ముఖపేజీతఫ్సీర్At-Talaaq (65)

తఫ్సీర్ At-Talaaq (65) — الطلاق

మదనీ · 12 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ إِذَا طَلَّقْتُمُ ٱلنِّسَآءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا۟ ٱلْعِدَّةَ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ رَبَّكُمْ ۖ لَا تُخْرِجُوهُنَّ مِنۢ بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّآ أَن يَأْتِينَ بِفَـٰحِشَةٍۢ مُّبَيِّنَةٍۢ ۚ وَتِلْكَ حُدُودُ ٱللَّهِ ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُۥ ۚ لَا تَدْرِى لَعَلَّ ٱللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًۭا ﴿١﴾

ఓ ప్రవక్తా మీరు లేదా మీ సమాజము నుండి ఎవరైన తమ భార్యకు విడాకులు ఇవ్వదలచినప్పుడు ఆమె గడువు (ఇద్దత్) ఆరంభంలో ఆమెకు విడాకులివ్వండి. విడాకులు శుద్ధావస్తలో ఇవ్వాలి అందులో ఆమెతో సంబోగించకుండా ఉండాలి. ఆ గడువులో మీరు వారి వైపు మరలదలచుకుంటే మీ భార్యల వైపు మరలే అధికారం మీకు కలగటానికి. మరియు మీరు మీ ప్రభువైన అల్లా హ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మీరు విడాకులిచ్చిన స్త్రీలను వారు ఉన్న నివాసముల నుండి మీరు వెళ్ళగొట్టకండి. మరియు వారు కూడా తమ గడువుముగియనంతవరకు స్వయంగావెళ్ళిపోకూడదు. కానిఒక వేళ వారు వ్యభిచారము లాంటి ప్రత్యక్షమైన అశ్లీల కార్యమునకు పాల్పడితే తప్ప. ఈ ఆదేశాలు అల్లా హ్ తన దాసుల కొరకు విధించిన హద్దు లు. మరియు ఎవరైతే అల్లాహ్ హద్దు లను అతిక్రమిస్తాడో అతడు తన ప్రాణముపై దుర్మార్గమునకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు తన ప్రభువుకు అవిధేయత చూపటం వలన దాన్ని వినాశన స్థానములకు చేర్చాడు. ఓ విడాకులిచ్చేవాడా నీకు తెలియదు బహుశా అల్లాహ్ దీని తరువాత భర్త మనస్సులో ఆకర్షణను కలిగిస్తే అప్పుడు అతడు తనభార్య వైపుకు మరలుతాడు. فإذابلغن أجلهن فأمسكوهن بمعروف أو فارقوهن بمعروف وأشهدواذوى عدل منكم وأقيموا

فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍۢ وَأَشْهِدُوا۟ ذَوَىْ عَدْلٍۢ مِّنكُمْ وَأَقِيمُوا۟ ٱلشَّهَـٰدَةَ لِلَّهِ ۚ ذَٰلِكُمْ يُوعَظُ بِهِۦ مَن كَانَ يُؤْمِنُ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مَخْرَجًۭا ﴿٢﴾

వారి గడువు ముగిసే సమయం ఆసన్నమైనప్పుడు మీరు వారివైపు ప్రేమతో,మంచిగా వ్యవహరిస్తూ మరలండి లేదా వారి గడువు ముగిసేంత వరకు వారి వైపు మరలటమును వదిలి వేయండి. అప్పుడు వారికి తమపై పూర్తి అధికారముంటుంది, అది కూడా వారి కొరకు ఉన్న హక్కులను వారికి అప్పగించటంతో పాటు. మరియు మీరు వారి వైపు మరలదలచుకుంటే లేదా వారి నుండి విడిపోవదలచుకుంటే అప్పుడు మీరు తగాదాను అంతమొందించటానికి మీలో నుండి ఇద్దరు న్యాయవంతులైన సాక్షులను ఏర్పాటు చేసుకోండి. ఓ సాక్ష్యం పలికేవారా మీరు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సాక్ష్యం ఇవ్వండి. ఈ ప్రస్తావించబడిన ఆదేశాలతో అల్లాహ్ పై,ప్రళయదినం పై విశ్వాసమును చూపే వాడు హితోపదేశం గ్రహిస్తాడు. ఎందుకంటే అతడే హితోపదేశము ద్వారా ప్రయోజనం చెందుతాడు. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడతాడో అతడిని అల్లాహ్ అతడికి కలిగే ప్రతీ ఇబ్బంది నుండి,బాధ నుండి బయటపడే మార్గమును తయారు చేస్తా డు

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ وَمَن يَتَوَكَّلْ عَلَى ٱللَّهِ فَهُوَ حَسْبُهُۥٓ ۚ إِنَّ ٱللَّهَ بَـٰلِغُ أَمْرِهِۦ ۚ قَدْ جَعَلَ ٱللَّهُ لِكُلِّ شَىْءٍۢ قَدْرًۭا ﴿٣﴾

لكل شىء قدرا మరియు ఆయన అతను ఆలోచించని మరియు అతని మనసులో లేని చోటు నుండి అతనికి ఆహారోపాధిని కలిగిస్తా డు. మరియు ఎవరైతే తన వ్యవహారాల్లో అల్లా హ్ పై నమ్మకమును కలిగి ఉంటాడో ఆయన అతనికి చాలు. నిశ్చయంగా అల్లా హ్ తన ఆదేశమును చేసి తీరుతాడు. దేని నుండి కూడా ఆయన అశక్తు డు కాడు. మరియు ఏదీ ఆయన నుండి తప్పిపోదు. నిశ్చయంగా అల్లా హ్ ప్రతీ వస్తు వుకు నిర్ణీత లెక్కను ఉంచాడు. అది దానికి చేరుతుంది. కావునకష్టా నికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. మరియు సుఖానికి ఒక నిర్ణీత లెక్క ఉన్నది. ఆ రెండిటిలో నుంచి ఏది కూడా మనిషిపై శాశ్వతంగాఉండదు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

وَٱلَّـٰٓـِٔى يَئِسْنَ مِنَ ٱلْمَحِيضِ مِن نِّسَآئِكُمْ إِنِ ٱرْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَـٰثَةُ أَشْهُرٍۢ وَٱلَّـٰٓـِٔى لَمْ يَحِضْنَ ۚ وَأُو۟لَـٰتُ ٱلْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ ۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مِنْ أَمْرِهِۦ يُسْرًۭا ﴿٤﴾

మరియు ఆ విడాకులివ్వబడిన స్త్రీలు ఎవరైతే తమ వయస్సు అధికమవటం వలన రుతుస్రావము అవటం నుండి నిరాశులయ్యారో ఒక వేళ మీరు వారి గడువు ఎలా ఉంటుందని సందేహ పడితే వారి గడువు మూడు నెలలు. మరియు ఏ స్త్రీలైతే తమ చిన్న వయస్సు వలన రుతుస్రా వ వయస్సుకు చేరలేదో వారి గడువు కూడా అలాగే మూడు నెలలు. మరియు గర్భిణీ స్త్రీలు విడాకుల వలన లేదా మరణం వలన వారి గడువు ముగింపువారు తమ గర్భమును ప్రసవించినప్పుడు. మరియు ఎవరైతే అల్లా హ్ కు ఆయనఆదేశములను పాటించి,ఆయనవారించినవాటికి దూరంగా ఉండి భయపడుతాడో అల్లాహ్ అతని వ్యవహారములను అతని కొరకు సులభతరం చేస్తాడు. మరియు అతని కొరకు ప్రతీ కష్టతరమైన పనిని సులభం చేస్తా డు

ذَٰلِكَ أَمْرُ ٱللَّهِ أَنزَلَهُۥٓ إِلَيْكُمْ ۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّـَٔاتِهِۦ وَيُعْظِمْ لَهُۥٓ أَجْرًا ﴿٥﴾

ఈ ప్రస్తా వించబడిన తలాఖ్ (విడాకులు),మరలింపు,గడువు ఆదేశాలు అల్లా హ్ ఆదేశము ఓ విశ్వాసపరులారా ఆయన దాన్ని మీ వైపునకు అవతరింపజేశాడు మీరు దాన్ని తెలుసుకోవటానికి. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతాడో ఆయన అతను పాల్పడిన అతని పాపములను తుడిచివేస్తా డు. మరియు ఆయన అతనికి పరలోకములో గొప్పప్రతిఫలమును ప్రసాదిస్తా డు. అది స్వర్గములో ప్రవేశము. మరియు తరగనిఅనుగ్రహాలను పొందటం

أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَآرُّوهُنَّ لِتُضَيِّقُوا۟ عَلَيْهِنَّ ۚ وَإِن كُنَّ أُو۟لَـٰتِ حَمْلٍۢ فَأَنفِقُوا۟ عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ ۖ وَأْتَمِرُوا۟ بَيْنَكُم بِمَعْرُوفٍۢ ۖ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُۥٓ أُخْرَىٰ ﴿٦﴾

ى تعاسرتمفسترضع له أخر ఓ భర్తల్లారా మీరు మీ స్థోమతను బట్టి మీరు నివాసం ఉన్న చోటే వారికి నివాసమును కల్పించండి. అల్లాహ్ మీపై దాని కన్న మించి భారం వేయడు. మరియు మీరు ఖర్చు చేసే విషయంలో గాని నివాసమును కల్పించే విషయంలో గాని ఇతర విషయముల్లో గాని వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశముతో వారికి కీడును కలిగించకండి. మరియు ఒక వేళ విడాకులివ్వబడినస్త్రీలు గర్భవతులైతే వారు తమ గర్భమును ప్రసవించే వరకు వారిపై ఖర్చుచేయండి. ఒక వేళ వారు మీ కొరకు మీ సంతానమునకు పాలు త్రా పిస్తే వారు పాలు త్రా పించినందుకు వారికి ప్రతిఫలం ఇవ్వండి. ప్రతిఫలం విషయంలో ధర్మానుసారంగా పరస్పరం సంప్రదించుకోండి. ఒక వేళ భర్త భార్య ఆశించిన ప్రతిఫలం విషయంలో పిసినారి తనం చూపి మరియు ఆమె తాను ఆశించిన దానిపై తప్ప ఇష్టపడకుండా పిసినారి తనం చూపితే తండ్రి తన సంతానమునకు పాలు త్రాపించే వేరొక స్త్రీను ఏర్పాటు చేసుకోవాలి

لِيُنفِقْ ذُو سَعَةٍۢ مِّن سَعَتِهِۦ ۖ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُۥ فَلْيُنفِقْ مِمَّآ ءَاتَىٰهُ ٱللَّهُ ۚ لَا يُكَلِّفُ ٱللَّهُ نَفْسًا إِلَّا مَآ ءَاتَىٰهَا ۚ سَيَجْعَلُ ٱللَّهُ بَعْدَ عُسْرٍۢ يُسْرًۭا ﴿٧﴾

ఎవరికైతే సంపదలో విశాలత్వం ఉన్నదో అతడు తాను విడాకులిచ్చిన స్త్రీ పై మరియు తన సంతానముపై తన స్తోమత ప్రకారం ఖర్చు చేయాలి. మరియు ఎవరి ఆహారోపాధి కుదించబడి ఉన్నదో అతడు అల్లా హ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయాలి. అల్లా హ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దానిలో మాత్రమే భారం వేస్తా డు. దానికి మించి అతనిపై భారం వేయడు. మరియు అతని సామర్ధ్యముకు మించి భారం వేయడు. తొందరలోనే అల్లా హ్ అతని క్లిష్టమైన,కష్టమైన స్థితిని విశాలత్వమును,ఐశ్వర్యమును కలిగింపజేస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్ وكأين من قرية عتت عن أمرربها ورسله فحاسبنها حسابا شديدا وعذبنها عذابا نكرا

وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِۦ فَحَاسَبْنَـٰهَا حِسَابًۭا شَدِيدًۭا وَعَذَّبْنَـٰهَا عَذَابًۭا نُّكْرًۭا ﴿٨﴾

మరియు ఎన్నో నగర వాసులు పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశమును మరియు ఆయన ప్రవక్తలు అలైహిముస్సలాంల ఆదేశమును ధిక్కరించినప్పుడు మేము వారి దుష్కర్మలపై వారితో కఠినంగాలెక్క తీసుకున్నాము. మరియు మేము వారికి ఇహపరాల్లో అతి చెడ్డదైనశిక్షను విధించాము. فذاقت وبال أمرها وكان عقبةأمرها خسرا

فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَـٰقِبَةُ أَمْرِهَا خُسْرًا ﴿٩﴾

కావున వారు తమ దుష్కర్మల పరిణామమును రుచి చూశారు. మరియు వారి ముగింపు ఇహలోకములో నష్టముగా మరియు పరలోకములో నష్ట ముగా జరిగినది

أَعَدَّ ٱللَّهُ لَهُمْ عَذَابًۭا شَدِيدًۭا ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ يَـٰٓأُو۟لِى ٱلْأَلْبَـٰبِ ٱلَّذِينَ ءَامَنُوا۟ ۚ قَدْ أَنزَلَ ٱللَّهُ إِلَيْكُمْ ذِكْرًۭا ﴿١٠﴾

అల్లా హ్ వారి కొరకు తీవ్రమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. కావున ఓ అల్లా హ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను విశ్వసించిన బుద్ధిమంతులారా వారిపై దిగినది మీపై దిగనంతవరకు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వద్దకు హితోపదేశమును అవతరింపజేశాడు. అది మీకు ఆయన పై అవిధేయత యొక్క దుష్పరిణామమును మరియు ఆయనపై విధేయత యొక్క మంచిపరిణామమును గుర్తు చేస్తుంది

رَّسُولًۭا يَتْلُوا۟ عَلَيْكُمْ ءَايَـٰتِ ٱللَّهِ مُبَيِّنَـٰتٍۢ لِّيُخْرِجَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِنَ ٱلظُّلُمَـٰتِ إِلَى ٱلنُّورِ ۚ وَمَن يُؤْمِنۢ بِٱللَّهِ وَيَعْمَلْ صَـٰلِحًۭا يُدْخِلْهُ جَنَّـٰتٍۢ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًۭا ۖ قَدْ أَحْسَنَ ٱللَّهُ لَهُۥ رِزْقًا ﴿١١﴾

ఈ హితోపదేశం అతడు ఆయన వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త. ఆయన ఎటువంటి సందేహము లేని స్పష్టమైన అల్లా హ్ ఆయతులను వారికి చదివి వినిపిస్తు న్నారు. అల్లా హ్ పై విశ్వాసమును కనబరచి, ఆయన ప్రవక్తను దృవీకరించి సత్కర్మలు చేసే వారిని అపమార్గపు చీకట్ల నుండి సన్మార్గపు వెలుగు వైపునకు ఆయన తీస్తారని ఆశిస్తూ. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేస్తారో వారిని అల్లాహ్ స్వర్గ వనాల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల ,వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వాస్తవానికి అల్లా హ్ అతనకి మంచి ఆహారోపాధిని ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన అతన్ని అనుగ్రహాలు అంతం కాని స్వర్గములో అతన్ని ప్రవేశింపజేశాడు

ٱللَّهُ ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَـٰوَٰتٍۢ وَمِنَ ٱلْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ ٱلْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ وَأَنَّ ٱللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًۢا ﴿١٢﴾

అల్లా హ్ ఆయనేసప్తా కాశములను సృష్టించాడు. మరియు ఆయనసప్తా కాశములను సృష్టించినట్లే సప్త భూములను ఆయనసృష్టించాడు. వాటి మధ్య అల్లా హ్ యొక్క విశ్వ ,ధార్మిక ఆదేశము దిగుతుంది. అల్లా హ్ ప్రతీ వస్తు వుపై సామర్ధ్యం కలవాడని మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ. ఆయనను ఏదీను అశక్తు డినిచేయదు. మరియు పరిశుద్ధు డైనఆయనజ్ఞానపరంగాప్రతీ వస్తు వును చుట్టు ముట్టి ఉన్నాడు. ఆకాశముల్లో గాని భూమిలో గాని ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · At-Talaaq — الطلاق

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు