طسٓمٓ ﴿١﴾
ముఖపేజీ›తఫ్సీర్›Al-Qasas (28)
మక్కీ · 88 ఆయతులు
طسٓمٓ ﴿١﴾
تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ ﴿٢﴾
ఇవి స్పష్టమైన ఖుర్ఆన్ వచనాలు
نَتْلُوا۟ عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِٱلْحَقِّ لِقَوْمٍۢ يُؤْمِنُونَ ﴿٣﴾
మేము మూసా మరియు ఫిర్ఔన్ వృత్తాంతమును విశ్వాస జనుల కొరకు ఎటువంటి సందేహము లేని సత్యముతో మీపై చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే వారే అందులో ఉన్న దానితో ప్రయోజనం చెందుతారు
إِنَّ فِرْعَوْنَ عَلَا فِى ٱلْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًۭا يَسْتَضْعِفُ طَآئِفَةًۭ مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَآءَهُمْ وَيَسْتَحْىِۦ نِسَآءَهُمْ ۚ إِنَّهُۥ كَانَ مِنَ ٱلْمُفْسِدِينَ ﴿٤﴾
నిశ్ఛయంగా ఫిర్ఔన్ మిసర్ (ఈజిప్టు ) భూమిలో అతిక్రమించాడు మరియు అందులో ఆదిపత్యమును చెలాయించాడు. మరియు అతడు దాని వాసులను వర్గా లుగా విభజించాడు. వారిలో నుండి ఒక వర్గమును వారి మగ సంతానమును హత మార్చి,వారి ఆడవారిని సేవ కొరకు వారిని మరింత అవమానానికి గురి చేయడానికి జీవించి ఉండేటట్లు చేసి బలహీనులుగా చేశాడు. వారు ఇస్రాయీలు సంతతివారు. నిశ్ఛయంగా అతడు హింస,నిరంకుశత్వము,అహంకారము ద్వారా భూమిలో ఉపద్రవాలను రేకెత్తే వారిలోంచి అయిపోయాడు
وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ فِى ٱلْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةًۭ وَنَجْعَلَهُمُ ٱلْوَٰرِثِينَ ﴿٥﴾
మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రా యీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రా ముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లా హ్ పలికాడో: ثنارأوو తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము
وَنُمَكِّنَ لَهُمْ فِى ٱلْأَرْضِ وَنُرِىَ فِرْعَوْنَ وَهَـٰمَـٰنَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا۟ يَحْذَرُونَ ﴿٦﴾
మరియు మేము వారిని భూమిలో ఆధిక్యత కలిగిన వారిని చేసి వారికి భూమిలో సాధికారత ప్రసాదించాలని మరియు మేము ఫిర్ఔన్ కు,రాజ్యంలో అతనికి పెద్ద మద్దతు దారుడైన హామాన్ మరియు వారిరువురి సైనికులకు,రాజ్యంలోని వారిరువురి సహాయకులకు వారు దేని గురించైతే భయపడుతున్నారో వారి రాజ్యమును కోల్పోవటమును,అది కూడా ఇస్రా యీలు సంతతి లో నుండి ప్రస్తా వించబడిన ఒక పిల్లవాడి చేతిలో జరగటమును చూపించటమును కోరుతున్నాము. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَأَوْحَيْنَآ إِلَىٰٓ أُمِّ مُوسَىٰٓ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِى ٱلْيَمِّ وَلَا تَخَافِى وَلَا تَحْزَنِىٓ ۖ إِنَّا رَآدُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ ٱلْمُرْسَلِينَ ﴿٧﴾
మరియు మేము మూసా అలైహిస్సలాం తల్లి మనస్సులో ఇలా ఆదేశించాము: నీవు అతనికి పాలు ఇస్తూ ఉండు. చివరికి ఫిర్ఔన్,అతని జాతి వారు అతన్ని హతమారుస్తా రని నీకు భయమేస్తే అతన్ని ఒక పెట్టిలో ఉంచి దాన్ని నైలు నదిలో పడవేయి. మరియు నీవు మునగటం గురించి గాని ఫిర్ఔన్ నుండి గాని అతనిపై భయపడకు. మరియు అతను నీ నుండి విడిపోతాడని దుఃఖించకు. నిశ్చయంగా మేము అతన్ని జీవించి ఉన్న స్థితిలో నీ వైపునకు మరలించేవారము. మరియు అతన్ని అల్లా హ్ సృష్టితాలవైపు ప్రవక్తలుగా పంపించినوప్రవక్తల్లోంచి చేసేవారము
فَٱلْتَقَطَهُۥٓ ءَالُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّۭا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَـٰمَـٰنَ وَجُنُودَهُمَا كَانُوا۟ خَـٰطِـِٔينَ ﴿٨﴾
అప్పుడు ఆమె మేము ఆదేశించినట్లే అతన్ని ఒక పెట్టిలో పెట్టి నదిలో పడవేసింది. అప్పుడు అతను ఫిర్ఔన్ వంశీయులకు దొరికాడు. అప్పుడు వారు అతన్ని ఎత్తు కున్నారు. మూసా ఫిర్ఔన్ కు శతృవు అయ్యి అతని రాజ్యం అతని చేతి మీద కోల్పోవటం,వారికి దుఃఖమును తీసుకుని వచ్చే వాడిగా అవటం ఏదైతే అల్లాహ్ తలచుకున్నాడో అది నిజమవటానికి. నిశ్చయంగా ఫిర్ఔన్,అతని మంత్రి అయిన హామాను,వారిరువురి సహాయకులు తమ అవిశ్వాసం వలన,తమ నిరంకుశత్వం వలన,భూమిపై తమ సంక్షోభమును కలిగించటం వలన అపరాధులైపోయారు
وَقَالَتِ ٱمْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍۢ لِّى وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوْ نَتَّخِذَهُۥ وَلَدًۭا وَهُمْ لَا يَشْعُرُونَ ﴿٩﴾
ఎప్పుడైతే ఫిర్ఔన్ అతన్ని హతమార్చదలచాడో అతనితో అతని భార్య ఇలా పలికింది: ఈ పిల్లవాడు నీకూ,నాకూ సంతోషమును కలిగించేవాడు. నీవు అతన్ని హతమార్చకు. బహుశా అతను సేవ ద్వారా మనకు ప్రయోజనం కలిగిస్తా డు లేదా మేము అతన్ని దత్తత చేసుకుని పుతృనిగా చేసుకుందాము. అతని చేతి మీదుగా వారిరాజ్యము అతనికి చేరుతుందన్న విషయం వారికి తెలియదు
وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَـٰرِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِى بِهِۦ لَوْلَآ أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿١٠﴾
మరియు మూసా అలైహిస్సలాం తల్లి హృదయం మూసా వ్యవహారం విషయం తప్ప ప్రపంచ వ్యవహారాలన్నింటి నుండి ఖాళీ అయిపోయింది. ఆమెకు ఓపిక లేకపోయేది. చివరికి ఆమె అతనితో తనకు ఉన్నసంబంధము వలన అతడు తన కుమారుడని బహిర్గతం చేసే ఆస్కారం ఉండేది. ఒక వేళ మేము ఆమె హృదయమును అతని స్థిరత్వముపై,ఆమె సహనముపై తమ ప్రభువుపై విశ్వసించి,నమ్మకమును కలిగి ఉండి తనపై తీర్పు ఇవ్వబడిన దానిపై సహనము చూపే వారిలో నుండి అవటానికి ముడివేశాము
وَقَالَتْ لِأُخْتِهِۦ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِۦ عَن جُنُبٍۢ وَهُمْ لَا يَشْعُرُونَ ﴿١١﴾
మరియు మూసా అలైహిస్సలాం తల్లి ఆయనను నదిలో పడవేసిన తరువాత అతని సోదరినితో ఇలా పలికింది: నీవు అతనిపట్ల ఏమి చేయబడుతుందో తెలుసుకోవటానికి అతని వెంట వెళ్ళు. అప్పుడు ఆమె తన విషయం బయటపడకుండా ఉండేందుకు దూరం నుంచే ఆయనను గమనించసాగింది. మరియు ఆమె అతని సోదరి అని,ఆమె అతని సమాచారమును తనిఖీ చేస్తు న్నదని ఫిర్ఔన్,అతని జాతి వారు గ్రహించలేకపోయారు
۞ وَحَرَّمْنَا عَلَيْهِ ٱلْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰٓ أَهْلِ بَيْتٍۢ يَكْفُلُونَهُۥ لَكُمْ وَهُمْ لَهُۥ نَـٰصِحُونَ ﴿١٢﴾
మరియు మూసా అల్లా హ్ నిబంధనతో స్త్రీల నుండి పాలు త్రాగటం నుండి దూరంగా ఉన్నారు. అతని సోదరి అతన్ని పాలు త్రాపించటంపై వారి ఆసక్తిని చూసినప్పుడు వారితో ఇలా పలికింది: ఏమీ నేను అతన్ని పాలు త్రాపించి,అతని బాగోగులు చూసుకునే (పోషించే) ఒక కుటుంబం వారిని మీకు తెలుపనా ?. వారు అతని మేలును ఆశించేవారై ఉంటారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ ق
فَرَدَدْنَـٰهُ إِلَىٰٓ أُمِّهِۦ كَىْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّۭ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ﴿١٣﴾
అప్పుడు మేము మూసాను అతని తల్లికి ఆయన దగ్గరవటం నుండి ఆమె కంటిచలువ అవుతారని ఆశిస్తూ వాపసు చేశాము. మరియు ఆమె అతని విడిపోవటం వలన బాధపడకుండా ఉండటానికి,అతన్ని ఆమెకు వాపసు చేసే విషయంలో అల్లాహ్ వాగ్దానం ఎటువంటి సందేహం లేని సత్యమని తెలుసుకోవటానికి. కాని వారిలో నుండి చాలా మందికి ఈ వాగ్దా నం గురించి తెలియదు. మరియు ఎవరికీ ఆమె అతని తల్లి అని తెలియదు
وَلَمَّا بَلَغَ أَشُدَّهُۥ وَٱسْتَوَىٰٓ ءَاتَيْنَـٰهُ حُكْمًۭا وَعِلْمًۭا ۚ وَكَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿١٤﴾
మరియు అతను దృఢమైన శరీరము అయ్యే వయస్సుకు చేరి,తన బలమును దృఢపరచుకున్నప్పుడు మేము అతనికి ఇస్రాయీలు సంతతి వారి ధర్మ విషయంలో అతని దైవదౌత్యముకు మునుపే అర్ధం చేసుకునే గుణమును,జ్ఞానమును ప్రసాదించాము. ఏ విధంగానైతే మేము మూసాకు తన విధేయత వహించటంపై ప్రతిఫలమును ప్రసాదాంచామో అలాగే ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశములో సద్వర్తనులకు ప్రతిఫలమును ప్రసాదిస్తా ము
وَدَخَلَ ٱلْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍۢ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَـٰذَا مِن شِيعَتِهِۦ وَهَـٰذَا مِنْ عَدُوِّهِۦ ۖ فَٱسْتَغَـٰثَهُ ٱلَّذِى مِن شِيعَتِهِۦ عَلَى ٱلَّذِى مِنْ عَدُوِّهِۦ فَوَكَزَهُۥ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَـٰذَا مِنْ عَمَلِ ٱلشَّيْطَـٰنِ ۖ إِنَّهُۥ عَدُوٌّۭ مُّضِلٌّۭ مُّبِينٌۭ ﴿١٥﴾
و لى ى إنه عد م ض م بين మరియు మూసా ప్రజలు తమ ఇండ్లలో విశ్రాంతి తీసుకునే సమయంలో నగరంలో ప్రవేశించారు. అప్పుడు ఆయన అక్కడ ఇద్దరు వ్యక్తులను పరస్పరం తగాదాలాడుతుండగా,ఒకరినొకరు కొట్టుకుంటుండగా చూశారు. వారిలో ఒకడు మూసా అలైహిస్సలాం జాతి అయిన ఇస్రాయీలు సంతతికి చెందినవాడు,ఇంకొకడు మూసా శతృవైన ఫిర్ఔన్ జాతి ఖిబ్తీకు చెందిన వాడు. అప్పుడు తన జాతికి చెందిన వాడు తన శతృవుజాతి ఖిబ్తీ నుండి ఉన్న వ్యక్తి కి విరుద్ధంగా తనకు సహాయం చేయాలని ఆయనతో కోరాడు. అప్పుడు మూసా తన చేతి పిడికిలితో ఖిబ్తీని కొట్టా రు. ఆయన ఇలా బలంగా కొట్టి అతన్ని హతమార్చారు. మూసా అలైహిస్సలాం ఇలా పలికారు: ఇది షైతాను అలంకరణ,అతని మోసం లో నుంచిది. నిశ్చయంగా షైతాను తనను అనుసరించే వాడికి అపమార్గమునకు లోను చేసే ఒక శతృవు. అతని శతృత్వము బహిర్గతమవుతుంది. అయితే నా నుండి ఏదైతే జరిగినదో అతని శతృత్వం వలన,అతడు నన్ను అపమార్గమునకు లోను చేయదలిచే అపమార్గమునకు లోను చేసేవాడు కావటం వలన
قَالَ رَبِّ إِنِّى ظَلَمْتُ نَفْسِى فَٱغْفِرْ لِى فَغَفَرَ لَهُۥٓ ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ ﴿١٦﴾
మూసా తన ప్రభువుతో తన ద్వారా జరిగిన దాన్ని అంగీకరిస్తూ వేడుకుంటూ ఇలా పలికారు: ఓ నా ప్రభువా నేను ఈ ఖిబ్తీను హత్య చేసి నాపై హింసకు పాల్పడ్డా ను. అయితే నీవు నా కొరకు నా పాపమును మన్నించు. అప్పుడు అల్లా హ్ మా కొరకు మూసాకి తన మన్నింపును స్పష్టపరచాడు. నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తా ప్పడే వారికి మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును
قَالَ رَبِّ بِمَآ أَنْعَمْتَ عَلَىَّ فَلَنْ أَكُونَ ظَهِيرًۭا لِّلْمُجْرِمِينَ ﴿١٧﴾
అ తరువాత మూసా ప్రార్ధన గురించి సమాచారము కొనసాగింది అందులో ఆయన ఈ విధంగా పలికాడు: ఓ నా ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన బలము,తెలివి,జ్ఞాى నము వలన నేను అపరాధము చేసే వారికి వారి అపరాధము చేయటం పై సహాయకునిగా ఉండనంటే ఉండను
فَأَصْبَحَ فِى ٱلْمَدِينَةِ خَآئِفًۭا يَتَرَقَّبُ فَإِذَا ٱلَّذِى ٱسْتَنصَرَهُۥ بِٱلْأَمْسِ يَسْتَصْرِخُهُۥ ۚ قَالَ لَهُۥ مُوسَىٰٓ إِنَّكَ لَغَوِىٌّۭ مُّبِينٌۭ ﴿١٨﴾
ఎప్పుడైతే ఆయన నుండి ఏదైతే సంభవించినదో ఖిబ్తీ హత్య నుండి సంభవించినదో ఆయన ఏమి జరుగుతుందో అని భయపడుతూ నిరీక్షిస్తూ తెల్లవారు చేశాడు. నిన్నటి రోజు తన శతృవుకి విరుద్ధంగా సహాయమును,తోడ్పాటును ఆయనతో కోరాడో అతడు వేరొక ఖిబ్తీకి వ్యతిరేకంగా సహాయమును కోరాడు. మూసా అతనితో ఇలా పలికారు: నిశ్ఛయంగా నీవు మార్గభ్రష్టకు లోను చేసేవాడివి,స్పష్టమైన అపమార్గమునకు లోను చేసేవాడివి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ و
فَلَمَّآ أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِٱلَّذِى هُوَ عَدُوٌّۭ لَّهُمَا قَالَ يَـٰمُوسَىٰٓ أَتُرِيدُ أَن تَقْتُلَنِى كَمَا قَتَلْتَ نَفْسًۢا بِٱلْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّآ أَن تَكُونَ جَبَّارًۭا فِى ٱلْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ ٱلْمُصْلِحِينَ ﴿١٩﴾
ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం తనకు,ఇస్రాయిలీకి శతృవైన ఖిబ్తీని గట్టిగా పట్టు కో దలిచారో ఇస్రాయిలీ ఆయనతో بينم لغوي إنك నిశ్ఛయంగా నీవు అపమార్గమునకు లోను చేసే వాడివి అన్న మాటలు విన్నాడో మూసా తనను గట్టిగా పట్టు కుంటారని భావించాడు. అప్పుడు అతడు మూసాతో ఇలా పలికాడు: నీవు నిన్న ఒక ప్రాణమును తీసినట్లే నన్ను హత్యచేయదలచావా. నీవు ప్రజలని హతమార్చి,వారిపై హింసకు పాల్పడి భూమిలో క్రూ రునిగా అవ్వాలని మాత్రం అనుకుంటున్నావు. నీవు ఇద్దరు పోట్లా డుకునే వారి మధ్య సంస్కరించేవాడవదలచుకోలేదు
وَجَآءَ رَجُلٌۭ مِّنْ أَقْصَا ٱلْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَـٰمُوسَىٰٓ إِنَّ ٱلْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَٱخْرُجْ إِنِّى لَكَ مِنَ ٱلنَّـٰصِحِينَ ﴿٢٠﴾
మరియు ఎప్పడైతే వార్త వ్యాపించినదో నగర శివారు నుండి ఒక వ్యక్తి పరుగెత్తు కుంటూ మూసాను వేటాడటం పై దయ చూపుతూ ఇలా పలికాడు: ఓ మూసా నిశ్చయంగా ఫిర్ఔన్ జాతి పెద్దలు నిన్ను హత మార్చటానికి సంప్రదింపులు చేస్తున్నారు కాబట్టి నీవు ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపో. నిశ్ఛయంగా నేను నీకు ఉపదేశము చేసేవాడిని,నిన్ను వారు పొంది హత్య చేయటం నుండి నీపై కరుణించేవాడిని
فَخَرَجَ مِنْهَا خَآئِفًۭا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِى مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٢١﴾
మూసా ఉపదేశము చేసిన వ్యక్తి ఆదేశించినట్లే చేశారు. అప్పుడు ఆయన ఊరి నుండి భయపడుతూ తనకు ఏమి జరుగుతుందో అని నిరీక్షిస్తూ బయలుదేరారు. తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికాడు: ఓ నా ప్రభువా దుర్మార్గ ప్రజల నుండి ,వారు నాకు చెడును కలిగించకుండా నన్ను రక్షించు
وَلَمَّا تَوَجَّهَ تِلْقَآءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّىٓ أَن يَهْدِيَنِى سَوَآءَ ٱلسَّبِيلِ ﴿٢٢﴾
మరియు ఆయన మద్యన్ వైపునకు బయలుదేరినప్పుడు ఆయన ఈ విధంగా పలికారు: బహుశా నా ప్రభువు నన్ను మంచి మర్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తా డు. అప్పుడు నేను దాని నుండి మార్గభ్రష్టు డిని కాను
وَلَمَّا وَرَدَ مَآءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةًۭ مِّنَ ٱلنَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ ٱمْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِى حَتَّىٰ يُصْدِرَ ٱلرِّعَآءُ ۖ وَأَبُونَا شَيْخٌۭ كَبِيرٌۭ ﴿٢٣﴾
ى మరియు ఆయన మద్యన్ వాసులు నీటిని త్రాగే నీటి వద్దకు చేరుకున్నప్పుడు ప్రజల ఒక సమూహం తమ పశువులకు నీటిని త్రాపిస్తుండగా పొందారు. మరియు వారే కాకుండా ఇద్దరు స్త్రీలను తమ గొర్రెలను ప్రజలు త్రాపించేంత వరకు ఆపి ఉండగా పొందారు. మూసా అలైహిస్సలాం వారిద్దరితో ఇలా అడిగారు: మీరిద్దరి సమస్య ఏమిటి మీరు ప్రజలతోపాటు త్రాపించటం లేదు ?. వారిద్దరు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు: కాపరులు మరలిపోయేంత వరకు మేము త్రా పించకుండా ఆగి ఉండటం మా అలవాటు ; వారితో కలవకుండా జాగ్రత్తపడటానికి. మరియు మా తండ్రి అధిక వయస్సు కల వృద్ధు డు. ఆయన త్రా పించలేడు. కాబట్టి మా గొర్రెలకు మేమే నీరు త్రపించాలి
فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰٓ إِلَى ٱلظِّلِّ فَقَالَ رَبِّ إِنِّى لِمَآ أَنزَلْتَ إِلَىَّ مِنْ خَيْرٍۢ فَقِيرٌۭ ﴿٢٤﴾
అప్పుడు ఆయన వారిద్దరిపై దయ చూపి వారిద్దరి కొరకు వారి గొర్రెలకు నీరు త్రా పించారు. ఆ తరువాత నీడ వైపునకు మరలారు అందులో సేదతీరారు. తన అవసరాన్ని తన ప్రభువు ముందట పెట్టి ఇలా ప్రా ర్ధించారు: ఓ నా ప్రభూ నీవు నా వైపునకు కురుపించే ఏ మేలైనా నేను అవసరం కలవాడిని. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَجَآءَتْهُ إِحْدَىٰهُمَا تَمْشِى عَلَى ٱسْتِحْيَآءٍۢ قَالَتْ إِنَّ أَبِى يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَآءَهُۥ وَقَصَّ عَلَيْهِ ٱلْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ ﴿٢٥﴾
అప్పుడు వారిద్దరు వెళ్లి తమ తండ్రికి అతని గురించి తెలియపరచారు. అప్పుడు ఆయన వారి నుండి ఒకామెను అతన్ని పిలుచుకుని రమ్మని ఆయన వద్దకు పంపించారు. అప్పుడు ఆమే ఆయన వద్దకు సిగ్గు పడుతూ నడిచి వచ్చింది. ఆమె ఇలా పలికింది: నిశ్చయంగా మా తండ్రి మీరు మా కొరకు నీళ్ళు త్రాపించినందుకు మీకు మీ ప్రతిఫలమును ప్రసాదించటానికి ఆయన వద్దకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మూసా వారి తండ్రి వద్దకు వచ్చినప్పుడు,ఆయనకు తన సమాచారములన్ని తెలియపరచారు. ఆయన అతనికి భరోసా కలిగిస్తూ ఇలా పలికారు: నీవు భయపడకు నీవు దుర్మార్గ ప్రజలైన ఫిర్ఔన్,అతని నాయకుల నుండి ముక్తిని పొందావు. వారికి మద్యన్ పై ఎటువంటి అధికారము లేదు. అలాగే వారు నీకు ఎటువంటి కీడును తీసుకుని రాలేరు
قَالَتْ إِحْدَىٰهُمَا يَـٰٓأَبَتِ ٱسْتَـْٔجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ ٱسْتَـْٔجَرْتَ ٱلْقَوِىُّ ٱلْأَمِينُ ﴿٢٦﴾
అతని ఇద్దరి కుమార్తెల్లోంచి ఒకామె ఇలా పలికింది: ఓ మా తండ్రి అతన్ని మా గొర్రెలను మేపటానికి జీతంపై పెట్టు కోండి. అతనిలో బలము,అమానత్ కలిగి ఉండటం వలన మీరు అతన్ని జీతంపై పెట్టు కోవటానికి తగిన వాడు. బలముతో అతనికి ఇవ్వబడిన బాధ్యతను నెరవేరుస్తా డు. మరియు అమానత్ తో అతనికి అప్పగించిన అమానత్ ను పరిరక్షిస్తా డు
قَالَ إِنِّىٓ أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ٱبْنَتَىَّ هَـٰتَيْنِ عَلَىٰٓ أَن تَأْجُرَنِى ثَمَـٰنِىَ حِجَجٍۢ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًۭا فَمِنْ عِندِكَ ۖ وَمَآ أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰلِحِينَ ﴿٢٧﴾
ه వారి తండ్రి మూసా అలైహిస్సలాంను ఉద్దేసించి ఇలా పలికారు: నిశ్చయంగా నేను నా ఇద్దరు కుమార్తెలలో ఒకరితో మీ వివాహం చేయదలిచాను. ఆమె మహర్ గా మీరు ఎనిమిది సంవత్సరాలు మా గొర్రెలను మేపాలి. ఒక వేళ మీరు పది సంవత్సరములు కాలమును పూర్తి చేస్తే అది మీ తరపు నుండి అధికము మీపై తప్పనిసరి కాదు. ఎందుకంటే ఒప్పందం ఎనిమిది సంవత్సరములు మాత్రమే. దానిపై ఏదైతే ఉన్నదో అది స్వచ్ఛందంగా ఉంటుంది. మీకు కష్టమైన దాన్ని నేను మీపై తప్పనిసరి చేయదలచుకోలేదు. ఒక వేళ అల్లా హ్ తలచుకుంటే మీరు తొందరలోనే నన్ను ఒప్పందాలను పూర్తి చేసే వారైన పుణ్యాత్ముల్లోంచి పొందుతారు,వారు ప్రమాణాలను భంగపరచరు
قَالَ ذَٰلِكَ بَيْنِى وَبَيْنَكَ ۖ أَيَّمَا ٱلْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَٰنَ عَلَىَّ ۖ وَٱللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌۭ ﴿٢٨﴾
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు: మేము చేసుకున్న ఒప్పందము ఏదైతే ఉన్నదో అది మీకూ,మాకూ మధ్య ఉన్నది. రెండు కాలముల్లో నుంచి నేను మీ కొరకు చేసిన ఎనిమిది సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు నేను నాపై ఉన్న బాధ్యతను పూర్తి చేసిన వాడినవుతాను. మీరు నాతో అధికంగా కోరకండి. మరియు మేము చేసుకున్న ఒప్పందంపై అల్లా హ్ యే సాక్షి,దాని పరిరక్షకుడు
۞ فَلَمَّا قَضَىٰ مُوسَى ٱلْأَجَلَ وَسَارَ بِأَهْلِهِۦٓ ءَانَسَ مِن جَانِبِ ٱلطُّورِ نَارًۭا قَالَ لِأَهْلِهِ ٱمْكُثُوٓا۟ إِنِّىٓ ءَانَسْتُ نَارًۭا لَّعَلِّىٓ ءَاتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍۢ مِّنَ ٱلنَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ ﴿٢٩﴾
ఎప్పుడైతే మూసా రెండు కాలములను పది సంవత్సరములుగా పూర్తి చేసి,తన ఇంటి వారిని తీసుకుని మద్యన్ నుండి మిసర్ కు బయలు దేరారో తూర్ పర్వత దిక్కులో ఆయన ఒక మంటను చూశారు. అప్పుడు ఆయన తన ఇంటి వారితో ఇలా పలికారు: మీరు ఆగండి, నిశ్చయంగా నేను ఒక మంటను చూశాను. బహుశా నేను దాని నుండి మీ వద్దకు ఏదైన సమాచారము తీసుకుని వస్తాను. లేదా నేను మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తా ను మీరు దానితో మంటను వెలిగిస్తా రు. బహుశా మీరు చలి నుండి వెచ్చదనాన్ని గ్రహిస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَلَمَّآ أَتَىٰهَا نُودِىَ مِن شَـٰطِئِ ٱلْوَادِ ٱلْأَيْمَنِ فِى ٱلْبُقْعَةِ ٱلْمُبَـٰرَكَةِ مِنَ ٱلشَّجَرَةِ أَن يَـٰمُوسَىٰٓ إِنِّىٓ أَنَا ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ ﴿٣٠﴾
ఎప్పుడైతే మూసా తాను చూసిన మంట వద్దకు వచ్చారో పరిశుద్ధు డైన,మహోన్నతుడైన ఆయన ప్రభువు ఆయనను లోయ కుడి వైపున ఉన్న స్థలము నుండి దేనినైతే అల్లా హ్ మూసా కొరకు వృక్షము నుండి తన మాట ద్వారా శుభప్రదం చేశాడో ఇలా మాట్లా డాడు: ఓ మూసా నేనే సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లా హ్ ను. ن
وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَءَاهَا تَهْتَزُّ كَأَنَّهَا جَآنٌّۭ وَلَّىٰ مُدْبِرًۭا وَلَمْ يُعَقِّبْ ۚ يَـٰمُوسَىٰٓ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ ٱلْـَٔامِنِينَ ﴿٣١﴾
మరియు నీవు నీ చేతి కర్రను పడవేయి. అప్పుడు మూసా తన ప్రభువు ఆదేశమునకు కట్టు బడి ఉండి దాన్ని పడవేశారు. ఎప్పుడైతే ఆయన దాన్ని చూశారో అది చలిస్తున్న,కదులుతున్న స్థితిలో ఉండి తన వేగములో పాము వలె ఉన్నది. అప్పుడు మూసా దాని నుండి భయపడి వెనుతిరిగి పారిపోసాగారు. తన పరగెత్తటం నుండి తిరిగి చూడ లేదు. అప్పుడు ఆయన్ని ఆయన ప్రభువు ఇలా పిలుపునిచ్చాడు: ఓ మూసా ముందుకు రా,నీవు దానితో భయపడకు. నిశ్చయంగా నీవు దాని నుండి,నీవు భయపడే ఇతర వాటి నుండి సురక్షితంగా ఉన్నావు
ٱسْلُكْ يَدَكَ فِى جَيْبِكَ تَخْرُجْ بَيْضَآءَ مِنْ غَيْرِ سُوٓءٍۢ وَٱضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ ٱلرَّهْبِ ۖ فَذَٰنِكَ بُرْهَـٰنَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦٓ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًۭا فَـٰسِقِينَ ﴿٣٢﴾
నీవునీ కుడి చేతిని నీ మెడ దగ్గరలో నీ చొక్క తెరవబడిన భాగములో ప్రవేశింపజేయి అది ఎటువంటి బొల్లి రోగము లేకుండా తెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు మూసా దాన్ని ప్రవేశింపజేశారు అది మంచువలె తెల్లగా బయటకు వచ్చింది. మరియు నీ చేతిని నీ వైపునకు నీ భయం తగ్గటానికి అదుముకో. అప్పుడు మూసా దాన్ని తన వైపునకు అదుముకున్నారు అంతే ఆయన భయము ఆయన నుండి తొలగిపోయింది. ఈ ప్రస్తా వించబడిన చేతి కర్ర,చేయి నీ ప్రభువు వద్ద నుండి ఫిర్ఔన్,అతని జాతి నాయకుల వైపునకు పంపించబడ్డ నిదర్శనాలు. నిశ్చయంగా వారు అవిశ్వాసము ద్వారా,పాపకార్యలకు పాల్పడటం ద్వారా అల్లా హ్ విధేయత నుండి తొలగిపోయిన ప్రజలు. قال رب إنى قتلت منهم نفسا فأخاف أن يقتلون
قَالَ رَبِّ إِنِّى قَتَلْتُ مِنْهُمْ نَفْسًۭا فَأَخَافُ أَن يَقْتُلُونِ ﴿٣٣﴾
మూసా తన ప్రభువును వేడుకుంటూ ఇలా పలికారు: నిశ్చయంగా నేను వారిలో నుండి ఒక ప్రాణమును చంపాను అందు వలన ఒక వేళ నేను వారి వద్దకు నీవు ఇచ్చి పంపించిన వాటిని వారికి చేర వేయటానికి వస్తే వారు నన్ను చంపి వేస్తా రని నేను భయపడుతున్నాను
وَأَخِى هَـٰرُونُ هُوَ أَفْصَحُ مِنِّى لِسَانًۭا فَأَرْسِلْهُ مَعِىَ رِدْءًۭا يُصَدِّقُنِىٓ ۖ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ ﴿٣٤﴾
మరియు నాసోదరుడు హారూన్ నా కన్న ఎక్కువ స్పష్టంగా మాట్లా డుతాడు. కాబట్టి నీవు ఒక వేళ ఫిర్ఔన్,అతని జాతి వారు నన్ను తిరస్కరిస్తే అతన్ని నా మాటను సమర్ధించటానికి సహాయకునిగా నాతోపాటు పంపించు. నిశ్చయంగా వారు నన్ను తిరస్కరిస్తా రని భయపడుతున్నాను. ఏ విధంగానైతే అది నాకన్న పూర్వం ప్రవక్తలు పంపించబడ్డ జాతుల అలవాటో,వారు వారిని తిరస్కరించారు
قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَـٰنًۭا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِـَٔايَـٰتِنَآ أَنتُمَا وَمَنِ ٱتَّبَعَكُمَا ٱلْغَـٰلِبُونَ ﴿٣٥﴾
అల్లా హ్ మూసా దుఆను స్వీకరిస్తూ ఇలా పలికాడు: ఓ మూసా మేము తొందరలోనే నీతో పాటు నీ సోదరుడిని ప్రవక్తగా,సహాయకునిగా పంపింపించి నీకు బలమును చేకూరుస్తాము. మరియు మీరిద్దరి కొరకు ఆధారమును,మద్దతును కలిగిస్తాము. అయితే వారు మీరు అసహ్యించుకునే చెడుతో మీకు చేరుకోలేరు. మేము మీకు ఇచ్చి పంపంపించిన సూచనల మూలంగా మీరు, మిమ్మల్ని అనుసరించిన విశ్వాసపరులు విజయమును పొందుతారు
فَلَمَّا جَآءَهُم مُّوسَىٰ بِـَٔايَـٰتِنَا بَيِّنَـٰتٍۢ قَالُوا۟ مَا هَـٰذَآ إِلَّا سِحْرٌۭ مُّفْتَرًۭى وَمَا سَمِعْنَا بِهَـٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ ﴿٣٦﴾
మూసా అలైహిస్సలాం వారి వద్దకు మా స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చినప్పుడు వారు ఇది మూసా కల్పించుకున్న అబద్దము మాత్రమే. మరియు మేము దీన్ని మా పూర్వ తాత ముత్తా తలలో వినలేదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَقَالَ مُوسَىٰ رَبِّىٓ أَعْلَمُ بِمَن جَآءَ بِٱلْهُدَىٰ مِنْ عِندِهِۦ وَمَن تَكُونُ لَهُۥ عَـٰقِبَةُ ٱلدَّارِ ۖ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ ﴿٣٧﴾
మరియు మూసా ఫిర్ఔన్ ను ఉద్దేశించి ఇలా పలికారు: పరిశుద్ధు డైన ఆయన వద్ద నుండి మార్గదర్శకమును తీసుకుని వచ్చిన సత్యవంతుడి గురించి నా ప్రభువుకి తెలుసు,మరియు పరలోకములో ప్రశంసనీయమైన పర్యవసానం ఎవరి కొరకు ఉన్నదో ఆయనకు తెలుసు. నిశ్చయంగా దుర్మార్గు లు తాము ఆశించిన దానిలో సాఫల్యం చెందలేరు. మరియు తాము భయపడే వాటి నుండి విముక్తి చెందలేరు
وَقَالَ فِرْعَوْنُ يَـٰٓأَيُّهَا ٱلْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرِى فَأَوْقِدْ لِى يَـٰهَـٰمَـٰنُ عَلَى ٱلطِّينِ فَٱجْعَل لِّى صَرْحًۭا لَّعَلِّىٓ أَطَّلِعُ إِلَىٰٓ إِلَـٰهِ مُوسَىٰ وَإِنِّى لَأَظُنُّهُۥ مِنَ ٱلْكَـٰذِبِينَ ﴿٣٨﴾
ى మరియు ఫిర్ఔన్ తన జాతి వారిలో నుండి నాయకులను ఉద్దేశించి ఇలా పలికాడు: ఓ నాయకులారా నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం గలడని నాకు తెలియదు. ఓ హామాన్ గట్టిపడే వరకు మట్టిపై అగ్నిని రాజేసి దానితో ఎత్తైన ఒక నిర్మాణమును కట్టు నేను దానిపై నిలబడి మూసా ఆరాధ్య దైవమును చూస్తా నని ఆశిస్తు న్నాను. మరియు నిశ్చయంగా మూసా అల్లా హ్ వద్ద నుండి నా వైపునకు,నా జాతి వారి వైపునకు ప్రవక్తగా పంపించబడ్డా డని వాదిస్తు న్నవిషయంలో అబద్దము పలుకుతున్నాడని భావిస్తు న్నాను
وَٱسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُۥ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَظَنُّوٓا۟ أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ ﴿٣٩﴾
మరియు ఫిర్ఔన్,అతని సైన్యముల అహంకారం తీవ్రమైపోయినది. మరియు వారు మిసర్ ప్రాంతములో అన్యాయంగా అహంకారాన్ని ప్రదర్శించారు. మరియు మరణాంతరం లేపబడటమును నిరాకరించారు. మరియు వారు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం,పర్యవసానం కొరకు మా వైపునకు మరలించబడరని భావించారు
فَأَخَذْنَـٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَـٰهُمْ فِى ٱلْيَمِّ ۖ فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلظَّـٰلِمِينَ ﴿٤٠﴾
అప్పుడు మేము అతన్నీ పట్టుకున్నాము,అతని సైన్యములనూ పట్టుకున్నాము. వారిని సముద్రంలో ముంచుతూ విసిరివేశాము. చివరికి వారందరు నాశనమయ్యారు. ఓ ప్రవక్తా మీరు యోచన చేయండి దుర్మార్గు ల స్థితి,వారి ముగింపు ఏమయిందో. వారి స్థితి,వారి ముగింపు వినాశనమయ్యింది
وَجَعَلْنَـٰهُمْ أَئِمَّةًۭ يَدْعُونَ إِلَى ٱلنَّارِ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ لَا يُنصَرُونَ ﴿٤١﴾
మరియు మేము వారిని అవిశ్వాసము, మార్గభ్రష్టతను వ్యాపింపజేసి నరకము వైపునకు పిలిచే నిరంకుశుల కొరకు,మార్గభ్రష్టుల కొరకు నమూనాగా చేశాము. మరియు ప్రళయదినాన శిక్ష నుండి వారిని రక్షించటం ద్వారా వారు సహాయపడరు. అంతే కాదు వారు చెడు సంప్రదాయాలను జారీ చేయటం,అపమార్గముతో దానివైపునకు పిలవటం వలన వారిపై శిక్ష రెట్టింపు చేయబడుతుంది. దానిపై ఆచరించిన దాని బరువు కూడా వారిపై వ్రా యబడుతుంది,మరియు దానిపై ఆచరించటంలో వారిని అనుసరించిన వారి కర్మల బరువు వ్రా యబడుతుంది
وَأَتْبَعْنَـٰهُمْ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا لَعْنَةًۭ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ هُم مِّنَ ٱلْمَقْبُوحِينَ ﴿٤٢﴾
మరియు మేము వారి శిక్షను ఇహలోకములో పరాభవం,ధూత్కారము రూపములో అధికము చేసి వెంటాడేటట్లు చేశాము. మరియు ప్రళయ దినాన వారే దూషించబడినవారు,అల్లా హ్ కారుణ్యము నుండి దూరం చేయబడినవారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ مِنۢ بَعْدِ مَآ أَهْلَكْنَا ٱلْقُرُونَ ٱلْأُولَىٰ بَصَآئِرَ لِلنَّاسِ وَهُدًۭى وَرَحْمَةًۭ لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ ﴿٤٣﴾
మరియు నిశ్చయంగా మేము పూర్వ జాతుల వారి వద్దకు మా ప్రవక్తలను పంపించి వారు వారిని తిరస్కరిస్తే మేము వారి తిరస్కారము వలన వారిని తుది ముట్టించిన తరువాత మూసా అలైహిస్సలాంనకు తౌరాత్ ను ప్రసాదించాము. అందులో ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిని వారు చూసి వాటిని వారు ఆచరించేవి,వారికి నష్టం కలిగించేవాటిని చూసి వాటిని వదిలివేసేవి ఉన్నవి. అందులో వారికి మేలు వైపునకు,ఇహపరాల మేలు ఉన్న కారుణ్యం వైపునకు మార్గదర్శకత్వం ఉన్నది. బహుశా వారు తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని,ఆయనను విశ్వసిస్తా రేమో
وَمَا كُنتَ بِجَانِبِ ٱلْغَرْبِىِّ إِذْ قَضَيْنَآ إِلَىٰ مُوسَى ٱلْأَمْرَ وَمَا كُنتَ مِنَ ٱلشَّـٰهِدِينَ ﴿٤٤﴾
ఓ ప్రవక్తా మేము మూసాను ఫిర్ఔన్,అతని నాయకుల వద్దకు పంపించిన విషయమును మూసా వద్ద ముగించినప్పుడు మీరు మూసా అలైహిస్సలాం కొరకు కొండ పడమర వైపున లేరు. మరియు మీరు ప్రత్యక్షంగా ఉన్న వారిలో లేరు చివరకు మీరు ఆ సమాచారము తెలుసుకుని దాన్ని ప్రజలకు తెలియపరచారు. మీరు వారికి చెప్పినది అల్లా హ్ మీకు వహీ ద్వారా తెలియపరచాడు
وَلَـٰكِنَّآ أَنشَأْنَا قُرُونًۭا فَتَطَاوَلَ عَلَيْهِمُ ٱلْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًۭا فِىٓ أَهْلِ مَدْيَنَ تَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِنَا وَلَـٰكِنَّا كُنَّا مُرْسِلِينَ ﴿٤٥﴾
కాని మేము మూసా తరువాత ఎన్నో సమాజాలను,సృష్టితాలను ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘ కాలం గడిచిపోయింది చివరకు వారు అల్లాహ్ ప్రమాణములను మరచిపోయారు. మరియు మీరు మద్యన్ వాసుల మధ్య నివాసమూ లేరు వారిపై మా ఆయతులను చదివి వినిపించటానికి. కానీ మేము మిమ్మల్ని మా వద్ద నుండి ప్రవక్తగా పంపించి,మూసా వృత్తాంతమును,మద్యన్ లో ఆయన నివాసమును మీకు వహీ ద్వారా మేము తెలియపరచాము. అప్పుడు అందులో నుండి మీకు అల్లా హ్ వహీ ద్వారా మీకు తెలియపరచిన దాన్ని మీరు ప్రజలకు తెలియపరచారు
وَمَا كُنتَ بِجَانِبِ ٱلطُّورِ إِذْ نَادَيْنَا وَلَـٰكِن رَّحْمَةًۭ مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًۭا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٍۢ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ﴿٤٦﴾
يتذك رون మరియు మేము మూసాను పిలిచి ఆయనకు ఏదైతే మేము దివ్యవాణిని అవతరింపజేశామో అప్పుడు మీరు తూర్ వైపున లేరు. కాని మేము మిమ్మల్ని ప్రజల కొరకు నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యంగా పంపించాము. మేము ఆ వృత్తాంతమును మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము మీరు మీ కన్న పూర్వం ఎటువంటి హెచ్చరించే వాడు హెచ్చరించటానికి రాని జాతి వారిని హెచ్చరించటానికి బహుశా వారు హితోపదేశం గ్రహించి,మీరు వారి వద్దకు పరిశుద్ధు డైన అల్లా హ్ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తా రని
وَلَوْلَآ أَن تُصِيبَهُم مُّصِيبَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا۟ رَبَّنَا لَوْلَآ أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًۭا فَنَتَّبِعَ ءَايَـٰتِكَ وَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿٤٧﴾
మరియు ఒక వేళ వారు ఉన్న అవిశ్వాసము,పాప కార్యముల వలన వారిపై దైవ శిక్ష వచ్చి చేరితే వారి వద్దకు ఒక ప్రవక్త పంపించకపోవటంపై వాదిస్తూ ఇలా పలుకుతారు: నీవు ఎందుకని మా వద్దకు ఒక ప్రవక్తను పంపించలేదు అప్పుడు మేము నీ ఆయతులను అనుసరించి,వాటిని ఆచరించి,మేము విశ్వసించి వారి ప్రభువు ఆదేశముపై ఆచరించే వారిలో నుండి అయిపోయేవారము. ఒక వేళ అలా జరిగి ఉంటే మేము వారిని శీఝ్రంగా శిక్షించేవారము. కానీ మేము దాన్ని వారి నుండి ఆలస్యం చేశాము చివరికి వారి వద్దకు ఒక ప్రవక్తను పంపించి వారిని మన్నించటానికి
فَلَمَّا جَآءَهُمُ ٱلْحَقُّ مِنْ عِندِنَا قَالُوا۟ لَوْلَآ أُوتِىَ مِثْلَ مَآ أُوتِىَ مُوسَىٰٓ ۚ أَوَلَمْ يَكْفُرُوا۟ بِمَآ أُوتِىَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا۟ سِحْرَانِ تَظَـٰهَرَا وَقَالُوٓا۟ إِنَّا بِكُلٍّۢ كَـٰفِرُونَ ﴿٤٨﴾
ఎప్పుడైతే ఖురైష్ జాతి వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం తీసుకుని వచ్చారో వారు యూదులను ఆయన గురించి అడిగారు. అప్పుడు వారు వారికి ఈ వాదనను నేర్పిస్తే వారు అన్నారు: మూసా తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని సూచించే చేయి,చేతి కర్ర లాంటి మహిమలు ఇవ్వబడినట్లు ఎందుకని ముహమ్మద్ కు ఇవ్వబడలేదు. ఓ ప్రవక్తా మీరు వారిని ఖండిస్తూ ఇలా తెలియపరచండి: ఏమీ మునుపు بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ మూసా ఇవ్వబడిన వాటిని యూదులు తిరస్కరించలేదా ?!. మరియు వారు తౌరాత్,ఖుర్ఆన్ విషయంలో ఇలా పలికారు నిశ్ఛయంగా అవి రెండూ మంత్రజాలములు ఒక దానికొకటి మద్దతిస్తు న్నవి. మరియు వారు నిశ్ఛయంగా మేము తౌరాత్,ఖుర్ఆన్ ను పూర్తిగా తిరస్కరిస్తు న్నాము అని అన్నారు
قُلْ فَأْتُوا۟ بِكِتَـٰبٍۢ مِّنْ عِندِ ٱللَّهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَآ أَتَّبِعْهُ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٤٩﴾
ఓ ప్రవక్తా వారందరితో ఇలా పలకండి: మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గదర్శకం కల అల్లా హ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును తీసుకుని రండి. ఒక వేళ మీరు తీసుకుని వస్తే నేను దాన్ని అనుసరిస్తాను,ఒక వేళ మీరు తౌరాత్,ఖుర్ఆన్ మంత్రజాలము అని వాదిస్తు న్నవిషయంలో మీరు సత్యవంతులే అయితే
فَإِن لَّمْ يَسْتَجِيبُوا۟ لَكَ فَٱعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَآءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ ٱتَّبَعَ هَوَىٰهُ بِغَيْرِ هُدًۭى مِّنَ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿٥٠﴾
ఒక వేళ ఖురైష్ మీరు తౌరాత్,ఖుర్ఆన్ కన్న ఎక్కువ మార్గ దర్శకం గల ఏదైన పుస్తకమును తీసుకుని రమ్మని మీరు వారికి ఇచ్చిన పిలుపును స్వీకరించకపోతే ఆ రెండింటి పట్ల వారి తిరస్కారము ఎటువంటి ఆధారం కాదు అని నమ్మండి. అది కేవలం మనోవాంచలను అనుసరించటం మాత్రమే. పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క ఎటువంటి మార్గ నిర్దేశకం లేకుండా తన మనోవాంచలను అనుసరించే వాడి కన్నపెద్ద మార్గభ్రష్టుడు ఎవడూ ఉండడు. నిశ్ఛంగా అల్లాహ్ ,అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసం వలన తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడే జనులకు సన్మార్గము,మార్గదర్శకత్వం కొరకు భాగ్యమును కలిగించడు
۞ وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ ٱلْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ ﴿٥١﴾
మరియు నిశ్ఛయంగా మేముఇస్రాయీలు సంతతి నుండి ముష్రికులకు,యూదులకు పూర్వ సమాజాల వృత్తాంతముల ద్వారా,వారు మా ప్రవక్తలను తిరస్కరించినప్పుడు వారిపై మేము దించిన శిక్ష ద్వారా మాటను దాని ద్వారా వారు హితబోధన గ్రహించి వారికి సంభవించినది వీరికి సంభవించకముందే విశ్వసిస్తా రని ఆశిస్తూ మాటనుచేరవేశాము
ٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ مِن قَبْلِهِۦ هُم بِهِۦ يُؤْمِنُونَ ﴿٥٢﴾
ఎవరైతే ఖుర్ఆన్ అవతరణ ముందు నుండే తౌరాత్ పట్ల విశ్వాసముపై స్థిరంగా ఉన్నారో వారే ఖుర్ఆన్ పై తమ గ్రంధముల్లో దాని సమాచారము,దాని గుణమును వారు పొందటం వలన విశ్వాసమును కనబరుస్తా రు
وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوٓا۟ ءَامَنَّا بِهِۦٓ إِنَّهُ ٱلْحَقُّ مِن رَّبِّنَآ إِنَّا كُنَّا مِن قَبْلِهِۦ مُسْلِمِينَ ﴿٥٣﴾
దాన్ని వారిపై పఠించబడినప్పుడు వారు ఇలా పలికేవారు: మేము దాన్ని విశ్వసించాము నిశ్చయంగా అది ఎటువంటి సందేహము లేని,మన ప్రభువు వద్ద నుండి అవతరింపబడిన సత్యము. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ కన్న ముందు నుండే ప్రవక్తలు దాని కన్న ముందు తీసుకుని వచ్చిన వాటిపై ఉన్న మన విశ్వాసము వలన విధేయులమై ఉండేవారము
أُو۟لَـٰٓئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا۟ وَيَدْرَءُونَ بِٱلْحَسَنَةِ ٱلسَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَـٰهُمْ يُنفِقُونَ ﴿٥٤﴾
ప్రస్తావించబడిన గుణములతో వర్ణించబడిన వీరందరికి అల్లా హ్ వారి గ్రంధము పట్ల విశ్వాసముపై వారి సహనము వలన,ముహమ్మద్ సల్లల్లా హు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడినప్పుడు ఆయనపై తమ విశ్వాసము వలన వారి ఆచరణలకు రెండు సార్లు వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. మరియు వారు తమ సత్కర్మల పుణ్యాలతో వారు చేసుకున్న పాపాలను తొలగించుకుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన వాటిని మంచి మార్గముల్లో ఖర్ఛు చేస్తా రు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
وَإِذَا سَمِعُوا۟ ٱللَّغْوَ أَعْرَضُوا۟ عَنْهُ وَقَالُوا۟ لَنَآ أَعْمَـٰلُنَا وَلَكُمْ أَعْمَـٰلُكُمْ سَلَـٰمٌ عَلَيْكُمْ لَا نَبْتَغِى ٱلْجَـٰهِلِينَ ﴿٥٥﴾
గ్రంధవహుల్లో నుండి విశ్వాసపరులైన వీరందరు అసత్య మాటను విన్నప్పుడు దాని వైపునకు శ్రద్ధ చూపకుండానే దాని నుండి విముఖత చూపుతారు. మరియు దాన్ని కలిగిన వారిని (అసత్యపరులని) ఉద్దేశించి ఇలా పలుకుతారు: మా కర్మలు మాకు,మీ కర్మలు మీకు. మీరు మా నుండి దూషణ,బాధల నుండి నిశ్ఛింతగా ఉన్నారు. ధర్మ విషయముల్లో ,ప్రా పంచిక విషయంలో నష్టము,బాధ కలిగిన అజ్ఞా న వాసుల తోడు మాకు అవసరం లేదు
إِنَّكَ لَا تَهْدِى مَنْ أَحْبَبْتَ وَلَـٰكِنَّ ٱللَّهَ يَهْدِى مَن يَشَآءُ ۚ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ ﴿٥٦﴾
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు ఇష్టపడిన వారికి అబూతాలిబ్,ఇతరుల్లాంటి వారిని విశ్వాసము భాగ్యమును కలిగించి సన్మార్గమును కలిగించ లేరు. కాని ఒక్కడైన అల్లా హ్ అతడే తాను కోరిన వారికి సన్మార్గపు భాగ్యమును కలిగించగలడు. మరియు ఆయనే సన్మార్గము వైపునకు మార్గము పొందే వారు ఎవరో తన ముందస్తు జ్ఞా నము ద్వారా బాగా తెలిసిన వాడు
وَقَالُوٓا۟ إِن نَّتَّبِعِ ٱلْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَآ ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا ءَامِنًۭا يُجْبَىٰٓ إِلَيْهِ ثَمَرَٰتُ كُلِّ شَىْءٍۢ رِّزْقًۭا مِّن لَّدُنَّا وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ ﴿٥٧﴾
من لدنا ولكن أكثرهم لا يعلمون మరియు మక్కా వాసుల్లోంచి ముష్రికులు ఇస్లాంను అనుసరించటం నుండి,దానిపట్ల విశ్వాసమును కనబరచటం నుండి వంకలు చూపుతూ ఇలా పలుకుతారు: ఒక వేళ మేము నీవు తీసుకుని వచ్చిన ఈ ఇస్లా మును అనుసరిస్తే మా శతృవులు మా దేశము నుండి మమ్మల్ని వేగముగా గెంటివేస్తా రు. ఏమీ మేము ఈ ముష్రికులందరిని హరమ్ ప్రాంతములో నివాసమును కలిగించలేదా ?. అక్కడ రక్తపాతము,హింస నిషిద్ధము. వారిపై ఇతరుల దాడి నుండి అక్కడ వారు నిశ్చింతగా ఉన్నారు. అక్కడ అన్ని రకాల ఫలములు మా వద్ద నుండి ఆహారముగా చేరుతున్నాయి. దాన్ని మేము వారి వద్దకు తీసుకుని వచ్చాము. కాని వారిలో నుండి చాలా మందికి అల్లా హ్ అనుగ్రహించిన అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలపటం తెలియదు
وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍۭ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَـٰكِنُهُمْ لَمْ تُسْكَن مِّنۢ بَعْدِهِمْ إِلَّا قَلِيلًۭا ۖ وَكُنَّا نَحْنُ ٱلْوَٰرِثِينَ ﴿٥٨﴾
మరియు చాలా బస్తీలు తమపై ఉన్నఅల్లా హ్ అనుగ్రహములను తిరస్కరించి పాప కార్యముల్లో ,అవిధేయకార్యముల్లో వృధా అయిపోయినవి. అప్పుడు మేము వారిపై ఒక శిక్షను పంపించి దాని ద్వారా వారిని తుదిముట్టించాము. ఇవి నాశనమైన వారి నివాసములు వాటిపై నుండి ప్రజలు పోతుంటారు. అక్కడ నివాసమున్న వారి తరువాత పయనమయ్యే వారిలో నుండి కొద్దిమంది తప్ప నివాసముండలేదు. మరియు ఆకాశముల్లో,భూమిలో మరియు వాటిలో ఉన్న వారికి మేము వారసులమయ్యాము
وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ ٱلْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِىٓ أُمِّهَا رَسُولًۭا يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِى ٱلْقُرَىٰٓ إِلَّا وَأَهْلُهَا ظَـٰلِمُونَ ﴿٥٩﴾
ظلمون ఓ ప్రవక్తా మీ ప్రభువు నగరములను ముఖ్య నగరమైన మక్కాలో మిమ్మల్ని ప్రవక్తగా పంపించినట్లు వాటిలో పెద్ద నగరములో ఒక ప్రవక్తను పంపించి అక్కడి వాసులను మన్నించినంత వరకు వినాశనం చేయడు. మరియు మేమూ నగరవాసులు సత్యంపై స్థిరంగా ఉన్న స్థితిలో ఉంటే నాశనం చేయము. మేము మాత్రం ఒక వేళ వారు అవిశ్వాసం, పాప కార్యములకు పాల్పడటం వలన దుర్మార్గు లైతే వారిని నాశనం చేస్తా ము
وَمَآ أُوتِيتُم مِّن شَىْءٍۢ فَمَتَـٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ ٱللَّهِ خَيْرٌۭ وَأَبْقَىٰٓ ۚ أَفَلَا تَعْقِلُونَ ﴿٦٠﴾
మరియు మీకు మీ ప్రభువు ప్రసాదించినది ఏదైన దాని ద్వారా మీరు ఇహలోక జీవితంలో ప్రయోజనం చెందుతారు,అలంకరించుకుంటారు. ఆ పిదప అది అంతమైపోతుంది. మరియు పరలోకంలో అల్లా హ్ వద్ద ఉన్న గొప్ప ప్రతిఫలం ఇహలోకంలో ఉన్న సామగ్రి,అలంకరణ కన్న మేలైనది,శాస్వతంగా ఉండేది. ఏమీ మీరు దాన్ని అర్ధం చేసుకొని అంతమైపోయే దానిపై శాస్వతంగా ఉండే దాన్ని ప్రా ధాన్యతనివ్వరా ?!. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
أَفَمَن وَعَدْنَـٰهُ وَعْدًا حَسَنًۭا فَهُوَ لَـٰقِيهِ كَمَن مَّتَّعْنَـٰهُ مَتَـٰعَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ ٱلْقِيَـٰمَةِ مِنَ ٱلْمُحْضَرِينَ ﴿٦١﴾
ఏమీ పరలోకము,అందులో ఉన్న శాస్వత అనుగ్రహాల గురించి మేము వాగ్దానం చేసిన వాడు అతనితో సమానుడు కాగలడా ఎవడికైతే మేము ఇహలోకంలో అతను ప్రయోజనం చెందే సంపద,అలంకరణను ప్రసాదించామొ. ఆ తరువాత అతడు ప్రళయదినాన నరకాగ్ని వైపునకు హాజరు చేయబడే వారిలో నుండి అయిపోతాడు ?!
وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ﴿٦٢﴾
మరియు ఆరోజు వారిని పరిశుద్ధు డైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తా డు: నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?
قَالَ ٱلَّذِينَ حَقَّ عَلَيْهِمُ ٱلْقَوْلُ رَبَّنَا هَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَغْوَيْنَآ أَغْوَيْنَـٰهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَآ إِلَيْكَ ۖ مَا كَانُوٓا۟ إِيَّانَا يَعْبُدُونَ ﴿٦٣﴾
అవిశ్వాసం వైపున పిలిచే వారిలో నుండి ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వారు ఇలా అంటారు: ఓ మా ప్రభువా వీరందరు మేము అపమార్గమును పొందిన విధంగా మేము అపమార్గమునకు లోను చేసిన వారు. మేము వారి నుండి నీ వద్ద నిర్దోషత్వమును కోరుతున్నాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. వారు కేవలం షైతానులను ఆరాధించేవారు
وَقِيلَ ٱدْعُوا۟ شُرَكَآءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا۟ لَهُمْ وَرَأَوُا۟ ٱلْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا۟ يَهْتَدُونَ ﴿٦٤﴾
మరియు వారితో ఇలా అనబడుతుంది: మీరు ఉన్న అవమానము నుండి మిమ్మల్ని రక్షించటానికి మీరు మీ భాగస్వాములను పిలవండి. అప్పుడు వారు తమ భాగస్వాములను పిలుస్తా రు. కాని వారు వారి పిలుపునకు సమాధానమివ్వరు. మరియు వారు తమ కొరకు సిద్ధం చేసి ఉంచిన శిక్షను చూసి తాము ఇహలోకంలో సత్యమునకు దారి పొంది ఉండాల్సిందని కోరుకుంటారు
وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَآ أَجَبْتُمُ ٱلْمُرْسَلِينَ ﴿٦٥﴾
మరియు ఆరోజు వారిని వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తా డు: నేను మీ వద్దకు పంపించిన నా ప్రవక్తలకు మీరు ఏమి సమాధానమిచ్చారు ?
فَعَمِيَتْ عَلَيْهِمُ ٱلْأَنۢبَآءُ يَوْمَئِذٍۢ فَهُمْ لَا يَتَسَآءَلُونَ ﴿٦٦﴾
అప్పుడు వారు వాదించినవి వారిపై గోప్యమైపోయాయి,వారు ఏమీ ప్రస్తావించలేదు. వారు శిక్షించబడుతారని వారు పూర్తి నమ్మకముతో ఉండటం వలన వారికి కలిగిన ఆపద భయానక పరిస్థితి వలన వారు ఒకరినొకరు ప్రశ్నించుకోరు
فَأَمَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَـٰلِحًۭا فَعَسَىٰٓ أَن يَكُونَ مِنَ ٱلْمُفْلِحِينَ ﴿٦٧﴾
కాని ఈ ముష్రికులందరిలో నుండి ఎవడైతే తన అవిశ్వాసము నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,ఏదైన సత్కార్యమును చేస్తే బహుశా అతడు తాము ఆశించిన దాన్ని పొంది సాఫల్యము చెందే వారిలోంచి,తాము భయపడే వాటి నుండి ముక్తి పొందే వారిలో నుంచి అయిపోతాడు
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَآءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ ٱلْخِيَرَةُ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ ﴿٦٨﴾
మరియు ఓ ప్రవక్తా నీ ప్రభువు తాను సృష్టించదలచిన దాన్ని సృష్టిస్తా డు. మరియు తన విధేయత కొరకు,తన దౌత్యము కొరకు తాను కోరుకున్న వారిని ఎన్నుకుంటాడు. ముష్రికులకు అల్లా హ్ పై అభ్యంతరం తెలిపే అనుమతి ఉండదు. పరిశుద్ధు డైన ఆయన అతీతుడు మరియు ఆయన వారు ఆయనతో పాటు సాటి కల్పించేవారి నుండి పరిశుద్ధు డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وربك يعلمما تكن صدورهم وما يعلنون
وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ ﴿٦٩﴾
మరియు నిశ్ఛయంగా నీ ప్రభువుకి తన దాసుల హృదయాలు ఏమి దాస్తు న్నాయో,ఏమి బహిర్గతం చేస్తు న్నాయో తెలుసు. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు
وَهُوَ ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ ٱلْحَمْدُ فِى ٱلْأُولَىٰ وَٱلْـَٔاخِرَةِ ۖ وَلَهُ ٱلْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٧٠﴾
మరియు ఆయనే అల్లా హ్ పరిశుద్ధు డు ఆయన తప్ప సత్య ఆరాధ్య దైవం లేడు. ఇహలోకములో స్థు తులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి మరియు పరలోకంలో స్థు తులన్నీ ఆయన ఒక్కడికే చెందుతాయి. మరియు ఆయనకు తిరుగులేని జారి అయ్యే న్యాయ వ్యవస్థ కలదు. ప్రళయదినాన మీరు లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు ఆయన ఒక్కడి వైపే మరలింపబడుతారు
قُلْ أَرَءَيْتُمْ إِن جَعَلَ ٱللَّهُ عَلَيْكُمُ ٱلَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِضِيَآءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ ﴿٧١﴾
ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా అడగండి: మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లా హ్ మీపై శాశ్వతంగా ఎడతెగకుండా,అంతం లేకుండా ప్రళయం వరకు రాత్రిని ఉండేటట్లు చేస్తే అల్లా హ్ కాకుండా మీ వద్దకు పగటి వెలుగులాంటి వెలుగును తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?. ఏమీ మీరు ఈ వాదనలను వినరా,దానిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లా హ్ తప్ప వేరే ఆరాధ్య దైవం కాడని మీరు తెలుసుకోరా ?
قُلْ أَرَءَيْتُمْ إِن جَعَلَ ٱللَّهُ عَلَيْكُمُ ٱلنَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِلَيْلٍۢ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ ﴿٧٢﴾
تبصرون ఓ ప్రవక్తా వారితో ఇలా అడగండి: మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ ప్రళయం వరకు పగలును శాశ్వతంగా,ఎడతెగకుండా మీపై చేస్తే అల్లాహ్ కాకుండా మీ వద్దకు పగలు చేసిన కార్యల వలన కలిగిన అలసట నుండి మీరు విశ్రాంతి తాసుకోవటానికి మీరు ఉండే రాత్రిని తీసుకుని వచ్చే ఆరాధ్య దైవం ఎవడు ?!. ఏమీ మీరు ఈ సూచనలను చూడటం లేదా,వీటన్నింటిని మీ వద్దకు తీసుకుని వచ్చే వాడు అల్లా హ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని మీరు తెలుసుకోరా ?!
وَمِن رَّحْمَتِهِۦ جَعَلَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ لِتَسْكُنُوا۟ فِيهِ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٧٣﴾
ఓ ప్రజలారా మీరు పగలు పని చేయటం వలన అలసిపోయిన తరువాత విశ్రాంతి తీసుకోవటానికి రాత్రిని మీ కొరకు చీకటిగా చేయటం మరియు మీరు ఆహారోపాధి అన్వేషణలో శ్రమించటానికి పగలును మీ కొరకు కాంతివంతంగా చేయటం పరిశుద్ధుడైన ఆయన కారుణ్యము. బహుశా మీరు మీపై ఉన్నఅల్లా హ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని,వాటి పట్ల కృతఘ్నులు కారని
وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ ﴿٧٤﴾
మరియు ఆరోజు వారిని పరిశుద్ధు డైన,మహోన్నతుడైన వారి ప్రభువు ఇలా పలుకుతూ పిలుస్తా డు: నన్ను వదిలి మీరు ఆరాధించే నా భాగస్వాములు, వారు నా భాగస్వాములని మీరు వాదించిన వారు ఏరి ?
وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍۢ شَهِيدًۭا فَقُلْنَا هَاتُوا۟ بُرْهَـٰنَكُمْ فَعَلِمُوٓا۟ أَنَّ ٱلْحَقَّ لِلَّهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ ﴿٧٥﴾
మరియు మేము ప్రతీ జాతి నుండి దాని ప్రవక్తను తీసుకుని వస్తాము,అతడు వారికి వ్యతిరేకంగా వారు ఉన్న అవిశ్వాసం,తిరస్కారం గురించి సాక్ష్యం పలుకుతాడు. ఆ జాతుల్లోంచి తిరస్కరించిన వారితో మేము ఇలా పలుకుతాము: మీరు ఉన్న అవిశ్వాసము,తిరస్కారముపై మీ వాదనలను, ఆధారాలను ఇవ్వండి. అప్పుడు వారి వాదనలు అంతమైపోతాయి. మరియు ఎటువంటి సందేహం లేని సత్యము అల్లా హ్ కొరకే అని వారికి నమ్మకం కలుగుతుంది. పరిశుద్ధు డైన ఆయన కొరకు వారు కల్పించుకుని సాటికల్పించిన వారు వారి నుండి అదృశ్యమైపోతారు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
۞ إِنَّ قَـٰرُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَءَاتَيْنَـٰهُ مِنَ ٱلْكُنُوزِ مَآ إِنَّ مَفَاتِحَهُۥ لَتَنُوٓأُ بِٱلْعُصْبَةِ أُو۟لِى ٱلْقُوَّةِ إِذْ قَالَ لَهُۥ قَوْمُهُۥ لَا تَفْرَحْ ۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْفَرِحِينَ ﴿٧٦﴾
నిశ్ఛయంగా ఖారూను మూసా అలైహిస్సలాం జాతి వారిలో నుండి వాడు. అతడు వారిపై అహంకారమును చూపాడు. మరియు మేము అతనికి ఎన్నో సంపదల యొక్క నిధులను ప్రసాదించాము అంటే దాని నిధుల తాళములను మోయటం బలవంతులైన సమూహమునకు భారంగా ఉండేది. అతడి జాతివారు అతడితో ఇలా పలికారు: నీవు అహంకార సంతోషమును కలిగి ఉండకు. నిశ్చయంగా అల్లాహ్ అహంకార సంతోషమును చూపేవారిని ఇష్టపడడు. అంతేకాక వారిని ద్వేషిస్తా డు మరియు దానిపై వారిని శిక్షిస్తా డు
وَٱبْتَغِ فِيمَآ ءَاتَىٰكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنْيَا ۖ وَأَحْسِن كَمَآ أَحْسَنَ ٱللَّهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ ٱلْفَسَادَ فِى ٱلْأَرْضِ ۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُفْسِدِينَ ﴿٧٧﴾
మరియు నీవు అల్లా హ్ నీకు ప్రసాదించిన సంపదల్లో వాటిని మంచి మార్గముల్లో ఖర్చు చేసి పరలోక నివాసములో ప్రతిఫలాన్ని ఆశించు. మరియు నీవు తినటం,త్రా గటం,వస్త్రములు ధరించటం మొదలగు అనుగ్రహాల నీ భాగమును మరువకు. ఎటువంటి దుబారా లేకుండా,సందేహం లేకుండా (ఖర్చు చేయి). పరిశుద్ధుడైన ఆయన నీతో మంచిగా వ్యవహరించినట్లే నీ ప్రభువుతో,ఆయన దాసులతో మంచిగా వ్యవహరించు. మరియు నీవు పాపకార్యములకు పాల్పడి,విధేయ కార్యాలను విడనాడి భూమిలో అల్లకల్లో లాను కోరుకోకు. నిశ్చయంగా అల్లా హ్ వాటి ద్వారా భూమిలో అల్లకల్లో లాలను రేకెత్తించే వారిని ఇష్టపడడు. అంతే కాదు వారిని ద్వేషిస్తా డు
قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلْمٍ عِندِىٓ ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ ٱللَّهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِۦ مِنَ ٱلْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةًۭ وَأَكْثَرُ جَمْعًۭا ۚ وَلَا يُسْـَٔلُ عَن ذُنُوبِهِمُ ٱلْمُجْرِمُونَ ﴿٧٨﴾
ఖారూన్ ఇలా పలికాడు: ఈ సంపదలన్నీ నాకు మాత్రం నా జ్ఞా నం వలన,సామర్ధ్యం వలన ఇవ్వబడినవి. నేను వాటి హక్కుదారుడను. ఏమీ అతని కన్నా ముందు తమ శక్తి అధికంగా కల,తమ అధిక సంపదలు కల జాతుల వారిని అల్లా హ్ అంతమొందించాడన్న విషయం ఖారూనుకు తెలియదా ?. అప్పుడు వారి బలము,వారి సంపదలు వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు ప్రళయదినాన పాపత్ములు తమ పాపముల గురించి వాటి గురించి అల్లా హ్ కు జ్ఞా నం ఉండటం వలన ప్రశ్నించబడరు. అప్పుడు వారిని ప్రశ్నించటం గద్దింపు ప్రశ్న,మందలింపు ప్రశ్న
فَخَرَجَ عَلَىٰ قَوْمِهِۦ فِى زِينَتِهِۦ ۖ قَالَ ٱلَّذِينَ يُرِيدُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا يَـٰلَيْتَ لَنَا مِثْلَ مَآ أُوتِىَ قَـٰرُونُ إِنَّهُۥ لَذُو حَظٍّ عَظِيمٍۢ ﴿٧٩﴾
عظيم అప్పుడు ఖారూను తన అహంకారమును ప్రదర్శిస్తూ తన వైభవంలో బయలుదేరాడు. ఖారూను సహచరుల్లోంచి ఇహలోక జీవిత వైభవములో అత్యాశను కలిగిన వారు ఇలా పలికారు: అయ్యో మా దౌర్భాగ్యం మేము కూడా ఖారూన్ కు ఇవ్వబడినట్లు ఇహలోక వైభవమును ఇవ్వబడి ఉంటే ఎంత బాగుండేది. నిశ్చయంగా ఖారూను పరిపూర్ణమైన పెద్ద వాటా కలిగిన వాడు
وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ ٱللَّهِ خَيْرٌۭ لِّمَنْ ءَامَنَ وَعَمِلَ صَـٰلِحًۭا وَلَا يُلَقَّىٰهَآ إِلَّا ٱلصَّـٰبِرُونَ ﴿٨٠﴾
మరియు జ్ఞాన సంపన్నులు ఖారూనును అతని వైభవంలో చూసినప్పుడు,అతని సహచరులు ఆశపడుతున్న దానిని విన్నప్పుడు ఇలా పలికారు: మీ పాడు గాను! అల్లాహ్ ప్రసాదించే ప్రతిఫలం పరలోకంలో ఉన్నది. మరియు ఏవైతే ఆయన తయారు చేసి ఉంచాడో అనుగ్రహాలు అతన్ని విశ్వసించి,సత్కార్యములు చేసిన వారి కొరకు ఉన్నయో అవి ఖారూనుకు ఇవ్వబడిన ప్రా పంచిక వైభవము కన్న గొప్పవి. ఈ మాటను పలకటానికి,దానికి తగ్గట్టు గా ఆచరించటానికి ఇహలోకంలో ఉన్న అంతమైపోయే ప్రా పంచిక సామగ్రిపై అల్లా హ్ వద్ద ఉన్న పుణ్యముపై ప్రా ధాన్యత ఇవ్వటంపై సహనం చూపే ఓర్పుగలవారికే ఈ భాగ్యం కలిగించబడుతుంది. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్
فَخَسَفْنَا بِهِۦ وَبِدَارِهِ ٱلْأَرْضَ فَمَا كَانَ لَهُۥ مِن فِئَةٍۢ يَنصُرُونَهُۥ مِن دُونِ ٱللَّهِ وَمَا كَانَ مِنَ ٱلْمُنتَصِرِينَ ﴿٨١﴾
అప్పుడు మేము అతని ద్రోహానికి ప్రతీకారంగా అతనిని,అతని ఇంటిని,అందులో ఉన్న వారందరిని భూమిలోకి కూర్చివేశాము. అల్లాహ్ తప్ప అతనికి సహాయం చేయటానికి ఎటువంటి వర్గము వారు అతని కొరకు లేకుండాపోయారు. మరియు అతను స్వయంగా తనను కాపాడుకోలేకపోయాడు
وَأَصْبَحَ ٱلَّذِينَ تَمَنَّوْا۟ مَكَانَهُۥ بِٱلْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ ۖ لَوْلَآ أَن مَّنَّ ٱللَّهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَـٰفِرُونَ ﴿٨٢﴾
అతన్ని కూర్చక ముందు అతని సంపదలో,అతని వైభవంలో ఆశను కలిగిన వారు ఇలా పలకసాగారు: అల్లా హ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి ఆహారోపాధిని విస్తరింపజేస్తా డని,వారిలో నుండి తాను కోరిన వారిపై కుంచింపజేస్తా డని మాకు తెలియదా ఏమిటీ ?!. ఒక వేళ మేము పలికిన దానికి ఆయన శిక్షించకుండా అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఖారూన్ ను కూర్చినట్లు మమ్మల్ని ఆయన కూర్చేవాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు ఇహలోకంలో గాని,పరలోకంలో గాని సాఫల్యం చెందరు. అంతే కాదుوవారి పరిణామం,వారి స్థితి ఆ రెండింటిలో నష్టమే
تِلْكَ ٱلدَّارُ ٱلْـَٔاخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّۭا فِى ٱلْأَرْضِ وَلَا فَسَادًۭا ۚ وَٱلْعَـٰقِبَةُ لِلْمُتَّقِينَ ﴿٨٣﴾
ఈ పరలోక గృహమును మేము సత్యముపై విశ్వాసమును కనబరచి,దాన్ని అనుసరించటం నుండి భూమిలో అహంకారమును కోరని వారి కొరకు,అందులో చెడును ఆశించని వారి కొరకు అనుగ్రహాల,మర్యాదల గృహముగా చేస్తాము. స్థుతింపబడిన పరిణామమైన అనుగ్రహాలు కల స్వర్గము,అందులో ఉండే అల్లా హ్ ప్రసన్నత తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఉంటుంది
مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ خَيْرٌۭ مِّنْهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَى ٱلَّذِينَ عَمِلُوا۟ ٱلسَّيِّـَٔاتِ إِلَّا مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٨٤﴾
ప్రళయదినాన ఎవరైన నమాజు,జకాతు,ఉపవాసము మొదలగు వాటి లోంచి ఏ సత్కార్యమును తీసుకుని వచ్చినా అతని ఆ సత్కార్యము కన్నా మంచిగా ప్రతిఫలముంటుంది. ఏ విధంగా నంటే అతని కొరకు పుణ్యము పది రెట్లు అధికం చేయబడుతుంది. మరియు ఎవరైన అవిశ్వాసము, వడ్డీ సొమ్ము తినటం, వ్యభిచారము మొదలగు వాటిలో నుంచి ఏ దుష్కార్యమును తీసుకుని వచ్చినా దుష్కార్యములకు పాల్పడిన వారికి మాత్రం అధికం చేయకుండా వారు చేసిన దుష్కార్యమునకు సమాన ప్రతిఫలమే ప్రసాదించటం జరుగుతుంది
إِنَّ ٱلَّذِى فَرَضَ عَلَيْكَ ٱلْقُرْءَانَ لَرَآدُّكَ إِلَىٰ مَعَادٍۢ ۚ قُل رَّبِّىٓ أَعْلَمُ مَن جَآءَ بِٱلْهُدَىٰ وَمَنْ هُوَ فِى ضَلَـٰلٍۢ مُّبِينٍۢ ﴿٨٥﴾
నిశ్ఛయంగా మీపై ఎవరైతే ఖుర్ఆన్ ను అవతరింపజేసి దాని ప్రచారమును,అందులో ఉన్న వాటిపై ఆచరణను మీపై విధిగావించాడో అతడు మిమ్మల్ని మక్కాకు విజయంతో మరలింపజేస్తాడు. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి: ఎవరు సన్మార్గమును తీసుకొని వచ్చాడో,ఎవరు సన్మార్గము నుండి,సత్యము నుండి తప్పి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నాడో నా ప్రభువుకు బాగా తెలుసు
وَمَا كُنتَ تَرْجُوٓا۟ أَن يُلْقَىٰٓ إِلَيْكَ ٱلْكِتَـٰبُ إِلَّا رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًۭا لِّلْكَـٰفِرِينَ ﴿٨٦﴾
ఓ ప్రవక్తా ఖుర్ఆన్ దైవ వాణి రూపంలో అల్లాహ్ వద్ద నుండి నీ వైపునకు అవతరిస్తుందని ప్రవక్తగా పంపించక మునుపు నీవు ఆశించ లేదు. కాని పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కారుణ్యము నీపై దాని అవతరణను నిర్ణయించినది. కావున నీవు అవిశ్వాసపరులకు వారు ఉన్న అపమార్గములో సహాయకునిగా ఉండకు
وَلَا يَصُدُّنَّكَ عَنْ ءَايَـٰتِ ٱللَّهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَٱدْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿٨٧﴾
ఈ ముష్రికులందరు అల్లా హ్ ఆయతుల నుండి అవి మీపై అవతరించిన తరువాత వాటిని మీరు పఠించటమును,వాటి ప్రచారమును వదిలివేయటానికి మరలించకూడదు. మరియు మీరు ప్రజలను అల్లా హ్ పై విశ్వాసము వైపునకు,ఆయన ఏకత్వం వైపునకు,ఆయన ధర్మంపై ఆచరణ వైపునకు పిలవండి. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ మరియు మీరు అల్లా హ్ తో పాటు ఇతరులను ఆరాధించే ముష్రికుల్లోంచి కాకండి. కాని మీరు ఒక్కడైన అల్లా హ్ ను మాత్రమే ఆరాధించి ఏకేశ్వరోపాసన చేసే వారిలో నుంచి అయిపోండి
وَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۘ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَىْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُۥ ۚ لَهُ ٱلْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ ﴿٨٨﴾
మరియు మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆరాధించకండి. ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. పరిశుద్ధుడైన ఆయన ముఖము తప్ప ప్రతీది నశిస్తుంది. న్యాయ నిర్ణయం ఆయన ఒక్కడి కొరకే,తాను కోరినది నిర్ణయిస్తా డు. ఆయన ఒక్కడి వైపునకే ప్రళయదినాన మీరు లెక్క తీసుకనబడటానికి,ప్రతిఫలం ప్రసాదించబడటానికి మరలింపబడుతారు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్
అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు