ముఖపేజీతఫ్సీర్Al-Ahqaf (46)

తఫ్సీర్ Al-Ahqaf (46) — الأحقاف

మక్కీ · 35 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

حمٓ ﴿١﴾

హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది

تَنزِيلُ ٱلْكِتَـٰبِ مِنَ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ ﴿٢﴾

ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లా హ్ వద్ద నుండి జరిగింది. م

مَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍۢ مُّسَمًّۭى ۚ وَٱلَّذِينَ كَفَرُوا۟ عَمَّآ أُنذِرُوا۟ مُعْرِضُونَ ﴿٣﴾

ఆకాశములను,భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటన్నింటిని మేము వృధాగా సృష్టించలేదు. అంతే కాదు మేము వాటన్నింటిని సత్యముతో సంపూర్ణ విజ్ఞతలతో సృష్టించాము. దాసులు వాటి ద్వారా ఆయనను (అల్లా హ్ ను) గుర్తించి ఆయన ఒక్కడి ఆరాధన చేయటం మరియు ఆయనతో పాటు దేనిని సాటి కల్పించకపోవటం వాటిలో నుండే. మరియు వారు అల్లాహ్ ఒక్కడికి తెలిసిన ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో వారికి ప్రా తినిధ్యమును చేకూర్చేవాటిని వారు నెలకొల్పాలి. మరియు అల్లా హ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారు అల్లా హ్ గ్రంధములో వారికి హెచ్చరించబడిన వాటి నుండి విముఖత చూపుతున్నారు. వాటిని లెక్కచేయటం లేదు

قُلْ أَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِى مَاذَا خَلَقُوا۟ مِنَ ٱلْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌۭ فِى ٱلسَّمَـٰوَٰتِ ۖ ٱئْتُونِى بِكِتَـٰبٍۢ مِّن قَبْلِ هَـٰذَآ أَوْ أَثَـٰرَةٍۢ مِّنْ عِلْمٍ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٤﴾

ఓ ప్రవక్తా మీరు సత్యము నుండి విముఖత చూపే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి: మీరు అల్లా హ్ ను వదిలి ఆరాధిస్తు న్నమీ విగ్రహాల గురించి నాకు తెలపండి వారు భూమి యొక్క భాగములలో నుండి ఏమి సృష్టించారు ?. వారు ఏదైన పర్వతమును సృష్టించారా ?. ఏదైన కాలువను సృష్టించారా ?. లేదా ఆకాశములను సృష్టించటంలో అల్లాహ్ తో పాటు వారికి ఏదైన భాగము,వాటా ఉన్నదా ?. ఖుర్ఆన్ కన్న ముందు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును లేదా మీ పూర్వికులు వదిలి వెళ్ళిన దానిలో నుండి మిగిలిన ఏదైన జ్ఞా నమును నా వద్దకు తీసుకుని రండి ఒక వేళ మీ విగ్రహాలు ఆరాధనకు అర్హులని మీరు చేస్తు న్నవాదనలో మీరు సత్యవంతులేనైతే

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ وَهُمْ عَن دُعَآئِهِمْ غَـٰفِلُونَ ﴿٥﴾

మరియు అల్లా హ్ ను వదిలి ప్రళయదినం వరకు తన దుఆని స్వీకరించని ఒక విగ్రహమును ఆరాధించే వాడి కన్న పెద్ద మార్గభ్రష్టు డెవడూ ఉండడు. మరియు వారు అల్లా హ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు తమను ఆరాధించే దాసుల దుఆ నుండి నిర్లక్ష్యంలో పడి ఉన్నారు. వారు వారికి ప్రయోజనం కలిగించటం లేదు నష్టం కలిగించటం దూర విషయం

وَإِذَا حُشِرَ ٱلنَّاسُ كَانُوا۟ لَهُمْ أَعْدَآءًۭ وَكَانُوا۟ بِعِبَادَتِهِمْ كَـٰفِرِينَ ﴿٦﴾

మరియు వారు ఇహలోకములో వారికి ప్రయోజనం కలిగించకపోవటంతో పాటు వారు ప్రళయదినము నాడు సమీకరించబడినప్పుడు తమను ఆరాధించేవారికి శతృవులైపోతారు. మరియు వారికి తమకి సంబంధం లేదంటారు. మరియు వారు తమను ఆరాధించిన విషయం తెలవటం గురించి నిరాకరిస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَـٰتُنَا بَيِّنَـٰتٍۢ قَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ هَـٰذَا سِحْرٌۭ مُّبِينٌ ﴿٧﴾

మరియు మన ప్రవక్తపై అవతరించబడిన మా ఆయతులను వారి ముందట చదివి వినిపించబడినప్పుడు తమ ప్రవక్త చేత తమ వద్దకు వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారు ఇలా పలుకుతారు: ఇది స్పష్టమైన మంత్రజాలము. మరియు అల్లా హ్ వద్ద నుండి ఎటువంటి దైవవాణి కాదు

أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ ۖ قُلْ إِنِ ٱفْتَرَيْتُهُۥ فَلَا تَمْلِكُونَ لِى مِنَ ٱللَّهِ شَيْـًٔا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِۦ شَهِيدًۢا بَيْنِى وَبَيْنَكُمْ ۖ وَهُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ ﴿٨﴾

ఏమీ ఈ ముష్రికులందరు: నిశ్ఛయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని అల్లా హ్ కు అంటగట్టా డు అని పలుకుతున్నారా ?. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి: ఒక వేళ నేను దాన్ని నా వద్ద నుండి కల్పించుకుని ఉండి అల్లాహ్ నన్ను శిక్షించదలచి ఉంటే మీకు నా విషయంలో ఎటువంటి ఉపాయం ఉండదు. అటువంటప్పుడు ఆయనపై అబద్దమును అపాదించి నేను ఎలా నా స్వయమును శిక్షకు సమర్పించుకుంటాను ?. మీరు అల్లాహ్ విషయంలో ఆయన ఖుర్ఆన్ విషయంలో దూషిస్తున్న వాటి గురించి మరియు నా విషయంలో అపనిందపాలు చేస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు. నాకు,మీకు మధ్య సాక్ష్యంగా పరిశుద్ధు డైన ఆయన చాలు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛత్తా పముతో మరలే వారి పాపములను బాగా మన్నించేవాడును,వారిపై అపారంగా కరుణించేవాడును

قُلْ مَا كُنتُ بِدْعًۭا مِّنَ ٱلرُّسُلِ وَمَآ أَدْرِى مَا يُفْعَلُ بِى وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَىَّ وَمَآ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ مُّبِينٌۭ ﴿٩﴾

ఓ ప్రవక్తా మీ దైవదౌత్యమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి: నేను మీకు ఇచ్చిన నా పిలుపునకు మీరు ఆశ్ఛర్యపోవటానికి నేను అల్లా హ్ పంపించిన మొట్టమొదటి ప్రవక్తని కాదు. వాస్తవానికి నా కన్న మునుపు చాలా మంది ప్రవక్తలు గతించారు. నా పట్ల అల్లా హ్ ఏమి చేస్తా డో మరియు మీ పట్ల ఇహలోకంలో ఏమి చేస్తా డో నాకు తెలియదు. అల్లా హ్ నాకు దైవవాణి ద్వారా తెలియపరచిన దాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను ఏదన్న పలికిన,ఏదన్న చేసిన ఆయన దైవ వాణి ప్రకారం మాత్రమే ఉంటుంది. మరియు నేను మాత్రం అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాడిని మాత్రమే

قُلْ أَرَءَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ ٱللَّهِ وَكَفَرْتُم بِهِۦ وَشَهِدَ شَاهِدٌۭ مِّنۢ بَنِىٓ إِسْرَٰٓءِيلَ عَلَىٰ مِثْلِهِۦ فَـَٔامَنَ وَٱسْتَكْبَرْتُمْ ۖ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿١٠﴾

ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి: మీరు నాకు చెప్పండి ఒక వేళ ఈ ఖుర్ఆన్ అల్లా హ్ వద్ద నుండి అయ్యి వుండి,మీరు దాన్ని తిరస్కరించి ఉండి,బనీ ఇస్రాయీల్ నుండి ఒక సాక్ష్యం పలికే వాడు దాని విషయంలో తౌరాత్ లో వచ్చిన దాన్ని నమ్ముతూ అది అల్లా హ్ వద్ద నుండి వచ్చినదని సాక్ష్యం పలికి,దానిపై అతను విశ్వాసమును కనబరచి ఉండి మరియు మీరు దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపితే అప్పుడు మీరు దుర్మార్గు లు కారా ?! నిశ్చయంగా అల్లా హ్ దుర్మార్గ ప్రజలకు సత్యము కొరకు సౌభాగ్యం కలిగించడు

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلَّذِينَ ءَامَنُوا۟ لَوْ كَانَ خَيْرًۭا مَّا سَبَقُونَآ إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا۟ بِهِۦ فَسَيَقُولُونَ هَـٰذَآ إِفْكٌۭ قَدِيمٌۭ ﴿١١﴾

మరియు ఖుర్ఆన్ ని,తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించిన వారు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు: ఒక వేళ ముహమ్మద్ తీసుకుని వచ్చినది మంచి వైపునకు మార్గదర్శకం చేసే సత్యమే అయితే ఈ నిరుపేదలు,బానిసలు,బలహీనులు మా కన్న ముందు దానివైపునకు సాగరు. మరియు ఎందుకంటే వారు తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానితో మార్గదర్శకం పొందలేదు. తొందరలోనే వారు ఇలా అంటారు: అతడు మా వద్దకు తీసుకుని వచ్చినది ఇది ప్రా చీనي అబద్దము. మరియు మేము అబద్దమును అనుసరించము

وَمِن قَبْلِهِۦ كِتَـٰبُ مُوسَىٰٓ إِمَامًۭا وَرَحْمَةًۭ ۚ وَهَـٰذَا كِتَـٰبٌۭ مُّصَدِّقٌۭ لِّسَانًا عَرَبِيًّۭا لِّيُنذِرَ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَبُشْرَىٰ لِلْمُحْسِنِينَ ﴿١٢﴾

للمح سنين ఈ ఖుర్ఆన్ కన్న మునుపు అల్లా హ్ మూసా అలైహిస్సలాంపై అవతరింపజేసిన గ్రంధం తౌరాత్ మార్గదర్శకంగా సత్యం విషయంలో అనుసరించటానికి మరియు బనీ ఇస్రా యీల్లోంచి దానిపై విశ్వాసమును కనబరచి దాన్ని అనుసరించిన వారి కొరకు కారుణ్యంగా ఉన్నది. మరియు ముహమ్మద్ సల్లల్లా హు بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అరబీ భాషలో దాని కన్న మునుపటి గ్రంధములను దృవీకరించే గ్రంధము. అల్లా హ్ కి సాటి కల్పించటం ద్వారా,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి దాని ద్వారా హెచ్చరించటానికి. మరియు ఇది తమ సంబంధమును తమ సృష్టికర్తతో మరియు తమ సంబంధమును ఆయన సృష్టితో మెరుగుపరచిన సజ్జనులకు ఒక శుభవార్త

إِنَّ ٱلَّذِينَ قَالُوا۟ رَبُّنَا ٱللَّهُ ثُمَّ ٱسْتَقَـٰمُوا۟ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿١٣﴾

నిశ్ఛయంగా ఎవరైతే మనకు అల్లా హ్ తప్ప ఇంకెవరూ ప్రభువు లేడూ అని పలికి ఆ తరువాత విశ్వాసముపై మరియు సత్కర్మపై స్థిరంగా ఉంటారో వారిపై పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి విషయంలో ఎటువంటి భయం ఉండదు. మరియు ఇహలోక భాగముల నుండి వారు కోల్పోయిన వాటిపై మరియు తమ వెనుక వారు వదిలి వచ్చిన వాటి పై వారు దుఃఖించరు

أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ خَـٰلِدِينَ فِيهَا جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٤﴾

ఈ గుణాలతో వర్ణించబడిన వారు స్వర్గవాసులు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు ఇహలోకములో ముందు పంపించుకున్న తమ సత్కర్మలపై వారికి ప్రతిఫలంగా

وَوَصَّيْنَا ٱلْإِنسَـٰنَ بِوَٰلِدَيْهِ إِحْسَـٰنًا ۖ حَمَلَتْهُ أُمُّهُۥ كُرْهًۭا وَوَضَعَتْهُ كُرْهًۭا ۖ وَحَمْلُهُۥ وَفِصَـٰلُهُۥ ثَلَـٰثُونَ شَهْرًا ۚ حَتَّىٰٓ إِذَا بَلَغَ أَشُدَّهُۥ وَبَلَغَ أَرْبَعِينَ سَنَةًۭ قَالَ رَبِّ أَوْزِعْنِىٓ أَنْ أَشْكُرَ نِعْمَتَكَ ٱلَّتِىٓ أَنْعَمْتَ عَلَىَّ وَعَلَىٰ وَٰلِدَىَّ وَأَنْ أَعْمَلَ صَـٰلِحًۭا تَرْضَىٰهُ وَأَصْلِحْ لِى فِى ذُرِّيَّتِىٓ ۖ إِنِّى تُبْتُ إِلَيْكَ وَإِنِّى مِنَ ٱلْمُسْلِمِينَ ﴿١٥﴾

ى మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల వారికి వారి జీవితంలో మరియు వారి మరణం తరువాత ధర్మమునకు వ్యతిరేకం కాని మంచి చేసి ఉత్తమంగా మెలగమని గట్టి ఆదేశమును ఇచ్చాము. ముఖ్యంగా తన తల్లిని ఎవరైతే తనను గర్భంలో కష్టంగా భరించిందో మరియు తనను కష్టంగా జన్మనిచ్చిందో. మరియు తను గర్భంలో నిలదొక్కుకుని తన పాలు విడిపించే సమయం మొదలయ్యే వరకు కాలము ముప్పై నెలలు అవుతుంది. చివరికి అతను బౌద్ధిక మరయు శారీరక తన రెండు బలములను పరిపూర్ణం చేసుకునటమునకు చేరుకున్నప్పుడు మరియు నలభై సంవత్సరములను పూర్తి చేసుకున్నప్పుడు ఇలా పలుకుతాడు: ఓ నా ప్రభువా నీవు నాపై, నా తల్లిదండ్రు లపై అనుగ్రహించిన నీ అనుగ్రహాలపై నేను కృతజ్ఞతను తెలుపుకోవటానికి నాకు స్పూర్తినివ్వు మరియు నేను నీవు సంతుష్టపడి నా నుండి స్వీకరించే సత్కర్మను చేసే నాకు స్పూర్తినివ్వు. మరియు నీవు నా సంతానమును నా కొరకు తీర్చి దిద్దు. నిశ్చయంగా నేను నా పాపముల నుండి పశ్ఛాత్తాప్పడుతూ నీ వైపునకు మరలాను. మరియు నిశ్చయంగా నేను నీ విధేయతకు కట్టు బడి ఉన్నాను,నీ ఆదేశములకు విధేయుడను

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ نَتَقَبَّلُ عَنْهُمْ أَحْسَنَ مَا عَمِلُوا۟ وَنَتَجَاوَزُ عَن سَيِّـَٔاتِهِمْ فِىٓ أَصْحَـٰبِ ٱلْجَنَّةِ ۖ وَعْدَ ٱلصِّدْقِ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ ﴿١٦﴾

يوعدون ఇలాంటి వారి నుండి వారు చేసుకున్న సత్కర్మలను మేము స్వీకరిస్తాము. మరియు మేము వారి పాపములను మన్నించి వేస్తాము. వారిని వాటి వలన పట్టు కోము. వారందరు స్వర్గ వాసుల్లో ఉంటారు. వారితో చేయబడిన ఈవాగ్దా నము సత్య వాగ్దా నము. అది తొందరలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది

وَٱلَّذِى قَالَ لِوَٰلِدَيْهِ أُفٍّۢ لَّكُمَآ أَتَعِدَانِنِىٓ أَنْ أُخْرَجَ وَقَدْ خَلَتِ ٱلْقُرُونُ مِن قَبْلِى وَهُمَا يَسْتَغِيثَانِ ٱللَّهَ وَيْلَكَ ءَامِنْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ فَيَقُولُ مَا هَـٰذَآ إِلَّآ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ ﴿١٧﴾

మరియు ఎవడైతే తన తల్లిదండ్రులతో ఇలా పలికాడో: మీకు వినాశనం కలుగు గాక. ఏమీ నేను మరణించిన తరువాత జీవింపజేయబడి నా సమాధి నుండి నేను వెలికి తీయబడుతానని మీరు నన్ను బెదిరిస్తు న్నారా ?! వాస్తవానికి చాలా తరాలు గతించిపోయాయి. మరియు వాటిలో జనం చనిపోయారు కాని వారిలో నుండి ఎవరూ జీవింపజేయబడి మరల లేపబడలేదు. మరియు అతని తల్లిదండ్రులు అల్లా హ్ తో తమ కుమారునకు విశ్వాసము కొరకు మార్గదర్శకత్వం చేయమని సహాయమును కోరేవారు. మరియు వారిద్దరు తమ కుమారునితో ఇలా పలికేవారు: ఒక వేళ నీవు మరణాంతరం లేపబడటమును విశ్వసించకపోతే నీకు వినాశనం కలుగును కాబట్టి నీవు దాన్ని విశ్వసించు. నిశ్చయంగా మరణాంతరం లేపబడటం గురించి అల్లా హ్ بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ వాగ్దా నము ఎటువంటి సందేహం లేని సత్యము. మరణాంతరం లేపబడటము పట్ల తన తిరస్కారమును నవీనపరుస్తూ అతడు ఇలా పలుకుతాడు: మరణాంతరం లేపబడటం గురించి పలుకబడుతున్న ఈ మాటలు మాత్రం పూర్వికుల పుస్తకముల నుండి మరియు వారు వ్రాసిన వాటి నుండి అనుకరించబడినవి. అవి అల్లా హ్ నుండి నిరూపించబడలేదు

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ حَقَّ عَلَيْهِمُ ٱلْقَوْلُ فِىٓ أُمَمٍۢ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ ٱلْجِنِّ وَٱلْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا۟ خَـٰسِرِينَ ﴿١٨﴾

వీరందరు వారే ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వీరికన్న మునుపటి జిన్నుల,మానవుల తరాల వారు. నిశ్చయంగా వారు తమను నరకంలో ప్రవేశింపజేసుకుని తమ స్వయమునకు మరియు తమ ఇంటివారికి నష్టమును కలిగించుకోవటం వలన నష్టపోయేవారు

وَلِكُلٍّۢ دَرَجَـٰتٌۭ مِّمَّا عَمِلُوا۟ ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَـٰلَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ ﴿١٩﴾

ఆ రెండు వర్గముల కొరకు - స్వర్గపు వర్గము మరియు నరకపు వర్గము - వారి కర్మలను బట్టి స్థా నాలు ఉంటాయి. అయితే స్వర్గ వాసుల స్థా నాలు ఉన్నత స్థా నాలు. మరియు నరక వాసుల స్థా నాలు అదమమైన శ్రేణులు. వారికి అల్లా హ్ వారి కర్మల ప్రతిఫలమును సంపూర్ణంగా ఇవ్వటానికి. మరియు వారికి ప్రళయదినమున వారి పుణ్యములు తగ్గించి, వారి పాపములు అధికం చేసి అన్యాయం చేయబడదు

وَيَوْمَ يُعْرَضُ ٱلَّذِينَ كَفَرُوا۟ عَلَى ٱلنَّارِ أَذْهَبْتُمْ طَيِّبَـٰتِكُمْ فِى حَيَاتِكُمُ ٱلدُّنْيَا وَٱسْتَمْتَعْتُم بِهَا فَٱلْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ ٱلْهُونِ بِمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَبِمَا كُنتُمْ تَفْسُقُونَ ﴿٢٠﴾

మరియు ఆ రోజు అల్లా హ్ పై అవిశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శిక్షంచటం కొరకు ప్రవేశపెట్టటం జరుగుతుంది. మరియు వారిని మందలిస్తూ మరియు దూషిస్తూ ఇలా పలకబడుతుంది: మీరు మీ ఇహలోక జీవితంలోనే మీ మంచి వస్తు వులను పోగొట్టు కున్నారు. మరియు మీరు అందులో ఉన్న సుఖభోగాలను అనుభవించేశారు. ఇక పోతే ఈ రోజున, మీరు భూమిలో అన్యాయంగా చూపించిన మీ అహంకారము వలన మరియు అవిశ్వాసం,పాపకార్యములతో మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోవటం వలన మిమ్మల్ని అవమానమమునకు గురి చేసే,మిమ్మల్ని పరాభవమునకు గురి చేసే శిక్ష మీకు ఇవ్వబడుతుంది

۞ وَٱذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنذَرَ قَوْمَهُۥ بِٱلْأَحْقَافِ وَقَدْ خَلَتِ ٱلنُّذُرُ مِنۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِۦٓ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍۢ ﴿٢١﴾

أخاف عليكم عذاب يوم عظيم ఓ ప్రవక్తా మీరు బంధములో ఆద్ సోదరుడైన హూద్ అలైహిస్సలాం తన జాతివారిని వారిపై వాటిల్లే శిక్ష గురించి హెచ్చరించినప్పటి వైనమును జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు వారు అరేబియా ద్వీపకల్పం యొక్క దక్షిణప్రాంతంలో తమ ఇళ్లల్లో ఉన్నారు. వాస్తవానికి హూద్ కన్న ముందు మరియు ఆయన తరువాత ప్రవక్తలు తమ జాతి వారిని హెచ్చరిస్తూ వారితో ఇలా పలుకుతూ గతించారు: మీరు ఒక్కడైన అల్లా హ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు ఇతరులను ఆరాధించకండి. ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను మీ గురించి గొప్ప దినమైన ప్రళయదిన శిక్ష గురించి భయపడుతున్నాను

قَالُوٓا۟ أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ ءَالِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ ﴿٢٢﴾

ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు: ఏమీ నీవు మమ్మల్ని మా దేవతల ఆరాధన నుండి దూరం చేయటానికి మా వద్దకు వచ్చావా ?! అది నీకు జరగదు. నీవు మాకు బేదిరిస్తు న్నశిక్షను మా వద్దకు తీసుకునిరా ఒక వేళ నీవు బెదిరిస్తు న్నవిషయంలో సత్యవంతుడివేనైతే

قَالَ إِنَّمَا ٱلْعِلْمُ عِندَ ٱللَّهِ وَأُبَلِّغُكُم مَّآ أُرْسِلْتُ بِهِۦ وَلَـٰكِنِّىٓ أَرَىٰكُمْ قَوْمًۭا تَجْهَلُونَ ﴿٢٣﴾

ఆయన ఇలా సమాధానమిచ్చారు: శిక్ష వేళ యొక్క జ్ఞా నము అల్లా హ్ వద్ద మాత్రమే ఉన్నది. మరియు నాకు దాని గురించి ఎటువంటి జ్ఞా నం లేదు. నేను మాత్రం నాకు మీ వద్దకు ఇచ్చి పంపించిన సందేశాలను మీకు చేరవేసే ఒక ప్రవక్తను. కాని నేను మిమ్మల్ని, మీకు ప్రయోజనం ఉన్న వాటి విషయంలో అజ్ఞా నులై దాన్ని వదిలివేసే మరియు మీకు నష్టం ఉన్న వాటిని పొందే జనులుగా చూస్తు న్నాను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

فَلَمَّا رَأَوْهُ عَارِضًۭا مُّسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا۟ هَـٰذَا عَارِضٌۭ مُّمْطِرُنَا ۚ بَلْ هُوَ مَا ٱسْتَعْجَلْتُم بِهِۦ ۖ رِيحٌۭ فِيهَا عَذَابٌ أَلِيمٌۭ ﴿٢٤﴾

మరి ఎప్పుడైతే వారు తొందర చేసిన శిక్ష వారి వద్దకు వచ్చినదో వారు దాన్ని ఆకాశపు ఒక వైపు ఒక మేఘము రూపంలో ప్రత్యక్షమై తమ లోయల వైపునకు వస్తుండగా చూసి ఇలా పలికారు: ఇది మాపై వర్షమును కురిపించటానికి ప్రత్యక్షమయింది. హూద్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు: విషయము మీరు అనుకుంటున్నట్లు అది మీపై వర్షమును కురిపించే మేఘం కాదు. కాని అది మీరు తొందరగా కోరుకున్న శిక్ష. అది ఒక గాలి అందులో ఒక బాధాకరమైన శిక్ష కలదు

تُدَمِّرُ كُلَّ شَىْءٍۭ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا۟ لَا يُرَىٰٓ إِلَّا مَسَـٰكِنُهُمْ ۚ كَذَٰلِكَ نَجْزِى ٱلْقَوْمَ ٱلْمُجْرِمِينَ ﴿٢٥﴾

అల్లా హ్ దేనిని నాశనం చేయమని దానికి ఆదేశించాడో అది ఆ ప్రతీ దానిపై వీచి నాశనం చేస్తుంది. వారి నివాసుమున్న వారి ఇండ్లను వారు ముందు వాటిలో ఉన్నట్లు సాక్ష్యం పలకటమును మాత్రమే కనిపించబడును. తమ అవిశ్వాసం పై మరియు తమ పాపకార్యములపై మొండిగా వ్యవహరించే వారికి మేము ఇటువంటి బాధాకరమైన శిక్షను కలిగిస్తా ము

وَلَقَدْ مَكَّنَّـٰهُمْ فِيمَآ إِن مَّكَّنَّـٰكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًۭا وَأَبْصَـٰرًۭا وَأَفْـِٔدَةًۭ فَمَآ أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَآ أَبْصَـٰرُهُمْ وَلَآ أَفْـِٔدَتُهُم مِّن شَىْءٍ إِذْ كَانُوا۟ يَجْحَدُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿٢٦﴾

మరియు నిశ్ఛయంగా మేము మీకు ఇవ్వని సాధికారత సాధనాలను హూద్ జాతివారికి ప్రసాదించాము. మరియు మేము వారికి వినగలిగే వినికిడిని మరియు చూడగలిగే చూపును మరియు అర్ధం చేసుకునే హృదయములను చేశాము. అయితే వారి వినికిడి గాని వారి చూపులు గాని వారి బుద్దు లు గాని వారికి ఏమాత్రం పనికి రాలేదు. వారి వద్దకు అల్లాహ్ శిక్ష వచ్చినప్పుడు అవి వారి నుండి తొలగించలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు. మరియు వారిపై వారి ప్రవక్త హూద్ అలైహిస్సలాం భయపెట్టిన శిక్షదేని గురించినయితే వారు హేళన చేసే వారో అది కురిసింది

وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُم مِّنَ ٱلْقُرَىٰ وَصَرَّفْنَا ٱلْـَٔايَـٰتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ﴿٢٧﴾

ఓ మక్కా వాసులారా నిశ్ఛయంగా మేము మీ చుట్టు ప్రక్కల కల ఎన్నో బస్తీలను నాశనం చేశాము. నిశ్ఛయంగా మేము ఆద్ ను,సమూద్ ను,లూత్ జాతి వారిని మరియు మద్యన్ వారిని నాశనం చేశాము. మరియు మేము వారు తమ అవిశ్వాసము నుండి మరలుతారని ఆశిస్తూ వారి కొరకు రకరకాల వాదనలను,ఆధారాలను ఇచ్చాము

فَلَوْلَا نَصَرَهُمُ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ قُرْبَانًا ءَالِهَةًۢ ۖ بَلْ ضَلُّوا۟ عَنْهُمْ ۚ وَذَٰلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا۟ يَفْتَرُونَ ﴿٢٨﴾

అయితే వారు అల్లాహ్ ను వదిలి దేవతలుగా తయారు చేసుకుని,ఆరాధన ద్వారా,బలి ఇవ్వటం ద్వారా వారు దగ్గరత్వమును పొందిన విగ్రహాలు ఎందుకని వారికి సహాయం చేయలేదు ?! అవి వారికి ఖచ్చితంగా సహాయం చేయవు. అంతే కాదు వారికి వారు అత్యంత అవసరమైనప్పుడు వారు వారి నుండి అదృశ్యమైపోయారు. మరియు ఈ విగ్రహాలు వారికి ప్రయోజనం కలిగిస్తా యని మరియు వారి కొరకు అల్లా హ్ వద్ద సిఫారసు చేస్తా రని వారు ఏదైతే ఆశించారో అదంతా వారి అబద్దము మరియు వారి కల్పన

وَإِذْ صَرَفْنَآ إِلَيْكَ نَفَرًۭا مِّنَ ٱلْجِنِّ يَسْتَمِعُونَ ٱلْقُرْءَانَ فَلَمَّا حَضَرُوهُ قَالُوٓا۟ أَنصِتُوا۟ ۖ فَلَمَّا قُضِىَ وَلَّوْا۟ إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ ﴿٢٩﴾

ఓ ప్రవక్తా మేము మీ వైపునకు జిన్నుల్లో నుండి ఒక వర్గమును మీ వద్దకు పంపిస్తే వారు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ ను వింటున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. వారు దాన్ని వినటానికి హాజరు అయినప్పుడు పరస్పరం ఇలా మాట్లా డుకున్నారు: మేము దాన్ని వినగలిగే వరకు మీరు నిశబ్దంగా ఉండండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖిరాఅత్ ను ముగించగానే వారు తమ జాతి వారి వద్దకు ఒక వేళ వారు ఈ ఖుర్ఆన్ ను విశ్వసించకపోతే వారిని అల్లా హ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ మరలారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

قَالُوا۟ يَـٰقَوْمَنَآ إِنَّا سَمِعْنَا كِتَـٰبًا أُنزِلَ مِنۢ بَعْدِ مُوسَىٰ مُصَدِّقًۭا لِّمَا بَيْنَ يَدَيْهِ يَهْدِىٓ إِلَى ٱلْحَقِّ وَإِلَىٰ طَرِيقٍۢ مُّسْتَقِيمٍۢ ﴿٣٠﴾

వారు వారితో ఇలా పలికారు: ఓ మా జాతి వారా మేము మూసా తరువాత అల్లా హ్ అవతరింపజేసిన గ్రంధమును విన్నాము అది దాని కన్న మునుపు అల్లా హ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను దృవీకరుస్తుంది. మేము విన్న ఈ గ్రంధము సత్యము వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది. మరియు అది ఇస్లాం మార్గము

يَـٰقَوْمَنَآ أَجِيبُوا۟ دَاعِىَ ٱللَّهِ وَءَامِنُوا۟ بِهِۦ يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُجِرْكُم مِّنْ عَذَابٍ أَلِيمٍۢ ﴿٣١﴾

ఓ మా జాతి వారా ముహమ్మద్ మిమ్మల్ని పిలుస్తున్న సత్యము విషయంలో ఆయనను స్వీకరించండి. మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపములను మీ కొరకు మన్నించివేస్తాడు మరియు ఆయన మిమ్మల్ని మీ కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన సత్యము విషయంలో ఆయనను అంగీకరించకపోయినప్పుడు మరియు ఆయనను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించనప్పుడు మీరు బాధాకరమైన శిక్షకు అర్హులవుతారు

وَمَن لَّا يُجِبْ دَاعِىَ ٱللَّهِ فَلَيْسَ بِمُعْجِزٍۢ فِى ٱلْأَرْضِ وَلَيْسَ لَهُۥ مِن دُونِهِۦٓ أَوْلِيَآءُ ۚ أُو۟لَـٰٓئِكَ فِى ضَلَـٰلٍۢ مُّبِينٍ ﴿٣٢﴾

మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిచిన సత్యమును అంగీకరించని వాడు భూమిలో పారిపోయి అల్లాహ్ నుండి తప్పించుకోలేడు. మరియు అతని కొరకు శిక్ష నుండి రక్షించే వాడు అల్లాహ్ కాకుండా ఏ రక్షకుడు లేడు. వారందరు సత్యము నుండి స్పష్టముగా తప్పిపోయారు

أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَلَمْ يَعْىَ بِخَلْقِهِنَّ بِقَـٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ ۚ بَلَىٰٓ إِنَّهُۥ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ ﴿٣٣﴾

كل شىء قدير మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరు ఆ అల్లా హ్ ఆకాశములను మరియు భూమిని సృష్టించిన వాడు మరియు అవి పెద్దవైనా కూడా,విశాలమైనా కూడా వాటిని సృష్టించటం నుండి అశక్తుడు కాని వాడు మృతులను లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు జీవింపజేయటం పై సామర్ధ్యం కలవాడని చూడటం లేదా ?! ఎందుకు కాదు. ఆయన వారిని జీవింపజేయటంపై సామర్ధ్యము కలవాడు. పరిశుద్ధు డైన ఆయన ప్రతీ వస్తు వుపై సామర్ధ్యం కలవాడు. మృతులను జీవిపజేయటం నుండి ఆయన అశక్తు డు కాడు

وَيَوْمَ يُعْرَضُ ٱلَّذِينَ كَفَرُوا۟ عَلَى ٱلنَّارِ أَلَيْسَ هَـٰذَا بِٱلْحَقِّ ۖ قَالُوا۟ بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا۟ ٱلْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ﴿٣٤﴾

మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శక్షించటానికి తిసుకుని రాబడే దినమున వారితో మందలిస్తూ ఇలా పలకబడుతుంది: ఏమీ మీరు చూస్తు న్నటువంటి ఈ శిక్ష వాస్తవం కాదా ?! లేదా మీరు ఇహలోకంలో మీరు పలికిన విధంగా అబద్దమా ?! వారు, మా ప్రభువు సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము అని పలుకుతారు. అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది: అల్లా హ్ పై మీ అవిశ్వాసం కారణంగా మీరు శిక్షను చవిచూడండి

فَٱصْبِرْ كَمَا صَبَرَ أُو۟لُوا۟ ٱلْعَزْمِ مِنَ ٱلرُّسُلِ وَلَا تَسْتَعْجِل لَّهُمْ ۚ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ مَا يُوعَدُونَ لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا سَاعَةًۭ مِّن نَّهَارٍۭ ۚ بَلَـٰغٌۭ ۚ فَهَلْ يُهْلَكُ إِلَّا ٱلْقَوْمُ ٱلْفَـٰسِقُونَ ﴿٣٥﴾

ఓ ప్రవక్తా మీరు నూహ్,ఇబ్రాహీమ్,మూసా,ఈసా అలైహిముస్సలాంటి దృఢ సంకల్పం కల ప్రవక్తలు సహహనం పాటించినట్లు గా మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించటంపై సహనం చూపండి. వారి కొరకు శిక్ష గురించి తొందర చేయకండి. మీ జాతి వారిలో నుండి తిరస్కారులు పరలోకంలో వారికి వాగ్దా నం చేయబడిన శిక్షను చూసిన రోజు వారి శిక్ష పొడిగింపు వలన వారు ఇహలోకంలో దినపు ఒక ఘడియను మాత్రమే గడిపారనుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఒక సందేశము మరియు మానవులకు,జిన్నులకు చాలును. నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లా హ్ విధేయత నుండి తొలగిపోయిన జాతి వారు మాత్రమే శిక్ష ద్వారా నాశనం చేయబడుతారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Ahqaf — الأحقاف

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు