ముఖపేజీతఫ్సీర్Luqman (31)

తఫ్సీర్ Luqman (31) — لقمان

మక్కీ · 34 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

الٓمٓ ﴿١﴾

تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْحَكِيمِ ﴿٢﴾

ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఈ ఆయతులు విజ్ఞతతో మాట్లా డే గ్రంధ ఆయతులు. هدى ورحمة للمح سنين

هُدًۭى وَرَحْمَةًۭ لِّلْمُحْسِنِينَ ﴿٣﴾

మరియు అది తమ ప్రభువు హక్కులను,ఆయన దాసుల హక్కులను నెరవేర్చటంతో సత్కార్యము చేసే వారి కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము

ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلْـَٔاخِرَةِ هُمْ يُوقِنُونَ ﴿٤﴾

వారు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటిస్తా రు మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును చెల్లిస్తా రు. మరియు వారు అంతిమ దినములో ఉన్న మరణాంతరం లేపబడటం,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం,శిక్షింపబడటం పై విశ్వాసమును కనబరుస్తా రు

أُو۟لَـٰٓئِكَ عَلَىٰ هُدًۭى مِّن رَّبِّهِمْ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ ﴿٥﴾

ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తమ ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉన్నారు. మరియు వారందరే తాము ఆశించిన వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి దూరంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు

وَمِنَ ٱلنَّاسِ مَن يَشْتَرِى لَهْوَ ٱلْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ ٱللَّهِ بِغَيْرِ عِلْمٍۢ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌۭ مُّهِينٌۭ ﴿٦﴾

మరియు ప్రజల్లోంచి నజర్ బిన్ హారిస్ లాంటి వారు పరధ్యానంలో పడవేసే మాటలను ఎంచుకుని ప్రజలను ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లా హ్ ధర్మం నుండి వాటి వైపు మరలిస్తారు. మరియు అల్లాహ్ ఆయతులను ఎగతాళిగా చేసుకుని వాటి నుండి పరిహాసమాడేవారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరికి పరలోకంలో అవమానమునుకలిగించే శిక్ష ఉన్నది

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًۭا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِىٓ أُذُنَيْهِ وَقْرًۭا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ ﴿٧﴾

మరియు అతనిపై మా ఆయతులు చదివి వినిపించినప్పుడు అతడు వాటిని వినటం నుండి అహంకారమును చూపుతూ వాటిని విననట్లుగా, శబ్దములను వినటం నుండి అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లు గా మరలిపోతాడు. ఓ ప్రవక్తా మీరు అతనికి అతని గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి శుభవార్తనివ్వండి

إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ جَنَّـٰتُ ٱلنَّعِيمِ ﴿٨﴾

నిశ్చయంగా అల్లా హ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసే వారి కొరకు అనుగ్రహభరితమైన స్వర్గ వనాలు కలవు. అల్లా హ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచిన వాటిని అనుభవిస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ق

خَـٰلِدِينَ فِيهَا ۖ وَعْدَ ٱللَّهِ حَقًّۭا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٩﴾

వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. దీని గురించి అల్లా హ్ వారితో ఎటువంటి సందేహం లేని సత్య వాగ్దా నము చేశాడు. మరియు పరిశుద్ధు డైన ఆయన తనని ఎవరూ ఓడించని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన విధి వ్రా తలో,తన ధర్మ శాసనములలో వివేకనంతుడు

خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ بِغَيْرِ عَمَدٍۢ تَرَوْنَهَا ۖ وَأَلْقَىٰ فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِكُمْ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٍۢ ۚ وَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۭ فَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۢ كَرِيمٍ ﴿١٠﴾

పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను ఎత్తుగా ఎటువంటి స్థంభములు లేకుండా సృష్టించాడు. మరియు భూమిలో అది మిమ్మల్ని తీసుకుని ప్రకంపించకుండా ఉండేందుకు పర్వతములను పాతాడు. మరియు భూమిపై రకరకాల జంతువులను విస్తరింపజేశాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని అవతరింపజేశాము. అప్పుడు మేము భూమిలో ఆనందభరితమైన దృశ్యము కల అన్ని రకముల వాటిని మొలకెత్తించాము. దానితో ప్రజలు,పశువులు ప్రయోజనం చెందుతారు

هَـٰذَا خَلْقُ ٱللَّهِ فَأَرُونِى مَاذَا خَلَقَ ٱلَّذِينَ مِن دُونِهِۦ ۚ بَلِ ٱلظَّـٰلِمُونَ فِى ضَلَـٰلٍۢ مُّبِينٍۢ ﴿١١﴾

ఈ ప్రస్తావించబడినవి అల్లా హ్ సృష్టితాలు. ఓ ముష్రికులారా అల్లా హ్ ను వదిలి మీరు ఆరాధించేవి ఏమి సృష్టించాయో నాకు చూపించండి ?!. కాని దుర్మార్గులు సత్యము నుండి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారు. ఏవిధంగానంటే వారు తమ ప్రభువుతో పాటు ఏమీ సృష్టించని వారిని సాటి కల్పిస్తు న్నారు. మరియు వారే సృష్టించబడినవారు

وَلَقَدْ ءَاتَيْنَا لُقْمَـٰنَ ٱلْحِكْمَةَ أَنِ ٱشْكُرْ لِلَّهِ ۚ وَمَن يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِۦ ۖ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِىٌّ حَمِيدٌۭ ﴿١٢﴾

మరియు నిశ్చయంగా మేము లుఖ్మాన్ కు ధర్మ విషయంలో అవగాహన,వ్యవహారాల విషయంలో ఖచ్చితత్వమును ప్రసాదించాము. మరియు అతనితో మేము ఇలా పలికాము: ఓ లుఖ్మాన్ నీవు నీ ప్రభువునకు తన విధేయత కొరకు నీకు ఆయన అనుగ్రహించిన భాగ్యముపై కృతజ్ఞత తెలుపుకో. మరియు ఎవరైతే తన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుకుంటాడోఅతని కృతజ్ఞత తేలుపుకోవటం యొక్క ప్రయోజనం అతనిపైనే మరలుతుంది. కాని అల్లా హ్ అతని కృతజ్ఞత తెలుపుకోవటం నుండి అక్కర లేని వాడు. మరియు ఎవరైతే తనపై ఉన్న అల్లా హ్ అనుగ్రహమును తిరస్కరించి దాని పట్ల కృతఘ్నుడైపోతాడో ఆయన పరిశుద్ధు డు. అతని కృతఘ్నత యొక్క నష్టము మాత్రం అతనిపైనే ఉంటుంది. మరియు అతడు అల్లా హ్ కు ఎటువంటి నష్టం కలిగించలేడు. ఎందుకంటే ఆయన తన సృష్టితాలన్నింటి నుండి అక్కరలేని వాడు. ప్రతీ స్థితిలో స్థు తింపబడినవాడు

وَإِذْ قَالَ لُقْمَـٰنُ لِٱبْنِهِۦ وَهُوَ يَعِظُهُۥ يَـٰبُنَىَّ لَا تُشْرِكْ بِٱللَّهِ ۖ إِنَّ ٱلشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌۭ ﴿١٣﴾

ఓ ప్రవక్తా మీరు లుఖ్మాన్ తన కొడుకును మంచి విషయంలో ప్రో త్సహిస్తూ మరియు అతన్ని చెడు నుండి హెచ్చరిస్తూ ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి: ఓ నా ప్రియ కుమారుడా నీవు అల్లా హ్ తో పాటు ఇతరులను ఆరాధించకు. నిశ్చయంగా అల్లా హ్ తో పాటు ఏ ఆరాధ్య దైవమునకు ఆరాధన చేయటం అనేది మనిషిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి దారి తీసే పెద్ద పాపమునకు పాల్పడటం ద్వారా మనిషి కొరకు పెద్ద అన్యాయము

وَوَصَّيْنَا ٱلْإِنسَـٰنَ بِوَٰلِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُۥ وَهْنًا عَلَىٰ وَهْنٍۢ وَفِصَـٰلُهُۥ فِى عَامَيْنِ أَنِ ٱشْكُرْ لِى وَلِوَٰلِدَيْكَ إِلَىَّ ٱلْمَصِيرُ ﴿١٤﴾

మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులకి విధేయత చూపమని మరియు అల్లా హ్ కొరకు అవిధేయత లేని విషయములలో వారి పట్ల ఉత్తమంగా మెలగమని తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని తన గర్భములో బాధ తరువాత బాధను పొందుతూ మోసింది. మరియు అతనికి పాలు త్రాపించటమును ఆపటమనేది రెండు సంవత్సరముల కాలములో. మరియు మేము అతనితో ఇలా పలికాము: నీవు అల్లాహ్ కొరకు ఆయన నీపై అనుగ్రహించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకో. ఆ తరువాత నీవు నీ తల్లిదండ్రులకు వారు నీ పెంపకము,నీ సంరక్షణ పట్ల స్థిరంగా ఉన్న దానికి కృతజ్ఞత తెలుపుకో. నా ఒక్కడి వైపే మరలటం జరుగుతుంది. అప్పుడు నేను ప్రతి ఒక్కరికి అతను అర్హత కలిగిన దాన్ని ప్రతిఫలమును ప్రసాదిస్తా ను. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِن جَـٰهَدَاكَ عَلَىٰٓ أَن تُشْرِكَ بِى مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌۭ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِى ٱلدُّنْيَا مَعْرُوفًۭا ۖ وَٱتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَىَّ ۚ ثُمَّ إِلَىَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿١٥﴾

ఒక వేళ తల్లిదండ్రు లు తమ తరపు నుండి నిర్ణయించుకుని నీవు అల్లా హ్ తో పాటు ఇతరులను సాటి కల్పించటంపై నిన్ను ప్రేరేపించటానికి ప్రయత్నం చేస్తే ఆ విషయంలో నీవు వారి మాట వినకు. ఎందుకంటే సృష్టికర్త అవిధేయతలో ఎటువంటి సృష్టికి విధేయత చూపటం సరికాదు. మరియు నీవు ఇహలోకములో మంచితనముతో,బంధుత్వముతో,ఉపకారముతో వారికి తోడుగా ఉండు. మరియు నీవు నా వైపునకు ఏకత్వముతో,విధేయతతో మరలే వారి మార్గమును అనుసరించు. ఆ తరువాత ప్రళయదినాన నా ఒక్కడి వైపునకే మీ అందరి మరలటం ఉంటుంది. అప్పుడు నేను మీరు ఇహలోకంలో చేసే కర్మల గురించి మీకు తెలియపరుస్తా ను. మరియు వాటి పరంగా మీకు నేను ప్రతిఫలమును ప్రసాదిస్తా ను

يَـٰبُنَىَّ إِنَّهَآ إِن تَكُ مِثْقَالَ حَبَّةٍۢ مِّنْ خَرْدَلٍۢ فَتَكُن فِى صَخْرَةٍ أَوْ فِى ٱلسَّمَـٰوَٰتِ أَوْ فِى ٱلْأَرْضِ يَأْتِ بِهَا ٱللَّهُ ۚ إِنَّ ٱللَّهَ لَطِيفٌ خَبِيرٌۭ ﴿١٦﴾

ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా దుష్కర్మ లేదా సత్కర్మ ఒక వేళ అది ఒక ఆవ గింజ బరువంత చిన్నదిగా ఉండి,ఏదైన ఒక పెద్ద రాతి బండ లోపల ఉండి దాన్ని ఎవరు తెలుసుకోకపోయినా లేదా అది ఆకాశముల్లో గాని భూమిలో గానీ ఏ ప్రదేశములో ఉన్నా నిశ్చయంగా అల్లాహ్ దాన్ని ప్రళయదినమున తీసుకుని వస్తాడు. దాని పరంగా ఆయన దాసుడికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మగ్రాహి సున్నితమైన వస్తు వులు ఆయనపై గోప్యంగా ఉండవు. ఆయన వాటి వాస్తవికతలను,వాటి స్థా నాలను తెలుసుకునేవాడు

يَـٰبُنَىَّ أَقِمِ ٱلصَّلَوٰةَ وَأْمُرْ بِٱلْمَعْرُوفِ وَٱنْهَ عَنِ ٱلْمُنكَرِ وَٱصْبِرْ عَلَىٰ مَآ أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ ٱلْأُمُورِ ﴿١٧﴾

ఓ నా ప్రియ కుమారా నీవు నమాజును దాని పరిపూర్ణపద్దతిలో పాటించి నెలకొల్పు,మంచి గురించి ఆదేశించు,చెడు గురించి వారించు. ఆ విషయంలో నీకు కలిగే బాదపై సహనం చూపు. వాటిలో నుండి నీకు ఏవైతే ఆజ్ఞా పించబడినవో అవి నీవు చేయాలని అల్లా హ్ నీపై గట్టిగా తెలిపినవి. అందులో నీకు ఎటువంటి ఎంపిక లేదు

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِى ٱلْأَرْضِ مَرَحًا ۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍۢ فَخُورٍۢ ﴿١٨﴾

మరియు నీవు నీ ముఖమును అహంకారముతో ప్రజల నుండి త్రిప్పకు మరియు నీవు భూమిపై నీ స్వయమును ఇష్టపడుతూ నవ్వుతూ నడవకు. నిశ్చయంగా అల్లా హ్ తన నడకలో గర్వించే,తనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల గర్వించి ప్రజల ముందు వాటిపై అహంను ప్రదర్శించి,అల్లా హ్ కు వాటిపై కృతజ్ఞత తెలుపని ప్రతి ఒక్కడినీ ఇష్టపడడు

وَٱقْصِدْ فِى مَشْيِكَ وَٱغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ ٱلْأَصْوَٰتِ لَصَوْتُ ٱلْحَمِيرِ ﴿١٩﴾

మరియు నీవు నీ నడకలో వేగమునకు,నిదానమునకు మధ్యలో ఉండి హొందాతనము బహిర్గతమయ్యే మధ్య మార్గమును పాటించు. మరియు నీ స్వరమును తగ్గించు, బాధ పెట్టేంత బిగ్గరగా దానిని చేయకు. నిశ్చయంగా స్వరాలలో అతి చెడ్డ స్వరము గాడిద స్వరము బిగ్గరగా ఉండటం వలన

أَلَمْ تَرَوْا۟ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ وَأَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهُۥ ظَـٰهِرَةًۭ وَبَاطِنَةًۭ ۗ وَمِنَ ٱلنَّاسِ مَن يُجَـٰدِلُ فِى ٱللَّهِ بِغَيْرِ عِلْمٍۢ وَلَا هُدًۭى وَلَا كِتَـٰبٍۢ مُّنِيرٍۢ ﴿٢٠﴾

ఓ ప్రజలారా మీరు చూడలేదా,గమనించలేదా అల్లా హ్ ఆకాశములలో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలను ప్రయోజనం పొందటమునకు మీ కొరకు అందుబాటులో ఉంచాడు. మరియు భూమిపై ఉన్న జంతువులను,వృక్షాలను,మొక్కలను కూడా మీకు అందుబాటులో ఉంచాడు. మరియు ఆయన ప్రత్యక్షంగా కనబడే రూప అందము, మంచి శరీరాకృతి లాంటి మరియు లోపల దాగి ఉన్న బుద్ధి,జ్ఞానము లాంటి తన అనుగ్రహాలను మీపై పరిపూర్ణం చేశాడు. ఈ అనుగ్రహాలు ఉండి కూడా ప్రజల్లోంచి కొంతమంది అల్లాహ్ వద్ద నుండి దివ్య జ్ఞానముతో ఎటువంటి పత్రిక జ్ఞానం లేకుండా లేదా కాంతివంతమైన బుద్ధి, అల్లా హ్ వద్ద నుండి అవతరింపబడిన ఎటువంటి స్పష్టమైన గ్రంధం లేకుండా అల్లా హ్ ఏకత్వము విషయంలో వాదులాడుతున్నారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّبِعُوا۟ مَآ أَنزَلَ ٱللَّهُ قَالُوا۟ بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ ءَابَآءَنَآ ۚ أَوَلَوْ كَانَ ٱلشَّيْطَـٰنُ يَدْعُوهُمْ إِلَىٰ عَذَابِ ٱلسَّعِيرِ ﴿٢١﴾

మరియు అల్లాహ్ తౌహీద్ విషయంలో వాదులాడే వీరందరితో "మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన దైవ వాణిని అనుసరించండి" అని పలికినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చేవారు: మేము దాన్ని అనుసరించము కాని మేము మా పూర్వికులను మా ఆరాధ్య దైవాల ఆరాధనల్లోంచి దేనిపై మేము పొందామో దాన్ని అనుసరిస్తాము. ఏమీ ఒక వేళ షైతాను వారి పూర్వికులను వారిని అపమార్గమునకు లోను చేసే విగ్రహారాాధన ద్వారా ప్రళయదినమున అగ్ని శిక్ష వైపునకు పిలిచినా వారు వారిని అనుసరిస్తా రా ?!

۞ وَمَن يُسْلِمْ وَجْهَهُۥٓ إِلَى ٱللَّهِ وَهُوَ مُحْسِنٌۭ فَقَدِ ٱسْتَمْسَكَ بِٱلْعُرْوَةِ ٱلْوُثْقَىٰ ۗ وَإِلَى ٱللَّهِ عَـٰقِبَةُ ٱلْأُمُورِ ﴿٢٢﴾

మరియు ఎవరైతే అల్లా హ్ వైపునకు తన ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ,తన ఆచరణను మంచిగా చేస్తూ ముందుకు పోతాడో అతడు ముక్తిని ఆశించే వాడు, సంబంధంపెట్టుకునే దృఢమైన దాన్ని పట్టుకున్నాడు ఏ విధంగానంటే తాను పట్టుకున్నది తెగిపోతుందన్నభయం అతనికి ఉండదు. మరియు అల్లా హ్ ఒక్కడి వైపే వ్యవహారలన్నింటి పరిణామము,వాటి మరలటం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కడికి దేనికి అతడు హక్కు దారుడో దాన్ని ప్రసాదిస్తా డు

وَمَن كَفَرَ فَلَا يَحْزُنكَ كُفْرُهُۥٓ ۚ إِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوٓا۟ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴿٢٣﴾

మరియు ఎవరైతే అల్లా హ్ పై అవిశ్వాసమును కనబరుస్తా డో ఓ ప్రవక్తా అతని అవిశ్వాసం మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మా ఒక్కరి వైపే ప్రళయదినాన వారి మరలటం జరుగును. అప్పుడు మేము వారు ఇహలోకంలో చేసిన దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాము. మరియు వాటి పరంగా వారికి మేము ప్రతిఫలమును ప్రసాదిస్తాము. నిశ్ఛయంగా అల్లాహ్ హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నవి ఏవీ ఆయనపై గోప్యంగా ఉండవు. نمتعهم قليلا ثم نضطرهم إلىعذاب غليظ

نُمَتِّعُهُمْ قَلِيلًۭا ثُمَّ نَضْطَرُّهُمْ إِلَىٰ عَذَابٍ غَلِيظٍۢ ﴿٢٤﴾

మరియు మేము ఇహలోకంలో వారికి ప్రసాదించిన సుఖాలను కొంత కాలం వరకు వారిని అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని ప్రళయదినమున తీవ్ర శిక్ష వైపునకు మళ్ళిస్తా ము. అది నరక శిక్ష

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلِ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ﴿٢٥﴾

ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను సృష్టించినదెవరు,భూమిని సృష్టించినదెవరు ? అని అడిగితే వారు తప్పకుండ వాటిని సృష్టించినది అల్లా హ్ అని సమాధానమిస్తా రు. మీరు వారితో ఇలా అనండి: స్థు తులన్ని మీపై వాదనను బహిర్గతం చేసిన అల్లా హ్ కే చెందుతాయి. అంతే కాదు వారిలో చాలా మంది తమ అజ్ఞా నం వలన స్థు తులకు హక్కుదారుడెవరో తెలుసుకోలేకపోతున్నారు

لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلْغَنِىُّ ٱلْحَمِيدُ ﴿٢٦﴾

ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిపై ఉన్నవన్నీ సృష్టి పరంగా,అధికారము పరంగా,కార్యనిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. నిశ్చయంగా అల్లా హ్ తన సృష్టితాలన్నింటి నుండి అక్కరలేని వాడు. ఇహపరలోకాల్లో స్థు తింపబడేవాడు

وَلَوْ أَنَّمَا فِى ٱلْأَرْضِ مِن شَجَرَةٍ أَقْلَـٰمٌۭ وَٱلْبَحْرُ يَمُدُّهُۥ مِنۢ بَعْدِهِۦ سَبْعَةُ أَبْحُرٍۢ مَّا نَفِدَتْ كَلِمَـٰتُ ٱللَّهِ ۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٌۭ ﴿٢٧﴾

حكيم మరియు ఒక వేళ భూమిలో ఉన్న వృక్షములన్నింటిని నరికివేసి కలములుగా తయారు చేసి మరియు సముద్రమును వాటిని సిరాగా చేసి,ఒక వేళ దాన్ని ఏడు సముద్రములుగా విస్తరింపజేసిన అల్లా హ్ మాటలు వాటి ముగింపు లేకపోవటం వలన అంతం కావు. నిశ్చయంగా అల్లా హ్ అతన్ని ఎవరూ ఓడించని بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ సర్వాధిక్యుడు. అతడు తన సృష్టించటంలో,తన వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు

مَّا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ إِلَّا كَنَفْسٍۢ وَٰحِدَةٍ ۗ إِنَّ ٱللَّهَ سَمِيعٌۢ بَصِيرٌ ﴿٢٨﴾

ఓ ప్రజలారా ప్రళయదినాన లెక్క తీసుకోవటం కొరకు, ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మిమ్మల్ని సృష్టించటం,మిమ్మల్ని మరల లేపటం ఒక ప్రాణమును సృష్టించటం మాదిరి మాత్రమే. మరియు దాన్ని మరల లేపటం సులభము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు ఒక శబ్ధమును వినటం ఇంకో శబ్ధమును వినటం నుండి ఆయనకు పరధ్యానంలో ఉంచదు. ఆయన సర్వం చూసే వాడు ఒక వస్తు వును చూడటం ఇంకో వస్తు వుని చూడటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు. మరియు ఇదేవిధంగా ఒక ప్రాణమును సృష్టించటం లేదా దాన్ని మరల లేపటం ఇంకొక ప్రాణమును సృష్టించటం,దాన్ని మరల లేపటం నుండిم ఆయనను పరధ్యానంలోلఉంచదు

أَلَمْ تَرَ أَنَّ ٱللَّهَ يُولِجُ ٱلَّيْلَ فِى ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِى ٱلَّيْلِ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ كُلٌّۭ يَجْرِىٓ إِلَىٰٓ أَجَلٍۢ مُّسَمًّۭى وَأَنَّ ٱللَّهَ بِمَا تَعْمَلُونَ خَبِيرٌۭ ﴿٢٩﴾

ఏమీ మీరు చూడలేదా అల్లా హ్ పగలును అధికం చేయటానికి రాత్రిని తగ్గిస్తు న్నాడని మరియు రాత్రిని అధికం చేయటానికి పగలును తగ్గిస్తు న్నాడని. మరియు ఆయన సూర్య,చంద్రు ల పయన మార్గమును నిర్దేశించాడు అప్పుడే వాటిలోని ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు తన కక్ష్యలో పయనిస్తు న్నవి. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి తెలిసినవాడని (మీకు తెలియదా). మీ కర్మలలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తా డు

ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ ٱلْبَـٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلْعَلِىُّ ٱلْكَبِيرُ ﴿٣٠﴾

ఈ కార్య నిర్వహణ,విధి వ్రాత రెండూ అల్లాహ్ ఒక్కడే సత్యమని, ఆయన తన ఉనికిలో,తన గుణాలలో,తన కార్యాలలో సత్యమని, ముష్రికులు ఆయనను వదిలి ఆరాధిస్తు న్నది నిరాధారమైన అసత్యమని, అల్లా హ్ ఆయనే తన ఉనికిలో,తన ఆధిక్యతలో,తన విధి వ్రా తలో తన సృష్టితాలన్నింటిపై ఉన్నతుడని, ఆయనకన్న ఉన్నతుడు లేడని,ఆయనే అన్నింటికన్న గొప్పవాడని సాక్ష్యం పలుకుతున్నవి

أَلَمْ تَرَ أَنَّ ٱلْفُلْكَ تَجْرِى فِى ٱلْبَحْرِ بِنِعْمَتِ ٱللَّهِ لِيُرِيَكُم مِّنْ ءَايَـٰتِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍۢ لِّكُلِّ صَبَّارٍۢ شَكُورٍۢ ﴿٣١﴾

ఏమీ మీరు చూడటం లేదా ఓడలు తన దయతో, తన ఆదీనంలో చేయటంతో ఓ ప్రజలారా పరిశుద్ధు డైన ఆయన మీకు తన సామర్ధ్యం,తన దయపై సూచించే తన సూచనలను చూపించటానికి సముద్రంలో పరిగెడుతున్నవి. నిశ్చయంగా వీటిలో తనకు ఆపద కలిగినప్పుడు ప్రతీ సహనం చూపే వాడి కొరకు మరియు తనకు అనుగ్రహాలు కలిగినప్పుడు కృతజ్ఞతలు తెలుపుకునే వాడి కొరకు ఆయన సామర్ధ్యంపై సూచించే సూచనలు కలవు

وَإِذَا غَشِيَهُم مَّوْجٌۭ كَٱلظُّلَلِ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمْ إِلَى ٱلْبَرِّ فَمِنْهُم مُّقْتَصِدٌۭ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا كُلُّ خَتَّارٍۢ كَفُورٍۢ ﴿٣٢﴾

كل ختار كفور మరియు వారికి అన్నివైపుల నుండి ఒక అల పర్వతముల వలె,మేఘమువలె చుట్టుముట్టినప్పుడు వారు అల్లాహ్ ఒక్కడినే ఆయన కొరకు దుఆను,ఆరాధనను ప్రత్యేకిస్తూ వేడుకుంటారు. మరియు ఎప్పుడైతే అల్లాహ్ వారి కొరకు దుఆను స్వీకరించి,వారిని ఒడ్డుకు చేర్చి రక్షించి,వారిని మునగటం నుండి భద్రపరుస్తా డో వారిలో నుండి కొందరు (విశ్వాసానికి-అవిశ్వాసానికి ) మధ్యలో ఉండిపోయేవారు తమపై విధిగావించబడిన కృతజ్ఞతను పరిపూర్ణ రూపంలో నెలకొల్పరు. మరియు వారిలో నుండి కొందరు అల్లా హ్ అనుగ్రహమును తిరస్కరిస్తా రు. మరియు మన ఆయతులను ప్రతీ ద్రోహి - అతడు ఈ వ్యక్తి లాంటి వాడు ఎవడైతే తనను రక్షిస్తే కృతజ్ఞత తెలుపుకునే వారిలోంచి అయిపోతానని ప్రమాణం చేశాడో - తనపై అనుగ్రహాలను ప్రసాదించిన తన ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపని ,అల్లా హ్ అనుగ్రహాలపట్ల కృతఘ్నుడై ఉండేవాడు మాత్రమే తిరస్కరిస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُوا۟ رَبَّكُمْ وَٱخْشَوْا۟ يَوْمًۭا لَّا يَجْزِى وَالِدٌ عَن وَلَدِهِۦ وَلَا مَوْلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِۦ شَيْـًٔا ۚ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ ۖ فَلَا تَغُرَّنَّكُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا وَلَا يَغُرَّنَّكُم بِٱللَّهِ ٱلْغَرُورُ ﴿٣٣﴾

ఓ ప్రజలారా మీరు మీ ప్రభవుపట్ల ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భీతిని కలిగి ఉండండి. మరియు మీరు ఆరోజు శిక్ష నుండి భయపడండి అందులో ఏ తండ్రి తన ఏ సంతానమునకు కొంచెముకూడా పనికి రాడు. మరియు ఏ సంతానము తన తండ్రికి కొంచెము కూడా పనికి రాడు. నిశ్చయంగా ప్రళయదినమున ప్రతిఫలమును ప్రసాదించే అల్లాహ్ వాగ్దానము నిరూపితమవుతుంది,ఖచ్చితముగా నెరవేరుతుంది. ఇహలోక జీవితము దానిలో ఉన్న కోరికలు,పరధ్యానంలో చేసే వస్తు వులు మిమ్మల్ని మోసం చేయకూడదు సుమా. మరియు షైతాను నిన్ను మోసగించకూడదు మీపై అల్లా హ్ యొక్క క్షమాపణ,కోపముపై అదిగమించటం వలన,మీ నుండి శిక్షను ఆయన ఆలస్యం చేయటం వలన

إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلْغَيْثَ وَيَعْلَمُ مَا فِى ٱلْأَرْحَامِ ۖ وَمَا تَدْرِى نَفْسٌۭ مَّاذَا تَكْسِبُ غَدًۭا ۖ وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍۢ تَمُوتُ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۢ ﴿٣٤﴾

నిశ్చయంగా అల్లా హ్ ఆయన ఒక్కడి వద్దే ప్రళయదినము గురించి జ్ఞానము కలదు. కాబట్టి అది ఎప్పుడు వాటిల్లు తుందో ఆయనకు తెలుసు.ఆయన తలచుకున్నప్పుడు వర్షమును కురిపిస్తాడు. మరియు మాతృ గర్భములో ఉన్నది మగ శిసువా లేదా ఆడ శిసువా ?,దుష్టుడా,పుణ్యాత్ముడా ? అన్నది ఆయనకు తెలుసు. మరియు ఏ ప్రాణికీ తాను రేపటి దినమున సంపాదించేది మేలైనదా లేదా చెడుదైనదా తెలియదు. మరియు ఏ ప్రాణికీ తాను ఏ ప్రాంతములో మరణిస్తాడో తెలియదు. కానీ ఇవన్నీ అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ వీటన్నింటిగురించి బాగా తెలిసిన వాడు,ఎరుగువాడు. వీటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Luqman — لقمان

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు