كَانَ بِعِبَادِهِۦ بَصِيرًۢا ﴿٤٥﴾

ఒక వేళ అల్లా హ్ ప్రజలకు వారు చేసిన అవిధేయ కార్యాలపై, వారు పాల్పడిన పాపములపై శీఘ్రంగా శిక్షిస్తే వెంటనే భూవాసులందరినీ,వారి ఆదీనంలో ఉన్న జంతువులను,సంపదలను నాశనం చేసేవాడు. కానీ పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానంలో నిర్ణీతమైన సమయం వరకు వారికి గడువునిస్తాడు. మరియు అది ప్రళయదినము. ప్రళయదినం వచ్చినప్పుడు, నిశ్ఛయంగా అల్లా హ్ తన దాసులను వీక్షిస్తు న్నాడు. వారి నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వారి కర్మల పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ (అవి) మేలైనవి అయితే మేలుగా, ఒక వేళ చెడ్డవైతే చెడుగా. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Faatir — فاطر

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు