ముఖపేజీతఫ్సీర్Al-Jumu'a (62)

తఫ్సీర్ Al-Jumu'a (62) — الجمعة

మదనీ · 11 ఆయతులు

చదవండి · వినండిPDF ఫైల్

يُسَبِّحُ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ٱلْمَلِكِ ٱلْقُدُّوسِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ ﴿١﴾

ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. ఆయన ఒక్కడే రాజ్యమును ఏలే ఏకైక రాజాది రాజు, ప్రతీ లోపము నుండి పరిశుద్ధు డు. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రా తలోవివేకవంతుడు

هُوَ ٱلَّذِى بَعَثَ فِى ٱلْأُمِّيِّـۧنَ رَسُولًۭا مِّنْهُمْ يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِهِۦ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَإِن كَانُوا۟ مِن قَبْلُ لَفِى ضَلَـٰلٍۢ مُّبِينٍۢ ﴿٢﴾

ఆయనే చదవలేని వ్రా యలేని వారైన అరబ్బులలో వారిలో నుంచే ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన తనపై అవతరింపజేసిన అతని ఆయతులను వారికి చదివి వినిపిస్తాడు. మరియు ఆయన వారిని అవిశ్వాసము నుండి,దుర లక్షణాల నుండి పరిశుద్ధపరుస్తాడు. మరియు వారికి ఖుర్ఆన్ ను బోదిస్తాడు. మరియు వారికి సున్నత్ ను నేర్పిస్తాడు. మరియు నిశ్చయంగా ఆయన వారి వద్దకు ప్రవక్తగా పంపించక మునుపు వారు సత్యము నుండి స్పష్టమైన అపమార్గంలో ఉండేవారు. ఎందుకంటే వారు విగ్రహాలను ఆరాధించేవారు. మరియు రక్తమును చిందించేవారు. మరియు బంధుత్వమును త్రెంచేవారు

وَءَاخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا۟ بِهِمْ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿٣﴾

మరియు ఆయన ఈ ప్రవక్తను అరబ్బుల్లోంచి ఇతర జనుల వైపునకు మరియు వారే కాకుండా ఇంకా రాని వారి వైపునకు పంపించాడు. మరియు వారు తొందరలోనే వస్తా రు. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో మరియు తన ధర్మ శాసనంలో మరియు తన విధి వ్రా తలో వివేకవంతుడు

ذَٰلِكَ فَضْلُ ٱللَّهِ يُؤْتِيهِ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ ذُو ٱلْفَضْلِ ٱلْعَظِيمِ ﴿٤﴾

ఈ ప్రస్తా వించబడినది - అరబ్బుల వైపునకు మరియు ఇతరుల వైపునకు ప్రవక్తను పంపించడం - అల్లా హ్ అనుగ్రహము ఆయన దాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లా హ్ గొప్ప ఉపకారము చేసేవాడు. మరియు ఆయన ఉపకారములో నుంచి ఈ సమాజపు ఒక ప్రవక్తను ప్రజలందరి వైపునకు ఆయన ప్రవక్తగా పంపించటం. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

مَثَلُ ٱلَّذِينَ حُمِّلُوا۟ ٱلتَّوْرَىٰةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ ٱلْحِمَارِ يَحْمِلُ أَسْفَارًۢا ۚ بِئْسَ مَثَلُ ٱلْقَوْمِ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ ۚ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿٥﴾

ه తౌరాతులోఉన్న దానికి కట్టు బడి ఉండమని బాధ్యత ఇవ్వబడిన తరువాత దాని బాధ్యత వహించని యూదుల ఉపమానము పెద్ద పెద్ద పుస్తకాలు మోసే గాడిద లాంటిది. దానిపై మోయబడినవి పుస్తకాలా లేదా వేరేవా దానికి తెలియదు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించే జాతి వారి ఉపమానము ఎంతో చెడ్డది. మరియు అల్లా హ్ దుర్మార్గ జనులకు సత్యమును పొందే భాగ్యమును కలిగించడు

قُلْ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ هَادُوٓا۟ إِن زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَآءُ لِلَّهِ مِن دُونِ ٱلنَّاسِ فَتَمَنَّوُا۟ ٱلْمَوْتَ إِن كُنتُمْ صَـٰدِقِينَ ﴿٦﴾

صدقين ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి: ఓ యూదత్వముపై దానిలో మార్పు చేర్పులైన తరువాత ఉండిపోయినవారా ప్రజలను కాకుండా మిమ్మల్ని అల్లా హ్ కొరకు ప్రత్యేకమైన స్నేహితులుగా మీరు ఒక వేళ వాదిస్తే మీరు మరణమును కోరుకోండి - మీ వాదనకు తగ్గట్టు గా - మీకు ప్రత్యేకించుకున్నది గౌరవం త్వరగా లభించటానికి ఒక వేళ మీరు ప్రజలు కాకుండా అల్లా హ్ స్నేహితులని మీ వాదనలో సత్యవంతులే అయితే

وَلَا يَتَمَنَّوْنَهُۥٓ أَبَدًۢا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلظَّـٰلِمِينَ ﴿٧﴾

మరియు వారు ఎన్నటికి మరణమును ఆశించరు. కాని వారు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు,దుర్మార్గము,తౌరాతులో మార్పు చేర్పుల వలన ఇహలోకంలో శాశ్వతంగా ఉండిపోవటమును ఆశిస్తా రు. మరియు అల్లా హ్ కు దుర్మార్గు ల గురించి బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తా డు

قُلْ إِنَّ ٱلْمَوْتَ ٱلَّذِى تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُۥ مُلَـٰقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَـٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٨﴾

فينبئكم بما كنتمتعملون ఓ ప్రవక్తా ఈ యూదులందరితో మీరు ఇలా పలకండి: నిశ్చయంగా మీరు ఏ మరణము నుండి పారిపోతున్నారో అది త్వరగా లేదా అలస్యంగా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ తరువాత మీరు ప్రళయదినమున గోచర,అగోచర విషయాల గురించి జ్ఞా నము కల అల్లా హ్ వైపునకు మరలించబడుతారు. ఆ రెండిటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. అప్పుడు ఆయన మీరు ఇహలోకంలో చేసుకున్న వాటి గురించి మీకు తెలియపరుస్తాడు. మరియు వాటి పరంగా ఆయన మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తా డు. بلغ ఖుర్ఆన్ · తఫ్సీర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا نُودِىَ لِلصَّلَوٰةِ مِن يَوْمِ ٱلْجُمُعَةِ فَٱسْعَوْا۟ إِلَىٰ ذِكْرِ ٱللَّهِ وَذَرُوا۟ ٱلْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌۭ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ﴿٩﴾

ذلكم خير لكم إن كنتم تعلمون ఓ అల్లా హ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా జుమా రోజున ప్రసంగం చేసే వారు మెంబరుపై ఎక్కిన తరువాత అజాన్ ఇచ్చే వారు పిలుపు ఇచ్చినప్పుడు మీరు ఖుత్బాకి,నమాజుకు హాజరు కావటం కొరకు త్వరపడండి. మరియు మీరు విధేయత చూపటం నుండి అశ్రద్ధవహించకుండా ఉండటానికి వ్యాపారమును వదిలివేయండి. జుమా నమాజు కొరకు అజాన్ ఇవ్వబడిన తరువాత పరుగెత్తి రావటం, వ్యాపారమును వదిలివేయటం లాంటి ఆదేశించబడినవి ఇవి మీకు ఎంతో మేలైనది - ఓ విశ్వాసపరులారా - ఒక వేళ మీకు అది తెలిసి ఉంటే మీరు అల్లా హ్ మీకు ఆదేశించిన వాటిని చేసి చూపించండి

فَإِذَا قُضِيَتِ ٱلصَّلَوٰةُ فَٱنتَشِرُوا۟ فِى ٱلْأَرْضِ وَٱبْتَغُوا۟ مِن فَضْلِ ٱللَّهِ وَٱذْكُرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴿١٠﴾

تفلحون మీరు జుమా నమాజును పూర్తి చేసినప్పుడు హలాల్ సంపాదనను,మీ అవసరాలను పూర్తి చేసుకోవటమును అన్వేషిస్తూ భూమిలో విస్తరించిపోండి. మరియు హలాల్ సంపాదన మార్గము నుండి మరియు హలాల్ ప్రయోజనం నుండి అల్లాహ్ అనుగ్రహమును ఆశించండి. మరియు మీరు ఆహారోపాధిని మీరు అన్వేషిస్తు న్నసమయంలో అల్లా హ్ ను ఎక్కువగా స్మరించండి. ఆహారోపాధిని మీ అన్వేషించటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరపింపజేయకూడదు. మీరు ఇష్టపడే వాటి ద్వారా విజయమును ఆశిస్తూ మరియు మీరు భయపడే వాటి నుండి విముక్తి పొందుతూ

وَإِذَا رَأَوْا۟ تِجَـٰرَةً أَوْ لَهْوًا ٱنفَضُّوٓا۟ إِلَيْهَا وَتَرَكُوكَ قَآئِمًۭا ۚ قُلْ مَا عِندَ ٱللَّهِ خَيْرٌۭ مِّنَ ٱللَّهْوِ وَمِنَ ٱلتِّجَـٰرَةِ ۚ وَٱللَّهُ خَيْرُ ٱلرَّٰزِقِينَ ﴿١١﴾

ه మరియు కొంత మంది ముస్లిములు ఏదైన వ్యాపారమును లేదా వినోదమును చూసినప్పుడు దాని వైపునకు బయలుదేరి వేరైపోయేవారు. మరియు ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని మెంబరుపై నిలబడి ఉండగా వదిలేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా తెలపండి: సత్కార్యము చేయటంపై అల్లా హ్ వద్ద ఉన్న ప్రతిఫలము మీరు బయలుదేరి వెళ్ళిన వ్యాపారము,వినోదము కన్న ఎంతో మేలైనది. మరియు అల్లా హ్ జీవనోపాధి ప్రసాదించటంలోఅత్యుత్తముడు. మూలం: అల్-ముఖ్తసర్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ఆన్

నేర్చుకో · Al-Jumu'a — الجمعة

అనుసరించు · పునరావృతం · వినిపించు · నమోదు అక్కర్లేదు

తఫ్సీర్ · 31 భాషలు